
సాక్షి, హైదరాబాద్ : గొల్ల, కుర్మ కులాలతో పాటు కుర్వ, కురువ కులాలకు సైతం గొర్రెల పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు బుధవారం కుర్వ, కురవ కులాలను లబ్దిదారుల జాబితాలో చేర్చుతూ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు.