భారీ వర్షానికి 80 గొర్రెలు మృతి
భారీ వర్షానికి 80 గొర్రెలు మృతి
Published Mon, May 15 2017 9:27 PM | Last Updated on Tue, Sep 5 2017 11:13 AM
హాలహర్వి: భారీ వర్షానికి 80 గొర్రెలు మృతి చెందిన ఘటన కామినహాల్ గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా కిష్టిపాడుకు చెందిన గొర్రెల కాపరులు 210 గొర్రెలను కామినహాల్ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న పొలంలో ఆదివారం రాత్రి నిలిపారు. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి సమీపంలో కాల్వకు నీళ్లు రావడం, అదే సమయంలో గొర్రెలు నిలిపిన ప్రాంతానికి పక్కనే పిడుగు పడటంతో గొర్రెలు పరుగులు తీసి కాల్వ వైపు వెళ్లి నీటిలో పడ్డాయి. దీంతో 80 గొర్రెలు మృతి చెందాయి. ఈ ప్రమాదంలో దాదాపు రూ.6 లక్షల వరకు నష్టం వాటిల్లిందని గొర్రెల కాపరులు పేర్కొన్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. విషయం తెలుసుకున్న హాలహర్వి తహసీల్దార్ రామసుబ్బయ్య సంఘటన స్థలానికి చేరుకుని మృతి చెందిన గొర్రెలను పరిశీలించారు. గొర్రెలు మృతిచెందడానికి కారణాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు.
Advertisement