ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కున్న జుకర్‌బర్గ్ | mark zuckerberg struck in traffic jam, eats kachori | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కున్న జుకర్‌బర్గ్

Published Thu, Oct 29 2015 7:54 AM | Last Updated on Thu, Jul 26 2018 12:27 PM

ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కున్న జుకర్‌బర్గ్ - Sakshi

ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కున్న జుకర్‌బర్గ్

ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కున్నాడు. తాజ్‌మహల్ సందర్శించి తిరిగా ఢిల్లీ వచ్చే సమయంలో మహాలయ ఫ్లై ఓవర్ వద్ద జామ్‌లో ఇరుక్కున్నాడు. ఎక్కువ సేపు ట్రాఫిక్ ఆగిపోవడంతో కారు దిగిన మార్క్.. అక్కడి స్థానికులతో కాసేపు మాట్లాడి, అక్కడున్న కచోరీలు తిన్నాడు. సాయంత్రం సమయంలో జుకర్‌బర్గ్ తాజ్‌మహల్‌ను సందర్శించాడు.

ఆ సందర్భంగా తాజ్‌మహల్ వద్ద తాను కూర్చుండగా సహోద్యోగులు తీసిన ఫొటోను పోస్ట్ చేశాడు. ఎప్పటిలాగే తన గ్రే కలర్ టీషర్టు, బ్లూ జీన్స్ వేసుకునే తాజ్‌మహల్‌కు వెళ్లాడు. తాజ్.. తాను అనుకున్నదాని కంటే చాలా అద్భుతంగా ఉందని తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఆయనతో పాటు ఏడుగురు ఆగ్రా పర్యటనకు వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement