kachori
-
సమోసా, కచోరీ ఏం పాపం చేశాయ్..! ఇదీ లెటెస్ట్ ట్రెండ్ వైరల్ స్టోరీ
ఇప్పుడంటే బఫేలు, కేటరింగ్లు వచ్చాయి గానీ, గతంలో విందు భోజనాల్లో కొసరి కొసరి వడ్డించడం అలవాటు. ఏమండీ... ఇది రుచి చూశారా.. మీ కోసమే స్పెషల్‌గా చేయించా... అసలు ఈ పనస పొట్టు బిర్యానీ తిని చూడండి.. హా.. ములక్కాడ, జీడిపప్పు అబ్బ.. ఒక్కసారి రుచి చూడండి... ఇంకో పూర్ణ బూరె వేసుకోండి.. వేడి వేడిగా నెయ్యి వేసుకొని తిన్నారంటే బ్రహ్మాండం కదా..! అన్నట్టు చివర్లో తాంబూలం మర్చిపోకండి సుమా! ఇదీ పెళ్లిళ్లు, పేరంటాల్లో అతిథులకు లభించే మర్యాద. కానీ ప్రస్తుత బిజీ లోకంలో ఆ అప్యాయతలు మర్యాదలు అన్నీ మారిపోయాయి. ట్రెండ్ మారింది. చుట్టాలు, బంధువుల ప్లేస్‌లోకి చిన్న చిన్న రెస్టారెంట్లు వచ్చి చేరాయి. దీన్ని అందిపుచ్చుకున్న చిన్న చిన్న రెస్టారెంట్లు, హోటల్స్ వ్యాపారంలో ట్రెండ్ మార్చేశాయి. ప్రస్తుత బిజీ లోకంలో ఆనాటి అప్యాయతలు మర్యాదలు అన్నీ మారిపోయాయి. ట్రెండ్ మారింది. దీన్నే చిన్నా, పెద్దా రెస్టారెంట్లు, హోటల్స్ క్యాష్ చేసుకుంటున్నాయి. చుట్టాలు, బంధువుల ప్లేస్‌లోకి చిన్న చిన్న రెస్టారెంట్లు వచ్చి చేరాయి. రా రామ్మని ఊరించేలా కస్టమర్లను వినూత్నంగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటిదాకా సరికొత్త రుచులు, వివిధ ప్రాంతాల వంటకాలను అందించిన హోటళ్లు భోజన ప్రియుల్ని, కొత్తగా తిందామనుకుని వచ్చే వారిని ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. హంగులు, ఆర్భాటాలతో మెప్పించడమే కాకుండా చుట్టాల్లా ఆదరిస్తున్నాయి. ( శివారులో వినూత్న హోటళ్లు) ఇక ఆ తరువాత కస్టమర్లను ఆకట్టుకునేలా తమ హోటళ్ల పేర్లను పెట్టుకోవడంలో మరో అడుగు ముందుకేశాయి. తినేసి పో.., ఉలవచారు, కోడికూర-చిట్టిగారె,రాజుగారి పులావ్ లాంటి పేర్లతో తమ హోటళ్ళకు రప్పించుకుంటున్నాయి. (ఆకలైతుందా.. తినేసిపో! అంతేరా! దా–తిను! ) సమోసాను, కచోరీని మర్చిపోతే ఎలా? ఎప్పటికపుడు తమ సృజనాత్మకతకు పదును పెడుతూ కొంత పుంతలు తొక్కుతున్నాయి. ఈక్రమంలోనే ఇపుడు నయా ట్రెండ్ వెలుగులోకి వచ్చింది. అయ్యా , మా హోటల్‌కు వచ్చినందుకు ధన్యవాదాలు. ఈ సారి మాత్రం ఇవి మర్చిపోవద్దు అంటూ గుర్తు చేయడం విశేషంగా నిలిచింది. రెస్టారెంట్ బిల్లుపై సమోస, కచోరీ తినడం మర్చిపోకండి.. వాటిలో ఫిల్లింగ్ ఉంటుంది. కడుపు నిండుతుంది అన్నట్టు ఒక మెసేజ్ ఉండటం లేటెస్ట్ ట్రెండ్. దీనికి సంబంధించిన రిసీట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఔరా అంటున్నారు భోజన ప్రియులు. (హంగూ, ఆర్బాటంలేదు, గుర్రమెక్కలేదు.. మూడు ముళ్లు వేయలేదు.. సింపుల్‌గా సెలబ్రిటీ పెళ్లి) -
కచోరీ, జిలేబీ సూపర్: జపాన్ రాయబారి!
