రూ.1 కోటి కంటే ఖరీదైన వాచ్‌ ధరించిన మార్క్‌ | Mark Zuckerberg Wearing Patek Philippe Wrist Watch Worth Over Rs 1 Crore, Photo Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

రూ.1 కోటి కంటే ఖరీదైన వాచ్‌ ధరించిన మార్క్‌

Published Tue, Nov 5 2024 1:52 PM | Last Updated on Tue, Nov 5 2024 3:37 PM

Mark Zuckerberg wearing Patek Philippe wrist watch worth over Rs 1 crore

ప్రముఖ టెక్‌ కంపెనీ మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలో సుమారు రూ.ఒక కోటి వాచ్‌ ధరించి కనిపించారు. ఈయన ప్రస్తుతం ప్రపంచంలోని మూడో అత్యంత సంపన్న వ్యక్తికి ఉన్నారు. తాను ధరించిన వాచ్‌కు సంబంధించి వాచ్‌.న్యూజ్‌ అనే ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్‌లో వివరాలు వెల్లడించారు.

మార్క్ జుకర్‌బర్గ్ పాటెక్ ఫిలిప్ వాచ్ ధరించి తన భార్య ప్రిస్సిల్లా చాన్‌తో కలిసి ఉన్న ఉన్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. తాను షేర్‌ చేసిన ఇమేజ్‌లోని వాచ్‌కు సంబంధించి నెట్టింట చర్చ జరిగింది. దాంతో పలు సమాజిక మాధ్యమాల్లో తన రిస్ట్‌వాచ్‌ వివరాలు వెల్లడించారు. అందులో భాగంగా వాచ్‌.న్యూజ్‌ అనే ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్‌ దాని వివరాలు వెల్లడించింది.

ఇదీ చదవండి: పెళ్లి కూతురిని వెతకనందుకు రూ.60 వేలు జరిమానా!

జుకర్‌బర్గ్‌ ధరించిన వాచ్‌ ప్రతిష్టాత్మక స్విస్ బ్రాండ్ పాటెక్ ఫిలిప్ తయారు చేసిన టైమ్‌పీస్‌గా  గుర్తించారు. ఈ సంస్థ ప్రపంచంలోని అత్యంత ఖరీదైన, ప్రత్యేకమైన గడియారాలను రూపొందించడంలో ప్రసిద్ధి చెందింది. మార్క్‌ ఈ కంపెనీకు చెందిన దాదాపు రూ.1 కోటి కంటే ఎక్కువ ధర ఉంటే ‘5236పీ’ మోడల్‌ వాచ్‌ను ధరించినట్లు వాచ్‌.న్యూజ్‌ పేర్కొంది. మార్చిలో అనంత్‌ అంబానీ ప్రీవెడ్డింగ్‌ వేడులకు వచ్చిన జుకర్‌బర్గ్‌ దంపతులు తను వాడిన పాటక్‌ ఫిలిప్‌ వాచ్‌ను చూసి బాగుందని కితాబిచ్చిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement