sheeps
-
మాచర్ల గొర్రె .. ఇక స్పెషలే!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: పల్నాడు ప్రాంతంలో బాగా పెరిగే ‘మాచర్ల గొర్రె’కు దేశీయంగా ప్రత్యేక గుర్తింపు లభించింది. ఏపీకి చెందిన ఒంగోలు గిత్త, అశీల్ రకం కోడి వంటివి ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రత్యేకత సంతరించుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఎన్బీఏజీఆర్ (నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్) ఈ గొర్రెను ఉత్తమ రకం పశువుగా నమోదు చేసింది. గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలతో పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మాచర్ల రకం గొర్రెలు ఉన్నాయి. దేశంలోని ఇతర రకాల గొర్రెలు, పొట్టేళ్లతో పోలిస్తే మాచర్ల గొర్రెలు విభిన్నంగా ఉన్నట్టు ఎన్బీఏజీఆర్ పేర్కొంది. దీనిపై ప్రత్యేక పరిశోధన చేసిన అనంతరం తాజా గా ఆ సంస్థ వీటిని ఉత్తమ రకం పశువులుగా గుర్తించింది. ఈ పరిశోధనలో కర్నాల్‌లోని ఎన్బీఏజీఆర్, గన్నవరంలోని ఎనీ్టఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ పరిశోధన బృందాలు పాల్గొన్నాయి.స్థానిక పరిస్థితులకు అనుకూలంగా.. మాచర్ల గొర్రెలనే గుక్కల జాల అని, గుంటూరు లోకల్ గొర్రె అని కూడా పిలుస్తారు. ఏపీలోని వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా మాచర్ల గొర్రెల జాతి చక్కగా ఇమిడిపోయినట్టు పరిశోధకులు తెలిపారు. వీటి మాంసం మిగతా వాటితో పోలిస్తే రుచికరంగా ఉంటుందని వెల్లడించారు.శరీర బరువు ఏడాదిలో 30 నుంచి 45 కేజీల వరకూ పెరుగుతుందని పేర్కొన్నారు. ముఖం, కాళ్లపై గోధుమ లేదా నలుపు రంగు మచ్చలు ఉంటాయి. కొన్ని గొర్రెలు ముదురు గోధుమ రంగు మచ్చలతో ఉంటాయి. మాచర్ల గొర్రెల పోషణ లాభదాయకంగా ఉండటంతో చిన్న సన్నకారు రైతులు, రైతు కూలీలు దీన్నే వృత్తిగా చేసుకుంటున్నారని వెల్లడించారు. రెండో స్థానంలో ఏపీ» గడచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో పశు సంపద భారీగా పెరిగినట్టు ఎన్బీఏజీఆర్వెల్లడించింది.» ప్రపంచంలో 13.8 % వాటా పశువులతో దేశం మూడో స్థానంలో ఉండగా.. దేశంలో 23.74% వాటాతో అంటే 17.63 మిలియన్ గొర్రెలతో దేశంలోనేఏపీ రెండో స్థానంలోఉన్నట్టు స్పష్టం చేసింది.» వ్యవసాయం కంటే గొర్రెల పెంపకం లాభసాటిగాఉండటంతో ఎక్కువ మంది రైతులు దీనినే వృత్తిగా ఎంచుకుంటున్నారు. పైగా మాంసం ధర ఎక్కువగా ఉండటం వల్ల మంచి గిట్టుబాటు అవుతున్నట్టు తెలుస్తోంది. -
బక్రీద్ వేడుక: మేకలు, గొర్రెలతో మార్కెట్లలో నెలకొన్న సందడి
-
బక్రీద్ పొట్టేళ్లకు భలే డిమాండ్
బైరెడ్డిపల్లి/పలమనేరు( చిత్తూరు జిల్లా) : చిత్తూరు జిల్లాలోని బైరెడ్డిపల్లిలో పొట్టేళ్ల సంతకు ప్రసిద్ధి. ఈ నెల 16న బక్రీద్ పండగను పురస్కరించుకుని ముందస్తుగానే కొందరు మాంసాహారం కోసం పొట్టేళ్లను ఇక్కడకొచ్చి కొనడం ఆనవాయితీ. ఆ మేరకు శనివారం జరిగిన వారపు సంతలో జత పొట్టేళ్లు గరిష్టంగా రూ.3 లక్షల దాకా పలికాయి. సాధారణంగా జత పొట్టేళ్లు్ల రూ.40 వేల దాకా ఉంటాయి. రాష్ట్రంలోనే పొట్టేళ్ల వారపుసంతగా పేరొందిన సంత చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లిలో జరుగుతుంది. ఇక్కడ లభించే నాణ్యమైన, రుచికరమైన పొట్టేళ్ల కోసం మన రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళల నుంచి వచ్చి వ్యాపారులు పొట్టేళ్లను కొని తీసుకెళుతుంటారు. పండుగకు ముందు సంత కావడంతో పొట్టేళ్లను విక్రయించే రైతులు, కొనే వ్యాపారులతో సంత ప్రాంతం జనంతో కిక్కిరిసిపోయింది. ఇక వాహనాలైతే మూడు కిలోమీటర్ల మేర బారులుతీశాయి. ముఖ్యంగా కాశ్మీరీ మేకపోతులు, స్థానికంగా పెంచిన పొట్టేళ్లు మాత్రం లక్షల్లో ధరలు పలకడం విశేషం. బక్రీద్ నేపథ్యంలో శనివారం జరిగిన వారపుసంతకు పొట్టేళ్లు, మేకలు, గొర్రెలు సుమారుగా 40 నుంచి 50 వేల దాకా వచ్చాయి. మొత్తం మీద ఇక్కడ పండుగ సంతలో రూ.20 కోట్ల దాకా క్రయ, విక్రయాలు జరిగాయి. వచ్చే శనివారమూ ఇదే స్థాయిలో వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. దళారులకు పండగే.. ఇక్కడి పొట్టేళ్ల సంతలో పండుగసంత కావడంతో దళారుల హవా కొనసాగింది. మొత్తం వ్యవహారం చేతిరుమాళ్ల ద్వారా రహస్య వ్యాపారాలతోనే జరిగింది. అటు రైతులు, ఇటు వ్యాపారులకు మధ్య బేరం కుదర్చడంలో దళారులే ఇక్కడ కీâ¶లకం. వీరికి ఇరువైపుల నుంచి నిర్ణయించిన మేర కమీషన్లు దక్కుతాయి. కేవలం బక్రీద్ పండుగకు పొట్టేళ్లను పెంచి మంచి ధరలకు అమ్ముకోవడం రైతులకు మంచి ఆదాయంగా మారింది. దీంతో చిత్తూరు, అనంతపురం జిల్లాలు, కర్ణాటకలోని కోలారు, చింతామణి, శ్రీనివాసపురం, మాలూరు జిల్లాల్లో బక్రీద్ పొట్టేళ్ల పెంపకం సాగుతోంది. ఏటా మేలో మంచి పొట్టేళ్ల కోసం రైతుల అన్వేషణ మొదలవుతుంది. కందూరు, సోమల, సదుం, పీలేరు, అంగళ్లు, బైరెడ్డిపల్లె, బంగారుపేట(కర్ణాటక) తదితర ప్రాంతాల నుంచి మంచి గొర్రె పొట్టేళ్లను రైతులు కొనుగోలు చేస్తారు. అప్పటికే వీటి ధర రూ.10 వేల దాకా ఉంటుంది. ఆ తర్వాత వీటిని బాగా సంరక్షిస్తారు. పచి్చగడ్డితో పాటు బూసా, గానుగపిండి, మొక్కజొన్న తదితరాలను పెట్టి ఏడాది పాటు సాకుతారు. దీంతో బక్రీద్ పండుగకల్లా కొమ్ములు తిరిగిన పొట్టేళ్లు మంచి మాంసంతో సిద్ధమవుతాయి. ఇక్కడి పొట్టేళ్ల మాంసం చాలా రుచి నేను బైరెడ్డిపల్లి సంతంలో 30 ఏళ్ల నుంచి బక్రీద్ పొట్టేళ్లను కొంటున్నా. మా ప్రాంతంలో బైరెడ్డిపల్లి పొట్టేళ్లకు భలే డిమాండ్. వీటి మాంసం చాలా రుచిగా ఉంటుంది. ఫారాల్లో మేపే పొటేళ్లలో ఈ రుచి రాదు. అందుకే ఇక్కడి కొచ్చి కొంటుంటాం. – అబ్దుల్ బాషా, గుడియాత్తం, తమిళనాడు ఇక్కడి పొట్టేళ్లకు భలే డిమాండ్ ఈ ప్రాంతంలోని రైతులు కొండల్లో, బీడు భూముల్లో పొట్టేళ్లను మేపుతుంటారు. దీంతో ఫామ్‌లో ఉండే వాటి కన్నా వీటి శరీరం దృఢంగా ఉంటుంది. దీంతో పాటు రుచి బాగుంటుంది. ఇక మేకలను అటవీప్రాంతంలో మేపుతారు. అవి అడవుల్లోని పలురకాల ఔషధ గుణాలున్న ఆకులను తినడంతో వీటికీ డిమాండ్ ఎక్కువగా ఉంది. – డా.వేణు, గొర్రెల పరిశోధన కేంద్ర చీఫ్ సైంటిస్ట్, పలమనేరు -
గొర్రెదాటు రాతలు.. ఎన్నాళ్లీ రోతలు
సాక్షి, అమరావతి: బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు..బ్యాక్ బోన్ క్లాస్ అంటూ అడుగడుగునా బీసీలకు వెన్నంటి నిలిచింది వైఎస్ జగన్ ప్రభుత్వం. యాదవులకు గొర్రెలు, మేకలు పంపిణీ చేయడం దగ్గర ఆగిపోకుండా ఆ సామాజిక వర్గాలకు చెందిన వారిని చట్టసభలకు పంపించిన చరిత్ర సీఎం జగన్‌ది. యాదవుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా గుర్తింపును తీసుకొచ్చారు.ఆర్బీకేల ద్వారా ఉచితంగా మందులు పంపిణీ చేయడమే కాదు..ఏటా క్రమం తప్పకుండా డీ వారి్మంగ్, వ్యాక్సినేషన్ చేస్తోంది. వైఎస్సార్ పశు బీమా పథకాన్ని సన్న జీవాలకు వర్తింప చేయడమే కాదు..మూగ, సన్నజీవాల కోసం దేశంలో మరెక్కడా లేని విధంగా వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవారథాలను తీసుకొచ్చింది.సుమారు 400 ఏళ్లపాటు కలగా ఉన్న మాచర్ల, నాగావళి గొర్రె జాతులకు భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) గుర్తింపును సాధించడం ద్వారా వాటిపై ఆధారపడిన లక్షలాది మంది జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకొచ్చింది. ఇలా ఐదేళ్లుగా యాదవుల సంక్షేమం కోసం అన్ని విధాలుగా కృషి చేస్తుంటే రామోజీరావుకు మాత్రం కనిపించడం లేదు. యాదవులను తప్పుదారి పట్టించేవిధంగా ‘షెడ్డు దక్కలేదు..పొట్టేలు చిక్కలేదు’ అంటూ అచ్చేసిన బురద కథనంలో వాస్తవాలేమిటో పరిశీలిద్దాం.. ఆరోపణ: యాదవుల సంక్షేమం పట్టని జగన్ వాస్తవం: రాష్ట్రంలో 55.22 లక్షల మేకలు, 1.77 లక్షల గొర్రెలు పెంచుకుంటూ లక్షన్నర కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. వీరిలో 75 శాతం యాదవులు కాగా, మిగిలిన 25 శాతం ఇతర సామాజిక వర్గాల వారున్నారు. వీరి సంక్షేమం కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. గతంకంటే మెరుగైన రీతిలో ఆర్థిక చేయూతనందించారు. నవరత్నాల ద్వారా ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించారు. అర్హత ఉన్నవారందరికీ ఇంటి స్థలాలతోపాటు సొంత ఇళ్ల నిర్మాణానికి సహకరించారు. ఆరోపణ: గత ప్రభుత్వ పథకాలను తెగ్గోసిన జగన్ సర్కార్ వాస్తవం: కేంద్రం సహకారంతో ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున రుణం అందించే స్కీమ్ నేటికీ కొనసాగుతూనే ఉంది. చంద్రబాబు హయాంలో 2029 సొసైటీలుండగా, ప్రస్తుతం వీటి సంఖ్య 2735కు పెరిగింది. అంటే కొత్తగా 706 సొసైటీలను ఏర్పాటు చేయడమే కాదు. వారికి అన్ని విధాలుగా అండగా నిలిచారు. ఎన్సీడీసీ ద్వారా 2423 మందికి రూ.62.49 లక్షల ఆర్థిక సాయం అందించారు. గొర్రెలు, మేకల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెళకువలపై ఆర్బీకేల ద్వారా నిరంతరాయంగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఆర్బీకేల ద్వారా 1159 యూనిట్లకు డీ వారి్మంగ్తోపాటు క్రమం తప్పకుండా వ్యాక్సిన్లు వేస్తున్నారు. ఆరోపణ: వైఎస్సార్సీపీ హయాంలో అందని రుణాలు వాస్తవం: జగన్ ప్రభుత్వంలో యాదవులకు రుణాలే అందలేదని రాసుకొచ్చారు. ఎన్సీడీసీ పథకం కింద ఇప్పటి వరకు 2150 యూనిట్లు మంజూరు చేశారు. వీటిలో రూ.లక్ష చొప్పున 1,416 యూనిట్ల (20 గొర్రెలు. ఒక పొట్టేలు), రూ.5 లక్షల చొప్పున 675 యూనిట్లు (50 గొర్రెలు, రెండు పొట్టేళ్లు), రూ.10 లక్షల చొప్పున 57 యూనిట్లు (100 గొర్రెలు, ఐదు పొట్టేళ్లు), రూ.50 లక్షల చొప్పున 2 యూనిట్లు (500 గొర్రెలు 25 పొట్టేళ్లు) మంజూరు చేశారు. వీటికోసం రూ.43.77 కోట్లు ఖర్చు చేశారు. ఇవే కాదు..ఎన్ఎల్ఎం స్కీమ్ కింద 12 మందికి 50 లక్షల సబ్సిడీతో రూ.కోటి చొప్పున రుణాలు అందించారు. ఇంకా 60 అప్లికేషన్లు బ్యాంకుల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. లక్ష మందికి జారీ చేసిన కేసీసీ కార్డుల ద్వారా రూ.60 వేల నుంచి రూ.2 లక్షల వరకు పావలా వడ్డీ రుణాలు మంజూరు చేశారు. ఆరోపణ: అటెకెక్కించిన బీమా పథకం వాస్తవం: వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన అనంతరం నాలుగేళ్లలో 77 వేల మంది పశు పోషకులకు వైఎస్సార్ పశునష్టపరిహారం పథకం కింద నేరుగా వారి ఖాతాల్లో పరిహారం జమ చేశారు. ఇలా రూ.176.68 కోట్లు జమ చేస్తే అత్యధికంగా లబ్ధి పొందింది మేకలు, గొర్రెల పెంపకందారులే. మరింత ఎక్కువ మందికి లబ్థి చేకూర్చాలని సంకల్పంతో 2022–23లో వైఎస్సార్ పశు బీమా పథకాన్ని తీసుకొచ్చారు. దారిద్య్ర రేఖకు దిగువనున్న వారితోపాటు ఎస్సీ, ఎస్టీలకు తమ జీవాలకు మూడేళ్ల కాలపరిమితితో నిర్దేశించిన ప్రీమియంలో 80 శాతం ప్రభుత్వం రాయితీగా భరిస్తోంది. ఇప్పటికే 1.75 లక్షల మంది ఈ స్కీమ్‌లో నమోదు కాగా, ఇప్పటి వరకు మృత్యువాతపడిన జీవాలకు సంబంధించి రూ.2.50 కోట్ల పరిహారాన్ని అందించారు. ఆరోపణ: కార్పొరేషన్‌తో పైసా మేలు జరగలేదు. వాస్తవం: యాదవుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘతన వైఎస్ జగన్‌కే దక్కుతుంది. కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాదు..నవరత్నాల ద్వారా యాదవులకు అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ ఈ కార్పొరేషన్ ద్వారానే అందిస్తున్నారు. చేయూత, ఆసరా వంటి పథకాల ద్వారా ఆర్థిక చేయూతనివ్వడమే కాదు..జగనన్న విద్యాదీవెన, వసతి వంటి పథకాల ద్వారా వారి పిల్లల చదువులకు భరోసా కల్పిస్తున్నారు. వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవా రథాల ద్వారా సన్న జీవాలకు నాణ్యమైన వైద్యం వారి ముంగిటకే తీసుకొచ్చారు. ఆరోపణ: జగన్ హయాంలో ఏదీ పెద్దపీట? వాస్తవం: యాదవుల సంక్షేమానికి చంద్రబాబు అన్ని విధాలుగా తూట్లు పొడిచారు. యాదవులకు గుర్తింపు కాదు కదా..కనీసం ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. కేంద్రం అమలు చేసిన పథకాలు తప్ప సొంతంగా ఒక్కరంటే ఒక్కరికి కూడా ఆర్థిక చేయూతనివ్వలేదు.మంజూరు చేసిన రూ.250 కోట్లలో చెల్లించిన మొత్తం కేవలం రూ.80 కోట్లే. కేంద్ర ప్రాయోజిత పథకం కింద పశువులు, సన్న జీవాల కోసం అమలు చేసిన బీమా పథకంలో నిర్దేశించిన ప్రీమియం మొత్తంలో 50 శాతం లబ్ధిదారులే భరించాల్సి వచ్చేది. మిగిలిన 50 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించేవి. 2015లో కేంద్రం మ్యాచింగ్ గ్రాంట్ నిలిపివేయడంతో బాబు హయాంలో బీమా పథకాన్నే అటకెక్కించేశారు. ఆ రెండు జాతుల గుర్తింపు కనిపించలేదా మాచర్ల, నాగావళి జాతి గొర్రెలకు అరుదైన గొర్రె జాతులుగా ఐసీఏఆర్ గుర్తింపు లభించింది. ఇప్పటి వరకూ నెల్లూరు జాతి గొర్రెలకే అధికారిక గుర్తింపు ఉంది. ఐసీఏఆర్ గుర్తింపు ద్వారా ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రుణాలు పొందేందుకు వెసులుబాటు కలిగింది. పునరుత్పత్తి కోసం ఉపయోగించే పొట్టేళ్ల ధరలు రెట్టింపు పలకనున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహక పథకాల కింద వీటి అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు మంజూరుకానున్నాయి. -
బీఆర్ఎస్ ను కుదిపేస్తున్న గొర్రెల స్కామ్
-
గొర్రెలకు అరుదైన గుర్తింపు
సాక్షి, అమరావతి: శతాబ్దాల నాటి అరుదైన గొర్రె జాతులకు ఎట్టకేలకు నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్ (ఎన్బీఏ జీఆర్) గుర్తింపు లభించింది. నాటు గొర్రెలుగా ముద్రపడిన నాగావళి, మాచర్ల ప్రాంతాల గొర్రె జాతులకు శ్రీవెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం కృషితో అధికారిక గుర్తింపు లభించింది. దేశంలో రెండొందలకు పైగా గొర్రె జాతులను అధికారికంగా గుర్తించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని గొర్రెల్లో జన్యు వైవిధ్యం ఉన్నప్పటికీ ఇప్పటివరకు కేవలం నెల్లూరు జాతి గొర్రెలకు మాత్రమే గుర్తింపు లభించింది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన నాగావళి గొర్రె(విజయనగరం నాటు గొర్రె)లతో పాటు పల్నాడు ప్రాంతానికి చెందిన మాచర్ల (కృష్ణ) గొర్రెలను అధికారికంగా గుర్తించాలన్న డిమాండ్ దశాబ్దాలుగా ఉంది. ఏదైనా కొత్త జాతిని గుర్తించాలంటే వాటి బాహ్య, జన్యు లక్షణాల నిర్థారణ, జనాభా స్థితుగతులపై సమగ్రంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఈ దిశగా శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న మాచర్ల, గరివిడి పరిశోధనా కేంద్రాల శాస్త్రవేత్తలు 15 ఏళ్లపాటు లోతైన అధ్యయనం చేసి శాస్త్రీయ ఆధారాలతో నివేదిక సమర్పించాయి. అధికారిక గుర్తింపుతో ప్రయోజనాలివీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రుణాలు పొందాలంటే గొర్రెల జాతులను స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఉత్తరాంధ్రా, పల్నాడు, రాయలసీమ ప్రాంతవాసులు తాము పెంచే జాతులను నాటు గొర్రెలుగా పేర్కొనాల్సి రావడంతో తగిన లబ్ధి, ఆశించిన ధర పొందలేకపోతున్నారు. ప్రస్తుతం వీటికి అధికారిక గుర్తింపు లభించడంతో వాటిని పెంచేవారు ఇకపై అన్ని రకాల లబ్ధి పొందగలరు. పునరుత్పత్తి కోసం ఉపయోగించే పొట్టేళ్ల ధర ప్రస్తుతం రూ.30 వేలు కాగా గుర్తింపుతో రూ.45 వేలు పలికే అవకాశం ఉంది. ఆడ గొర్రెలకు ప్రస్తుతం రూ.10 వేలు లభిస్తుండగా.. ఇకపై రూ.15 వేల వరకు పలుకుతాయి. కృష్ణ గొర్రెలకు వందేళ్ల చరిత్ర మాచర్ల గొర్రెల జన్మస్థలం కృష్ణా నది పరీవాహక ప్రాంతం కావడంతో వీటిని కృష్ణ గొర్రెలుగా పిలుస్తారు. నదికి ఇరువైపులా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. ఏపీలో 6.60 లక్షల సంపద ఉందని అంచనా. నెల్లూరు, ముజఫర్ నగర్ గొర్రెల కంటే అధిక బరువు కలిగి ఉంటాయి. నలుపు, తెలుగు, గోధుమ రంగుల్లో ఉంటాయి. తల కుంభాకారంగా, చెవులు, తోక గొట్టాల వలె ఉంటాయి. కొమ్ములు తలకి సమాంతరంగా వుంటాయి. మొదటి ఈత 18–24 నెలలకు వస్తాయి. 20 శాతంపైగా కవలలకు జన్మనిస్తాయి.ప్రతి రెండేళ్లకు 3 పిల్లల చొప్పున ఏడేళ్ల జీవిత కాలంలో 6–8 పిల్లలకు జన్మనిస్తాయి. పొట్టేలు 53.25 కేజీలు, ఆడ గొర్రె 40 కేజీల వరకు పెరుగుతాయి. యుద్ధాలు చేసిన గొర్రెలివి నాగావళి జాతి గొర్రెలకు శతాబ్దాల చరిత్ర ఉంది. కళింగుల కాలంలో ఈ గొర్రెలను యుద్ధాలు, పందేలకు వినియోగించేవారని చెబుతుంటారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర, ఒడిశాలోని గంజాం, గజపతి జిల్లాల్లో సుమారు 9.90 లక్షల నాగావళి గొర్రెలు ఉన్నట్టు అంచనా. బూడిద, గోధుమ, తెలుపు మిశ్రమ వర్ణం కలిపి ఉంటాయి. తల పాము పడగ ఆకారం ఉంటుంది. కళ్ల చుట్టూ నల్లటి వలయం, నోరు, ఉదరం, కాళ్ల చివర భాగం నల్లగా, తోక సన్నగా, కాళ్లు, గిట్టలు బలంగా పొడవుగా ఉంటాయి. ఏడేళ్ల పాటు జీవించే ఈ గొర్రెలు ఏడాదిన్నర నుంచి ప్రతి రెండేళ్లకు 6 పిల్లలకు జన్మనిస్తాయి. పొట్టేలు 2.5 అడుగులు ఎత్తు పెరిగితే.. ఆడ గొర్రెలు మగ గొర్రెల కంటే 2 అంగుళాల తక్కువ ఎత్తు ఉంటాయి. పొట్టేలు 42 కిలోలు, ఆడ గొర్రెలు 35 కిలోల వరకు బరువు పెరుగుతాయి. 12 నెలల వయసులోనే మంచి మాంసం దిగుబడి వస్తుంది. వీటి మాంసంలో కొవ్వు శాతం చాలా తక్కువ. పరాన్న జీవులు, సూక్ష్మజీవుల వల్ల వచ్చే రోగాలను తట్టుకునే శక్తి వీటికి ఉంది. వీటిలో వ్యాధి నిరోధక శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. కీలక ముందడుగు నాగావళి, మాచర్ల గొర్రె జాతులకు గుర్తింపు లభించడం ఏపీ పశు గణాభివృద్ధిలో కీలకమైన ముందడుగు. 15 ఏళ్లుగా వర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలు, అధ్యయనం ఎట్టకేలకు ఫలించాయి. గుర్తింపుతో ఈ జాతుల పరిరక్షణకు పెద్దఎత్తున నిధులు మంజూరవుతాయి. – డాక్టర్ కె.సర్జన్‌రెడ్డి, రీసెర్చ్ డైరెక్టర్, ఎస్వీవీ విశ్వవిద్యాలయం -
పసందైన పొట్టేళ్ల సంత!
బైరెడ్డిపల్లి/పలమనేరు(చిత్తూరు జిల్లా): సాధారణంగా జత పొటేళ్లు రూ.40 వేల దాకా ఉంటాయి. కానీ బక్రీద్ పండుగ కోసం ప్రత్యేకంగా సంరక్షించిన కొమ్ములు తిరిగిన పొట్టేళ్ల ధరలు లక్షలు పలుకుతున్నాయి. రాష్ట్రంలో పొట్టేళ్లు, మేకలు, గొర్రెలకు ప్రాచుర్యం పొందిన వారపు సంతల్లో చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లె ముఖ్యమైంది. ఇక్కడ లభించే నాణ్యమైన, రుచికరమైన పొట్టేళ్ల కోసం మన రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళల నుంచి కూడా వస్తుంటారు. బక్రీద్‌ను పురస్కరించుకుని బైరెడ్డిపల్లెలో శనివారం జరిగిన వారపుసంతకు పొట్టేళ్లు, మేకలు, గొర్రెలు సుమారుగా 40 నుంచి 50 వేల దాకా వ చ్చినట్టు తెలిసింది. జత పొట్టేళ్లు రూ.30 వేల నుంచి రూ.2.70 లక్షల దాకా అమ్ముడయ్యాయి. మొత్తంమీద ఇక్కడ పండుగ సంతలో రూ.20 కోట్ల దాకా క్రయ, విక్రయాలు జరిగినట్టు సమాచారం. గత శనివారం సైతం ఇదే స్థాయిలో రూ.10 కోట్లకు పైగా వ్యాపారం జరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. బైరెడ్డిపల్లె సంతకు బడా వ్యాపారులు బయటి రాష్ట్రాల నుంచి రావడంతో ఇక్కడి పొట్టేళ్లుఅత్యధిక ధరలు పలుకుతున్నాయి. అంతేకాదు, ఇక్కడి పొట్టేళ్ల సంతలో పండుగ సంత కావడంతో దళారుల హవా కొనసాగింది. అటు రైతులు, ఇటు వ్యాపారులకు మధ్య బేరం కుదర్చడంలో దళారులే కీâలకం. వీరికి ఇరువైపుల నుంచి నిర్ణయించిన మేర కమీషన్లు దక్కుతాయి. మొత్తం మీద బక్రీద్ పండుగకు ముందే దళారులు జేబులు నింపుకొన్నారు. మే నుంచి ఏడాది పాటు పొట్టేళ్ల పెంపకం బక్రీద్ పండుగ కోసం పొట్టేళ్లను పెంచి అమ్ముకోవడం రైతులకు లాభసాటిగా మారింది. దీంతో చిత్తూరు, అనంతపురం(అవిభక్త) జిల్లాలు, కర్ణాటకలోని కోలారు, చింతామణి, శ్రీనివాసపురం, మాలూరు జిల్లాల్లో బక్రీద్ పొట్టేళ్ల పెంపకం సాగుతోంది ఏటా మేలో మంచి పొట్టేళ్ల కోసం రైతుల అన్వేషణ మొదలవుతోంది. కందూరు, సోమల, సదుం, పీలేరు, అంగళ్లు, బైరెడ్డిపల్లె, బంగారుపేట(కర్ణాటక) తదితర ప్రాంతాల నుంచి మంచి గొర్రె పొట్టేళ్లను రైతులు కొనుగోలు చేస్తారు. అప్పటికే వీటి ధర రూ.10 వేల దాకా ఉంటుంది. ఆ తర్వాత వీటిని బాగా సంరక్షిస్తారు. ప చ్చిగడ్డితో పాటు బూసా, గానుగపిండి, మొక్కజొన్న తదితరాలను పెట్టి ఏడాదిపాటు సాకుతారు. దీంతో బక్రీద్ పండుగకల్లా కొమ్ము లు తిరిగిన పొట్టేళ్లు మంచి మాంసంతో సిద్ధమవుతాయి. జత పొట్టేళ్లను రూ.2.70 లక్షలకు విక్రయించా.. బక్రీద్ కోసం పొట్టేళ్లను మేపడమే వృత్తిగా పెట్టుకున్నాం. ఏడాదంతా పొట్టేళ్లను మేపి.. బక్రీద్ పండక్కి ముందు సంతకు తోలుకెళతాం. వ్యాపారులు ఎక్కువగా వస్తారు కాబట్టి బాగా మేపిన పొట్టేళ్ల ధర ఎక్కువ పలుకుతుంది. ఈ దఫా జత పొట్టేళ్లను రూ.2.70 లక్షలకు అమ్మడం ఆనందంగా ఉంది. – జగదీష్ , పొట్టేళ్ల పెంపకందారు, తాయిళూరు, కర్ణాటక వీటి మాంసం చాలా రుచిగా ఉంటుంది.. నేను బైరెడ్డిపల్లి సంతలో 23 ఏళ్ల నుంచి బక్రీద్ పొట్టేళ్లను కొంటున్నా. మా ప్రాంతంలో బైరెడ్డిపల్లి పొట్టేళ్లకు భలే డిమాండ్. ఎందుకంటే ఈ ప్రాంతంలోని కొండ, గుట్టల్లో మేత మేస్తుంటాయి. దీంతో వీటి మాంసం చాలా రుచిగా ఉంటుంది. ఫారాల్లో మేపే పొట్టేళ్లు రుచీపచీ ఉండవు. – అబ్దుల్‌బాషా, గుడియాత్తం, తమిళనాడు -
గొర్రెలు నచ్చలే..!