భారతదేశంలోని జపాన్ రాయబారి హిరోషి సుజుకి తాజాగా వారణాసిలో స్ట్రీట్‌ఫుడ్ టేస్ట్ చేశారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వివరాలను పంచుకున్నారు. కూరగాయలతో చేసిన కచోరీతోపాటు జిలేబీలను ఆయన ఆరగించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో దీనికి సంబంధించిన రెండు క్లిప్‌లను షేర్ చేశారు. వీడియోను పోస్ట్ చేసిన ఆయన.. ‘వారణాసిలో స్ట్రీట్ ఫుడ్‌ను ఆస్వాదిస్తున్నాను’అని రాశారు. కచోరీ చాలా బాగుందని, జలేబీ మరింత బ్రహ్మాండంగా ఉందంటూ కొనియాడారు. జపాన్ రాయబారికి చెందిన ఈ వీడియో వైరల్ అయ్యింది. జపాన్ రాయబారి వారణాసిని సందర్శించడం ఇదేమీ తొలిసారి కాదు. గత మే నెలలోనూ ఈ నగరాన్ని సందర్శించారు. అప్పుడు గోల్ గప్పా, బాటి చోఖా,బనారసి థాలీ లాంటి పలు వంటకాలను రుచి చూశారు. Enjoying street food in Varanasi! pic.twitter.com/xVmNvcOJuw — Hiroshi Suzuki, Ambassador of Japan (@HiroSuzukiAmbJP) December 30, 2023 -
పెసర పప్పు రుచులు.. డోక్లా, దాల్ కచోరి ఇలా ఇంట్లోనే ఈజీగా!
Recipes In Telugu: వేసవి కాలంలో ఎంతో చలువ చేసే పెసర పప్పుతో రకరకాల వంటకాలు వండుకోవచ్చు. మండే ఎండల్లో పెసర పప్పుని మరింత రుచికరంగా వండుకుని ఎలా ఆస్వాదించవచ్చో చూద్దాం... డోక్లా కావలసినవి: పొట్టుతీయని పెసరపప్పు – కప్పు, అల్లం – అంగుళంన్నర ముక్క, పచ్చిమిర్చి – రెండు, కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూను, ఆయిల్ – టేబుల్ స్పూను, నిమ్మరసం – టేబుల్ స్పూను, బేకింగ్ సోడా – అరటీస్పూను, ఉప్పు – రుచికి సరిపడా, కొత్తిమీర తరుగు – పావు కప్పు, పచ్చికొబ్బరి తురుము – పావు కప్పు, వేయించిన నువ్వులు – టీస్పూను. తాలింపు కోసం: ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు, ఆవాలు – అర టీస్పూను, జీలకర్ర – ఆరటీస్పూను, ఇంగువ – చిటికెడు, కరివేపాకు – రెండు రెమ్మలు. తయారీ: ►పెసర పప్పుని శుభ్రంగా కడిగి రాత్రంతా లేదా ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి. ►నానిన పప్పుని నీళ్లు వంపేసి కొత్తిమీర తరుగు వేసి బరకగా రుబ్బుకోవాలి. ►మందపాటి పాత్రలో రెండున్నర కప్పులు నీళ్లు పోసి..