weather forecast
-
14 రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరిక
న్యూఢిల్లీ: దేశంలోని పలు ప్రాంతాల్లో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల చలి వాతావరణం నెలకొనగా, మరికొన్ని చోట్ల వర్షం కురుస్తోంది. కోస్తాంధ్రలో బలమైన గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని, పలు రాష్ట్రాల్లో పొగమంచు ఆవరించే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రాబోయే వారంలో దేశంలోని 14 రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతోందో తెలియజేసింది.ఐఎండీ అందించిన వివరాల ప్రకారం నవంబర్ 25న నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతం శ్రీలంక తీరం వెంబడి 45 నుంచి 55 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. నవంబర్ 26న తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్, నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నవంబర్ 27,28 తేదీల్లో గంటకు 50 నుంచి 60 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతం, ఆ పక్కనే ఉన్న తూర్పు భూమధ్యరేఖ హిందూ మహాసముద్రంపై అల్పపీడనం ఏర్పడింది. నవంబర్ 25-29 మధ్య తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. నవంబర్ 27-28 తేదీలలో కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. నవంబర్ 25న మత్స్యకారులు సముద్రతీరానికి వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది.పలు రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉంది. పంజాబ్, హర్యానా, చండీగఢ్‌లోని వివిధ ప్రాంతాలలో నవంబర్ 27 నుంచి 29 వరకు, హిమాచల్ ప్రదేశ్‌లో నవంబర్ 25 నుంచి 28 వరకు, ఉత్తరప్రదేశ్‌లో నవంబర్ 28 నుంచి 30 ఉదయం వరకు పొగమంచు కురియనుంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, యూపీ, రాజస్థాన్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్, నికోబార్ దీవుల్లో చలిగాలులు వీస్తున్నాయి. ఇది కూడా చదవండి: Jharkhand: ఇలా గెలిచి.. అలా రాజీనామాకు సిద్ధమై.. ఏజేఎస్‌యూలో విచిత్ర పరిణామం -
తెలంగాణలో దంచికొట్టనున్న వానలు.. హైదరాబాద్‌కు కుంభవృష్టి హెచ్చరిక!
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు కురవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. వర్షాలు పడే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. కొన్నిచోట్ల మాత్రం ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే.. రాజధాని హైదరాబాద్ నగరంలో కుంభవృష్టి తప్పదని హెచ్చరిస్తూ యెల్లో అలర్ట్ జారీ చేసింది. వాతావరణ కేంద్రం హెచ్చరికలతో అధికార యంత్రాంగం వరుణ గండాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే.. పశ్చిమ విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఆవర్తనం ఏర్పడిందని వాతావరణకేంద్రం తన ప్రకటనలో స్పష్టం చేసింది.నాలుగు రోజులు ఇలా.. 🌧️గురువారం(నేడు) ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్ సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నాయి.🌧️శుక్రవారం రోజున ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడే ఛాన్స్ ఉంది. 🌧️19, 20న తేదీల్లోనూ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది. 🌧️వాతావరణ శాఖ అంచనాల ప్రకారమే.. బుధవారం కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, నిజామాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదైంది. -
తెలంగాణ:నేడు, రేపు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: వేసవి తాపం నుంచి కాస్త చల్లబడ్డ రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సౌరాష్ట్ర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. మధ్య మహారాష్ట్ర, ఉత్తర లోతట్టు కర్ణాటక మీదుగా దక్షిణ కర్ణాటకకు విస్తరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సూర్యాపేట్, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. సోమవారం నుంచి రాష్ట్రంలో పొడివాతావరణం ఉంటుందని వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం, కొన్నిప్రాంతాల్లో అంతకంటే తక్కువగా నమోదవుతున్నాయి. కాగా, సోమవారం నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. శుక్రవారం రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. నల్లగొండలో గరిష్ట ఉష్ణోగ్రత 40.0 డిగ్రీల సెల్సియస్, అలాగే ఆదిలాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 21.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. శుక్రవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 1 నుంచి 3 డిగ్రీల మేర తక్కువగా నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. -
IPL 2024: చెన్నై, ఆర్సీబీ మ్యాచ్‌కు ముందు వాతావరణం, పిచ్ వివరాలు
ఐపీఎల్ 2024 సీజన్ తొలి మ్యాచ్ ఇవాళ (మార్చి 22) జరుగనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఫైవ్ టైమ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే), ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది. అక్షయ్ కుమార్, ఏఆర్ రెహ్మాన్లచే ప్రత్యేక కార్యక్రమం.. మ్యాచ్‌కు ముందు సీజన్ ఆరంభ వేడుకలు జరుగనున్నాయి. సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఈవెంట్లో బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, సంగీత మాంత్రికుడు ఎఆర్ రెహ్మాన్, సింగర్ సోనూ నిగమ్ పెర్ఫార్మ్ చేయనున్నారు. సీఎస్కే నూతన కెప్టెన్‌గా రుతురాజ్.. లీగ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. నూతన కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్‌ను ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించింది. మాజీ కెప్టెన్ ధోని స్వచ్ఛందంగా కెప్టెన్సీ నుంచి తప్పుకుని రుతురాజ్‌కు బాధ్యతలు అప్పజెప్పాడు. వాతావరణం ఎలా ఉందంటే.. సీఎస్కే, ఆర్సీబీ మ్యాచ్‌కు వేదిక అయిన చెన్నైలో వాతావరణం ఆటకు ఆనువుగా ఉంది. వాతావరణం నుంచి మ్యాచ్‌కు ఎలాంటి అవాంతరాలు సంభవించవు. చెన్నైలోని కొన్ని ప్రాంతాల్లో గురువారం రాత్రి తేలికపాటి వర్షం పడినప్పటికీ.. ఇవాళ మ్యాచ్ జరిగే సమయంలో (7-11 గంటల మధ్యలో) వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. మ్యాచ్ వేలల్లో ఉష్ణోగ్రతలు 30, 31 డిగ్రీల మధ్యలో ఉండే అవకాశం ఉంది. వర్షం నుంచి ఎలాంటి ముప్పు లేదు. పిచ్ ఎవరికి అనుకూలం.. చెపాక్ పిచ్ బ్యాటింగ్, బౌలింగ్ రెండిటికీ అనుకూలిస్తుందని చెప్పాలి. తొలుత బ్యాటర్లకు స్వర్గధామంగా కనిపించే ఈ పిచ్ క్రమంగా స్నిన్‌కు అనుకూలిస్తూ బౌలర్ ఫ్రెండ్లీగా మారుతుంది. ఈ పిచ్‌పై ఛేదన కాస్త కష్టంగానే ఉంటుంది. తొలుత బ్యాటింగ్ చేసే జట్టుకే విజయావకాశాలు అధికంగా ఉంటాయి. రాత్రి వేళలో తేమ శాతం అధికమైతే స్పిన్నర్లు చెలరేగే అవకాశం ఉంటుంది. హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఐదు సార్లు ఛాంపియన్ అయిన సూపర్ కింగ్స్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఘనమైన రికార్డు ఉంది. ఈ ఇరు జట్లు ఐపీఎల్లో 31 సార్లు ఎదురెదురుపడగా.. సీఎస్కే 20, ఆర్సీబీ 10 సందర్భాల్లో విజయం సాధించాయి. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. చెపాక్ విషయానికొస్తే.. ఆర్సీబీపై సీఎస్కే సంపూర్ణ ఆధిపత్యం కలిగి ఉంది. ఇక్కడ ఇరు జట్లు 8 మ్యాచ్‌ల్లో తలపడగా.. సీఎస్కే ఏకంగా ఏడు మ్యాచ్‌ల్లో జయకేతనం ఎగురవేసింది. కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఆర్సీబీ విజయం సాధించింది. అది కూడా లీగ్ ప్రారంభ ఎడిషన్ అయిన 2008లో. నాటి నుంచి ఇప్పటివరకు ఆర్సీబీ సీఎస్కేపై చెపాక్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేదు. తుది జట్లు (అంచనా).. సీఎస్కే: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్‌కీపర్), శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ, ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదార్, కెమరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్ (వికెట్‌కీపర్), అనూజ్ రావత్, అల్జరీ జోసఫ్, సిరాజ్, కర్ణ్ శర్మ, ఆకాశ్‌దీప్ -
జీ20 సదస్సు.. ప్రత్యేకంగా వాతావరణ కేంద్రం.. ఇంకా ఎన్నో!