డొంకేశ్వర్(ఆర్మూర్): గొర్రెల కోసం ఏపీలోని అనంతపూర్‌కు వెళ్లిన జిల్లా అధికారులకు, లబ్ధిదారులకు చుక్కెదురైంది. అక్కడ మందలు మందకొడిగానే ఉండడంతో లబ్ధిదారులకు జీవాలు నచ్చలేదు. దీంతో బోధన్ నుంచి 18 మంది, పల్లికొండ నుంచి 16మంది మూడ్రోజుల పాటు అక్కడే ఉండి జిల్లాకు వాపస్ వచ్చారు. అనుకున్న స్థాయిలో గొర్రెలు లేకపోవడం, కొన్నిచోట్ల పెద్దగా ఉండడంతో కొనుగోలు సాధ్యపడలేదు. దీంతో జిల్లాలో జీవాల పంపిణీకి స్వల్ప బ్రేకులు పడ్డాయి. లబ్ధిదారులను మళ్లీ తీసుకెళ్లడానికి పశుసంవర్ధక శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం మందలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల కోసం అన్వేషిస్తున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నియోజకవర్గ స్థాయిలో ఈ నెల 9న గొర్రెల పంపిణీని ప్రారంభించారు. అయితే, ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న జీవాల పంపిణీ జిల్లాలో 85 యూనిట్లకే పరిమితమైంది. ఇటీవల అనంతపూర్ జిల్లాకు వెళ్లిన అధికారులు ఆపసోపాలు పడి ఇప్పటి వరకు జిల్లాకు 1,785 జీవాలను మాత్రమే తెచ్చారు. వాస్తవానికి పంపిణీ ప్రారంభం రోజున 24 యూనిట్ల చొప్పున ఐదు నియోజకవర్గాలు కలిపి మొత్తం 120 యూనిట్లను లబ్ధిదారులకు అందజేయాలి. కానీ, జీవాలను పక్క రాష్ట్రం నుంచి తెచ్చేందుకు సమయం సరిపోకపోవడంతో 85 యూనిట్లే పంపిణీ చేశారు. ఇంకా 35 యూనిట్లు గ్రౌండింగ్ చేయాల్సి ఉంది. దీనికోసం ఇటీవల అనంతపూర్‌కు వెళ్లగా, అక్కడి గొర్రెలు లబ్ధిదారులకు నచ్చలేదు. దీంతో మిగిలిన యూనిట్ల గ్రౌండింగ్ దశాబ్ది ఉత్సవాల్లో సాధ్యపడలేదు. డీడీలు కట్టిన వారిని తీసుకెళ్తాం గొర్రెలు నచ్చక అనంతపూర్ నుంచి కొంతమంది వాపస్ వచ్చిన విషయం వాస్తవమే. వారిని మళ్లీ తీసుకెళ్లడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు 120లో ఇంకా 35 యూనిట్లు గ్రౌండింగ్ చేయాల్సి ఉంది. డీడీలు కట్టిన మిగతా వారందరినీ కూడా జీవాలను తెచ్చేకునేందుకు తీసుకెళ్తాం. లబ్ధిదారులు అందోళన చెందకుండా ఒపిక పట్టాలి. – జగన్నాథచారి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి మిగతా వారికి ఎప్పుడో? రెండో విడత గొర్రెల పంపిణికీ ప్రభుత్వం జిల్లాకు 8,384 యూనిట్ల లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఇప్పటి వరకు 1,843 మంది గొల్ల, కుర్మలు తమ వాటాధనాన్ని ప్రభుత్వానికి డీడీల రూపంలో చెల్లించారు. ప్రస్తుతం 85 మందికి మాత్రమే యూనిట్లు అందడంతో మిగతా వారు మాకెప్పుడిస్తారని అధికారులను అడుగుతున్నారు. తమను కూడా జీవాలను తెచ్చుకునేందుకు తీసుకెళ్లాలని ఒత్తిడి తెస్తున్నారు. అయితే, గొర్రెలను జిల్లాకు తేవడానికి కలెక్టర్ నియమించిన జిల్లా అధికారులు ఇటీవల అనంతపూర్కి వెళ్లారు. మళ్లీ తెచ్చేందుకు వారినే పంపుతారా? లేదా రాష్ట్ర శాఖ సూచించిన అధికారులు వెళ్లారా..? అనే స్పష్టత రావాల్సి ఉంది. అనంతపూర్‌తో పాటు కర్ణాటకలోని రాయచూర్ జిల్లా నుంచి జీవాలను తెచ్చేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, రాయచూర్‌కు ఇంత వరకు జిల్లా నుంచి వెళ్లలేదు. -
బీసీలకు బర్లు, గొర్లు కాదు, బడులు కావాలె
దిల్సుఖ్నగర్ (హైదరాబాద్): రాష్ట్రంలో పన్నెండు లక్షల మంది పేద విద్యార్థులు చదువుకోవాడానికి స్కాలర్ షిప్‌లు, ఫీజులు ఇవ్వాలని అడుగుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం గొర్లను, బర్లను ఇస్తూ బీసీలను మళ్లీ కులవృత్తులకే పరిమితం చేయాలని చూస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. బీసీ విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో ‘పాలమూరు నుంచి పట్నం వరకు’పేరిట డిసెంబర్ రెండో తేదీన చేపట్టిన బీసీల పోరుయాత్ర గురువారం ఎల్బీనగర్ నియోజకవర్గానికి చేరుకుంది. ఈ సందర్భంగా కొత్తపేటలోని బాబూ జగ్జీవన్‌రామ్ భవన్లో నిర్వహించిన బీసీల పోరుగర్జన మహాసభలో ఆయన మాట్లాడారు. గత మూడున్నరేళ్లుగా పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వడంలేదని, స్కాలర్షిప్లు, మెస్‌చార్జీలు పెరిగిన ధరల ప్రకారం పెంచడం లేదని విచారం వ్యక్తం చేశారు. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు దొడ్డు బియ్యంతో నాసిరకం భోజనం పెడుతున్నారని, ఆసరా పింఛన్‌దారులకు రూ.2016 రూపాయలు ఇస్తుండగా, హాస్టల్ విద్యార్థులకేమో రూ.1,500 ఇస్తున్నారని అన్నారు. బీసీ రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, కేంద్ర అధ్యక్షుడు తాటికొండ విక్రంగౌడ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు బైరు రవికృష్ణ గౌడ్, బీసీ మహిళ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మణిమంజరి, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనకాల శ్యాంకుర్మ, బీసీ విద్యార్థి సంఘం నాయకులు స్వామిగౌడ్, పాలకూరి కిరణ్, ఎస్.దుర్గయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
కురమయ్య.. నీ ఆలోచన బాగుందయ్యా!
మద్దిపాడు: గొర్రెల కాపరికి తన జీవాలంటే ప్రాణం. వాటిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిందే కదా! తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా మరికల్ మండలం, చింతగుంట గ్రామానికి చెందిన కురమయ్య సుమారు వెయ్యి గొర్రెల మందకు కాపరి. అన్ని జీవాలకు మేత కావాలి కదా! అందుకే వాటిని మేపుకుంటూ ప్రస్తుతం ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని వెల్లంపల్లి, గుండ్లాపల్లి పరిసర ప్రాంతాలకు చేరుకున్నాడు. ఇతనితో పాటు మరో ముగ్గురు కూడా మందకు రక్షణగా ఉంటారు. ఇంత పెద్ద సమూహంలో పిల్లలు పుట్టడం సహజమే. అయితే అవి నడవలేవు కాబట్టి వాటి కోసం బాడుగ వాహనం కావాలి. అది ఖర్చుతో కూడుకున్నది కావడంతో కురమయ్యకు ఓ ఐడియా వచ్చింది. చిలకలూరిపేటలో ఓ ఆటోమొబైల్ గ్యారేజీకి వెళ్లి 38వేల రూపాయలు ఖర్చు చేసి ఇనుప గ్రిల్స్‌తో ట్రాలీ తయారు చేయించాడు. దానిని తన ద్విచక్రవాహనానికి అమర్చడంతో ట్రాలీ వాహనంలా మారిపోయింది. ప్రస్తుతం 60 మేక పిల్లలను ఎంత దూరమైనా సులువుగా తీసుకువెళుతున్నామని దీనివలన ఖర్చు తగ్గిందని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. (క్లిక్ చేయండి: సర్రుమని తెగే పదును.. చురుకైన పనితనం) -
చైనా గొర్రెల సర్కిల్.. మిస్టరీ వీడింది!
వైరల్: ఆ వీడియో.. చైనాకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఇంటర్నెట్ ద్వారా యావత్ ప్రపంచం చర్చించుకునేలా చేసింది. గొర్రెలు గుండ్రంగా పదిరోజులకు పైగా తిరిగిన వీడియో ఒకటి ఈ నెల మొదట్లో ట్విటర్ ద్వారా ఈ వీడియో బాగా వైరల్ అయ్యింది. చైనా అధికారిక మీడియా సంస్థ పీపుల్స్ డెయిలీనే హైలెట్ చేసింది. అయితే.. ఈ వీడియోపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తికర చర్చ నడిచింది. మరోవైపు చైనా నుంచి మరో ముప్పు రాబోతోందంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా నడిచింది. చైనీయులకు మాత్రం ఆ వీడియో వణుకు పుట్టించింది. గొర్రెల మంద అలా తిరగడం అపశకునంగా భావించారు చైనా ప్రజలు. ఏదైనా ప్రకృతి విపత్తుకు ముందస్తు సంకేతంగా అనుమానించారు. మరోవైపు.. లిస్టెరియోసిస్ బ్యాక్టిరియల్ ఇన్ఫెక్షన్ మూలంగా సర్కిలింగ్ డీసీజ్ కారణంగానే అవి అలా చేసి ఉంటాయని సైంటిస్టులు భావించారు. కానీ.. ఇవేవీ ఆ మూగజీవాల వింత ప్రవర్తను కారణం కాదని అంటున్నారు ఇంగ్లండ్ హార్ట్‌ప్యూరీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మ్యాట్ బెల్. మంగోలియాలోని ఓ పొలంలో గొర్రెలు అలా వ్యవహరించడం వెనుక బలమైన కారణం ఉందని ఆయన అంటున్నారు. చాలాకాలం పాటు గొర్రెలు దొడ్డిలోనే ఉండడం మూలంగానే అలా ప్రవర్తించి ఉంటాయని అంటున్నారు. ‘‘చాలాకాలంగా అవి దొడ్డికే పరిమితం అయ్యి ఉండొచ్చు. ఆ కారణంగానే బయటకు రాగానే.. అవి తమ పరిధిని దాటి పోకుండా అలాగే ఉండిపోయాయి. గుండ్రంగా తిరిగిన వాటి మూస ప్రవర్తనకు కారణం కూడా అదే. వాటిలో మందలోని కొన్ని గొర్రెలు అలా ప్రవర్తిస్తే.. పోనుపోనూ మిగతావి కూడా అనుసరిస్తూ ఉండిపోయాయి. ఇదసలు ఏమాత్రం మంచి పరిణామం కాదు’’ అని మ్యాట్ బెల్ తెలిపారు. The great sheep mystery! Hundreds of sheep walk in a circle for over 10 days in N China's Inner Mongolia. The sheep are healthy and the reason for the weird behavior is still a mystery. pic.twitter.com/8Jg7yOPmGK — People's Daily, China (@PDChina) November 16, 2022 గొర్రెలు మంద మనస్తత్వాన్ని ప్రదర్శిస్తాయి. మందతో పాటు కదులుతాయి. వేటాడే జంతువుల నుంచి రక్షించుకునేందుకు అలా వ్యవహరిస్తుంటాయి. వైరల్ అయిన వీడియోలో గొర్రెల ఓనర్.. మిస్ మియావోగా తేలింది. ఆమె దగ్గర 34 గొర్రెల దొడ్లు ఉన్నాయని. కానీ, ఒక్క మందలోనే గొర్రెలే అలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాయని ఆమె పేర్కొంది. చాలాకాలం వాటిని మందలో ఉంచి.. ఆ తర్వాత వాటిని పొలంలోకి వదిలిందట!. నవంబర్ 4వ తేదీ నుంచి అవి అలా వ్యవహరిస్తున్నాయని తెలుస్తోంది. అయితే ఇప్పుడవి ఇంకా గుండ్రంగానే తిరుగుతున్నాయా? తిరగడం మానేశాయా? అనే విషయాలపై మాత్రం స్పష్టత లేదు. -
TS: పరిహారం కోసం వెళ్లిన పోశన్నకు షాక్
క్రైమ్: ఉన్నట్లుండి ఇంటి బయట కొట్టంలో ఉన్న గొర్రెలు మాయమైపోతూ వచ్చాయి. చివరకు ఓ కొండచిలువ వాటిని మింగేసిందని తెలుసుకున్నాడు ఆ గొర్రెల కాపరి. నష్టపరిహారం కోరుతూ అతను ఫారెస్ట్ అధికారులను సంప్రదించాడు. అయితే ఉల్టా అతని మీదే కేసు పెడతామని ఫారెస్ట్ అధికారులు చెప్పడంతో షాక్ తిన్నాడు. మంచిర్యాల జిల్లా పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కావాల్ గ్రామానికి చెందిన పోశన్న.. ఇంటి ఆవరణలోనే సాదుకుంటున్న నాలుగు గొర్రెలు కనిపించకపోవడంతో ఆందోళన చెందాడు. వారం రోజుల్లో ఆ నాలుగు ఒక్కొక్కటిగా అదృశ్యమైపోతూ వచ్చాయి. ఈ క్రమంలో దొంగల పనిగా భావించిన ఆ కుటుంబం ఒక కన్నేసింది. అయితే.. అక్టోబర్ 30వ తేదీన పోశన్న భార్య ఇల్లు ఊడుస్తున్న టైంలో ఇంటి ఫెన్సింగ్‌లో ఓ భారీ కొండచిలువ చిక్కుకుని కనిపించింది. దీంతో గొర్రెలను మింగింది కొండచిలువనేనని నిర్ధారించుకుని.. కోపంతో ఊరి జనం సాయంతో దానిని గొడ్డళ్లతో నరికి చంపేశాడు పోశన్న. గొర్రెలు బతికే ఉంటాయన్న ఆశతో దాని కడుపు చీల్చి చూశాడు. అయితే.. అందులో గొర్రెల మృతదేహాలు కనిపించాయి. దీంతో పోశన్న అటవీ అధికారులను నష్టపరిహారం కోసం సంప్రదించాడు. అయితే.. నష్టపరిహారానికి బదులు.. కొండచిలువను చంపిన నేరానికి వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేస్తామని అధికారులు చెప్పడంతో పోశన్న కంగుతిన్నాడు. -
చేపలు వదిలారు... గొర్రెలెప్పుడో?
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం అమలుపై ప్రభుత్వ వర్గాలు తర్జనభర్జన పడుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సమయంలో ఆ నియోజకవర్గంలో హడావుడి చేసి లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసిన పశుసంవర్థక శాఖ అధికారులు ఇప్పుడు గప్‌చుప్ కావడం చర్చనీయాంశమైంది. రెండో విడత గొర్రెల పంపిణీ కోసం అక్కడ 7,200 యూనిట్ల గొర్రెల కోసం లబ్ధిదారులు ఇప్పటికే డీడీలు చెల్లించగా, వారికి గొర్రెలు ఎప్పుడివ్వాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని అధికారులు చెబుతున్నారు. అసలు ఈసారి గొర్రెల పంపిణీ ఉంటుందా లేదా అన్నదానిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదని, తామైతే లబ్ధిదారుల వివరాలను సేకరించామని చెబుతున్నారు. గొర్రెల కొనుగోలుకు అవసరమైన రూ.90 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. అయితే, ప్రభుత్వం ఎప్పుడు గ్రీన్‌సిగ్నల్ ఇస్తుందో తేలాల్సి ఉంది. ఎక్కడ ఉప ఎన్నిక వచ్చినా..: రాష్ట్రంలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ప్రభుత్వం గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. హుజూర్నగర్, దుబ్బాక, నాగార్జునసాగర్, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు అక్కడి లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో గొర్రెలు పంపిణీ చేశారు. అయితే, మునుగోడు విషయంలో ప్రభుత్వం భిన్నంగా ఆలోచిస్తోందనే చర్చ జరుగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనా మా వల్లనే సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో నియోజకవర్గ ప్రజలకు అందుతున్నాయనే చర్చకు తావులేకుండా ఆచితూ చి వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇంకా గొర్రెల పంపిణీపై నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. అయితే, బుధవా రం మునుగోడు మండలంలోని కిష్టాపూర్ పెద్ద చెరువులో ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వ హించింది. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ముదిరాజ్, గొర్రెల సమాఖ్య చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్లు హాజరై అక్కడి చెరువులో చేపపిల్లలను వదిలారు. అలాగే, గొర్రెలకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గొర్రెల పంపిణీ త్వరలో జరుగుతుందా? ఈసారి ప్రభుత్వ వ్యూహం ఏంటి? రెండో విడతలో భాగంగా అందరితోపాటే ఈ నియోజకవర్గంలో గొర్రెల పంపిణీ ఉంటుందా? లేదా ఉప ఎన్నిక సమయంలోనే పంపిణీ జరుగుతుందా? అన్నది వేచిచూడాల్సిందే. -
పండుగైనా, పబ్బమైనా.. అనారోగ్యమైనా అడవి బాట!
సాక్షి, కామారెడ్డి: పొద్దున లేవగానే సద్దిమూట కట్టుకుని, నీళ్ల డబ్బా వెంటేసుకుని.. చేతిలో గొడ్డలితో అడవిబాట పట్టడం.. ఒంటరిగానే తిరగడం.. అక్కడే తినడం, చీకటి పడ్డాకే తిరిగి ఇంటి దారి పట్టడం.. ఒకరోజు, రెండు రోజులు కాదు.. దాదాపు జీవితాంతం ఇలాగే గడుస్తుంది. ఇది గొర్రెల కాపరుల జీవితం. పొద్దంతా మేత కోసం గొర్రెలను తిప్పడం, రాత్రికి ఇంటికి చేరుకోవడం.. ఇంట్లో పండుగైనా, పబ్బమైనా, చివరికి అనారోగ్యం బారినపడినా.. ఇంట్లో ఎవరో ఒకరు గొర్రెల వెంట వెళ్లాల్సిందే. ఇలా ఎలమందలు తమ జీవితకాలంలో సగటున లక్ష కిలోమీటర్లపైనే నడుస్తారని అంచనా. వారి జీవనంపై ప్రత్యేక కథనం. గొర్రెల మందలే లోకంగా.. రాష్ట్రంలో గొర్రెల పెంపకంపై ఆధారపడి 7.61 లక్షల కుటుంబాలు జీవిస్తున్నట్టు అంచనా. ఆ కుటుంబాల్లోని వారు పది, పదిహేనేళ్ల వయసులోనే గొర్రెల వెంట వెళ్లడం మొదలుపెడతారు. 65 ఏళ్లు దాటినా వృత్తిని కొనసాగిస్తూనే ఉంటారు. ఏదైనా అనారోగ్యం వస్తే తప్ప ఇంటిపట్టున ఉండేది లేదు. ఎవరైనా బంధువులో, కుటుంబ సభ్యులో చనిపోయినా కూడా.. గొర్రెలను కొట్టంలోనే ఉంచేయలేరు. తోటి గొర్రెల కాపరులకు అప్పగించడమో, తమ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు కాయడానికి వెళ్లడమో చేస్తుండే పరిస్థితి. ఒక కాపరి రోజు కనీసం పది, పదిహేను కిలోమీటర్లు చొప్పున సగటున ఏడాదికి 2,100 కిలోమీటర్లపైన.. యాభై ఏళ్ల పాటు లక్ష కిలోమీటర్లపైనే నడుస్తారని అంచనా. కుటుంబాలను వదిలి.. మన్యం పోయి.. తమ ప్రాంతాల్లో గొర్రెలకు మేత సరిగా లభించని పరిస్థితుల్లో.. దూరంగా ఉన్న అడవులకు గొర్రెలను తీసుకెళ్తుంటారు. దీన్ని మన్యం పోవడం అని పిలుచుకుంటారు. ఇలా గోదావరి, కృష్ణ, మంజీరా నది పరీవాహక ప్రాంతాలకు వెళ్తుంటారు. మూడు, నాలుగు నెలలు అక్కడే ఉండి గొర్రెలను మేపుతారు. వెంట తీసుకువెళ్లిన తిండి గింజలతో, సమీపంలోని ఊర్ల నుంచి తెచ్చుకునే సామగ్రితో వంట చేసుకుని తింటారు. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన వారు చాలామంది గోదావరి వెంట వెళ్తారు. కొందరు గోదావరి దాటి మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలకూ గొర్రెలను తోలుకెళ్లి మేపుతుంటారు. మరికొందరు మంజీరా వెంట కర్ణాటకకు వెళ్తారు. బీపీ, షుగర్లు దరిచేరవట! గొర్రెలను కాయడానికి అలుపులేకుండా తిరగడం వల్ల కాపరులకు బీపీ, షుగర్ వంటి వ్యాధులు వారి దరిచేరవని అంటుంటారు. పచ్చని గట్లు, పొలాలు, అడవుల వెంట తిరగడం వల్ల స్వచ్ఛమైన గాలిని పీలుస్తుండటంతో ఆరోగ్యంగా ఉంటామని చెప్తుంటారు. అయితే నడిచీ నడిచీ కాళ్లు, కీళ్ల నొప్పులతో బాధపడుతుండటం మాత్రం కనిపిస్తుంటుంది. అడవుల్లో తిరిగేప్పుడు ముళ్లు గుచ్చుకోవడం, గాయాలవడం వంటివి జరుగుతుంటాయి. ఈ క్రమంలో చాలా మందికి మూలికలు, ఆకు పసర్లతో సొంతంగా వైద్యం చేసుకునే నైపుణ్యం ఉంటుంది. అడవుల్లో తిరిగే సమయాల్లో చాలాసార్లు వన్య మృగాలు కనిపిస్తాయని, వాటి కంట పడకుండా జాగ్రత్త పడతామని.. ఒకవేళ దాడి చేస్తే ఎదుర్కొనేందుకూ సిద్ధంగా ఉంటామని గొర్రెల కాపరులు చెబుతున్నారు. (క్లిక్ చేయండి: బసంత్‌నగర్ ఎయిర్‌పోర్టుకు మహర్దశ) చిరుతపులి వెంట పడ్డాం.. పదేళ్ల వయసు నుంచి జీవాల వెంట వెళ్తున్నాను. ఇప్పుడు 65 ఏండ్లు. జ్వరం వచ్చినప్పుడే ఇంటి పట్టున ఉండేది. పండుగ ఉన్నా ఆగమాగం తిని పోవుడే. ఓసారి అడవిలో ఎలుగుబంటి మా మీదికి వస్తే కొట్లాడినం. ఇంకోసారి చిరుత పులి గొర్రెను అందకునిపోతే వెంటపడ్డం. గొర్రెను విడిచి పారిపోయింది. – చెట్కూరి హన్మయ్య, ఇస్రోజివాడి, కామారెడ్డి జిల్లా కాపరుల జీవితమంతా కష్టాలే.. గొర్రెలు, మేకల కాపరుల జీవితమంతా కష్టాలే. మేత కోసం అడవికి వెళితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్లు ఇబ్బంది పెడతారు. పంట చేల వెంట వెళితే రైతుల నుంచి ఇబ్బందులు. జీవాలకు రోగాలతో సమస్య. వాటికి మందుల కోసం ఖర్చు పెరిగిపోతోంది. ప్రభుత్వం గొర్లు, మేకల పెంపకానికి స్థలాలు కేటాయించాలి. మందలకు అవసరమైన షెడ్లు నిర్మించి ఇవ్వాలి. నీటి సౌకర్యం కల్పించాలి. ఏళ్లకేళ్లు నడవడం వల్ల కీళ్లనొప్పులతో ఇబ్బంది పడుతున్నరు. వారికి ప్రత్యేక పింఛన్లు ఇవ్వాలి. – జోగుల గంగాధర్, న్యాయవాది, గొర్రెలమేకల కాపరుల సంఘం నాయకుడు నలభై ఐదేళ్లుగా గొర్రెలు కాస్తున్నా.. పదేళ్ల వయసులో గొర్లు మేపడం మొదలుపెట్టిన. 45 ఏళ్లుగా మేపుతున్నా.. అడవిలో చిరుతపులులు, ఎలుగుబంట్లతో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఏటా మేత కోసం మూడు నాలుగు నెలలు మహారాష్ట్రలోని ధర్మాబాద్, కొండల్వాడి, బిలోలి వైపు వెళతాం. అప్పట్లో గొర్రెలు, మేకలకు రోగమొస్తే ఆకు పసర్లు పోసేవాళ్లం. ఇప్పటి మందులు ఎన్ని పోసినా రోగాలు తగ్గడం లేదు. – కన్నపురం బక్కయ్య, ఇసన్నపల్లి, కామారెడ్డి జిల్లా అన్నం పాచిపోయినా తినాల్సి వస్తది నేను ఏడేండ్ల వయసు నుంచే గొర్ల వెంట పోతున్న. చలి, వాన, ఎండ ఏదైనా సరే పోక తప్పది. ఎండా కాలంలో సద్దిడబ్బా మూత తీసేసరికి అన్నం పాచిపోయి ఉంటుంది. ఆకలైతది ఎట్లయిన తినాలె. అన్నంల నీళ్లు పోసి కలిపి.. నీళ్లను పారబోసి అన్నం తినేవాళ్లం. – మాసూరి రాజయ్య, ఇసన్నపల్లి -
Photo Feature: పుడమితల్లి ఒడిలో.. అంతులేని ఆనందం
డైనింగ్ టేబుల్ లేదు.. వడ్డించే వారూ ఉండరు.. కూర్చొనేందుకు సరైన సౌకర్యమూ ఉండదు. అయితేనేం.. తినే ప్రతీ మెతుకులోను అంతులేని ఆనందం వారి సొంతం. పుడమితల్లి ఒడిలో.. చేలగట్లపై సమయానికి తినే పట్టెడు అన్నమే వారికి బలం. ఆ శక్తితోనే ఎంతో మందికి అన్నం పెట్టేందుకు పొలంలో శ్రమిస్తారు. శ్రమైక జీవన సౌందర్యానికి మించినది లేదని చాటిచెబుతారు. విజయనగరం జిల్లా కుమిలి రోడ్డులో పొలం గట్లపై సామూహికంగా భోజనాలు చేస్తూ సోమవారం ‘సాక్షి’ కెమెరాకు చిక్కిన మహిళా రైతుల చిత్రమే దీనికి సజీవ సాక్ష్యం. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయనగరం చకచకా ఈ–క్రాప్ జిల్లాలో ఈ–క్రాప్ నమోదు చకచకా సాగుతోంది. సచివాలయ వ్యవసాయ సహాయకులు, వ్యవసాయ, రెవెన్యూ అధికారుల సమక్షంలో పంటల నమోదు ప్రక్రియ జరుగుతోంది. ఉచిత పంటల బీమా, సున్నావడ్డీ, పంట రుణాలు, నష్ట పరిహారం, రైతు భరోసా, ధాన్యం కొనుగోలు వంటి ప్రయోజనాలు రైతులకు చేరాలంటే ఈ–క్రాప్ నమోదు తప్పనిసరి. రైతులు కూడా బాధ్యతగా ఈ నెల 31లోగా ఈ క్రాప్ నమోదు చేయించుకునేందుకు చొరవచూపాలని అధికారులు సూచిస్తున్నారు. – నెల్లిమర్ల రూరల్ ముందస్తు వైద్యం వర్షాలు కురిసే వేళ.. కలుషిత మేత, నీరు తాగడంతో జీవాలు వ్యాధుల భారిన పడే అవకాశం ఉంది. జీవాల సంరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం ముందస్తుగా ఉచిత వైద్యసేలందిస్తోంది. ఊరూరా పశువైద్య శిబిరాలు నిర్వహించి నట్టల నివారణ మందు వేయిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 6,04,665 జీవాలు ఉండగా వీటిలో గొర్రెలు 4,48,154, మేకలు 1,56,511 ఉన్నాయి. జీవికి రూ.2.50 పైసల చొప్పున సుమారు రూ.18 లక్షల విలువైన డోసులను సరఫరా చేసింది. ఈ నెల 16న ప్రారంభమైన నట్టనివారణ మందు వేసే ప్రక్రియ ఈ నెల 31 వరకు సాగనుందని పశుసంవర్థకశాఖ జేడీ వైవీ రమణ తెలిపారు. – రామభద్రపురం ఐదు అడుగుల అరటిగెల.. చీపురుపల్లిరూరల్(గరివిడి): అరటిగెల సాధారణంగా 3 నుంచి నాలుగు అడుగుల పొడవు ఉంటుంది. అయితే, గరివిడి పట్టణంలోని బద్రీప్రసాద్ కాలనీలో ఓ విశ్రాంత ఫేకర్ ఉద్యోగి ఇంటి పెరటిలోని అరటిచెట్టు ఐదు అడుగుల గెల వేసింది. 300కు పైబడిన పండ్లతో చూపరులను ఆకర్షిస్తోంది. (క్లిక్: మొబైల్ మిస్సయ్యిందా..? జస్ట్ ఇలా చేస్తే చాలు.. మీ ఫోన్ సేఫ్!) -
Kurnool: జీవాల పెంపకం ఇక శాస్త్రీయం
కర్నూలు (అగ్రికల్చర్) : గొర్రెలు, మేకల పెంపకాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. జీవాల పెంపకాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం పెంపకందారులకు రాష్ట్ర స్థాయిలో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. కర్నూలు జిల్లా డోన్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయి గొర్రెల పెంపకందారుల శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తోంది. ప్యాపిలి మండలంలోని హుసేనాపురంలో పదెకరాల్లో శిక్షణ కేంద్రం భవన సముదాయాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేసింది. భవనాలు పూర్తయ్యే వరకూ తాత్కాలికంగా డోన్ పట్టణంలోని పశుసంవర్థక శాఖ రైతు శిక్షణ కేంద్రంలో ఈ శిక్షణ ఇస్తారు. విశాఖలోని స్టేట్ మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లైవ్ స్టాక్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అధికారులు రూపొందించిన మాడ్యూల్స్ ప్రకారం శిక్షణ ఉంటుంది. రాష్ట్రం మొత్తం మీద 2 కోట్లకు పైగా జీవాలుండగా, రాయలసీమ జిల్లాల్లోనే కోటి వరకూ ఉన్నట్టు తెలుస్తోంది. అందువల్ల కర్నూలులో రాష్ట్ర స్థాయి శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. విత్తనపు పొట్టేళ్ల ఎంపిక, టీకాలు వేయించడం తదితర అంశాలపై సమగ్రంగా శిక్షణ ఇస్తారు. వచ్చే నెల 1 నుంచి మూడు రోజుల పాటు.. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి శిక్షణ తరగతులుంటాయి. గొర్రెల పెంపకందారులను బ్యాచ్‌లుగా విభజించి మూడు రోజుల పాటు శిక్షణ ఇస్తారు. రెండు రోజుల పాటు తరగతులు నిర్వహిస్తారు. ఒక్కరోజు అనంతపురం జిల్లాలోని గొర్రెల ఫామ్‌కు తీసుకెళ్లి ప్రాక్టికల్‌గా శిక్షణ ఇస్తారు. గొర్రెల పెంపకందారులకు అదృష్టమే శాస్త్రీయ పద్ధతుల్లో గొర్రెల పెంపకాన్ని చేపట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం హర్షణీయం. మాకు 200 గొర్రెలున్నాయి. వీటిని పెంచడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఎప్పటికప్పుడు తగిన శిక్షణ ఇస్తే.. గొర్రెల పెంపకం లాభసాటిగా ఉంటుంది. – పరమేష్, గొర్రెల పెంపకందారు, యు.కొత్తపల్లి, డోన్ మండలం -
డ్రోన్‌తో అద్భుతం; ఎనిమిదో వింతను చూడాల్సిందే
ఇజ్రాయెల్‌కు చెందిన డ్రోన్ ఫోటోగ్రాఫర్ లయర్ పటేల్ తన కెమెరాతో అద్భుతం చేశాడు. వందలాది గొర్రెల మంద ఒకేసారి కదులుతుండగా.. పై నుంచి అవి దిశను మార్చుకుంటున్న తీరును కెమెరాలో బందించాడు. ఆ వీడియోలో గొర్రెల కదలికల్ని ఫాస్ట్ పార్వర్డ్ పద్దతిలో ఒకసారి.. స్లో మోషన్ యాంగిల్లో చూపెట్టాడు. ఒకసారి పాములా మెలికలు తిరుగుతూ కనిపించిన గొర్రెల మంద మరోసారి పక్షి ఆకారంలోకి మారడం కనువిందు చేసింది. డ్రోన్‌తో అద్భుతం చేసి చూపించిన లయర్ పటేల్ దీని వెనుక కఠోర శ్రమ దాగి ఉందంటూ చెప్పుకొచ్చాడు. ''కొన్ని నెలలుగా 1000-1700 సంఖ్య ఉన్న గొర్రెల మంద కదలికను డ్రోన్‌లో బందించేందుకు చాలా శ్రమించా. అవి ఒకచోట కుదురుగా ఉండకపోవడంతో వాటి చుట్టే ఏడు నెలల పాటు తిరగాల్సి వచ్చింది. అలా చివరికి ఒక దగ్గర ఆగి అవి ఆహారం మేస్తుండగా.. ఒకసారి స్లో మోషన్లో.. మరోసారి ఫాస్ట్ ఫార్వర్డ్ పద్దతిలో చిత్రీకరించా. తీరా వీడియోను చూశాకా అంత అందంగా వస్తుందని ఊహించలేదు. ఇన్నాళ్ల నా కష్టం ఊరికే పోలేదు. '' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా లయర్ పటేల్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఇప్పటికే వేల సంఖ్యలో వ్యూస్ రాగా.. లయర్ కెమెరా పనితనానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వీలైతే మీరు ఒకసారి లుక్కేయండి. చదవండి: వావ్ అంకుల్.. స్టెప్పులిరగదీశావ్ కదా..! View this post on Instagram A post shared by Lior Patel - Drone Photography (@liorpatel) -
ర్యాంప్‌పై హొయలు ఒలుకుతన్న గొర్రెలు ...
