costly watch
-
రూ.5 కోట్ల వాచ్‌తో జుకర్‌బర్గ్.. ప్రత్యేకతలివే..
మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కంపెనీ ఏఐ లామాకు సంబంధించిన విషయాలను ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో ద్వారా షేర్ చేసుకున్నారు. అయితే ఆ వీడియోలో తాను ధరించిన వాచ్‌పై నెట్టింట చర్చ జరిగింది. ప్రపంచంలోనే అత్యంత సన్నని వాచ్‌ను మార్క్ ధరించినట్లు నెటిజన్లు గుర్తించారు. ఈ బల్గారి ఆక్టో ఫినిసిమో ఆల్ట్రా సీఓఎస్సీ(Bulgari Octo Finissimo Ultra COSC) మోడల్ వాచ్ కేవలం 1.7 మిల్లీమీటర్ మందంతో ఉంటుంది. అంటే దాదాపు రెండు క్రెడిట్ కార్డ్‌ల మందం కంటే సన్నగా ఉంటుంది.ఈ వాచ్ ప్రత్యేకతలు..ఈ వాచ్ కేవలం 1.7 మిమీ మందంతో ఉంటుంది.ఈ వాచ్ బీవీఎల్ 180 క్యాలిబర్‌తో గంటకు 28,800 వైబ్రేషన్స్ (4 హెర్ట్జ్) ఫ్రీక్వెన్సీతో మాన్యువల్ వైండింగ్ మూవ్‌మెంట్‌ను కలిగి ఉంటుంది.ఈ గడియారాన్ని సాండ్బ్లాస్టెడ్ టైటానియంతో తయారు చేశారు. వాచ్ పట్టీలు కూడా పూర్తిగా టైటానియంతోనే రూపొందించారు. కాబట్టి ఇది చాలా ఏళ్లు మన్నికగా ఉంటాయి. దాంతోపాటు తేలికపాటి డిజైన్ దీని సొంతం.ఇది COSC సర్టిఫైడ్ గడియారం. అంటే ఇది కఠినమైన కచ్చితత్వ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.ఈ వాచ్ లిమిటెడ్ ఎడిషన్. ప్రపంచంలో ఇవి 20 మాత్రమే ఉన్నాయి. అందుకే ఇది అంత ప్రత్యేక సంతరించుకుంది.దీని ధర సుమారు 5,90,000 అమెరిన్ డాలర్లు. అంటే రూ.5 కోట్లకు పైనే.లామా 3 కంటే పది రెట్లు ఎక్కువజుకర్బర్గ్ పోస్ట్ చేసిన వీడియోలో మాట్లాడుతూ.. మెటా ఏఐ లామా 4 వెర్షన్‌ను 2025 ప్రారంభంలో విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. ఇది తదుపరి తరం ఏఐ మోడల్ అని, లామా 3 కంటే ఇది మరింత మెరుగ్గా పని చేస్తుందన్నారు. ఇందులో రీజనింగ్ వ్యవస్థ సమర్థంగా పని చేస్తుందని చెప్పారు. లామా 4కు సుమారు 1,60,000 జీపీయూలు(గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్- కంప్యూటర్లు, గేమింగ్ కన్సోల్స్ కోసం చిత్రాలు, వీడియోలను రియల్ టైమ్‌లో అందించడానికి ఇది ఉపయోగపడుతుంది) అవసరమని భావిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది లామా 3 కంటే పది రెట్లు ఎక్కువ. -
రూ.1 కోటి కంటే ఖరీదైన వాచ్ ధరించిన మార్క్
ప్రముఖ టెక్ కంపెనీ మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలో సుమారు రూ.ఒక కోటి వాచ్ ధరించి కనిపించారు. ఈయన ప్రస్తుతం ప్రపంచంలోని మూడో అత్యంత సంపన్న వ్యక్తికి ఉన్నారు. తాను ధరించిన వాచ్‌కు సంబంధించి వాచ్.న్యూజ్ అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో వివరాలు వెల్లడించారు.మార్క్ జుకర్‌బర్గ్ పాటెక్ ఫిలిప్ వాచ్ ధరించి తన భార్య ప్రిస్సిల్లా చాన్‌తో కలిసి ఉన్న ఉన్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. తాను షేర్ చేసిన ఇమేజ్‌లోని వాచ్‌కు సంబంధించి నెట్టింట చర్చ జరిగింది. దాంతో పలు సమాజిక మాధ్యమాల్లో తన రిస్ట్‌వాచ్ వివరాలు వెల్లడించారు. అందులో భాగంగా వాచ్.న్యూజ్ అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ దాని వివరాలు వెల్లడించింది. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck)ఇదీ చదవండి: పెళ్లి కూతురిని వెతకనందుకు రూ.60 వేలు జరిమానా!జుకర్‌బర్గ్ ధరించిన వాచ్ ప్రతిష్టాత్మక స్విస్ బ్రాండ్ పాటెక్ ఫిలిప్ తయారు చేసిన టైమ్పీస్గా గుర్తించారు. ఈ సంస్థ ప్రపంచంలోని అత్యంత ఖరీదైన, ప్రత్యేకమైన గడియారాలను రూపొందించడంలో ప్రసిద్ధి చెందింది. మార్క్ ఈ కంపెనీకు చెందిన దాదాపు రూ.1 కోటి కంటే ఎక్కువ ధర ఉంటే ‘5236పీ’ మోడల్ వాచ్‌ను ధరించినట్లు వాచ్.న్యూజ్ పేర్కొంది. మార్చిలో అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ వేడులకు వచ్చిన జుకర్‌బర్గ్ దంపతులు తను వాడిన పాటక్ ఫిలిప్ వాచ్‌ను చూసి బాగుందని కితాబిచ్చిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by watchnewz (@watch.newz) -
ధర ‘వాచ్’పోతుంది..!