జై సియా రాం భారత మూలాలున్న బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, అక్షతా మూర్తి దంపతులకు శుక్రవారం ఉదయం పాలం విమానాశ్రయంలో.. కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ చౌబే జై సియా రాం(జై శ్రీరాం) అంటూ స్వాగతం పలికారు. వారికి మంత్రి చౌబే రుద్రాక్షను, భగవద్గీత, హనుమాన్ చాలీసా ప్రతులను కానుకలుగా అందజేశారు. వ్యాపారవేత్తలకు ఆహ్వానాల్లేవ్.. జీ20 ప్రత్యేక విందు కార్యక్రమానికి వ్యాపార దిగ్గజాలకు ఆహ్వానాలు వెళ్లాయన్న వార్తలపై కేంద్రం స్పందించింది. జీ20 స్పెషల్ డిన్నర్‌కు రావాలంటూ వ్యాపారవేత్తలను ఆహ్వానించలేదని స్పష్టం చేసింది. శనివారం జరిగే విందుకు బిలియనీర్లు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి 500 మందికి పైగా వ్యాపారవేత్తలు హాజరవనున్నారంటూ వస్తున్న వార్తలను తప్పుదోవపట్టించేవిగా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. వాణిజ్యవేత్తలెవరినీ ఆహ్వానించలేదని తెలిపింది. యూపీఐని పరిచయం చేసేందుకు.. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘డిజిటల్ ఇండియా’ కార్యక్రమంపై జీ20 ప్రతినిధులకు ప్రత్యక్ష అనుభవం కల్పించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంది. విదేశీ ప్రతినిధులు ఢిల్లీలో ఉండగా జరిపే కొనుగోళ్లకు గాను యూపీఐ(యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) ద్వారా చెల్లింపులపై ఆసక్తి కల్పించేందుకు చర్యలు తీసుకుంది. దేశీయంగా రూపకల్పన చేసిన ఈ విధానంలో చెల్లింపులు ఎంత సులువో వారికి తెలియజేయడమే ఉద్దేశం. ఇందులోభాగంగా సుమారు వెయ్యి మంది విదేశీ ప్రతినిధుల ఫోన్ వ్యాలెట్లలో రూ.500 నుంచి రూ.1000 వరకు బ్యాలెన్స్ జమ చేయనుంది. ఇందుకోసం రూ.10 లక్షల వరకు ప్రత్యేకించింది. ప్రత్యేకంగా వాతావరణ కేంద్రం జీ20 సమావేశాలు జరిగే ప్రగతి మైదాన్‌కు సమీపంలో భారత వాతావరణ విభాగం(ఐఎండీ) అదనంగా ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ప్రపంచ నేతలు పాల్గొంటున్న కార్యక్రమం అయినందున ఈ వాతావరణ కేంద్రం ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలు చేస్తుంది. గురువారం నుంచి ఆదివారం వరకు ఇది నిర్విరామంగా వాతావరణాన్ని పరిశీలిస్తుంటుంది. ఐఎండీకి చెందిన వెబ్‌పేజీ mausam.imd.gov.in/g20 ద్వారా వాతావరణ సూచనల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. చదవండి: G20 Summit: బైడెన్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు స్ట్రీట్ ఫుడ్, మిల్లెట్స్‌తో ప్రత్యేక మెనూ భారత్‌లో ఈ సీజన్లో ప్రజలు ఎక్కువగా ఇష్టపడే వంటకాలతో ప్రత్యేకంగా మెనూ సిద్ధమైంది. భారతీయ స్ట్రీట్ ఫుడ్ ఐటమ్స్‌తోపాటు మిల్లెట్లతో చేసిన ఆహార పదార్థాలకు ఇందులో స్థానం కల్పించారు. ఇంకా గులాబ్ జామ్, రసమలై, జిలేబీ వంటి స్వీట్లు కూడా అతిథులకు వడ్డిస్తారు. వడ్డించే సిబ్బందికి ప్రత్యేక యూనిఫాం రూపొందించారు. మెనూలో ఫలానావి ఉంటాయని అధికారులెవరూ స్పష్టంగా చెప్పనప్పటికీ, భారతీయ వంటకాల్లో వైవిధ్యాన్ని చాటేలా మెనూ ఉంటుందని భావిస్తున్నారు. ప్రత్యేక టేబుల్ వేర్ ప్రపంచనేతలకు ఇచ్చే విందు కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. వారికి మరిచిపోలేని ఆతిథ్య అనుభూతి కల్పించేందుకు ఆహారపదార్థాలను వెండి, బంగారు పూత కలిగిన పాత్రల్లో వడ్డిస్తారు. విదేశీ నేతలు వివిధ హోటళ్లలో బస చేసినప్పుడు, రాష్ట్రపతి ఏర్పాటు చేసిన విందుకు హాజరయ్యే సమయంలో ఉపయోగించేందుకు 200 మంది కళాకారులతో 15 వేల వరకు సామగ్రిని తయారు చేయించారు. ఇందులో స్టీల్, ఇత్తడి లేదా రెండింటి మిశ్రమంతో తయారైన టేబుల్ సామగ్రికి వెండిపూత వేయించారు. విందు సమయంలో అతిథులకు బంగారు పూత వేసిన గ్లాస్‌లలో డ్రింక్స్‌ను సర్వ్ చేస్తారు. ప్లేట్లు, స్పూన్లు తదితర వస్తువులను భారతీయ సంప్రదాయం ప్రతిబింబించేలా ఎంపిక చేశారు. జైపూర్, ఉదయ్‌పూర్, వారణాసిలతోపాటు కర్ణాటకలో వీటిని తయారు చేయించారు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీపై నిషేధం జీ20 దృష్ట్యా ఈ నెల 8, 9, 10వ తేదీల్లో న్యూఢిల్లీలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఢిల్లీ పోలీసులు ఈ ప్రాంతంలో ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు ప్రకటించారు. క్లౌడ్ కిచెన్, ఫుడ్ డెలివరీలు, అమెజాన్ డెలివరీ వంటి వాణిజ్య సేవలపై ఎన్డీఎంసీ ప్రాంతంలో నిషేధం విధిస్తున్నట్లు స్పెషల్ పోలీస్ కమిషనర్ ఎస్ఎస్ యాదవ్ చెప్పారు. ఈ ప్రాంతంలో లాక్డౌన్ విధిస్తారన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. అలాంటిదేమీ లేదన్నారు. బియెన్‌వెన్యూ నుంచి బియెన్‌వెనిడో దాకా.. జీ20 శిఖరాగ్రానికి హాజరయ్యే జీ20 ప్రతినిధులు, విదేశీ అతిథులకు వారివారి భాషల్లోనే స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. జీ20 ఇతివృత్తం ‘వసుధైక కుటుంబకమ్’ను జీ20 సభ్యదేశాలు, ఆహ్వానిత దేశాల భాషల్లో ముద్రించారు. దీంతోపాటు ఫ్రెంచిలో బియెన్‌వెన్యూ, టర్కిష్‌లో హాస్గెల్డినిజ్, జర్మన్లో విల్కోమెన్, ఇండోనేసియన్‌లో సెలామట్ దతంగ్, స్పానిష్‌లో బియెన్‌వెనిడో అంటూ స్వాగతాన్ని రష్యన్, మాండరిన్ భాషల్లో సైతం ముద్రించారు. దేశాల ప్రతినిధుల కోసం భారత్ మండపం కాంప్లెక్స్ 14వ నంబర్ హాలు ప్రవేశద్వారం వద్ద వీటిని ఏర్పాటు చేశారు. ఖర్గేకు రాని విందు పిలుపు సాక్షి, న్యూఢిల్లీ: జీ 20సదస్సులో భాగంగా శనివారం రాత్రి అతిథులకు ఇస్తున్న విందుకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు పిలుపు రాలేదు. ప్రగతిమైదాన్‌లోని భారత మండపంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇవ్వనున్న ఈ విందుకు ఖర్గేకు పిలుపు రాలేదని ఆయన కార్యాలయం ధ్రువీకరించింది. మాజీ ప్రధానులు దేవెగౌడ. మన్మోహన్ సింగ్. కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర కార్యదర్శులు, పలువురు పారిశ్రామిక వేత్తలు ఆహ్వానితుల్లో ఉన్నారు. అయితే కేబినెట్ హోదా ఉన్న రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు ఖర్గేకు ఆహా్వనం పంపకపోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సీఎంలు నితీశ్‌కుమార్ , మమతా బెనర్జీ, కేజ్రీవాల్, భగవంత్‌మాన్, హేమంత్ సోరెన్‌లు విందుకు హాజరు అవుతున్నట్లు ప్రకటించారు. అనారోగ్య కారణంగా విందుకు హాజరుకావడంలేదని మాజీ ప్రధాని దేవెగౌడ ట్వీట్ చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ కూడా అనారోగ్య కారణాలతో విందుకు హాజరుకావడం లేదని సమాచారం. నేతల బస సదస్సుకు హాజరవుతున్న దేశాధినేతలందరికీ సెంట్రల్ ఢిల్లీలోని స్టార్‌హోటళ్లు, గురుగ్రామ్‌లో బస ఏర్పాట్లు చేశారు. సుమారు 35 వేల గదులు బుక్ చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఐటీసీ మౌర్య 14వ అంతస్తులో, చాణక్యపురిలోని తాజ్ ప్యాలెస్‌లో చైనా ప్రధాని లీ క్వియాంగ్, బ్రెజిల్ ప్రతినిధులు, షాంగ్రీలాలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, జర్మనీ చాన్స్‌లర్ ఒలాఫ్ షోల్జ్, క్లారిడ్జ్ హోటల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, ఇంపీరియర్ హోటల్లో ఆ్రస్టేలియా ప్రధాని ఆంటొనీ అల్బనీస్, ఒబెరాయ్ హోటల్లో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, గురుగ్రామ్‌లోని ఒబెరాయ్ హోటల్లో దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్, జేడబ్ల్యూ మారియట్, హయత్ రెసిడెన్సీల్లో ఇటలీ ప్రతినిధులు, లీ మెరిడియన్‌లో నెదర్లాండ్స్, నైజీరియా, యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు, లలిత్ హోటల్లో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, గురుగ్రామ్ లీలీ హోటల్లో సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ బృందం బస చేయనుంది. -
తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: వాయవ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఈ ప్రభావంతో.. తెలంగాణలో రెండు రోజులపాటు భారీవర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో ప్రభుత్వం, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడొచ్చని తెలిపింది. @balaji25_t sirpur Kaghaznagar today morning 9.30 am. pic.twitter.com/trKHQyrWPb — SIDDIQUI (@siddiquiindia) August 19, 2023 వాయవ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలను ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో గురువారం ఏర్పడిన అల్పపీడనం చురుకుగా ఉంది. రెండు, మూడు రోజుల్లో అది పశ్చిమ వాయవ్య దిశలో ఉత్తర ఒడిశా-ఉత్తర ఛత్తీస్‌గఢ్ వైపు వెళ్లే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో తెలంగాణలో రాబోయే రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. Heavy rain in jagtial district pic.twitter.com/x1q6Mlkzaz — Laxman Thota (@LaxmanPatels1) August 19, 2023 భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో చీఫ్ సెక్రటరీ శాంతికుమారి కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కంట్రోల్ రూమ్‌లను నిర్వహించి.. ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు. మొన్నటి వర్షాలు, వరదల సమయంలో కలిగిన భారీ ప్రాణ-ఆస్తి నష్టం, ప్రజల్ని అప్రమత్తం చేయడంలో అధికార యంత్రాంగ వైఫల్యంపై తెలంగాణ హైకోర్టు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఇకనైనా అప్రమత్తంగా ఉండాలని సూచించిన విషయం తెలిసిందే. ఇక శుక్రవారం.. వివిధ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. భద్రాద్రి కొత్తగూడెంలో అధికంగా వర్షపాతం నమోదు అయ్యింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్‌లో ఓ మోస్తరు వానలు పడ్డాయి. హైదరాబాద్‌లోనూ ఓ మోస్తరు వాన కురిసింది. ఇదీ చదవండి: కేసీఆర్‌కు నేనంటే భయం! -
ఏపీకి రెయిన్ అలర్ట్.. ఆ జిల్లాల్లో నేడు, రేపు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 5.8 కి.మీ.ల ఎత్తులో విస్తరించింది. దీని ప్రభావంతో ఆదివారం ఉత్తర కోస్తాలో అనేకచోట్ల, దక్షిణ కోస్తాలో కొన్నిచోట్ల, రాయలసీమలో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ శనివారం వెల్లడించింది. సోమవారం ఉత్తర, దక్షిణ కోస్తాల్లో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. మరోవైపు ఈ నెల 18 నాటికి వాయవ్య బంగాళాఖాతంలోనే మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, అదేరోజు నుంచి రాష్ట్రంలో వర్షాలు ఊపందుకునేందుకు అవకాశం ఉంది. చదవండి: వైఎస్సార్ షాదీ తోఫాలో మార్పులు.. ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్ -
తుఫాన్‌గా మారిన అల్పపీడనం, తీరం అల్లకల్లోలం.. భారీ వర్ష సూచన
బరంపురం (ఒడిశా): ఉత్తర బంగాళాఖాతం అండమాన్ దీవిలో ఏర్పడిన అల్పపీడనం పెను తుఫానుగా మారనుంది. దీని ప్రభావంతో ఈనెల 6 నుంచి 9వరకు దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురువనున్నట్లు భారత వాతావరణ అధ్యయన కేంద్రం అధికారులు తెలిపారు. తాజా సమాచారం అందే సమయానికి గోపాల్పూర్ తీరానికి 700కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉంది. మూడు రోజుల క్రితం బంగాళాఖతంలో ఏర్పడిన అల్పపీడనం సైక్లోన్‌గా మారినట్లు వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీని ప్రభావంతో తుఫాను తీరందాటే సమయంలో భారీ వర్షంతో పాటు గంటకు సుమారు 80నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. అలాగే గంజాం, గజపతి, రాయగడ, ఖుర్దా, జగత్సింగపూర్, పారాదీప్ జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర లోని శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం తీరప్రాంతాల్లో భారీ నష్టం జరిగే ప్రమాదం ఉన్నట్లు సమాచారం. మరోవైపు గంజాం జిల్లా ఛత్రపూర్‌లో కలెక్టర్ దివ్యజ్వోతి పరిడా వివిధ విభాగాలకు చెందిన ప్రభుత్వ అధికార్లతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. సాధ్యమైనంత వరకు తుఫాన్ ప్రభావంతో ప్రాణ, ఆస్తినష్టం లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. గోపాల్‌పూర్‌లో.. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గోపాల్పూర్ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. పారాదీప్ నుంచి కళింగపట్నం మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర హెచ్చరించగా.. సైక్లోన్ జోన్‌గా గుర్తింపు పొందిన గోపాలపూర్ సైతం ఇదే ఆందోళన కొనసాగుతోంది. దీని కారణంగా తీరంలో 5 మీటర్లకు పైగా సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఇప్పటికే మోటార్ బోట్లతో చేపల వేటపై నిషేధం ఉండగా.. సంప్రదాయ బోట్లు సైతం తీరానికే పరిమితమయ్యాయి. జిల్లాలోని సముద్ర తీరానికి సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు, మత్స్యకారులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లే పనిలో ఉన్నారు. తుఫాను బాధితులను ఆదుకోవాలి జయపురం: ఇటీవల విరుచుకుపడిన పెనుగాలులతో కూడిన అకాల వర్షాలు, తుఫాను కారణంగా పంటలు నష్టపోయిన రైతులు, ఇల్లు కోల్పోయిన కుటుంబాలను వెంటనే ఆదుకోవాలని జయపురం సమితి బాధితులు కోరారు. ఈ మేరకు సామాజిక కార్యకర్త బి.హరిరావు నేతృత్వంలో పలువురు బాధితులు జయపురం సబ్ కలెక్టర్ దేవధర ప్రదాన్‌ను ఆయన కార్యాలయంలో గురువారం కలిసి, వినతిపత్రం అందించారు. అధికారులు కేవలం టార్పాన్లు ఇచ్చి, చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. ఎవరికి భూమి పట్టాలు ఉన్నాయో వారికి మాత్రం కొంత ఆర్థికసాయం అందించారని, మిగతా బాధితులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. దీనిపై దృష్టి సారించి, బాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామస్తులు రమేష్ జాని, సాను ఖొర, బలరాం జాని తదితరులు పాల్గొన్నారు. -
Hyderabad: మరో మూడు రోజులు వర్షాలే!
సాక్షి, హైదరాబాద్: నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మరో మూడు రోజులు వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ సోమవారం తెలిపింది. ఈదురు గాలులతో పాటు వడగండ్ల వాన సైతం కురవొచ్చని తాజా బులిటెన్‌లో తెలిపింది. పగలంతా అధిక ఉష్ణోగ్రతలు, మధ్యాహ్నం లేదంటే సాయంత్రం పూట వాతవరణంలో మార్పులు రావొచ్చని తెలిపింది. సోమవారం నాటి పరిస్థితులే మరో మూడు నాలుగు రోజులపాటు కొనసాగొచ్చని పేర్కొంది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనూ వర్షాభావం కొనసాగొచ్చని తెలిపింది వాతావరణ శాఖ. -
ఒడిశా మీదుగా ఉపరితల ద్రోణి.. వర్షాలకు అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా సముద్రమట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వానలు, ఒకట్రెండు చోట్ల ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. ఆదివారం రాష్ట్రంలోని పలుచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీ సెల్సియస్ నుంచి 43 డిగ్రీ సెల్సియస్ మధ్యన నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. శనివారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే, గరిష్ట ఉష్ణోగ్రత భద్రాచలంలో 39.8 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 20.0 డిగ్రీ సెల్సియస్‌గా నమోదయ్యాయి. -
TS/AP: మరో రెండు రోజులు వర్షాలు
సాక్షి, హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు వర్ష ప్రభావం కొనసాగనుంది. ఏపీలో పలుచోట్ల మోస్తరు వర్షాలు ఉండగా, తెలంగాణలో పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అకాలవర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో.. ఇవాళ, రేపు(సోమ, మంగళవారాల్లో) ఏపీలో వర్షాలు పడనున్నాయి. ఏపీ తో పాటు యానాం మీదుగా కొనసాగుతోంది అల్పపీడనం. దీంతో.. తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు లేదంటే వడగంట్ల వాన కురవొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. ఉమ్మడి వరంగల్, నల్లగొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలుగురాష్ట్రాల్లో కురిసిన అకాల వర్షాలతో ఇప్పటికే భారీగా పంట నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. -
మూడు రోజులు వానలే.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు వర్షాలు కొనసాగనున్నాయి. ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్ తీరం వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. మరోవైపు బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. వీటి ఫలితంగా శుక్ర, శని, ఆదివారాల్లో దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, రాయలసీమల్లో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే వీలుంది. శనివారం దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గురువారం రాత్రి నివేదికలో వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవవచ్చని తెలిపింది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని పేర్కొంది. ఉరుములు, మెరుపులు, అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉందని, గంటకు 30నుంచి 40 కిలోమీటర్లు గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. మూడు రోజులపాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేడ్కర్ కోరారు. -
Hyderabad: హైదరాబాద్‌లో వర్షం
సాక్షి, హైదరాబాద్: అన్‌సీజన్‌లో నగరాన్ని వరుణుడు పలకరించాడు. గురువారం అర్ధరాత్రి తర్వాత నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో చిరు జల్లులు కురియగా, శుక్రవారం వేకువఝామునే మరోసారి చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు దాకా వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట, పంజాగుట్ట, ఆర్టీసీ క్రాస్‌రోడ్, చింతల్, బాలానగర్, సుచిత్ర, కుత్బుల్లాపూర్, బేగంపేట.. ఇంకా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కొన్నిచోట్ల చిరు జల్లులు కురియగా, మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షం గట్టిగానే దంచికొట్టింది. ఒకవైపు గత రెండు మూడు రోజులుగా నగరంలో చలి విజృంభణతో నగరవాసులు వణికిపోతుండగా, ఇప్పుడు వర్ష ప్రభావంతో చలి తీవ్రత మరింత పెరగొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. Earlier morning unexpected moderate #rainfall with thunderstorm accompanied by gusty winds on Friday. @ind2day #Hyderabad #oldcity pic.twitter.com/DNdShMsZbU — Mohd Lateef Babla (@lateefbabla) January 6, 2023 -
అమెరికాను గజగజలాడిస్తున్న బాంబ్ సైక్లోన్
చలికాలంలో వణుకు సహజం. కానీ, ఆ వణుకు ప్రాణంపోయేలా, క్షణాల్లో మనిషిని సైతం గడ్డకట్టించేదిగా ఉంటే!. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం.. తన దేశ పౌరులను ఉద్దేశించి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. శీతాకాలపు తుపాను వేగంగా వస్తున్నందున క్రిస్మస్కు కుటుంబ సభ్యులను, స్నేహితులను సందర్శించడానికి వెళ్లాలనుకునే అమెరికన్లు వెంటనే బయలుదేరాలని ఆయన హెచ్చరించారు. మంచు తుపాను బలం పుంజుకోవడంతో.. అత్యంత అరుదైన పరిణామం ‘బాంబ్ సైక్లోన్’గా బలపడొచ్చని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. అమెరికా మంచు తుపాన్‌తో వణికిపోతోంది. -39(మైనస్) డిగ్రీల సెల్సియస్‌కు మెర్క్యూరీ మీటర్లు పడిపోతున్నాయి. అర్కిటిక్ బ్లాస్ట్.. విపరీతమైన చలిని, హిమపాతాన్ని, చల్లని గాలులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు అక్కడి ప్రజలు. ఇప్పటిదాకా ఐదుగురు మృత్యువాత చెందారు. గత నలభై ఏళ్లలో ఎన్నడూ ఇంత ఘోరమైన పరిస్థతి ఎదుర్కొలేదని వాతావరణ శాఖ చెబుతోంది. ఇప్పటికే వందల సంఖ్యలో విమానాలు రద్దు అయ్యాయి. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. రోడ్డు, రైల్వే మార్గాలు సైతం మంచు ప్రభావానికి గురికాగా.. క్రిస్మస్పై ఈ ఎఫెక్ట్ పడేలా కనిపిస్తోంది. ఇది ప్రమాదకరమైనది. మీరు చిన్నప్పుడు చూసిన మంచులాంటిది కాదు. ప్రాణాలకు ముప్పు కలిగించేది. చాలా తీవ్రమైన వాతావరణం.. ఓక్లహోమా నుంచి వ్యోమింగ్, మైనే వరకు కొనసాగనుంది. కాబట్టి నేను ప్రతి ఒక్కరూ దయచేసి స్థానిక హెచ్చరికలను పట్టించుకోవాలని ఒవల్ కార్యాలయం నుంచి జాతిని ఉద్దేశించి బైడెన్ కోరారు. మధ్య అమెరికా నుంచి తూర్పు వైపు వీచే ఈ శీతలగాలుల ప్రభావంతో.. 135 మిలియన్ల(సుమారు పదమూడు కోట్ల మంది) జనాభాపై ప్రభావం పడనుందని తెలుస్తోంది. గురువారం ఒక్కరోజే.. 