Enjoy
-
ముంబై మ్యూజికల్ ఈవెంట్లో ఎంజాయ్ చేస్తున్న మెహ్రీన్ (ఫోటోలు)
-
Winter Travel Ideas: శీతాకాలంలో తప్పక చూడాల్సిన పర్యాటక ప్రాంతాలు
దేశంలో చలివాతావరణం కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ శీతాకాలంలో దేశంలోని కొన్ని పర్యాటక ప్రాంతాల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. ఇటువంటి తరుణంలో ఆయా ప్రాంతాలకు వెళితే బిజీలైఫ్ నుంచి మానసిక ప్రశాంతత లభిస్తుంది.మనదేశంలో శీతాకాలంలో సందర్శించదగిన అనేక ప్రదేశాలున్నాయి. అక్కడ చలిని కూడా ఎంజాయ్ చేయవచ్చు. ప్రతీయేటా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఈ ప్రాంతాల్లో టూరిస్టుల తాకిడి అధికంగా ఉంటుంది. ఆ ప్రాంతాలు ఏవి? ఎక్కడున్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం.గోవాప్రకృతి అందాలకు నిలయమైన గోవా.. స్వదేశీ, విదేశీ పర్యాటకుల గమ్యస్థానం. అందమైన సముద్రం, బీచ్, నైట్ లైఫ్, పార్టీలు, వినోదాన్ని ఇష్టపడేవారు వింటర్ సీజన్లో గోవాను సందర్శిస్తే మంచి అనుభూతి దొరుకుతుంది. గోవా ప్రముఖ పర్యాటక ప్రాంతంగా గుర్తింపుపొందింది. గోవాకు స్నేహితులు, కుటుంబ సభ్యులతో వెళ్లవచ్చు. లేదా ఒంటరిగా నైనా వెళ్లవచ్చు. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో గోవాలో అత్యంత రమణీయమైన వాతావరణం కనిపిస్తుంది.జైసల్మేర్శీతాకాలంలో రాజస్థాన్‌లోని జైసల్మేర్ ప్రకృతిశోయగాలతో మరింత సుందరంగా తయారవుతుంది. జైసల్మేర్‌లో చారిత్రక వారసత్వం, సంస్కృతి రెండూ కనిపిస్తాయి. ఇక్కడ క్యాంపింగ్, నైట్ అవుట్, ఒంటె సవారీ తదితర వినోద కార్యకలాపాల్లో పాల్గొని, ఎంజాయ్ చేయవచ్చు. చలికాలంలో జైసల్మేర్‌ను సందర్శించాలని పర్యాటకులు ఉవ్విళ్లూరుతుంటారు.కూర్గ్కర్ణాటకలో ఉన్న కూర్గ్ అధికారిక పేరు కొడగు. దీనిని స్కాట్లాండ్ ఆఫ్ సౌత్ ఇండియా అని కూడా అంటారు. చలికాలంలో కూర్గ్‌లో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం ఇక్కడి విశేషం. దేశమంతటా అత్యధిక చలివున్న సమయంలో కూర్గ్‌లో వెచ్చదనాన్ని అనుభవించవచ్చు. కూర్గ్‌లోని ప్రకృతి అందాలు ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటాయి.ముంబైవింటర్ సీజన్లో ముంబైని కూడా సందర్శించవచ్చు. ఇక్కడి బీచ్‌లో బలమైన అలలను చూసి ఎంజాయ్ చేయవచ్చు. ముంబైలో సందర్శించేందుకు పలు పర్యాటక ప్రదేశాలున్నాయి. ఇక్కడి స్ట్రీట్ ఫుడ్‌ను ఆహార ప్రియులను అమితంగా ఇష్టపడుతుంటారు. ముంబైలో సందర్శించేందుకు పలు పురాతన ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ శీతాకాలంలో తక్కువ బడ్జెట్లో ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే అందుకు ముంబై అనువైన ప్రాంతమని పర్యాటకులు చెబుతుంటారు. ఇది కూడా చదవండి: Delhi Election 2025: ఆ మూడు పార్టీల బలాలు.. బలహీనతలు -
ఫ్యామిలీ ట్రిప్‌లో భూమిక చావ్లా.. శ్రీలంకలో చిల్ అవుతూ! (ఫోటోలు)
-
గోవా ట్రిప్ ఎంజయ్ చేస్తున్న వితిక శేరు , నిహారిక కొణిదెల (ఫొటోలు)
-
అమెరికాలో రోహిత్ శర్మ చిల్.. ఫొటోలు చూశారా?
-
సింపుల్‌గా భలే అందంగా ఉంది.. మౌనీ రాయ్ సూపర్ హాట్! (ఫొటోలు)
-
త్వరలో పెళ్లి.. వెకేషన్లో చిల్ అవుతున్న సిద్దార్థ్- అదితి (ఫోటోలు)
-
కిడ్స్ తో కలిసి సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న నమ్రత (ఫొటోలు)
-
కచోరీ, జిలేబీ సూపర్: జపాన్ రాయబారి!
భారతదేశంలోని జపాన్ రాయబారి హిరోషి సుజుకి తాజాగా వారణాసిలో స్ట్రీట్‌ఫుడ్ టేస్ట్ చేశారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వివరాలను పంచుకున్నారు. కూరగాయలతో చేసిన కచోరీతోపాటు జిలేబీలను ఆయన ఆరగించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో దీనికి సంబంధించిన రెండు క్లిప్‌లను షేర్ చేశారు. వీడియోను పోస్ట్ చేసిన ఆయన.. ‘వారణాసిలో స్ట్రీట్ ఫుడ్‌ను ఆస్వాదిస్తున్నాను’అని రాశారు. కచోరీ చాలా బాగుందని, జలేబీ మరింత బ్రహ్మాండంగా ఉందంటూ కొనియాడారు. జపాన్ రాయబారికి చెందిన ఈ వీడియో వైరల్ అయ్యింది. జపాన్ రాయబారి వారణాసిని సందర్శించడం ఇదేమీ తొలిసారి కాదు. గత మే నెలలోనూ ఈ నగరాన్ని సందర్శించారు. అప్పుడు గోల్ గప్పా, బాటి చోఖా,బనారసి థాలీ లాంటి పలు వంటకాలను రుచి చూశారు. Enjoying street food in Varanasi! pic.twitter.com/xVmNvcOJuw — Hiroshi Suzuki, Ambassador of Japan (@HiroSuzukiAmbJP) December 30, 2023 -
Pooja Ramachandran Beach Photos: ఫ్యామిలీతో బీచ్‌లో చిల్ అవుతున్న పూజా రామచంద్రన్ (ఫోటోలు)
-
అంతరిక్షంలో పొగలుకక్కే కాఫీ ఎలా తాగుతారు?
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ)లో అంతరిక్ష పరిశోధనలు నిర్వహించే ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో వ్యోమగామి సమంతా క్రిస్టోఫోరెట్టి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో వ్యోమగాములు వేడివేడి కాఫీని ఎలా తాగుతారో చూపించారు. వీడియోలో క్రిస్టోఫోరెట్టి ఒక ప్యాకెట్లోని కాఫీని ఒకచిన్న బాటిల్లో పోయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తారు. అయితే గురుత్వాకర్షణలేమి కారణంగా కాఫీ బయటకు రాదు. ఆ తర్వాత ఆమె ప్రత్యేకంగా రూపొందించిన ‘స్పేస్ కప్’ను బయటకు తీసి, అందులో కాఫీ పోస్తారు. దీంతో ఆమె హాయిగా కాఫీ తాగగలుగుతారు. 2,85,000కు మించిన వీక్షణలు, 2 వేలకు పైగా లైక్‌లను అందుకున్న ఈ వీడియో అంతరిక్షంలో ఎదురయ్యే సవాళ్లు, వాటి పరిష్కారాలను తెలియజేస్తుంది. ‘స్పేస్ కప్’ వ్యోమగాములకు ఎంతో ఉపయోగపడుతుంది. నాసా తెలిపిన వివరాల ప్రకారం ఈ మైక్రోగ్రావిటీ కప్పులు అంతరిక్షంలో ద్రవపదార్థాలను తాగేందుకు రూపొందించారు. స్పేస్ కప్ అనేది ద్రవాన్ని నిష్క్రియాత్మకంగా కప్పు పైభాగానికి చేరవేస్తుంది. దీని రూపకల్పనకు పరిశోధకులు ఉపరితల ఉద్రిక్తత, చెమ్మగిల్లే పరిస్థితులు,కప్పు నిర్దిష్ట జ్యామితి మొదలైనవాటిని పరిశీలిస్తారు. ప్రక్రియను చూసేందుకు కప్పును పారదర్శకంగా రూపొందిస్తారు. ఇది కూడా చదవండి: చైనా ‘జియాన్-6’తో భారత్‌పై నిఘా పెట్టిందా? How do you like your coffee?☕️ Our astronaut @AstroSamantha demonstrates how she has her morning coffee in space! #InternationalCoffeeDay pic.twitter.com/UKA1Hy0EWW — ESA (@esa) October 1, 2023 -
జమ్మూ కాశ్మీర్ లో రాహుల్ గాంధీ వేకేషన్
-
హువాయి కొత్త స్మార్ట్ఫోన్లు: ఫీచర్లు గమనించారా?
బీజింగ్: హువాయి మూడు కొత్తస్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. ఎంజాయ్ సిరీస్‌కు కొనసాగింపుగా ఎంజాయ్ 8, 8ప్లస్, 8ఇ మోడల్ మొబైళ్లను విడుదల చేసింది. ఈ మిడ్‌రేంజ్ స్మార్ట్ఫోన్లు ప్రస్తుతానికి చైనా మార్కెట్లో లభ్యం. కాగా అన్ని డివైస్‌లలో డ్యుయల్ రియర్ కెమెరాలను అమర్చింది. అలాగే 18.9డిస్ప్లే ప్రత్యేకతగా ఉండనున్నాయి.ఎంజాయ్ 8 3జీ వేరియంట్ 1299 యెన్‌గాను( రూ. 13వేలు) 4జీవేరియంట్ ధర 1499యెన్లుగా ఉండనుంది. ఎంజాయ్ 8ప్లస్ ధర 1699యెన్స్ (సుమారు రూ.17,606) 128జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర 1899గా (రూ.19,679)ను ఉంటుంది. ఎంజాయ్ 8ఇ 1099 (రూ.11,388) యెన్‌గాను నిర్ణయించింది. ఈ స్మార్ట్ఫోన్లు మూడు బ్లూ, పింక్, బ్లాక్ కలర్స్‌లో లభ్యం. ఎంజాయ్ 8 ఫీచర్లు 5.99 ఇంచెస్ డిస్ప్లే 720x1440 రిజల్యూషన్ ఆండ్రాయిడ్ ఓరియో 8.0 3/4జీ ర్యామ్ 32/64జీబీ స్టోరేజ్ 256దాకా విస్తరించుకునే సదుపాయం 13+2 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ ఎంజాయ్ 8 ప్లస్ ఫీచర్లు 5.93 డిస్ప్లే 1080x2160 రిజల్యూషన్ ఆక్టాకోర్ కిరిన్ 659ప్రాసెసర్ ఆండ్రాయిడ్ ఓరియో 8.0 4జీబీ 64/128జీబీ స్టోరేజ్ 256 ఎక్స్‌పాండబుల్ 13+2 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 16+2 ఎంపీ డ్యుయల్ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఎంజాయ్ 8ఇ 5.7 ఇంచెస్ డిస్ప్లే 720x1440 రిజల్యూషన్ ఆండ్రాయిడ్ ఓరియో 8.0 3జీబీ ర్యామ్ 32 జీబీ స్టోరేజ్ 13+2 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 5ఎంపీ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ -
వరుడికి కోడిగుడ్లు, పేడనీళ్లతో స్నానం.!
సాక్షి, బెంగళూరు( బొమ్మనహళ్లి) : స్నేహితులు పెళ్ళికి వచ్చి సందడి చేయడం, చిన్న చిన్న చిలిపి పనులు చేయడం కామన్ అన్న విషయం అందరికి తెలిసిందే. కాని మంగళూరులో జరిగిన ఒక యువకుడికి అతన్ని స్నేహితులు పెళ్ళికి వచ్చి సందడి చేయడమే కాకుండ అతన్ని అల్లరి పట్టించారు. పెళ్ళి కుమారుడికి పేడనీళ్లు, టమోటాల రసం, గోడిగుడ్లతో స్నానం చేయించారు. దీంతోపాటు వివిద రకాల కూరగాయాలతో ఏర్పాటు చేసిన పూలమాలలు వేసి వినూత్న రీతిలో అతనిని ఊరేగిస్తూ స్నేహితులు సందడి చేశారు. ఈ పెళ్ళిలో స్నేహితులు చేసిన ఈ సందడి పెద్దలకు ఇబ్బందిని కలిగించినా... స్నేహితుల సంతోషాన్ని చూసి ఏమి అనలేక పోయారు. ఈ పెళ్ళి సందడి ఈ నెల 19న మంగళూరులోని బంట్వాళ తాలుకా రాయి అనే గ్రామంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ పెళ్ళికి సంబంధించి వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. రాయి గ్రామానికి చెందిన రాకేశ్ అనే యువకుడి పెళ్ళి జరిగింది. అతను మంగళూరులో ఉన్న ఈ ప్రవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తన పెళ్ళికి రావాల్సిందిగా స్నేహితులందరిని ఆహ్వానించాడు. దీంతో మెహందీ కార్యక్రమం రోజు స్నేహితులు పెళ్లికి వచ్చారు. అక్కడ పెద్దలు... పెళ్ళి కుమారుడు రాకేష్‌కు తల స్నానం చేయిస్తుండగా అతడి స్నేహితులు అప్పటికే సిద్దం చేసుకున్న పేడ నీళ్లు, టమోటాల రసం, కోడిగుడ్లు పెట్టి స్నానం చేయించారు. అంతటితో ఆపకుండా అతని కోసం ప్రత్యేకంగా వివిర రకాల కూరగాయాలతో సిద్ధం చేసిన హారాలు వేసి అతనికి అలంకరణ చేశారు. పెళ్ళి రోజున కూడా తామేమి తక్కువ కాదని స్నేహితులు అందరు ఒకే రకమైన దుస్తులు ధరించి పెళ్ళి వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామంలో ఎక్కడ చూసిన రాకేష్ పెళ్ళి బ్యానర్లు ఏర్పాటు చేశారు. అందులో రాపాటద రాకేషన్ పెళ్ళి వేడుకలు అని వివిధ సమయాల్లో వివిధ కార్యక్రమాలు జరుగతున్నాయని ప్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేసి పెళ్ళి వేడుకల్లో సందడి చేసారు. -
సంక్రాంతి సంబరాల్లో ఎంజాయ్ చేసిన విదేశీయులు
-
ప్రాణం తీసిన ఈత సరదా..
గుడిమల్కాపురం(మేళ్లచెర్వు): ఈత సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. స్థానికులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గుడిమల్కాపురం గ్రామానికి చెందిన పేరం వెంటేష్(21) గ్రామపరిధిలోని అంజనీ సిమెంట్ పరిశ్రమలో కాంట్రక్టర్ వద్ద మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేస్తున్న ఏ.కోటయ్య అనే యువకుడితో కలిసి బుధవారం మధ్యాహ్నం క్వారీ దగ్గరకు వచ్చి కొద్ది సేపు ఈత కోట్టారు.తరువాత పనికి వెళ్లాలని కోటయ్య ఒడ్డుకు వచ్చి వెంకటేశ్‌ను రమ్మని పిలిచాడు. అయితే అప్పటికే వెంకటేశ్ బురదలో కురుకుపోయి నీటమునిగాడు. ఇదే విషయాన్ని కోటయ్య సమీపంలో ఉన్న వారికి చెప్పాడు. వారు వచ్చి చూసే సరికి వెంకటేశ్ అప్పటికే మతిచెందాడు. ఐదు గంటల పాటు శ్రమించి బురదో కూరుకుపోయిన వెంకటేశ్ మతదేహాన్ని వెలికి తీశారు. ఉన్న ఒక్క కొడుకు మతిచెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.సంఘటన స్థలాన్ని పొలీసులు పరిశీలించి వివరాలు సేకరించారు. ప్రాణం తీసిన ఈత సరదా.. టఠీజీఝఝజీnజ ్ఛn్జౌy ్టౌ ఛీజ్ఛీఛీ టఠీజీఝఝజీnజ, ్ఛn్జౌy,ఛీజ్ఛీఛీ ప్రాణం తీసిన, ఈత సరదా, మేళ్లచెరువు గుడిమల్కాపురం(మేళ్లచెర్వు): ఈత సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. స్థానికులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గుడిమల్కాపురం గ్రామానికి చెందిన పేరం వెంటేష్(21) గ్రామపరిధిలోని అంజనీ సిమెంట్ పరిశ్రమలో కాంట్రక్టర్ వద్ద మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేస్తున్న ఏ.కోటయ్య అనే యువకుడితో కలిసి బుధవారం మధ్యాహ్నం క్వారీ దగ్గరకు వచ్చి కొద్ది సేపు ఈత కోట్టారు.తరువాత పనికి వెళ్లాలని కోటయ్య ఒడ్డుకు వచ్చి వెంకటేశ్‌ను రమ్మని పిలిచాడు. అయితే అప్పటికే వెంకటేశ్ బురదలో కురుకుపోయి నీటమునిగాడు. ఇదే విషయాన్ని కోటయ్య సమీపంలో ఉన్న వారికి చెప్పాడు. వారు వచ్చి చూసే సరికి వెంకటేశ్ అప్పటికే మతిచెందాడు. ఐదు గంటల పాటు శ్రమించి బురదో కూరుకుపోయిన వెంకటేశ్ మతదేహాన్ని వెలికి తీశారు. ఉన్న ఒక్క కొడుకు మతిచెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.సంఘటన స్థలాన్ని పొలీసులు పరిశీలించి వివరాలు సేకరించారు. -
ఉల్లాసంగా...ఉత్సాహంగా
కరీంనగర్ సిటీ : కరీంనగర్‌లోని ఉజ్వల పార్క్ ఆదివారం చిన్నారుల కేరింతలు.. మహిళల ఆటలు..పురుషుల నృత్యాలతో హోరెత్తింది. ఎల్లాపి కులస్తులు ఏర్పాటుచేసుకున్న వనమహోత్సవం కన్నులపండువగా సాగింది. దాదాపు 300 కుటుంబాలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. రన్నింగ్, కబడ్డీ, ఖోఖో, త్రోబాల్, మ్యూజికల్ చైర్, డ్యాన్స్ తదితర విభాగాల్లో పోటీపడ్డారు. కరీంనగర్ యూనిట్ అధ్యక్షుడు వి.గణేశ్‌బాబు, ప్రధాన కార్యదర్శి లక్కాకుల సురేందర్‌రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అర్జున అవార్డు గ్రహీత మాదాసు శ్రీనివాసరావు, ఆర్టీసీ జగిత్యాల డిపో మేనేజర్ పారువెల్ల హన్మంతరావు, తుల అనూషను ఘనంగా సన్మానించారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు నగదు పురస్కరాలు అందించారు. ఎల్లాపి సంఘం మాజీ అధ్యక్షుడు లక్కాకుల మనోహర్‌రావు, కార్పొరేటర్ తాటి ప్రభావతి, వేల్ముల వెంకటేశ్వర్రావు, ఆది జలపతిరావు, తాటి వేణుగోపాల్‌రావు, బాలసంకుల అనంతరావు, వి.బాలకిషన్‌రావు, గందె కల్పన విశ్వేశ్వర్రావు, లక్కాకుల మోహన్‌రావు, ఆది కొండాల్‌రావు, భాస్కర్‌రావు, ఆది రమణారావు, సర్పంచ్‌లు ఆది మధుసూదన్‌రావు, జి.లత శ్రీనివాస్‌రావు, రాజన్న తదితరులు పాల్గొన్నారు. -
రాజస్థాన్‌లో పోలీసుల ఎంజాయ్మెంట్
-
మమ్మీ డాడీలకు 10 పరీక్షలు ఆర్ యూ రెడీ...