మెటల్ స్టాండ్ పెట్టాలి. ►ఈ స్టాండ్‌పై ఒక వెడల్పాటి పాత్రనుపెట్టి అడుగున ఆయిల్ రాయాలి. ►పప్పు రుబ్బులో అల్లం, పచ్చిమిర్చిని దంచి వేయాలి. కొద్దిగా ఆయిల్, నిమ్మ రసం, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. దీనిలో అరటీస్పూన్ బేకింగ్ సోడా వేసి కలిపి, ►ఆయిల్ రాసి పెట్టుకున్న పాత్రలో వేసి ఆవిరి మీద ఇరవై నిమిషాల పాటు ఉడికించి దించేయాలి. ►బాణలిపెట్టి ఆయిల్ వేయాలి, ఆయిల్ వేడెక్కిన తరువాత ఆవాలు వేసి చిటపటలాడనిచ్చి, జీలకర్ర, ఇంగువ కరివేపాకు వేసి వేయించాలి. ►దీనిలో రెండు టేబుల్ స్పూన్లు నీళ్లుపోసి తిప్పి స్టవ్ ఆపేయాలి. ►ఆవిరి మీద ఉడికించిన పప్పుపైన ఈ తాలింపు వేయాలి. కొత్తిమీర తరుగు, పచ్చికొబ్బరి, నువ్వులు చల్లి, ముక్కలుగా కట్ చేస్తే డోక్లా రెడీ. దాల్ కచోరి కావలసినవి: గోధుమ పిండి – రెండు కప్పులు, ఉప్పు – అర టీస్పూను, నెయ్యి – పావు కప్పు. స్టఫింగ్ కోసం: పొట్టుతీసిన పెసరపప్పు – అరకప్పు, నెయ్యి టేబుల్ స్పూను, పసుపు – పావు టీస్పూను, కారం – అర టీస్పూను, జీలకర్ర – అరటీస్పూను, సొంటిపొడి – అరటీస్పూను, ధనియాల పొడి – టీస్పూను, సోంపు – టీస్పూను, ఆమ్చూర్ పొడి – టీస్పూను, ఉప్పు – రుచికి సరిపడా, ఆయిల్ – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ముందుగా పెసరపప్పుని శుభ్రంగా కడిగి రెండు గంటలపాటు నానబెట్టి, తరువాత బరకగా రుబ్బి పక్కనపెట్టుకోవాలి. ►గోధుమ పిండిలో పావు కప్పు నెయ్యి, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా కలుపుకోని పక్కన పెట్టుకోవాలి. ►స్టవ్ మీద బాణలి పెట్టి అర టేబుల్ స్పూను నెయ్యి వేయాలి. ►వేడెక్కిన తరువాత పెసర పప్పు రుబ్బు జీలకర్ర, సొంటిపొడి, ధనియాలపొడి, సోంపు పొడి, ఆమ్‌చూర్‌పొడి, పసుపు, కారం వేసి కలపాలి. ►నాలుగు నిమిషాలు వేగాక రుచికి సరిపడా ఉప్పు వేసి మరో ఐదు నిమిషాలు వేయించి స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. ►చల్లారాక మిశ్రమాన్ని ఉండలుగా చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ►ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని చపాతీలా వత్తుకుని మధ్యలో పెసరపప్పు ఉండ పెట్టి, పూర్తిగా కవర్ అయ్యేలా ఉండలా చుట్టుకోవాలి. ►ఈ ఉండని చిన్న కచోరిలా చేసి బంగారు వర్ణంలోకి మారేంత వరకు ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే దాల్ కచోరి రెడీ. చదవండి: అవును... నాకు బట్టతలే.. అయితే ఏంటి? -
ఏకంగా రైలునే ఆపేసిన ‘కచోరి’.. ప్రతిరోజూ ఇదే తంతు!