60 మిలియన్ల మందిపై ఇది ప్రభావం చూపెట్టింది. బాంబ్ సైక్లోన్ అంటే.. బాంబ్ సైక్లోన్ అనేది మధ్య-అక్షాంశ తుపాను. దీనిలో కేంద్ర పీడనం గంటకు ఒక మిల్లీబార్ వద్ద కనీసం 24 గంటల పాటు వేగంగా పడిపోతుంటుంది. అయితే, తుపాను ఎక్కడ ఏర్పడుతుందనే అనే దాని ఆధారంగా మిల్లీబార్ రీడింగులు మారే అవకాశం ఉంటుంది. వాయు పీడనం అనేది వాతావరణం యొక్క బరువు ద్వారా ప్రయోగించే శక్తిని కొలవడం. ఈ పీడనం ఎంత తక్కువగా ఉంటే తుపాను అంత బలంగా ఉంటుందన్న మాట. అమెరికా జాతీయ వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. ప్రస్తుత పరిస్థితి కొనసాగితే.. ఉష్ణోగ్రతలు ఇప్పుడున్న దానికంటే 11 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవచ్చట. అలాగే గాలి పీడనం 1003 మిల్లీబార్ల నుంచి 968 మిల్లీబార్లకు పడిపోవచ్చని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ . బాంబు తుపాన్ ఎలా ఏర్పడుతుందంటే.. వివిధరకాల వాయు ద్రవ్యరాశి (చల్లని, పొడి) గాల్లో కలిసినప్పుడు. వెచ్చని గాలి పెరిగేకొద్దీ, అది గాలి ఒత్తిడిని తగ్గించే క్లౌడ్ వ్యవస్థను సృష్టిస్తుంది. అల్పపీడన ప్రాంతం చుట్టూ అపసవ్య దిశలో ప్రసరించే తుఫానుగా ఏర్పడుతుంది. జనావాసాలపై బాంబ్ సైక్లోన్ ప్రభావం ఊహించని రీతిలో ఉంటుంది. మనుషుల ప్రాణాలు తీయడంతో పాటు ఆస్తి నష్టం కూడా భారీగానే ఉంటుంది. గట్టిగా గాలి పీల్చినా.. మాట్లాడినా సరే ఆ చలికి తెమడ పట్టేసి.. ప్రాణాలకు తీసుకొస్తుంది. 1979 నుంచి 2019 మధ్య.. ఉత్తర అమెరికాలో ఏడు శాతం మంచు తుపానులు బాంబ్ సైక్లోన్లుగా మారాయి. 1980లో బాంబ్ సైక్లోన్ అనే పదాన్ని ఉపయోగించారు. బాంబ్ సైక్లోన్ స్థితి చలికాలంలోనే కాదు.. అరుదుగా సమ్మర్‌లోనూ నెలకొంటుంది. వీటి ప్రభావంతో ఇప్పటిదాకా వందల నుంచి వేల మంది మరణించారు!. బాంబు సైక్లోన్ తుపాను అనేది.. చల్లని గాలుల తీవ్రతను బట్టి ఉంటుంది. దీంతో అమెరికాలో ఇప్పుడు నెలకొన్న పరిస్థితి మరింత దిగజారవచ్చు. టెంపరేచర్లు.. సున్నా కంటే చాలా తక్కువ ప్రమాదకరమైన కనిష్ట స్థాయికి పడిపోవచ్చు. అంటే.. ఏదైనా సరే నిమిషాల్లో గడ్డకట్టుకుపోతుంది. క్రిస్మస్ తర్వాత నుంచి నెమ్మదిగా మొదలై.. కొత్త సంవత్సరం మొదటిరోజు నాటికి ఈ పరిస్థితి మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. భారీగా కురుస్తోన్న మంచు(Snow), చలిగాలులకు.. స్థానిక ఉష్ణోగ్రతలు ఘోరంగా పడిపోయాయి. క్రిస్మస్ దగ్గర పడుతున్న వేళ.. ప్రయాణాలకు ఈ వాతావరణం అవరోధంగా మారింది. గురువారం ఒక్కరోజే వేలాది విమానాలు రద్దయినట్లు సమాచారం. కెంచుకీ, జార్జియా, నార్త్ కరోలినా, ఒక్లాహోమాలు అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి. మేరీల్యాండ్, మిస్సోరీలు.. అత్యవసర పరిస్థితులకు సిద్దంగా ఉనన్నాయి. మిన్నెసొటాలో జంట నగరాలు స్నో ఎమర్జెన్సీలను ప్రకటించుకున్నాయి. ఈశాన్య వాతావరణంతో పోలిస్తే.. బాంబ్ సైక్లోన్ ప్రభావం మరీ ఘోరంగా ఉంటుంది. -
మాండూస్ ఎఫెక్ట్.. రాయలసీమ, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు.. కంట్రోల్ రూం నెంబర్లివే
Cyclone Mandous Andhra Pradesh LIVE Updates ప్రకాశం జిల్లా: సముద్ర తీరంలో టెన్షన్ సింగరాయకొండ మండలం ఊళ్ళ పాలెం, పల్లెపాలెం సముద్ర తీరంలో టెన్షన్ వాతావరణ నెలకొంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బృందం బయటకురాలేక లోపల చిక్కుకుపోవడంతో ఆందోళన కొనసాగుతుంది. బంధువులతో పాటు పోలీస్, మెరైన్ సిబ్బంది తీరం వద్ద మోహరించారు. సముద్ర తీరానికి కిలోమీటర్ దూరంలో మత్స్యకారుల బోటు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులతో పోలీసులు ఫోన్లో మాట్లాడి, వారికి ధైర్యం చెప్పారు. మత్స్యకారులు కూడా ప్రస్తుతానికి క్షేమంగానే ఉన్నామని తెలిపారు. ఇంజన్లో ఆయిల్ అయిపోవడం వల్ల ఇక్కడ ఇరుక్కుపోయామని మత్స్యకారులు పోలీసులకు తెలిపారు. గత నాలుగో తేదీన చీరాల మండలం ఓడరేవు నుంచి మత్స్యకారులు చేపలు వేటకు వెళ్లినట్లు, తుపానులో బయటకురాలేక చిక్కుకున్నట్టు అధికారులు తెలిపారు. మత్స్యకారులను క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారు. మాండూస్ తుపాన్‌పై ఏపీ సీఎస్ జవహర్‌రెడ్డి టెలికాన్ఫరెన్స్ ► మాండూస్ తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. శనివారం విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయం నుంచి ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఈసందర్భంగా.. తుపాను ప్రభావిత ప్రాంతాలలో ఆయా జిల్లాల కలెక్టర్లు పర్యటించాలని సీఎస్ ఆదేశించారు. శని, ఆదివారాల్లో రెండు రోజులపాటు పర్యటించాలని తెలిపారు. వర్షపు నీరు తొలగిన తర్వాత నష్టం అంచనాకు ఎన్యుమరేషన్ ప్రక్రియను చేపట్టాలని ఆయా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ► తిరుపతిలో వర్షపు నీరు త్వరిత గతిన దిగువకు వెళ్ళేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి కలెక్టర్ ను సీఎస్ ఆదేశించారు. ఈ టెలీకాన్ఫరెన్స్ లో పాల్గొన్న సీఎంవోప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.పూనం మాలకొండయ్య మాట్లాడుతూ.. భారీ వర్షాలు పడిన ప్రాంతాల్లో వెంటనే శానిటేషన్ పనులు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు.వర్షపు నీరు తగ్గిన వెంటనే పంట నష్టం అంచనాలు చేపట్టాలని చెప్పారు. ► రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సంచాలకులు డా.బిఆర్.అంబేద్కర్ మాట్లాడుతూ.. శుక్రవారం రాత్రి 8.30 గం.ల నుండి శనివారం ఉ.8.30గం.ల వరకు అన్నమయ్య జిల్లాలో 23.3 మిల్లీ మీటర్లు, చిత్తూరు జిల్లాలో 30.5,ప్రకాశం జిల్లాలో 14.1, ఎస్పి ఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో 57.6, తిరుపతి జిల్లాలో 75.7, వైయస్సార్ కడప జిల్లాలో 14.5 మిల్లీమీటర్ల వంతున సరాసరి వర్షపాతం నమోదైందని సీఎస్‌కు వివరించారు. ► ఇంకా ఈటెలీ కాన్ఫరెన్స్ లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు. ► కాగా గత 24 గంటల్లో పై తెలిపిన ఆరు జిల్లాల్లోని 109 ప్రాంతాల్లో 64.5 మిల్లీ మీటర్లకంటే అధిక వర్షపాతం నమోదైనట్టు తెలుస్తోంది. ► మాండూస్ తుపాను బలహీనపడుతోంది. తీవ్ర వాయుగుండంగా మారి బలహీనపడుతోంది. ► తుపాను ప్రభావంతో తమిళనాడుతో పాటు ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ► తిరుపతిలో నీటమునిగిన కాలనీలను ఎమ్మెల్యే భూమన పరిశీలించారు. వరద బాధితులను ఆయన పరామర్శించారు. తిరుపతిలో మాండూస్ తుఫాన్ ఎఫెక్ట్...మోకాళ్ళలోతు వరద నీటిలో వెళ్లి వరద బాధితులను పరామర్శించిన భూమన...👏👏👍 pic.twitter.com/IYmiYGTHw4 — Radhika Reddy...😍 (@sweety_00099) December 10, 2022 తిరుమల: ► మాండూస్ తుపాను ప్రభావంతో.. తిరుమలలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు టీటీడీ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. వర్షం కారణంగా పాపవినాశనం, జపాలి, వేణుగోపాల స్వామి ఆలయం, ఆకాశ గంగా, శ్రీవారి పాదాలకు వాహనాలను టీటీడీ అనుమతించడం లేదు. ఘాట్ రోడ్డులో అక్కడక్కడా కొండచరియలు విరిగి పడుతున్నాయి. దీంతో.. ద్విచక్ర వాహనదారులను అప్రమత్తం చేస్తోంది టీటీడీ. నెల్లూరు జిల్లా ► కోవ్వూరు నియోజవర్గంలో మాండూస్ తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నం ► బలహీన పడుతున్న మాండూస్ తుపాను. తీవ్ర వాయు గుండంగా మారి మరింత బలహీనపడే దిశగా కదులుతోంది. తూర్పుగోదావరి ► మాండూస్ తుఫాను నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో ధాన్యం కొనుగోళ్ళు వేగవంతం చేశారు అధికారులు. జిల్లాలో ఇప్పటివరకు 30 వేల 126 మంది రైతుల నుంచి లక్షా 46 వేల 417 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతులు జాగ్రత్త లు తీసుకోవాలని చెబుతున్నారు అధికారులు. సాక్షి, అమరావతి: పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తీరం దాటింది మాండూస్ తుపాను. పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ.. తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం కనిపిస్తోంది. తీరంలో కొనసాగుతున్న అలజడితో మరో రెండు రోజులు ఉత్తర తమిళనాడు, దక్షిణ ఏపీలోని పలు జిల్లాల్లో అతిభారీ నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. 