సాక్షి, హైదరాబాద్: అన్‌సీజన్‌లో నగరాన్ని వరుణుడు పలకరించాడు. గురువారం అర్ధరాత్రి తర్వాత నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో చిరు జల్లులు కురియగా, శుక్రవారం వేకువఝామునే మరోసారి చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు దాకా వర్షం కురిసింది.
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట, పంజాగుట్ట, ఆర్టీసీ క్రాస్‌రోడ్, చింతల్, బాలానగర్, సుచిత్ర, కుత్బుల్లాపూర్, బేగంపేట.. ఇంకా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కొన్నిచోట్ల చిరు జల్లులు కురియగా, మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షం గట్టిగానే దంచికొట్టింది.
ఒకవైపు గత రెండు మూడు రోజులుగా నగరంలో చలి విజృంభణతో నగరవాసులు వణికిపోతుండగా, ఇప్పుడు వర్ష ప్రభావంతో చలి తీవ్రత మరింత పెరగొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
Earlier morning unexpected moderate #rainfall with thunderstorm accompanied by gusty winds on Friday. @ind2day #Hyderabad #oldcity pic.twitter.com/DNdShMsZbU
— Mohd Lateef Babla (@lateefbabla) January 6, 2023
Comments
Please login to add a commentAdd a comment