ఇష్టమైనవాటి కోసం ఎంతదూరమైనా వెళ్తుంటారు కొందరు! అవి తమ చెంతకే వస్తే!. ఇక్కడో లోకోపైలట్ ఏం చేస్తున్నాడో తెలుసా? కచోరిలను చాలా ఇష్టంగా బ్రేక్ ఫాస్ట్, స్నాక్స్ రూపంతో తింటుంటారు. కానీ, కచోరి కోసం ఆ రైల్వే లోకోపైలట్ రైలునే ఆపేశాడు.ఇలా ఒక్కరోజే కాదు..ప్రతీ రోజూ జరుగుతోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజస్తాన్‌లోని జైపూర్ రైల్వే డివిజన్ లోకో పైలట్‌గా విధులు నిర్వహిస్తున్న ఆ లోకోపైలట్.. అల్వార్ సమీపంలోని దౌద్పూర్ క్రాసింగ్ వద్ద ప్రతి రోజు ట్రైన్‌ను ఆపుతుంటాడు. అదే సమయంలో క్రాసింగ్ వద్దకు కచోరిలు అమ్మే వ్యక్తి .. ట్రైన్ ఇంజన్ బోగీ వద్దకు వచ్చి లోకోపైలట్‌కు కచోరిలు ఇచ్చి వెళ్తుంటాడు. అయితే ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు దౌద్పూర్ క్రాసింగ్ వద్ద ఇలా జరగడంతో.. రైలు ప్రయాణికులు, క్రాసింగ్ దాటే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఆ రైలులోని ఇద్దరు లోకోపైలట్లు, ఇద్దరు గేట్‌మన్లు, ఇన్స్ట్రక్టర్ను జైపూర్ రైల్వే డివిజన్ మేనేజర్ నరేంద్ర కుమార్ సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై అల్వార్ రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ ఆర్ఎల్ మీనా మాట్లాడుతూ.. లోకోపైలట్ చేస్తున్నపనిని తీవ్రంగా ఖండించారు. లోకో పైలట్లు రైలను తమ వ్యక్తిగతమైన అవసరాల కోసం ఎక్కడా నిలపకూడని అన్నారు. కచోరి కోసం కదులుతున్న రైలును ఆపడం సరైన పని కాదని అన్నారు. ఈ వీడియో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. @AshwiniVaishnaw @RailMinIndia @GMNWRailway @DRMJaipur @drm_dli यह वीडियो एकwhatsappग्रुप के माध्यम से आज ओर अभी देखने को मिला है क्या यह रेलवे नियमानुसार सही है अगर गलत है तो एक्शन लीजिए और सम्बंधित सभी व्यक्तियों पर कार्यवाही करें@vishalmrcool @JAGMALSINGH_MON @vasudhoot pic.twitter.com/Tw5dtkozzn — NARENDRA KUMAR JAIN (@NarendraJainPcw) February 18, 2022 -
సమోస.. కచొరికి చట్నీ రుచిగా వండలేదని భార్యపై..
భోపాల్: దుకాణంలో విక్రయించే సమోస, కచొరికి భార్య చేసిన చట్నీని రుచి చూసిన భర్త రుచిగా రాలేదని చెప్పాడు. మళ్లీ చేసుకురా అని చెప్పడంతో భార్యాభర్తల మధ్య గొడవ ప్రారంభమైంది. ఈ క్రమంలో మాటామాట పెరిగి ఆమెపై తీవ్రంగా దాడి చేసి భర్త పరారయ్యాడు. కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడిన ఆమె చివరకు ప్రాణం కోల్పోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ధాటియా జిల్లా ఉపరాయంగావ్‌లో చోటుచేసుకుంది. స్థానికంగా సమోస కచోరి దుకాణాన్ని ఆనంద్ గుప్తా నిర్వహిస్తున్నాడు. ఆయన భార్య ప్రీతి. అయితే సమోస.. కచోరి కోసం చట్నీ తయారు చేయమని ఆనంద్ ఆదివారం ఇంట్లో ఉన్న భార్యకు చెప్పాడు. కొద్దిసేపటి అనంతరం భార్య చట్నీ తయారుచేసి భర్తకు రుచి చూపించింది. అయితే రుచి లేకపోవడంతో భర్త ఆమెకు మళ్లీ చేయమని చెప్పాడు. ఈ సమయంలో వారిద్దరి మధ్య వాగ్వాదం ఏర్పడింది. క్షణికావేశానికి లోనైన భర్త భార్యపై దాడి చేశాడు. కోడలిని కొడుతుండడంతో భర్త తల్లి వచ్చి వారించింది. ఆమెను పక్కకు నెట్టి కర్రతో తలపై గట్టిగా బాదాడు. తీవ్ర గాయాలపాలైన భార్య ప్రీతిని వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందింది. దాడి చేసిన అనంతరం భర్త ఆనంద్ గుప్తా పరారయ్యాడు. సమాచారం అందుకున్న గోరాఘాట్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు అనంతరం నిందితుడు ఆనంద్ కోసం గాలిస్తున్నారు. -
కచోరీలు అమ్ముకుంటున్న భారత క్రికెటర్
వడోదర: అతను భారత్ తరపున క్రికెట్ ఆడి ఎన్నో మధురమైన విజయాలను అందించాడు. దశాబ్ధం క్రితం చెవిటి, మూగ విభాగంలో క్రికెట్ ఆడి...వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అతని ఆల్‌రౌండ్ ప్రదర్శనకు గాను ఇండియా టీం కెప్టెన్‌గా కూడా నియమించబడ్డాడు. అయితే ఇప్పుడు మాత్రం అతడు... జీవనాధారం కోసం రోడ్డు పక్కన కచోరీలు అమ్ముకుంటున్నాడు. తన బ్యాటింగ్ సామర్థ్యాలతో కీలకమైన అర్థ సెంచరీలు సాధించి డెఫ్ అండ్ డమ్ క్రికెట్ వరల్డ్ కప్ భారత్‌కు రావడంలో కీలక పాత్ర పోషించిన క్రికెటర్ ఇమ్రాన్ షేక్.. జీవితం విసిరిన బౌలింగ్‌లో మాత్రం క్లీన్ బౌల్డయ్యాడు. ఇమ్రాన్ షేక్ వారం రోజుల క్రితం వడోదరలోని ఓల్డ్ పద్రా రోడ్డులో 'మూంగ్ కచోరీ' స్టాల్ ను ప్రారంభించాడు. దీనిపై అతడు మాట్లాడుతూ.. 'క్రికెట్ అంటే నాకు ఎంతో ఇష్టం, ఇంకా క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నాను. కానీ నా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కుటుంబానికి అండగా నిలబడటానికి ఈ నిర్ణయం తీసుకున్నాను. చెవిటి, మూగ విభాగంలో క్రికెట్ ఆడటం వలన సరిపడినంత ఆదాయం సమకూరకపోవడంతో.. భార్య రోజాతో కలిసి న్యూట్రిషనల్ కచోరీ వ్యాపారం ప్రారంభించాను' అని తెలిపాడు. భారత క్రికెట్ ఆటగాళ్లు అంటే సంపాదన విషయంలో వారికేం కొదవ లేదు అనే భావన ఉంది. అయితే ఇది కేవలం కొందరి విషయంలో మాత్రమే అని ఇమ్రాన్ షేక్ ఉదంతం స్పష్టం చేస్తుంది. -
ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కున్న జుకర్‌బర్గ్
ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కున్నాడు. తాజ్‌మహల్ సందర్శించి తిరిగా ఢిల్లీ వచ్చే సమయంలో మహాలయ ఫ్లై ఓవర్ వద్ద జామ్‌లో ఇరుక్కున్నాడు. ఎక్కువ సేపు ట్రాఫిక్ ఆగిపోవడంతో కారు దిగిన మార్క్.. అక్కడి స్థానికులతో కాసేపు మాట్లాడి, అక్కడున్న కచోరీలు తిన్నాడు. సాయంత్రం సమయంలో జుకర్‌బర్గ్ తాజ్‌మహల్‌ను సందర్శించాడు. ఆ సందర్భంగా తాజ్‌మహల్ వద్ద తాను కూర్చుండగా సహోద్యోగులు తీసిన ఫొటోను పోస్ట్ చేశాడు. ఎప్పటిలాగే తన గ్రే కలర్ టీషర్టు, బ్లూ జీన్స్ వేసుకునే తాజ్‌మహల్‌కు వెళ్లాడు. తాజ్.. తాను అనుకున్నదాని కంటే చాలా అద్భుతంగా ఉందని తన ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఆయనతో పాటు ఏడుగురు ఆగ్రా పర్యటనకు వెళ్లారు.