-
గొర్రెల క్యాట్ వాక్ కేకో కేక
ర్యాంప్‌పై హొయలు ఒలుకుతూ.. వయ్యరంగా నడుస్తూ వస్తున్న గొర్రెలు ఔరా అనిపించాయి. అందంగా తయారైన గొర్రెలు మోడళ్లకు తీసికట్టు మాదిరి అందచందాలు ప్రదర్శిస్తూ క్యాట్ వాక్ చేశాయి. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ దృశ్యం టర్కీలో కనిపించింది. గొర్రెల పెంపకంపై అవగాహన కల్పించేందుకు.. గొర్రెల రకాలు, వాటి మాంసం వివరాలు తెలుపుతూ ఈ ఫ్యాషన్ షో నిర్వహించారు. ఈ షో టర్కీలోని దియాబకీర్ నగరంలో జరిగింది. ఈ పోటీలో దాదాపు 12 గొర్రె జాతులు పాల్గొన్నాయి. ఆ గొర్రెలను యజమానులు అందంగా తయారు చేసి ర్యాంప్‌పై నడిపించారు. ఈ క్రమంలో స్టేజీపైకి వచ్చిన గొర్రెలు పెద్ద ఎత్తున జనాలు ఉండేసరికి గందరగోళ పడ్డాయి. యజమానులు వెంట నిల్చుని వాటిని నడిపించేందుకు అపసోపాలు పడ్డారు. ఒక్కో గొర్రె ఒక్కో రీతిన తయారై జ్యూరీ వారి దృష్టిని ఆకర్షించేలా వాటిని తయారుచేశారు. ఫ్యాషన్ షోల మాదిరి గొర్రెలకు నంబర్లు ఇచ్చి ర్యాంప్‌పై హొయలొలికిస్తూ అవి నడిచాయి. కళ్లజోడు ధరించి.. వింత హెయిర్ స్టైల్‌తో ఉన్న గొర్రె ఫైనల్ విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా విజేతతో కలిసి అందరూ ఫొటోలు దిగారు. అనంతరం పోటీల పాల్గొన్న అన్ని గొర్రెలతో యజమానులు ఫొటోలకు ఫోజిచ్చారు. ఈ ఫ్యాషన్ షోకు పెద్ద ఎత్తున స్పందన లభించింది. ఈ సమయంలో నిర్వాహకులు కరోనా నిబంధనలు విధిగా పాటించారు. పోటీల్లో పాల్గొన్న వారందరూ మాస్క్ ధరించారు. పెద్దాచిన్న గొర్రెలు సందడి చేశాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. -
వాగులో కొట్టుకుపోయిన మేకలు, గొర్రెలు
సాక్షి, నిర్మల్ : భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. భైంసా మండలం కామోల్ శివారులోని వాగులో 100 మేకలు, గొర్రెలు, సహా కాపరి రాము చిక్కుకుపోయారు. భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టు గేట్లను ఎత్తివేయడంతొ ఒక్కసారిగా వాగు పొంగిపొర్లింది. అయితే వాగు మధ్యలో బండరాయిపై నిల్చుని కాపరి రాము ప్రాణాలు దక్కించుకున్నాడు. కానీ గొర్రెలు, మేకలు మాత్రం నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. దీంతో వెంటనే గ్రామస్తుల సహకారంతో పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు గేట్లను మూసివేయించారు. నీటి ప్రవాహం తగ్గాక సహాయక చర్యలు చేపట్టే అవకాశం ఉందని వెల్లడించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జైనూర్ మండలం కిషన్ నాయక్ తండా గ్రామస్తులు వాగు దాటలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం ఓ గర్భిణీని వాగు దాటించి ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. -
‘కాటన్ ఉత్పత్తికి సరిపోను గొర్రెలు లేవు’
సింగపూర్: సింగపూర్ మినిస్టర్ ఒకరు తప్పులో కాలేశారు. కాటన్ ఉత్పత్తికి తగినన్ని గొర్రెలు లేవంటూ నవ్వుల పాలయ్యారు. అది కూడా ఓ వీడియో ఇంటర్వ్యూలో. ఇంకేముంది జనాలు సదరు మినిస్టర్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు. వివరాలు.. సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల మంత్రి చాన్ చున్ సింగ్ ఓ వీడియో ఇంటర్వ్యూలో విదేశీ వాణిజ్యం మీద సింగపూర్ ఎలా ఆధారపడిందో వివరిస్తూ.. ‘ఫేస్ మాస్క్‌లు కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటాయి. కానీ వాటి తయారీకి తగిన ముడి సరుకులు మన దగ్గర లభించటం లేదు. కాటన్‌ను ఉత్పత్తి చేయడానికి తగినన్ని గొర్రెలు సింగపూర్‌లో లేవు’ అన్నారు. తర్వాత తన పొరపాటును గ్రహించి తనలో తానే నవ్వుకున్నారు చాన్. కానీ ఈ లోపే నెటిజనులు ఆయనను ఓ ఆట ఆడుకున్నారు. ‘బాబా బ్లాక్ షీప్ రైం గుర్తు పెట్టుకుంటే సరి’.. ‘ఈ వీడియో చేసే వారేవరైనా.. ముఖ్యంగా చిన్న పిల్లలు సైతం కాటన్, పత్తి చెట్ల నుంచి వస్తుంది కానీ గొర్రెల నుంచి రాదని చెప్పగలరు’.. ‘నేను గొర్రెలను లెక్కిస్తున్నాను’ అంటూ నెటిజనులు కామెంట్ చేశారు. అయితే చాన్ ఇలా నోరు జారడం ఇదే ప్రథమం కాదు. గతంలో లాక్డౌన్ నేపథ్యంలో మాల్స్ ముందు క్యూ కట్టిన జనాలను ఉద్దేశిస్తూ.. ‘ఇడియట్స్’ అని కామెంట్ చేశాడు. -
రెండో విడతకు సన్నాహాలు
సాక్షి, యాదాద్రి : రెండో విడత గొర్రెల పంపిణీకి జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. గత ఏడాది రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రారంభించిన గొర్రెల పంపిణీ కార్యక్రమం ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిపెట్టింది. గొర్రెల కాపరుల కుటుంబాలకు ఆర్థికంగా చేయూతను ఇవ్వడంతోపాటు మాంసం ఉత్పత్తిని పెంచాలన్నది ప్రభుత్వం ధ్యేయం. అందుకోసం గత ఏడాది మొదటి విడతలో 75శాతం సబ్సిడీతో 18 ఏళ్లు నిండిన గొల్ల,కురుమ సామాజిక వర్గానికి చెందిన వారికి గొర్రెలను పంపిణీ చేసింది. త్వరలో రెండో విడత చేపట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. గత ఏడాది ఇలా.. గొర్రెల పెంపకానికి ముందుకు వచ్చే గొల్ల, కురుమ కుటుంబాల్లో 18 ఏళ్లు నిండిన వారు అర్హులు. జిల్లాలో 342 గొర్రెల,మేకల పెంపకందారుల సంఘాలు ఉన్నాయి. 2017జూన్‌లో గ్రామ సభలు నిర్వహించి సంఘంలో సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరినీ ఎంపిక చేశారు. సభ్యత్వం లేని వారికి సభ్యత్వం ఇచ్చి గొర్రెలను అందజేశారు. గ్రామ సభల ద్వారా ఏ, బీ రెండు జాబితాలను తయారు చేసి మొదటి విడతలో ఏ జాబితాలోని యూAనిట్లకు గొర్రెలను పంపిణీ చేశారు. ముందుగా జిల్లాలో గల మండలాలు, గ్రామాలు, లబి ్ధదారుల ఎంపిక పూర్తిగా అధికారులు, సంఘాల ప్రతినిధుల సమక్షంలో లాటరీ పద్ధతిలో జరిగా యి. ఏ లిస్టులోని లబ్ధిదారులకు 17వేలకుపైగా గొర్రెలను పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి గొర్రెలను కొనుగోలు చేసి లబ్ధిదారులకు అందజేశారు. ఇంకా కొందరికి పంపిణీ చేయాల్సి ఉంది. బి జాబితాలో.. ప్రస్తుతం బి జాబితాలోని 15,000 మందికి రెండో విడతలో గొర్రెలను పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. రెండో జాబితాలో 1,543మంది డీడీలు చెల్లించి సిద్ధంగా ఉన్నారు. 1,700 మందికి బి జాబితా లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేశారు. మిగతా వారికి పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని పశు వైద్యాధికారులు చెబుతున్నారు. రెండో విడతలో గొర్రెలను మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్‌గఢ్‌తో పాటు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నియమాలను పాటించాలి ఒకే కుటుంబంలోని ఎంత మంది సభ్యులున్నా వారు సంఘాల్లో ఉండవచ్చు. సంఘాల్లో ఉన్న వారందరికీ సబ్సిడీ గొర్రెల యూనిట్ మంజూరు చేస్తారు. గొర్రెలు ఉన్నవారికి, ఉద్యోగం చేస్తున్న కుటుంబాలకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఒక్కో యూనిట్లో 20 గొర్రెలు, ఒక పొట్టేలుతో కలిపి 21 ఇస్తారు. యూనిట్ విలువ రూ.1.25లక్షలు. బ్యాంకులతో నిమిత్తం లేకుండా లబ్ధిదారులకు ఈ పథకం వర్తిస్తుంది. యూనిట్ మొత్తంలో 25శాతం (రూ.31,250) లబ్ధిదారుడి వాటా, 75 శాతం (రూ.93.750) ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. లాటరీ పద్ధతిలో గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక చేశారు. ఉదాహరణకు ఒక గ్రామంలో 60 మంది సభ్యులుంటే అందులో 30 మందిని సంఘాల సభ్యుల సమక్షంలోనే లాటరీ ద్వారా గుర్తించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ పర్యవేక్షణ ఉంటుంది. మండల స్థాయిలో తహసీల్దార్, మండల అభివృద్ధి అధికారి, స్థానిక పశువైద్యుడితో కూడిన త్రి సభ్య కమిటీలు ఉంటాయి. పంపిణీ చేసే గొర్రెలను పక్క రాష్ట్రం నుంచే కొనుగోలు చేయాలన్న నిబంధన సడలించారు. గొర్రెల రవాణా, వాటి బీమా ఖర్చు అంతా ప్రభుత్వమే భరిస్తుంది. కొత్తగా ఇచ్చే గొర్రెలతో పాటు పాత జీవాలకు కూడా ఉచితంగా బీమా చేస్తున్నారు. గొర్రె ఆరోగ్య పరిరక్షణకు ఏడాదికి మూడుసార్లు టీకాలు, నట్టల మందు సరఫరా చేస్తారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున సంచార పశువైద్యశాలలు ఏర్పాటు చేశారు. గొర్రెల మార్కెటింగ్ కోసం ప్రత్యేక చర్యలు ప్రతి రెండు మూడు మండలాలకు ఒకటి చొప్పున గొర్ల అంగడి ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ ఆదేశాల కోసం చూస్తున్నాం మొదటి దశ లబ్ధిదారులను ఎంపిక చేసిన సమయంలోనే రెండో విడతకు లబ్ధిదారులను ఎంపిక చేశాం. నిబంధనల ప్రకారం లబ్ధిదారుల నుంచి వారి వాటాధనం డీడీలు ఆహ్వానిస్తాం. ప్రభుత్వం రెండో విడత గొర్రెల పంపిణీ కోసం ఇచ్చే ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాం. –మదన్‌కుమార్, జిల్లా పశు వైద్యాధికారి -
జంతువుల్లోనూ నపుంసక జంతువులు
వాషింగ్టన్ : సాధారణంగా మనుషుల్లో ఆడ, మగతో పాటు నపుంసకులు ఉంటారన్నది తెలిసిన విషయమే. కానీ జంతువుల్లోనూ నపుంసక జంతువులు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా గొర్రెల జాతికి సంబంధించి 12 గొర్రెల్లో ఒకటి నపుంసకత్వాన్ని కలిగి ఉందని పోర్ట్లాండ్లోని ‘‘ఓరెగాన్ హెల్త్ అండ్ సైన్సెస్ యూనివర్శిటీ’’ చెందిన ప్రొఫెసర్ చార్లెస్ రోసెల్లీ పేర్కొన్నారు. గొర్రెల జెండర్ అన్నది తల్లి గర్భంలోనే నిర్ణయించబడుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. నపుంసక గొర్రెలు ఆడవాటితో కలవటానికి ఇష్టపడకపోవటం వల్ల వాటిని వధశాలలకు తరలించటం జరుగుతోందని చెప్పారు. దాదాపు ఎనిమిది శాతం గొర్రెలు నపుంసకత్వాన్ని కలిగి ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా కొన్ని రకాల కోతులు, కుక్కలు, తాబేళ్లు, సింహాలు కూడా నపుంసకత్వాన్ని కలిగి ఉన్నాయని వెల్లడించారు. చానల్ 4ఎస్ రూపొందించిన ‘‘మై గే డాగ్ అండ్ అదర్ అనిమల్స్’’ అనే డాక్కుమెంటరీలో ఈ వివరాలను ప్రస్తావించారు. -
జమ్మూ కాశ్మీర్లో పిడుగుపాటుకు వందకు పైగా గొర్రెలు మృతి
-
హద్దులు దాటుతున్న గొర్రెలు
ఆదిలాబాద్‌రూరల్ : అవి టారస్, ఐచర్ (పెద్ద లారీలు) వాహనాలు.. కింద, పైన, మధ్యలో చెక్కలను స్లాబ్‌గా వేసి గొర్రెలను తరలిస్తున్నారు.. ఒక్కో టారస్ వాహనంలో 300 గొర్రెలు.. ఇలా రెండు టారస్ వాహనాల్లో, రెండు ఐచర్ వాహనాల్లో మొత్తం వెయ్యి గొర్రెలను సరిహద్దు దాటిస్తుండగా జాతీయ రహదారిపై పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీ గొర్రెలుగా అనుమానించిన ఆర్టీఏశాఖ అధికారులు అదుపులోకి తీసుకొని ఆదిలాబాద్‌రూరల్ పోలీసులకు అప్పగించారు. ఈ విషయం తెలుసుకున్న పశు సంవర్ధకశాఖ అధికారులు అక్కడికి చేరుకొని పరిశీలించారు. అవి సబ్సిడీ గొర్రెలుగా అనుమానిస్తున్నారు. కరీంనగర్ జిల్లా గం గాధర్ గ్రామం నుంచి నాలుగు భారీ లారీల్లో తరలిస్తున్నారనే వచ్చిన సమాచారం మేరకు దాడి చేసి రాంపూర్ సమీపంలో జాతీయ రహదారి 44పై పట్టుకున్నారు. గొల్లకుర్మలకు రూ.1లక్ష 25వేల వ్యయంతో 21 గొర్రెలను పంపిణీ చేస్తోంది. అయితే కొంతమంది దళారులు మహారాష్ట్రలో కొనుగోలు చేసిన వాటిని చెవులకు వేసిన ట్యాగ్‌ను తొలగించి రీసైక్లింగ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్రమంగా తరలిస్తున్న గొర్రెలు సుమారు వెయ్యి వరకు ఉంటాయని సంబంధిత శాఖాధికారులు, పోలీసులు తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న ఈ గొర్రె యూనిట్ల విలువ సుమారు రూ.60 లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు. పట్టుకున్న గొర్రెలను పశుసంవర్ధక శాఖ అధికారులకు అప్పగించామని ఆదిలాబాద్‌రూరల్ ఎస్సై తోట తిరుపతి తెలిపారు. గొర్రెలను తరలిస్తున్న వ్యక్తులు దొరికినప్పుడే వీటి పూర్తి వివరాలను బయటపడతాయన్నారు. లారీలను సీజ్ చేసి, గొర్రెలను తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. -
కుర్వ, కురువ కులాలకూ గొర్రెల పంపిణీ
సాక్షి, హైదరాబాద్ : గొల్ల, కుర్మ కులాలతో పాటు కుర్వ, కురువ కులాలకు సైతం గొర్రెల పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు బుధవారం కుర్వ, కురవ కులాలను లబ్దిదారుల జాబితాలో చేర్చుతూ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. -
కార్లలో మేకల దొంగతనం
రాజేంద్రనగర్ రంగారెడ్డి : ఒకటి కాదు... రెండు కాదు... 11 నెలలుగా 30 మేకలను ఎత్తుకెళ్లారు. కారుల్లో వచ్చి మరీ దొంగతనాలకు పాల్పడతారు. దొంగతనాల విషయం తెలిసి దొంగలను పట్టుకునేందుకు స్థానిక యువకలు ఎన్నిసార్లు ప్రయత్నించినా దొరకలేదు సరికదా.. ఆ కారును వారి మీదకే దూకించి భయపెట్టేవారు. వంద గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలి వానకు చచ్చిందన్న చందంగా ఎట్టకేలకు మేకల దొంగలు పోలీసులకు చిక్కారు. కారు పంక్చర్ కావడంతో స్థానిక యువకులు గుర్తించి పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... ప్రేమావతిపేట ప్రాంతంలో స్థానిక కురుమ, యాదవులు మేకలను పెంచుతున్నారు. వీటిని తమ ఇళ్ల ముందు ఉన్న పాకలతో పాటు బస్తీలోని ఖాళీ స్థలంలో రాత్రి సమయాలలో గడ్డి వేసి ఉంచేవారు. గత 11 నెలలుగా రాత్రి సమయంలో వాహనాలలో వచ్చిన దొంగలు వీటిని ఎత్తుకెళ్లడం ప్రారంభించారు. ఇలా 30 మేకలను అపహరించారు. ఈ విషయమై బాధితులు రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. స్థానిక యువకులు రాత్రి సమయంలో బస్తీలలో కాపు కాసినా వారిపైకే వాహనాలను తీసుకెళ్తూ భయభ్రాంతులకు గురి చేసి తప్పించుకునే వారు. వాహనాలకు నెంబర్ లేకపోవడం, మితిమీరిన వేగంతో వెళ్తుండడంతో వారిని పట్టుకోవడంలో స్థానిక యువకులు విఫలమయ్యారు. ఇదిలా ఉండగా ఆదివారం రాత్రి 12 గంటల ప్రాంతంలో స్థానిక యువకులు ప్రేమావతిపేట శివాలయం వద్ద కాపు కాశారు. కారులో నలుగురు యువకులు ప్రేమావతిపేట ప్రాంతానికి వచ్చారు. ఓ వీధిలో నిద్రిస్తున్న మూడు మేకలను రెప్పపాటులో కారులోకి వేసుకున్నారు. మేకల శబ్ధానికి అప్రమత్తమైన యువకులు కారు వద్దకు రాగానే రివర్స్‌లో వారిపైకే వేగంగా పోనిచ్చారు. అప్రమత్తమైన యువకులు రాళ్లతో దాడి చేశారు. ఇదే సమయంలో వాహనం ముందు టైర్ పంక్చరైంది. అలాగే ముందుకు వేగంగా పోనిచ్చారు. రోడ్డుపై కొద్దిదూరం వెంబడించినా యువకులకు కారు చిక్కలేదు. విషయాన్ని పెద్దలకు చెప్పి రోడ్డు పైకి వచ్చారు. వాహనం పంక్చర్ కావడంతో దానిని అలాగే ముందుకు తీసుకెళ్లడంతో డాంబర్ రోడ్డు (బీటీ రోడ్డు)ను రాసుకుంటూ వెళ్లింది. యూనివర్సిటీ రోడ్డు నుంచి బుద్వేల్ మీదుగా స్థానిక చర్చి ప్రాంతంలో పార్కు చేసి ఉంది. దీంతో యువకులు వాహనాన్ని గుర్తించి దానిపై స్థానికులను ఆరా తీశారు. స్థానిక యువకులే దొంగతనాలకు పాల్పడుతున్నారని నిర్ధారించుకుని రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వాహనంతో పాటు నలుగురు యువకులు, ఒక మేకను స్టేషన్‌కు తీసుకొచ్చారు. ప్రస్తుతం వీరిని విచారిస్తున్నారు. వీరితో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు, గత 11 నెలల కాలంగా 30 మేకలను దొంగలించింది వీరేనా, వీరికి స్థానికులు ఎవరైనా సహకరించారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడ్డ యువకులంతా 24 సంవత్సరాలలోపే ఉండడం గమనార్హం. -
గొర్రెల కోసం వెళ్లి.. బందీలుగా మారి..
సాక్షి, జనగామ: సబ్సిడీ గొర్రెల కొనుగోలు నిమిత్తం కర్ణాటకకు వెళ్లినవారు ఊహించని షాక్‌కు గురయ్యారు. జనగామ జిల్లాలోని చిల్పూర్ మండలం లింగంపల్లికి చెందిన 12 మంది, చిల్పూర్‌కి చెందిన 20 మంది గొర్రెల కాపరులు వెటర్నరీ అధికారుల సహకారంతో ఈ నెల 15న కర్ణాటకకు వెళ్లారు. చిల్పూర్కు చెందిన 20 మంది గొర్రెలను కొనుగోలు చేసి తిరిగొచ్చారు. లింగంపల్లి గొర్రెల కాపరులు శుక్రవారం రాత్రి యాద్గిర్ జిల్లా వడిగర్ల తాలుకా ఖానాపురం ప్రభుత్వ పాఠశాలలో బస చేశారు. వారితో ఉన్న వెటర్నరీ డాక్టర్ కిరణ్ తన బాధ్యతలను గుండాల వెటర్నరీ డాక్టర్ జాటోత్ యాకూబ్‌కు అప్పగించారు. అయితే, యాకూబ్ తిరిగి యాద్గిర్ జిల్లా కేంద్రానికి వచ్చారు. ఇటీవల ఆ చుట్టుపక్కల గ్రామాలైన వడిగర్ల, ఖానాపురం ప్రాంతాల్లో చిన్నపిల్లలను ఎత్తుకెళ్లే ముఠా సంచరిస్తోందనే వదంతులున్నాయి. అంతకు ముందు దొంగలు చోరీలకు వచ్చి ఇద్దరిని హత్య చేసిన∙ఉదంతాలున్నాయి. దీంతో రాత్రిపూట ఆ ప్రాంతవాసులు గస్తీ కాస్తున్నారు. ఈ క్రమంలో పాఠశాల ఆవరణలోకి దొంగల ముఠా వచ్చిందని సమాచారం అందడంతో గ్రామస్తులు అక్కడకు పెద్ద సంఖ్యలో చేరారు. గొర్రెల కాపరులకు కన్నడ భాష రాకపోవడంతో స్థానికులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక పోయారు. దీంతో దొంగలుగా భావించి వారిపై దాడి చేశారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. వారిని బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రాత్రంతా స్టేషన్లోనే భయంతో కాలం వెళ్లదీశారు. బాధితుడి సెల్ ద్వారా వెలుగులోకి.. పోలీసుల అదుపులో ఉన్న బాధితుడు ఒకరు తన సెల్‌ఫోన్ ద్వారా తమ కష్టాలను వాట్సాప్‌లో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీస్ స్టేషన్లో తాము కూర్చున్న విధానం, గ్రామస్తుల చేతిలో గాయపడిన ఫొటోలు పోస్టు చేశాడు. దీంతో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు సిద్ధిరాజ్ యాదవ్ స్పందించి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. యాదవ నాయకులు, అధికారుల ప్రయత్నాలతో పోలీసులు వారిని విడుదల చేశారు. శనివారం గొర్రెలకాపరులు లింగంపల్లికి తిరుగుపయనమ య్యారు. గొర్రెలకాపరుల వెంట వెటర్నరీ అధికారులుండకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని యాదవ సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సర్కారు గొర్రెలకు ఉచిత దాణా
సాక్షి, హైదరాబాద్: వేసవిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలకు రూ.66 కోట్లతో ఉచితంగా దాణా పంపిణీ చేయనున్నట్లు పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెల్లడించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2.53 లక్షల మందికి 53 లక్షల పైచిలుకు గొర్రెలను పంపిణీ చేశామన్నారు. కేవలం గొర్రెలను పంపిణీ చేయడమే కాకుండా వాటికి దాణా, నీరు, ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. యూనిట్‌కు 4 బస్తాల దాణా అందిస్తామన్నారు. గొర్రెలకు బీమా సౌకర్యం కల్పించామని, చనిపోయిన వాటి వివరాలను అధికారులకు తెలియజేస్తే క్లెయి మ్స్ చెల్లిస్తారన్నారు. గొర్రెల పెంపకందారు ప్రమాదవశాత్తు చనిపోతే రూ.ఆరు లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తామన్నారు. రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో ఆధునిక సౌకర్యాలతో గొర్రెల పెంపకంపై శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని ఎక్కువ కోతలు ఇచ్చే మేలు రకపు పశుగ్రాస విత్తనాలను 75 శాతం రాయితీపై రైతులకు ఇస్తామన్నారు. వెయ్యి కోట్లతో మత్స్యశాఖ అభివృద్ధి: మత్స్యరంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లతో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని మంత్రి తలసాని వెల్లడించారు. సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, మత్స్యశాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పథకాలపై విస్తృత ప్రచారం చేయాలని వారిని ఆదేశించారు. మత్స్య విత్తన అభివృద్ధి పథకం కింద రూ.204 కోట్లతో హేచరీలు, విత్తన క్షేత్రాల బలోపేతం వంటివి చేపడుతున్నామన్నారు. చేపల వేట కోసం మత్స్యకారులకు రూ.82 కోట్లతో సబ్సిడీపై క్రాఫ్ట్‌లు, వలలను పంపిణీ చేస్తామన్నారు. రూ. 370 కోట్లతో చేపల మార్కెటింగ్‌కు అవసరమైన చర్యలను చేపడతామన్నారు. 201718 సంవత్సరంలో 51 కోట్ల చేపపిల్లలను రూ.42 కోట్ల ఖర్చుతో 11,067 జలాశయాల్లో విడుదల చేశామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మత్స్యశాఖ కమిషనర్ సువర్ణ పాల్గొన్నారు. -
థర్డ్ పార్టీ వెరిఫికేషన్ రద్దు?
సాక్షి, హైదరాబాద్: గొర్రెల అక్రమార్కులకు ఊతం ఇచ్చేలా పశు సంవర్ధకశాఖ వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గొర్రెల పంపిణీలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అనేకచోట్ల గొర్రెల రీసైక్లింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ అక్రమాలపై థర్డ్ పార్టీ సర్వే చేపట్టాలని ఇటీవలే తీసుకున్న నిర్ణయాన్ని ఆ శాఖ వెనక్కు తీసుకున్నట్లు సమాచారం. థర్డ్ పార్టీ సర్వే కోసం ఆర్థిక సామాజిక అధ్యయనాల కేంద్రం (సెస్)కు అనుమతిస్తూ ప్రభుత్వం గత డిసెంబర్ 30న ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వులను నిలుపుదల చేయాలని ఆ శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. ‘తనిఖీల కోసం ఉత్తర్వులు వచ్చాయా? వస్తే చూపించండి. ఆ విషయం నాకు తెలియదే. అయినా మనమంతా మానవులం. అక్కడక్కడ తప్పులు జరగడం సహజం. అయినా ఏదో ఒక సంస్థకు తనిఖీల బాధ్యత అప్పగిస్తే అంతా సవ్యంగా చేసినట్లే అవుతుందా? లక్షలాది గొర్రెలను, లబ్ధిదారులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసే శక్తి సంస్థలకు ఎంత ఉంటుంది?’అంటూ కొత్తగా బాధ్యతలు చేపట్టిన పశు సంవ ర్థకశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా వ్యాఖ్యానించడం గమనార్హం. రాజకీయంగా ఇబ్బందనా.. థర్డ్ పార్టీ వెరిఫికేషన్ సెస్‌కు అప్పగిస్తూ సురేశ్‌చందా ఉత్తర్వులు ఇవ్వడంపై పైస్థాయిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైనట్లు సమాచారం. సందీప్‌కుమార్ సుల్తానియాకు బాధ్యతలు అప్పగించడంతో ఆయన తనిఖీ ని పక్కన పెట్టేసినట్లు అర్థమవుతోంది. గత జూన్‌లో ప్రభుత్వం గొర్రెల పంపిణీ చేపట్టింది. ఇతర రాష్ట్రాల్లో గొర్రెల లభ్యత లేకపోవడం, దళారుల ప్రవేశం, పశు వైద్యుల చేతివాటంతో అక్రమాలు మొదలయ్యాయి. దీంతో ప్రభుత్వం కొందరు అధికారులపై వేటు కూడా వేసింది. అయితే థర్డ్ పార్టీ వెరిఫికేషన్ చేపడితే తన తప్పును తానే ఒప్పుకున్నట్లు అవుతుందని పెద్దలు భావించారు. అక్రమాలు జరిగినట్లు సెస్ నివేదిస్తే రాజకీయంగానూ నష్టం జరుగుతుం దని సర్కారు భావించింది. దీంతో సెస్‌కు ఇచ్చిన తనిఖీ బాధ్యతలను రద్దు చేసే యోచనలో సర్కారు ఉంది. 42 లక్షల గొర్రెల పంపిణీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గొర్రెల పంపిణీ ప్రక్రియ జోరందుకుంది. ఇప్పటివరకు 42 లక్షల గొర్రెలను పంపిణీ చేసినట్లు రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ ఎండీ వి.లక్ష్మారెడ్డి సోమవారం వెల్లడించారు. 2 లక్షలకు పైగా గొల్లకుర్మలకు ఒక్కొక్కరికి 20+1 చొప్పున 75 శాతం సబ్సిడీపై పంపిణీ చేశామన్నారు. ప్రభుత్వ వాటా రూ.1,877 కోట్లు, లబ్ధి0్దదారుల వాటా రూ.625 కోట్లు మొత్తం రూ.2,502 కోట్లు గొర్రెల కోసం ఖర్చు చేసినట్లు తెలిపారు. 15.50 లక్షల గొర్రె పిల్లల పునరుత్పత్తి జరిగి సుమారు రూ. 700 కోట్ల సంపద గొల్ల కుర్మలకు చేరిందన్నారు. 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 100 సంచార పశు వైద్య అంబులెన్సులను అందుథబాటులోకి తీసుకువచ్చామన్నారు. -
తెలంగాణ ప్రతీక.. కనబడదా ఇక..!