సమ్మర్ స్పెషల్ పిల్లలకు చెప్పాల్సిన పది కథలివి. కథలు చెప్పాలంటే క్లయిమాక్స్ తెలిసుండాలిగా. అదీ నీతి కథల్లో క్లయిమాక్సే కీలకం. అందుకే మమ్మీ డాడీలకి ఈ చిన్ని పరీక్ష. పిల్లలు పరీక్షలు అయిపోయాయి. ఇక మిగిలింది పెంపకం పరీక్షలే. కాపీయింగ్ చేయకుండా జవాబులు చూడకుండా మీ పిల్లలకి ఈ నీతి కథల క్లయిమాక్స్‌లు చెప్పి మంచి పేరెంట్స్ అనిపించుకోండి. ఎంజాయ్. 1 ఎవరి పని వారు చేయాలి... ఒక ఊళ్లో ఒక రజకుడున్నాడు. అతడి దగ్గర ఒక కుక్క, గాడిద ఉన్నాయి. ఒక రోజు రాత్రి ఒక దొంగ ఆ రజకుడి ఇంటికి వచ్చాడు. గాడిద అది చూసి కుక్కతో- ‘లే..లే.. పెద్దగా మొరుగు. దొంగ వచ్చాడు’ అంది. దానికి కుక్క ‘నీ పని నువ్వు చూసుకో. ఇంతకాలం ఈ ఇంటి యజమానికి సేవ చేశాను. కాని ఏం చేశాడు? సరిగ్గా తిండి కూడా పెట్టట్లేదు’ అంది. దానికి గాడిద ‘అవన్నీ ఎంచవలసిన సమయం ఇది కాదు. నీకు విశ్వాసం లేకపోతే నాకు ఉంది. నువ్వు మొరగకపోతే నేను ఓండ్ర పెడతాను’ అని పెద్దగా ఓండ్ర పెట్టసాగింది. అప్పుడేం జరిగిందంటే... 2 బడాయి తాబేలు... ఒక చెరువులో కొన్ని కొంగలు, ఒక తాబేలు నివసించేవి. ఒకసారి ఆ ప్రాంతానికి కరువొచ్చింది. చెరువు మెల్లగా ఎండిపోవడం మొదలెట్టింది. కొంగలు ఒక్కొక్కటిగా వలస వెళుతున్నాయి. అది గమనించిన తాబేలు తనకు స్నేహితులైన రెండు కొంగల దగ్గరకొచ్చి- ‘మిత్రులారా... ఈ కష్టకాలంలో మీరు తప్ప నాకు ఇంకెవరున్నారు. మీతో పాటు నన్ను కూడా తీసుకెళ్లండి. నీళ్లున్న వేరే చెరువుకు వచ్చి మీతో పాటు బతుకుతాను’ అంది. ‘తీసుకెళతాం. కాని ఎలా’ అన్నాయి కొంగలు. దాని తాబేలే మార్గం చెప్పింది. పొడవైన కర్ర తెచ్చి రెండు కొంగలను చెరొక కొన పట్టుకొమ్మంది. మధ్య భాగాన్ని తాను పళ్లతో కరిచి పట్టుకుంది. కొంగలు గాల్లో లేచాయి. వాటితో పాటు తాబేలు కూడా లేచింది. కింద నుంచి ఇది గమనించిన జనం ముక్కున వేలేసుకున్నారు. పిల్లలు వెంటబడ్డారు. చాలామంది ‘ఈ తెలివి ఎవరిది.. ఈ తెలివి ఎవరిది’ అని ఆశ్చర్యపోయారు. అప్పుడేమైందంటే... 3 నక్కా- కొంగ ఒకసారి ఒక నక్క కనపడిన ఆహారాన్నల్లా పోగేసి విందు చేసుకుంది. తినే తొందరలో ఒక ఎముక దాని గొంతులో ఇరుక్కుంది. మింగుదామంటే లోపలికి పోదు. ఊయాలంటే బయటకు రాదు. ఈ అవస్థ నుంచి బయట పడేయమని చెరువు దగ్గర ఉన్న కొంగ దగ్గరకు వెళ్లింది. ‘మిత్రమా. నా గొంతులో ఉన్న ఎముక తీసి పెట్టు. ఊరికే వద్దు. నీ సాయానికి తగిన డబ్బు చెల్లిస్తాను’ అంది. కొంగ అందుకు అంగీకరించి నక్క గొంతులోకి తన ముక్కును పెట్టి ఎముకను లాగి బయట పడేసింది. అప్పుడేమైందంటే.... 4 పాము- చలిచీమలు... ఒక అడవిలో ఒక త్రాచు ఉండేది. అది ఎంతో పాశవికంగా పక్షుల గూళ్ల మీద దాడి చేసి వాటి గుడ్లు తినేస్తూ ఉండేది. పక్షులు దానిని ఏమీ చేయలేకపోయేవి. ఒకసారి అది దారిలో ఒక పెద్ద చీమల పుట్టను చూసింది. ఆ పుట్టనే తన ఇల్లు చేసుకోవాలనుకుంది. వెంటనే ఆ పుట్టలోకి దూరి అక్కడున్న చలిచీమలతో ‘ఎవరనుకున్నారు? మర్యాదగా అవతలికిపోండి. ఇక నుంచి ఈ పుట్ట నాది’ అంది. రాబోయేది వానాకాలం. చీమలు ఎంతో శ్రమ పడి ఆ పుట్టను నిర్మించుకున్నాయి. ఇప్పుడు త్రాచు వచ్చి చేరింది. పైగా చీమలు అంటూ చిన్న చూపు చూస్తోంది. అప్పుడేమైందంటే... 5 ఐకమత్యమే మహాబలం ఒక అడవిలో ఒక పావురాల గుంపు ఉండేది. ఒకరోజు అవి ఆకాశంలో ఎగురుతూ ఉండగా కింద నూకలు చల్లి కనిపించాయి. పావురాలు అవి చూసి నేల వాలుదామనుకున్నాయి. కాని వాటిలోని ఒక ముసలి పావురం- ‘తొందరపడకండి. అడవి మధ్యలో నూకలు ఉన్నాయంటే వాటి కింద వల ఉంటుంది. ఇది వేటగాడి పని’ అంది. అయినా కూడా పావురాలు మూర్ఖంగా వెళ్లి నూకల మీద వాలాయి. అంతే... వల వాటిని పట్టేసింది. దూరంగా వేటగాణ్ణి గమనించి వాటి పైప్రాణాలు పైనే పోయాయి. అప్పుడు ముసలి పావురం ‘బాధ పడకండి. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మనందరం రెక్కలు ఒక్కసారే ఆడించి పైకి ఎగురుదాం. వలతో సహా ఇక్కడి నుంచి వెళ్లిపోవచ్చు’ అంది. వెంటనే పావురాలు తమ రెక్కల్లో బలం తెచ్చుకున్నాయి. అన్నీ కలిసి ఒక్కసారిగా ఎగిరాయి. వేటగాడు నోరు తెరుచుకుని చూస్తూ ఉండగానే అన్నీ ఆకాశంలోకి ఎగిరాయి. అప్పుడేమైందంటే... 6 సింహం- చిట్టెలుక.... ఒక అడవిలో ఒక సింహం ఉండేది. దాని పేరు చెప్తే అందరికీ హడల్. ఒకరోజు అది ఒక చెట్టు కింద పడుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉంది. ఆ చెట్టు తొర్రలో ఒక ఎలుక ఉండేది. అది తన కలుగు నుంచి బయటకు వచ్చి ఆడుకోవడం మొదలెట్టింది. అది ఒకసారి సింహం చెవిని గిల్లడం మరోసారి సింహం తోక మీద గెంతడం చేసేసరికి సింహానికి మెలకువ వచ్చి ఆపైన కోపం వచ్చి చిటికెలో తన పంజాలో ఎలుకను బంధించేసింది. ‘నిన్ను తినేస్తా’ అంది సింహం. ‘బాబ్బాబు... ఈసారికి నన్నొదిలిపెట్టు. నన్ను నీ స్నేహితుణ్ణి అనుకో. ఒక స్నేహితుడిగా నీకు మేలు చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు మేలు చేస్తా’ అంది చిట్టెలుక. అందుకు సింహం పెద్దగా నవ్వి ‘నీతో స్నేహమా... నువ్వు నాకు చేసే సాయమా’ అంది. కాని చిట్టెలుక ముఖం చూసి జాలితో వదిలేసింది. ఇలా ఉండగా ఒకరోజు ఒక పెద్ద వేటగాడు అడవికి వచ్చాడు. సింహాన్ని వలేసి బంధించాడు. అప్పుడేమైందంటే.... 