winter
-
Winter Travel Ideas: శీతాకాలంలో తప్పక చూడాల్సిన పర్యాటక ప్రాంతాలు
దేశంలో చలివాతావరణం కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ శీతాకాలంలో దేశంలోని కొన్ని పర్యాటక ప్రాంతాల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. ఇటువంటి తరుణంలో ఆయా ప్రాంతాలకు వెళితే బిజీలైఫ్ నుంచి మానసిక ప్రశాంతత లభిస్తుంది.మనదేశంలో శీతాకాలంలో సందర్శించదగిన అనేక ప్రదేశాలున్నాయి. అక్కడ చలిని కూడా ఎంజాయ్ చేయవచ్చు. ప్రతీయేటా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఈ ప్రాంతాల్లో టూరిస్టుల తాకిడి అధికంగా ఉంటుంది. ఆ ప్రాంతాలు ఏవి? ఎక్కడున్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం.గోవాప్రకృతి అందాలకు నిలయమైన గోవా.. స్వదేశీ, విదేశీ పర్యాటకుల గమ్యస్థానం. అందమైన సముద్రం, బీచ్, నైట్ లైఫ్, పార్టీలు, వినోదాన్ని ఇష్టపడేవారు వింటర్ సీజన్లో గోవాను సందర్శిస్తే మంచి అనుభూతి దొరుకుతుంది. గోవా ప్రముఖ పర్యాటక ప్రాంతంగా గుర్తింపుపొందింది. గోవాకు స్నేహితులు, కుటుంబ సభ్యులతో వెళ్లవచ్చు. లేదా ఒంటరిగా నైనా వెళ్లవచ్చు. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో గోవాలో అత్యంత రమణీయమైన వాతావరణం కనిపిస్తుంది.జైసల్మేర్శీతాకాలంలో రాజస్థాన్‌లోని జైసల్మేర్ ప్రకృతిశోయగాలతో మరింత సుందరంగా తయారవుతుంది. జైసల్మేర్‌లో చారిత్రక వారసత్వం, సంస్కృతి రెండూ కనిపిస్తాయి. ఇక్కడ క్యాంపింగ్, నైట్ అవుట్, ఒంటె సవారీ తదితర వినోద కార్యకలాపాల్లో పాల్గొని, ఎంజాయ్ చేయవచ్చు. చలికాలంలో జైసల్మేర్‌ను సందర్శించాలని పర్యాటకులు ఉవ్విళ్లూరుతుంటారు.కూర్గ్కర్ణాటకలో ఉన్న కూర్గ్ అధికారిక పేరు కొడగు. దీనిని స్కాట్లాండ్ ఆఫ్ సౌత్ ఇండియా అని కూడా అంటారు. చలికాలంలో కూర్గ్‌లో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం ఇక్కడి విశేషం. దేశమంతటా అత్యధిక చలివున్న సమయంలో కూర్గ్‌లో వెచ్చదనాన్ని అనుభవించవచ్చు. కూర్గ్‌లోని ప్రకృతి అందాలు ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటాయి.ముంబైవింటర్ సీజన్లో ముంబైని కూడా సందర్శించవచ్చు. ఇక్కడి బీచ్‌లో బలమైన అలలను చూసి ఎంజాయ్ చేయవచ్చు. ముంబైలో సందర్శించేందుకు పలు పర్యాటక ప్రదేశాలున్నాయి. ఇక్కడి స్ట్రీట్ ఫుడ్‌ను ఆహార ప్రియులను అమితంగా ఇష్టపడుతుంటారు. ముంబైలో సందర్శించేందుకు పలు పురాతన ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ శీతాకాలంలో తక్కువ బడ్జెట్లో ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే అందుకు ముంబై అనువైన ప్రాంతమని పర్యాటకులు చెబుతుంటారు. ఇది కూడా చదవండి: Delhi Election 2025: ఆ మూడు పార్టీల బలాలు.. బలహీనతలు -
వింటర్ ది డ్రాగన్: చలిపులి.. చర్మం వలుస్తోందా?
కొత్త ఏడాది తర్వాత క్రమక్రమంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయేమోగానీ... అందరూ బయటే ఎక్కువసేపు గడిపే సాయంత్రాలూ, పనులకు వెళ్లే ఉదయం వేళల్లో చలి కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఈ సీజన్లో వీచే కరకుగాలులు వాతావరణం నుంచి తేమను లాగేస్తాయి. అవి చర్మం నుంచి కూడా తేమను లాగేస్తుండం వల్ల మేను పొడిబారుతుంది. పొట్టుగా రాలుతుంది. ఇలాంటి సమస్యలన్నీ ఈ సీజన్లో అనివార్యంగా కనిపిస్తుంటాయి. ఒక్కొక్కరి చర్మ స్వభావం ఒక్కోలా ఉండటం వల్ల కొందరిలో చలికాలపు సమస్యలు ఎక్కువగానూ, మరికొందరిలో తక్కువగానూ కనిపిస్తుంటాయి. ఈ చలి సమస్యల తీవ్రత చర్మంపై చాలా ఎక్కువగా ఉన్నవారిలో... వారి మేనిపై పగుళ్లు, చర్మం పొట్టుగా రాలడం వంటి లక్షణాలతో ఎక్జిమా తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అలా ఈ సీజన్లో కనిపించే సమస్యల నుంచి రక్షణ పొందడమెలాగో తెలుసుకుందాం.కేవలం కొన్ని చిన్న చిన్న మార్పులతో చలికాలపు తీవ్రత నుంచి మిమ్మల్ని కాపాడుకోవచ్చు. అవి తెలుసుకునే ముందర ఈ కాలంలో వచ్చే కొన్ని సాధారణ చర్మ సమస్యలేమిటో చూద్దాం...ఇవీ సాధారణంగా కనిపించే చర్మ సమస్యలు... ఎక్జిమా ఫ్లేర్స్ : తక్కువ ఉష్ణోగ్రతల వల్ల చర్మం ప్రభావితమై ఎగ్జిమాలాంటి పగుళ్లు. చర్మం పొడిబారడం, పొట్టుగా రాలడం : బయటి చల్లగాలి కారణంగా దేహంలోని వేడిమి చర్మం నుంచి బయటకు వెళ్లడంతో తేమ కూడా బయటకు వెళ్తుంది. దాంతో చర్మం బాగా పొడిబారిపోవడమే కాకుండా, పొట్టుగా రాలుతుంది. పగిలే పెదవులు : సున్నితమైన పెదవుల చర్మమూ పగుళ్లువారుతుంది. చిల్ బ్లెయిన్స్ : చేతులూ, పాదాల మీద చర్మం కొన్నిచోట్ల (పగుళ్లు రాబోయే చోట) ఉబ్బెత్తుగా మారుతుంది. ఇలాంటి ఉబ్బెత్తు ప్రదేశాల్లో నొప్పి ఉంటుంది. వీటిని చిల్ బ్లెయిన్స్ అంటారు. వింటర్ యాక్నె : జిడ్డు చర్మం వల్లనే మొటిమలు ఎక్కువగా వస్తాయన్న భావన చాలామందిలో ఉంటుంది. దీనికి భిన్నంగా వాతావరణంలో చలి ఎక్కువగా ఉన్నప్పుడూ మొటిమలు వస్తాయి. వీటిని ‘వింటర్ యాక్నే’గా చెప్పవచ్చు.చర్మం ప్రభావితమైందని తెలిపే సూచనలివి... చలికాలపు చల్లగాలులకు చర్మం ప్రభావితమైనదనీ, దానికి ఇప్పుడు మరింత రక్షణాత్మక చర్యలు అవసరమని తెలియజేసేలక్షణాలివి... చర్మం ఎర్రబారడం, ఇలా ఎర్రబారిన చోట దురద రావడం ఏవైనా ఉపశమన చర్యలకోసం లేపనాల వంటివి రాసినప్పుడు ప్రభావితమైన చర్మభాగాలు మంటగా అనిపించడం చర్మం తీవ్రంగా పొడిబారినప్పుడు అక్కడ పొట్టులా రాలడం చర్మం నుంచి తేమ తొలగి΄ోవడంతో చర్మం బాగా బిగుతుగా ఉన్న ఫీలింగ్ ఏవైనా చర్మ సంరక్షణ లేపనాలు రాసినప్పుడు చర్మం ముట్టుకోనివ్వకపోవడం. చర్మంపై చలికాలపు దుష్ప్రభావాల నివారణ, రక్షణ చర్యలివి... తేమ పెరిగేలా చూసుకోవడం: చర్మం ఎప్పుడూ తేమ కోల్పోకుండా చూసుకునేందుకు క్రమం తప్పకుండా... హైలూరానిక్ యాసిడ్, షియా బటర్ లేదా సెరమైడ్స్ ఉండే మంచి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. మరవకూడని సన్ స్క్రీన్ : చలికాలపు ఎండవేడిమిలోనూ అల్ట్రా వయొలెట్ కిరణాలు చర్మంపై ప్రభావం చూపుతాయి. అందుకే ఎండలోకి వెళ్లేముందర 30 ప్లస్ ఎస్పీఎఫ్ ఉన్న సన్‌స్క్రీన్‌ను చర్మంపై రాసుకోవడం మంచిది. హ్యుమిడిఫైయర్ వాడటం : గదిలోపల ఉండే పొడిదనాన్ని ఎదుర్కోవడం కోసం (మరీ ముఖ్యంగా బెడ్రూమ్ వంటి చోట్ల) క్రమం తప్పకుండా హ్యుమిడిఫైయర్ వాడాలి. గోరువెచ్చటి నీటితో స్నానం : వెచ్చటి నీళ్లతో స్నానం చేయడమన్నది స్నానం వేళ బాగున్నప్పటికీ ఆ తర్వాత చర్మం తీవ్రంగా పొడిబారి పగుళ్లుబారినట్లుంటుంది. దీనికి బదులు గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేస్తే... స్నానం తర్వాత చర్మం బాగుంటుంది. గాఢమైన సౌందర్యసాధనాలు వద్దు చర్మంపై రాసుకునే ఉత్పాదనల్లో ఆల్కహాల్, రెటినాల్, మెంథాల్ వంటివి ఎక్కువ మోతాదుల్లో ఉన్నవి గానీ లేదా ఇతరత్రా గాఢమైన వాసనలు వచ్చే సౌందర్యసాధనాలకు బదులు తేలికపాటి సువాసన వెదజల్లే మైల్డ్ సౌందర్యసాధనాలు వాడుకోవడమే మంచిది. నీళ్లు తాగుతుండటం: చర్మం కోల్పోయే నీటి మోతాదులను మళ్లీ మళ్లీ భర్తీ చేసుకునేందుకు వీలుగా ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండటం మంచిది. మేని నిగారింపును పెంచే ఆహారాలు తీసుకోవడం: మేని నిగారింపును మరింతగా పెంచే తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలతో కూడిన... అన్ని రకాల ΄ోషకాలూ పుష్కలంగా ఉండే సమతులాహారం తీసుకోవడం మేలు. వైద్యనిపుణులను సంప్రదించడం: పైన పేర్కొన్న అన్ని రకాల జాగ్రత్తలను తీసుకున్న తర్వాత కూడా చర్మంపై చలికాలపు దుష్ప్రభావాలు కనిపిస్తుంటే... తక్షణం చర్మవ్యాధి నిపుణులను సంప్రదించడం మంచిది. డా. బాల నాగ సింధూర కంభంపాటి, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ (చదవండి: టేస్టీ బర్గర్ వెనుకున్న సీక్రెట్ తెలిస్తే కంగుతినడం ఖాయం..! ) -
చలికాలం.. కాస్త ఎండపడనిద్దాం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: చలికాలమని ముసుగుతన్ని ఇంట్లోనే పడుకుని కాలక్షేపం చేద్దామనుకుంటున్నారా? చలికి భయపడి మార్నింగ్ వాక్కు వెళ్లడం మానేశారా? ఇంట్లోంచి నేరుగా ఉదయం 10 తర్వాత కార్యాలయానికి బయలుదేరుతున్నారా? ఉదయం బాగా చలేస్తోందని.. సాయంత్రం వాకింగ్ చేస్తున్నారా? చలి పేరుతో ఇలా చేస్తుంటే వెంటనే మీ అలవాటును మార్చుకోండి. లేదంటే మానసిక ఒత్తిడి తప్పదని హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్(సీఎంవో) హోవార్డ్ లీవైన్ చెబుతున్నారు. చలికాలంలో వచ్చే వాతావరణ మార్పులతో మెదడులో కొన్ని రసాయన మార్పులు జరిగి.. శారీరకంగా నీరసంగా ఉన్నామనే భావన వస్తుందని.. ఈ భావనతో బయటకు వెళ్లి ఇతరులను కలవడం కూడా తగ్గిపోతుందని ఆయన పేర్కొంటున్నారు. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా తెలిసిన విషయాన్ని మర్చిపోవడం.. కొన్ని పదాలను అసలు పలికేందుకు ఇబ్బంది పడి.. వేరే పదాలను పలకడం వంటివి కూడా చేస్తారని ఆయన అధ్యయనం స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతిరోజూ ఉదయం 10 గంటలలోపు అరగంట పాటు సూర్యరశ్మిలో ఉండాలని సూచిస్తున్నారు. ఒకవేళ సూర్యరశ్మి అందుబాటులో లేని రోజుల్లో ప్రత్యేకంగా కాంతిని ప్రసరింపచేసేందుకు ఉపయోగించే లైట్ బాక్సుల ద్వారా కూడా ఉపశమనం పొందవచ్చని ఆయన చెబుతున్నారు.ఎస్ఏడీ.. ఎలా వస్తుందంటే..చలికాలంలో కాంతి లేకపోవడం వల్ల మన మానసిక, శారీరక ప్రవర్తనపై ప్రభావం పడుతుంది. దీనిని సీజనల్ అఫెక్టివ్ సిండ్రోమ్ (ఎస్ఏడీ) అని.. వైద్య పరిభాషలో ‘సిర్కాడియల్ రిథమ్స్’ అని అంటారు. ఎస్ఏడీ మన మెదడులోని నిద్రను ప్రేరేపించే హార్మోన్ మెలటోనిన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఇది మానసిక స్థితిని ప్రభావితం చేసే మరో ఎంజైమ్ సెరోటోనిన్ తక్కువ విడుదల కావడానికి దోహదం చేస్తుంది. ఈ రసాయన అసమతుల్యత వల్ల నీరసంగా మారిపోతాం. తద్వారా ఎక్కువగా తినడం.. ప్రధానంగా కార్బొహైడ్రేట్ ఆహారాన్ని ఎక్కువగా తీసుకుని.. ప్రోటీన్ ఆహారాన్ని తక్కువగా తీసుకోవడం కూడా జరుగుతుందని ఈ అధ్యయనంలో తేలింది. అంతేకాకుండా ఇతరులతో కలవడంపై దీని ప్రభావం ఉంటుందని అంటున్నారు. దీంతో ఇంటికే పరిమితమై మానసికంగా ఇబ్బంది పడతారని లీవైన్ స్పష్టం చేశారు. ఎస్ఏడీ అనేది కేవలం మానసిక స్థితి మాత్రమే కాదని అంతకుమించి ఏకాగ్రతను కూడా దెబ్బతీస్తుందని ఆయన పేర్కొంటున్నారు. జ్ఞాపకశక్తి వంటి సమస్యలతో పాటు మన పనితీరుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు. ఈ సిండ్రోమ్ మన ఉచ్ఛారణలో సరైన పదాలు పలకలేకపోవడంతో పాటు.. సరైన సమాచారం కూడా సకాలానికి గుర్తుకురాకపోవడం జరుగుతుందని ఆయన చెబుతున్నారు. సూర్యరశ్మి లేదా లైట్ థెరపీసీజనల్గా వచ్చే ఈ సిండ్రోమ్‌కు సాధారణంగా డోపమైన్ స్థాయిని పెంచే యాంటీ డిప్రెసెంట్స్ మందులను వాడతారు. అయితే, దీనికంటే మంచి మందు ఏమిటంటే.. ప్రతిరోజూ అరగంట పాటు సూర్యుడి ఎండ తగిలేలా ఉండటమేనని హోవార్డ్ లీవైన్ చెబుతున్నారు. అది కూడా ఉదయం 10 గంటలలోపు అరగంటపాటు సూర్యుడి ఎండ తగిలేలా ఉంటే ఈ సిండ్రోమ్ నుంచి బయటపడవచ్చని ఆయన జరిపిన అధ్యయనంలో తేలింది. ఒకవేళ చలికాలంలో వాతావరణ ప్రభావంతో సూర్యరశ్మి లేనిపక్షంలో లైట్ థెరపీని ఆయన సూచిస్తున్నారు. తెల్లని కాంతిని ఉత్పత్తి చేసే లైట్ బాక్సులను కొనుగోలు చేసి ఉపయోగించడమే ఈ లైట్ థెరపీ. ఆన్లైన్లో ఈ లైట్ బాక్సులు అందుబాటులో ఉన్నాయి. మీ లైట్ బాక్స్‌లో 10,000 లక్స్ (‘లక్స్’ అంటే నిర్దేశిత ప్రదేశంలో ఎంతమేర లైట్ పడుతుందని తెలిపేది. దీనిని కాంతి తీవ్రత/కాంతి ప్రకాశం అని పేర్కొంటారు) ఎక్స్పోజర్ ఉండాలి. సాధారణంగా సూర్యుడు బాగా ప్రకాశించే సమయంలో 50 వేల కాంతి ప్రకాశాలు ఉంటాయి. అందులో పదో వంతు కాంతి తీవ్రత ఉండేలా చూసుకుంటే చాలని ఆయన స్పష్టం చేస్తున్నారు. -
చలి కాలంలో వర్షం.. అనుకూలమా? ప్రతికూలమా?
దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. శీతాకాలంలో వర్షాలు కురవడం విచిత్రంగా అనిపిస్తుంది. ఇటువంటి వాతావరణంలో పొగమంచు పెరిగేందుకు అవకాశం ఉంటుందని, చలి తీవ్రత కూడా పెరుగుతుందని కొందరు అంటుంటారు. సాధారణంగా వేసవికాలంలో వర్షం కురిస్తే వాతావరణం చల్లగా మారి, మనకు హాయినిస్తుంది. అలాగే వాతావరణంలో తేమ శాతాన్ని పెంచుతుంది. మరి శీతాకాలంలో వర్షం పడినప్పుడు ఏమి జరుగుతుంది?మనదేశంలో శీతాకాలంలో వర్షాలు పడటం అనేది అతి అరుదుగా జరుగుతుంటుంది. అయితే ఈ వర్షాలుకు రుతుపవనాలకు ఏమాత్రం సంబంధం లేదు. భారత్‌తో చలికాలంలో వాయువ్య దిశ నుండి వచ్చే గాలులు గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. వీటిని వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ అంటారు. ఈ గాలులు పశ్చిమాన మధ్యధరా సముద్రం నుండి వస్తాయి. ఈ గాలుల కారణంగా వాతావరణంలో అల్ప పీడనం ఏర్పడుతుంది. ఫలితంగా వర్షాలు కురుస్తాయి.ఉష్ణోగ్రతలపై ప్రభావంభారతదేశంలో హిమాలయ ప్రాంతాలలో కురుస్తున్న మంచు కారణంగా ఏర్పడే చలి మైదాన ప్రాంతాల వరకూ వ్యాపిస్తుంది. శీతాకాలంలో వాతావరణం పొడిగా ఉన్నప్పటికీ, ఈ సమయంలో కురిసే వర్షం వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది ఉష్ణోగ్రతలను తగ్గిస్తుంది. ఈ వర్షం కారణంగా ఉత్తర, మధ్య భారతదేశంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. గాలిలో తేమ పెరుగుతుంది. ఈ రెండింటి కలయిక కారణంగా చలి మరింతగా పెరుగుతుంది. మంచు కురుస్తున్న ప్రాంతాల్లో ఒకవేళ వర్షం పడితే, అక్కడ చలి తగ్గుతుంది. చాలా చల్లగా ఉండే ప్రాంతాల్లో, కురిసే వర్షపు నీరు ఉష్ణోగ్రతను పెంచడంలో సహాయపడుతుంది. ఇది ఉత్తర భారతదేశంలో ఎక్కువగా జరుగుతుంది. అయితే అత్యంత అరుదుగా ఇది జరుగుతుంది. శీతాకాలంలో కురిసే తేలికపాటి వర్షం ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోకుండా కాపాడుతుంది.గాలిలో తేమశాతం పెరిగి..ఉత్తర భారతదేశంలోని మైదాన ప్రాంతాల్లో వర్షం కారణంగా, గాలిలో తేమశాతం చాలావరకూ పెరుగుతుంది. పొగమంచు కూడా పెరుగుతుంది. మరోవైపు ఇప్పటికే పొగమంచు ఉన్న ప్రాంతాల్లో, వర్షాలు కురిస్తే పొగమంచు తగ్గుతుంది. చలికాలంలో కురిసే వర్షాల వల్ల ఒక ప్రయోజనం ఉంది. ఢిల్లీ ఎన్సీఆర్ వంటి ప్రాంతాలలో కాలుష్యాన్ని తగ్గించడంలో, గాలి నాణ్యతను మెరుగుపరచడంలో వర్షాలు ఎంతో ఉపయోగపడతాయి. శీతాకాలంలో కురిసే వర్షాలు గాలిలోని కాలుష్య కారకాలను కడిగివేస్తాయి. ఇది గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది. పొగ, కాలుష్యం అధికంగా ఉండే నగరాల్లో వర్షం వల్ల కాలుష్యం తగ్గుతుంది. ఉత్తర భారతదేశంలో కురిసే శీతాకాలపు వానలు చలి గాలులను పెంచవు. వర్షం పడితే అది ఖచ్చితంగా చలిని కొంతవరకు ప్రభావితం చేస్తుంది. కానీ చలిగాలులను నియంత్రింపజేయదు. చలికాలంలో కురిసే వర్షం చల్లదనాన్ని తగ్గించడమనేది చాలా అరుదుగా జరుగుతుంది. అయితే ఇటువంటి వర్షం గాలిలో తేమను, చల్లదనాన్ని పెంచుతుంది. అదే సమయంలో కలుషితమైన గాలిని తగ్గిస్తుంది. ఇది కూడా చదవండి: Year Ender 2024: చిన్న పొరపాట్లు.. పెను ప్రమాదాలు -
చికాగోలో నాట్స్ వింటర్ క్లాత్ డ్రైవ్
భాషే రమ్యం.. సేవే గమ్యం నినాదం తో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. చికాగోలో పేదవారి కోసం ముందడుగు వేసింది. గడ్డ కట్టే చలిలో పేదలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వారి కోసం వింటర్ క్లాత్ డ్రైవ్ నిర్వహించింది. ఈ డ్రైవ్ ద్వారా చలికాలంలో వేసుకునే స్వెట్టర్లు, కోట్లు సేకరించింది. చిన్ననాటి నుంచే విద్యార్ధుల్లో సామాజిక సేవ అనేది అలవాటు చేసేందుకు ఈ వింటర్ డ్రైవ్‌ని నాట్స్ ఎంచుకుంది. చికాగో నాట్స్ సభ్యులు, తెలుగు కుటుంబాలకు చెందిన వారు ఈ వింటర్ క్లాత్ డ్రైవ్‌లో స్వెట్టర్లు, కోటులు, బూట్లు విరాళంగా ఇచ్చారు.. నాట్స్ చికాగో బృందం ఇలా సేకరించిన వాటిని చికాగోలోని అరోరా ఇల్లినాయిస్లో ఉన్న గుడ్ విల్ సంస్థకు విరాళంగా అందించింది. గుడ్‌విల్ సంస్థ నిరాశ్రయులకు, పేదలకు చలికాలంలో వారికి కావాల్సన సాయం చేస్తుంటుంది. నాట్స్ నిర్వహించిన వింటర్ క్లాత్ డ్రైవ్‌లో పాల్గొన్న చిన్నారులను నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అభినందించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను సేవా పథం వైపు నడిపిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా ప్రశంసించారు. థ్యాంక్స్ గివిండే సందర్భంగా నాట్స్ చికాగో విభాగం చేపట్టిన వింటర్ క్లాత్ డ్రైవ్ సామాజిక సేవలో నాట్స్ వేసిన మరో ముందడుగు అని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అన్నారు. ఈ డ్రైవ్‌లో పాల్గొన్న నాట్స్ చికాగో బృంద సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.నాట్స్ వింటర్ క్లాత్ డ్రైవ్ కార్యక్రమాన్ని నాట్స్ చాప్టర్ కోఆర్డినేటర్లు హవేల మద్దెల, బిందు వీడులమూడి, లక్ష్మి బొజ్జ, రోజా సీలంశెట్టి, చంద్రిమ దాడి, సిరిప్రియ బాచు, భారతి కేశనకుర్తి, భారతి పుట్ట, సింధు కాంతంనేని, ప్రియాంకా పొన్నూరు, వీర తక్కెలపాటి, అంజయ్య వేలూరు, ఈశ్వర్ వడ్లమన్నాటి తదితరులు చక్కటి ప్రణాళిక, సమన్వయంతో నిర్వహించారు. వింటర్ క్లాత్ డ్రైవ్ విజయంలో కీలక పాత్ర పోషించిన వాలంటీర్లు సుమతి నెప్పలాలి, రాధ పిడికిటి, బిందు బాలినేని, రామ్ కేశనకుర్తి, పాండు చెంగలశెట్టి, ప్రదీప్ బాచు, బాల వడ్లమన్నాటి, వీర ఆదిమూలం, రాజేష్ వీడులమూడి, శ్రీకాంత్ బొజ్జ, గోపీ ఉలవ, గిరి మారిని, వినోత్ కన్నన్, అరవింద్ కోగంటిలకి చికాగో నాట్స్ చాప్టర్ కోఆర్డినేటర్లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యులు శ్రీనివాస్ పిడికిటి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఆర్కే బాలినేని, హరీష్ జమ్ముల, ఎమాన్యూల్ నీల, కిరణ్ మందాడి, రవి తుమ్మల, కిషోర్ నారె, మురళి మేడిచర్ల, రాజేష్ కాండ్రు మరియు బోర్డ్ సభ్యులుగా ఉన్న ముర్తి కోప్పాక, మహేశ్ కాకర్ల, శ్రీనివాస్ అరసాడ , శ్రీనివాస్ బొప్పాన, డా. పాల్ దేవరపల్లిలు ఈ వింటర్ క్లాత్ డ్రైవ్‌కు తమ మద్దతు, సహకారం అందించినందుకు నాట్స్ చికాగో విభాగం ధన్యవాదాలు తెలిపింది.(చదవండి: టాంటెక్స్ ''నెలనెల తెలుగువెన్నెల'' 209 వ సాహిత్య సదస్సు) -
Snowfall Destinations: అత్యధిక మంచు కురిసే ప్రాంతాలివే..
భారతదేశంలోని ఉత్తరాదిన పలు ప్రాంతాల్లో ప్రస్తుతం విపరీతంగా మంచుకురుస్తోంది. దీంతో పర్యాటకులు ఆ మంచుతో కూడిన ప్రాంతాలను చూసేందుకు క్యూ కడుతున్నారు. ఆ మంచులో చాలాసేపు ఆడుకోవాలని తహతహలాడుతున్నారు. మరి ప్రపంచంలో అత్యధికంగా మంచుకురిసే ప్రాంతాలు ఎక్కడున్నాయో తెలుసా?నూతన సంవత్సరం ప్రారంభంలో ప్రపంచంలోని పలు దేశాల్లో మంచు కురుస్తుంటుంది. అయితే కొన్ని ప్రాంతాలు భారీ హిమపాతం కారణంగా ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఈ సమయంలో టూరిస్టులు ఆయా ప్రాంతాలకు తరలివచ్చి, తనివితీరా ఎంజాయ్ చేస్తుంటారు. ఆ ప్రాంతాలేవో, ఎక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.మౌంట్ డెనాలి, అలాస్కా ఉత్తర ధ్రువానికి సమీపంలోని అందమైన ప్రాంతం అలస్కా(Alaska). ఇది అమెరికాలో ఉంది. హిమపాతానికి ఈ ప్రాంతం ఎంతో ప్రసిద్ధి చెందింది. అలాస్కాలో ఏడాది పొడవునా మంచు కురుస్తుంటుంది. అయితే శీతాకాలంలో డెనాలి పర్వతంపై హిమపాత దృశ్యం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది.వెర్ఖోయాన్స్క్ అండ్ ఐమ్యాకాన్, రష్యారష్యాలోని వెర్కోయాన్స్క్, ఐమ్యాకాన్లు ప్రపంచంలోనే అత్యంత శీతల ప్రదేశాలలో ఒకటిగా గుర్తింపు పొందాయి. శీతాకాలంలో వెర్ఖోయాన్స్క్లో ఉష్ణోగ్రత -48 డిగ్రీల సెల్సియస్ వరకుచేరుకుంటుంది. ఐమ్యాకాన్(iMacon)లో ఉష్ణోగ్రత -71 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటుంది. అందుకే ప్రతీయేటా నూతన సంవత్సరంలో హిమపాతాన్ని చూసేందుకు పర్యాటకులు రష్యాకు తరలివస్తుంటారు.ఫ్రేజర్, కొలరాడోకొలరాడో అమెరికాలోని రెండవ అత్యంత శీతల ప్రదేశంగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా శీతాకాలంలో కొలరాడోలో భారీ హిమపాతంతో పాటు, తెల్లటి మంచు పలకలు కనిపిస్తాయి. కొలరాడోలోని ఫ్రేజర్లో మంచు కురుస్తున్న దృశ్యం టూరిస్టులను సంబ్రమాశ్చర్యాలకు లోనయ్యేలా చేస్తుంది.మిన్నెసోటా అండ్ యుకాన్, అమెరికాఅమెరికాలోని మిన్నెసోటాలో గల అంతర్జాతీయ జలపాతం(International Falls) ప్రపంచంలోని అత్యంత శీతల ప్రదేశాలలో ఒకటిగా గుర్తిస్తారు. ఈ జలపాతాన్ని ‘ఐస్ బాక్స్ ఆఫ్ ది నేషన్’ అని కూడా పిలుస్తారు. అమెరికాలోని యుకాన్లో గల స్నాగ్ అనే చిన్ని గ్రామం కూడా భారీ హిమపాతానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.ఉలాన్బాతర్, మంగోలియామంగోలియా రాజధాని ఉలాన్బాతర్ ప్రపంచంలోని అత్యంత శీతల ప్రదేశాలలో ప్రత్యేక స్థానం దక్కించుకుంది. శీతాకాలంలో ఇక్కడి ఉష్ణోగ్రత -16 డిగ్రీల సెల్సియస్‌కి పడిపోతుంది. ఫలితంగా భారీగా హిమపాతం కురుస్తుంది.ఇది కూడా చదవండి: భారత్‌పై ‘బంగ్లా’ విషం.. ఈ అంశాలతో స్పష్టం -
సుదీర్ఘ రాత్రికి కారణమేమిటి?
ఈ ఏడాది డిసెంబర్ 21కి ఓ ప్రత్యేకత ఉంది. పగటి సమయం 8 గంటలూ, రాత్రి సమయం 16 గంటలూ ఉంటుందని అంటున్నారు. కానీ, పదమూడున్నర గంటలే ఉంటుందనేది నిపుణుల అభిప్రాయం.సాధారణంగా ప్రతిరోజూ మనకు 12 గంటల పగలు 12 గంటలు రాత్రి సమయం ఉంటుంది. అయితే రుతువులను బట్టి, భూమిపై ఉన్న ప్రాంతాన్ని బట్టి పగలు – రాత్రుల సమయంలో ఎక్కువ తక్కువలూ ఉంటాయి. భూమి ఇరుసు 23.4ని కోణంలో వంగి ఉండటం వలన సూర్యుని నుండి వెలువడే సూర్యకాంతి భూమిపైన సమానంగా కాకుండా వివిధ కాలాలలో వివిధ రీతుల్లో పడుతుంది. ఫలితంగా రాత్రి–పగలు సమయాల్లో ఒక్కోసారి ఎక్కువ తేడాలు వస్తాయి. దీన్నే ‘ఆయనాతం’ అంటారు.సంవత్సరంలో రెండుసార్లు అయనాతం ఏర్పడుతుంది. మొదటిది వేసవి కాలపు ఆయనాతం కాగా, రెండవది శీతాకాలపు ఆయనాతం. శీతాకాలపు ఆయనాతం డిసెంబర్ 19–23 తేదీల మధ్యలో ఏదో ఒక రోజు ఏర్పడుతుంది. ఈరోజు మనం చూసేది శీతాకాలపు అయనా తాన్నే. ఇదే సమయంలో ఆస్ట్రేలియా వంటి ప్రాంతాల్లో పగలు ఎక్కువగా ఉండి రాత్రి తక్కువగా ఉంటుంది. శీతకాల ఆయనాతంతో భూమి ఉత్తరాయణం ప్రారంభిస్తుంది. అంటే... సూర్యుడు ఉత్తర దిశ వైపుకు కదలడం ప్రారంభిస్తాడు. అదే క్రమంలో జనవరి నుండి పగలు సమయం క్రమంగా పెరుగుతూ రాత్రి సమయం క్రమంగా తగ్గుతుంది.చదవండి: పురాతన నిధిలో గ్రహాంతర పదార్థాలు..!అయనాతం వంటి వాటిని ఆసరా చేసుకుని కొంతమంది ప్రత్యేక పూజలు చేస్తామంటూ కల్లబొల్లి మాటలతో ప్రజలను మోసం చేసే అవకాశం ఉంది. గ్రహణం ఏర్పడడం, ఆయనాతం ఏర్పడడం, నెలలో ఒకసారి పౌర్ణమి, ఒకసారి అమావాస్య ఏర్పడడం... ఇవన్నీ ప్రకృతిలో చోటు చేసుకునే సహజ ప్రకియలు. శాస్త్రీయ సమాచారాన్ని అర్థం చేసుకుని మోసగాళ్ల పాలబడకుండా జాగ్రత్తగా ఉండాలి. మూఢనమ్మకాలను నిర్మూలించి శాస్త్రీయ సమాజం నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.– చార్వాక, సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ నేషనల్ కోఆర్డినేటర్ -
ఓవైపు చలి మరోవైపు ఆకలి
శీతాకాలం.. అంటేనే భూమిమీద ఉత్తరార్థ గోళానికి పండుగ వాతావరణం. ప్రపంచంలో మూడోవంతు జనాభా ఇప్పుడు హాలిడే సీజన్ కోసం సిద్ధమవుతోంది. ఉత్తరార్థగోళ చలి ప్రభావాన్ని నేరుగా చవిచూస్తే గాజా స్ట్రిప్ మాత్రం వేడుకలకు దూరంగా ఆకలితో పోరాటం చేస్తోంది. చుట్టూ ఉన్న ప్రపంచమంతా పండుగకు సిద్ధమవుతుంటే క్షిపణుల మోతలు, బాంబుల దాడులతో ధ్వంసమైన గాజా నిరాశ, ఆకలితో మరణపు అంచున ఒంటరిగా నిలబడింది. ఉత్తరార్ధ గోళంలోకి వచ్చిన శీతాకాలం గాజాలో మరింత విషాదాన్ని తెచ్చిపెట్టింది. చల్లని వాతావరణం, వర్షం గాజాలో నిరాశ్రయులైన 20 లక్షల మంది పాలస్తీనియన్ల జీవితాలను దుర్భర పరిస్థితుల్లోకి నెట్టింది. ఇప్పటికే పలుమార్లు భారీ వర్షం కురిసింది. నిర్వాసితుల గుడారాలు వరదనీటిలో చిక్కుకుపోయాయి. కొన్ని కూలిపోయాయి. ఇది వేలాది నిరుపేద కుటుంబాలను మరింత కష్టాల్లోకి నెట్టింది. బాంబు దాడుల నుంచి తప్పించుకోవడానికి చాలా మంది ఇళ్ల నుంచి కేవలం కట్టుబట్టలతో బయటపడ్డారు. కొందరు శిథిలాల నుంచి బట్టలు తెచ్చుకున్నారు. కానీ అత్యధిక శాతం పాలస్తీనియన్లకు ఆ అవకాశం లేకుండాపోయింది. చలికాలం రావడంతో ఒంటిని వెచ్చగా ఉంచే సరైన దుస్తులులేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న పిల్లల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కనీసం చెప్పులు కూడా కొనుక్కోలేని దుస్థితి. ఆకాశాన్నంటుతున్న ధరలు ప్రస్తుతం అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం ఒక కొత్త గుడారం 1,000 డాలర్ల వరకు ఉంటుంది. ఒక తాత్కాలిక షెల్టర్ వందల డాలర్లు ఖర్చవుతుంది. ఒక కొత్త దుప్పటి 100 డాలర్ల వరకు ఉంటుంది. బట్టల ధరలు మరింత పెరిగిపోయాయి. ఒక లైట్ పైజామా ధర ఇప్పుడు 95 డాలర్లు. ఒక కోటు వంద డాలర్లు. ఒక జత బూట్లు 75 డాలర్లు. చలి కాచుకోవడానికి సరిపడా ఇంధనం లేదు. ఇక 8 కిలోల గ్యాస్ ధర 72 డాలర్లకు చేరుకుంది. కలప ధర కొంచెం తక్కువ. కానీ పునరావాస శిబిరాల్లో ఉన్న ఎవరి దగ్గరా అంత డబ్బు లేదు. విపరీతమైన డిమాండ్‌ను తీర్చడానికి గాజా అంతటా సెకండ్ హ్యాండ్ దుస్తుల మార్కెట్లు వెలిశాయి. అక్కడా ధరలు ఎక్కువగానే ఉన్నాయి. ప్రబలుతున్న వ్యాధులు వెచ్చగా ఉంచేందుకు బట్టలు, ఇంధనం లేకపోవడంతో శీతాకాలంలో జలుబు, ఫ్లూ, ఇతర వ్యాధులు ప్రబలుతున్నాయి. ఇవి ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయి. పోషకాహార లోపంతో బలహీనపడిన శరణార్థుల శరీరాలు విపరీతమైన భయం, బాంబుల గాయాలతో అలసిపోయాయి. అందుకే సాధారణ జలుబును కూడా వాళ్లు తట్టుకోలేక ఊరకనే జబ్బు పడుతున్నారు. ప్రస్తుతం ఆసుపత్రులు కూడా అరకొరగా పనిచేస్తున్నాయి. బాంబు దాడిలో తీవ్రంగా గా యపడిన వారికి మాత్రమే వైద్యం అందుతోంది. ఔషధాలు, సిబ్బంది కొరతతో సాధారణ రోగాలకు వైద్యం అందించలేకపోతున్నాయి. పరిశుభ్రత దాదాపు అసాధ్యంగా మారడంతో వ్యాధులు వేగంగా ప్రబలుతున్నాయి. చలివాతారణంలో సరైన విద్యుత్, ఇతరత్రా వసతులు ఏక గుడారాల్లో నిర్వాసితులు సరిగా స్నానం చేయలేక తిప్పలు పడుతున్నారు. చివరకు చేతులు కూడా శుభ్రంగా కడుక్కోలేని దైన్యం వాళ్లది. అత్యంత విలాసం.. రొట్టె ముక్క అక్టోబర్ నుంచి గాజాలోకి వచ్చే అంతర్జాతీయ మానవతా సహాయం కూడా చాలా తగ్గిపోయింది. గాజా స్ట్రిప్ మొత్తం వినాశకరమైన కరువును ఎదుర్కొంటోంది. డిమాండ్ పెరిగి సరకు రవాణా బాగా తగ్గిపోవడంతో ధరలు విపరీతంగా పైకి ఎగశాయి. ఒక బస్తా పిండి ధర ఇప్పుడు ఏకంగా 300 డాలర్లకు పైనే ఉంది. ఇతర ఆహార పదార్థాలు కూడా ప్రియమైపోయాయి. కూరగాయల ధరలు మండిపోతున్నాయి. వేట మాంసం, కోడి మాంసం కోరుకోవడం చాలా పెద్ద అత్యాశ కిందే లెక్క. ఒకప్పుడు కుటుంబాలకు జీవనాడి అయిన బేకరీలు ఇప్పుడు ముడి సరుకులు అందక మూతపడ్డాయి. ఒక రొట్టె దొరకడమే చాలా కష్టంగా మారింది. పిండి దొరికినా అది పురుగులమయం. ఒకవేళ పురుగులు లేకుంటే అప్పటికే అది ముక్కిపోయి ఉంటోంది. దీంతో ప్రజలు ఇప్పుడు తకాయా(ఛారిటీ సూప్ కిచెన్ల)పై ఆధారపడవలసి వస్తోంది. ఉదయం 11:00 గంటలకు ఇవి తెరిచే సమయానికి పంపిణీ కేంద్రాల ముందు జనం చాంతాడంత వరసల్లో క్యూ కడుతున్నారు. వేలాది మంది శరణార్థుల కుటుంబాలకు తమ పిల్లలను పోషించడానికి ఇవి తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. భరించలేని మానసిక వేదన ఆకలి శారీరక బాధే అయినా మానసిక వేదన అంతులేకుండా ఉంది. 2 లక్షలకు మందికి పైగా పిల్లలు పోషకాహార లేమితో బాధపడుతున్నారు. సరైన పౌష్టికాహారం లేక చిన్నారుల శరీరాలు ఎముకల గూడులాగా తయారయ్యాయి. వందలమంది చిన్నారులు సరైన తిండితిప్పలు లేక అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయారు. పిల్లలకు సరైన తిండికూడా పెట్టలేకపోతున్నామన్న బాధ తల్లిదండ్రులను విపరీతంగా వేధిస్తోంది. ఆకలితో చచ్చిపోతున్న పిల్లలను చూసి నిస్సహాయంగా కుమిలిపోతున్నారు. కన్నపిల్లలు కడతేరిపోతుంటే కన్నవారి కష్టాలకు హద్దుల్లేకుండా పోయిది. అత్యంత క్రూరమైన ఈ పరిస్థితులను దూరం నుంచి చూస్తున్న పశి్చమదేశాలు నిశ్శబ్దంగా ఉండటం మరింత దారుణం. భూతలంపై నడిమధ్యలోనే ఉన్నా చలి, ఆకలితో పాలస్తీనా సమాజం ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ మరణంకోసం ఎదురుచూస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఫోన్లూ వణుకుతాయ్