డబ్బు మనిషిని రాజ్యాలనుఏలే రాజులుగా మారుస్తుంది. రోడ్లపై ఉండే బిచ్చగాళ్లుగా మారుస్తుంది. దాన్ని ఎలా వాడుతున్నామనేదే ప్రధానం. అయితే సంపాదించిన సొమ్మంతా ఎలా దాచుకుంటున్నామనేది కూడా ముఖ్యమని చాలామంది అభిప్రాయపడుతున్నారు. డబ్బు దాయాలంటే చాలామందికి వెంటనే గుర్తొచ్చేది బ్యాంకులు. సేవింగ్స్ స్కీమ్‌లు, రికరింగ్ డిపాజిట్లు, ఎఫ్డీ.. దాంతోపాటు మ్యూచువల్ ఫండ్లు, స్టాక్‌మార్కెట్ షేర్లు, రియల్ఎస్టేట్లో పెట్టుబడులు, భవనాలు కొనుగోలు చేయడం.. ఇలా వివిధ మార్గాల్లో డబ్బు దాస్తున్నారు. వీటితోపాటు బాగా డబ్బు సంపాదిస్తున్నవారు ఖరీదైన గడియారాలను కొనుగోలు చేస్తూ వాటిరూపంలో సంపద దాస్తున్నారు. ఇటీవల హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయన అక్రమాస్తుల విలువ వెయ్యి కోట్ల రూపాయలకు పైనే ఉండొచ్చని ఏసీబీ భావిస్తోంది. అయితే తన పేరుతో 214 ఎకరాలు భూమి, తెలంగాణతోపాటు విశాఖపట్నంలో 29 ప్లాట్లు, 19 ఓపెన్ ప్లాట్లు, 7 ఫ్లాట్లు, 3 విల్లాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. దాంతోపాటు ఖరీదైన గడియారాలు కూడా ఉన్నట్లు చెప్పారు. ప్రపంచంలోనే ఖరీదైన గడియారాలు..(ఫోర్బ్స్ డేటా ప్రకారం) 1. గ్రాఫ్ డైమండ్స్ హాలూసినేషన్ ధర: రూ.458 కోట్లు ఉపయోగించిన పదార్థం: ప్లాటినం తయారీ సంవత్సరం: 2014 ప్లాటినమ్ బ్రాస్లెట్తో ఉన్న ఈ గడియారాన్ని 110 క్యారెట్ల విభిన్న రంగులతో కూడిన వజ్రాలతో తయారుచేశారు. 2. గ్రాఫ్ డైమండ్స్ ది ఫాసినేషన్ ధర: రూ.333 కోట్లు ఉపయోగించిన పదార్థం: డైమండ్ తయారీ సంవత్సరం: 2015 152.96 క్యారెట్ల తెల్లని వజ్రాలను కలిగి అరుదైన 38.13 క్యారెట్ల వజ్రం సెంట్రల్ డయల్‌గా పనిచేస్తుంది. 3. పటేక్ ఫిలిప్ గ్రాండ్‌మాస్టర్ చైమ్ రెఫ్. 6300A-010 ధర: రూ.258 కోట్లు ఉపయోగించిన పదార్థం: తెలుపు బంగారం తయారీ సంవత్సరం: 2019 4. బ్రెగ్యుట్ గ్రాండే కాంప్లికేషన్ మేరీ ఆంటోయినెట్ ధర:రూ. 250 కోట్లు ఉపయోగించిన పదార్థం: బంగారం తయారీ సంవత్సరం: 1827 ఫ్రెంచ్ రాణి మేరీ ఆంటోయినెట్ కోసం దీన్ని తయారుచేశారని నమ్ముతారు. 1900 చివరలో ఈ గడియారాన్ని కొందరు దుండగులు దొంగలిచారు. ప్రస్తుతం ఇది ఎల్ఏ మేయర్ మ్యూజియంలో ఉంది. 5. జేగర్-లెకౌల్ట్రే జోయిలెరీ 101 మాన్చెట్ ధర: రూ.216 కోట్లు ఉపయోగించిన పదార్థం: తెలుపు బంగారం తయారీ సంవత్సరం: 2012 777 వజ్రాలను ఇందులో అమర్చారు. 6. చోపార్డ్ 201- క్యారెట్ ధర: రూ.208 కోట్లు ఉపయోగించిన పదార్థం: తెలుపు, పసుపు బంగారం తయారీ సంవత్సరం: 2000 ఇది స్ప్రింగ్ లోడెడ్ మెకానిజమ్‌తో పని చేస్తుంది. సమయం తెలుసుకునేందుకు దానిపై నొక్కినప్పుడు మూడు గుండె ఆకారపు వజ్రాలు (15-క్యారెట్ గులాబీ రంగు, 12-క్యారెట్ నీలం రంగు, 11-క్యారెట్ తెలుపు రంగు) పూల రేకుల్లా విచ్చుకుంటాయి. 