7 నాన్నా... పులి... ఒక రైతు తన కొడుకుతో పాటు పొలానికి వెళ్లాడు. దగ్గరలోనే అడవి ఉంది. అందువల్ల రైతు తన కొడుకుతో ‘బాబూ.. పులి తిరుగుతోంది. నీకు కనపడితే వెంటనే నాన్నా.. పులి అని పిలూ వస్తాను’ అని తన పనిలో పడ్డాడు. కొడుకు ఆడుకుంటూ తండ్రిని పరీక్షిద్దామని ‘నాన్నా... పులి’ అన్నాడు. వెంటనే తండ్రి పరిగెత్తుకొని వచ్చాడు. పులి లేదు. కొడుకు ఆకతాయిగా నవ్వాడు. మరికొద్ది సేపటి తర్వాత కొడుకు మళ్లీ ‘నాన్నా.. పులి’ అన్నాడు. తండ్రి పరిగెత్తుకొని వచ్చాడు. పులి లేదు. మూడోసారి నిజంగానే పులి వచ్చింది. అప్పుడేమైందంటే... 8 ఆవు - పులి.. ఒక ఆవు అడవికి మేతకు వెళ్లి దారి తప్పింది. అది సరాసరి పులి తిరిగే ప్రాంతంలోకి వెళ్లింది. పులికి ఇది మంచి పలహారం. ఆవును పులి ఆపేసింది. ‘నిన్ను తినేస్తా’ అంది. అప్పుడు ఆవు ‘నాకు దొరికిన గడ్డిని నేను తినడం ఎంత న్యాయమో నీకు దొరికిన జీవాన్ని నువ్వు తినడం అంతే న్యాయం. అయితే ఒక్క మాట. నాకు ఈ మధ్యనే లేగదూడ పుట్టింది. దానికి ప్రతి సాయంత్రం నేను పాలు ఇవ్వాలి. ఇప్పుడు నన్ను వదిలితే వెళ్లి పాలు ఇచ్చి వస్తాను. అప్పుడు నన్ను తినెయ్’ అంది. పులి నమ్మలేదు. ‘నువ్వు అబద్ధం చెప్తున్నావ్. నువ్వు మళ్లీ రావు’ అంది. ‘లేదు... వస్తాను’ అంది ఆవు. అప్పుడేమైందంటే... 9 కాకి - కుండ అనగనగా ఒక కాకి. ఆ కాకికి ఒకరోజు దప్పికేసింది. ఎగిరింది... ఎగిరింది... ఒక ఇంటి పెరటిలో ఒక కుండ కనిపించింది. కాకి అక్కడ వాలి కుండలోని నీళ్లు తాగాలని చూసింది. కాని నీళ్లు దాని ముక్కుకు అందలేదు. అవి అడుగున ఉన్నాయి. కాకికి దప్పికగా ఉంది. ఏం చేయాలి? ఒక ఆలోచన వచ్చింది. కాకి వెంటనే దగ్గరలో ఉన్న రాళ్లను ఏరి ఒక్కోరాయినీ ఆ కుండలో వేయడం మొదలెట్టింది. అప్పుడేమైందంటే... 10 కుందేలు తెలివి ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అది ప్రతిరోజూ తనకు ఆహారంగా అడవిలోని ఒక మూగ జీవిని కోరేది. ఎవరూ దానిని ఎదిరించలేక బాధపడుతుండేవారు. ఆరోజు సింహానికి ఆహారంగా వెళ్లాల్సిన బాధ్యత కుందేలు మీద పడింది. కుందేలుకు సింహం నోట చిక్కడం ఇష్టం లేదు. అందుకని అది సింహం దగ్గరకు చాలా ఆలస్యంగా వెళ్లింది. సింహం కోపంగా ‘ఎందుకింత ఆలస్యం?’ అని అడిగింది. కుందేలు వినయంగా ‘ప్రభూ, నా తప్పేమీ లేదు. నీలాంటివాడే ఒకడు నన్ను అటకాయించాడు. తప్పించుకుని వచ్చేసరికి ఆలస్యమైంది’ అంది. ‘నాలాంటివాడా? ఎక్కడ? చూపించు’ అంది సింహం. అప్పుడు ఏమైందంటే... జవాబులు 1. ఆ ఓండ్రకు నిద్ర చెడిన రజకుడు వేళగాని వేళలో ఓండ్ర పెడతావా అని దుడ్డుకర్ర తీసుకొని గాడిదను నాలుగు బాదాడు. ఈ హడావిడికి దొంగ పారిపోయాడు. నీతి: కుక్క పని కుక్క చేయాలి. గాడిద పని గాడిద చేయాలి అని. 2. తాబేలు తబ్బిబ్బయ్యింది. ఈ ఘనత తనదే అని నలుగురికీ అరిచి చెప్పాలనుకుంది. ఆ మాట కోసమే ఏమరుపాటులో నోరు తెరిచింది. ఇంకేముంది? ఆకాశం నుంచి నేల మీద చతికిల పడింది. నీతి: గొప్పలు అన్ని వేళలా మంచివి కావు. 3. నక్క ఎంతో సంతోషపడింది. అమ్మయ్య... కృతజ్ఞతలు అంది కొంగతో. మరి నా ఫీజు అంది కొంగ. నక్క హా..హా..హా.. అని పెద్దగా నవ్వి నా నోట్లో తల పెట్టి ప్రాణాలతో బయటపడ్డావ్. అదే నీ ఫీజు అంది. నీతి: దుష్టులతో జాగ్రత్త. ఎంత మేలు చేసినా కీడు చేస్తారు. 4. చలిచీమలు అడవిలో ఉన్న తన బంధుగణాన్నంతా పిలిచాయి. వేలాదిగా చీమలు తరలి వచ్చాయి. అవన్నీ ఒక్కసారికి త్రాచును కమ్ముకున్నాయి. అత్యంత బలం గలదాన్నని విర్రవీగిన ఆ త్రాచు చలిచీమల చేత చిక్కి అర్ధంతరంగా చచ్చింది. నీతి: ఎవరినీ బలహీనులుగా చూడవద్దు. 5. అవన్నీ అక్కడి నుంచి దూరంగా పెద్ద చెట్టు దగ్గర వాలాయి. ఆ చెట్టు తొర్రలో ఒక ఎలుక ఉంది. అది ఆ పావురాలకు స్నేహితుడు. పావురాలు దానితో తమ అవస్థ చెప్పగా వెంటనే ఎలుక వచ్చి తన పళ్లతో ఆ వలను తెచ్చి వాటికి విముక్తి ప్రసాదించింది. నీతి: ఐకమత్యమే మహాబలం. 6. సింహం వల నుంచి విడిపించుకోవడానికి పెనుగులాడింది. ఇంతలో సింహానికి వచ్చిన కష్టాన్ని చిట్టెలుక గమనించింది. అంతే.. గబగబా వచ్చి తన వాడియైన పళ్లతో వలను తెంపేసి సింహాన్ని విముక్తం చేసింది. సింహానికి చిట్టెలుక మీద గౌరవం పెరిగింది. అప్పటి నుంచి ఎలుకను అది తన నిజమైన స్నేహితుడిగా స్వీకరించింది. నీతి: స్నేహం ఎంత చిన్నదైనా మేలే చేస్తుంది. 7. పులి నిజంగానే వచ్చింది. కొడుకు భయపడిపోయి ‘నాన్నా..పులి’ అని పెద్దపెద్దగా అరిచాడు. కాని కొడుకు మళ్లీ ఆకతాయిగా అబద్ధం చెప్తున్నాడనుకొని తండ్రి రాలేదు. కొడుకును పులి తినేసింది. నీతి: అబద్ధం ప్రాణాంతకం. 8. పులి అపనమ్మకంగానే వదిలేసింది. ఆవు వెంటనే ఇంటికి పరిగెత్తి దూడకు కడుపు నిండుగా పాలు తాపి ‘జాగ్రత్త తల్లి’ అని ముద్దులు పెట్టి వదల్లేక వదల్లేక అడవికి చేరుకుంది. ‘ఇక నాకు దిగుల్లేదు. తిను’ అంది. పులికి ఇది ఆశ్చర్యం. మాట మీద నిలబడే గొప్ప గుణం గల ఆవును చూసి దాని హృదయం పశ్చాత్తాపంతో నిండిపోయింది. ఆవును వదిలేసింది. అంతేకాదు అప్పటి నుంచి అది అనవసర వేట కట్టిపెట్టింది. నీతి: నిజాయితీకి మించిన వ్యక్తిత్వం లేదు. 9. రాళ్లన్నీ అడుగుకు వెళ్లాయి. కుండలోని నీళ్లు పైకి వచ్చాయి. కాకి హాయిగా తన దప్పిక తీర్చుకుని ఎగిరిపోయింది. నీతి: శక్తి కన్నా యుక్తి మేలు. 10. కుందేలు నేరుగా సింహాన్ని ఒక బావి దగ్గరకు తీసుకెళ్లింది. ‘అదిగో చూడు’ అని బావిలోకి చూపించింది. సింహం తొంగి చూసి, తన నీడనే ప్రత్యర్థి అనుకుని దానితో పోరాటానికి ఒక్క ఊపున బావిలో దూకి చచ్చింది. నీతి: మూర్ఖులకు ముప్పు తప్పదు. -
మధురైలో గోట్ఫైట్
-
సన్‌రైజర్స్ సరదాలు
-
ఏమి సేస్తిరి... ఏమి సేస్తిరి..!