సాక్షి, హైదరాబాద్: గొంగడి.. తెలంగాణ సాహిత్య, సామాజిక, సాంస్కృతిక జీవనానికి ప్రతీక.. దక్కన్ ప్రాంత రక్షణ కవచం.. వందల ఏళ్లుగా తెలంగాణ జనజీవనంలో భాగమైన ఈ గొంగడి ఇప్పుడు మాయమైపోతున్నదా.. చలిలో వెచ్చదనం, మండుటెండలో చల్లదనాన్ని ఇచ్చే గొంగడి కనుమరుగు కానుందా.. ఉలెన్ దుప్పట్లు, బ్లాంకెట్లు, ప్రజల అలవాట్లలో మార్పులు గొంగడి ఉనికిని ప్రశ్నార్థకం చేశాయి. నల్లజాతి గొర్రెలతోపాటే గొంగడి కూడా క్రమంగా అంతరించిపోతోంది. అనేక సంవత్సరాలుగా గొంగళ్ల తయారీని నమ్ముకొని బతికిన కుటుంబాలు ఆ వృత్తికి దూరమయ్యాయి. ప్రస్తుతం మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్‌లో 20 కుటుంబాలే నేత గొంగళ్లను తయారు చేసి విక్రయిస్తున్నాయి. ఈ కుటుంబాల్లోనూ పెద్దవాళ్లు తప్ప ఈతరం యువతీయువకులు వృత్తికి పూర్తిగా దూరమయ్యారు. కనుమరుగవుతున్న గొంగడిని కాపాడుకొనే లక్ష్యంతో దక్కన్ గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం, ఆహార సార్వభౌమత్వ సంఘటనలు సంయుక్తంగా గొంగడి పరిరక్షణ ఉద్యమం చేపట్టాయి. శనివారం బేగంపేటలోని ‘దారం’వస్త్ర షోరూమ్‌లో గొంగళ్ల ప్రదర్శనను ఏర్పాటు చేశాయి. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ప్రత్యేక కథనం.. నల్ల గొర్రెలు ఎక్కడ..? గొర్రెల నుంచి బొచ్చు సేకరించి శుద్ధి చేసి దారంలా రూపొందించి మగ్గంపై నేయడానికి కనీసం 25 రోజులు పడుతుంది. ఒక గొంగడి తయారు చేయడానికి ఏడాది వయసు దాటిన గొర్రెలు కనీసం 25 అవసరమవుతాయి. వాటి నుంచి మాత్రమే 2 అంచుల పొడవున్న గొర్రె బొచ్చు లభిస్తుంది. గొర్రె వయస్సు పెరిగే కొద్దీ వెంట్రుకల పొడవు తగ్గి గొంగళ్ల తయారీకి పనికి రాకుండా పోతుంది. అయితే గత 20 ఏళ్లలో గొంగళ్ల తయారీకి ప్రధాన వనరైన నల్ల గొర్రెల సంఖ్య భారీగా పడిపోయింది. ఒకప్పుడు తెలంగాణలో లక్షలాది నల్ల గొర్రెలు ఉండగా.. ఇప్పుడు కేవలం 11 జిల్లాల్లో 10 వేలపైచిలుకే ఉన్నాయి. నల్ల గొర్రెల సంఖ్య తగ్గడంతో బొచ్చు సేకరణ సవాలుగా మారింది. ఇప్పుడు మెదక్‌లోనే.. దక్కన్ గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం అధ్యయనం ప్రకారం ప్రస్తుతం గొంగళ్ల తయారీ మెదక్‌లో తప్ప మరెక్కడాలేదు. గతంలో నారాయణ్‌ఖేడ్ పరిసరాల్లోని ప్రతి ఊళ్లో కనీసం రెండు, మూడు కుటుంబాలు గొంగళ్లను తయారు చేసేవి. సామాజికంగా గొల్ల, కురుమలే కాకుండా అనేక మంది గొంగళ్లను వినియోగించేవారు. దీంతో ఈ వృత్తికి ఆదరణ లభించింది. అయితే నల్ల గొర్రెల సంఖ్య తగ్గడంతో ఒకప్పుడు గొంగళ్లు నేయడమే వృత్తిగా బతికిన వందలాది కుటుంబాలు క్రమంగా ఆ వృత్తి నుంచి దూరమయ్యాయి. ఇప్పుడు నారాయణ్‌ఖేడ్, శివ్వంపేట, బిజిలీపూర్ ప్రాంతాల్లో 20 కుటుంబాలే మిగిలాయి. గొంగడి అ‘ధర’హో.. నల్లటి నేత గొంగడి ఆరోగ్య ప్రదాయిని. ఎన్ని రకాల దుస్తులు, సదుపాయాలు అందుబాటులోఉన్నా కాలానికి తగినట్లు సేవలందించేది ఒక్క గొంగడి మాత్రమే. అందుకే తెలంగాణ జీవితంలో, సంస్కృతిలో, ఆటపాటల్లో భాగమైంది. గోచి, గొంగడి తెలంగాణ కళారూపాలయ్యాయి. ఇంతటి ఘన చరిత్ర ఉన్న గొంగడి ఇప్పుడు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో ధరలూ కాస్త ఎక్కువే ఉన్నాయి. హైదరాబాద్ బేగంపేటలోని ‘దారం’షోరూమ్‌లో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో ఒక్కో గొంగడి రూ.6000 నుంచి రూ.9,000 వరకు లభిస్తోంది. ఆదివారం కూడా ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు గొంగళ్ల ప్రదర్శన ఉంటుంది. ఒక్కసారి గొంగడి కొంటే 10–20 ఏళ్ల వరకు మన్నికైన సేవలందిస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఈ వృత్తి మాతోనే పోయేటట్టున్నది.. ‘ఇప్పుడు గొర్రె బొచ్చు దొరుకుతలేదు. కత్తిరించి తెచ్చేవాళ్లూ లేరు. మాతోనే ఈ వృత్తి పోయేటట్టున్నది. మహా అయితే ఇంకో నాలుగైదేండ్లు మాత్రమే పని చేస్తాం కావచ్చు. మా పిల్లలకైతే ఈ పని రానే రాదు.’’ – గుండా యాదమ్మ, గొట్టిముక్కల, శివ్వంపేట మండలం నేటి తరానికి పరిచయం అవసరం మా ఇంట్లో ఇప్పటికీ గొంగడి వినియోగిస్తాం. ప్రత్యేకంగా నా కోసం ఓ గొంగడి కొనుక్కోవాలనే నాన్నతో కలసి వచ్చా. నేటి తరానికి గొంగడి గొప్పతనాన్ని పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. – వర్ష శేష్, సైనిక్‌పురి నల్లగొర్రెలు కావాలి ఎర్ర గొర్రెలు కాకుండా నల్ల గొర్రెలను ఉత్పత్తి చేసి పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అంతరించిపోతున్న గొంగడి తయారీని కాపాడాలి. హైదరాబాద్‌లో ఇప్పటికి ఏడుసార్లు, బెంగళూర్, ఢిల్లీల్లో రెండుసార్లు ప్రదర్శనలు ఏర్పాటు చేశాం. జనం ఆదరిస్తున్నారు. కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు కావలసిందల్లా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం. – యాదగిరి, గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం ప్రధాన కార్యదర్శి -
గొర్రెకు..గొర్రె!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: వివిధ కారణాల వల్ల మరణించిన రాయితీ గొర్రెల స్థానంలో మళ్లీ గొర్రెలను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది రాష్ట్రవ్యా ప్తంగా 3.62 లక్షల లబ్ధిదారులకు 75 శాతం రాయితీపై ప్రభుత్వం గొర్రెలు పంపిణీ చేస్తున్న విషయం విదితమే. సుదూర ప్రాంతాల నుంచి వందల కిలోమీటర్ల మేర జీవాలను వాహనాల్లో తీసుకొస్తున్నారు. ఫలితంగా తీవ్ర అలసటతో మార్గమధ్యంలో, కాపరి వద్దకు వచ్చాక పలు రకాల రోగాల బారినపడటం, స్థానిక పరిస్థితులకు అల వాటు పడకపోవడం తదితర కారణాల వల్ల అధిక సంఖ్య లో గొర్రెలు మృత్యువాత పడుతున్నాయి. ఫలితంగా కాపరులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ప్రతి గొర్రెకు ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించినప్పటికీ.. దాని ఫలాలు అందుతాయో లేవోనన్న బెంగ లబ్ధిదారులను తొలుత వెంటాడింది. బీమా పరిహారంగా నగదు చెల్లిస్తారని కాపరులు భావించారు. అయితే బీమా పరిహారం నేరుగా లబ్ధిదారునికి చెల్లిస్తే.. ఇతర ఖర్చులకు వినియోగించుకునే అవకాశం లేకపోలేదు. తద్వారా ఆర్థిక పరిపుష్టి కలగాలన్న సదుద్దేశం గాడి తప్పే ప్రమాదం లేకపోలేదు. దీనిపై నిశితంగా ఆలోచించిన సర్కారు.. చనిపోయిన గొర్రె స్థానంలో మరో గొర్రెను అంద జేయాలన్న నిర్ణయం తీసుకున్నట్లు పశుసంవర్థక శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. కాగా, సుమారు 53 వేల గొర్రెలు చనిపోయినట్లు పశు సంవర్థక శాఖాధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. రాయితీ గొర్రె మరణం వాస్తవమేనని కంపెనీ నిర్ధారించుకున్న తర్వాత అందుకు సంబంధించిన బీమా పరిహారాన్ని జిల్లా కలెక్టర్ ఖాతాలో బీమా కంపెనీ జమ చేస్తుంది. ఈ మొత్తంతో సదరు లబ్ధిదారునికి మరొక గొర్రె కొనుగోలు చేసి అందజేస్తారు. ఇప్పటివరకు రంగారెడ్డి జిల్లాలో చనిపోయిన వెయ్యి గొర్రెల వివరాలను బీమా కంపెనీకి అందజేయగా.. ఇందులో 34 క్లెయిమ్స్‌కు ఆమోదం లభించింది. -
గొర్రెల రీ సైక్లింగ్ నిజమే!
పుల్కల్ (అందోల్): గొర్రెల రీసైక్లింగ్‌ను అధికార యంత్రాంగం సీరియస్‌గా తీసుకుంది. ‘అక్కడా.. ఇక్కడా అదే గొర్రె.. బకరా ఎవరు’ శీర్షికన ఇటీవల ‘సాక్షి’ ప్రధాన సంచిక లో ప్రచురితమైన కథనానికి స్పందించిన మంత్రి శ్రీనివాస్‌యాదవ్ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లాలో పశు సంవర్ధక శాఖ అధికారులే కాకుండా కలెక్టర్ ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో విచారణ జరిపించారు. ఈ క్రమంలో పుల్కల్ మండలంలో ప్రభుత్వం ఇచ్చిన గొర్రెలను విక్రయించింది వాస్తవమే అని విచారణలో తేలింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు కలెక్టర్‌కు ఇటీవల నివేదిక సైతం సమర్పించారు. గొర్రె లను అమ్మిన వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయించాలని కలెక్టర్ ఆదేశించడంతో జిల్లా పశుసంవర్థక శాఖ అధికారులు సోమవారం పుల్కల్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. గొర్రెలు ఎవరు తీసుకున్నారు? ఎవరికి అమ్మారు? ఎక్కడికి తీసుకెళ్లారు? అనే దాంతో పాటు మధ్యవర్తిగా వ్యవహరించిన పుల్కల్ వ్యక్తికి సంబంధించిన సమాచారాన్నీ సేకరి స్తున్నట్లు తెలిసింది. పుల్కల్లో ఐదుగురు, అక్సాన్‌పల్లి, సింగూరులో పలువురిపై కేసు నమోదుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. -
ఇద్దరు పశువైద్యుల సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్: గొర్రెల పంపిణీలో అవకతవకలకు పాల్పడిన ఇద్దరు పశు వైద్యాధికారులను పశు సంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సస్పెండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. అధికారుల సస్పెన్షన్‌కు సంబంధించి ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గొర్రెల కొనుగోలు, రవాణాలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన రాజన్న సిరిసిల్ల జిల్లా పశు వైద్యాధికారి కాంతయ్య, అదే జిల్లా రుద్రంగి మండల పశు వైద్యాధికారి మనోహర్‌కుమార్‌లను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. గొర్రెల పంపిణీలో అవకతవకలకు పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని తలసాని హెచ్చరించారు. -
మందల ఉన్నది మా గొర్రె
సాక్షి, హైదరాబాద్/ పుల్కల్: ‘అగజూర్రి సారూ...! మందల ఉన్న బట్ట గొర్రె.. అగ్గొగ్గో ఆ.. కొదమ, దానెమ్మటే ఉన్న బొల్లిగొర్రె.. ఈ సుక్క పిల్ల.. అన్నీ మీరిచ్చిన గొర్లే. మంచిగ కాసుకుంటన్నం. అమ్ముకున్నమని సెప్పింది ఎవరు సారూ..?’ అని గొర్రెల కాపర్లు మం దలో ఉన్న గొర్రెలను అధికారులకు చూపెడుతున్నారు. అవి తామిచ్చిన గొర్రెలు కావని తెలిసినా అధికారులు.. ‘అవి మేం ఇచ్చిన గొర్రెలే’ అని సంతృప్తిని నటిస్తున్నారు. ‘అటూ ఇటూ ఇదే గొర్రె, ఎవరు బకరా’ శీర్షికన ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించి విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో గత మూడ్రోజులుగా లబ్ధిదారుల గొర్రెలను అధికారులు తనిఖీ చేస్తున్నారు. ముఖ్యంగా గొర్రెల రీసైక్లింగ్ ఎక్కువగా ఉన్న సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో విచారణ చేస్తున్నారు. ఈ విచారణలో అధికారులు తమను కాపాడుకోవడం కోసం గొర్రెలను అమ్ముకున్న లబ్ధిదారులను దాచిపెడుతున్నారు. సంగారెడ్డి జిల్లాలోని పుల్కల్ మండలంలో మంగళవారం ఒకవైపు అధికారులు తనిఖీలు చేస్తుండగానే.. అదే మండలంలోని బస్వాపురం నుంచి సబ్సిడీ గొర్రెలను ఆటోల్లో తరలిస్తున్న దృశ్యాలు ‘సాక్షి’కి కనిపించాయి. అద్దెకు గొర్రెల మందలు అధికారులు తనిఖీలు ముమ్మరం చేయటంతో లబ్ధిదారులు గొర్రెలను అద్దెకు తెచ్చి అధికారులకు చూపెడుతున్నారు. అధికారులు కూడా 21 గొర్రెలున్నాయా? లేవా? అని లెక్క చూసుకొని విచారణ మమ అనిపిస్తున్నారు. అధికార బృందాలు పుల్కల్ మండలానికి క్యూ కట్టారు. అధికారులు ముందే సమాచారం ఇస్తుండటంతో.. లబ్ధిదారులు తమ బంధువులకు చెందిన గొర్రెల మందలను అద్దెకు తెచ్చుకుంటున్నారు. అధికారులకు వాటినే చూపిస్తున్నారు. ట్యాగులు లేకపోవడంతో.. సబ్సిడీ గొర్రెలను సులువుగా గుర్తించేందుకు ప్రభుత్వం గొర్రెల చెవులకు ట్యాగులు వేస్తోంది. ట్యాగుకు నంబర్ ఉంటుంది. దీని ఆధారంగా అది ఎవరి గొర్రె అనేది గుర్తించవచ్చు. కానీ కాపర్లు ఈ ట్యాగులను తొలగిస్తున్నారు. దీనిపై అధికారులు కూడా అభ్యంతరం చెప్పటం లేదు. ఈ ట్యాగులు లేక క్రయవిక్రయాలు సులువవుతున్నాయి. 85 మందిపై కేసులు పెట్టాం: డీడీ రంగయ్య ‘ఎవరు బకరా’ కథనానికి స్పందన నిజాంసాగర్(జుక్కల్): గొర్రెల రీసైక్లింగ్‌పై అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. ‘ఎవరు బకరా’ శీర్షికన ఆదివారం ‘సాక్షి’ దినపత్రిక మెయిన్ పేజీలో ప్రచురితమైన కథనంపై స్పందించిన అధికారులు విచారణ చేపడుతున్నారు. ఇందులో భాగం గా రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య డిప్యూటీ డైరెక్టర్, టాస్క్‌ఫోర్స్ అధికారి రంగయ్య మంగళవారం కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ హసన్‌పల్లిలో విచారణ చేపట్టారు. గ్రామంలో మేకల యూనిట్లు పొందిన 16 మందితో మాట్లాడారు. సబ్సి డీ గొర్రెలను విక్రయించడంతో పాటు బినామీల పేరిట గొర్రెలను తీసుకుంటున్న వారిపైనా చర్యలు తీసుకుంటూ కేసులు పెడుతున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 85 మందిపైన కేసులు నమోదు చేశామన్నారు. సబ్సిడీపై పొందిన గొర్రెలను విక్రయించవద్దని లబ్ధిదారులకు సూచించారు. గొర్రెలు అనారోగ్యం బారిన పడి మృతిచెందితే బీమా పరిహారం అందుతుందని వివరించారు. -
ఎవరు బకరా..!
రేషన్ బియ్యం తరహాలో గొర్రెలు కూడా రీసైక్లింగ్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి తెలంగాణ పల్లెలకు.. ఇక్కడ్నుంచి మళ్లీ ఆంధ్రా సంతలకు.. అక్కడ్నుంచి మళ్లీ తెలంగాణ గొర్రెల కాపర్ల ఇంటి ముందరకు గింగిరాలు కొడుతున్నాయి. పథకం తొలి రోజుల్లో తీసుకొచ్చిన గొర్రెలనే రెండు రాష్ట్రాల మధ్య చక్కర్లు కొట్టిస్తున్నారు. మొదట్లో గొర్రెలను పకడ్బందీగానే సేకరించిన అధికారులు ఆ తర్వాత చేతులెత్తేయడంతో పరిస్థితి దిగజారింది. దళారుల ప్రమేయం పెరిగిపోయి రీసైక్లింగ్‌కు తెరలేచింది. అధికారులు లక్షల సంఖ్యలో గొర్రెలను పంపిణీ చేసినట్టు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ లెక్కలతో పొంతన కుదరడం లేదు. చాలాచోట్ల దళారులే లబ్ధిదారుల నుంచి గొర్రెలను గుండుగుత్తగా రూ.50 వేల నుంచి రూ.55 వేల మధ్య కొనేస్తున్నారు. అవే గొర్రెలను పాలమూరు జిల్లాలోని గద్వాల, పెబ్బేరు కేంద్రంగా ఆంధ్ర, రాయలసీమలకు తరలిస్తున్నారు. అక్కడి సంతల్లో మళ్లీ వాటినే కొని తెలంగాణ పశుసంవర్థక శాఖ అధికారులకు అంటగడుతున్నారు. దారితప్పిన గొర్రెల పథకంపై ‘సాక్షి’ ఈవారం ఫోకస్.. – వర్ధెల్లి వెంకటేశ్వర్లు, హైదరాబాద్ దళారీలదే రాజ్యం ఈ ఆధార్ కార్డు కర్నూలు జిల్లా శిరివెల్ల మండలం చెన్నారం గ్రామానికి చెందిన కొర్రపాటి సుబ్బరాయుడు తండ్రి కాశన్నది. ఆయన ఐసీఐసీఐ బ్యాంకు ఖాతా, ఆయన చిన్నాన్నకు చెందిన ఆంధ్రా బ్యాంకు ఖాతాలో తెలంగాణ ప్రభుత్వం మొత్తం రూ.23 లక్షల వరకు జమ చేసింది. ఒక్కరికే ఇంత పెద్దమొత్తంలో గొర్రెలు ఉన్నా యా? అని ఆరా తీస్తే.... సుబ్బరాయుడు గత ఎనిమిదేళ్లుగా పశువుల దళారీగా పనిచేస్తున్నట్టు తేలింది! ఈయన ఒక సంతలో గొర్రెలను కొని మరో సంతలో అమ్ముతుంటాడు. రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పథకం తెచ్చిన నేపథ్యంలో కర్నూలు జిల్లా దీబగుంట్ల సంతలో అడ్డా వేసి.. మన అధికారులకు బోను పెట్టాడు. మొదట్లో గొర్రెల కాపరుల దగ్గర్నుంచి గొర్రెలు సేకరించి అధికారులకు అమ్మేవాడు. ఇప్పుడు గద్వాల నుంచి లబ్ధిదారుల నుంచే టోకున గొర్లు తెచ్చి అదే సంతలో మన అధికారులకే అమ్మేస్తున్నాడు. ఇప్పుడు మన అధికారులకు ఆయనకు మధ్య బాగా పరిచయం పెరిగింది. హైదరాబాద్ నుంచి అధికారులు ఒక్క ఫోన్ కొడితే చాలు.. దీబగుంట్ల సంతలో గొర్రెలు సిద్ధం చేస్తున్నాడు. ఫోన్‌పైనే లారీల కొద్దీ గొర్రెలను పంపుతున్నాడు. మెదక్, సంగారెడ్డి, పాలమూరు జిల్లాలకు మొదటి విడతలో 10 యూ నిట్లు, ఆ తర్వాత 8 యూనిట్లు, తాజాగా 6 చొప్పున మొత్తం 22 యూనిట్ల గొర్లు ఇచ్చాడు. ‘సాక్షి ప్రతినిధి’ ఈయనకు ఫోన్ చేసి పశుసంవర్థక శాఖ అధికారిగా పరిచయం చేసుకొని మాటల్లో పెట్టింది. మాకు ఇంకెన్ని గొర్రెలు ఇవ్వగలవు అని అడగ్గా.. ‘తన చిన్నాన్న, తన వద్ద కలిపి ఇంకో 35 యూనిట్ల(735) గొర్రెలు ఉన్నాయి’ అని చెప్పాడు. ఎక్కడికి రావాలని అడిగితే.. ఎప్పుడు తీసుకునే చోటే దీబగుంట్ల సంతకు రమ్మన్నాడు. ‘పాత ఆరు యునిట్లకు ఇంకా బ్యాంకుల దుడ్లు పడలేదు.. తొందరగా వేయించండి సారూ..’ అని ప్రాధేయపూర్వకంగానే అర్థించాడు. ఈయనే కాదు బనగానపల్లి మండలం యనకండ్లలో చౌట లక్ష్మిదేవి, చౌట లక్ష్మయ్య భార్యాభర్తల ఖాతాల్లో తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు రూ.40 లక్షల డబ్బులు పడ్డాయి. గోస్పాడు మండలం యాలూరులో చాకలి ఓబులేసు, కోడుమూరులో కుర్వ గిడ్డాంజనేయులు, కోయిలకొండలో గురప్పలు కూడా లక్షల్లో డబ్బులు డ్రా చేశారు. కర్నూలు జిల్లాకు చెందిన 21 మంది గొర్రెలు అమ్మిన వారి పేర్లను సేకరించి క్షేత్రస్థాయిలో విచారిస్తే వారిలో 16 మంది దళారులే అని తేలింది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కొందరు వైశ్యులు కూడా గొర్రెలు అమ్మినట్లు నివేదికలు ఉన్నాయి. వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట, వేలేరుపాడు, సత్తుపల్లి ప్రాంతాలకు గొర్రెలను ఇచ్చినట్టు రికార్డుల్లో ఉంది. ఫోన్ల మీదనే సేకరణ.. అధికారిక నివేదికల ప్రకారం ఇప్పటి వరకు 24.85 లక్షల గొర్రెలు రాష్ట్రానికి చేరాయి. ఇందులో 65 శాతం కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచే తెచ్చారు. నిబంధనల ప్రకారం పశు సంవర్థక శాఖ అధికారులు పొరుగు రాష్ట్రాల్లో గొర్రెల లభ్యతపై సర్వే నిర్వహించి, నాణ్యమైనవాటినే ఎంపిక చేయాలి. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా గొర్రెల కాపర్ల నుంచే కొనాలి. లబ్ధిదారులను కూడా వెంట తీసుకెళ్లి వారి సమక్షంలోనే కొనుగోళ్లు జరపాలి. పథకం తొలి రోజుల్లో అధికారులు కొంతమేర పకడ్బందీగానే గొర్రెలను సేకరించి లబ్ధిదారులకు అప్పగించారు. అయితే క్రమంగా గొర్రెల లభ్యత తగ్గిపోవటం, స్థానికంగా ఒత్తిడి పెరగటంతో అధికారులు చేతులెత్తేశారు. ఫలితంగా అవినీతికి బీజం పడింది. రైతుల వద్ద నుంచి గొర్రెలు సేకరించడం మానేసి దళారీ వ్యవస్థను ప్రోత్సహించారు. దళారులు కొన్ని రోజుల పాటు స్థానిక గొర్రెల కాపరుల నుంచి జీవాలను సేకరించి విక్రయించారు. క్రమంగా ఇరువర్గాల మధ్య పరిచయాలు పెరగడంతో అవినీతి వట వృక్షంగా మారింది. అధికారులు క్షేత్ర స్థాయి పర్యవేక్షణ తగ్గించి, దళారుల ఫోన్లపై ఆధారపడ్డారు. తెలంగాణ నుంచి బయల్దేరే ముందు దళారికి ఫోన్ చేస్తే కావాల్సినన్ని గొర్రెలు సిద్ధం చేసి పెడుతున్నారు. ప్రతి యూనిట్‌పై రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ముట్టజెపుతున్నట్టు దళారుల మాటలను బట్టి తెలుస్తోంది. ఏపీ టు తెలంగాణ.. తెలంగాణ టు ఏపీ గొర్రెల పథకంలో రెండు రాష్ట్రాల్లోనూ దళారులది ఇష్టారాజ్యంగా మారిపోయింది. గొర్రెల కంటే ముందే దళారులే లబ్ధిదారుడి ఇంటికి వస్తున్నారు. తెచ్చిన గొర్రెలను తెచ్చినట్టు తీసేసుకుంటున్నారు. యూనిట్ గొర్రెలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష నుంచి రూ.1.15 లక్షల దాకా వెచ్చిస్తుంటే కేవలం రూ.50 వేల నుంచి రూ.55 వేలకే కొనుగోలు చేస్తున్నారు. లారీల్లో వచ్చిన గొర్రెలను వచ్చినట్టే అమ్మితే రూ.50 వేలు, వారం పది రోజుల పాటు మేపితే రూ.55 వేల చొప్పున చెల్లిస్తున్నారు. ఏపీలో గొర్రెలు అమ్ముతున్న దళారులు.. లబ్ధిదారుల్లో కొందరి ఫోన్ నంబర్ తీసుకొని పరిచయం పెంచుకుంటున్నారు. చివరికి వారిని కూడా తమ అక్రమ వ్యాపారంలోకి దింపుతున్నారు. ఇలా ప్రస్తుతం తెలంగాణలో ప్రతి మండలంలో కనీసం ముగ్గురు నుంచి నలుగురు లబ్ధిదారులే దళారులుగా అవతారం ఎత్తి సబ్సిడీ గొర్రెలను టార్గెట్ చేస్తున్నారు. ఇలా కొనుగోలు చేసిన గొర్రెలను రాత్రికి రాత్రే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల్, పెబ్బేరుకు తరలిస్తున్నారు. అక్కడ కర్నూలు, అనంతపురం జిల్లాకు చెందిన దళారులు సిద్ధంగా ఉంటారు. 10 నుంచి 15 నిమిషాల్లో బేరం పూర్తి అవుతోంది. స్థానిక దళారులు ప్రతి యూనిట్(20 గొర్రెలు, ఒక పొట్టేలు)పై రవాణా ఖర్చులు, లేబర్ చార్జీలు పోను రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు లాభం చూసుకుంటున్నారు. ఈ లెక్కన రూ.65 వేల నుంచి రూ.70 వేల ధరకు యునిట్ గొర్రెలను ఏపీ నుంచి వచ్చే దళారులకు ఇచ్చేస్తున్నారు. వాళ్లు నేరుగా తమ ప్రాంతాలకు తీసుకెళ్లి సంత సమీపంలో దించి మళ్లీ తెలంగాణ అధికారులకు ఫోన్ చేసి రమ్మంటున్నారు. ప్రతి యూనిట్‌పై రూ.25 వేల నుంచి రూ.30 వేల నికర లాభంతో గొర్రెలను తిరిగి మన అధికారులకు అప్పగిస్తున్నారు. ఈ వలయాకార ప్రక్రియ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో నిత్యకృత్యంగా మారిపోయింది. పుల్కల్లో మాటేస్తే... సబ్సిడీ గొర్రెలను తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో రాత్రి 10 గంటల సమయంలో సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలోని ఓ నిర్జన ప్రదేశంలో కాపుగాశాం. పుల్కల్ పట్టణంతో పాటు సమీప గ్రామాలు చెక్రియాల్, బస్వాపూర్, ముద్దాయ్పేట, సింగూరు, అక్సాన్‌పల్లి, కోర్పోల్, కోడూర్ తదితర గ్రామాల నుంచి ట్రాలీల్లో గొర్రెలు తెచ్చి ఇక్కడ పోగేస్తున్నారు. వచ్చిన గుంపును వచ్చినట్టే డీసీఎంలు, లారీల్లోకి ఎక్కిస్తున్నారు. ఒక లారీ, ఐదు డీసీఎంలలో గొర్రెలను ఎక్కించారు. ఒకదాని వెంట ఒకటి వెళ్లిపోతున్నాయి. చివరగా ఒక డీసీఎం మిగిలింది. సింగూరు నుంచి రావాల్సిన ట్రాలీ ఆలస్యంగా రావటంతో ఆ డీసీఎం కాస్త ఆలస్యంగా బయల్దేరింది. మేం ధైర్యం చేశాం. డీసీఎంకు అడ్డంపోయి ఆపేశాం. డ్రైవర్‌ను కిందకు దించి వివరాలడిగాం. డీసీఎం సమీపంలోని మునిపల్లి మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తిదని చెప్పాడు. తాను డ్రైవర్‌ను మాత్రమే అన్నాడు. ఉదయం 6.30 నుంచి 8 గంటల మధ్య గద్వాలకు గొర్రెలను చేర్చాలని పుల్కల్కు చెందిన దళారీ చెప్పినట్లు వివరించాడు. గత 20 రోజుల నుంచి ఇదే పని చేస్తున్నానని, ఇప్పటికే చాలా ట్రిప్పులు వేశానని తెలిపాడు. వెంటనే గద్వాల్ ‘సాక్షి’ నెట్‌వర్క్‌ను అప్రమత్తం చేయగా.. గద్వాల పట్టణంలోని మార్కెట్ వెనక ఉన్న సంత స్థలంలో కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి వచ్చిన దళారులు సిద్ధంగా ఉన్నట్టు తేలింది. ఎప్పుడు చేస్తున్న పనే కాబట్టి పెద్దగా బేరసారాలు లేకుండానే క్రయవిక్రయ తంతు ముగించేశారు. ఇలా లారీల నుంచి గొర్రెలను దించకుండానే బేరం కుదిరిపోతోంది. టీచరు.. హోంగార్డు.. మెకానిక్ కూడా లబ్ధిదారులే.. పుల్కల్లో మొత్తం 900 మంది లబ్ధిదారులను గుర్తించాం. వారి ఇళ్లకు వెళ్లి చూడగా.. 