7. పటేక్ ఫిలిప్ హెన్రీ గ్రేవ్స్ సూపర్ కాంప్లికేషన్ ధర: రూ.200 కోట్లు ఉపయోగించిన పదార్థం: బంగారం తయారీ సంవత్సరం: 1932 8. రోలెక్స్ పాల్ న్యూమన్ డేటోనా రెఫ్ 6239 ధర: రూ.155 కోట్లు ఉపయోగించిన మెటీరియల్: స్టెయిన్లెస్ స్టీల్ తయారీ సంవత్సరం: 1968 9. జాకబ్ & కో.బిలియనీర్ వాచ్ ధర: రూ.150 కోట్లు ఉపయోగించిన పదార్థం: తెలుపు బంగారం తయారీ సంవత్సరం: 2015 ఇదీ చదవండి: వాట్సప్‌లో కొత్తమోసాలు.. జాగ్రత్తసుమా! 10. పటేక్ ఫిలిప్ స్టెయిన్లెస్ స్టీల్ రెఫ్ 1518 ధర: రూ.100 కోట్లు ఉపయోగించిన మెటీరియల్: స్టెయిన్లెస్ స్టీల్ తయారీ సంవత్సరం: 1943 -
గ్లోబల్ స్టార్.. చేతి వాచ్ కూడా ఆ రేంజ్లో ఉండాల్సిందే!
ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కూతురు జన్మించిన విషయం అందరికి తెలిసిందే. లిటిల్ ప్రిన్సెస్ రాకతో వారి కుటుంబంలో సంబరాలు అంబరాన్ని తాకాయి. అపోలో హాస్పిటల్లో జన్మించిన ఈ చిన్నారిని చూడటానికి చిరంజీవి, వారి కుటుంబ సభ్యులు తరలి వచ్చారు. అయితే వైద్యశాల నుంచి ఇంటికెళ్లే సమయంలో రామ్ చరణ్ డ్రెస్సింగ్ స్టైల్ ఎంతోమందిని ఆకర్శించింది. ఇందులో చెప్పుకోదగ్గది ఆయన ఖరీదైన వాచ్. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రిచర్డ్ మిల్లే బ్రాండ్ రామ్ చరణ్ కట్టుకున్న వాచ్ ధర రిచర్డ్ మిల్లే బ్రాండ్ అని తెలుస్తోంది. దీని ధర సుమారు రూ. 1.62 కోట్లు కావడం గమనార్హం. అత్యంత ఖరీదైన వస్తువులను ఇష్టపడే చరణ్ వద్ద ఇప్పటికే యోహాన్ బ్లేక్, రోలెక్స్, పటేక్ ఫిలిప్, ఆర్ఎమ్ 61-01 యోహాన్ బ్లేక్ రిచర్డ్ మిల్లె వంటి మరిన్ని కాస్ట్లీ వాచ్‌లు ఉన్నాయి. వీటి ధర కూడా చాలా ఎక్కువని సమాచారం. (ఇదీ చదవండి: ఇన్‌స్టా సంపాదనలో వీరిని మించిన వారే లేరు! టాప్ 5 జాబితాలో ఎవరున్నారంటే?) కేవలం వాచ్‌లు మాత్రమే కాకూండా కస్టమైజ్డ్ మెర్సిడెస్ మేబ్యాక్ GLS 600, ఆడి మార్టిన్ V8 వాంటేజ్, రోల్స్ రాయిస్ ఫాంటమ్, రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, ఆస్టన్ మార్టిన్, ఫెరారీ పోర్టోఫినో ఉన్నాయి. వీటితో పాటు చరణ్ ఒక సొంత ప్రైవేట్ జెట్ కూడా కలిగి ఉన్నట్లు చెబుతారు. -
'మీ అభిమానం తగలెయ్య.. రెండున్నర కోట్ల వాచ్ కొట్టేశారు'
ఫార్ములా వన్ స్టార్ చార్లెస్ లెక్లెర్కు చేదు అనుభవం ఎదురైంది. తనను కలవడానికి వచ్చిన అభిమానుల్లో గుర్తుతెలియని ఒక వ్యక్తి చార్లెస్ చేతికున్న ఖరీదైన వాచ్‌ను కొట్టేశాడు. కొట్టేసిన ఆ వాచ్ పేరు రిచర్డ్ మిల్లే.. దాని ఖరీదు ఇండియన్ కరెన్సీలో అక్షరాలా దాదాపు రూ.2.4 కోట్లకు పైగా. అభిమానం పేరుతో కలవడానికి వచ్చి విలువైన వస్తువును కొట్టేయడమేంటని