80 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. తుపాను ప్రభావం తగ్గేవరకూ వేటకు వెళ్లోద్దని మత్యకారులకు అధికారుల సూచిస్తున్నారు. ప్రకాశం జిల్లాలోనూ వర్ష ప్రభావం కనిపిస్తోంది. నెల్లూరు జిల్లాలో టోల్‌ఫ్రీ నంబర్ 1077 మాండుస్ తుఫాన్ ప్రభావంతో అర్ధరాత్రి నుంచి తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లాలో ఈదురు గాలులు తో కూడిన భారీ వర్షం కురుస్తోంది. తిరుపతి నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమమయ్యాయి. ఘాట్ రొడ్డులో వాహన దారులను అప్రమత్తం చేస్తున్న సిబ్బంది. వర్షంలోనే తడిచి ముద్దవుతున్నారు భక్తులు. ఇంకొంతమంది భక్తులు గదులకే పరిమితం అయ్యారు. నగరంలోని లక్ష్మీపురం సర్కిల్, రామానుజ సర్కిల్, అన్నమయ్య సర్కిల్, పద్మావతి పురం, లీలమహల్, వెస్ట్ చర్చి, మహిళా యూనివర్సిటీ , కృష్ణ నగర్ లో లోతట్టు ప్రాంతాలు జలమమయ్యాయి. 🌀తీరం దాటిన మాండూస్ తుఫాన్ 🌀రాత్రి 1:30 గంటలకు పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటిన తుఫాన్ 🌀సాయంత్రానికి వాయుగుండంగా బలహీన పడే అవకాశం 🌀ఈరోజు ప్రకాశం, SPSR నెల్లూరు, తిరుపతి,చిత్తూరు,అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు pic.twitter.com/wsEOyoxgkl — Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) December 10, 2022 అలాగే.. రాయలసీమలో తుపాను ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. వైఎస్ఆర్లో వర్షాలు.. కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు మాండుస్ తుఫాన్ ప్రభావంతో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షo.. అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కడప, రైల్వే కోడూరు, రాయచోటి, రాజంపేట, పులివెందులలో వర్షం పడుతోంది. దీంతో ఆయా జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో మాండూస్ తుపాను ఎఫెక్ట్‌తో తుపాను, భారీ వర్షాల పట్ల అధికారులు అప్రమత్తం అయ్యారు. జిల్లా కలెక్టరేట్‌తో పాటు నాలుగు రెవెన్యూ డివిజన్లలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. తుపాను దృష్ట్యా లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పాపాగ్ని నది తీరం వైపు వెళ్లకుండా ప్రజల్ని అప్రమత్తం చేశారు అధికారులు. ► జిల్లా కలెక్టరేట్ కార్యాలయం కంట్రోల్ రూం నెంబర్:08568-246344, ► కడప రెవెన్యూ డివిజన్ కంట్రోల్ రూం: 08562-295990 ► జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్ కంట్రోల్ రూం: 9440767485 ► బద్వేల్ రెవెన్యూ డివిజన్ కంట్రోల్ రూం: 91812160052 ► పులివెందుల రెవెన్యూ డివిజన్ కంట్రోల్ రూం: 7396167368 విజయనగరం మాండూస్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా చెదురు మదురు వర్షాలు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న చిరు జల్లులు తో పెరిగిన చలి తీవ్రత. శ్రీకాకుళం జిల్లా లో పలుచోట్ల గడిచిన రాత్రి నుండి చిరు జల్లులు కురుస్తున్నాయి. చలి తీవ్రత పెరిగింది. విద్యుత్ స్తంభాలు కూలినా, లైన్లు తెగినా.. టోల్ ఫ్రీ నెంబర్ 1912 -
IND VS NZ 3rd ODI: టీమిండియాకు షాకింగ్ న్యూస్
న్యూజిలాండ్‌తో మూడో వన్డేకు ముందు టీమిండియా అభిమానులకు షాకింగ్ న్యూస్ తెలిసింది. క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లే పార్క్ వేదికగా రేపు (నవంబర్ 30) జరుగబోయే మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉందని స్థానిక వాతావరణ శాఖ వెదర్ ఫోర్‌కాస్ట్‌లో పేర్కొంది. క్రైస్ట్‌చర్చ్‌లో రేపు ఉదయం నుంచే అకాశం మేఘావృతమై ఉంటుందని, మ్యాచ్ సమయానికి (భారతకాలమానం ప్రకారం ఉదయం 7 గంటకు) భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్ ప్రెడిక్షన్‌లో వెల్లడించింది. ఈ వార్త తెలిసి భారత క్రికెటర్లు, అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఈ మ్యాచ్ సాధ్యపడకపోతే సిరీస్ కోల్పోవాల్సి వస్తుందని బాధ పడుతున్నారు. కనీసం 10 ఓవర్ల పాటైన మ్యాచ్ జరిగితే, సిరీస్ సమం చేసుకునే అవకాశం అయినా ఉంటుందని అనుకుంటున్నారు. కాగా, 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్ తొలి వన్డేలో విజయం సాధించగా (7 వికెట్ల తేడాతో).. రెండో వన్డే వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. ఇక మూడో వన్డే కూడా రద్దైతే న్యూజిలాండ్ 1-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. ఇదిలా ఉంటే, వన్డే సిరీస్‌కు ముందు జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా, డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం మూడో మ్యాచ్ టైగా ముగిసింది. ఈ మధ్యలో జరిగిన రెండో మ్యాచ్‌లో గెలిచిన హార్ధిక్ సేన.. 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. -
Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్: ఏపీలో పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం మంగళవారం కోస్తా తీరంలో స్థిరంగా కొనసాగుతోంది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం నైరుతి దిశ వైపు వంపు తిరిగి ఉంది. ఉపరితల ద్రోణి అల్పపీడన ప్రాంతం నుంచి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశాల మీదుగా చత్తీస్ఘడ్ వరకు సగటు సముద్రమట్టం వరకు విస్తరించి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో బుధ, గురువారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. (చదవండి: గుడ్‌న్యూస్: ఉద్యోగులకు ‘ఈ–స్కూటర్లు’) -
ఉరుములు, మెరుపులతో హైదరాబాద్‌లో భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలో మళ్లీ వరుణుడి ప్రతాపం మొదలైంది. గురువారం మధ్యాహ్నం ఆకస్మాత్తుగా మొదలైన వాన సుమారు గంటపాటు దంచికొట్టింది. ఆల్వాల్, బోరబండ, యూసఫ్‌గూడ, మైత్రినవం, నిజాంపేట, కూకట్పల్లి, బోయినపల్లి, మారేడుపల్లి, బేగంపేట, చిలకలగూడ.. ఇలా చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మళ్లీ సాయంత్రం సమయంలో భారీ వర్షం పడింది. ఉరుములు, మెరుపులతో వాన దంచికొట్టింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లోనూ ఈదురు గాలులతో కూడిన వాన కురిసింది. ఈరోజు మధ్యాహ్నం నుంచి ఏదొక సమయంలో నగరంలో వర్షం కురుసిన నేపథ్యంలో చాలాచోట్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగారు. చాలాచోట్ల నిలిచిపోయిన నీటిని తరలిస్తున్నారు. ట్రాఫిక్ జామ్ కాకుండా ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. గణేషుడి విగ్రహాల నిమజ్జనం దరిమిలా.. వర్షాలకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందునా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. మరోవైపు.. తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు మూడు రోజులు పరిస్థితి ఇలాగే కొనసాగవచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Rain Forecast: రాయలసీమలో మరో మూడు రోజులు భారీ వర్షాలు
