
హైదరాబాద్, సాక్షి: నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సోమవారం మధ్యాహ్నాం నుంచి పలు చోట్ల కుండపోత వాన కురుస్తోంది. కూకట్‌పల్లి, మియాపూర్, జీడిమెట్ల, చందానగర్, రాయదుర్గం, మదీనాగూడ.. తదితర ప్రాంతాల్లో భారీగా వాన పడింది.
ద్రోణి ప్రభావంతో గత నాలుగు రోజులుగా తెలంగాణలోని పలు జిల్లాలో వానలు కురుస్తున్న సంగతి తెలిసిందే. పలు చోట్ల వడగండ్ల వాన కురవడంతో విపరీతమైన పంట నష్టమూ వాటిల్లింది. మరోవైపు సాయంత్రంలోపు నగరంలోని మరిన్ని ప్రాంతాలకు వాన విస్తరించవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది.
@balaji25_t @Hyderabadrains Unexpected sudden downpour as I stepped out near Sanghamitra school Nizampet rd pic.twitter.com/rcEGHBrocH
— Anupama (@Anupama97882988) March 24, 2025
Comments
Please login to add a commentAdd a comment