-
వినోదమొక్కటే చాలదు!
టీవీక్షణం బుల్లితెర ముందు కూర్చుని భలేగా ఎంజాయ్ చేస్తుంటారు బుజ్జిగాళ్లు. టీవీ చూడ్డానికి మించిన సంతోషం మరేమీ ఉండదు వారికి. అందుకే పిల్లల కోసం రకరకాల కార్యక్రమాలను రూపొందిస్తుంటారు చానెళ్ల యజమానులు. అసలు పిల్లల కోసమే ప్రపంచవ్యాప్తంగా బోలెడన్ని ప్రత్యేక చానెళ్లు ఉన్నాయి. కార్టూన్ నెట్వర్క్, ఖుషీ టీవీ, నికొలొడియన్, నిక్ జూనియర్, డిస్నీ జూనియర్, జెటిక్స్, పోగో, మా జూనియర్స్, టూన్ డిస్నీ, చింటూ టీవీ, బూమెరాంగ్ అంటూ వందలాది చానెళ్లు చిన్నారులను అలరించడానికే పుట్టుకొచ్చాయి. వీటిలో చిన్నారుల మనుసుల్ని అత్యధికంగా దోచుకున్న చానెల్ నికొలొడియన్. ప్రపంచంలో ఇదే నంబర్‌వన్ కిడ్స్ చానెల్ అని సర్వేలో తేలింది. తర్వాతి స్థానంలో కార్టూన్ నెట్వర్క్ నిలిచింది. ఇక ప్రోగ్రాముల విషయానికి వస్తే... పిల్లలకు మనుషులతో రూపొందించే కార్యక్రమాల కంటే, యానిమేషన్లే ఎక్కువ ఇష్టమని తేలింది. మనుషులతో రూపొందించిన వాటిలో శక్తిమాన్, మిస్టర్ బీన్ లాంటి ఏవో కొన్ని మాత్రమే సక్సెస్ అయ్యాయి. అందుకే పిల్లల కార్యక్రమాలను చాలావరకూ యానిమేషన్ రూపంలోనే తెరకెక్కిస్తున్నారు. టామ్ అండ్ జెర్రీ, బగ్స్ బన్నీ, డక్ టేల్స్, రిక్ అండ్ మార్టిన్, ద సింప్సన్స్, డ్రాగన్ బాల్, పవర్ రేంజర్స్, ద జంగిల్‌బుక్, శ్రీకృష్ణ, ఎక్స్‌మెన్, వాకింగ్ విత్ డైనోసార్స్, సూపర్‌మేన్, బ్యాట్‌మేన్, స్పైడర్మాన్ తదితర యానిమేషన్ సిరీస్‌లన్నీ సూపర్ హిట్ అయ్యాయి! పిల్లల షోలే కదా అని లైట్‌గా తీసుకుంటే కుదరదు. బుజ్జిగాళ్లకీ ఓ టేస్ట్ ఉంటుంది. దాన్ని గమనించి, ఎప్పటికప్పుడు కొత్త కొత్త కథనాలను వెలువరించాలి. లేదంటే ఫెయిలవడం ఖాయం. స్క్విరల్ బాయ్, వాట్ ఎ కార్టూన్ లాంటి కొన్నింటిని పిల్లలు తిప్పి కొట్టడానికి కారణం అదే. ఆ దెబ్బతో పిల్లలైనంత మాత్రాన ఏది పడితే అది చూడరని తెలిసొచ్చింది చానెళ్లవారికి. వెంటనే కొత్త కథల వేటలో పడ్డారు. సరికొత్త కథనాలకు తెర తీశారు. అయితే ఈ క్రమంలో షోలను కొన్నిసార్లు పక్కదారి పట్టిస్తున్నారు. కొన్ని కిడ్స్ షోలను పరిశీలిస్తే హింస హద్దు దాటినట్టుగా అనిపిస్తోంది. తుపాకులతో కాల్చేయడం, బాంబులు వేయడం, కత్తులు దూయడం, వెంటాడి చంపడం, కుట్రలు పన్నడం, కుతంత్రాలు జరపడం వంటివి కాస్త ఎక్కువగా కనిపిస్తున్నాయి. అవి పిల్లల మీద దుష్ర్పభావాన్ని చూపుతాయనడంలో సందేహం లేదు. టీవీ షోలను చూసి పిల్లలు తప్పుడు పనులకు పాల్పడిన ఉదంతాలు చాలా ఉన్నాయి. ఆమధ్య ఇద్దరు పిల్లలు ఓ టీవీ షోలో చూసి, తమ స్నేహితుడి పట్ల హింసకు పాల్పడ్డారు. మరో చిన్నారి తన ఫేవరేట్ షోలో హీరో వచ్చి కాపాడతాడని ప్రాణాలను ప్రమాదంలో పెట్టుకున్నాడు. టీవీ ప్రోగ్రాముల ప్రభావం వారి మీద అంతగా ఉంటోందన్నమాట. కాబట్టి పిల్లల కార్యక్రమాలను జాగ్రత్తగా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది. హింసను వారి మనసుల్లో నాటకుండా, విలువలను తెలియజేసేందుకు ప్రయత్నించాలి. అలాగని నీతి పాఠాలు చెప్పమని కాదు. చెడును ప్రేరేపించవద్దని... వినోదంతో పాటు విజ్ఞానాన్నీ, విషయ పరిజ్ఞానాన్నీ కలిగించే కార్యక్రమాలను కూడా పెంచమని! -
కామిక్ ఎక్స్‌ప్రెస్
-
మనోహరమైన మున్నార్..!