చార్లెస్ తెగ బాధపడిపోయాడు. విషయంలోకి వెళితే.. వచ్చేవారం ఇటలీ వేదికగా జరగనున్న ఇమోలా గ్రాండ్ ప్రిక్స్ జరగనుంది. టోర్నమెంట్లో పాల్గొనేందుకు చార్లెస్ లెక్లెర్ సోమవారం ఇటలీలో అడుగుపెట్టాడు. చార్లెస్‌తో పాటు స్నేహితులు, ట్రైనర్ ఆండ్రియా ఫెరారీ ఉన్నారు. టుస్కాన్ నగరం వియారెగియోలో చార్లెస్‌కు హోటల్ గది కేటాయించారు. అయితే అప్పటికే అతను ఉంటున్న హోటల్ ముందు తనను కలవడానికి జనాలు గూమికూడి ఉన్నారు. వారి అభిమానానికి మురిసిపోయిన చార్లెస్ స్వయంగా వారినిక కలవడానికి వచ్చాడు. అయితే ఆ గుంపులో నుంచే ఒక తెలియని వ్యక్తి చార్లెస్ చేతికున్న వాచ్‌ను కొట్టేశాడు. తన వాచ్ కొట్టేసిన విషయాన్ని చార్లెస్ స్వయంగా పోలీసులకు చెప్పి రిపోర్ట్ చేశాడు. చార్లెస్ రిపోర్డు ఆధారంగా పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. కాగా నిజంగానే దొంగతనం చేశారా.. లేక ముందుస్తు ప్లాన్ అమలు చేసి ఈ పని చేశారా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. చదవండి: Pele: మరోసారి ఆసుపత్రిలో చేరిన బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం Wimbledon 2022: రష్యన్ టెన్నిస్ ప్లేయర్లకు షాక్.. వింబుల్డన్‌కు దూరమయ్యే అవకాశం! -
Jr NTR Watch Cost: వామ్మో.. ఎన్టీఆర్ ధరించే వాచ్ అన్ని కోట్లా!
బ్రాండ్ల విషయంలో ఎన్టీఆర్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఆ మధ్య ఆయన ధరించే మాస్క్, బ్లేజర్, షూల గురించి సోషల్ మీడియాలో చర్చ జరగ్గా..ఇప్పుడు ఆయన చేతికి ఉన్న వాచ్ చర్చనీయాంశంగా మారింది. మరి ఆ వాచ్ ప్రత్యేక ఏంటనేది డౌట్ రావొచ్చ. అసలు విషయానికొస్తే.. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. రీసెంట్గా జరిగిన ‘ఆర్ఆర్ర్’ప్రెస్మీట్లో ఎన్టీఆర్ చేతికి ధరించిన వాచ్‌పై అందరి దృష్టి పడింది. అది చాలా స్పెషల్‌గా ఉండడంతో.. దీని ధర ఎంత ఉంటుందబ్బా.. అని సెర్చ్ చేస్తే.. దిమ్మతిరిగిపోయింది. ఆ వాచ్ ధర దాదాపు నాలుగు కోట్ల రూపాయలు(5,14,800 డాలర్లు) . రిచర్డ్ మిల్లే RM కు చెందిన 011 కార్బన్ NTPT గ్రోస్జీన్ వాచ్ అది(Richard Mille rm 011 CarbonNtpt Grosjean Rose Gold lotus F1 Team limited Edition). ప్రపంచంలోనే అత్యధిక ఖరీదైన వాచ్‌లతో ఇది ఒకటి. ఈ బ్రాండ్‌లో లభించే ప్రతి వాచ్ చాలా ఖరీదైనదే. ఎన్టీఆర్ ఇష్టంతో ఈ వాచ్ కొలుగోలు చేశాడట. ఇలాంటివి ఆయన దగ్గర మరో రెండు వాచ్ లు ఉన్నాయని సమాచారం. వాస్తవానికి ఎన్టీఆర్ కి కార్లు, వాచ్‌లు, దుస్తులు అంటే చాలా ఇష్టం. వాటికోసం కోట్లలో ఖర్చు చేస్తుంటారు. ఎన్టీఆర్ కి నచ్చితే చాలు.. రేటు చూడకుండా కొనేస్తారు. -
కొట్టేసిన మారడోనా వాచీ ధరెంతో.. స్పెషాలిటీ ఏంటో తెలుసా?
Maradona Stolen Watches Specialities And Cost: అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజం డిగో మారడోనా.. సాకర్ ప్రపంచంలో ఓ లెజెండ్. మరణం అనంతరం ఆయన లెగసీ కొనసాగుతోంది. అయితే ఆయనకు చెందిన కాస్ట్లీ వాచీ ఒకటి దుబాయ్‌లో చోరీకి గురికాగా.. ఎట్టకేలకు దానిని అస్సాం(అసోం)లో రికవరీ చేసుకున్నారు పోలీసులు. 2010 ఫిఫా వరల్డ్ కప్ టైంలో స్విట్జర్లాండ్‌కు చెందిన కాస్ట్లీ వాచ్ మేకింగ్ కంపెనీ హుబ్లోట్.. బిగ్‌బ్యాంగ్ మోడల్ పేరుతో మారడోనా గౌరవార్థం లిమిటెడ్ ఎడిషన్ రిలీజ్ చేసింది. మొత్తం 250 వాచీలు తయారు చేయించగా.. క్షణాల్లో హాట్‌కేకుల్లా ఒక్కక్కటి భారీ ధరకు అమ్ముడుపోయాయి. వీటిలో రెండు వాచీలను మారడోనాకు గిఫ్ట్‌గా ఇచ్చింది హుబ్లోట్. 2010 ఫిఫా వరల్డ్ కప్ సందర్భంగా మారడోనా ఈ రెండు వాచీలను(రెండుచేతులకు చెరోటి) ధరించి స్పెషల్ ఎట్రాక్షన్‌గా కనిపించారు. అందులో ఆయన విక్టరీ సింబల్ చూపించే ఫొటో(వెనకనుంచి), సంతకం, జెర్సీ నెంబర్ కూడా ఉంటాయి. వీటి ధర ఒక్కొక్కటి రూ. 20 లక్షలుగా(మన కరెన్సీలో) ప్రకటించింది కంపెనీ. అయితే.. In an act of international cooperation @assampolice has coordinated with @dubaipoliceHQ through Indian federal LEA to recover a heritage @Hublot watch belonging to legendary footballer Late Diego Maradona and arrested one Wazid Hussein. Follow up lawful action is being taken. pic.twitter.com/9NWLw6XAKz — Himanta Biswa Sarma (@himantabiswa) December 11, 2021 మారడోనా మరణానంతరం ఆయనకు చెందిన వస్తువులు కొన్నింటిని దుబాయ్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీ వేలంపాటలో చేజిక్కించుకుంది. ఆ కంపెనీకి సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న వాజీద్ హుస్సేన్ అనే వ్యక్తి.. ఆ వాచీని దొంగిలించాడు. ఆపై తన తండ్రికి బాగోలేదని ఆగష్టులో భారత్(అస్సోం) వచ్చేశాడు. ఈ చోరీని సీరియస్‌గా తీసుకున్న దుబాయ్ పోలీసులు.. ఎట్టకేలకు అస్సోం పోలీసుల సహకారంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని అస్సోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, డీజీపీలు స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. A costly Hublot watch... Maradona... Dubai... Assam Police Looks like random words, don't they? But today all these words came together nicely, stating a story of successful International Cooperation between #DubaiPolice and @assampolice . pic.twitter.com/oMRYgpX3HH — DGP Assam (@DGPAssamPolice) December 11, 2021 -
Prabhas : అభిమానికి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన ప్రభాస్
Diehard Fan Gets Costly Gift From Darling Prabha: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. అయితే కొందరి అభిమానం హీరోలనే ఆశ్చర్యపరిచేలా ఉంటుంది. తాజాగా ప్రభాస్ వీరాభిమాని ఒకరు ప్రభాస్‌కి షాక్చిచే రీతిలో తన అభిమానాన్ని చాటుకున్నాడు. తలపై ప్రభాస్ అని అక్షరాలు కనిపించేలా గుండు కొట్టించుకున్నాడు. అతని అభిమానాన్ని చూసి షాక్ అయిన ప్రభాస్ సరదాగా అతడితో కాసేపు ముచ్చటించాడు. చదవండి: రామ్‌చరణ్ హెయిర్ స్టైలిస్ట్‌కు ఒక్క రోజుకే అన్ని లక్షలా? అనంతరం తన వీరాభిమానికి ఖరీధైన వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఇది ఫాజిల్ కంపెనీకి చెందిన వాచ్ అని తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. అయితే ప్రభాస్ తన అభిమానులకు ఇలా గిఫ్ట్‌లు ఇవ్వడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ డార్లింగ్ పలువురికి బహుమతులు ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. వచ్చే ఏడాది సంక్రాంతికి రాధేశ్యామ్‌తో సందడి చేయనున్నాడు ప్రభాస్. చదవండి: Suriya: హీరో సూర్య ఇంటి వద్ద హై సెక్యూరిటీ బంగారం మూవీలో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉందో తెలుసా? -
వైరలవుతున్న రామ్ చరణ్ కాస్ట్లీ వాచ్.. ధరెంతో తెలుసా?
