flock
-
భూకంపాన్ని పసిగట్టిన పక్షులు?.. వీడియో వైరల్!
జపాన్‌లోని క్యోటో నగరంలో ఆమధ్య వేల సంఖ్యలో కాకులు గుంపులుగా ఎగురుతున్న వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అయ్యింది. జపాన్‌లోని హోన్షులో ఆకాశంలో వేలాది కాకులు ఎగురుతూ క్యోటో సమీపంలోని జపనీస్ ద్వీపానికి చేరుకున్నాయి. మనుషులకు మించి ప్రకృతిని అర్ధం చేసుకునే శక్తి పక్షులకే ఉందా? అని అంటే.. అవుననే సమాధానమే వస్తుంది. ప్రకృతి వైపరీత్యాలను కాకులు , కుక్కలు మొదలైనవి ముందుగానే గుర్తిస్తుంటాయి. సునామీ, భూకంపం లాంటి ప్రకృతి విపత్తులు సంభవించడానికి కొన్ని క్షణాల ముందు వేలాది కాకులు వింతగా ప్రవర్తించడానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. జపాన్‌లోని క్యోటో నగరంలో మాదిరిగానే కొన్నాళ్ల క్రితం క్రితం టర్కీలో సంభవించిన విధ్వంసకర భూకంపానికి కొద్ది క్షణాల ముందు కూడా పక్షులు అసాధారణంగా ప్రవర్తించాయి. భారీ సంఖ్యలో పక్షులు గుమిగూడి కిలకిలారావాలు చేస్తూ ఆకాశంలో అటుఇటూ సంచరిస్తూ కనిపించాయి. పక్షులు అలా ప్రవర్తించడానికి కారణం రానున్న భూకంపాన్ని పసిగట్టడమేనంటూ నిపుణులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా ద్వీప దేశమైన జపాన్‌లో 2024 నూతన సంవత్సరం తొలిరోజే శక్తివంతమైన భూకంపం చోటు చేసుకుంది. వాయవ్య జపాన్ తీరంలో సోమవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో పలుమార్లు భూప్రకంపనలు నమోదయ్యాయి. కనీసం 21 సార్లు భూమి కంపించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే ఈ భూకంపానికి కొన్ని నిముషాల ముందు వేలాది పక్షలు ఒకచోట చేరి విచిత్రంగా ప్రవర్తించాయి. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది కూడా చదవండి: జపాన్‌లో భారీ భూకంపం.. 155సార్లు కంపించిన భూమి The sudden increase in crow activity in #Japan is causing concern among residents, reminiscent of an ancient omen associated with natural disasters. On the first day of 2024, Japan is struck by a significant #earthquake#Tsunami pic.twitter.com/vNLoM1JRWu — Surajit (@surajit_ghosh2) January 1, 2024 -
కిలకిలరావాల రోజ్ పీటర్స్.. స్టేట్ గెస్ట్ హౌస్ ఏరియా కేరాఫ్ అడ్రస్
సాక్షి, విజయవాడ: విజయవాడలోని స్టేట్ గెస్ట్ హౌస్ ప్రాంతం.. అక్కడ ఏ చెట్టుపై చూసినా పిట్టల గుంపులే. సెల్ టవర్లు, విద్యుత్ తీగలు ఇలా వాలేందుకు అనువుగా ఉన్న ప్రతిచోటా పక్షుల సందడే. సాయంత్రం అయిందంటే చాలు ఆ ప్రాంతం వేలాదిగా వచ్చే రోజ్ పీటర్స్ పక్షుల కిలకిలరావాలతో సందడిగా మారిపోతుంది. ఏటా ఇదే సీజన్లో వచ్చే ఈ పక్షులకు స్టేట్ గెస్ట్ హౌస్ ఏరియా కేరాఫ్ అడ్రస్‌గా మారింది. – కందుల చక్రపాణి, స్టాఫ్ ఫొటోగ్రాఫర్, విజయవాడ) కూర్మం కాదు..కంద! సాక్షి, తెనాలి: గుంటూరు జిల్లా తెనాలి రూరల్ మండల గ్రామం ఎరుకలపూడిలో ప్రకృతి రైతు ముళ్లపూడి రంగయ్య వ్యవసాయ క్షేత్రంలో కంద దుంప ఒకటి 17 కిలోల బరువు ఊరింది. ఇది చూడటానికి తాబేలు ఆకారాన్ని పోలినట్లు ఉంది. రంగయ్య తన ఇంటిదగ్గరి క్షేత్రంలో ప్రకృతి పద్ధతుల్లో రకరకాల పండ్లతోపాటు కందను సాగుచేస్తున్నారు. – ఎరుకలపూడి (తెనాలి) -
చిరుతల దాడిలో 71 గొర్రె పిల్లలు మృతి
రొద్దం(అనంతపురం): రెండు చిరుతల దాడిలో 71 గొర్రె పిల్లలు హతమయ్యాయి. అనంతపురం జిల్లా రొద్దం మండల పరిధిలోని ఆర్ లోచెర్ల, కంచిసముద్రం గ్రామాల మధ్య ఓకుంట వద్ద గురువారం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది. గొర్రెల కాపర్లు తెలిపిన వివరాలు.. పెనుకొండ మండలం చిన్నపరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఐదుగురు మేపు కోసం 18 రోజుల క్రితం గొర్రెల మందను తోలుకెళ్లారు. ఆర్ లోచెర్ల గ్రామానికి చెందిన బోయ హనుమంతు అనే రైతు పొలంలో వందలాది గొర్రెల మందను నిలిపారు. సరిగా నడవలేని 100 పిల్లలను రొప్పం ఏర్పాటు చేసి ఒక చోట ఉంచారు. వాటి వద్ద కాపలా ఉన్న నాగన్న భోజనం చేయడానికి గ్రామంలోకి వెళ్లగా, మాటు వేసిన రెండు చిరుతలు ఒక్కసారిగా దాడి చేసి 71 గొర్రె పిల్లలను చంపేసి రక్తం తాగారుు. 20 పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. భోజనం చేసి వచ్చిన నాగన్నపైకి చిరుతలు దాడికి యత్నించడంతో అతను గట్టిగా కేకలు వేస్తూ పరుగు తీసి ప్రాణాలు కాపాడుకున్నాడు. రూ 3 లక్షలు నష్టం వాటిల్లినట్లు వారు వాపోయారు.