నేడు చాలామంది మానసిక ఒత్తిడి నుంచి దూరం అవాలని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని వెదుక్కుంటూ ప్రకృతి వనాలున్నచోటుకు వెళ్లాలని తపిస్తున్నారు. ఆ కోవలో పర్యాటకులను అమితంగా ఆకర్షించే ప్రాంతం మున్నార్. ఆహ్లాదకరమైన వాతావరణంలో, ఆకుపచ్చని తేయాకు తోటల్లో మీ సెలవుదినాలను ఎంజాయ్ చేయవచ్చు. ఏర్కాడు, ఏలగిరి, తేక్కడితో పాటు ఊటీ, కొడెకైనాల్లు మున్నార్‌కు దగ్గరలోనే ఉన్నాయి. అద్భుతమైన సెలవు దినాలలో మూడు రాత్రులు, నాలుగు పగళ్ల కోసం రూ.17,010 చెల్లిస్తే చాలు. ఇందులోనే అల్పాహారం, లంచ్, డిన్నర్, విమానాశ్రయానికి చేర్చడం వంటి అవకాశాలు కల్పించారు. అతిథుల సౌకర్యం కోసం 10 శాతం డిస్కౌంట్‌తో రూమ్ డైనింగ్, లాండ్రీ సౌకర్యాలున్నాయి. అత్యంత రద్దీగల ఈ ప్రాంతాల్లో ప్రత్యేకంగా పిల్లలు, పెద్దలు వినోదాన్ని పొందే సౌకర్యాలూ ఉన్నాయి. మూడు రాత్రులు, నాలుగు పగళ్లు మున్నార్, తేక్కడిలో గడపచ్చు. ఇందుకు ప్యాకేజీ ధర రూ.32,000. దీంట్లోనే పెద్దలకు ప్రత్యేకమైన ఆయుర్వేదిక్ మసాజ్, సుగంధద్రవ్యపు తోటల సందర్శన, మున్నార్‌లోని ఇతర ప్రదేశాల సందర్శన అవకాశం కల్పిస్తారు. మరిన్ని వివరాలకు: http://bookings.sterlingholidays.com/packages/monsoon/ వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వచ్చు. -
30 లక్షలతో ‘ఎంజాయ్’
మహి, సునీతా మార్షియా జంటగా రూపొందిన చిత్రం ‘ఎంజాయ్’. జి.వి.సుబ్రమణ్యం దర్శకుడు. జి.సత్యనారాయణ నిర్మాత. బుధవారం హైదరాబాద్‌లో దర్శక-నిర్మాత మారుతి చేతుల మీదుగా ఈ చిత్రం ప్రచార చిత్రాలను విడుదల చేశారు. స్నేహితుల సహకారంతో కేవలం 30 లక్షలతో సినిమాను పూర్తి చేశామని దర్శకుడు చెప్పారు. తమ ప్రయత్నాన్ని ప్రేక్షకులు తప్పక ఆశీర్వదిస్తారని నిర్మాత నమ్మకం వ్యక్తం చేశారు. ‘‘నా ‘ఈ రోజుల్లో’ సినిమా ఎంతమందిని బాగు చేసిందో, అంతమందిని చెడగొట్టింది. ఈ ‘ఎంజాయ్’ బృందం మాత్రం బాగుపడిన వారి జాబితాలోనే ఉండాలి’’ అని మారుతి ఆకాంక్షించారు. దర్శకులు శివనాగేశ్వరరావు, వీరశంకర్, దేవిప్రసాద్ మాట్లాడారు. -
నృత్యాలు,కేరింతలతో అదరగొట్టిన యూత్
-
టెన్షన్ లేని టూర్
దసరా సెలవులు సమీపిస్తున్నాయి... ఫ్యామిలీ అంతా కలిసి ఏదైనా టూర్‌కి వెళ్లి ఎంజాయ్ చేయాలనుకోవడం సహజం. కానీ, రైల్వే, విమాన టికెట్ల రిజర్వేషన్, వీసా మొదలు... గైడు, చూడాల్సిన ప్రదేశాల ఎంపిక, భోజనం, వసతి ఏర్పాట్లు కష్టమే. వీటికి భయపడే చాలా మంది తమ టూర్లు రద్దు చేసుకుంటారు. అరుుతే.. ఇప్పుడు అలాంటి సందేహాలు అక్కర్లేదు. ఆ ఏర్పాట్లన్నీ చూసుకునే టూర్ సర్వీసెస్ వరంగల్ నగరంలో విస్తరిస్తున్నాయి. ఒక్కటేమిటి... అన్ని రకాల సేవలను ఆయూ సంస్థలే బాధ్యతగా తీసుకుంటున్నారుు. ఇక మీరు చేయూల్సిందల్లా... ఎమౌంట్ చెల్లించడమే. సాక్షి, హన్మకొండ :తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలు, వివాహ శుభకార్యాలకు వాహనాలు నడిపించడమే గతంలో టూర్ సర్వీసెస్‌గా ఉండేది. ఇప్పుడు బస్సులో తీసుకెళ్లడమే కాదు.. అక్కడ బ్రేక్ దర్శనాలు కూడా చేరుుస్తున్నారు. హానీమూన్ ప్యాకేజీలు కూడా అందిస్తున్నారు. పెళ్లి, విహారయాత్రలకు వాహనాలు సమకూర్చడం ప్రస్తుత పోటీ ప్రపంచంలో చిన్న అంశంగా మారింది. యాత్ర ప్రత్యేకతలను తెలిపే గైడ్ల నుంచీ... వసతి, భోజన, దర్శన, వీసా, టికెట్ల వంటి ఏర్పాట్లు చేసే సంస్థలు వెలిశారుు. ఈ సర్వీసెస్ వరంగల్‌లో అందుబాటులోకి రాగా... ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. టూర్ ఏదైనా సరే.. విద్యార్థులు వెళ్లే ఎడ్యుకేషనల్ టూర్స్, ఫ్యామిలీస్ వెళ్లే పుణ్యక్షేత్రాల దర్శనం, కొన్ని కుటుంబాలు కలిసి చేసే ఆథ్యాత్మిక యాత్రలు, కార్పొరేట్ కంపెనీలు ఏర్పాటు చేసే రిఫ్రెష్మెంట్ టూర్స్, సింగిల్‌గా వెళ్లే ఎడ్వెంచర్స్ టూర్, కొత్తగా పెళ్లైన జంటలకు హానీమూన్... ఇలా ఏదైనా సరే అన్నీ ఏర్పాట్లు చకచకా జరిగిపోతుంటాయి. టూర్ బుక్ చేసుకుని ఎమౌంట్ చెల్లిస్తే చాలు. ఆ తర్వాత ఎలాంటి టెన్షన్స్ లేకుండా టూర్‌ని ఎంజాయ్ చేయడమే యాత్రికులకు మిగిలిన పని. సింపుల్‌గా చెప్పాలంటే రైల్వే రిజర్వేషన్ నుంచి మొదలు పెడితే విదేశాల్లో వీసా ఇప్పించడం వరకు అన్ని బాధ్యతలను ఈ సంస్థలే తీసుకుంటున్నారుు. సేవలు ఎలా అంటే.. ముందుగా సదరు వ్యక్తులు ఎక్కడికి వెళతారో... సంస్థలో బుక్ చేసుకోవాలి. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు రైలు, బస్సు, విమానం టికెట్లు బుక్ చేసి ఇస్తారు. ఆ తర్వాత వరంగల్ నుంచి బయల్దేరి గమ్యస్థానం చేరిన వెంటనే అక్కడ ఈవెంట్ మేనెజ్మెంట్ సంస్థకు సంబంధించిన బాధ్యులు యాత్రికులను పికప్ చేసుకుంటారు. ఒప్పందం ప్రకారం 3 స్టార్, 4 స్టార్ హోటళ్లలో వసతి, భోజన సౌకర్యం కల్పిస్తారు. అనంతరం దర్శనీయ స్థలాలు చూసేందుకు వాహనం, గైడ్, అనుమతి తదితర పనులన్నీ వీరే చక్కబెడతారు. తిరుపతి వంటి పుణ్యక్షేత్రాల్లో అయితే బ్రేక్ దర్శనం ఏర్పాట్లు కూడా ఈ సర్వీస్ సంస్థకు చెందిన బాధ్యులే తీసుకుంటారు. యాత్ర మొత్తం పూర్తయిన తర్వాత తిరిగి వరంగల్ చేరే వరకు ఏ ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తారు. అందుబాటులో ఉన్న ప్యాకేజీలు ఎడ్యుకేషన్ టూర్లో భాగంగా విద్యార్థులకు జిల్లాలో హన్మకొండలోని వేయిస్తంబాలగుడి, భద్రకాళి టెంపుల్, ఖిలావరంగల్, లక్నవరం, రామప్ప ప్యాకేజ్ టూర్ అందుబాటులో ఉంది. ఈ ప్రదేశాల దర్శనంతో పాటు లంచ్, స్నాక్స్ కూడా అందిస్తారు. ఇవి కాకుండా ఎడ్యుకేషన్ టూర్లో మైసూర్, బెంగళూరు, కన్యాకుమారి ప్యాకేజీలూ ఉన్నాయి. ఈ ప్యాకేజీకి కనీసం 50 మంది విద్యార్థులు ఉండాలి. ప్రకృతి, పుణ్యక్షేత్రం ప్యాకేజీలో భద్రాచలం అందుబాటులో ఉంది. ఇక షిర్డీ, వైజాగ్, తిరుపతి వంటి ప్రాంతాలకు సంబంధించి మూడు పగళ్లు, నాలుగు రాత్రుల ప్యాకేజీకి అన్ని ఖర్చులు కలిపి ఒక్కరికి రూ. 6000 వరకు చార్జ్ వేస్తున్నారు. కొత్తగా పెళ్లైన జంటలకు సంబంధించి కేరళకు హనీ మూన్ ప్యాకేజీ ఉంది. ఇందులో ఐదు రాత్రులు, నాలుగు పగళ్లు కలిపి జంటకు రూ. 44,000 చార్జ్ తీసుకుంటున్నారు. బ్యాంకాక్ టూర్లో భాగంగా ఐదు పగల్లు, నాలుగు రాత్రులకు సంబంధించి ఒక్కరికి రూ. 44,000... ఖాట్మాం డు టూర్లో మూడు పగల్లు, నాలుగు రాత్రుళ్లకు సంబంధించి ఒక్కరికి రూ. 25,000 చార్జ్ వేస్తున్నారు. విదేశీ యాత్రల్లో తెలుగు భాష తెలిసిన గైడ్, ఇంగ్లిష్ భాష వచ్చిన క్యాబ్ డ్రైవర్లను సంస్థలే సమకూర్చుతారుు. ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ అందిస్తున్న ప్యాకేజీలు (హైదరాబాద్ నుంచి) కాకతీయ హెరిటేజ్ ప్యాకేజ్ ( 2 డేస్, 2 నైట్స్) యాదగిరిగుట్ట, పెంబర్తి, జైన దేవాలయం, చేర్యాల పెయింటింగ్స్, ఖిలా వరంగల్, భద్రకాళి టెంపుల్, వేయిస్తంభాలగుడి, గణపురం కోటగుళ్లు, రామప్పదేవాలయం, ఏటూరునాగరాం అభయారణ్యం, లక్నవరం సరస్సులున్నాయి. ఒక్క యాత్రికుడికి టికెట్ ధర ఏసీ కోచ్ అయితే రూ. 3,000, నాన్ ఏసీ కోచ్‌కు రూ. 2,500. హిల్‌స్టేషన్ ప్యాకేజ్ (3 డేస్, 2 నైట్స్) అన్నవరం,బొర్రగుహాలు, అరకు, విశాఖపట్నం, భీమవరం, పాలకొల్లు, విజ యవాడ, ద్వారాకా తిరుమల ఉన్నా రుు. ఏసీ కోచ్ టికెట్ ధర ఒక్కరికి రూ.4,000, నాన్ఏసీ కోచ్‌కు రూ. 3,500. టెంపుల్ ప్యాకేజీ (2 డేస్, 1 నైట్) వేములవాడ, కొండగట్టు, కాళేశ్వరం, బాసర ప్యాకేజీకి ఏసీ కోచ్ టికెట్ ధర ఒక్కరికి రూ. 2,600, నాన్ ఏసీకి రూ.2,100. విహారయాత్ర (2 డేస్, 1 నోట్) భద్రాచలం, పాపికొండలు (బోటు జర్నీ). ఏసీ కోచ్ టికెట్ ధర ఒక్కరికి రూ.2,600, నాన్ ఏసీకి రూ. 2,100. ఆదరణ బాగుంది కొంత కాలం క్రితం వరకు ప్రైవేట్ బస్ సర్వీసెస్ ఉండే ఏనుగుల గడ్డ ప్రాంతమే నగరంలో టూరిస్ట్ సర్వీసెస్‌కి అడ్డా. కానీ, పోటీ ప్రపంచంలో అందరూ వివిధ వృత్తుల్లో బిజీ అవడంతో తీరిక లేకుండా ఉంటున్నారు. అందువల్లే పని ఒత్తిడి నుంచి బయట పడేందుకు టూర్స్‌కి ఎక్కువగా వెళ్తున్నారు. అయితే అక్కడ కూడా బస, వసతి ఇబ్బందులు ఉండొద్దని కోరుకుంటున్నారు. అందువల్లే టూరిస్ట్ సర్వీసెస్‌కి నగరంలో ఆదరణ పెరుగుతోంది. మేం సర్వీస్ ప్రారంభించిన వారం రోజుల వ్యవధిలోనే బ్యాంకాక్, ఖాట్మాండుల ప్యాకేజీలను ఇద్దరు టూరిస్టులు బుక్ చేసుకోవడం ఇక్కడున్న డిమాండ్‌ని తెలియజేస్తుంది. మా సర్వీసెస్ కావాలనుకునే వారు 97009 99786 ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చు. - ప్రదీప్, హ్యాపీడేస్-హాలీడేస్ మేనేజర్ విదేశాలకు వెళ్లేవారు పెరిగారు గతంలో యాత్రలు అంటే తిరుపతి, వేములవాడ, కాళేశ్వరం.. లేదంటే చార్ధామ్ యాత్ర అన్నట్లుగానే ఉండేది. కానీ గడిచిన ఐదేళ్లలో నగరంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. సమ్మర్ వెకేషన్స్‌కి ఎక్కువ మంది కులూమనాలి, సిమ్లా, గోవా, ఊటీలకు వెళ్తున్నారు. ప్రకృతి ప్రేమికులు ఎక్కువగా కేరళ... లేదంటే బ్యాంకాక్, పుకెట్ ఐలాండ్ వంటి దీవులకు వెళ్తున్నారు. గతంలో ఈ సర్వీస్‌ల కోసం హైదరాబాద్ వరకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు నగరంలో అందిస్తుండటంతో వెకేషన్స్‌కి విదే శాలకు వెళ్లేవారి సంఖ్య పెరిగింది. - నవీన్, శ్రీజా ట్రావెల్స్ మేనేజింగ్ డెరైక్టర్