ఎండలకు రాళ్లు కూడా పగులుతాయని విన్నాం. కానీ.. చలికి ఫోన్లు సైతం పగిలిపోతాయట. వేసవితో పోలిస్తే శీతాకాలంలో స్మార్ట్ఫోన్లు కిందపడితే స్క్రీన్లు అత్యంత సులభంగా పగిలిపోతాయని ఎలక్ట్రానిక్ నిపుణులు చెబుతున్నారు. ఫోన్లతో పాటు స్మార్ట్ వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు వంటి ఎలక్ట్రానిక్ పరికరాల పనితీరుపై చలి తీవ్ర ప్రభావాన్నే చూపుతాయని పేర్కొంటున్నారు. చలికాలం వచ్చిందంటే చాలామంది ఆరోగ్య విషయాల్లో అనేక జాగ్రత్తలు తీసుకుంటారని.. ఇకపై చలికాలంలో స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు వంటి ఎలక్ట్రానిక్ పరికరాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరని నిపుణులు చెబుతున్నారు. – సాక్షి, అమరావతివిలువైన డేటా కోల్పోయే అవకాశంప్రస్తుత డిజిటల్ యుగంలో ఏ సమాచారమైనా పేపర్ డాక్యుమెంట్ల రూపంలో భద్రపరుచుకోవడం కంటే.. వాటిని ఫోన్లు లేదా వ్యక్తిగత కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లలో సేవ్ చేసుకుని భద్రపరచుకుంటుంటాం. అయితే ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లలో ఉండే హార్డ్ డ్రైÐవ్లు కొన్ని సందర్భాల్లో విపరీతమైన చలికి ప్రభావితమై పనిచేయకుండా పోయే ప్రమాదం ఉంది. దీంతో హార్డ్ డ్రైవ్‌లలో మాత్రమే నిక్షిప్తమై ఉండే మన విలువైన సమాచారం, డాక్యుమెంట్లను పూర్తిగా తిరిగి చూడడానికి వీలులేని విధంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను ఉపయోగించేవారు తాము వాడేవి కొత్తవి కదా అని అజాగ్రత్త ఉండొచ్చు. కానీ, కొత్తవి అయినంత మాత్రాన చలికి ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకోవడం కేవలం అపోహేనట. కొత్త ఎల్రక్టానిక్ పరికరాలు కూడా విపరీతమైన చలి పరిస్థితుల్లో వాటి పనితీరు తగ్గుముఖం పట్టవచ్చని నిఫుణులు పేర్కొంటున్నారు.చలి విపరీతంగా ఉంటే ఫోను ఆగిపోయే ఛాన్స్» ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, ల్యాప్‌టాప్‌ల ఎల్సీడీ, ఓఎల్ఈడీ స్కీన్లు నిదానంగా పనిచేయడం వల్ల ఆ సమయంలో వాటిని ఉపయోగిస్తున్నప్పుడు ఆ పరికరాల స్కీన్లపై కనిపించే బొమ్మలు, అక్షరాల నాణ్యత, స్పష్టత సరిగా ఉండకపోయే అవకాశం ఉంది. » ప్రమాదవశాత్తు స్మార్ట్ ఫోను వంటివి కిందపడితే వేసవి కాలంలో కంటే శీతాకాలంలో వాటి స్క్రీన్లు అత్యంత సులభంగా పగిలిపోతాయి. » ఎలక్ట్రానిక్ పరికరాలను వేలిముద్రల గుర్తింపు, ముఖ గుర్తింపు ద్వారానే త్వరగా అన్, ఆఫ్ అయ్యేలా పెట్టుకుంటాం. కానీ.. ఎక్కువ చలి సమయంలో సెన్సార్ విధానం సరిగా పనిచేయక ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్నెస్ బ్యాండ్లు వంటి ధరించగలిగేవి విపరీతమైన చలిలో కచి్చతమైన రీడింగ్‌లను తెలపలేవు. » కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లో ఉపయోగించే హార్డ్ డ్రైవ్‌లు చలి ప్రభావంతో ఆలస్యంగా ఓపెన్ కావడం వంటి పరిస్థితులు తలెత్తుతాయి. » ఎల్రక్టానిక్ వస్తువులలో ఉండే సున్నితమైన, అతి సున్నితమైన సర్క్యూట్లు చలికి తుప్పు పట్టే అవకాశం ఉండటంతో ఆయా వస్తువులు పూర్తిగా పనిచేయకుండా పోయే అవకాశం ఏర్పడుతుంది. » కెమెరాలు సైతం చలి తగ్గి ఎండ పెరిగే కొద్దీ వాటి అద్దాలపై పొరగా ఏర్పడే పొగమంచు ఫొటోల్లోని బొమ్మ నాణ్యతను ప్రభావితం చేస్తుంది. » ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లలో ఉపయోగించే లిథియం అయాన్ బ్యాటరీలు చల్లని ఉష్ణోగ్రతలలో పేలవంగా పనిచేస్తాయని, విపరీతమైన చలిలో బ్యాటరీ తాత్కాలికంగా పనిచేయడం ఆగిపోవచ్చు లేదా శాశ్వతంగా దెబ్బతినే అవకాశం ఉంది. » స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్ బడ్లు వేగంగా బ్యాటరీ నష్టానికి గురికావడంతో అవి పనిచేయడంలో ఎక్కువగా అవాంతరాలు ఏర్పడే వీలుంది. » ఎలక్రానిక్ పరిరకాలకు ఉపయోగించే గాజు, ప్లాస్టిక్ వంటివి చలికి పెళుసుబారి చిన్న ఒత్తిడికే పగుళ్లు లేదా విరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.ఇలా చేయడం బెటర్» చలికి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వ్యక్తిగతంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో.. ఎల్రక్టానిక్ పరికరాల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని నిఫుణులు సూచిస్తున్నారు. » శీతాకాలంలో ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లకు సాధారణ కన్నా ఎక్కువసార్లు చార్జింగ్ పెడుతూ ఉండాలి. ఎక్కువ కాలం పాటు గడ్డకట్టే చలికి పరికరాలను బహిర్గతం చేయకుండా ఉంచాలి. తప్పనిసరిగా బయటకు తీసుకెళ్లాల్సి వచ్చినప్పుడు చలి సోకని కవర్లలో వాటిని ఉంచాలి.» చలికాలంలో స్మార్ట్ ఫోన్లు సహా అన్ని ఎల్రక్టానిక్ వస్తువులను ఆరుబయట చలిలో ఎక్కువ సమయం వినియోగించాల్సి వస్తే.. ఇంటికి చేరుకోగానే వాటిని శుభ్రం చేయడం మంచిదని సూచిస్తున్నారు. » చల్లటి పరిస్థితులను తట్టుకునేలా రూపొందించిన ఎల్రక్టానిక్ పరికరాలను కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. -
చలికాలంలో గీజర్లు వాడుతున్నారా ? జాగ్రత్తలు పాటించండి! లేదంటే ముప్పే!
ప్రస్తుతం చలి పులి పంజా విసురుతోంది. బారెడు పొద్దెక్కినా మంచంమీద నుంచి లేవాలంటే వణుకు పుడుతోంది. మరి ఈ చలినుంచి తప్పించుకోవాలంటే రూం హీటర్లు, గీజర్లు వాడడం అనివార్యమనే చెప్పాలి. అయితే ఇటీవల గీజర్లకు సంబంధించి కొన్ని విషాదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో గీజర్ల వాడకంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అవేంటో చూద్దాం. గీజర్ల కొనుగోలు విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఉత్తమ బ్రాండ్లను మాత్రమే ఎంచుకోవాలి. అంతేకాదు తొందరంగా నీళ్లు వేడెక్కాలంటే నాణ్యమైన గీజర్లను వాడాలి. గీజర్‌ను ఆన్ చేసి, స్నానం చేయడం కాకుండా, నీళ్లను బకెట్లో నింపుకొని, గీజర్ ఆఫ్ చేసిన స్నానానికి వెళ్లాలి. దీని కరెంట్ ఆదా అవుతుంది. ప్రమాదాలను చాలావరకు నివారించే అవకాశం ఉంది.గీజర్ ఎక్కువ సమయం ఆన్‌లో ఉండటం అంత మంచిదికాదు.అలాగే ఆటో కట్ఆఫ్ ఉన్న గీజర్లను ఎంచుకోవాలి. పొరపాటున గీజర్ ఆన్ చేసి మర్చిపోతే, పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. గీజర్లను తడి తగలకుండా ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి. గీజర్‌కు గోడకు మధ్య ఖాళీ ఉండాలి.గీజర్‌లో ప్రెషర్ ఎక్కువ అయితే ఆ ఒత్తిడిని విడుదల చేయడానికి గీజర్‌లో వాల్వ్ ఉంచారో లేదో చెక్ చేసుకోవాలి. వాల్వ్‌లో ఏదైనా లోపం ఉందేమో ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి. -
16గంటల.. సుదీర్ఘరాత్రి
తిరుపతి సిటీ: సాధారణంగా శీతాకాలంలో పగలు తక్కువగాను, రాత్రి సమయం ఎక్కువ ఉంటుంది. ఏటా వేసవిలో భూమి సూర్యుడికి దగ్గరగా, శీతాకాలంలో భూమి సూర్యుడికి దూరంగా కక్ష్య దిశలో మార్పులు జరుగుతుంటాయి. ఈ క్రమంలో ఏర్పడే ప్రక్రియనే వేసవి కాలపు అయనాంతం, శీతాకాలపు అయనాంతం అంటారు. ఈ ఏడాది శీతాకాలంలో డిసెంబర్ 21న వింత చూడబోతున్నాం. ఆ రోజు సుదీర్ఘమైన రాత్రి ఏర్పడనుంది. ఏకంగా 16 గంటల పాటు రాత్రి సమయం, 8గంటల పాటు పగలు సమయం మాత్రమే ఉంటుంది. ఇలా జరగడాన్ని శీతాకాల అయనాంతం (వింటర్ సోల్స్టైస్) అంటారు. సూర్యుడికి సుదూరంగా భూమి శీతాకాలపు అయనాంతం ఏర్పడే రోజున భూమి సూర్యుడికి దూరంగా ఉంటుంది. ఆ రోజున భూమి ధ్రువం వద్ద 23.5 డిగ్రీల వంపులో ఉంటుంది. ఈ సహజ మార్పు కారణంగా 2024లో అత్యంత తక్కువ సమయం పగలు ఉంటుంది. దీంతో సూర్యకాంతి 8 గంటలు, చంద్రుడి కాంతి 16 గంటల వరకు ఉంటుంది. భూమి తన అక్ష్యం వైపు తిరిగే సమయంలో దక్షిణ అర్ధగోళంలో భూమి, సూర్యుడి మధ్య దూరం గరిష్టంగా ఉంటుంది. ఆ సమయంలో ఏర్పడే దానినే అయనాంతరం అంటారు. సూర్యుడు మధ్యాహ్న సమయంలో ఆకాశంలో అత్యధిక లేదా అత్యల్ప స్థానానికి చేరుకున్నప్పుడు సూర్యుని చుట్టూ భూమి కక్ష్యలో ఉండే రెండు బింధువులను అయనాంతం అంటారు. దీని ఫలితంగా సంవత్సరంలో పొడవైన రోజు (వేసవి కాలపు అయనాంతం), అతి తక్కువ రోజు (శీతాకాలపు అయనాంతం) వస్తుంది. ఇది ఏటా రెండుసార్లు జరిగే ఘట్టం. సంవత్సరం పొడవునా, ఉత్తర లేదా దక్షిణ అర్ధగోళం సూర్యుని వైపు వంగి ఉంటుంది. వేసవి కాలపు అయనాంతం అనేది అత్యంత పొడవైన రోజు. అయనాంతంపై ప్రగాఢ నమ్మకాలు శీతాకాలంలో ఏర్పడే అయనాంతంపై పలు దేశాలలో పలురకాల నమ్మకాలను ప్రజలు పాటిస్తుంటారు. చైనాతో పాటు ఇతర తూర్పు ఆసియా దేశాలలో బౌద్ధమతంలోని యన్, యాంగ్ శాఖకు చెందిన ప్రజలు ఐక్యత, శ్రేయస్సుకు ప్రతీకగా నమ్ముతూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉత్తర భారత్‌లో శ్రీకృష్ణునికి నైవేద్యం సమర్పించి, గీతాపారాయణం చేస్తారు. రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో పుష్య మాస పండుగను ఘనంగా జరుపుకుంటారు. సూర్యుడి ఉత్తరాయణ ప్రక్రియ శీతాకాలపు అయనాంతం నుంచి మొదలవుతుంది. అందుకే మన దేశంలో దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇదో వింత అనుభూతి భూ భ్రమణంలో భాగంగా సూర్యుడు, భూమి మధ్య దూరం ఏడాదిలో ఒక్కసారి పెరగడం, తగ్గడం జరుగుతుంటుంది. వేసవిలో సూర్యుడికి దగ్గరగానూ, శీతాకాలంలో సూర్యుడికి దూరంగా భూభ్రమణం జరుగుతుంటుంది. భూమి సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు వేసవి అయనాంతంగానూ, సూర్యుడికి సుదూరంగా భూభ్రమణం జరిగినప్పుడు శీతాకాలపు అయనాంతంగా పేర్కొంటారు. – నెహ్రూ, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, రీజినల్ సైన్స్ సెంటర్21న తగ్గనున్న ఉష్ణోగ్రతలు శీతాకాలపు అయనాంతం ఏర్పడే రోజు, తేదీ ఏటా మారుతూ ఉంటుంది. అయితే, కచి్చతంగా డిసెంబర్ 20 నుంచి 23 తేదీలలోపు మాత్రమే వస్తుంటుంది. ఈ ఏడాది 21వ తేదీన ఈ అరుదైన ఘట్టం సంభవిస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీంతో సూర్యకిరణాలు అలస్యంగా భూమికి చేరుతాయి. ఈ కారణంగా ఉష్ణోగ్రతలలో మార్పులు సంభవించి, దేశవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. -
6 జిల్లాల్లో శీతల గాలులు: పంటలను ఇలా రక్షించుకుందాం!