సెలబ్రిటీలు ఏం చేసినా అది వార్తే అవుతుంది. ఏది తిన్నా, ఎటు వెళ్లినా, ఏం ధరించినా అది సెన్సెషనల్ టాపిక్‌గా మారుతుంది. ఇటు అభిమానులు సైతం తాము ఇష్టపడే స్టార్ల లైఫ్‌స్టైల్‌ను ఇంట్రెస్ట్‌గా అబ్జర్వ్ చేస్తుంటారు. తల నుంచి కాళ్ల వరకు ఏదీ వదలకుండా ఏం ధరించారని జల్లెడ పట్టి మరీ చూస్తుంటారు. ఇటీవల కాలంలో సెలబ్రెటీలు ధరించిన దుస్తులు, వాచ్‌లు, షూస్, హ్యండ్‌బ్యాగ్ ఇలా అన్నింటి ధరలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రామ్ చరణ్ ధరించిన ఓ వాచ్ ఖరీదుపై నెట్టింట్లో తెగ చర్చ జరుగుతోంది. చరణ్ ధరించిన వాచ్ పేరు, దాని ఖరీదు చూసిన వారందరూ షాక్ అవుతున్నారు. ఈ హీరో ధరించిన వాచ్ లక్ష 50 వేల డాలర్లు అట. అంటే మన ఇండియన్ కరెన్సీలో దీని ధర ఏకంగా కోటి 50 లక్షలు. ఈ మధ్యకాలంలో చెర్రీ ఎక్కువగా ఈ వాచ్‌తోనే కనిపిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆ వాచ్ ఖరీదు బయటపడటంతో అంత కాస్ట్లీనా అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో భిన్నంగా స్పందిస్తున్నారు. ఇంత ఖరీదైన వాచ్‌తో సామాన్యులు జీవితాంతం సంతోషంగా బతికేయచ్చు అని అంటుంటే.. మరికొందరు స్టార్స్ అన్నప్పుడు ఆమాత్రం ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరోవర్గం వారు ఆ వాచ్ డబ్బులు పేదవాళ్లకు ఇచ్చిన ఎంతోమంది బాగుపడతారు అంటూ హితవు పలుకున్నారు. View this post on Instagram A post shared by Bhimavaram abbai memes 🔥 (@kastha_navvu_babai) ఇక రామ్ చరణ్ విషయానికొస్తే.. చరణ్ వెండితెరమీద కనిపించి రెండేళ్లు దాటింది. అయినప్పటికీ చెర్రీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆ మధ్యలో సైరా నర్సింహరెడ్డి చిత్రానికి నిర్మాతగా మారిన రామ్ చరణ్ ప్రస్తుతం యంగ్‌టైగర్ ఎన్టీఆర్, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతున్నాడు. చెర్రీకి జోడీగా బాలీవుడ్ నటి ఆలియా భట్ నటిస్తోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆచార్య’ లోనూ రామ్ చరణ్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న చరణ్ సిద్ధ అనే కీలక పాత్రలోనూ కనిపించనున్నాడు. ఈ రెండిటి అనంతరం స్టార్ డైరక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు. దీనికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నాడు. చదవండి: రామ్‌చరణ్ సపోర్ట్ దొరకడం మర్చిపోలేను: యంగ్ హీరో చదవండి: భాగ్యమిత్ర లాటరీ.. సెక్యూరిటీ గార్డు కరోడ్‌పతి -
కాస్ట్లీ వాచ్
-
అవినీతి కాదు ‘కానుక’
విశ్లేషణ కర్ణాటక ముఖ్యమంత్రి అత్యంత ఖరీదైన హబ్లోట్ కంపెనీ వాచీని ధరించి నట్లు మీడియా.. జనం దృష్టికి తెచ్చిన రోజున సీఎం సిద్ధరామయ్య వివరణ ఇచ్చారు. అది మరొకరు అప్పటికే ఉప యోగించిన వాచీ అని, తన సంపన్న మిత్రుడు ఇస్తే తాను దానిని ధరిస్తున్నానని స్పష్టం చేయడం ద్వారా, తనపై వచ్చిన ఆరోపణల వాడినుంచి ఆయన తప్పించుకుని ఉండవచ్చు. ఆయన ఆ వివరణ ఇచ్చినప్పటికీ ‘అయితే’ అనేది ఇంకా ఉంటూనే ఉంది. ప్రత్యేకించి రాజ్యాంగబద్ధంగా ముఖ్య స్థానాల్లో ఉన్నప్పటికీ రాజకీయవాదులు మునుపటి తరానికి చెందిన రాజకీయనేతల్లాగా స్వచ్ఛంగా ఉండగలరని నమ్మడానికి భారతీయ పౌరులు ఇష్టపడటంలేదు కాబట్టే సీఎం వివరణ తర్వాత కూడా ‘అయితే’ అనేది ఇంకా ధ్వనిస్తూనే ఉంది. సిద్ధరామయ్య పరిశుద్ధంగా ఉండొచ్చు గానీ, తాను