సాక్షి, అమరావతి: రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు నుంచి తెలంగాణ వరకు రాయలసీమ మీదుగా విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ వర్షాలు పడుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గడచిన 24 గంటల్లో (సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి మంగళవారం ఉదయం 8.30 గంటల వరకు) శ్రీసత్యసాయి, అనంతపురం, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలో 13 సెంటీమీటర్ల అత్యధిక వర్షం కురిసింది. జూపాడు బంగ్లా మండలంలో 11.5, అన్నమయ్య జిల్లా బీరొంగి కొత్తకోట మండలంలో 10.6, అనంతపురం జిల్లా డి.హీరేలాల్ మండలంలో 10.4, విడపనకల్ మండలంలో 10.2, కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలో 8.8, కర్నూలు అర్బన్, అన్నమయ్య జిల్లా కలికిరి మండలంలో 8.3, చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలో 7.4, అనంతపురం జిల్లా బొమ్మనహళ్ మండలంలో 7.3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మరో 3 రోజులపాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. -
తెలంగాణ: ఆది, సోమవారాల్లో పలుచోట్ల వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశంఉందని వాతావరణ శాఖ తెలిపింది. వివిధ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు, ఒకట్రెండు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్లు వివరించింది. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుంచి ఇంటీరియర్ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. ఇది సముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించినట్టు పేర్కొంది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోని సగానికి పైగా జిల్లాలకు విస్తరించినట్లు తెలిపింది. మరో రెండ్రోజుల్లో పూర్తిస్థాయిలో రుతుపవనాలు వ్యాప్తి చెందే అవకాశంఉందని స్పష్టం చేసింది. -
రాష్ట్రమంతటా రుతుపవనాల విస్తరణ
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 13న తెలంగాణలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు గురువారం రాష్ట్రమంతటా విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాల ఉత్తర పరిమితి ఇప్పుడు పోరుబందర్, భావ్‌నగర్, ఖాండ్వా, గోండియా, దుర్గ్, భవానీపట్నం, కళింగపట్నం గుండా వెళుతోంది. అలాగే ఉపరితల ద్రోణి విదర్భ నుంచి తెలంగాణ మీదుగా రాయలసీమ వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగింది. దీంతో రాగల మూడు రోజులు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు, చాలా జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశముందని తెలిపింది. ఇతర ప్రాంతాల్లోతేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇదిలావుండగా, గత 24 గంటల్లో మహబూబాబాద్‌లో 15 సెంటీమీటర్ల అతి భారీ వర్షం కురిసింది. నిర్మల్ జిల్లా ముధోల్‌లో 13 సెంటీమీటర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లిలో 12, అశ్వారావుపేటలో 9, మహబూబాబాద్ జిల్లా మల్యాల్‌లో 8, జగిత్యాల జిల్లా వెలగటూరు, వరంగల్ జిల్లా పర్వతగిరి, కరీంనగర్‌లలో 7సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైందని వాతావరణ కేంద్రం తెలిపింది. -
రానున్న రెండ్రోజులు మోస్తరు వానలు
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న రెం డ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వానలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు గురువారం వాతావరణ శాఖ వెల్లడించింది. చత్తీస్గడ్ నుంచి కోస్తాంధ్ర తీరం వరకు కొనసాగుతున్న ఉపరితలద్రోణి తెలంగాణకు దూరంగా వెళ్లిందని తెలిపింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు రానున్న రెండ్రోజుల్లో గోవా, దక్షిణ మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో మరింత ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది. గురువారం రాష్ట్రంలో సాధారణం కంటే 2 నుంచి 4డిగ్రీల సెల్సియస్ మేర ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గరిష్ట ఉష్ణోగ్రత రామగుండంలో 42.8 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత నిజామాబాద్‌లో 22.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. -
తెలంగాణలోకి ప్రవేశించనున్న నైరుతి రుతుపవనాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండల తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలకు ఊరటనిచ్చేలా వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. తెలంగాణలోకి మంగళవారం నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు అంచనా వేసింది. గతేడాదితో పోలిస్తే రుతుపవనాల రాకకు రెండ్రోజులు ఆలస్యమైనట్లు పేర్కొంది. ఈ నెల 10వ తేదీ కల్లా రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాలు వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపింది. వాస్తవానికి మే 29న కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించగా ఆ తర్వాత వాటి కదలిక మందగించడంతో వ్యాప్తి ఆలస్యమైంది. ప్రస్తుతం రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు వాతావరణ శాఖ వివరించింది. సాధారణం కంటే కాస్త ఎక్కువ వానలు... ఈ ఏడాది రాష్ట్రంలో వర్షాలు సంతృప్తికరంగా ఉంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం కంటే కాస్త ఎక్కువ వానలు కురుస్తాయని చెబుతున్నారు. తెలంగాణలో సాధారణ వర్షపాతం 72.05 సెంటీమీటర్లు కాగా.. గతేడాది వానాకాలంలో 100.97 సెంటీమీటర్ల మేర వర్షాలు కురిశాయి. రాష్ట్రవ్యాప్తంగా 6 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదవగా 21 జిల్లాల్లో అధిక వర్షపాతం, మరో 6 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతంతో పోలిస్తే రాష్ట్రంలో ఈసారి మొత్తంమీద 104 శాతం మేర వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రుతుపవనాల కదలికలు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అంచనాల్లో మార్పులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. పెరిగిన ఉక్కపోత... కేరళలోకి నైరుతి రుతుపవనాలు ముందస్తుగా ప్రవేశించినప్పటికీ తొలి మూడు రోజులు మందకొడిగా కదలడంతో వాతావరణం చల్లబడలేదు. సాధారణంగా సీజన్‌కు ముందుగా కురిసే వర్షాలతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకొని చల్లబడుతుంది. కానీ ఈసారి నైరుతి సీజన్‌కు ముందు ఉష్ణోగ్రతలు పెరిగాయి. నడివేసవిలో నమోదైనట్లుగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. అసని తుపానుతో మే నెల మూడో వారంలో వాతావరణం చల్లబడినట్లు కనిపించినా ఆ తర్వాత ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగాయి. దీని ప్రభావంతో వాతావరణంలో ఉక్కపోత పెరిగింది. దీనికి వడగాడ్పులు తోడవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. తాజాగా మరో రెండ్రోజులు కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కాస్త ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. రుతుపవనాలు పూర్తిగా వ్యాప్తి చెందే వరకు ఉష్ణోగ్రతలు సాధారణానికి కాస్త అటుఇటుగానే నమోదు కానున్నాయి. ఆదివారం నల్లగొండలో 43.8 డిగ్రీ సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదవగా మెదక్‌లో 25 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. -
రుతుపవనాల దోబూచులాట
గ్రీష్మకాల మార్తాండుడు నిప్పులు చెరుగుతున్నవేళ నీలాకాశం నల్లటి మబ్బు తెరలతో గొడుగు పట్టాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. ఆ మేఘాలు తమ హృదయ కవాటాలు తెరిచి చినుకు ధారలతో నేలతల్లికి అభిషేకం చేస్తే ఇక చెప్పేదేముంది? అందుకే ‘వానంటే ప్రకృతి వరప్రసాదం. నింగి నేలకు దిగిరావడం’ అంటాడు అమెరికన్ రచయిత, కవి జాన్ అప్డైక్. మన దేశంలో జోరుగా వానలు మోసుకొచ్చే నైరుతీ రుతుపవనాల గురించి భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఏటా విడుదల చేసే అంచనాల గురించి అందరిలోనూ ఆసక్తి ఉంటుంది. అంచనాలు తప్పినప్పుడు ఆసక్తి స్థానంలో నిరాసక్తత ఏర్పడటమూ రివాజే. ఈసారి కూడా ఐఎండీ అంచనాలు కాస్త గురితప్పాయి. చాలా ముందే రుతుపవనాలు ఆగమిస్తాయని చెప్పడంతో మొదలుపెట్టి అవి వచ్చేశాయని కూడా ప్రకటించి నాలిక్కరుచుకోవడంతో ఎప్పటికన్నా ఎక్కువగా ఐఎండీపై విమర్శల జోరు పెరిగింది. ‘కడుపుతో ఉన్నమ్మ కనక మానుతుందా’ అన్నట్టు శుక్రవారం నాటికి దాదాపు కేరళ అంతటా వర్షాలు మొదలయ్యాయని తాజా సమాచారం చెబుతోంది. వాతావరణ అంచనాలకు సంబంధిం చిన ఉపకరణాలు, సాంకేతికతలు అభివృద్ధి చెందిన ఈ కాలంలో కూడా ఐఎండీకి తొట్రుపాటు ఎందుకు తప్పడం లేదు? ‘సాంకేతికతలుంటేనే సరిపోదు, వాటిని సక్రమంగా వినియోగించాలి. పద్ధతులు పాటించాలి’ అంటోంది ప్రైవేటు వాతావరణ పరిశోధనా సంస్థ స్కైమెట్. ఒక రంగంలో పనిచేసేవారి మధ్య తెలియని పోటీతత్వం ఉండటం, పరస్పరం విమర్శించుకోవడం అసహజమేమీ కాదు. కనుక స్కైమెట్ విమర్శే సర్వస్వం అనుకోనవసరం లేదు. ఐఎండీ ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా అంచనాలు అందించింది. ఈసారి దేశ వాయవ్య ప్రాంతంలో తప్ప ఇతరచోట్ల 103 శాతం వరకూ వర్షపాతం ఉండొచ్చని చెప్పింది. దక్షిణ అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో మే నెల 15 కల్లా నైరుతీ రుతుపవనాలు ఆగమిస్తాయన్నది. 19న మరో అంచనా విడుదల చేసింది. అయిదారు రోజులు ముందు... అంటే ఏటా ఇంచుమించు జూన్ 1 ప్రాంతంలో కేరళను పలకరించే రుతుపవనాలు మే 25 నాటికే రావొచ్చని వివరించింది. చివరకు రుతుపవనాలు వచ్చేశాయని 29న కురిసిన వర్షాల ఆధారంగా ఐఎండీ మరో ప్రకటన విడుదల చేసింది కూడా. అయితే ఆ మర్నాడే ఒక వివరణనిచ్చింది. వాతావరణ పరిస్థితుల రీత్యా రుతుపవనాలు ప్రభావం అన్నిచోట్లా సమంగా ఉండకపోవచ్చని తెలిపింది. నిజమే. కేరళలోని 14 వర్షపాత నమోదు కేంద్రాల్లో ఒక్కచోట కూడా వానపడిన దాఖలా లేదు. మరో రెండు కేంద్రాల్లో మాత్రం ఒక మిల్లీమీటరు వర్షపాతం కన్నా తక్కువ నమోదైంది. కేవలం 29న పడిన వర్షం ఆధారంగా అంచనాలు ప్రకటించడం ప్రమాణాలు ఉల్లంఘించడమేనన్నది స్కైమెట్ ఆరోపణ. ‘వాన రాకడ... ప్రాణం పోకడ ఎవరికీ తెలియదు’ అన్నది నానుడి. కానీ ఏళ్లు గడుస్తున్నకొద్దీ ఈ నానుడికి విలువ లేకుండా పోతున్నది. క్షణంసేపు ఆగిన ప్రాణాన్ని సైతం నిలబెడుతున్న మాదిరే వాతావరణ అంచనాలు కూడా దాదాపు సరిగానే ఉంటున్నాయి. అలాగని ప్రమాణాలను పక్కన బెట్టి ఇష్టానుసారం అంచనాలివ్వడం సరికాదు. ఒకటి రెండు రోజులు వేచిచూసి, అన్నివిధాలా అధ్యయనం చేస్తే వచ్చే నష్టం లేదు. ఇంకా చెప్పలేదేమని నిలదీసేవారెవరూ ఉండరు. కానీ అశాస్త్రీయ అంచనాలు వెలువరిస్తే పరిశోధనా సంస్థలకుండే ప్రతిష్ఠ దెబ్బతింటుంది. మార్కెట్లు మెరిసిపోవడానికీ, మదుపరులు హుషారెత్తడానికీ ‘మంచి అంచనాలు’ ఇవ్వాలని వచ్చిన రాజకీయ ఒత్తిడుల కారణంగానే ఐఎండీ అడ్డతోవలో అంచనాలు వేసిందన్న ఆరోపణలున్నాయి. అందులోని నిజానిజాల మాటెలా ఉన్నా అంచనాలు తప్పినప్పుడు శాస్త్రవేత్తలను నిలదీసిన దాఖలాలు మన దేశంలో లేవు. 2009 ఏప్రిల్‌లో ఒక నగరానికి భారీ నష్టం తీసుకొచ్చి, 306 మందిని బలిగొన్న భూకంపంపై సరైన అంచనాలు ఇవ్వలేకపోయారన్న కారణంగా ఆరుగురు ఇటలీ శాస్త్రవేత్తలకు ఆరేళ్ల చొప్పున జైలు శిక్షలు పడ్డాయి. అదృష్టవశాత్తూ ఇక్కడ అలాంటి పరిస్థితులు లేవు. ఈపాటికి శాంతించాల్సిన భానుడు ఇంకా తన ప్రతాపం చూపుతూనే ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్‌లో రానున్న నాలుగైదు రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉన్నదని ఇప్పటికే ఆ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. 47 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకూ ఈ ఉష్ణోగ్రతలుంటాయని దాని అంచనా. అందుకు తగ్గట్టే వాతావరణం భగ్గుమంటున్నది. ఈ పరిస్థితుల్లో ఐఎండీ అంచనా లకు విలువేముంటుంది? మన దేశంలో సాగుయోగ్యమైన భూముల్లో 60 శాతం వర్షాధారం. మనకు కురిసే వర్షాల్లో 80 శాతం నైరుతీ రుతుపవనాల ద్వారానే వస్తాయి. మన జీడీపీలో సాగు రంగం వాటా క్రమేపీ చిక్కిపోతున్నా ఇప్పటికీ అది గణనీయంగానే ఉంది. అన్నిటికీ మించి గ్రామీణ ప్రాంతాల్లో 50 శాతంమందికి సాగురంగమే ఉపాధి కల్పిస్తున్నది. ఉపాధి, ద్రవ్యోల్బణం, పారిశ్రామికరంగ కదలిక, గ్రామీణ ఆదాయాలు వగైరాలన్నీ నైరుతీ రుతుపవన గమనంపైనే ఆధారపడి ఉంటాయి. చినుకు కోసం ఆకాశంకేసి చూసే రైతును నిరాశపరిస్తే... అతని నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తే దాని ప్రభావం సాగు ఉత్పాదకతపై ఎంతగానో ఉంటుంది. ఫలానా తేదీకి రుతుపవనాలు వస్తాయని చెప్పడం వల్ల రైతులు డబ్బు ఖర్చుచేసి అవసరమైనవన్నీ సమకూర్చు కుంటారు. తీరా అనుకున్నట్టు జరగకపోతే నష్టపోతారు. కనుక అంచనాల విషయంలో శాస్త్రవేత్తలు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. విమర్శలకు తావీయని రీతిలో వ్యవహరించాలి. -
రానున్న మూడు రోజులు ‘మంట’లే.. వీలైతేనే బయటకు రండి!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో మూడు రోజల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ గురువారం ప్రకటించింది. 83 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, మరో 157 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. శుక్ర, శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 46ని– 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే మరికొన్ని జిల్లాల్లో 43ని నుంచి 45, మరికొన్ని జిల్లాల్లో 40–42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. ఈ మూడు రోజులు ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని, వడదెబ్బ తగలకుండా ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్), లస్సీ, నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటివి తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ తెలిపారు. చదవండి: పందులకూ ఓ పందెం! విజేతలకు రూ.2 లక్షల బహుమతి