తెలంగాణా రాష్ట్రంలో వచ్చే రెండు రోజు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని, ఉదయపు వేళల్లో దట్టంగా పొగమంచు ఆవరించే అవకాశం ఉందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయ వ్యవసాయ వాతావరణ పరిశోధన కేంద్రం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డా. పి. లీలారాణి ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో శీతల గాలులు వీచే అవకాశం ఉంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వివిధ పంటలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. రైతులు ఈ కింది సూచనలు పాటించాలని డా. పి. లీలారాణి సూచించారు.వరి: తెలంగాణా జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు చాలా ప్రాంతాలలో 15 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. చలి ప్రభావంతో యాసంగి నారుమడుల్లో నారు ఎదగక పోవచ్చు. ఆకులు పసుపు, ఎరుపు రంగుల్లోకి మారవచ్చు. కొన్నిసార్లు నారు చనిపోవచ్చు. అందువల్ల రైతులు కొన్ని రక్షణ చర్యలు చేపట్టాలి. నారుమళ్ళపై ఇనుప చువ్వలు లేదా వెదురు కర్రలతో ఊతమిచ్చి పైన పలుచని పాలిథిన్ షీట్ లేదా ఖాళీ యూరియా బస్తాలతో తయారు చేసిన పట్టాలతో సాయంత్రం పూట కప్పి, మరుసటి రోజు ఉదయాన్నే తీసివేయాలి. రాత్రి వేళల్లో నారుమడిలో నీరు నిండుగా ఉంచి తెల్లవారుజామున తీసివేసి, కొత్త నీరు పెట్టాలి. ∙200 చదరపు మీటరు విస్తీర్ణం గల నారుమడికి ఆఖరి దుక్కిలో 2 క్వింటాళ్లు బాగా చివికిన కోళ్ళు లేదా గొర్రెల ఎరువు వేయాలి. విత్తే సమయంలో 1 కిలో నత్రజని, 1కిలో భాస్వరం, 1 కిలో పొటాషియం ఇచ్చే రసాయనిక ఎరువులు వేయాలి. వరి నారుమళ్ళలో జింక్ ధాతువు లోపం నివారణకు 2 గ్రా. జింక్ సల్ఫేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.వరుసగా వరి పంట పండించే భూముల్లో ప్రతి మూడు పైర్లకు ఒకసారి లేదా ప్రతి యాసంగిలో దమ్ములో ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేట్ వేయాలి. చలి వాతావరణం, పొగమంచు వరిని అగ్గి తెగులు ఆశించటానికి అనుకూలం. పొలంలో, పొలంగట్లపైన ఉండే గడ్డి కలుపు మొక్కలు అగ్గి తెగులను వ్యాప్తి చేస్తాయి. కాబట్టి, పొలం గట్లపై కలుపు లేకుండా చూసుకోవాలి. వరి నారుమళ్ళలో అగ్గి తెగులు గమనిస్తే, నివారణకు 0.5 గ్రా. ట్రైసైక్లాజోల్ లేదా 1.5 మి.లీ. ఐసోప్రొథైయోలిన్ లేదా 2.5 మి.లీ. కాసుగామైసిన్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మొక్కజొన్న: చలి వల్ల మొక్కజొన్నలో భాస్వరం లోపించి ఆకులు ఊదా రంగులోకి మారుతాయి. భాస్వరం లోప లక్షణాలు గమనించినట్లైతే నివారణకు 10 గ్రా. 19–19–19 లేదా డి.ఎ.పి మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.మిరప : ప్రస్తుత చలి వాతావరణం మిరపను బూడిద తెగులు ఆశించటానికి అనుకూలం. నివారణకు, 3గ్రా. నీటిలో కరిగే గంధకం లేదా 1 మి.లీ. అజాక్సిస్ట్రోబిన్ లేదా 2.5గ్రా. టేబుకొనజోల్ + గంధకం లేదా 1.5గ్రా. కార్బండజిమ్ + మాంకోజేబ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.మామిడి: ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మామిడిలో తేనెమంచు పురుగు, బూడిద తెగులు ఆశించటానికి అనుకూలం. నివారణకు, 0.3గ్రా. డైనోటేఫురాన్ + 1గ్రా. కార్బండజిమ్ + 2.5 మి.లీ. వేపనూనె లేదా 0.5 గ్రా. థయోమిథాక్సామ్ + 2 మి.లీ. హెక్సాకొనజోల్ + 2.5 మి.లి వేప నూనె మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. కుసుమ: నవంబర్‌లో విత్తుకున్న కుసుమ పంటకు పేనుబంక ఆశించే అవకాశం ఉంది. నివారణకు 2 మి.లీ. డైమిథోయెట్‌ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. -
గరిటెడైనను చాలు.. గాడిద పాలు
సాక్షి, అమరావతి: ‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు.. కడివెడైననేమి ఖరము పాలు’ అనే వేమన పద్యం ఇప్పుడు ‘గరిటెడైనను చాలు.. గాడిద పాలు’ అని రూపుమార్చుకుంది. ప్రస్తుత తరుణంలో కొన్ని వస్తువులకు, ఆహార పదార్థాలకు ఆదరణ అనూహ్యంగా పెరిగింది. అందులో భాగంగానే గాడిద పాలకు డిమాండ్ ఏర్పడింది. అయితే, గాడిద పాలు దొరకడం కష్టం. ఎక్కడోగానీ.. ఎవరికో గానీ గాడిదలు అందుబాటులో ఉండవు. ఈ పరిస్థితుల్లో ఇటీవల వీధుల్లోకి అప్పుడప్పుడు గాడిదల్ని తీసుకొచ్చి మన కళ్లముందే గాడిద పాలు పితికి ఇస్తున్నారు.తెలంగాణ నుంచి వచ్చి..తెలంగాణ నుంచి గాడిదలను కొన్ని కుటుంబాల వారు ఏపీకి తీసుకువస్తున్నారు. జూలైలోనే ఇక్కడికి జనవరి వరకూ ఇళ్లను అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఇక్కడే గాడిదలను పెంచుతున్నారు. శీతాకాలం వచ్చేసరికి గాడిదలు పిల్లల్ని కంటాయి. ఈ కాలంలోనే పాలనూ ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. తెలంగాణ నుంచి వచ్చిన వారంతా పాడి గాడిదను ఊరంతా తిప్పుతూ ఇంటింటికీ పాలను విక్రయిస్తుంటారు. రోజుకి మూడు కప్పులు చొప్పున మూడు రోజుల పాటు గాడిద పాలు తాగితే ఆరోగ్య సమస్యలు తొలిగిపోతాయని వీరు ప్రచారం చేస్తున్నారు.15 మిల్లీలీటర్లు.. రూ.100కేవలం 15 మిల్లీలీటర్లు (అర టీ కప్పు) గాడిద పాల ధర రూ.100 పలుకుతోంది. ఇళ్ల వద్దకు వచ్చే పాల విక్రయదారులు ముందుగా రూ.300 వరకూ ధర చెబుతున్నారు. బేరమాడితే రూ.100 నుంచి రూ.200 వరకూ తగ్గించి ఇస్తున్నారు. ఈ లెక్కన లీటరు గాడిద పాల ధర కనీసం రూ.7 వేలు వరకూ ఉంటోంది. అయితే ఇందుకోసం ఒక గాడిదను, దూడను పోషించడానికి ఏటా రూ.80 వేలు ఖర్చవుతుందని పెంపెకందారులు చెబుతున్నారు.ఎందుకంత డిమాండ్ఒక గాడిద రోజుకు అర లీటర్ నుంచి 1.30 లీటర్ల వరకు పాలు ఇస్తుంది. తల్లి పాలలో ఉన్నట్టుగానే గాడిద పాలలోనూ పుష్కలంగా విటమిన్లు (ఏ, బీ1, బీ5, బీ6, బీ12, ఫోలిక్ ఆమ్లం) ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు. చర్మ సౌందర్యానికి, శిశు పోషణ కోసం పూర్వం నుంచీ గాడిద పాలను వాడటమేనేది ఉంది. ఊపిరితిత్తుల్లో నిమ్ము, ఆయాసం, కఫం, జలుబు వంటి వాటికి గాడిద పాలు ఔషధంగా పనిచేస్తాయని నమ్ముతుంటారు. దీంతో గాడిద పాల వ్యాపారం బాగా జరుగుతోంది.రోజుకి రూ.2 వేల సంపాదన మాది తెలంగాణలోని మంచిర్యాల. మా తాత ముత్తాతల నుంచీ గాడిదలను పెంచడం, పాలను విక్రయించడం మా వృత్తి. 10 కుటుంబాల వాళ్లం ఏటా పిల్లాపాపలతో కలిసి గాడిదలను తీసుకుని ఏపీకి వస్తాం. స్థానికంగా ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటాం. ఇక్కడి ప్రధాన నగరాలు, పట్టణాల్లో గాడిద పాలకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. బొంబాయ్ కాలనీలో ఉంటూ విజయవాడ వీధుల్లో పాలు విక్రయిస్తున్నాం. రోజుకి ఒక్కో గాడిద పాల ద్వారా రూ.2 వేల వరకూ ఆదాయం వస్తుంది. పిల్లలు పాఠశాలలకు వెళ్లే సమయానికంటే ముందే ఇళ్లకే వెళ్లి పాలు విక్రయిస్తుంటాం. అప్పుడే వ్యాపారం బాగుంటుంది. – జె.మహేష్, గాడిద పాల వ్యాపారి -
శీతాకాలంలో ఈ సూపర్ ఫుడ్‌తో అనేక సమస్యలకు చెక్
చలి కాలంలో శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది. అందుకే ఈ సీజన్‌కు తగినట్టుగా మన ఆహార అలవాట్లు మార్చుకోవాలి. చలికాలంలో బాడీని వేడిగా ఉంచుకోవడంతోపాటు, కొవ్వులేని ఆహార పదార్థాలను తీసుకోవాలి. వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందించే చియా గింజలను వింటర్ సూపర్ ఫుడ్‌గా చెబుతారు ఆహార నిపుణులు. వీటిల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ముఖ్యంగా ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ (ALA)లో పుష్కలంగా లభిస్తాయంటున్నారు నిపుణులు. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె, మెదడు పనితీరును మెరుగుపర్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి.చియా సీడ్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రొటీన్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు , మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. వీటిని పలు రకాలుగా మన ఆహారంలో చేర్చుకోవచ్చు. ముఖ్యంగా చియా వాటర్, స్మూతీస్, యోగర్ట్స్, లలాడ్స్, పుడ్డింగ్ రూపంలో తీసుకోవచ్చు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె ఆరోగ్యానికి, మంటను తగ్గించడానికి, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.చియా గింజల్లో ఎక్కువగా లభించే డైటరీ ఫైబర్ జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. మంచి శక్తి నిస్తుంది.యాంటీఆక్సిడెంట్లతో నిండిన చియా విత్తనాలు పర్యావరణ కారకాలు, కాలానుగుణ హెచ్చుతగ్గుల వల్ల కలిగే సమస్యల్ని ఎదుర్కోవడంలో సహాయపడతాయి, రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలనుంచి ఉపశమనానికి తోడ్పడతాయి.అలాగే చలికాలంలో నీళ్లు ఎక్కువగా తాగుతాం కాబట్టి చియా గింజల వాటర్ తీసుకోవడం మంచిది. చియా విత్తనాలు హైడ్రోఫిలిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఫలితంగా శీతాకాలంలో శరీరంలో తేమను నిలుపుకోవడంలో సహాయపడతాయి. చియా విత్తనాలు చర్మం తేమను కోల్పోకుండా కాపాడుతాయి. చర్మ సమస్యలను దూరం చేస్తాయి.హెర్బల్ టీ లేదా హాట్ చాక్లెట్ వంటి వేడి పానీయాలకు చియా సీడ్స్ యాడ్ చేసుకోవచ్చు.ఒక గ్లాస్ నీటిలో, కొద్దిగా చియా గింజలు వేసి, రాత్రంతా నానబెట్టాలి. ఆ నీటిని ఉదయం పరగడుపునే తాగితే, రోజంతా హైడ్రేటెడ్‌గా ఉంటుంది. పీచు పదార్థం పుష్కలంగా అందుతుంది. తద్వారా జీర్ణక్రియ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మలబద్ధకం నుంచీ ఉపశమనం లభిస్తుంది.చియా గింజల్లో యాంటి ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షించడంలో సాయపడతాయి. ఇందులోని యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు కేన్సర్ లక్షణాలను తగ్గిస్తాయి. చియా పుడ్డింగ్: పాలలో (బాదం లేదా కొబ్బరి పాలతో కూడా) చియా గింజలను నానబెట్టి రాత్రంతా రిఫ్రిజిరేటర్లో ఉంచి, నచ్చిన మరికొన్ని పండ్ల ముక్కలను కలుపుకొని చియా సీడ్ పుడ్డింగ్‌ను చేసుకోవచ్చు. సౌందర్య పోషణలోనూ, జుట్టు సంరక్షణలో కూడా చియా గింజలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. -
చలికాలంలో బరువు పెరుగుతారెందుకు? అదుపులో ఉండేందుకు ఏం చేయాలి?
