భారతదేశంలోని జపాన్ రాయబారి హిరోషి సుజుకి తాజాగా వారణాసిలో స్ట్రీట్‌ఫుడ్ టేస్ట్ చేశారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వివరాలను పంచుకున్నారు. కూరగాయలతో చేసిన కచోరీతోపాటు జిలేబీలను ఆయన ఆరగించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో దీనికి సంబంధించిన రెండు క్లిప్‌లను షేర్ చేశారు.
వీడియోను పోస్ట్ చేసిన ఆయన.. ‘వారణాసిలో స్ట్రీట్ ఫుడ్‌ను ఆస్వాదిస్తున్నాను’అని రాశారు. కచోరీ చాలా బాగుందని, జలేబీ మరింత బ్రహ్మాండంగా ఉందంటూ కొనియాడారు. జపాన్ రాయబారికి చెందిన ఈ వీడియో వైరల్ అయ్యింది.
జపాన్ రాయబారి వారణాసిని సందర్శించడం ఇదేమీ తొలిసారి కాదు. గత మే నెలలోనూ ఈ నగరాన్ని సందర్శించారు. అప్పుడు గోల్ గప్పా, బాటి చోఖా,బనారసి థాలీ లాంటి పలు వంటకాలను రుచి చూశారు.
Enjoying street food in Varanasi! pic.twitter.com/xVmNvcOJuw
— Hiroshi Suzuki, Ambassador of Japan (@HiroSuzukiAmbJP) December 30, 2023
Comments
Please login to add a commentAdd a comment