దేశంలో చలివాతావరణం కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ శీతాకాలంలో దేశంలోని కొన్ని పర్యాటక ప్రాంతాల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. ఇటువంటి తరుణంలో ఆయా ప్రాంతాలకు వెళితే బిజీలైఫ్ నుంచి మానసిక ప్రశాంతత లభిస్తుంది.
మనదేశంలో శీతాకాలంలో సందర్శించదగిన అనేక ప్రదేశాలున్నాయి. అక్కడ చలిని కూడా ఎంజాయ్ చేయవచ్చు. ప్రతీయేటా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఈ ప్రాంతాల్లో టూరిస్టుల తాకిడి అధికంగా ఉంటుంది. ఆ ప్రాంతాలు ఏవి? ఎక్కడున్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం.
గోవా
ప్రకృతి అందాలకు నిలయమైన గోవా.. స్వదేశీ, విదేశీ పర్యాటకుల గమ్యస్థానం. అందమైన సముద్రం, బీచ్, నైట్ లైఫ్, పార్టీలు, వినోదాన్ని ఇష్టపడేవారు వింటర్ సీజన్‌లో గోవాను సందర్శిస్తే మంచి అనుభూతి దొరుకుతుంది. గోవా ప్రముఖ పర్యాటక ప్రాంతంగా గుర్తింపుపొందింది. గోవాకు స్నేహితులు, కుటుంబ సభ్యులతో వెళ్లవచ్చు. లేదా ఒంటరిగా నైనా వెళ్లవచ్చు. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో గోవాలో అత్యంత రమణీయమైన వాతావరణం కనిపిస్తుంది.
జైసల్మేర్
శీతాకాలంలో రాజస్థాన్‌లోని జైసల్మేర్ ప్రకృతిశోయగాలతో మరింత సుందరంగా తయారవుతుంది. జైసల్మేర్‌లో చారిత్రక వారసత్వం, సంస్కృతి రెండూ కనిపిస్తాయి. ఇక్కడ క్యాంపింగ్, నైట్ అవుట్, ఒంటె సవారీ తదితర వినోద కార్యకలాపాల్లో పాల్గొని, ఎంజాయ్ చేయవచ్చు. చలికాలంలో జైసల్మేర్‌ను సందర్శించాలని పర్యాటకులు ఉవ్విళ్లూరుతుంటారు.
కూర్గ్
కర్ణాటకలో ఉన్న కూర్గ్ అధికారిక పేరు కొడగు. దీనిని స్కాట్లాండ్ ఆఫ్ సౌత్ ఇండియా అని కూడా అంటారు. చలికాలంలో కూర్గ్‌లో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం ఇక్కడి విశేషం. దేశమంతటా అత్యధిక చలివున్న సమయంలో కూర్గ్‌లో వెచ్చదనాన్ని అనుభవించవచ్చు. కూర్గ్‌లోని ప్రకృతి అందాలు ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటాయి.
ముంబై
వింటర్ సీజన్‌లో ముంబైని కూడా సందర్శించవచ్చు. ఇక్కడి బీచ్‌లో బలమైన అలలను చూసి ఎంజాయ్ చేయవచ్చు. ముంబైలో సందర్శించేందుకు పలు పర్యాటక ప్రదేశాలున్నాయి. ఇక్కడి స్ట్రీట్ ఫుడ్‌ను ఆహార ప్రియులను అమితంగా ఇష్టపడుతుంటారు. ముంబైలో సందర్శించేందుకు పలు పురాతన ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ శీతాకాలంలో తక్కువ బడ్జెట్‌లో ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే అందుకు ముంబై అనువైన ప్రాంతమని పర్యాటకులు చెబుతుంటారు.
ఇది కూడా చదవండి: Delhi Election 2025: ఆ మూడు పార్టీల బలాలు.. బలహీనతలు
Comments
Please login to add a commentAdd a comment