చలి వాతావరణంలో మన ఆహారపు అలవాట్లు మారుతుంటాయి. శీతాకాలంలో మనం వేడిగా ఉండే ఆహారపదార్థాలను అధికంగా తీసుకుంటుంటాం. ఫలితంగా శరీర బరువు పెరగడం మొదలవుతుంది. ఇది కొందరిలో ఆందోళనకు దారితీస్తుంది. అయితే చలికాలంలో కొన్ని జాగ్రత్తలను తీసుకోవడం, నియమాలను పాటించడం ద్వారా బరువును అదుపులో ఉంచుకోవచ్చు. చలికాలంలో బరువు పెరగడానికి కారణాలేమిటో, ఏ విధంగా బరువును అదుపులో ఉంచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.అదనపు కేలరీల తీసుకోవడంచలికాలంలో మనం ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటుంటాం. అతిగా టీ, కాఫీలు తాగడం, తీపి పదార్థాలు ఎక్కువగా తినడం మొదలైనవన్నీ బరువు పెరగడానికి కారణంగా నిలుస్తాయి. శీతాకాలంలో శరీరంలోని జీవక్రియ మందగిస్తుంది. ఫలితంగొ కొద్ది కేలరీలు మాత్రమే బర్న్ అవుతాయి.వ్యాయామం చేయకపోవడంచలికాలంలో చాలామంది వెచ్చగా పడుకోవాలని అనుకుంటారు. దీంతో రోజువారీ వ్యాయామాన్ని ఆపివేస్తారు. ఫలితంగా బరువు పెరగడం ప్రారంభమవుతుంది. దీనిని నివారించేందుకు వ్యాయామంపై దృష్టి పెట్టాలి.ప్రోటీన్ తీసుకోవడం ముఖ్యంఆహారంలో ప్రోటీన్ ఉండటం ముఖ్యం. ప్రొటీన్ వినియోగం జీవక్రియను పెంచుతుంది. కండరాలను నిర్మించడంలో కూడా సహాయపడుతుంది. పప్పులు, చేపలు, గుడ్లు, జున్ను ఇలా ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.చక్కెర- ఉప్పు తగ్గించండిచలికాలంలో తీపిని ఎక్కువగా తినడం కూడా బరువు పెరగడానికి కారణంగా నిలుస్తుంది. అదనంగా తీసుకునే ఉప్పు కూడా బరువు పెరగడానికి కారణంగా నిలుస్తుంది. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో నీరు చేరి బరువు పెరుగుతారు.ఫైబర్ కలిగిన ఆహారం ఉత్తమంపండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు మొదలైన ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను శీతాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాలి. ఫలితంగా కడుపు చాలా కాలం పాటు నిండుగా ఉంటుంది. బరువు పెరిగేందుకు అవకాశమివ్వదు.తాగునీరు- సూప్చలికాలంలో నీరు ఎక్కువగా తీసుకోవాలి. దీని వల్ల జీవక్రియ పెరుగుతుంది. ఆకలి తగ్గుతుంది. అలాగే చలికాలంలో వేడి వేడి సూప్ తాగడం మంచిది. తక్కువ కేలరీలు కలిగిన కూరగాయల సూప్ లేదా చికెన్ సూప్ తీసుకోవచ్చు.వ్యాయామం చేయండిచలికాలంలో వ్యాయామంపై తగిన శ్రద్ధ వహించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా కేలరీలను బర్న్ చేయవచ్చు. బరువు తగ్గవచ్చు.ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు శీతాకాలంలో ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు తీసుకోవాలి. ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. ఈ తరహా కొవ్వులు అసంతృప్తమైనవి. ఫలితంగా గుండెకు కూడా మేలు కలుగుతుంది. ఆలివ్ ఆయిల్, అవకాడో, గింజధాన్యాలను తీసుకోవడం ఉత్తమం.ఇది కూడా చదవండి: నేడు గీతా జయంతి: రూపాయికే భగవద్గీతను అందిస్తూ.. గీతాప్రెస్ వందేళ్ల ఘన చరిత్ర -
చలికాలంలోనూ ‘ఎండలు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చలికాలం కొనసాగుతున్నప్పటికీ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే స్వల్పంగా పెరిగాయి. ఇటీవలి తుపానుతోపాటు బంగాళాఖాతంలో నెలకొన్న పరిస్థితుల ప్రభావంతో రాష్ట్ర వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. వాతావరణంలో తేమ శాతం కూడా వేగంగా పెరిగింది. దీంతో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. మంగళవారం రాష్ట్రంలోని చాలా చోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. ఖమ్మంలో అత్యధికంగా 33.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైంది. ఇది సాధారణం కంటే 4.5 డిగ్రీలు అధికం. అలాగే భద్రాచలం, హనుమకొండ, హైదరాబాద్, నిజామాబాద్‌లలో రెండు డిగ్రీల సెల్సియస్ చొప్పున ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఇక కనిష్ట ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే రామగుండం, మెదక్, దుండిగల్లలో సాధారణం కంటే 7 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదవడం గమనార్హం. మిగిలిన చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల నుంచి 7 డిగ్రీల వరకు అధికంగా నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. మరో మూడు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. -
కిడ్స్‌పై కోల్డ్ వార్! 'పొడి' చెయ్యనియ్యొద్దు
చలికాలంలో చిన్నారుల చర్మాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. వాళ్లు చిన్నపిల్లలు కావడంతో తమ చర్మం గురించి ఎరుక, శ్రద్ధ వాళ్లలో ఉండదు. కానీ పిల్లల్లో ముఖం, పెదవులు పగలడం, కాళ్ల దగ్గరా పగుళ్లు రావడం వంటి అంశాలతో తల్లిదండ్రులు వారికోసం ఆందోళన పడుతుంటారు. ఇది చలికాలం కావడంతో టీనేజీ లోపు చిన్నారులకు వచ్చే చర్మ సమస్యల గురించి అవగాహన కోసం ఈ కథనం.చలికాలంలో చర్మం పొడిబారడం, పగుళ్లూ పిల్లలందరిలోనూ... ఆ మాటకొస్తే చాలామంది పెద్దవాళ్లలోనూ కనిపించేదే. కొందరు పిల్లల్లో జన్యుపరంగానే కొన్ని ప్రోటీన్లలోపం వల్ల చర్మం పొడిబారడం, ఎర్రబారడమన్నది ఎక్కువగా జరుగుతుంటుంది. మామూలుగా చర్మం బయటి కాలుష్యాలూ, వాతావరణం ప్రభావం, రాపిడి వంటి వాటి నుంచి రక్షణ కల్పిస్తుందన్నది తెలిసిందే. అయితే ఇలా పొడిబారి, ఎర్రగా మారడంతో.. కల్పించాల్సినంత రక్షణ కల్పించలేదు. ఇలా జరగడాన్ని ‘అటోపిక్ డర్మటైటిస్’గా చెబుతారు. అయితే ఈ సమస్య తీవ్రత అందరిలోనూ ఒకేలా ఉండక... చిన్నారి చిన్నారికి మారుతుంది. పిల్లల్లో సాధారణంగా కనిపించే ఈ చర్మ సమస్య, పరిష్కారాలు తెలుసుకుందాం. ఇటీవల వాతావరణంలో కాలుష్యాలు బాగా పెరగడం, పిల్లలు గతంలోలా ఆరుబయట మట్టిలో ఆడక΄ోవడం, అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడటం, తల్లిపాలకు బదులు డబ్బాపాలపై ఆధారపడటం, పిల్లలు సిజేరియన్ ప్రక్రియతో పుట్టడం వంటి కారణాలతో చిన్నారుల్లో వ్యాధి నిరోధక వ్యవస్థ (ఇమ్యూనిటీ) సరైనవిధంగా నియంత్రితం కావడం లేదు. దాంతో డాక్టర్లు పిల్లల్లో అటోపిక్ డర్మటైటిస్‌ను ఎక్కువగా చూస్తున్నారు.ఈ సమస్యలో మొదట చర్మం పొడిబారి, ఎర్రగా మారి దురద వస్తుంటుంది. పిల్లలు పదే పదే గీరుతుండటంతో చర్మం కాస్త మందంగా మారుతుంది. ఆ తర్వాత దురద మరింతగా పెరుగుతుంది. ఈ రెండు ప్రక్రియలూ ఒక సైకిల్ (ఇచ్–స్క్రాచ్ సైకిల్)లా నడుస్తుంటాయి. ఈ అటోపిక్ డర్మటైటిస్ అన్నది నెలల పిల్లలు మొదలుకొని, ఏడాది వయసు వారి వరకు కనిపించవచ్చుపిల్లల్లో 12 నెలల వయసు వరకు... ప్రభావితమయ్యే భాగాలుచర్మం ఎర్రబారడమన్నది ముఖంపై కనిపిస్తుంటుంది గాని నిజానికి చర్మంపై శరీరంలోని ఏ భాగంలోనైనా ఇలా జరగవచ్చు.΄పాకే పిల్లల్లో సాధారణంగా వాళ్ల మోకాళ్లు నేలతో ఒరుసుకు΄ోతుంటాయి కాబట్టి వీళ్లలో మోకాళ్ల వద్ద ఎటోపిక్ డర్మటైటిస్ కనిపిస్తుంటుంది.ఏడాదీ రెండేళ్ల పిల్లల్లో... ఈ వయసు పిల్లల్లో చర్మం ప్రభావితం కావడంమన్నది చర్మం ముడుతలు పడే ్ర΄ాంతాల్లో ఎక్కువ. రెండు నుంచి ఆరేళ్ల పిల్లల్లో...ఈ వయసు పొడిబారడం మోకాళ్ల కిందనున్న చర్మంలో చాలా ఎక్కువ. ముఖం మీద చర్మం పెద్దగా పగలదు. పెదవులు చీలినట్లుగా కావడం, కంటి చుట్టూ నల్లటి ముడతలు, మెడ మురికిపట్టినట్లుగా నల్లగా కనిపించడం, కాళ్ల వేళ్లకింద పగుళ్లు (ఫిషర్స్), చేతి గీతలు కాస్త ప్రస్ఫుటంగా కనిపించడం, వెంట్రుకలు ఉన్నచోట బొబ్బల్లా రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.ఏడు నుంచి పద్నాలుగేళ్ల పిల్లల్లో...ఏడు కంటే తక్కువ వయసు పిల్లలతో పోలిస్తే ఏడు నుంచి పధ్నాలుగేళ్ల వారిలో అటోపిక్ డర్మటైటిస్ లక్షణాల తీవ్రత తగ్గే అవకాశముంది. ఈ సమస్య ఉన్నవారిలో చర్మం పగిలి ఉండటంతో తరచూ వైరల్ ఇన్ఫెక్షన్లు... ఉదాహరణకు హెర్పిస్ సింప్లెక్స్ వంటివి; అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉదాహరణకు స్టెఫాలోకోకల్ వంటివి కనిపించవచ్చు. నివారణ / మేనేజ్మెంట్ అండ్ చికిత్స స్నానం చేయించే వ్యవధి ఎంత తక్కువైతే అంత మంచిది. గోరు వెచ్చని నీళ్లతోనే స్నానం చేయించాలిస్నానం చేసిన వెంటనే పూర్తిగా తుడవకుండా టవల్‌తో అద్దుతూ ఆ తేమ మీదనే మాయిశ్చరైజర్ పట్టించాలి కాళ్లూ, చేతులు ఎక్కువగా పొడిబారతాయి కాబట్టి మాయిశ్చరైజర్‌ను రోజుకు రెండు మూడుసార్లయినా పట్టించడం మంచిది ఉలెన్ దుస్తుల వల్ల పిల్లలకు ఇరిటేషన్ ఎక్కువగా వస్తుంటుంది. అందుకే వాటికి బదులు కాటన్ దుస్తులు ధరింపజేయడం మేలు దోమల వల్ల కూడా పిల్లల చర్మంపై దుష్ప్రభావం పడే అవకాశముంది. దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి స్కూలుకు వెళ్లే వయసు పిల్లలకు షూజ్తో కాటన్ సాక్స్ వాడటం, గట్టి చెప్పులకు బదులు కాస్త మెత్తటి పాదరక్షలు వాడితే కాళ్ల పగుళ్ల వల్ల కలిగే బాధలు తగ్గుతాయి సమస్య మరింత తీవ్రమైతే డర్మటాలజిస్టులను కలవాలి. సమస్య తీవ్రతను బట్టి వారు తగిన చికిత్స అందిస్తారు.(చదవండి: కంటికి ‘మంట’ పెట్టేస్తది.. సిగరెట్ అంటించకండి!) -
చలికాలంలో మేకప్, ఈ జాగ్రత్తలు తప్పదు.. లేదంటే!
చలికాలం ఉక్కపోత ఉండదు, మేకప్ చెదిరిపోదు, బాగుంటుంది అనుకుంటారు. అయితే, ప్రతి సీజన్‌కి బ్యూటీ చాలెంజెస్ ఉంటాయి. చలికాలంలో చేయించుకోదగిన ఫేషియల్స్, మేకప్, ఫుడ్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వివాహ వేడుకలకు మేకప్ చేయించుకునేవారు ఈ జాగ్రత్తలు పాటిస్తే, సరైన ప్రయోజనాలను పొందుతారు. పొడిగా ఉన్నా, జిడ్డుగా ఉన్నా చలి కాలం మేకప్ చేసేముందు హైడ్రేటెడ్ మాయిశ్చరైజర్ ఉపయోగించాలి. లేదంటే, మేకప్ కూడా డ్రైగా కనిపిస్తుంది. అవసరాన్ని బట్టి ప్రైమరీ లోషన్ వాడుకోవచ్చు.మెరిసే చర్మానికి..చర్మం మెరుస్తున్నట్టుగా ఆరోగ్యంగా కనిపించాలంటే నూనె శాతం ఎక్కువ ఉండే మాయిశ్చరైజర్ ఉపయోగించాలి. హైలురానిక్ యాసిడ్స్ ఉన్న సీరమ్‌ని ముందు ఉపయోగిస్తే మాయిశ్చరైజర్‌ని స్కిన్ మీద పట్టి ఉంచుతుంది. దీని వల్ల మేకప్ డ్రైగా కనిపించదు. బడ్జెట్‌ని బట్టి సీరమ్స్ మార్కెట్లో లభిస్తున్నాయి. వాటిలో చర్మానికి అవసరమయ్యే గుణాలు ఏవి ఉన్నాయో అవి చెక్ చేసుకోవాలి. సాధారణంగా చర్మం సహజ ఆయిల్స్‌ను ఉత్పత్తి చేస్తుంది. కానీ, వయసు పెరుగుతున్నకొద్దీ సహజ నూనెల ఉత్పత్తి ఆగి΄ోతుంది. దాంతో చర్మం ΄÷డిబారుతుంది. చలికాలం పెళ్లిళ్లు ఉన్న బ్రైడల్స్ అయితే కనీసం నెల ముందు నుంచి స్కిన్ కేర్ తీసుకోవాలి.హెల్తీ స్కిన్‌కి పోషకాహారంస్కిన్ కేర్ తీసుకోకుండా పెళ్లిరోజు మేకప్ చేయించుకుంటే హెల్తీగా కనిపించదు. నెల రోజుల ముందు నుంచి హైలురానిక్ యాసిడ్స్ ఉన్న సీరమ్స్ ఉపయోగించాలి. ΄ోషకాహారం, ΄ానీయాల మీద దృష్టి పెట్టాలి. జంక్ ఫుడ్, మాంసాహారం కాకుండా పండ్లు, కూరగాయలు, జ్యూసులను ఆహారంలో ఎక్కువ చేర్చుకోవాలి. దీని వల్ల చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది.మేకప్‌కి ముందుమేకప్కి ముందు ఎంజైమ్ స్క్రబ్ ఉపయోగిస్తారు. తర్వాత సీరమ్స్, అవసరమైతే షీట్ మాస్క్‌లు, అండర్ ఐ ప్యాచెస్ వాడుతారు. దీని వల్ల మేకప్ ప్యాచ్‌లుగా కనిపించదు.మేకప్ తీయడానికి తప్పనిసరిరిమూవర్స్ ఉపయోగించుకోవచ్చు. లేదంటే కొబ్బరినూనె, బాదం నూనె, బేబీ ఆయిల్ ను ఉపయోగించి మేకప్‌ను పూర్తిగా తీసేయాలి. తర్వాత ఫేస్‌వాష్‌తో శుభ్రపరుచుకొని, మాయిశ్చరైజర్ రాసుకోవాలి. అలసి΄ోయామనో, మరుసటి రోజు చూడచ్చులే అనో మేకప్ తీసేయకుండా అలాగే పడుకుంటే స్కిన్ బాగా దెబ్బతింటుంది. చర్మం ఇంకా పొడిబారడం, యాక్నె వంటి సమస్యలు ఉత్పన్నం కావచ్చు. మేలైన ఫేషియల్స్చలికాలంలో రొటీన్ ఫేషియల్స్ కాకుండా హైడ్రా ఫేషియల్ చేయించుకోవడం మంచిది. దీని వల్ల చర్మం నిగారింపు కోల్పోదు. వీటితో పాటు కొన్ని కెమికల్ పీల్స్ ఉంటాయి. అయితే, వీటిని పెళ్లికి పది రోజుల ముందు చేయించుకోవాలి. కెమికల్ పీల్ని బ్యూటీపార్లర్‌లో కాకుండా చర్మనిపుణుల సమక్షంలో చేయించుకోవడం మంచిది. – విమలారెడ్డి పొన్నాల, సెలబ్రిటీ అండ్ బ్రైడల్ మేకప్ ఆర్టిస్ట్ -
వింటర్లో వ్యాధులు : మిరియాలతో చాలా మేలు!
లేదు..రాలేదు అనుకుంటూ ఉండగానే చలి పులి పరుగెత్తుకొచ్చేసింది. మరోవైవు ఫంగెల్ ప్రభావం, వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశంఉంది. చలికాలంలో వచ్చే కొన్ని అనారోగ్యసమస్యల నుంచి తప్పించుకోవాలంటే కొన్ని వంటింటి చిట్కాలను పాటించాల్సిందే. ఇంట్లోనే లభించే నల్ల మిరియాలతో చలికాలంలో వచ్చే దగ్గు, జలుబు మొదలైన సమస్యలు రాకుండా మనల్ని కాపాడుతాయని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. నల్ల మిరియాల్లో ఎన్నో ఔషధగుణాలుంటాయి. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉన్నాయి. ఉంటాయి. ఇవి అంటువ్యాలులు సోకకుండా కాపాడతాయి. అలాగే నొప్పులనుంచి ఉపశమనం కలిగిస్తాయి. నల్ల మిరియాల్లోని విటమిన్ సీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకా మెగ్నీషియం, రాగి, ఇనుము, కాల్షియం, భాస్వరం, పొటాషియం, సోడియం వంటి ఖనిజాలకు మంచి మూలం. ఇందులో విటమిన్లు ఎ, కె, ఇ బి విటమిన్ కూడా ఉన్నాయి. ఇందులోని పైపెరిన్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. ప్రేగులను శుభ్రం చేస్తుంది.మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా నల్ల మిరియాలను సేవిస్తే మలబద్ధకం సమస్య తీరుతుంది.రక్త ప్రసరణను మెరుగుపరచడంలో చక్కగా పనిచేస్తాయి.అంతేకాదుబరువు తగ్గడంలో కూడా మిరియాలు బాగా పనిచేస్తాయి. ఇందులో లభించే ఫైటో న్యూట్రియెంట్స్ అదనపు కొవ్వును కరిగించడంలో సహాయపడుతాయి. జీవక్రియను వేగవంతం చేస్తాయి.అలాగే చలికాలంలో కీళ్లు,ఎముకల నొప్పులు బాగా వేధిస్తాయి. ఈ బాధలనుంచి ఉపశమనం కలిగించే ఔషధ గుణాలు మిరియాల్లో ఉన్నాయి. మధుమేహ వ్యాధి గ్రస్తులకు కూడా ఇవి మేలు చేస్తాయి. బ్లడ్ షుగర్ లెవల్స్‌ను నియంత్రణలో ఉంచుతాయి. నల్ల మిరియాలు శరీరాన్ని డీటాక్స్ చేయడంలో సహాయపడతాయి. క్యాన్సర్‌ను నివారణలోనూ ఉపయోగపడ తాయంటున్నారు నిపుణులుమనకున్న అనారోగ్య సమస్యను బట్టి తులసి ఆకులు, పసుపు మిరియాలతో చేసిన కషాయం, మిరియాల పాలు,మిరియాలు తేనె, మిరియాలు, తమలపాకు రసం కలుపుకొని తాగవచ్చు.గ్రీన్ టీకి చిటికెడు నల్ల మిరియాలు కలుపుకోవచ్చు.కూరలు, సలాడ్లలో మిరియాల పొడి జల్లు కోవచ్చు. మిరియాలు ,యూకలిప్టస్ నూనె వేసి మరిగించిన నీళ్లో ఆవిరి పట్టవచ్చు. నోట్: ఇది అవగాహనకోసం అందించిన సమాచారం మాత్రమే. మిరియాలు అందరికి ఒకేలా పనిచేయవు. శరీర తత్వాన్ని బట్టి, నిపుణుల సలహామేరకు తీసుకోవాలి. మిరియాలను ఎక్కువగా తీసుకుంటే కొన్ని నష్టాలు కూడా ఉంటాయనేది గమనించాలి. -
డిసెంబరు 21.. రాత్రి 16 గంటలు.. పగలు 8 గంటలు
శీతాకాలం.. పగటి కాలం తక్కువ..రాత్రి పొద్దు ఎక్కువ అంటారు. అయితే డిసెంబర్ 21 రాత్రిపూట మనం ఒక వింతను చూడబోతున్నాం. ఆరోజు సుదీర్ఘమైన రాత్రి కాలం రానుంది. ఆరోజు ఏకంగా 16 గంటపాటు రాత్రి సమయం ఉండనుంది. అయితే పగటి వేళ 8 గంటలు మాత్రమే ఉంటుంది. ఇలా జరగడాన్ని శీతాకాలపు అయనాంతం(వింటర్ సోల్స్టైస్) అంటారు.శీతాకాలపు అయనాంతం ఏర్పడే రోజున సూర్యుని నుండి భూమికి దూరం ఎక్కువగా ఉంటుంది. అలాగే చంద్రకాంతి భూమిపై ఎక్కువ కాలం ఉంటుంది. శీతాకాలపు అయనాంతం ఏర్పడిన రోజున భూమి దాని ధ్రువం వద్ద 23.4 డిగ్రీల వంపులో ఉంటుంది. ఈ సహజ మార్పు కారణంగా 2024, డిసెంబరు 21న ఈ ఏడాదిలో అత్యంత తక్కువ పగలు, సుదీర్ఘమైన రాత్రి ఏర్పడుతుంది. భూమి దాని అక్షం మీద తిరిగే సమయంలో దక్షిణ అర్ధగోళంలో భూమి నుండి సూర్యుడి దూరం గరిష్టంగా ఉన్న రోజున అయనాంతం వస్తుంది. ఇది శీతాకాలంలో ఏర్పడుతున్నందున దీనిని శీతాకాలపు అయనాంతం అని అంటారు.శీతాకాలపు అయనాంతం ఏర్పడే తేదీ ప్రతీయేటా మారుతుంటుంది. అయితే అది డిసెంబర్ 20- 23 తేదీల మధ్యనే వస్తుంటుంది. డిసెంబర్ 21న భూమికి సూర్యునికి గరిష్ట దూరం ఉండటం వల్ల సూర్యకిరణాలు ఆలస్యంగా భూమిని చేరుతాయి. ఈ కారణంగా ఉష్ణోగ్రతలో స్వల్ప తగ్గుదల కూడా కనిపిస్తుంది. వివిధ దేశాల్లో శీతాకాలపు అయనాంతం(వింటర్ సోల్స్టైస్) రోజున ఉత్సవాలు జరుపుకుంటారు. చైనాతో పాటు ఇతర తూర్పు ఆసియా దేశాలలో, బౌద్ధమతంలోని యిన్, యాంగ్ శాఖకు చెందిన ప్రజలు శీతాకాలపు అయనాంతం ఐక్యత, శ్రేయస్సును అందించే రోజుగా భావిస్తారు.శీతాకాలపు అయనాంతంపై వివిధ దేశాల్లో వేర్వేరు నమ్మకాలున్నాయి. శీతాకాలపు అయనాంతం వచ్చినప్పుడు ఉత్తర భారతదేశంలో శ్రీ కృష్ణునికి నైవేద్యం సమర్పించి, గీతా పారాయణం చేస్తారు. రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలలో పుష్యమాస పండుగ ను జరుపుకుంటారు. సూర్యుని ఉత్తరాయణం ప్రక్రియ శీతాకాలపు అయనాంతం నుండి మొదలవుతుంది. అందుకే భారతదేశంలో దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.ఇది కూడా చదవండి: బిష్ణోయ్ గ్యాంగ్‌లో మేడం మాయ.. చేసే పని ఇదే.. -
పెరుగుతోన్న చలి తీవ్రత.. రోగాల బారిన పడకుండా ఉండాలంటే..
చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. చల్లటి గాలులు కూడా వణికిస్తున్నాయి. అయితే చలిగాలులు అనేక రకాల వ్యాధులను కూడా మోసుకొస్తున్నాయి. ఈ సీజన్లో ప్రజల్లో వ్యాధి నిరోధకశక్తి తగ్గుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చలిగాలులు శరీరంలోకి వెళ్లడంతో వైరస్లు మరింత వృద్ధి చెందే ప్రమాదం ఉందని అంటున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది చలితీవ్రత పెరిగిందని వాతావరణ నిపుణులు కూడా పేర్కొంటున్నారు.సమస్యలు.. ఫ్లూ, సైనసైటిస్, ఊపిరితిత్తుల్లో వైరల్ ఇన్ఫెక్షన్, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి(సీవోపీడీ), ఆస్తమా వంటి సమస్యలు తలెత్తుతాయి. హైపోథెర్మియా, చర్మం లోపలి కణజాలం గడ్డ కట్టి గాయాలు కావటం, పెర్నియో, ఇమ్మర్షన్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.లక్షణాలు.. దగ్గు, జలుబు, గొంతునొప్పి, తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి ఆయాసం, న్యూమోనియా వంటి లక్షణాలు కనిపిస్తాయి. జాగ్రత్తలు.. చలి ఎక్కువగా ఉన్న సమయాల్లో మాస్కులు ధరించాలి. దీంతో వైరస్ సోకదు. వేరేవారికి సోకకుండా ఉంటుంది. ఎవరైనా వాతావరణాన్ని అంచనా వేసుకుని బయటకు రావాలి. మరీ చలితీవ్రత అధికంగా ఉంటే బయటకు రాకుండా ఉంటే మంచిది. ము ఖ్యంగా శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడేవారు బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇన్హేలర్లను వాడుతుండాలి.ఎవరికి ఇబ్బంది.. చలి తీవ్రత నేపథ్యంలో ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులు, గర్భిణులు, బాలింతలు, మహిళలు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. వృద్ధులు వేడివేడిగా సరైన ఆహారం తీసుకోవాలి. పూర్తిగా కప్పి ఉంచేలా వస్త్రాలను ధరించాలి. చలిగాలులు ఉన్నప్పుడు చిన్నారులను బయట తిప్పకూడదు. ఎక్కువరోజులు జలుబు, ఫ్లూ, ముక్కు నుంచి రక్తం రావటం వంటి లక్షణాలు కన్పిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. చలిగాలుల్లో ఆరు బయట పనిచేసే కార్మికులు, వీధుల్లో గడిపే నిరాశ్రయులు జాగ్రత్తగా ఉండాలి.చదవండి: ఈ డివైజ్‌తో మొటిమలలు, మచ్చలు ఇట్టే మాయం..!కారణాలు.. ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల వైరస్‌కు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. దీంతో శరీరంలో వైరస్ కణాలు వేగంగా వృద్ధి చెందుతాయి. ఈ వాతావరణంలో ఒకరి నుంచి మరొకరికి వేగంగా ఫ్లూ వ్యాప్తి చెందుతుంది.వ్యాధి నిరోధకశక్తి పెంచుకోవాలి.. చలికాలంలో వ్యాధి నిరోధకత తక్కువగా ఉంటుంది. దీంతో పౌష్టికాహారం తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా సిట్రస్ జాతికి చెందిన ఉసిరి, నిమ్మకాయల రసం తీసుకోవాలి. ఎక్కువగా నీటిని తాగాలి. కాచి చల్లార్చిన నీటిని తాగడం మరింత మంచిది. విపరీతమైన చలికి జాగ్రత్తలు తీసుకోకపోతే, అవయవాల్లో గాయాలై మరణాలు సంభవించవచ్చు. – డాక్టర్ ఎం.రాజీవ్, పల్మనాలజిస్ట్, టీజీఎంఎస్ సభ్యుడు -
వింటర్లో ట్రెండీ వేర్ ఏదో తెలుసా? (ఫోటోలు)
-
వింటర్ వేర్ : గ్రాండ్ వెల్వెట్, ట్రెండీ వెల్వెట్
వింటర్ టైమ్ బ్రైట్‌గా వెలిగిపోవాలన్నాప్రిన్సెస్లా హుందాగా మెరిసిపోవాలన్నావణికించే చలి నుంచి నైస్‌గా తప్పించుకోవాలన్నాఈ సీజన్‌కి బెస్ట్ ఎంపికగా వెల్వెట్ డిజైనరీ డ్రెస్సులు గ్రాండ్‌గా మదిని దోచేస్తున్నాయి. వెల్వెట్నే మనం మఖ్మల్ క్లాత్ అని కూడా అంటాం. మందంగా, మృదువైన పట్టులా ఉండే ఈ క్లాత్ నేత పని, వాడే మిశ్రమాల వల్ల చాలా ఖరీదైనదిగా కూడా పేరుంది. సంపన్నులు ధరించే వస్త్రంగా పేరొందిన వెల్వెట్కు ఎంతో ప్రాచీన చరిత్ర ఉంది. ఇప్పుడు ఈ క్లాత్ తయారీలో ఎన్నో మార్పులు చోటు చేసుకొని, అందరికీ అందుబాటులోకి వచ్చింది. ధరలను బట్టి క్లాత్ నాణ్యతలో మార్పులు ఉంటున్నాయి. దాదాపు డిజైనర్లందరూ వెల్వెట్‌తో డ్రెస్ డిజైనింగ్‌లో ప్రయోగాలు చేస్తుంటారు. లాంగ్ అండ్ షార్ట్ గౌన్లు, కుర్తీలు, లాంగ్ ఓవర్‌కోట్స్, శారీస్, బ్లౌజ్‌లను డిజైన్ చేయించుకోవచ్చు. ప్లెయిన్ వెల్వెట్ డ్రెస్‌లో వెస్ట్రన్ ఔట్‌ఫిట్స్‌ను డిజైన్ చేస్తుంటారు. ఇవి, వింటర్ సీజన్లో ఈవెనింగ్ పార్టీలకు స్పెషల్‌గా రెడీ అవుతున్నాయి. వీటిలో షార్ట్ గౌన్స్, ఓవర్ కోట్స్ ఎక్కువ.ఎంబ్రాయిడరీ వెల్వెట్ క్లాత్‌పైన మరింత అందంగా కనిపిస్తుంది. దీనివల్ల డ్రెస్‌కి అదనపు ఆకర్షణ చేకూరుతుంది. సంప్రదాయ వేడుకల్లోనూ డిజైనర్ శారీతో హుందాగా ఆకట్టుకుంటుంది. లెహంగా, చోలీ డిజైన్లలో గ్రాండ్‌గా వెలిగిపోతుంది. వెల్వెట్ అనేది వంకాయ రంగులోనే కాదు పచ్చ, పసుపు, పింక్.. వివిధ రంగులలో షిమ్మర్‌తో మెరిసిపోయేవీ ఉన్నాయి. -
మాయిశ్చరైజర్లు వాడుతున్నారా..!
చలికాలంలో చర్మం పొడిబారే సమస్య దాదాపుగా అందరూ ఎదుర్కొనేదే. ఎన్ని క్రీములు రాసినా ఏమాత్రం ఉపయోగం లేదని చాలామంది వాపోతుంటారు. ఈ సమస్యలకు పరిష్కారం కావాలంటే ముందు మన చర్మ తత్త్వాన్ని తెలుసుకోవాలి. కొందరికి ఆయిల్ స్కిన్ ఉంటుంది. వీరికి సమస్య పెద్దగా ఉండకపోవచ్చు. కానీ, ఈ కాలంలో పొడి చర్మం గల వారికి పెద్ద సమస్యగా ఉంటుంది. వారి చర్మతత్వాన్ని బట్టి మాయిశ్చరైజర్లు రాసుకోవాలి. గోరువెచ్చని నీళ్లుఫుల్క్రీమ్ లేదా అయిల్ బేస్డ్ మాయిశ్చరైజర్లు వాడాలి. స్నానం చేశాక కనీసం పది నిమిషాల్లోపు మాయిశ్చరైజర్ రాసుకోవాలి. చలిని తట్టుకోవడానికి చాలామంది వేడినీళ్లతో స్నానం చేస్తుంటారు. దీనివల్ల చర్మంపై సహజ నూనెలను కోల్పోతాం. అందుకని, స్నానానికి గోరువెచ్చని నీళ్లు వాడాలి. నిమ్మ, చందనంతో తయారైనవి కాకుండా గ్లిజరిన్, అలోవెరా, ఓట్‌మిల్క్ బేస్డ్ సోప్స్ స్నానానికి ఎంచుకోవాలి. వింటర్లోనూ సన్‌స్క్రీన్‌ను ఉపయోగించాలి.రుద్దకూడదు..డ్రై స్కిన్ ఉన్నవాళ్లు క్లెన్సింగ్ మిల్క్‌ని రోజుకు ఒకసారైనా ఉపయోగించాలి. స్క్రబ్స్ వంటివి ఎక్కువ ఉపయోగించకూడదు. కొందరు స్నానానికి మైత్తటి కాయిర్‌ను వాడుతుంటారు. ఈ కాలం దానిని వాడక΄ోవడం ఉత్తమం. పాదాలను రాత్రివేళ శుభ్రపరుచుకొని, ఫుట్ క్రీమ్ లేదా పెట్రోలియమ్ జెల్లీ రాసుకోవాలి. కాలి పగుళ్ల సమస్య ఉన్నవారు సాక్సులు వేసుకోవాలి. కొందరు సీరమ్స్ వాడుతుంటారు. వీటిలో యాసిడ్ కంటెంట్ చాలా తక్కువగా ఉన్నవి ఎంచుకోవాలి.ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్లు జెల్ లేదా లోషన్ బేస్డ్ మాయిశ్చరైజర్లు ఉపయోగించుకోవాలి. సోరియాసిస్, వంటి చర్మ సమస్యలు ఉన్నవారు ముందుగానే వైద్యులను సంప్రదించి మందులు తీసుకోవాలి.మేకప్‌కి ముందు మాయిశ్చరైజర్ మేకప్ చే సుకోవడానికి ముందు క్లెన్సింగ్ మిల్క్ ఉపయోగించి, తర్వాత మాయిశ్చరైజర్ వాడాలి. మేకప్ తీసేసాక మళ్లీ క్లెన్సింగ్ మిల్క్‌ను ఉపయోగించాలి. డ్రైస్కిన్ వాళ్లు ఆయిల్ బేస్డ్ ఫౌండేషన్స్ వాడాలి. సూప్‌లు, జ్యూస్‌లు..ఆకుకూరలు, కూరగాయలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. నట్స్, నువ్వులు వంటివి ఈ కాలంలో ఆహారంలో చేర్చుకోవడం, ఉపయోగించడం మంచిది. సాధారణంగా చలికాలంలో చాలామంది తక్కువ నీళ్లు తాగుతారు. కానీ, మన శరీరానికి 3–4 లీటర్ల నీళ్లు అవసరం. నీళ్లు తాగలేక΄ోయినా సూప్‌లు, జ్యూస్‌ల రూపంగా తీసుకోవచ్చు. – డా. స్వప్నప్రియ, డెర్మటాలజిస్ట్ -
పెసర పిండితో బ్యూటీ ప్యాక్స్ : మెరిసే మోము
శీతాకాలంలో చర్మం, ముఖం సౌందర్య పట్ల మరింత జాగ్రత్త తీసుకోవాలి. రసాయనాలులేని సహజ పదార్థాలతోనే చర్మ సౌందర్యాన్నిమెరుగు పర్చు కోవడానికి ప్రయత్నించాలి. చర్మాన్ని మృదువుగా చేయడంలోనూ, చర్మానికి మెరుపును ఇవ్వడంలోనూ, చక్కటి రంగు తేలేలా చేయడంలోనూ పెసలు చక్కగా పని చేస్తాయి. ఈ నేపథ్యంలో పెసర పిండితో కొన్ని చిట్కాలను ఇపుడు చూద్దాం! టీ స్పూన్ పెసరపిండిలో పచ్చిపాలు కలిపి మిశ్రమం తయారుచేసుకోవాలి. దీనిని ముఖానికి మాస్క్‌లా వేయాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. పొడిచర్మాన్ని ఈ మాస్క్ మృదువుగా మారుస్తుంది.పెసరపిండిలో కొద్దిగా పెరుగు, కొబ్బరి నూనె కలిపి చేతులకు రాయాలి. సున్నితంగా రబ్ చేసి, పది నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. పెసరపిండి, పెరుగు, కొబ్బరి నూనె చర్మాన్ని మరింత మృదువుగా మారుస్తాయి.టేబుల్ స్పూన్ పెసర్లు, ఐదు బాదంపప్పులు రాత్రి నీళ్లలో నానబెట్టాలి. ఉదయాన్నే వీటిని పేస్ట్ చేసి, ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే చర్మం పొడిబారడం సమస్యే దరిచేరదు.