రొద్దం(అనంతపురం): రెండు చిరుతల దాడిలో 71 గొర్రె పిల్లలు హతమయ్యాయి. అనంతపురం జిల్లా రొద్దం మండల పరిధిలోని ఆర్ లోచెర్ల, కంచిసముద్రం గ్రామాల మధ్య ఓకుంట వద్ద గురువారం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది. గొర్రెల కాపర్లు తెలిపిన వివరాలు.. పెనుకొండ మండలం చిన్నపరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఐదుగురు మేపు కోసం 18 రోజుల క్రితం గొర్రెల మందను తోలుకెళ్లారు. ఆర్ లోచెర్ల గ్రామానికి చెందిన బోయ హనుమంతు అనే రైతు పొలంలో వందలాది గొర్రెల మందను నిలిపారు. సరిగా నడవలేని 100 పిల్లలను రొప్పం ఏర్పాటు చేసి ఒక చోట ఉంచారు.
వాటి వద్ద కాపలా ఉన్న నాగన్న భోజనం చేయడానికి గ్రామంలోకి వెళ్లగా, మాటు వేసిన రెండు చిరుతలు ఒక్కసారిగా దాడి చేసి 71 గొర్రె పిల్లలను చంపేసి రక్తం తాగారుు. 20 పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. భోజనం చేసి వచ్చిన నాగన్నపైకి చిరుతలు దాడికి యత్నించడంతో అతను గట్టిగా కేకలు వేస్తూ పరుగు తీసి ప్రాణాలు కాపాడుకున్నాడు. రూ 3 లక్షలు నష్టం వాటిల్లినట్లు వారు వాపోయారు.
చిరుతల దాడిలో 71 గొర్రె పిల్లలు మృతి
Published Thu, Jan 29 2015 10:09 PM | Last Updated on Sat, Sep 2 2017 8:29 PM
Advertisement