ఫేస్‌బుక్ (మెటా) అధినేత మార్క్ జుకర్ బర్గ్‌కు బ్యాడ్ టైమ్ నడుస్తోందా? ప్రస్తుతం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితుల నుంచి బయటపడాలంటే జుకర్ బర్గ్ తన ఆస్తుల్ని అమ్ముకోవాల్సిందేనా? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. యూకే నిబంధనల విరుద్దంగా జుకర్‌బర్గ్ ప్రయత్నిస్తున్నారంటూ..ఫేస్‌బుక్‌కు వ్యతిరేకంగా యూకేలో రూ.22,990 కోట్ల ఫైన్ కేసు నమోదైంది.
ఫేస్‌బుక్ తన ఆధిపత్యంతో దుర్వినియోగానికి పాల్పడిందనే ఆరోపణలపై యూకేలో 3.1 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 22,990 కోట్లు) క్లాస్ యాక్షన్ దావాను ఎదుర్కొంటోంది. కాంపటీషన్ లా ఎక్స్‌పర్ట్ డాక్టర్ లిజా లోవ్‌డాల్ గోర్మ్‌సెన్ 'యూకే కాంపిటీషన్ లా ట్రిబ్యూనల్'లో ఫేస్‌బుక్‌పై క్లాస్ యాక్షన్ దావా వేశారు. 2015 - 2019 మధ్యకాలంలో ఫేస్‌బుక్ తన 44 మిలియన్ల యూకే వినియోగదారుల డేటాను చోరీకి పాల్పడిందని, తద్వారా బిలియన్ల ఆదాయాన్ని గడించేందుకు ఆ డేటా దోహదం చేసిందని స్పష్టం చేశారు. కాబట్టే యూజర్లకు ఫేస్‌బుక్ పరిహారం చెల్లించాలని దావాలో పేర్కొన్నారు. ఈ కేసులో ఫేస్‌బుక్ దుర్వినియోగానికి పాల్పడిందనే తేలితే దాదాపు 44 మిలియన్ల యూకే ఫేస్‌బుక్ యూజర్లకు ఒక్కొక్కరికి 68 డాలర్లు (సుమారు రూ.5,000) చెల్లించాల్సి ఉంటుందని ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాల్ని ప్రచురించాయి.
17ఏళ్ల క్రితం స్థాపించిన ఫేస్‌బుక్ కుటంబ సభ్యులు,స్నేహితులు ఆన్‌లైన్‌లో కలుసుకునేందుకు అనువైన వేదికగా మారింది. అయినప్పటికీ, ఫేస్‌బుక్‌లో మరో చీకటి కోణం దాగి ఉంది. ఇది సాధారణ యూకే ప్రజల వ్యక్తిగత డేటాను దొంగిలించి..వారిపై అన్యాయమైన నిబంధనలు, షరతులను విధిస్తూ మార్కెట్‌లో తన ఆధిపత్యంతో ఫేస్‌బుక్ దుర్వినియోగానికి పాల్పడింది. ఫేస్‌బుక్ ద్వారా యూకే యూజర్ల డేటాను దొంగిలించినందుకు 44 మిలియన్ల యూకే యూజ్లరకు నష్టపరిహారం కోసం ఈ కేసు వేస్తున్నట్లు గోర్మ్‌సెన్ తెలిపారు. కాగా డాక్టర్ గోర్మ్‌సెన్ బ్రిటిష్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ కంపారిటివ్ లా (బీఐఐసీఎల్)లో సీనియర్ రీసెర్చ్ ఫెలో, కాంపిటీషన్ లా ఫోరమ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
చదవండి: జుకర్ బర్గ్‌ను వెంటాడుతున్న యూకే, అమ్ముతావా? లేదా?
Comments
Please login to add a commentAdd a comment