394 మంది లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ చేసినట్లు తేలింది. పుల్కల్ మండల కేంద్రంలో 46 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఎంత మంది దగ్గర సబ్సిడీ గొర్రెలు ఉన్నాయో పరిశీలించగా.. విస్తుబోయే విషయాలు వెల్లడయ్యాయి. గొర్రెలు పొందిన వారిలో ఉపాధ్యాయుడు, హోంగార్డు, డిగ్రీ విద్యార్థి, ఫ్యాక్టరీ కార్మికుడు, హైదరాబాద్‌లో స్థిరపడిన మెకానిక్ తదితరులు ఉన్నారు. మొత్తం 23 ఇళ్లు తిరగగా.. 15 మంది గొర్రెలను అమ్మేసుకున్నారు. రూ.31.5 వేల పెట్టుబడి పోను రూ.20 వేల లాభానికి అమ్ముకున్నట్లు వారిలో కొందరు చెప్పారు. పుల్కల్కే చెందిన ఓ లబ్ధిదారుడు దళారీగా అవతారం ఎత్తి గొర్రెలను గుండుగుత్తగా కొనుగోలు చేసి గద్వాలకు తరలిస్తున్నాడు. డీసీఎం చెప్పిన దళారీ పేరు, ఇక్కడ లబ్ధిదారులు చెప్పిన బ్రోకర్ పేరు ఒకటే కావడం గమనార్హం. అలాగే మనూరులో 53 యూనిట్ల గొర్రెలు పంపిణీ చేయగా.. ‘సాక్షి’ పరిశీలనలో 11 యూనిట్లు మాత్రమే ఉన్నట్టు తేలింది. రూ. 55 వేలకు గొర్రెలు ఇవ్వడానికి సిద్ధం ముద్దాయిపల్లి గ్రామంలో 10 యూనిట్ల గొర్రెలు వచ్చాయంటే ఆ గ్రామానికి వెళ్లాం. ఊరు చివరిలో ఓ గొర్రెల కాపరి కనిపించాడు. ‘సర్కారు గొర్రెలు ఉంటే అమ్ముతారా..? పెద్దాయనా..’ అని అడిగాం. ‘మాకు ఇంకా రాలేదు బిడ్డా... ఫలానా వాళ్లకు వచ్చాయి. అమ్ముతమనే అంటున్నారు. వెళ్లి కలవండి’ అని సూచించాడు. ఊరు చివర చెరువు కొమ్మున గొర్రెలు మేపుతున్న వాళ్ల దగ్గరకు మమ్ముల్ని తీసుకెళ్లాడు. ఓ లబ్ధిదారుడి కోసం ప్రయత్నం చేస్తే ఐదుగురు జమయ్యారు. అందరూ గొర్రెలు అమ్ముడానికి ముందుకొచ్చారు. యూనిట్ గొర్రెలను మొత్తంగా రూ.50 వేలు ఇస్తామని బేరం మొదలుపెట్టాం. వాళ్లు రూ.62 వేలు అన్నారు. మేం మరో వెయ్యి పెంచాం. వాళ్లు రూ.2 వేలు తగ్గారు. మొత్తానికి 56 వేల దగ్గర బేరం ఆపేశాం. ఇంకా కిందకు దిగితే బేరం కుదిరేటట్టు ఉంది. దీంతో పుల్కల్లో పని ఉందని, మళ్లీ వస్తామని చెప్పాం. ఇంతకీ ఎందుకు అమ్ముకుంటున్నారని వారితో మాట కలిపాం. ‘రూ.80 వేలకు వచ్చే గొర్రెలను, రూ.1.25 లక్షలకు అంటగడుతుండ్రు. గుంపులోంచి మూడు నాలుగు గొర్రెలు వచ్చీ రావడంతోనే చస్తున్నాయి. ఇంకెన్ని చస్తాయో తెల్వదు. వీటికి మందులు వేయడానికి డాక్టర్లు రారు. ఏ మందు వేయాలో మాకు తెల్వదు. నష్టపోవడం కంటే ఇంత లాభం వచ్చేటప్పుడు అమ్ముకునుడే నయం..’ అని లబ్ధిదారులు వివరించారు. ఉద్గిరిలో గొర్రెలు ఎట్లా పుడుతున్నాయబ్బా? సబ్సిడీ పథకం ప్రారంభానికి ముందే సంగారెడ్డి జిల్లా పశు సంవర్థక శాఖ అధికారులు మహారాష్ట్రలోని ఉద్గిరి తాలూకాలో గొర్రెల లభ్యతపై ఒక సర్వే చేశారు. సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలకు ఉద్గిరి తాలూకా సరిహద్దుగా ఉంది. అక్కడ గొర్రెల లభ్యతపై వివరాలు సేకరించగా.. 2,500లకు మించి గొర్లు లభించే పరిస్థితి లేదని తేల్చారు. దీంతో ఈ ప్రాంతం నుంచి గొర్రెలు సేకరించలేమని అధికారులు కర్నూలు వైపు ప్రయాణించారు. కానీ విచిత్రంగా ఉద్గిరి నుంచే కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ, పిట్లం, బిచ్కుంద ప్రాంతాలకు వేల సంఖ్యలో గొర్రెలు దిగుమతి అవుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఇన్ని వేల గొర్లు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయని అడిగితే ఏ అధికారి వద్ద సమాధానం లేదు. చావులకు ప్రయాణమే కారణమా? ఇంటికి వచ్చిన వారం రోజుల లోపు ప్రతి యూనిట్లో సగటున మూడు గొర్రెలు మృత్యువాత పడుతున్నాయి. చనిపోతున్న గొర్రెల్లో 6 నెలల లోపు పిల్లలు, ఐదేళ్లకు పైబడిన గొర్రెలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ మరణానికి కారణం అధిక ప్రయాణమేనని పశువైద్య అధికారులు అంటున్నారు. కానీ విషయం బయటికి చెప్పడానికి బయపడి ‘ఫుట్రాట్’ వ్యాధి అని చెబుతున్నారు. లారీల్లో గొర్రెలను తరలిస్తుండగా.. నిలబడేందుకు ఆధారం దొరక్క కిందపడిపోయి కొన్ని, తొక్కిసలాటలో కొన్ని గాయపడుతున్నాయి. ప్రయాణం చేసినంతసేపు జీవాలు నరాలు బిగపట్టుకొని నిలబడటంతో జబ్బున పడుతున్నాయి. ఇవి తిరిగి మామూలు స్థితికి చేరుకోవడానికి కనీసం 15 రోజుల సమయం పడుతుంది. కానీ 15 రోజులు తిరక్క ముందే గొర్రెల కాపర్లు మళ్లీ దళారీల చేతిలో పెడుతున్నారు. జూలై 20 నుంచి ఇప్పటి వరకు ఈ మూడు నెలల కాల వ్యవధిలో ప్రతి గొర్రె సగటున 2,500 కి.మీ. దూరం ప్రయాణం చేసి ఉండొచ్చని అంచనా. ఈ సుదీర్ఘ ప్రయాణం వల్లే చిన్న పిల్లలు, వయసు మీద పడిన గొర్రెలు చనిపోతున్నాయి. మొదటి దశలో పెద్దగా ప్రాణనష్టం లేదు గానీ, రెండో దశలో అధిక ప్రాణనష్టం ఉంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 80 వేల దాకా గొర్రెలు మృత్యువాత పడ్డట్లు సమాచారం. సంతకు తరలిస్తున్న సబ్సిడీ గొర్రెల పట్టివేత కోదాడ రూరల్: కోదాడ నుంచి ఏపీలోని చిల్లకల్లు సంతకు రెండు వాహనాల్లో తరలిస్తున్న 48 గొర్రెలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం సూర్యాపేట జిల్లా నల్లబండగూడెం సమీపంలో రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు వద్ద తనిఖీల సందర్భంగా వీటిని పట్టుకున్నారు. వీటిలో సాధారణ గొర్రెలతోపాటు ఇటీవల సర్కారు అందజేసిన సబ్సిడీ గొర్రెలు కూడా ఉన్నట్లు గుర్తించారు. స్థానిక పశువైద్యాధికారి నాగేంద్రబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విజయ్‌ప్రకాశ్ తెలిపారు. చెక్‌పోస్టులను బలోపేతం చేశాం గొర్రెల రీసైక్లింగ్ ఘటనలు మా దృష్టికి కూడా వచ్చాయి. అందుకే పశుసంవర్థక, పోలీస్, రెవెన్యూ, కమర్షియల్ ట్యాక్స్ అధికారులతో కలిపి టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశాం. సరిహద్దు చెక్‌పోస్టులను బలోపేతం చేశాం. ఇప్పటికే కొన్ని లారీలు సీజ్ చేశాం. గొర్రెలు అమ్ముకున్న వారిపై, కొనుగోలు చేసిన దళారులపై కేసులు పెడుతున్నాం. వాతావరణ మార్పుల వల్లే అక్కడక్కడ కొన్ని గొర్లు చనిపోతున్నాయి. – వి.లక్ష్మారెడ్డి, రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య ఎండీ -
అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు
సాక్షి, హైదరాబాద్: గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ హెచ్చరించారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామం, మాడ్గులపల్లి మండలం చెర్కుపల్లి గ్రామం, దామరచర్ల మండలం ఇర్కిగూడెం, సూర్యాపేట జిల్లా మోతె మండలానికి సంబంధించి లబ్ధిదారులకు అందించిన సుమారు 50 యూనిట్ల (1050) గొర్రెలను అక్రమంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మాచర్ల ప్రాంతానికి తరలిస్తున్నారన్న సమాచారం మంత్రికి అందింది. వెంటనే మంత్రి నల్లగొండ జిల్లా కలెక్టర్, పశుసంవర్ధకశాఖ అధికారులు, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అక్రమంగా గొర్రెలను తరలిస్తున్న 3 బొలేరో, 3 డీసీఎం వాహనాలను నల్లగొండ జిల్లాలోని వాడపల్లి, నాగార్జునసాగర్ చెక్‌పోస్ట్‌ల వద్ద స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమాలకు పాల్పడిన లబ్ధిదారులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని నల్లగొండ జిల్లా కలెక్టర్, పశుసంవర్ధకశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. -
నీలినాలికతో జాగ్రత్త
అప్రమత్తంగా లేకపోతే గొర్రెలకు ప్రమాదం పశుసంవర్ధకశాఖ డీడీ డాక్టర్ శ్రీనాథాచార్ అనంతపురం అగ్రికల్చర్: ఇటీవల జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవడంతో గొర్రెలకు నీలినాలుక (బ్లూటంగ్) వ్యాధి సోకే అవకాశం ఉన్నందున కాపర్లు అప్రమత్తంగా ఉండాలని పశుసంవర్ధకశాఖ డీడీ డాక్టర్ టి.శ్రీనాథాచార్ తెలిపారు. వర్షంతో పాటు ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతూ వాతావరణంలో మార్పు చోటుచేసుకుంటున్నందున నీలునాలుక వ్యాధి ఎక్కువగా వ్యాప్తించే అవకాశం ఉందన్నారు. బ్లూటంగ్ బ్లూటంగ్ అనేది ‘క్యూలెకాయిడ్’ రకం దోమల వల్ల వ్యాపిస్తుంది. వ్యాధి బారిన పడిన గొర్రెలు ఎక్కువగా ఈసుకుపోవడం (అబార్షన్), పాల ఉత్పత్తి పడిపోవడం, గొర్రెపిల్లలు బలహీనపడటం, మాంసం, ఉన్ని నాణ్యత దెబ్బతింటాయి. దీనివల్ల కాపరులకు ఆర్థికంగా నష్టం జరుగుతుంది. ఈ వ్యాధిని ‘ఏ’ విభాగంలో చేర్చినందున వీటి మాంసం విదేశీ ఎగుమతికి అవకాశం లేదు. నీలినాలుక వైరస్లలో 24 జన్యురకాలను గుర్తించినా... మన రాష్ట్రంలో బీటీవీ–18, బీటీవీ–23 ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఒక సంవత్సరంలోపు వయస్సు ఉన్న గొర్రెలకు ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. అలాగే త్వరగా వ్యాపించి నష్టం కలిగిస్తుంది. లక్షణాలు గొర్రెలకు 104 నుంచి 106 డిగ్రీల వరకు జ్వరం రావడం. మెత్తగా ఉండటం, ముఖం, ముక్కు, పెదవులు వాచి ఉండటం, నాలుక ఎర్రగా తయారై నీలి రంగుకు మారుతుంది. కళ్లు ఎర్రబడి కనురెప్పలు, చెవులు, కింది దవడ వాపు వస్తుంది. ముక్కు నుంచి తెల్లటి జిగట స్రవాలు రావడం, నోటిలోని మాంసం పొరలు (మ్యూకస్ మెంబ్రేన్) పుండ్ల మాదిరిగా ఏర్పడటం, తొడల మధ్య, చంకల్లో, మల ద్వారం కింద చర్మం ఎర్రగా కమిలినట్లు ఉండటం, వ్యాధి తీవ్రంగా ఉన్న గొర్రెల్లో గిట్టల మొదటి భాగం వాచి, మధ్యలో ఎర్రగా ఉండటం, చర్మం దెబ్బనడం వల్ల ఉన్ని, వెంట్రుకలు ఊడిపోవడం, తీవ్రతను బట్టి ఐదారు రోజులు మేత మేయక, నీరు తాగక నీరసించి చనిపోయే ప్రమాదం ఉంటుంది. చనిపోయిన గొర్రెల ఊపిరితిత్తులు వాపు రావడం, గాలిగొట్టాలు నురగ వంటి ద్రవాలతో నిండివుండటం, ఎద భాగంలో నీరు చేరడం, గుండె పొరల్లో రక్తస్రావం లాంటివి కనిపిస్తాయి. నిర్ధారణ, చికిత్స పశువైద్యాధికారి సాయంతో ఏలీసా, పీసీఏ అనే రక్తపరీక్షల ద్వారా వ్యాధిని నిర్ధారించుకోవచ్చు. వ్యాధి బహిర్గతమైన తర్వాత చికిత్స కష్టం. గాలికుంటు, పీపీఆర్ లాంటి వ్యా«ధి లక్షణాలు కూడా నీలినాలుక వ్యాధికి సారూప్యత ఉండటంతో పశువైద్యులను సంప్రదించి చికిత్స పొందాలి. నోటిలో పుండ్లను పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో కడిగి, బోరిక్ పౌడర్‌ను పూయాలి. వైద్యుని సలహా మేరకు యాంటీబయాటిక్ మందులు వాడాలి. గిట్టల మధ్య పుండ్లను పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో కడిగి, హిమాక్స్, నెమ్‌లెంట్ వంటి మందులను పూయాలి. వర్షాకాలంలో గొర్రెల కొట్టం, పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సాయంత్రం, రాత్రి సమయాల్లో మంద చుట్టూ వేపాకు పొగ వేసి దోమలను నివారించవచ్చు. ప్రతి 10–15 రోజులకోసారి గొర్రెల శరీరంపై, కొట్టంలో 2 శాతం బ్యూటాక్స్ మందును పిచికారీ చేయడం ద్వారా దోమకాటును అరికట్టవచ్చు. గొర్రెలను ఎత్తైన ప్రదేశంలో ఉంచాలి. గొర్రెల మందలో ఆవులు, దూడలను కట్టేయడం ద్వారా దోమలు వాటిపై వాలి గొర్రెలకు బెడదను తగ్గించుకోవచ్చు. -
పాతిక జీవాలకో విత్తన పొట్టేలు
గొర్రెల మంద అభివృద్ధికి తప్పనిసరి పశుశాఖ గొర్రెల విభాగం ఏడీ డాక్టర్ కాంతమ్మ అనంతపురం అగ్రికల్చర్: గొర్రెల మంద అభివృద్ధికి నాణ్యమైన పొట్టేళ్లు ఉండాలని పశుసంవర్ధకశాఖ గొర్రెల విభాగం ఏడీ డాక్టర్ ఎం.కాంతమ్మ తెలిపారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 38 లక్షలకుపైగా జీవాల సంఖ్య ఉన్నా... వాటికి తగ్గట్టు పొట్టేళ్ల సంఖ్య, అందులో మేలుజాతివి తక్కువగానే ఉన్నాయన్నారు. ప్రతి 25 గొర్రెలకు కనీసం ఒక విత్తనం పొట్టేలు మందలో ఉండేలా పెంపకందారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మందలో ఉన్నవి వద్దు మందలో పుట్టిన పొట్టేలు పిల్లలనే చాలా మంది విత్తన పొట్టేళ్లుగా ఎంపిక చేసుకుంటారు. దీని వల్ల పెద్దగా లాభం ఉండదు. వాటి రక్తసంబంధ సంతతిపై పొర్లే అవకాశం ఉంది. దీనిని ఇన్ బ్రీడింగ్ అంటారు. దగ్గరి సంబంధమున్న గొర్రెలు + పొట్టేళ్ల సంపర్కం వల్ల కలిగే జీవాలు బలహీనంగా ఉండటం, తక్కువ బరువుతో పుట్టడం, అవిటితనంతో పుట్టడం, సంతానోత్పత్తికి పనికిరానివిగాను, ఊబివిగాను ఉంటాయి. అంతేకాకుండా జన్యు సంబంధ లోపాలతో గానీ, జాతి లక్షణాలు కోల్పోవడం లాంటివి జరుగుతాయి. అందువల్ల విత్తన పొట్టేళ్ల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి. పొట్టేళ్లను రెండు మూడేళ్లకోసారి మార్పు చేయాలి. వేరొక మంద నుంచి గానీ, మంచి లక్షణాలున్న వాటిని మందలో వదలాలి. పొట్టేలు ఎంపిక ఇలా.. విత్తన పొట్టేళ్ల కోసం నెల్లూరు జాతిని ఎంపిక చేసుకోవాలి. నెల్లూరు గోధుమ, నెల్లూరు జోడిపి లాంటి జాతి లక్షణాలు బాగుంటాయి. చక్కటి శరీర సౌష్టవం, పొడవు, ఎత్తు, బరువు ఉండే వాటిని ఎంచుకోవాలి. కాలి గిట్టలు బాగుండాలి, చురుకుదనం కలిగి ఉండటం. వృషణాలు రెండూ సమానంగా, వయస్సుకు సరిపడిన పరిమాణంలో ఉండాలి. పొట్టేళ్ల మందపై వాడేందుకు కనీసం ఒకటిన్నర సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. ఇలాంటి వాటిని జత కలిపితే ఆరోగ్యవంతమైన, చురుకైన జీవాలు నిర్ణీత బరువుతో పుట్టడమే కాకుండా ఆశించిన రీతిలో పెరుగుదల, పునరుత్పత్తి జరిగి అధిక లాభాలనిస్తాయి. మందలో ప్రతి 25–30 గొర్రెలకు ఒక పొట్టేలు చొప్పున తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకుంటే మంద ఉత్పత్తి జరుగుతుంది. ఇలా చేయడం వల్ల ప్రతి గొర్రె నుంచి అదనపు ఆదాయం ఆశించవచ్చు. మేలుజాతి విత్తన పొట్టేళ్ల కొరత ప్రస్తుతం మేలు జాతి విత్తనపు పొట్టేళ్లు మార్కెట్లో దొరకడం లేదు. పెంపకదారులు చిన్న పిల్లలను వేరుచేసి అందులో పొట్టేలు పిల్లలను అమ్మినప్పుడు అని సంతలో కోతకు వెళుతున్నాయి. కొందరు మంచిజాతి పొట్టేళ్లను బయటి ప్రాంతాల నుంచి కోనుగోలు చేస్తున్నారు. ఇంకొందరు రెండేళ్లకోసారి పొట్టేళ్లను మార్పిడి చేస్తున్నారు. మరికొందరు గవర్నమెంటు ఫారాల నుంచి కూడా పొట్టేళ్లను కొంటున్నారు. ఎక్కడివైనా సరే మేలుజాతి, నాణ్యమైన విత్తన పొట్టేళ్ల ద్వారా మంద ఆశించిన వేగంగా అభివృద్ధి చెందడమే కాకుండా పెంపకందారులకు ఆదాయాన్ని పెంచుతుంది. -
గొర్రెల మందపై చిరుత దాడి
కంబదూరు(శెట్టూరు): శెట్టూరు మండలం బచ్చేహళ్లిలో గొర్రెలకాపరి నాగప్పకు చెందిన గొర్రెల మందపై బుధవారం ఆర్థరాత్రి చిరుత దాడి చేసింది. మందలోని ఒక గొర్రెను ఎత్తుకెళ్లి చంపేసింది. వర్షం పడుతుండడంతో బాధితుడు గుర్తించడం ఆలస్యమైంది. రూ.5 వేల నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపాడు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రామచంద్రానాయక్, బీట్ అఫీసర్ జగన్నాథ్‌లు గురువారం సంఘటన çస్థలాన్ని పరిశీలించి గొర్రెకు పంచనామా నిర్వహించారు. -
చిటికెలో ప్రాణాపాయం
- తొలకరి సమయంలో గొర్రెల్లో చిటికె వ్యాధి – పశుశాఖ ‘అనంత’ డివిజన్ డీడీ శ్రీనాథాచార్ అనంతపురం అగ్రికల్చర్ : తొలకరి వర్షాలకు మొలచిన గడ్డి తినడం వల్ల, ఎలాంటి రోగ లక్షణాలు కనిపించకుండానే చిటికె వ్యాధితో గొర్రెలు చనిపోయే ప్రమాదం ఉందని పశుసంవర్ధకశాఖ అనంతపురం డివిజన్ ఇన్చార్జి డీడీ డాక్టర్ టి.శ్రీనాథాచార్ తెలిపారు. కాపర్లకు నష్టాన్ని కలిగించే వాటిలో చిటికె వ్యాధి (ఎంటరోటోక్సిమియా) కూడా ఒకటన్నారు. ఈ వ్యాధిని ‘నెత్తిపిడుగు’ గడ్డిరోగం, పాటురోగం లాంటి రకరకాల పేర్లతో పిలుస్తారని తెలిపారు. వ్యాధి వ్యాప్తి: క్లాస్ట్రీడియం అనే సూక్ష్మజీవులు ప్రేవుల్లో గాలిలేని (ఎనిరోబిక్) వాతావరణంలో అభివృద్ధి చెందిన సందర్భంల్లో వదలబడిన విష పదార్థాలు (టాక్సీన్లు) ఈ వ్యాధికి కారణం. తొలకరి వర్షాలకు పెరిగిన లేత గడ్డిని గొర్రెలు ఆశగా, అధికంగా తింటాయి. అందువల్ల ప్రేవుల్లో గాలి లేని వాతావరణం ఏర్పడటం వల్ల సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది వ్యాధిని కలిగిస్తాయి. ఈ వ్యాధి మే నెలాఖరు నుంచి జూలై మధ్య ఎక్కువగా కనిపిస్తుంది. నవంబర్, డిసెంబర్ మాసాల్లో కూడా వ్యాపిస్తుంది. లక్షణాలు: ఎలాంటి రోగ లక్షణాలు కనపడకుండానే జీవాలు ఉన్నట్లుండి చనిపోతాయి. చనిపోయే ముందు గొర్రెలు నీరసంగా ఉండటం గమనించవచ్చు. జీవాలు గాలిలోకి ఎగిరి కిందపడి కాళ్లు గిలగిల కొట్టుకుంటూ పళ్లు కొరుకుతూ వణుకుతూ బిగుసుకుని నిమిషాల్లో చనిపోతాయి. కొన్ని జీవాలు నోటి నుంచి చొంగ కారుస్తాయి. శ్వాస పీల్చే శాతం ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో మలబద్ధకం, కడుపుబ్బరం ఉంటుంది. మేత మేయకుండా, నెమరు వేయకుండా తలలు వాల్చి, ముడుచుకుని ఒకే చోట నిలబడతాయి. ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా ఉదయం, సాయంత్రం వేళల్లో కనిపిస్తాయి. చికిత్స–నివారణ: జీవాల జీర్ణకోశంలో సూక్ష్మజీవుల వ్యాప్తిని అరికట్టుటకు టెట్రాసైక్లిన్, ఆంఫీసిలిన్, జెంటామైసిన్ వంటి మందులు, క్లోరిల్, ఎపిల్ వంటి ఇంజక్షన్లు పశు వైద్యుని పర్యవేక్షణలో వాడాలి. ప్రతి సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో వ్యాధినిరోధక టీకా (మల్టికాంపోనెంట్ యి.టి.వ్యాక్సీను) వేయించాలి. రెండో విడత అక్టోబరు, నవంబరు మాసాల్లో వేయించాలి. తొలకరి వర్షాలకు మొలిచి వాడిపోయిన గడ్డిని సాధ్యమైనంతవరకు మేపరాదు. మేత కోసం వలస వెళ్లు జీవాలకు వలస ప్రాంతాల్లో గల వ్యాధిని బట్టి .. ముందే టీకాలు వేయించి పంపడం వల్ల వ్యాధిని నివారించవచ్చు. జీవాలను ఉదయం కొంత ఆలస్యగా మేపుటకు తీసుకెళ్లడం, మధాహ్న సమయంలో కొంత సేపు విశ్రాంతిని ఇవ్వడం, సాయంత్రం త్వరగా తీసుకు రావడం వల్ల జీర్ణాశయం కొంత ఖాళీగా ఉంచుట ద్వారా సూక్ష్మ జీవుల అభివృద్ధిని తగ్గించవచ్చు. -
భారీ వర్షానికి 80 గొర్రెలు మృతి
హాలహర్వి: భారీ వర్షానికి 80 గొర్రెలు మృతి చెందిన ఘటన కామినహాల్ గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా కిష్టిపాడుకు చెందిన గొర్రెల కాపరులు 210 గొర్రెలను కామినహాల్ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న పొలంలో ఆదివారం రాత్రి నిలిపారు. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి సమీపంలో కాల్వకు నీళ్లు రావడం, అదే సమయంలో గొర్రెలు నిలిపిన ప్రాంతానికి పక్కనే పిడుగు పడటంతో గొర్రెలు పరుగులు తీసి కాల్వ వైపు వెళ్లి నీటిలో పడ్డాయి. దీంతో 80 గొర్రెలు మృతి చెందాయి. ఈ ప్రమాదంలో దాదాపు రూ.6 లక్షల వరకు నష్టం వాటిల్లిందని గొర్రెల కాపరులు పేర్కొన్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. విషయం తెలుసుకున్న హాలహర్వి తహసీల్దార్ రామసుబ్బయ్య సంఘటన స్థలానికి చేరుకుని మృతి చెందిన గొర్రెలను పరిశీలించారు. గొర్రెలు మృతిచెందడానికి కారణాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. -
మూగవేదన
జిల్లాలో గ్రాసం కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఎక్కడా పచ్చగడ్డి కనిపించకపోవడంతో పశువులు, గొర్రెల కాపరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూగజీవాల మేత కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నారు. అనంతపురం రూరల్ మండలం కురుగుంట సమీపంలో గడ్డి కోసం మూగజీవాలు ఒట్టి పొలాల్లో అవస్థలు పడుతున్న దృశ్యాలివీ. -సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
లారీ ఢీకొని 158 గొర్రెలు మృతి
జగిత్యాల జోన్: జగిత్యాల జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 158 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. జగిత్యాల మండలం ధర్మారంవాసులు ఎనుగుల ఐలయ్య, నందెల్లి హరీశ్‌లు గొర్రెల మందను రాత్రి ఇంటికి తీసుకొసుండగా గ్రామశివారులో లారీ ఢీ కొంది. దీంతో 150 గొర్రెలు మృతి చెందాయి. కిలో మీటరు దూరంలో అదే రోడ్డుపై పరుమాళ్ల చిన్న రాజయ్య, పరుమాళ్ల పెద్ద రాజయ్యలు తమ గొర్రెల మందను ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో 8 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. గొర్రెలను రోడ్డు నుంచి పక్కకు జరుపుతుండగా పాక రాజం అనే వ్యక్తిని జగిత్యాల నుంచి గొల్లపల్లి వెళ్తున్న కారు ఢీకొట్టింది. -