కూడా అవినీతి పరులుగా అనుమానిస్తున్న వర్గానికి చెందిన వారు అనే వాస్తవం ఆయనకు వ్యతిరేకంగా పరిణమించే అవకాశం ఉంది. ఆయన తన అమాయకత్వాన్ని నిరూపించుకోవలసిందే. నేరారోపణ చేసినవారే దాన్ని రుజువు చేయ వలసి ఉన్న నేర న్యాయ చట్టంలాగా కాకుండా, రాజకీయాల్లో ఇది స్పష్టంగా ఎరుకకు సంబంధిం చిన అంశంగా ఉంటుంది. అణకువ లేదా నిరుపేద నేపథ్యం కలిగి రాజకీయాల్లో మాత్రమే తను ఎదిగివచ్చినప్పుడు, అత్యంత విలాసవంతమైన గడియారాలను, మైమరిపించే కళ్లద్దాలు, చెప్పులను వాడటం అనేది తప్పనిసరిగా ప్రశ్నలను లేవనెత్తు తుంది. సిద్ధరామయ్య ప్రకటించిన ఆస్తుల వివరాలు అలాంటి విలాసప్రాయమైన అభి రుచులకు అనుకూలంగా లేవనుకోండి. అయితే నమ్మకం వేరు, సమ్మతి అనేది వేరు. ఎందుకంటే రాజకీయ నేతలు ఒక వర్గంగా తమవైన అరల్లో ఇమిడివుండే అస్థిపంజరాలుగా ఉంటారు. రాజకీయాల్లోకి రాకముందు వారు ఎలా ఉండే వారు? వారి ఆస్తులేవి? రెండు ఎన్నికల మధ్య ఐచ్ఛికంగా ప్రకటించవలసిన అఫిడవిట్లలో చూపిన విధంగా వారి ఆస్తులు పెరిగిన తీరు ఏది? వంటివి సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి. రాజకీయాలు అంటే సీట్లు సంపాదించడ మేననీ, అప్పటి నుంచి ప్రజా సంరక్షకత్వం అనేది తొలగిపోయి నీకది నాకిది అనేది ముందుకొస్తుం దని, దీంతో వారు ధరించే జుబ్బాతో మొదలుపెట్టి, కులీన జీవన శైలి మొదలవుతుందని ప్రజల్లో పేరు కుపోయిన విశ్వాసాన్ని ఇది బలోపేతం చేస్తుంది. ఇంతవరకు ప్రతి ఎన్నికలోనూ అభ్యర్థులు తమ ఆస్తుల వివరాలను పొందుపర్చవలసి ఉండేది కానీ ఆ వివరాలు పౌరులకు, ఓటర్లకు తెలియవు. తదుపరి ఎన్నికలకు గాను అఫిడవిట్లు వచ్చేసరికి వారి ఆస్తులు విపరీతంగా పెరిగి ఉంటాయి. అలా ఎలా జరుగుతుంది అనేదాంట్లోనే అసలు కథంతా ఉంది. అయితే బహిరంగంగా వివరించే కథ మాత్రం ఇది కాదు. అఫిడవిట్లలో కొన్ని సంఖ్యలను పూరిస్తే ఎన్నికల కమిషన్ సంతృప్తి చెందుతుంది. ఇదొక లాంఛనప్రాయమైన తంతులా మారింది. కార్యాలయంలో కూర్చున్న తొలి ఆరునెలల కాలంలోనే ఒక పురపాలక సంస్థ లేదా జిల్లా పరిషత్ కౌన్సిలర్ జీవనశైలి మరింత ఆడం బరంగా, డాబుసరిగా కనిపిస్తున్నప్పుడు వాటి సంకేతాలు స్పష్టంగా ఉనికిలోకి వస్తాయి. ప్రజలకు మంచి చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చామంటూ చేసే ప్రకటనలు అవినీతికి పొగ- తెరలుగా మాత్రమే కనిపిస్తాయి. తమ ఆస్తుల వివరాలు, వాటి మొత్తం విలువ జాబితాను మాత్రమే అభ్యర్థి నుంచి కోరటంతో సరిపెట్టుకోకుండా వాటిని వారెలా సంపాదించా రన్న ప్రశ్నను ఎన్నికల కమిషన్ ఎందుకు సంధించ లేదు? ఆదాయపన్ను బారి నుంచి తప్పించు కోవడానికి సామాన్య వ్యాపారి సైతం తన రసీదు పుస్తకాలను ఎలా తారుమారు చేస్తాడో మనందరికీ తెలుసు కాబట్టి, తాముచూపే లెక్కలకు జవాబు దారీగా ఉండాలని ఎన్నికల కమిషన్ కోరినట్లయితే కనీసం కొంత నైతికతకు చోటుంటుంది. సొంతవ్యాపార ప్రయోజనాలు కలిగివున్న వారు సైతం ఆ సంస్థలో తమ భాగస్వామ్యాన్ని సాంకేతికంగా చూపకపోవచ్చు. అంతమాత్రాన ఇలాంటివారు ఆ సంస్థలో క్రియాశీలకంగా లేరని అర్థం కాదు. అంటే శాసనం అర్థాన్ని, దాని స్ఫూర్తిని గౌరవించకపోవడం ఒక వాస్తవ అంశంగా ఉంటోం ది. ఛగన్ భుజ్‌బల్ కుటుంబాన్ని తీసుకోండి. తానూ, తన కుమారుడు, మేనల్లుడు... ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఏకకాలంలోనే ఈ కుటుంబం నుంచి వచ్చారు, అదేసమయంలో వీరికి వ్యాపార ప్రయోజనాలు కూడా ఉండేవి. ఇక వినోద్ తావ్డే అనే మంత్రి ఉదంతం కూడా ఉంది. తాను ఒక కంపెనీతో సంబంధం కలిగి ఉన్న విషయాన్ని ఈయన ఎన్నికల అఫిడవిట్లో పొందుపర్చలేదు. తర్వాత ఇచ్చిన వివరణలో తాను ఆ కంపెనీకి గౌరవనీయ డెరైక్టర్గానే ఉన్నానని చెప్పారు. కార్పొరేట్ చట్టం ప్రకారం స్వతంత్ర డెరైక్టర్లుగా వ్యవహరించే వారు ఉండవచ్చు. అయితే గౌరవనీయమైన అనే పదం తగిలించుకున్నంత మాత్రాన అతడు డెరైక్టర్ కాదని అర్థం కాదు. వివరాలు బహిర్గతం చేయడం నుంచి దుర్మార్గం అనేది విడిగా ఉండదు. కానీ ప్రత్యేకించి అనుమానించదగిన వాస్తవాంశాలతో (నరేంద్ర మోదీకి సతీమణి ఉన్నారా లేదా స్మృతి ఇరానీ యేల్ యూనివర్శిటీ పట్టభద్రురాలేనా వంటివి మాత్రమే కాకుండా) అఫిడవిట్ని ఎలా పూరించారు అనే దాన్ని ఇది నొక్కి చెబుతుంది. ఇలాంటి అంశాలను లాంఛనప్రాయంగా మాత్రమే పూరిస్తున్నారు. విషయానికి వస్తే, దేశవ్యాప్తంగా కూడా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, కానిస్టేబుల్ వంటి వారి బదిలీ విషయంలో కూడా డబ్బు చేతులు మారుతున్నందున అవినీతి బలంగా పాతుకుపోయింది. తనకు వచ్చిన బహుమతులపై చెలరేగిన వివాదం పట్ల ఆశ్చర్యం వ్యక్తపరుస్తూ సిద్ధరామయ్య చేసిన ప్రకటనలు అవి వాస్తవమే అయినప్పటికీ, అవి సమస్యను ప్రభావితం చేయకుండా ఉండవు. తాటిచెట్టు కింద కూర్చుని కనపడినంతమాత్రానే తాగుబోతులుగా లెక్కిస్తుంటారు. రాజకీయ వర్గానికి దేశంలో ప్రస్తుతం ఉన్న గుర్తింపు ఇలాగే ఉంది. మహేష్ విజాపుర్కార్, వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈమెయిల్: mvijapurkar@gmail.com -
లోకాయుక్తకు రిస్ట్ వాచీ ట్విస్ట్ !
సాక్షి, బెంగళూరు: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధరించే అత్యంత ఖరీదైన ‘హ్యూబ్లోట్’ వాచ్ వ్యవహారం లోకాయుక్తకు చేరింది. రూ.50-70లక్షల విలువ చేసే వాచ్‌ను సీఎం సిద్ధరామయ్య తన ఆస్తుల్లో చూపకుండానే అఫిడవిట్‌ను దాఖలు చేశారంటూ మానవ హక్కుల రక్షణా సమితి కార్యకర్త రామమూర్తి గౌడ లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. సీఎం ధరించే ఈ అత్యంత ఖరీదైన వాచ్‌కు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సిందిగా రామమూర్తి గౌడ లోకాయుక్తను కోరారు. ఇంత ఖరీదైన వాచ్‌కు సంబంధించిన వివరాలను 2015 మార్చి 31లో లోకాయుక్తకు అందజేసిన నివేదికలో పొందుపరచలేదు. నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి విలువైన ఏ వస్తువును కొన్నా, లేదా ఆయనకు బహుమతిగా లభించినా అందుకు సంబంధించిన వివరాలను ఈ నివేదికలో పొందుపరచాల్సి ఉంటుంది. కానీ ఈ వాచ్‌కు సంబంధించిన వివరాలు గత నివేదికలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పొందుపరచలేదు. ఇక లోకాయుక్తకు సీఎం సిద్ధరామయ్య అందజేసిన వివరాల ప్రకారం సీఎం సిద్ధరామయ్యకు వ్యవసాయం ద్వారా ఏడాదికి రూ. 2 లక్షల వరకు ఆదాయం వస్తోంది. వివిధ ప్రాంతాల్లో కొన్ని సంస్థలకు ఇచ్చిన కట్టడాలకు బాడుగ రూపంలో ఏడాదికి రూ. 38 లక్షల ఆదాయం లభిస్తుండగా, భార్య పార్వతి పేరిట బ్యాంకుల్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లకు ఏడాదకి రూ.1.25 లక్షల ఆదాయం వస్తోంది. ఇక ఈ నివేదికను సమర్పించే నాటికి ఇద్దరు కుమారులతో ఉన్న ఉమ్మడి కుటుంబానికి వ్యవసాయం ద్వారా ఏడాదికి రూ. 25 లక్షల ఆదాయం వస్తున్నట్లు వివరించారు.