జీవాల పెంపకంలో అప్రమత్తం
- ఇప్పటికే తీవ్రస్థాయికి చేరిన ఎండలు - జాగ్రత్తలు తీసుకోకుంటే నష్టమే.. అనంతపురం అగ్రికల్చర్ : ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీల వరకు నమోదవుతున్న నేపథ్యంలో వేసవితాపం నుంచి జీవాలను కాపాడుకునేందుకు కాపర్లు జాగ్రత్తలు తీసుకోవాలని పశుసంవర్ధకశాఖ అనంతపురం డివిజన్ సహాయ సంచాలకుడు డాక్టర్ టి.శ్రీనాథాచార్ తెలిపారు. జీవాలు వడదెబ్బకు, ఇతర వ్యాధులకు గురికాకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. మేత కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన, వెళుతున్న గొర్రెలు, మేకల పెంపకందారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. మండుతున్న ఎండలు ఇప్పటికే చాలా మండలాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం.. రానున్న రోజుల్లో ఇంకా పెరిగే పరిస్థితి కనిపిస్తుండటంతో గొర్రెలు, మేకల పెంపకానికి ఇబ్బంది కలిగే కలిగే అవకాశం ఉంది. మేత, నీటి కోసం రోజూ కనీసం పదుల కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉన్నందున వేసవితాపం ప్రభావం తప్పకుండా ఉంటుంది. వర్షాలు లేక నీరు, మేత లభ్యత అంతంత మాత్రంగా ఉన్నందున ఎండుగడ్డి, చిన్నపాటి పుల్లలు తింటూ సరైన సమయంలో తగినంత నీరు కూడా దొరకడం కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో జీవాలు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. వడదెబ్బ సోకే అవకాశం తగినంత మేత, నీరు లభించక జీవాలు నీరసించిపోతాయి. నడవడానికి కూడా ఇబ్బంది పడుతాయి. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ జీవాల శర్మం పొడారిపోతుంది. నోటీ నుంచి చొంగకారుస్తూ తీవ్ర ఆయాసానికి గురయ్యే లక్షణాలు కనిపిస్తాయి. నాడీ వ్యవస్థ, రక్తప్రసరణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థలు సక్రమంగా పనిచేయకపోవచ్చు. ఫలితంగా కొన్ని సందర్భాల్లో జీవాలు మరణించే ప్రమాదం ఉంది. అలాగే వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి అనేక రోగాలు ప్రబలే అవకాశం ఉంది. వడదెబ్బ లక్షణాలు కనిపించిన వెంటనే జాగ్రత్త పడాలి. పశువైద్యుని సంప్రదించి తగిన ప్రథమ చికిత్స చేయాలి. నార్మల్ సలైన్, డైక్ట్సోజ్, అవిల్, డెకడ్రాన్ లాంటి మంందులు పశువైద్యుడి సలహా మేరకు జీవాలకు తాపించాలి. వేసవి యాజమాన్యం వేసవిలో పచ్చిగడ్డి, ఎండుమేత తగినంత దొరకనపుడు ఖనిజ లవణ లోపం ఏర్పడుతుంది. దీంతో జీవాల పెరుగుదల ఉండదు. షెడ్లలో గొర్రెలు, మేకలు నాకడానికి వీలుగా ఖనిజ లవణ మిశ్రమ ఇటుకలను వేలాడదీస్తే ఈ లోపాన్ని సవరించవచ్చు. అందుబాటులో ఉండే సామగ్రితో గాలి, వెలుతురు ప్రసరించేలా చిన్నగా, ప్రత్యేకంగా షెడ్లు కట్టుకోవాలి. పాకలను బోదగడ్డి లేదా తాటాకులు లేదా కొబ్బరిపట్టలు లాంటి వాటితో కప్పుకోవాలి. వేసవి గాలులను నిరోధించడానికి షెడ్లకు ఇరువైపులా గోనె సంచులు కట్టి నీళ్లు పోస్తుంటే చల్లదనం వచ్చే అవకాశం ఉంది. ఎండాకాలంలో సంభవించే పీపీఆర్, బొబ్బ, గాలికుంటు, చిటుకవ్యాధి నివారణకు ముందు జాగ్రత్తగా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. సాధ్యమైనంత మేరకు జీవాలను ఉదయం, సాయంత్రం వేళల్లో మేతకు తీసుకెళ్లాలి. మధ్యాహ్నం సమయంలో నీడ ప్రదేశంలో విశ్రాంతి కల్పించాలి. కృత్రిమంగానైనా నీడ ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. -
జీవాల వలసలపై అప్రమత్తత
అనంతపురం అగ్రికల్చర్ : వేసవిలో ఎదురయ్యే గడ్డి కొరత వల్ల సాధారణంగా జిల్లా నుంచి జీవాలను మేతకోసం ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తారు. ఇలాంటి సమయంలో కాపర్లు జాగ్రత్తలు పాటించాలని పశుసంవర్ధకశాఖ గొర్రెల విభాగం సహాయ సంచాలకురాలు డాక్టర్ ఎం.కాంతమ్మ తెలిపారు. జిల్లాలో 38 లక్షల సంఖ్యలో గొర్రెలు ఉండగా 48 వేల కుటుంబాలు వాటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. వేసవిలో గడ్డి కొరత కారణంగా కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాలతో పాటు కర్ణాటకలోని బళ్లారి, రాయచూరు, హొస్పేట్, గంగావతి, తుమకూరు, కోలార్, బాగేపల్లి, గౌరీబిదనూరు, మధుగిరి, శిరా, చిక్కబళ్లాపూర్ లాంటి ప్రాంతాలకు మేపు కోసం జీవాలతో వలసలు వెళ్తున్నారు. ఈ సమయంలో ప్రమాదాలు, జబ్బులు, ఇతరత్రా అంటువ్యాధుల వల్ల జీవాలు చనిపోయి ఆర్థికంగా నష్టం జరగవచ్చు. పంటల కోతల సమయం వ్యవసాయ పంటల సీజన్లు ఒక్కో ప్రాంంతం మధ్య కొంత తేడా ఉంటుంది. పంట ఉన్న సమయంలో పొలాల్లో మేపడం వీలుకాదు. పంట నూర్పిడి తర్వాత మేతకు అనువుగా ఉంటుంది. వలసలు వెళ్లడం కాపరుల జీవితంలో ఒక భాగంగా తయారైంది. జాగ్రత్తలు పాటించాలి : గొర్రెల మందలను మేతకోసం తీసుకెళ్లాలనుకునే ప్రాంతాలను ముందుగా ఎంపిక చేసుకుని అక్కడ మేపు, నీటి సదుపాయం చూసుకోవాలి. అంటువ్యాధులు, జబ్బులు ఉన్నాయా..లేదో తెలుసుకోవాలి. జీవాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు సొంత గ్రామాల్లో కుటుంబ సభ్యులకు తెలియజేస్తూ ఉండాలి. వెళ్లే సమయంలో గొర్రెల మందను ఎక్కువ దూరం నడిపించకుండా, కాస్త విశ్రాంతి ఇస్తుండాలి. చూడి కట్టిన (గర్భం) జీవాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఎండ తీవ్రత లేని సమయంలో మందలు తోలుకెళ్లాలి. రాత్రిపూట గొర్రెల మందలు విశ్రాంతి తీసుకునే సమయంలో చుట్టూ కంపను గాని, కంచెను వేయడం వలన జీవాలను తోడేళ్లు, నక్కలు, దొంగల బారి నుంచి కాపాడుకోవచ్చు. వలస సమయంలో జీవాలన్నీ సక్రమంగా ఒక జట్టులా వెళ్లేందుకు వీలుగా మందల్లో కొన్ని మేకలు ఉంటే బాగుంటుంది. దీని వలన గొర్రెలు విడివిడిగా తప్పించుకునే అవకాశం ఉండడు.ఒక్కో సందర్భంలో గొర్రె పిల్లలకు మేకల పాలు తాపించి సంరక్షించుకోవచ్చు. వేసవిలో వలస వెళ్లేముందు గొర్రెల శరీరంపైన ఉండే ఉన్ని కత్తిరించాలి. అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉన్నందున ముందస్తుగా టీకాలు వేయించాలి. ప్రధానంగా నట్టల (డీవార్మింగ్) మందును తాపించాలి. దీని వల్ల కొత్త ప్రదేశాలకు పోయినప్పుడు అక్కడి నీరు మేతల నుంచి వచ్చే పరాన్న జీవుల బెడద నుంచి కాపాడుకోవచ్చు. వలసెళ్లినప్పుడు అంటువ్యాధులు సోకితే వెంటనే వైద్యం చేయించిన తర్వాత అమ్మేయడం వల్ల కాపర్లకు నష్టం జరగదు. కొన్ని నెలల పాటు అక్కడే ఉండే అవకాశం ఉన్నందున ముందస్తుగా కొన్ని వైద్య జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యులు సిఫారసు మేరకు కొన్ని అత్యవసర ముందులు అందుబాటులో ఉంచుకోవాలి. -
కుక్కల దాడిలో 68గొర్రెలు మృతి
కౌతాళం: మండల పరిధిలోని అడవుల్లో సోమవారం రాత్రి ఆరు కుక్కలు గొర్రెల మందపై దాడి చేశాయి. కుక్కల దాడిలో 68గొర్రెలు మృతిచెందినట్లు వాటి యజమానులు మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ తాలుకా నర్వ గ్రామానికి చెందిన మల్లేష్, బాలప్ప తెలిపారు. అక్కడ మేత లేకపోవడంతో దాదాపు వెయ్యి గొర్రెలను ఇటీవల కౌతాళం మండలంలోని అడవుల్లోకి వాటి కాపరులు తీసుకొచ్చారు. అందులోభాగంగా సోమవారం రాత్రి కుక్కలు మందపై దాడి చేశాయి. కాపరులు తేరుకునేలోపు 68 గొర్రెలు మృతిందగా 9తీవ్రంగా గాయపడ్డాయి. దాదాపు రూ.7లక్షలు నష్టం వాటిల్లిందని జయమానులు ఆవేదన వ్యక్తం చేశారు. కురువ సంఘం మండల అధ్యక్షుడు వీరేష్ సంఘటన స్థలానికి చేరుకుని జరిగిన నష్టాని ఆర్ఐ రామచంద్రకు చేరవేయడంతో ఆయన కూడా ఘటన స్థలాన్ని పరిశీలించి యజమానులకు నష్టపరిహారం అందేలా చూస్తామన్నారు. -
నాణ్యమైన పొట్టేళ్లతో మంద అభివృద్ధి
అనంతపురం అగ్రికల్చర్ : గొర్రెల పెంపకం, మంద అభివృద్ధి చెందాలంటే పొట్టేళ్ల ప్రాముఖ్యత తెలుసుకోవాలని పశుసంవర్ధక శాఖ అనంతపురం డివిజన్ సహాయ సంచాలకులు (ఏడీ) డాక్టర్ టి.శ్రీనాథాచార్ తెలిపారు. ప్రతి 25 గొర్రెలకు ఒక నాణ్యమైన విత్తనపు పొట్టేలు ఉండేలా కాపర్లు జాగ్రత్తలు తీసుకుంటే జీవాల సంఖ్య పెరుతుందని ఆయన వివరించారు. పొట్టేళ్లను మారుస్తూ ఉండాలి... మందలో పుట్టిన పొట్టేళ్లను ఎంపిక చేసుకోవడం సరికాదు. ఇతర ప్రాంతాల నుంచి నాణ్యమైన విత్తన పొట్టేళ్లను ఎంపిక చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. వీటిని కూడా ప్రతి రెండు మూడేళ్లకు ఓసారి మారుస్తుండాలి. మందలో ఉన్నవాటినే తీసుకునే పద్ధతిని ‘ఇన్ బ్రీడింగ్’ అంటారు.దగ్గరి సంబంధమున్న గొర్రెలు, పొట్టేళ్ల సంపర్కం వల్ల పుట్టిన పిల్లలు బలహీనంగా ఉంటాయి. తక్కువ బరువుతో, అవిటితనంతో పుట్టే అవకాశం ఎక్కువ. సంతానోత్పత్తికి పనికిరానివిగానూ, జన్యు సంబంధ లోపాలతో గాని, జాతి లక్షణాలు కోల్పోవడం లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ. అందుకోసం పొట్టేళ్ల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి. పొట్టేళ్ల ఎంపిక.. నెల్లూరు గోధుమ, నెల్లూరు జోడిపి లాంటి జాతి లక్షణాలున్న పొట్టేళ్లు బాగుంటాయి. చక్కటి శరీర సౌష్టవం, పొడవు, ఎత్తు, బరువు ఉండే వాటిని ఎంచుకోవాలి. కాలి గిట్టలు బాగుండాలి, చురుకుదనం కలిగి ఉండటం. వృషణాలు రెండూ సమానంగా, వయస్సుకు సరిపడిన పరిమాణంలో ఉండాలి. పొట్టేళ్ల మందపై వాడేందుకు కనీసం ఒకటిన్నర సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మందలో ప్రతి 25–30 గొర్రెలకు ఒక పొట్టేలు చొప్పున ఉండేలా చర్యలు తీసుకుంటే మంద ఉత్పత్తి పెరుగుతుంది. ప్రతి గొర్రె నుంచి అదనపు ఆదాయం ఉంటుంది. మేలు జాతి విత్తనపు పొట్టేళ్లు మార్కెట్లో లభించడం కష్టంగా ఉంది. పొట్టేళ్ల మార్పిడికి పశుసంవర్ధకశాఖ ప్రోత్సాహం ఇస్తోంది. దీనిని కాపర్లు వినియోగించుకోవాలి. -
18లోగా ప్రాథమిక గొర్రెల సంఘాలకు ఎన్నికలు
– పశుసంవర్ధకశాఖ జేడీ సుదర్శన్ కుమార్ కర్నూలు(అగ్రికల్చర్): ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘాలకు ఈ నెల 18లోగా ఎన్నికలు నిర్వహించాలని జిల్లా పశుసంవర్థక శాఖ జేడీ డాక్టర్ సుదర్శన్‌కుమార్.. ఏడీలను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఎన్నికలు జరగని సంఘాలు 70 వరకు ఉన్నాయన్నారు. వీటిన్నిటికి 5వ తేదీన నోటిఫికేషన్ ఇస్తామని.. పశువైద్యులకు తగిన ఆదేశాలు ఇచ్చి 18లోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. సునందిని, క్షీరసాగర్ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. ఊరూరా పశుగ్రాస కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించాలన్నారు. సమావేశంలో కర్నూలు ఏడీ సీవీ రమణయ్య, ఆదోని ఏడీ పి.రమణయ్య, టెక్నికల్ ఏడీ విజయుడు, గొర్రెల అభివృద్ధివిభాగం ఏడీ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆంత్రాక్స్‌తో 57 గొర్రెలు మృతి
కేపీతండా (చాగలమర్రి): మండలంలోని కేపీ తండాలో ఆంత్రాక్స్ వ్యాధి సోకి 57 గొర్రెలు మృతి చెందాయి. పొలాల్లో మేత కోసం వెళ్లి రక్తం కక్కి ఇవి మృతి చెందాయి. గత నాలుగు రోజులుగా గ్రామానికి చెందిన రాందాస్‌నాయక్, కృష్ణానాయక్, గోవిందు నాయక్, హనుమాన్ నాయక్, తిరుపతి నాయక్‌ల తోపాటు మరికొందరి గొర్రెలు నోరు, ముక్కు నుంచి రక్తం కక్కుతూ మృతి చెందాయని రైతులు తెలిపారు. ఈ విషయంపై మండల పశువైధ్యాది కారి పుల్లయ్య మాట్లాడుతూ..విషపు ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఇలా జరిగి ఉండవచ్చాన్నారు. కుళ్లిన, బూజు పట్టిన పశుగ్రాసాలు తినకుండా రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. -
బ్లూటంగ్‌తో జాగ్రత్త ..
అనంతపురం అగ్రికల్చర్ : గొర్రెల్లో నీలినాలుక వ్యాధి (బ్లూటంగ్) సోకే అవకాశం ఉన్నందున కాపర్లు అప్రమత్తంగా ఉండాలని పశుసంవర్ధకశాఖ ‘అనంత’ డివిజన్ సహాయ సంచాలకులు డాక్టర్ టి.శ్రీనాథాచార్ తెలిపారు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదైనా, వర్షాలు ఎక్కువగా వచ్చినా వ్యాధి రావడానికి ఆస్కారముందన్నారు. వ్యాధి లక్షణాలు.. చికిత్స.. నివారణా మార్గాలు.. ఆయన ఇలా వివరిస్తున్నారు. బ్లూటంVŠ S: ఇది ‘క్యూలెకాయిడ్’ రకం దోమల వల్ల వ్యాపిస్తుంది. వ్యాధి బారిన పడిన గొర్రెలు ఎక్కువగా ఈసుకుపోవడం (అబార్షన్), పాల ఉత్పత్తి పడిపోవడం, గొర్రెపిల్లలు బలహీనపడటం, మాంసం, ఉన్ని నాణ్యత దెబ్బతినడం వల్ల ఆర్థికంగా నష్టం జరుగుతుంది. ఈ వ్యాధిని ‘ఏ’ క్యాటగిరీలో చేర్చినందున వీటి మాంసం విదేశీ ఎగుమతికి అవకాశం లేదు. ఈ వ్యాధి ఒక ఏడాదిలోపు గొర్రె పిల్లల్లో ఎక్కువగా సంభవిస్తుంది. లక్షణాలు : 104 నుంచి 106 డిగ్రీల జ్వరం, ముఖం, ముక్కు, పెదవులు వాచి వుండటం, నాలుక ఎర్రగా తయారై నీలి రంగుకు మారుతుంది. కళ్లుగా ఎర్రబడి కనురెప్పలు, చెవులు, కింది దవడ వాపు రావడం జరుగుతుంది. ముక్కు నుంచి తెల్లటి జిగట స్రవాలు రావడం, నోటిలోని మాంసం పొరలు (మ్యూకస్ మెంబ్రేన్) పుండ్ల మాదిరిగా ఏర్పడటం, తొడల మధ్య, చంకల్లో, మల ద్వారం కింద చర్మం ఎర్రగా కమిలినట్లు ఉండటం, వ్యాధి తీవ్రంగా ఉన్న గొర్రెల్లో గిట్టల మొదటి భాగం వాచి, మధ్యలో ఎర్రగా ఉండటం, చర్మం దెబ్బనడం వల్ల ఉన్ని, వెంట్రుకలు ఊడిపోవడం, తీవ్రతను బట్టి ఐదారు రోజులు మేత మేయక, నీరు తాగక నీరసించి చనిపోయే అవకాశం ఉంటుంది. చనిపోయిన గొర్రెల్లో ఊపిరితిత్తులు వాపు, గాలిగొట్టాలు నురుగ వంటి ద్రవాలతో నిండిపోవడం, ఎద భాగంలో నీరు చేరుట, గుండె పొరల్లో రక్తస్రావం, ఊపిరితిత్తులకు సంబంధించిన రక్తనాళం మొదటి భాగంలో రక్తస్రావం జరిగినట్లు తెలుస్తుంది. చికిత్స : ఎలీసా పరీక్ష ద్వారా వ్యాధి నిర్ధారించవచ్చు. వ్యాధి బహిర్గతమైన తర్వాత ఎలాంటి చికిత్స లేదు. గాలికుంటు, పీపీఆర్ వ్యాధి లక్షణాలు కూడా నీలినాలుక వ్యాధికి సారూప్యత ఉండటంతో పశువైద్యులను సంప్రదించి చికిత్స పొందాలి. నోటిలో పుండ్లను పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో కడిగి, బోరిక్ పౌడర్‌ను పూయాలి. వైద్యుని సలహా మేరకు యాంటీబయాటిక్ మందులు వాడాలి. గిట్టల మధ్య పుండ్లను పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో కడిగి, హిమాక్స్, నెమ్‌లెంట్ వంటి మందులను పూయాలి. దోమలను నివారించాలి : వర్షాకాలంలో గొర్రెల కొట్టం, పరిసర ప్రాంతాల్లో నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సాయంత్రం, రాత్రి సమయాల్లో మంద చుట్టూ వేపాకు పొగ వేసి దోమలను నివారించవచ్చు. ప్రతి 10–15 రోజులకోసారి గొర్రెల శరీరంపై, కొట్టంలో 2 శాతం బ్యూటాక్స్ మందును పిచికారీ చేయడం ద్వారా దోమకాటును అరికట్టవచ్చు. రాత్రి పూట మందుకు కొద్ది దూరంలో పెట్రోమాక్స్ లైట్లను వెలిగించడం ద్వారా దోమల శాతాన్ని తగ్గించవచ్చు. గొర్రెలను ఎల్తైన ప్రదేశంలో ఉంచాలి. గొర్రెల మందలో ఆవులు, దూడలు కట్టేయడం ద్వారా దోమలు వాటì పై వాలి గొర్రెలకు బెడద తగ్గుతుంది. -
విస్తరిస్తున్న బ్లూటంగ్ మహమ్మారి
కానరాని నిర్మూలన చర్యలు పిట్టల్లా రాలుతున్న మూగజీవాలు అయోమయంలో పెంపకం దారులు పట్టించుకోని అధికారులు మెదక్ రూరల్: మూగజీవాలకు బ్లూటంగ్ అనే మహమ్మారి సోకి పిట్లల్లా రాలిపోతున్నాయి. అయినా సంబంధిత వైద్యాధికారులు పట్టించుకోవడం లేదని గొర్రెలు, మేకల పెంపకం దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ మండలంలోని వెంకటాపూర్, గుట్టకిందిపల్లి, శివ్వాయిపల్లి, బూర్గుపల్లి, వాడి తదితర గ్రామాలలో గల గొర్రెలకు బ్లూటంగ్ అనే వ్యాధి సోకడంతో జీవాలకు నోట్లో పుండ్లు ఏర్పడి, మేత మానేసి, దగ్గు, నాలిక నీలి రంగుగా మారడం, కాళ్లు చచ్చుపడి పోయి నడవలేని స్తితికి చేరుకుని చివరికి మృతి చెందుతున్నాయి. ఇలా ఒక్కో రైతు వద్ద పదుల సంఖ్యలో మృత్యువాతపడుతున్నాయి. దీంతో మూగ జీవాల మీదనే ఆధారపడి జీవించే పశుపోషకులు తీవ్రంగా నష్టపోతున్నారు. పశువైద్యాధికారులు మాత్రం బ్లూటంగ్ వ్యాధి నిర్మూలన కోసం ఇప్పటి వరకు ఎలాంటి వ్యాక్సిన్లను సరఫరా చేయలేదు. ఫలితంగా గొర్రెలు, మేకల పెంపకందారులు వేల రూపాయలను వెచ్చించి ప్రైవేట్ మెడికల్ షాపుల నుంచి మందులను తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో మూగజీవాల పోషణ భారంగా మారుతుందని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ స్పందించి బ్లూటంగ్ వ్యాధిని నిర్మూలనకు వాక్సిన్ను ప్రభుత్వాస్పత్రుల ద్వారా అందించాలని పెంపకం దారులు కోరుతున్నారు. వేల రూపాయల ఖర్చు గొర్రెల పెంపకం పైనే ఆధారపడి జీవిస్తున్నాం. మాయదారి రోగంతో జీవాలు ఒక్కొక్కటిగా మృతి చెందుతున్నాయి. జీవాలను కాపాడేందుకు వేల రూపాయలు ఖర్చు చేస్తూ ప్రైవేట్ మెడికల్ దుకాణాలలో మందులను కొనుగోలుచేస్తున్నాం. ప్రభుత్వం మందులను సరఫరా చేయడంలేదు. ఈ ఏడాదిలో సుమారు 30 జీవాలు రోగంతో మృతి చెందాయి. ఒక్కో గొర్రె నాలుగు వేల పైనే ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటికైనా మందులను సరఫరా చేయాలి. - పాత్లూరితార్యా-వెంకటాపూర్ తండా జీవాలు నడవలేక పోతున్నాయి వింత రోగంతో జీవాలు ఇప్పటికే మృతి చెందాయి.ఇంకా కొన్ని జీవాలు నడవలేక పోతున్నాయి.కాపాడేందుకు వేళ రూపాయలు ఖర్చు చేస్తున్నాము. ప్రైవేట్ మెడికల్ దుఖానాలలో మందులు దొరుకుతున్నాయి.ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వాది నివారనకు మందులను సరఫరా చేయాలి. - మలావత్ రెడ్యా-వెంకటాపూర్ తాండా 24 రకాల వైరస్‌లున్నాయి బ్లూటంగ్ అనేది గొర్రెలకు సోకె ప్రమాదకరమైన వ్యాధి. ఈ వ్యాధి క్యూలీఫైర్ అనే దోమ కుట్టడం వల్ల, వాతావరణంలో జరిగే మార్పుల వల్ల సంక్రమిస్తుంది.బ్లూటంగ్ లో 24 రకాల వైరస్లు ఉన్నాయి.సీరం తీసుకోని వాక్సిన్ తయారు చేయాలంటే చాలా సమయం పడుతుంది. ప్రైవేటులో లభించే వ్యాక్సిన్‌లో కేవలం 5 రకాల టీకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ పరంగా ఎలాంటి వాక్సిన్ అందుబాటులోకి రాలేదు. - వెటర్నరి అధికారి ఉమమసహేరా -
కుక్కల దాడిలో మూగజీవాల మృత్యువాత
డిండి : కుక్కులదాడిలో ఏడు మూగజీవాలు మృతిచెందాయి. ఈ ఘటన మండల పరిధిలోని యర్రగుంట్లపల్లిలో గురువారం చోటు చేసుకుంది. వివరాలు.. మండల పరిధిలోని యర్రగుంట్లపల్లి గ్రామానికి చెందిన ముచ్చర్ల రాములుకు చెందిన ఆరు గొర్రెలు, మేక దొడ్డిలో ఉండగా ఒక్కసారిగా కుక్కలు దాడి చేయడంతో గాయపడి మృతిచెందాయి. వాటి విలువ సుమారు రూ. 50 వేలు ఉంటుందని బాధితుడు తెలిపాడు. ప్రభుత్వం ఆర్థికసాయం చేసి బాధితుడిని ఆదుకోవాలని టీఆర్ఎస్ మండల నాయకులు మల్రెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి కోరారు. -
రైలు ఢీకొని 52 గొర్రెలు మృతి
కంచిలి : మండలంలోని జాడుపూడి గ్రామ సమీపంలో రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద బుధవారం భువనేశ్వర్–సికింద్రాబాద్ విశాఖ ఎక్స్‌ప్రెస్ ఢీకొని 52 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. వివరాల్లోకిళ్లే.. కవిటి మండలం జి.బెలగాం గ్రామానికి చెందిన మద్దిలి భీమయ్య, మద్దిలి భీమారావు, నర్తు రామారావులకు చెందిన గొర్రెలను కాపరి మేత కోసం ఈ మార్గంలో తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. రైలు వస్తుందని గమనించకపోవటంతో గొర్రెలను రైల్వేట్రాక్‌ను దాటిస్తుండగా రైలు ఢీకొంది. దీంతో గొర్రెలు రైలు వేగానికి చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. విషయం తెలుసుకొన్న యజమానులు సంఘటనా స్థలానికి వచ్చి గుండెలవిసేలా కన్నీరుమున్నీరయ్యారు. పేదలమైన∙తాము తమకున్నదంతా గొర్రెల పెంపకం కోసమే పెట్టామని, తీరా ఇవి చనిపోవటంతో కుటుంబాలతో సహా రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా సమాచారం తెలుసుకొన్న తహసీల్దార్ టి.కల్యాణచక్రవర్తి సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ 52 గొర్రెలు ఈ ప్రమాదంలో మృతి చెందాయని, దీనిపై ఉన్నతాధికారులకు నివేదిస్తానని చెప్పారు. -
అంతుచిక్కని వ్యాధితో 56 గొర్రె పిల్లల..
శ్రీకూర్మం (గార ) : తమను ఆర్థికంగా నిలబెడతాయనుకున్న గొర్రెలు ఒకేసారి మతి చెందడంతో పెంపకందారులు లబోదిబోమంటున్నారు. శ్రీకూర్మం పంచాయతీ కోళ్లపేట గ్రామం కోండ్రు పైడయ్య, కోండ్రు అప్పలరాజు, బాకి అప్పలరాజు, బాకి లక్ష్మణలకు చెందిన గొర్రెలను దువ్వుపేట సమీపంలోని సముద్రపు దిబ్బలపై ఉంచారు. మంగళవారం రాత్రి గూడుల్లో ఉన్న 56 గొర్రె పిల్లలు ఒకేసారి మత్యువాత పడ్డాయి. దీంతో సుమారు రూ. 3లక్షలకు పైగా నష్టం జరిగిందని పెంపకందారులు ఆవేదన వ్యక్తం చేశారు. గార పశువైద్యాధికారి కె.నారాయణమూర్తి పోస్టుమార్టం నిర్వహించి శాంపిల్స్‌ను లేబొరేటరీకి పంపించారు. రైతులు చలి పిడుగు పడి మతి చెందాయని భావిస్తుండగా వైద్యులు మాత్రం యాష్‌పిక్సియా అనే వ్యాధితో చనిపోయి ఉండవచ్చని, ఉన్నతాధికారులకు సమాచారమిచ్చామని తెలిపారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన సర్పంచ్ బరాటం రామశేషు ఆర్థికంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. -
నీలినాలుక.. నివారణే మందు!
గొర్రెల్లో నీలినాలుక వ్యాధి.. దోమల ద్వారా వ్యాధి వ్యాప్తి సకాలంలో గుర్తించకుంటే అనర్థం చికిత్స కంటే నివారణ చర్యలే కీలకం గజ్వేల్ పశువైద్యాధికారి నరేందర్‌రెడ్డి సలహాలు, సూచనలు గజ్వేల్: ప్రస్తుత సీజన్లో గొర్రెల్లో సోకే నీలి నాలుక వ్యాధి (బ్లూటంగ్) వల్ల కాపర్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఈ వ్యాధి పట్ల అప్రమత్తమై నివారణ చర్యలు చేపడితే గొర్రెలను ప్రాణనష్టం నుంచి కాపాడుకోవచ్చని గజ్వేల్ పశువైద్యాధికారి నరేందర్‌రెడ్డి (సెల్ నెం: 9505056118) సూచిస్తున్నారు. ఈ వ్యాధి నివారణపై ఆయన అందించిన సలహాలు, సూచనలివి. వ్యాధి సోకే కాలం: దోమలు ఉధృతంగా ఉండే ఆగస్టు, సెప్టెంబర్ నెలలు. దేని ద్వారా సోకుతుంది: అర్జి వైరస్ క్రిముల ద్వారా. ఎలా సోకుతుంది: క్యూలికాయిడస్ అనే దోమకాటు ద్వారా సోకుతుంది. లక్షణాలు: వ్యాధి మందలోని సగం జీవాలకు సోకితే 10 శాతానికి పైగా గొర్రెలు మరణిస్తాయి. జ్వరం 105 డిగ్రీల నుంచి 107 ఫారెన్‌హీట్ డిగ్రీల వరకు ఉంటుంది. మూతి, పెదవులు, చిగుళ్లు, నాలుక, ముఖం వాచి ఎర్రబడుతుంది. నోటి నుంచి నురుగతో కూడిన చొంగ, కళ్లు, ముక్కులు వాచి స్రావాలు కారుతాయి. వ్యాధి చివరి దశలో నాలుక నీలిరంగుగా మారుతుంది. నోటి నుంచి దుర్వాసన వస్తుంది. గిట్టల పైభాగం కరోనెట్ ఎర్రగా కందిపోయి వాచి చీము పట్టి నడవలేక జీవాలు కుంటుతుంటాయి. మేత తినలేకపోవడం వల్ల నీరసించి బరువును కోల్పోయి మరణం సంభవిస్తుంది. ఈ వ్యాధి మేకల్లో అరుదుగా సోకుతుంది. చికిత్స: వైరస్ వ్యాధి అయినందున చికిత్స వల్ల ప్రయోజనం ఉండదు. సెకండరీ బాక్టీరియా వల్ల కలిగే దుష్ఫలితాల నివారణకు యాంటీబయోటిక్ ఇంజక్షన్లు 3-5 రోజులు వాడాలి. నోటి పుండ్లను 5 శాతం పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో శుభ్రం చేసి బోరోగ్లిజరిన్ పూయాలి. నివారణ: 22 రకాల సిరోటైపులు ఈ వ్యాధిని కలిగిస్తున్నందున టీకాల తయారీ వ్యయప్రయాసలతో కూడుకుని ఉంటుంది. టీకాల తయారీకి ఇంకా సమయం పడుతుంది. కాబట్టి వ్యాధిని అదుపు చేయడానికి టీకాలు ప్రస్తుతం అందుబాటులో లేనందున నివారణ చర్యలపై శ్రద్ధ చూపాలి. వ్యాధి తీవ్రతపై సూర్యరశ్మి ప్రభావం ఉంటుంది. కాబట్టి వ్యాధిగ్రస్త జీవాలను నీడలో ఉంచి చికిత్స చేయించాలి. మందలో పంపకూడదు. ఈ వ్యాధి దోమకాటు ద్వారా ప్రధానంగా వ్యాపిస్తున్నందున దోమల నివారణకు వేపాకు లేదా నీలగిరి లేదా కలబంద లేదా పిడకల్ని కాల్చి దోమలను నివారించాలి. రాత్రి వేళల్లో ఎలక్ట్ట్లికల్ బల్బులు పెడితే వెలుతురుకు దోమల ఉధృతి తగ్గుతుంది. మాంసం, పాల ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. కాబట్టి వ్యాధిగ్రస్త జీవాల్ని మాంసానికి కోయవద్దు. పాలను గొర్రె పిల్లలు తాగకుండా చూడాలి. జీవాలకు సక్రమంగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయిస్తుంటే నీలి నాలుక వ్యాధి సోకే అవకాశం తగ్గుతుంది. -
అందమైన గొర్రెకు కాసుల వర్షమే
సాక్షి,సిటీబ్యూరో: త్యాగానికి మారుపేరైనా బక్రీద్ సందర్భంగా ఖుర్బానీ(త్యాగం) కోసం కొనుగోలు చేసే పోటేళ్లకు ధర కంటే వాటి శరీర ఆకృతికే ప్రాధాన్యత ఇస్తారు. ఎలాంటి గాయాలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నవాటినే ఇందుకు కొనుగోలు చేస్తారు. చెవులు, కొమ్ములకు గాయాలు (చెవి తెగిపోవడం.... కొమ్ము విరిగిపోవడం)లాంటివి ఉంటే అవి ఖుర్బానీలకు పనికిరావు. సాధారణ రోజుల్లో గొర్రెలు, పొట్టేళ్ల బరువును బట్టి ధర నిర్ణయిస్తారు. అయితే ఖుర్బానీ కోసం కొమ్ములుండి చూడడానికి అందంగా కనిపించే పొట్టేళ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. -
లక్షలు పలుకుతున్న 'అల్లాహ్' పొట్టేలు
సాక్షి,సిటీబ్యూరో: పహాడీషరీఫ్ షాహిన్నగర్కు చెందిన మహ్మద్ రఫియుద్దీన్ అనే వ్యక్తి పది రోజుల క్రితం జడ్చర్లలో 130 పొట్టేళ్లను కొనుగోలు చేశాడు. కాగా ఇందులో ఒక పొట్టేళ్లు చర్మంపై అరబ్ భాషలో అల్లాహ్ అని రాసినట్లుగా మచ్చ రూపంలో ఉండడాన్ని గుర్తించి దానిని ప్రత్యేకంగా అవ్ముకానికి పెట్టాడు. త్యాగానికి ప్రతీకైన బక్రీద్‌లో పొట్టేలు రూపంలో దేవుడు ఉన్నాడని భావిస్తున్న వారు దీనిని కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నారు. ఇప్పటి వరకు ఈ పొట్టేలుకు రూ. 2.5 లక్షలు వెచ్చించేందుకు పలువురు వుుందుకు వచ్చారని, అయితే దీనిని అమ్మాలా...? వద్దా...? ఇంకా నిర్ణయించుకోలేదని రఫియుద్దీన్ తెలిపారు. -
గొర్రెల సంత కిటకిట
అనంతపురం అగ్రికల్చర్: అనంతపురం వ్యవసాయ మార్కెట్‌యార్డులో శనివారం గొర్రెల సంత జీవాలతో కిటకిటలాడింది. శ్రావణ మా సం, వినాయకచవితి వేడుకలు ముగిశాయి. అ లాగే వచ్చే వారంలో బక్రీదు, మహాలయ పౌ ర్ణమి లాంటి పర్వదినాల నేపథ్యంలో మాం సానికి విపరీతమైన గిరాకీ ఏర్పడింది. భారీ సంఖ్యలో మేకలు, పొట్టేళ్లను విక్రయించేందుకు తీసుకురావడంతో మార్కెట్ యార్డు ప్రాం తంలో కిక్కిరిసింది. దీంతో అక్కడి రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. -
రేపటి నుంచి నట్టల నివారణ మందు పంపిణీ
– పశుసంవర్ధకశాఖ జేడీ దుర్గయ్య మహబూబ్‌నగర్ వ్యవసాయం : రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతగా చేపట్టిన నట్టల నివారణ కార్యక్రమాన్ని ఈ నెల 26వ తేదీ నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు, జిల్లాలోని 44లక్షల గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులను పంపిణీ చేయనున్నట్లు పశుసంవర్ధకశాఖ జేడీ దుర్గయ్య ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 37.30 లక్షల గొర్రెలు, 6.87లక్షల మేకలకు నట్టల నివారణ మందులను తాగించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. 185 పశువైద్య బృందాల ద్వారా వీటిని తాగించనున్నట్లు ఆయన తెలిపారు. గొర్రెలు, మేకల కాపారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
కుక్కల దాడి: 20 గొర్రెలు మృతి
మెదక్ : గొర్రెల మందపై కుక్కలు దాడి చేసిన ఘటనలో 20 గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటన మెదక్ జిల్లా మిరుదొడ్డి మండలం భూంపల్లిలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గొర్రెల యజామని గొర్రెలను మేతకోసం తీసుకెళ్తుండగా.. కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో 20 గొర్రెలు మృతిచెందగా.. మరో పది గొర్రెలు గాయాపడ్డాయి. దీంతో యజమాని కన్నీరుమున్నీరు అవుతున్నాడు. -
లారీ ఢీ : 20 గొర్రెలు మృతి
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని స్థానిక ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో గురువారం ఉదయం ఓ లారీ.. గొర్రెల మందను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 20 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ఘటనలో గొర్రెల కాపరి తీవ్రంగా గాయపడ్డాడు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... క్షతగాత్రుడ్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రైలు కిందపడి 30 గొర్రెలు మృతి
నిజామాబాద్ : ప్రమాదవశాత్తూ రైలు కింద పడి 30 గొర్రెలు మృతి చెందాయి. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలం గిడ్డ గ్రామంలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఓ గొర్రె రైలు పట్టాలు దాటడంతో మిగతా గొర్రెలు కూడా రైలు వచ్చే సమయంలో రైల్వే ట్రాక్ దాటడానికి ప్రయత్నించడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు గొర్రెల యజమాని బండారు వీరయ్య తెలిపారు. గొర్రెల మృతితో సుమారు లక్ష రూపాయల నష్టం వాటిల్లినట్లు వీరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. -
పొట్టేళ్లను ఎత్తుకెళ్లిన దొంగలు
కరీంనగర్: కోనరావుపేట మండలంలోని నిజాంబాద్ గ్రామంలో దొంగలు రెండు పొట్టేళ్లను బుధవారం సాయంత్రం ఎత్తుకెళ్లారు. వాటి విలువ సుమారు రూ.24 వేలు ఉంటుందని యజమాని తెలిపాడు. వివరాలు...నిజాంబాద్ గ్రామానికి చెందిన బొల్లు శ్రీనివాస్ బుధవారం గొర్రెల మందలోకి రెండు పొట్టేళ్లను తోలాడు. గురువారం ఉదయం చూసేసరికి రెండు పొట్టేళ్లు కనిపించలేదు. దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. (కోనరావుపేట) -
ప్రమాదవశాత్తూ 105 మేకలు మృతి
ఎల్లారెడ్డి : నిజామాబాద్ జిల్లాలో మేతకు వెళ్లిన 105 మేకలు, గొర్రెలు ప్రమాదవశాత్తూ మృత్యువాతపడ్డాయి. తాడ్వాయి మండలం, తనకల్లుకు చెందిన కొమరయ్య, మల్లయ్య, చిన్న నారాయణ, పెద్ద నారాయణ ఇలా ఓ పన్నెండు మంది తమ మేకలను మేత కోసం గురువారం నిజాంసాగర్ బ్యాక్ వాటర్ పరిసర ప్రాంతాలకు తీసుకెళ్లారు. సాయంత్రం తిరిగి వెళుతుండగా... ఎల్లారెడ్డి మండలం జంకంపల్లి వద్ద చెరువు కట్టపై నుంచి మేకలు, గొర్రెలు జారి లోతైన ప్రదేశంలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో సుమారు 105 వరకు గొర్రెలు, మేకలు మృతి చెందాయి. అయితే, మేతకు తీసుకొచ్చినవి ఎక్కువ సంఖ్యలో ఉండడంతో కొన్ని జారిపడిపోయిన విషయాన్ని వాటి యజమానులు గమనించలేదు. శుక్రవారం ఉదయం కొన్ని తగ్గినట్టు గుర్తించి వెనక్కి వెళ్లి చూడగా... చెరువు గట్టు పక్కన మృతి చెంది ఉండడం కనిపించింది. -
చిరుతల దాడిలో 71 గొర్రె పిల్లలు మృతి
రొద్దం(అనంతపురం): రెండు చిరుతల దాడిలో 71 గొర్రె పిల్లలు హతమయ్యాయి. అనంతపురం జిల్లా రొద్దం మండల పరిధిలోని ఆర్ లోచెర్ల, కంచిసముద్రం గ్రామాల మధ్య ఓకుంట వద్ద గురువారం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది. గొర్రెల కాపర్లు తెలిపిన వివరాలు.. పెనుకొండ మండలం చిన్నపరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఐదుగురు మేపు కోసం 18 రోజుల క్రితం గొర్రెల మందను తోలుకెళ్లారు. ఆర్ లోచెర్ల గ్రామానికి చెందిన బోయ హనుమంతు అనే రైతు పొలంలో వందలాది గొర్రెల మందను నిలిపారు. సరిగా నడవలేని 100 పిల్లలను రొప్పం ఏర్పాటు చేసి ఒక చోట ఉంచారు. వాటి వద్ద కాపలా ఉన్న నాగన్న భోజనం చేయడానికి గ్రామంలోకి వెళ్లగా, మాటు వేసిన రెండు చిరుతలు ఒక్కసారిగా దాడి చేసి 71 గొర్రె పిల్లలను చంపేసి రక్తం తాగారుు. 20 పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. భోజనం చేసి వచ్చిన నాగన్నపైకి చిరుతలు దాడికి యత్నించడంతో అతను గట్టిగా కేకలు వేస్తూ పరుగు తీసి ప్రాణాలు కాపాడుకున్నాడు. రూ 3 లక్షలు నష్టం వాటిల్లినట్లు వారు వాపోయారు. -
అయ్యయ్యో..
మదిరేపల్లి(శింగనమల) : గొర్రెలు జొన్న పైరును తినడంతో నాముకొని కళ్ల ముందే చనిపోతుండడంతో, వాటిని బతికించుకోవడానికి వారు పడుతున్న పాట్లను చూసి ప్రజలు చలించిపోయారు. ఈసంఘటన శింగనమల మండలంలోని మదిరేపల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగింది. మదిరేపల్లి గ్రామంకు చెందిన పెద్ద పెద్దన్న గొర్రల మందలో 150 గొర్రెలు వరుకు మృతి చెందాయి. దాదాపు రూ.8లక్షల మేరకు నష్టం వాటిల్లింది. మదిరేపల్లి గ్రామంకు చెందిన పెద్ద పెద్దన్న, నారాయణస్వామి, చిన్నరాజులు, నారాయణస్వామి, యల్లప్ప,నారాయణస్వామి, రాజప్ప, ఉజ్జేనప్ప, నారాయణస్వామి, జయకాంత్, వన్నప్ప, నారాయణస్వామి 12 మంది కలిసి 2వేలు గొర్రెలును మేపుకుంటున్నారు. రోజు మాదిరిగానే గొర్రెలను ఒక వైపు, గొర్రె పిల్లలను ఒక వైపు మేపు కోసం తీసుకెళ్లారు. మధ్యాహ్నం సమయంలో కొద్దిగా ఎండిపోయిన జొన్న పైరులో గొర్రెలును మేపుకున్నారు. అందులో 200 గొర్రెలు నాము కొని (అరగక) ఇబ్బంది పడ్డాయి. దీంతో గొర్రెల మందను పొలం నుంచి బయటకు తీసుకుపోయారు. కాని గంట గడిచిలోపే గొర్రెలు ఒక్కొక్కటీ కింద పడి కళ్లు ముందే చనిపోతుండడంతో గొర్రెలు యజమానులు అందోళన చెందారు. విషయంను గ్రామస్థులుకు, వెటర్నరీ సిబ్బందికి తెలియడంతో వారు గోపాల మిత్రలుతో కలిసి వచ్చి వైద్యం చేశారు. పొలల్లోనే ఎక్కడ పడితే అక్కడ 150 గొర్రెలు చనిపోయాయి. ప్రజలు మిగిలని గొర్రెలకు వైద్యులతో మందును వేయించారు. 50 గొర్రెలు వరకు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. శింగనమల, బుక్కరాయసముద్రం మండల వెటర్నరీ వైద్యులు సుధాకర్, రామచంద్రారెడ్డి, గోపాల మిత్రలు వైద్యం అందజేశారు. అనంతరం డిప్యూటీ తహశీల్దారు వరప్రసాద్, వీఆర్వో వెంకట్రామిరెడ్డి, జెడ్పీటీసీ శాలిని సంఘటన స్థలానికి వచ్చి పరీశీలించారు. బాధితులతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించడానికి కృషి చేస్తామని తెలిపారు. -
జీవాలకు నట్టల నివారణ మందులు తాగించాలి
- అడపాదడపా వర్షాల వల్ల రాత్రి వాతావరణం చల్లగా ఉంటున్నందున గొర్రెలు, మేకలను చలిగాలుల నుంచి కాపాడు కోవాలి. నేల రొచ్చు లేకుండా పరిశు భ్రంగా ఉంచుకోవాలి. నట్టల నివారణ మందులు తాగించాలి. - జీవాలు ఎదకు వస్తున్నట్లయితే వాటిని జాగ్రత్తగా పోతుతో దాటించాలి. చూడితో ఉన్న జీవాల మేపు, ఆరోగ్య పరిరక్షణపై శ్రద్ధ చూపాలి. - అక్టోబర్/నవంబర్‌లో సైలేజి గడ్డిని తయారు చేయాలనుకునే రైతులు ఇప్పుడే ఆఫ్రికన్ టాల్ మొక్కజొన్న రకాలను విత్తుకోవాలి. పప్పుజాతి, గడ్డిజాతి పశుగ్రాసాలను పెంచాలి. జీవాలను వర్షంలో తిప్పకుండా షెడ్డులోనో, ఇంటిపట్టునో ఉంచి పుష్టిగా మేపాలి. - ఆచార్య టి. రఘునందన్ (9440477240), అధిపతి, ఐఎల్‌ఎఫ్‌సీ, పశువైద్య కళాశాల, రాజేంద్రనగర్, హైదరాబాద్ రొయ్యల రైతు లాభదాయకత పెంచే బ్యాక్టీరియా! - రొయ్యల పెంపకంలో నేల స్వభావంతోపాటు నీటి నాణ్యత కూడా రొయ్యల పెరుగుదలకు సహాయపడుతుంది. గుల్లకొట్టడం(మోల్టింగ్) ద్వారా రొయ్యలు వదిలిన గుల్లను కిటెనో లైటిక్ బ్యాక్టీరియా(చెద పురుగులు కాగితాన్ని ఏ విధంగా తినేస్తాయో అలా) జీర్ణం చేసుకుంటుంది. అందులోని ఖనిజ లవణాలన్నీటినీ చెరువులో మళ్లీ వినియోగంలోకి తెస్తుంది. రొయ్యల పెంపకం జరుగుతున్నన్ని రోజులూ ఈ రీసైక్లింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. - నేల, నీరు ఈ బ్యాక్టీరియాకు ఎంత సహకరిస్తే అంతే నాణ్యతతో ఈ ఖనిజ లవణాల పునర్వినియోగ ప్రక్రియ జరుగుతుంది. తద్వారా రొయ్యల మోల్టింగ్ విధానం రైతుల లాభదాయకతకు తోడ్పడుతుంది. - నీటి నాణ్యత(ముఖ్యంగా క్షారత్వం, గాఢత)లో తేడాలుంటే రొయ్యల మోల్టింగ్ ప్రక్రియ నిలిచిపోయి రొయ్యల పెరుగుదల ఆగిపోతుంది. - ఆచార్య పి. హరిబాబు, ప్రభుత్వ మత్స్యకళాశాల, ముత్తుకూరు, నెల్లూరు జిల్లా పొదుగు వ్యాధి రాకుండా జాగ్రత్త పడాలి - పాడి పశువుల్లో ప్రాణాంతకమైనది పొదుగువాపు వ్యాధి. 3 రకాల సూక్ష్మక్రిముల వల్ల పాల గ్రంధికి సోకుతుంది. పరిశుభ్రత పాటించడం ద్వారా రాకుండా జాగ్రత్తపడడం ఉత్తమం. - ఈ వ్యాధి వల్ల పొదుగు ఎర్రబడి, వాచి పశువుకు జ్వరం వస్తుంది. చనిపోయే ప్రమాదమూ ఉంటుంది. పాల దిగుబడి తగ్గి, పాలలో కుదపలు కనపడతాయి. పాలు పలచబడి గోధుమ రంగుకు మారతాయి. కొన్నిసార్లు లక్షణాలు త్వరగా కనపడవు. - నివారణ మార్గాలు: పాలు తీసిన తర్వాత 4 చనులను పావిడిన్ లోషన్లో ముంచి తీయాలి. పశువులు వట్టిపోయే సమయంలో పొదుగులోకి ట్యూబు మందులు ఎక్కించాలి. - డా. ఎం.వి.ఎ.ఎన్. సూర్యనారాయణ (99485 90506), అధిపతి, పశు పరిశోధన కేంద్రం, గరివిడి, విజయనగరం జిల్లా మీ అభిప్రాయాలు, ప్రశ్నలు, సూచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, సాక్షి (సాగుబడి), సాక్షి టవర్స,6-3-249/1, రోడ్డు నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్- 500 034 saagubadi@sakshi.com -
నట్టలతో జీవాలకు ఎంతో నష్టం
పాడి-పంట: గొర్రె లేదా మేక శరీరంపై దాడి చేసే అంతర పరాన్నజీవుల్లో ఏలిక పాములు, బద్దె పురుగులు, జలగలు ప్రధానమైనవి. వీటివల్ల జీవాలకు పోషకాలు సరిగా అందక నీరసించి బక్కచిక్కిపోతాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నేటికీ సుమారు 95% జీవాలను విస్తృత లేదా సంప్రదాయ పద్ధతిలోనే పెంచుతున్నారు. ఈ పద్ధతిలో జీవాలను బయళ్లు, అడవుల్లో తిప్పుతూ మేపుతుంటారు. అలా ఆరుబయట మేసే జీవాలకు తరచుగా ఎదురవుతున్న ప్రధాన సమస్య నట్టల తాకిడి. ఇవి ఆశించడం సహజమే అయినప్పటికీ జీవాల శరీరంలో వాటి సంఖ్య ఎక్కువైతే అనేక అనర్థాలు చోటుచేసుకుంటాయి. వీటివల్ల జీవాల పెంపకందారులు తమ ఆదాయంలో 30% వరకు కోల్పోవాల్సి వస్తోంది. ఎంత మేపినా జీవాలు బలం పుంజుకోవడం లేదని పెంపకందారులు కలవరపడుతుంటారు. ‘బలం’ మందు పేరుతో నట్టల నివారణ మందును తాగిస్తూ సమస్యను తాత్కాలికంగా అధిగమిస్తుంటారు. వీటివల్లే నష్టం ఎక్కువ తీగ పురుగులు, పేగు పురుగులు, నల్ల పారుడు పురుగులు, కొరడా పురుగులు... ఇవన్నీ ఏలిక పాములు. జలగల్లో పొట్టి జలగలు, కార్జ్యపు జలగలు, రక్తపు జలగలు అనే రకాలు ఉంటాయి. వీటితో పాటు బద్దె పురుగులు కూడా జీవాలను ఆశించి వాటి ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంటాయి. ఏం జరుగుతుంది? జీవాల కాలేయం, ఊపిరితిత్తులు, ప్రేవులు, జీర్ణాశయం, ఇతర అంతర్గత అవయవాల్లో నట్టలు స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. ఇవి గొర్రెలు, మేకల్లోని పోషకాలను, రక్తాన్ని హరిస్తాయి. దీంతో జీవాలు రక్తహీనతకు గురవుతాయి. గొర్రెలు బరువు పెరగవు. ఎంత మేపినా చిక్కిపోతుంటాయి. మేత తినవు. పొట్ట లావుగా ఉంటుంది. దవడ కింద నీరు చేరుతుంది. విరేచనాలు అవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో అజీర్ణం, అధిక దాహం, ముక్కు-నోటి నుంచి రక్తం కారడం, కడుపుబ్బరం, దగ్గు వంటి లక్షణాలు కూడా కన్పిస్తాయి. సాయంత్రం వేళ దవడ కింది భాగం వాస్తుంది. ఉదయానికి తగ్గిపోతుంది. ఎలా నివారించాలి? నట్టల నివారణకు మందుల వాడకం (డీవార్మింగ్) తప్పనిసరి. సంవత్సరానికి 3-4 సార్లు ఈ మందుల్ని క్రమపద్ధతిలో తాగిస్తే నట్టల్ని సమర్ధవంతంగా నిర్మూలించవచ్చు. వర్షాకాలం ప్రారంభంలో, వర్షాకాలం మధ్యలో, వర్షాకాలం తర్వాత... ఈ మందుల్ని తాగించడం మంచిది. మందులు తాగించడానికి ముందు జీవాల పేడను పరీక్ష చేయించాలి. దీనివల్ల గొర్రె లేదా మేకను ఏ రకం నట్టలు ఆశించాయో తెలుస్తుంది. అప్పుడు ఆ నట్టలపై ప్రభావం చూపే మందుల్ని వాడాలి. దీనివల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతేకానీ సహచరులు వాడే మందునో లేదా మందుల షాపు వారు ఇచ్చిన దానినో లేదా పక్క గ్రామంలోని మందలకు వాడుతున్న మందునో తెచ్చి వినియోగించడం వల్ల అంతగా ప్రయోజనం ఉండకపోవచ్చు. సాధారణంగా ఏలిక పాముల నిర్మూలనకు ఫెన్బెండజోల్, లెవిమిసోల్, టెట్రామిసోల్ మందుల్ని వాడతారు. క్లొసంటాల్, ఆక్సిక్లొజనైడ్ మందులు జలగల్ని నిర్మూలిస్తాయి. బద్దె పురుగుల భరతం పట్టడానికి నిక్లోజమైడ్ వంటి మందుల్ని వాడాలి. ప్రయోజనాలెన్నో... జీవాలకు క్రమం తప్పకుండా నట్టల నివారణ మందును ఇస్తే మంద వేగంగా వృద్ధి చెందుతుంది. పెంపకందారులు మంచి ఆదాయం పొందుతారు. ఈ మందుల వల్ల జీవాలు ఆరోగ్యంగా, బలంగా, చురుకుగా ఉంటాయి. వాటిలో వ్యాధి నిరోధక శక్తి అధికమవుతుంది. పాలు, మాంసం, ఉన్ని దిగుబడి పెరుగుతుంది. వాటి నాణ్యత కూడా బాగుంటుంది. జీవాల బరువు సగటున 2-3 కిలోల చొప్పున పెరుగుతుంది. తద్వారా వాటి నుంచి మంచి రాబడి వస్తుంది. జీవాలు త్వరగా ఎదకు వచ్చి ఈనతాయి. ఎక్కువ సంఖ్యలో పిల్లలు పుడతాయి. వాటి బరువు కూడా అధికంగానే ఉంటుంది. గొర్రె పిల్లల్లో, పెద్ద జీవాల్లో మరణాల సంఖ్య బాగా తగ్గుతుంది. ఈ జాగ్రత్తలు అవసరం జీవాల శరీర బరువును దృష్టిలో పెట్టుకొని, తగు మోతాదులో నట్టల నివారణ మందును తాగించాలి. మేకల్లో కంటే గొర్రెల్లో పరాన్నజీవుల బెడద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గొర్రెలకు ఓ క్రమ పద్ధతిలో మందు తాగించాలి. గ్రామంలోని గొర్రెలన్నింటికీ ఒకేసారి సామూహికంగా మందును తాగిస్తే మంచి ఫలితం ఉంటుంది. పెంపకందారులు తాము వినియోగించిన మందు పేరును రాసిపెట్టుకోవాలి. వైద్యుని సిఫార్సు మేరకే మందు వాడాలి కానీ విచక్షణారహితంగా వినియోగించకూడదు. అవసరం లేకపోయినా మందు తాగించినప్పుడు, తగిన మందును ఎంపిక చేయలేనప్పుడు అది సరిగా ప్రభావం చూపదు. కాబట్టి వైద్యుని సూచన మేరకు తగిన మందును ఎంపిక చేసుకోవాలి. - డాక్టర్ సిహెచ్.రమేష్, హైదరాబాద్ ‘డీవార్మింగ్’ను మరవద్దు జీవాల పెంపకందారుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు గొర్రెలు, మేకలకు నట్టల నివారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఇందుకోసం తెలంగాణలో ఈ నెల 30వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు జీవాలకు ఉచితంగా, సామూహికంగా మందులు వేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా జూలై 15వ తేదీ నుంచి 25వ తేదీ వరకు మందులు అందిస్తారు. రెండు రాష్ట్రాలలోని జీవాల పెంపకందారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తమ జీవాలకు మందులు వేయించి, అంతర పరాన్నజీవుల బారి నుంచి వాటిని రక్షించుకోవాలి. -
రైతుల నెత్తిన అకాల పిడుగు
సాక్షి, ముంబై: కొన్నిరోజులుగా రాష్ట్రంలో అక్కడక్కడ ఈదురు గాలులతో కురుస్తున్న అకాల వర్షాల వల్ల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పశువులు కూడా పెద్ద సంఖ్యలో చనిపోయాయి. చేతికొచ్చిన పంటలు, బత్తాయి, మామిడి, ద్రాక్ష తదితర తోటల్లో పండ్లు నేల రాలడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వీటి నుంచి తేరుకోకముందే ధుళే జిల్లాలో శనివారం అర్ధరాత్రి నుంచి చల్లని ఈదురు గాలులతో కురుస్తున్న అకాల వర్షంవల్ల వెయ్యికి పైగా మేకలు, గొర్రెలు మృతి చెందాయి. వాటిపైనే ఆధారపడిన గొర్రెల మంద యజమానులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. దాదాపు రూ.ఐదు లక్షలకుపైగా నష్టపోయామని గొర్రెల యజమానులు బోరుమన్నారు. జిల్లా కలెక్టర్ ప్రకాశ్ మహాజన్‌తోపాటు తహసీల్ధార్ దత్తా శేజ్వాల్ ఘటనాస్థలికి చేరుకుని నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. మేకల కాపరులకు ప్రభుత్వం ద్వారా సాధ్యమైనంత త్వరగా నష్ట పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఖాందేశ్ ప్రాంతంలోని ధుళే, నందూర్బార్ జిల్లా లో గత మూడు రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. అయితే శనివారం రాత్రి వర్ష తీవ్రత ఎక్కువైంది. దీంతో పాచోర్ తాలూకాలో చల్లని గాలులవల్ల ఓ రైతు మృతి చెందాడు. జామ్నేర్ తాలూకాలో పిడుగుపడి ఓ రైతు దుర్మరణం చెం దాడు. నందూర్బార్లో అడవిలోకి మేతకు వెళ్లిన మేకలు, గొర్రెలు చలి కారణంగా కొన్ని మరణిం చగా, మరికొన్ని అస్వస్థతకు గురయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న ప్రజాప్రతినిధులు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సందెట్లో సడేమియా అన్నట్లు రైతులను పరామర్శించేందుకు పెద్ద సంఖ్యలో తరలిరావడం మొదలైంది. ఇదివరకు పత్తాలేకుండా పోయిన ప్రజాప్రతినిధులు అకాల వర్షాల పుణ్యమా అని ఏ గ్రామంలో చూసినా వారి పర్యటనలే కనిపిస్తున్నాయి. నష్టపరిహారం చెల్లించేలా చూస్తామని హామీలు ఇవ్వడం, రైతులను ఓదార్చడం లాంటి దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. ఒకవైపు అకాల వర్షాలు, మరోవైపు ఆకా శం మబ్బులు కమ్ముకుని ఉండడంవల్ల పంటలు, పండ్ల నాణ్యత తగ్గిపోయి గిట్టుబాటు ధర లభిం చదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ద్రాక్ష పంటలకు ప్రసిద్ధి చెందిన నాసిక్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ద్రాక్ష పంట కోతకు వచ్చింది. కానీ చల్లని గాలుల వల్ల ద్రాక్ష చెట్లపైనే కుళ్లిపోయి పూర్తిగా దెబ్బతింటున్నా యి. కనీసం పెట్టుబడైనా తిరిగి వస్తుందా అనే నమ్మకం లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
మూగజీవుల నేస్తం.. ప్రాణం పోసే
మూగజీవాల జబ్బులను పారదోలుతున్న అద్భుతమైన సంప్రదాయ మూలికా వైద్యుని విజయగాథ ఇది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రాంత పల్లెల్లో గొర్రె, మేక, గొడ్డు, గోదున్న రైతులందరికీ పెద్ద రాజన్న పేరు పేదాల మీదే ఆడుతుంది. ప్రాణాంతక వ్యాధి సోకింది.. ఈ పశువు బతకదని పశువైద్యులు తేల్చేసినప్పుడు ‘ఓరె.. పెద రాజన్నకు ఓసారి చూపించు.. చచ్చే బక్కెద్దు కూడా లేచి రంకేస్తుంది’ అంటుంటారు రైతులు. గోళ్ల గ్రామానికి చెందిన పెద్ద రాజన్న పశువైద్యుడిగా అంత పేరొం దాడు. అలాగని పెద రాజన్నకు పశువైద్యంలో పట్టాలేమీ లేవు. మూడో తరగతితో చదువు సరిపెట్టాడు. తాత, ముత్తాతల కాలం నుంచి మూగజీవాలకు ఊపిరిపోస్తున్న కుటుంబంలో పుట్టిన రాజన్న అందుబాటులో ఉన్న వనమూలికలతోనే పశువులకు చికిత్స చేస్తాడు. సంప్రదాయ విజ్ఞానంతో వేలాది పశువులకు ప్రాణంపోస్తున్న రాజన్న సేవలను కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ అనుబంధ సంస్థ నేషనల్ ఇన్నొవేషన్ ఫౌండేషన్(ఎన్ఐఎఫ్) సముచిత రీతిన గుర్తించడంతో ప్రతిష్టాత్మ క రాష్ర్టపతి అవార్డు ఇచ్చింది. పల్లెజనుల జ్ఞానాన్ని నెత్తికెత్తుకునే పల్లెసృజన సంస్థ కృషి ఇందుకు దోహదపడింది. తండ్రి, మామలే స్ఫూర్తి వనమూలికలతో పశువులకు వైద్యం చేసే పెద్ద రాజన్న కళ్యాణదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాల పరిధిలోని వందలాది గ్రామాలకు వెళ్లి సేవలందిస్తున్నాడు. ఆ ప్రాంతంలో మూగజీవాలున్న ప్రతి ఇల్లూ తలచుకునే పెద్ద రాజన్నకు పశువైద్యంలో ఆయన తండ్రి మాదప్ప, మామ కామయ్యలే గురువులు. 30 ఏళ్ల వయసు నుంచి రాజన్న మూగజీవాలకు సేవ చేస్తున్నాడు. 65 ఏళ్లు నిండినా నేటికీ మూగజీవాల సేవలోనే తలమునకలుగా ఉంటాడు. ఒక్కో రోజు వేళకు భోజనం చేసేందుకు కూడా వీలుకానంతగా లీనమైపోతాడు. స్వతహాగా రైతైన రాజన్న సొంత పొలం పనులు కూడా మానుకొని పశువుల సేవలో మునిగిపోతుంటాడు. ఒక్కోసారి దూరప్రాంతాల రైతులు కూడా వచ్చి రాజన్నను తీసుకుపోతారు. అయినా, రాకపోకల ఖర్చులు తప్ప వైద్యం చేసినందుకు రూపాయి కూడా ఆశించడు. శాస్త్రీయమైనది రాజన్న వైద్యం ఈ కాలంలో గచ్చాకు పుచ్చాకుతో రోగాలు కుదురుతాయూ? అని కొట్టి పడేసే వారి నోళ్లను పరీక్షల ఫలితాలు అవాక్కయ్యేలా చేశాయి. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి లాబ్ పరీక్షల్లో రాజన్న మందులోని శాస్త్రీయత రుజువైంది. ఆ తర్వాత దీనికి భారత ప్రభుత్వం పేటెంట్ ఇచ్చింది. ఐరోపా దేశాల్లో పేటెంట్ కోసం ఎన్ఐఎఫ్ దరఖాస్తు చేసిందంటే రాజన్న మందు గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది మార్చిలో రాష్ర్టపతి పురస్కా రంతోపాటు రూ. లక్ష నగదు బహుమతిని రాజన్న అందు కున్నారు. రాజన్న మందులను పోస్టు/ కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు. పొదుగు వ్యాధి మందు ప్యాకెట్ ధర రూ.వంద! వివరాలకు: పల్లెసృజన స్వచ్ఛంద సంస్ధ, 122, వాయుపురి, సైనిక్‌పురి పోస్ట్, సికింద్రాబాద్-500 094. ఫోన్: 040-27111959. జె. శ్రీకర్: 91777 52753 - వంక సోమశేఖర్‌రెడ్డి, న్యూస్‌లైన్ , కళ్యాణదుర్గం, అనంతపురం జిల్లా ప్రాణం ఉన్నంత వరకు సేవ చేస్తా! నోరులేని ప్రాణులు.. రోగాన్ని, బాధను చెప్పుకోలేవు. తండ్రి, మామల వద్ద నేర్చుకున్న విద్యతో 35 ఏళ్లుగా వేలాది పశువులను బతికించాను. ప్రాణం ఉన్నంత వరకు సేవ చేస్తూనే ఉంటా. జబ్బుపడిన పశువు లేచి మేత తినే వరకు ప్రాణం కుదుటపడదు. పశువుకు రోగం కుదిరిందంటే సంతోషపడతాను. నా విద్యను రాష్ర్టపతి గుర్తిస్తారని, బహుమతి ఇస్తారని ఎప్పుడూ అనుకోలేదు. ఢిల్లీ పెద్దల నుంచి అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. - బోయ పెద్ద రాజన్న, గోళ్ల గ్రామం, కళ్యాణదుర్గం మండలం, అనంతపురం జిల్లా ప్రాణాంతక పొదుగు వ్యాధి పరారే! పాడి పశువుకు పొదుగువాపు వ్యాధి వచ్చిందంటే ప్రాణం మీదకొచ్చినట్లేనని భావిస్తుంటారు. ఈ వ్యాధిని నయం చేయడానికి రూ. వెయ్యి ఖరీదైన యాంటీబయాటిక్ ఇంజక్షన్లు కనీసం 3,4 వేస్తుంటారు. అయినా, ఒక్కోసారి పశువు ప్రాణాలూ దక్కక పోవచ్చు. అయితే, రాజన్న ఇచ్చే మూలికల పొడిని నాలుగు పూటలు పొదుగుకు రాస్తే చాలు.. జబ్బు తగ్గిపోతుంది. పొదుగువాపు వ్యాధితో పాటు కట్టువ్యాధి, జబ్జ వాపు, విరేచనాలు, కంటిచూపు దెబ్బతినడం, పాలసార పెంపునకు, కాన్పు చేయడం, విరిగిన అవయవాలకు కట్లు కట్టడంతోపాటు.. చలికుందా, రక్తం కుందా, కుంటికుందా, ఊదా కుందా, ససులవ్యాధి అని స్థానికంగా వాడుకలో ఉన్న వ్యాధులకు కూడా రాజన్న వైద్యం చేస్తాడు. కాళ్లు విరిగిన పశువు రాజన్న వైద్యంతో 15 రోజుల్లో లేచి నడుస్తుంది. కారు చౌకలో ద్రావణ ఎరువు ‘అమృద కైరసాల్’ ప్రసిద్ధ సేంద్రియ వ్యవసాయ శాస్త్రవేత్త దివంగత డా. నమ్మాళ్వార్ పంటల పోషణకు రూపొందించిన చౌకైన ద్రావణ ఎరువు అమృద కైరసాల్. అమృద కైరసాల్ తయారీ పద్ధతి: ఐదు కిలోల ఆవు పేడను తీసుకొని ఒక గోనె సంచిలో వేసుకోవాలి. దానిలో ఐదు కిలోల మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో విరివిరిగా దొరికే తూటుకాడ (తూటేరు /కాంగ్రెస్ కంప /లొట్టపీసు) మొక్క ఆకులు సన్నగా తరిగి వేయాలి. దీనికి పావు కిలో బెల్లం కలిపి సంచిలో ఒక రాయివేసి తాడుతో కట్టి.. 10 లీటర్ల నీరు పోసిన డ్రమ్ములో వేలాడదీయాలి. నీటిలో ఉన్న సంచిని ఓ 20 సార్లు గట్టిగా కదుపుతూ తిప్పాలి. రోజుకు 3 సార్లు చేయాలి. 2 రోజుల్లో అమృద కైరసాల్ సిద్ధమౌతుంది. దీన్ని పది లీటర్ల నీటిలో కలిిపి పిచికారీ చేసుకోవచ్చు/సాగునీటి కాలువలో కలపవచ్చు. పోషణకు, చీడపీడల నివారణకు ‘హెర్బల్ టీ’ అందుబాటులో ఉన్న మొక్కలను ఉపయోగిం చి నమ్మాళ్వార్ కీటక నాశినిని రూపొం దించారు. ఐదు కిలోల పేడను తీసుకొని గోనె సంచిలో వేసుకోవాలి. పేడ ఉన్న సంచిలో వేప, వాయిలి, సీతాఫలం వంటి ఆకులు మరో ఐదు కేజీలు వేసి.. సంచి మునిగేందుకు అందులో ఒకరాయి వేసి.. నీటి తొట్టె లేదా డ్రమ్ములో వేయాలి. రోజుకు మూడు సార్లు కదుపుతూ తిప్పాలి. సంచిలోని పేడ, మొక్కల కషాయం క్రమంగా కరిగి నీటిలో కలుస్తుంది. దీన్ని అన్ని పంటలకు చీడపీడల నివారిణిగా, పోషక ద్రావణంగా ఉపయోగించుకోవచ్చు. -
పశువైద్యం మృగ్యం
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: పశువులకు వైద్యం దూరమవుతోంది. గ్రామాలకు దూరంగా పశువైద్యశాలలు ఉండటంతో ఎక్కువ మంది పశుపోషకులు వాటి వద్దకు తీసుకువెళ్లలేక ఇబ్బంది పడుతున్నారు. కొన్నిచోట్ల వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో అవి మూతపడ్డాయి. వేళలులను కూడా సక్రమంగా పాటించడం లేదు. ప్రతిరోజూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు పశువైద్యశాలలు తెరిచి వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలి. ఎక్కువ శాతం పశువైద్యశాలల్లో వేళలకు మంగళం పాడేస్తున్నారు. నిర్ణీత వేళల్లో వేసిన తలుపులు వేసినట్లే ఉంటున్నాయి. దాంతో అనేక మంది పశుపోషకులు ప్రైవేట్ పశువైద్యులను ఆశ్రయిస్తున్నారు. 172 మంది గోపాలమిత్రులు ఉన్నప్పటికీ కృత్రిమ గర్భధారణ, ప్రాథమిక చికిత్సలకే వారు పరిమితమవుతున్నారు. వేలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన పశువులకు సుస్తీ చేస్తే వాటి పోషకులు వైద్యం అందించేందుకు పడరానిపాట్లు పడుతున్నారు. జిల్లాలో 118 పశువైద్యశాలలు, 103 గ్రామీణ పశువైద్యశాలలు, 9 సహాయ సంచాలకుల పశువైద్యశాలలతోపాటు జిల్లా కేంద్రంలో బహుళార్థ పశువైద్యశాల ఉంది. 9 లక్షల 70 వేల 319 గేదెలు, 74,530 ఆవులు, 14లక్షల 6 వేల 401 గొర్రెలు, 4 లక్షల 6 వేల 260 మేకలు, 9 లక్షల 73 వేల 959 కోళ్లు ఉన్నాయి. వీటన్నింటికీ సకాలంలో వైద్యం అందించాల్సిన బాధ్యత పశుసంవర్థకశాఖపై ఉంది. పశువైద్యశాలలు ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో వైద్యులు, సిబ్బంది లేకపోవడం వల్ల పశువైద్యం దూరమవుతోంది. బుధవారం నిర్వహించిన ‘న్యూస్‌లైన్’ పరిశీలనలో పశుపోషకులు ఎదుర్కొంటున్న సమస్యలు వెలుగులోకి వచ్చాయి. ఒంగోలు నియోజకవర్గ పరిధిలో ఒంగోలు నగరం, ఒంగోలు రూరల్‌తోపాటు కొత్తపట్నం మండలాలున్నాయి. జిల్లా కేంద్రం కావడంతో మెరుగైన వైద్య సేవలు అందుతూనే ఉన్నాయి. ఒంగోలు మండలంలోని సుదూర గ్రామాలకు చెందిన పశువులకు, కొత్తపట్నం మండలంలోని పశువులకు సక్రమంగా వైద్య సేవలు అందడం లేదు. కందుకూరు పరిధిలో పశువులకు గాలికుంటు, బొబ్బ వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. వ్యాక్సిన్ వేసినప్పటికీ వ్యాధులు తగ్గకపోవడంతో వాటిపై ఆధారపడిన పోషకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొన్నిచోట్ల పశువైద్యులు సకాలంలో స్పందించడం లేదని పశుపోషకులు వాపోతున్నారు. కనిగిరి నియోజకవర్గంలో పశువుల సంఖ్య ఎక్కువగా ఉంది. దానికి తగినట్లుగా అక్కడ గతంలో సేవలు అందించినప్పటికీ ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదు. పశువుల, గొర్రెల మార్కెట్ యార్డులు గతంలో ఉంటే ప్రస్తుతం వాటి ఆచూకీ లేకుండా పోయింది. సంచార పశువైద్యశాల సేవలు నిలిచిపోయాయి. సీఎస్‌పురం మండలం నల్లమడుగుల ఉప పశువైద్యశాల వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో మూతపడింది. మార్కాపురం పరిధిలో పశువైద్య సేవలు నామమాత్రంగా అందుతున్నాయి. తర్లుపాడు మండలం తాడివారిపల్లి గ్రామంలోని పశువైద్యశాల మూతపడింది. మీర్జాపేట, తుమ్మలచెరువుల్లో సిబ్బంది లేకపోవడంతో ఎప్పుడు తెరుస్తారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. తర్లుపాడుకు చెందిన పశువైద్యుడు అప్పుడప్పుడూ వచ్చి వెళుతుండటంతో పశు పోషకులు పెదవి విరుస్తున్నారు. యర్రగొండపాలెం పరిధిలో పశువులకు సంబంధించి మందులున్నప్పటికీ వ్యాక్సిన్ సకాలంలో రావడం లేదు. తొలకరి వర్షాలకు ముందు పశువులకు వ్యాక్సిన్ వేయాల్సి ఉన్నా వర్షాలు పడిన తరువాత వేయడం వల్ల వ్యాధులు వ్యాప్తి చెందుతూనే ఉన్నాయి. పుల్లలచెరువులో పశువైద్యుడు ఒక్కరే ఉన్నారు. సిబ్బంది లేరు. సంతనూతలపాడు పరిధిలో పశువులకు వైద్య సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. చీమకుర్తిలోని పశువైద్యశాల నాలుగు సెంట్ల స్థలంలో నిర్వహిస్తున్నారు. ఆ స్థలంలోని గది నిండా దాణా, మందులతో నిండిపోతుంది. వర్షం వస్తే వాటిని కాపాడుకోలేక ఇబ్బంది పడుతున్నారు. కొండపి పరిధిలోని పశువైద్యుల్లో ఎక్కువ మంది ఒంగోలు నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. కొండపిలో పశువైద్యశాలకు భవనం లేకపోవడంతో పాల కేంద్రంలో నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. పొన్నలూరులో 50 గ్రామాలకు ఒక్క పశువైద్యశాల ఉంది. 25 కిలోమీటర్ల నుంచి పశువులను తీసుకురావడం కష్టతరంగా మారింది. అద్దంకి పరిధిలో పశువైద్యశాలలు పశువులకు అందుబాటులో ఉండటం లేదు. అద్దంకి మండలంలోని బొమ్మనంపాడు పశువైద్యశాల 26 గ్రామాల పరిధిలోని పశుపోషకులు ఉపయోగించుకోవలసి వస్తోంది. వైద్యులు, సిబ్బంది తగిన సంఖ్యలో లేకపోవడంతో బల్లికురవ, కొరిశపాడుల్లో ఎక్కువగా మూతపడే ఉంటున్నాయి. చీరాల పరిధిలో పశువైద్యం అంతంత మాత్రంగానే ఉంది. గవినివారిపాలెం పంచాయతీ పరిధిలో ఉచితంగా అందించాల్సిన దాణాను అక్కడివారు విక్రయించుకుంటున్నారని పశుపోషకులు బాహాటంగా ఫిర్యాదు చేస్తున్నారు. మందులను కూడా ప్రైవేట్ మెడికల్ షాపుల్లో విక్రయిస్తున్నారు. దాంతో ఎక్కువ మంది మందులు బయట మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. పర్చూరు పరిధిలో పశువైద్యం అంతంత మాత్రంగానే అందుతోంది. నూతలపాడు, చెరుకూరు, వీరన్నపాలెం గ్రామాల్లో పశువైద్యశాలలు ఉన్నప్పటికీ సకాలంలో వాటిని తెరవడం లేదు. పర్చూరులో పశువైద్యశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ఏ క్షణంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని సిబ్బంది, పశుపోషకులు ఆందోళన చెందుతున్నారు. దర్శి పరిధిలో పశువైద్యం సక్రమంగా అందడం లేదు. కురిచేడులో 54 వేల వరకు పశువులు ఉంటే ఒక్క పశువైద్యశాల ఉంది. దాంతో ఎక్కువ మంది పశుపోషకులు వాటికి వైద్యం చేయించలేకపోతున్నారు. వ్యాధుల బారిన పడిన సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దొనకొండలో కూడా వైద్య సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. గిద్దలూరు నియోజకవర్గ పరిధిలో పశువైద్య సేవలు అందించాలంటే వాటి పోషకులకు భారంగా మారింది. అర్ధవీడు మండలం వెలగలపాయలోయ గ్రామంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇక్కడి వైద్యశాల 15 కిలోమీటర్ల దూరంలో ఉండటం, మండల కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో పశుపోషకులు ఇబ్బంది పడుతున్నారు. -
మూగజీవాల మృత్యువాత
గసి బొరుగులు తిని 450గొర్రెలు మృతి, రూ.22.50 లక్షల నష్టం సాక్షి, అనంతపురం: గసి బొరుగులు (మరమరాల తయారీలోని వ్యర్థాలు) తిని 450 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. సుమారు రూ.22.50 లక్షల నష్టం వాటిల్లింది. సోమవారం అనంతపురంలో ఈ దారుణం చోటుచేసుకుంది. బుక్కరాయ సముద్రం ప్రాంతానికి చెందిన అన్నదమ్ములు పెద్ద కొండన్న, చిన్న కొండన్న, రామాంజనేయులుకు 600 గొర్రెలున్నాయి. స్వగ్రామంలో మేత లేకపోవడంతో గొర్రెలను అనంతపురానికి తోలుకొచ్చారు. ఆదివారం రోడ్డు పక్కన పడేసిన గసి బొరుగులను తిన్న గొర్రెలు అస్వస్థతకు గురయ్యాయి. అధిక మోతాదులో గసిని తినడంవల్ల గ్యాస్ అధికంగా తయారై గొర్రెలు మృత్యువాతపడినట్లు పశువైద్యులు గుర్తించారు. -
కలుషిత ఆహారం తిని 300 గొర్రెల మృతి
-
మంచినీటిలో విషం.. విద్యార్థులకు తప్పిన అపాయం
చేగుంట, న్యూస్‌లైన్: పాఠశాల వద్ద ఉన్న కుక్కలను చంపాలని భావించిన ఓ ప్రబుద్ధుడు... విద్యార్థులు తాగే నీటిలో విషం కలిపాడు. ముందుగానే ఆ విషయం బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన శనివారం మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లిలో కలకలం రేపింది. వివరాలివీ...రెడ్డిపల్లి పాఠశాలలో విద్యార్థుల కోసం ఓ నీటి డబ్బాను ఏర్పాటు చేశారు. శనివారం ఆ డబ్బాలోని నీటిలో ఏదో కలిసినట్టు గుర్తించిన విద్యార్థులు ప్రధానోపాధ్యాయురాలు విజయ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వచ్చి వివరాలు సేకరించారు. ఉదయం ఏగొండ అనే వ్యక్తి పాఠశాల ఆవరణలో కన్పించినట్టు స్థానికులు తెలుపడంతో అతణ్ణి విచారించారు. రెండు రోజుల క్రితం తన గొర్రెను పాఠశాల సమీపంలోని కుక్కలు చంపేశాయని, వాటిని హతమార్చాలనే నీటిలో విషం కలిపినట్లు అంగీకరించాడు. నీటి నమూనాతోపాటు ఆవరణలో లభించిన విష రసాయనం గల చిన్న సీసాను స్వాధీనం చేసుకున్న పోలీసులు దానిని ల్యాబ్‌కు పంపించారు. చిన్నారులకు ప్రమాదం తప్పినందుకు గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఉన్నతస్థాయి విచారణ జరిపించాలి:బాలల హక్కుల సంఘం సాక్షి, హైదరాబాద్: రెడ్డిపల్లి ఘటన పై ఉన్నతస్థాయి విచారణ జరపాలని బాలల హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అచ్యుతరావు శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ ఘటన ప్రభుత్వవర్గాల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలుస్తోందని ధ్వజమెత్తారు. -
ఇక మాంసం మంట!
న్యూఢిల్లీ: ఆహార పదార్థాల ధరలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. ఇది వరకే భారీగా ఉన్న ఉల్లి ధరలతో తిప్పలు పడుతున్న దిల్లీవాలాలు మాంసానికి కూడా దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మటన్ ధర రూ.30 వరకు పెరగడంతో కిలో ధర రూ.400 దాకా పలుకుతోంది. అయితే వీటి ధరలు ఎందుకు పెరుగుతున్నాయో ఎవరూ చెప్పలేకపోతున్నారు. చికెన్ ధరలు కూడా పెరిగాయని వ్యాపారులు తెలిపారు. నవరాత్రి తరువాత ఇతర రాష్ట్రాల కోళ్లు, గొర్రెల సరఫరాలు పెరగడం వల్ల గత వారం నుంచి వీటి టోకు ధరల్లో పెద్దగా మార్పులు కనిపించడం లేదని ఘాజీపూర్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. చాలా మంది అమ్మకందారులు మటన్ సరఫరాలు తగ్గడం వల్లే వాటి ధరలు పెంచాల్సి వచ్చిందని అంటున్నారు. అలకనంద ప్రాంత వ్యాపారి ఒకరు మాత్రం అసలు విషయం చెప్పాడు. తన పక్క దుకాణదారుడు ధరలు పెంచడాన్ని గమనించి తానూ అదే బాట పట్టానని అంగీకరించాడు. పత్పర్గంజ్లో గత వారం కిలో మటన్‌ను రూ.360కి అమ్మిన ఓ దుకాణదారుడు ఈవారం దానిని రూ.380కి పెంచాడు. ‘ఈద్, దసరా వల్ల మాంసానికి కొరత ఏర్పడింది. హర్యానా, పంజాబ్, రాజస్థాన్ నుంచి కూడా సరఫరాలు తగ్గిపోయాయి. వచ్చే వారం నుంచి ధరలు తగ్గిపోవచ్చు’ అని అతడు వివరించాడు. వసంత్‌కుంజ్, సీఆర్ పార్క్ ప్రాంతాల్లో అయితే కిలో మటన్‌కు రూ.400 పెట్టాల్సిందేనని స్థానికులు చెబుతున్నారు. అధిక ధరలకు సరఫరాలు తగ్గడమే కారణమని వ్యాపారులు అంటుండగా, లజ్‌పత్‌నగర్‌లోని ఓ దుకాణదారుడు మాత్రం సరఫరాలు పెరిగాయని, అందుకే తాము ధరలు తగ్గించామని తెలిపాడు. రూ.400 కిలో పలికిన మటన్‌ను తాము రూ.380కే అమ్ముతున్నామని చెప్పాడు. చికెన్ టోకు ధరలు తక్కువగానే ఉన్నందున వాటి ధరలు పెరిగే అవకాశమే లేదని ఘాజీపూర్ మండీ చైర్మన్ రియాసత్ అలీ అన్నారు. ఈ మండీలో శనివారం కోడిధర రూ.48-62 వరకు పలికింది. సరఫరాలో కొరత ఏమీ లేదని శనివారం కూడా 160 ట్రక్కుల్లో కోళ్లు వచ్చాయని అధికారులు తెలిపారు. -
‘క్రిస్‌గేల్’ మేక.. 2 లక్షల పొట్టేలు!!
నల్లగా నిగనిగలాడిపోతున్న ఈ మేకను చూశారా? దీనిపేరు క్రిస్ గేల్!! బరువు సుమారు 100 కిలోలు. రాజస్థాన్ నుంచి దిగుమతి అయిన దీని ధర రూ.90 వేలు. ఇక తెల్లగా తళతళలాడిపోతున్న పొట్టేలు బరువు 160 కిలోలు. దాని ధర అక్షరాలా 2 లక్షల రూపాయలు. వయసు మూడేళ్ల్లు. బక్రీద్‌ను పురస్కరించుకొని ముషీరాబాద్ ఏక్‌మినార్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ రహీమ్ పంజాబ్ నుంచి దీన్ని తీసుకొచ్చారు. కాగా, బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులు, సోదరీమణులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి, దైవత్వానికి ప్రతీక అయిన బక్రీద్‌ను ముస్లీంలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని ఆయన పేర్కొన్నారు. -
రాష్ట్రంలో లక్ష గొర్రెల మృత్యువాత
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: ‘‘ఈ సీజన్లో గొర్రెలు, మేకలకు ఎక్కువగా వ్యాధులు వస్తుంటాయి. కీలకమైన ఈ సమయంలో సమైక్యాంధ్ర సాధన కోసం పశువైద్యుల నుంచి పారా మెడికల్ సిబ్బంది వరకు సమ్మెబాట పట్టారు. సమ్మెకు దిగిన కాలంలో రాష్ట్రంలో లక్ష గొర్రెలు మరణించాయి. ఒక్క సీమాంధ్రలోనే 75 శాతం మృత్యువాతకు గురయ్యాయి. గొర్రెలు మరణిస్తుండటంతో వాటిపై ఆధారపడిన పెంపకందారులు తీవ్రంగా నష్టపోతున్నారు. పశువైద్యులను సమ్మె నుంచి మినహాయింపు ఇచ్చేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని’ ఆంధ్రప్రదేశ్ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ జమలయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం ఒంగోలు వచ్చిన సందర్భంగా స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సీజన్లో గొర్రెలు, మేకలకు గాలికుంటు, ఆంత్రాక్స్, నీలినాలుక, గిట్టపుండు వ్యాధులు వస్తాయన్నారు. నీలినాలుక, గిట్టపుండు వ్యాధులకు వ్యాక్సిన్ లేదన్నారు. గాలికుంటు వ్యాధికి వ్యాక్సిన్ ఉన్నప్పటికీ పై రెండు వ్యాధులను నియంత్రించలేరన్నారు. గొర్రెలు, మేకలు మృత్యువాత పడుతుండటంతో వాటిపై ఆధారపడిన పెంపకందారులు రోడ్డున పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పశువైద్యులు మానవతా దృక్పథంతో సేవలు అందించాలని కోరారు. నియోజకవర్గానికి ఒక మొబైల్ వ్యాన్ ఏర్పాటుచేసి పశువైద్యం అందించాలని సూచించారు. ప్రైవేట్ మందులకు రూ. 400 కోట్లు ఖర్చు గొర్రెలు, మేకలకు సంబంధించి ప్రభుత్వం అందించే మందుల్లో నాణ్యత లోపిస్తోందని జమలయ్య ఆరోపించారు. నాణ్యమైన నట్టల నివారణ మందు అందిస్తే కొన్నిరకాల వ్యాధులను నియంత్రించవచ్చన్నారు. రాష్ట్రంలో 8 లక్షల మంది పెంపకందారులున్నారని, ఒక్కో పెంపకందారుడు ఏటా 5 నుంచి 10 వేల రూపాయల మందులు కొనుగోలు చేస్తున్నారని, ఏడాదికి దాదాపు రూ. 400 కోట్లు వెచ్చిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం సరఫరా చేసే కొన్నిరకాల మందులు ప్రైవేట్ మెడికల్ షాపుల్లో విక్రయిస్తున్నారని, వాటిని ఔషధ నియంత్రణ అధికారులు అడ్డుకున్న దాఖలాలు లేవన్నారు. గొర్రెలు, మేకల పెంపకందారులకు ఈ ఏడాది రూ. 470 కోట్ల రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొందన్నారు. ఆరునెలలు గడుస్తున్నా ఇంతవరకు ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదన్నారు. నిధులు ఖర్చు చేయకుంటే క్రిమినల్ కేసులు పెట్టాలని ఆర్థిక శాఖ నిర్ణయించిందని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెంపకందారుల సమస్యలపై గ్రామ స్థాయి నుంచి వివరాలు సేకరించి వాటిని పరిష్కరించాలని కోరుతూ నవంబర్‌లో అసెంబ్లీని ముట్టడించనున్నట్లు జమలయ్య వెల్లడించారు. విలేకరుల సమావేశంలో గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం జిల్లా కార్యదర్శి మొనపాటి రామకృష్ణ, సహాయ కార్యదర్శి తోట తిరుపతిరావు, లీగల్ అడ్వయిజర్ కే పిచ్చయ్య పాల్గొన్నారు. -
మూగజీవాలు విలవిల
మానవపాడు, న్యూస్‌లైన్: గొర్రెలు వింతరోగాలతో విలవిల్లాడుతున్నాయి. పడుకున్న చోటే పడుకున్న ట్లు మృత్యువాతపడుతున్నాయి. గత రెం డురోజుల్లోనే 323 గొర్రెలు మృతిచెం దా యి. తాజాగా శనివారం గట్టు మం డలం మాచర్ల గ్రామంలో 100 గొర్రెలు చనిపోయాయి. మండలంలోని బోరవెల్లి గ్రా మంలో 30 మంది కాపరులు గోత కో సం గొర్రెల మందను పొలానికి తీసుకెళ్లా రు. ఉన్నట్టుండి ఒక్కొక్కటిగా కుప్పకూలి పోయాయి. ఈ విషయాన్ని స్థానిక పశుసంవర్ధకశాఖ అధికారులకు చెప్పినా ప ట్టించుకోలేదు. వైద్యం అందకపోవడం తో అవే గొర్రెలు మరణించాయి. నీలినాలుక, గాలికుంటు వ్యాధితోనే సుమారు రెండొందల గొర్రెలు చనిపోయినట్లు పశువైద్యాధికారి శంకరయ్య తెలిపారు. గత వారంరోజులుగా కురిసిన వర్షాలకు ఇ లాంటి రోగాలు దోమల నుంచి ప్రబలుతాయని, ఒక గొర్రెకు వచ్చిన రెండుగంటల కాల వ్యవధిలోనే మరో గొర్రెకు వ్యా ప్తిచెందే అవకాశం ఉందని తెలిపారు. బో రవెల్లి గ్రామంలో రాజుకు 200 గొర్రెలు ఉండగా, అందులో 42 గొర్రెలు చనిపోయాయి. శ్రీను అనే కాపరికి ఉన్న 65 గొ ర్రెల్లో 16, పెద్దవెంకటన్నకు 150 గొర్రెలు ఉండగా, అందులో 26, బిచ్చన్నకు చెం దిన 160 గొర్రెల్లో 20, భాగ్యమ్మ చెందిన 125 గొర్రెల్లో 13, లక్ష్మీదేవి 200 గొర్రెలకు 30, రాముడు 120 గొర్రెల్లో 18, ఊ రుకుందా గొర్రెల మందలో 35, నడిపి మనెన్న మందలో 22, చిన్న గంగన్న మందలో 12, పరమేష్ మందలో 8 గొర్రెలకు చనిపోయాయి. దాదాపు 3300 గొర్రెల్లో సుమారు 230 గొర్రె లు చనిపోయాయి. మరో 250 గొర్రెలు అస్వస్థతకు గురయ్యాయి. గట్టు మండలంలో.. గట్టు : వింతరోగాల తో మూగజీవాలు వి లవిల్లాడుతున్నాయి. అంతుచిక్కని వ్యా ధితో మండలంలోని మాచర్ల గ్రామంలో శనివారం ఒకేరోజు 100 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. దీంతో యజమానుల తీ వ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాని కి చెందిన కుర్వ దేవప్పకు చెందిన 30, కు ర్వ చిన్న నర్సప్పకు చెందిన 20, కుర్వ తి మ్మప్పకు చెందిన 15, కుర్వ భీమన్నకు చెందిన 10, కుర్వ వీరన్నకు చెందిన 20, కుర్వ నడిపి నర్సప్పకు చెందిన మరో 20 గొర్రెలను ఎప్పటిలాగే మేతకు తీసుకెళ్లా రు. శుక్రవారం రాత్రి దొడ్డిలో గొర్రెలు ఉ న్నవి ఉన్నట్టుగానే కనుమూశాయి. దీం తో తాము తీవ్రంగా నష్టపోయినట్లు బా ధితులు వాపోయారు. పశుసంవర్ధకశాఖ అధికారులు స్పందించి పరిహారం అందజేసి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. నెలరోజుల్లో 20వేలకు పైగా.. మహబూబ్‌నగర్ వ్యవసాయం: గిట్టుపుం డు, నీలినాలుక వ్యాధులతో నెలరోజుల్లో నే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 20వేలకు పైగా గొర్రెలు మృత్యువాతపడ్డాయి. వి స్తారంగా వర్షాలు కురుస్తుండటం, వ్యా ధుల సీజన్ అని తెలిసినా పశుసంవర్ధకశాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతోనే మూగజీవాలు మృత్యువాతపడుతున్నాయని కాపరులు వాపోతున్నారు. జిల్లాలో ఎక్కువగా నారాయణపేట్, మరికల్, పెబ్బేర్, కొల్లాపూర్, బాలానగర్, భూత్పూర్, తాడూర్, తెల్కపల్లి, మహబూబ్‌నగర్ తదితర మండలాల్లో గొర్రెలు అధికంగా ఉన్నాయి. జిల్లాలో దాదాపు 50లక్షల గొర్రెలు ఉండగా, వీటిపెంపకపై సుమారు 20 వేల కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. గొర్రెలు వ్యాధులబారినపడి మృత్యువాతపడుతుండటంతో చాలా కుటుంబాలు తీవ్ర ఆందోళనలో పడ్డాయి.