అవినీతి కాదు ‘కానుక’
విశ్లేషణ
కర్ణాటక ముఖ్యమంత్రి అత్యంత ఖరీదైన హబ్లోట్ కంపెనీ వాచీని ధరించి నట్లు మీడియా.. జనం దృష్టికి తెచ్చిన రోజున సీఎం సిద్ధరామయ్య వివరణ ఇచ్చారు. అది మరొకరు అప్పటికే ఉప యోగించిన వాచీ అని, తన సంపన్న మిత్రుడు ఇస్తే తాను దానిని ధరిస్తున్నానని స్పష్టం చేయడం ద్వారా, తనపై వచ్చిన ఆరోపణల వాడినుంచి ఆయన తప్పించుకుని ఉండవచ్చు. ఆయన ఆ వివరణ ఇచ్చినప్పటికీ ‘అయితే’ అనేది ఇంకా ఉంటూనే ఉంది.
ప్రత్యేకించి రాజ్యాంగబద్ధంగా ముఖ్య స్థానాల్లో ఉన్నప్పటికీ రాజకీయవాదులు మునుపటి తరానికి చెందిన రాజకీయనేతల్లాగా స్వచ్ఛంగా ఉండగలరని నమ్మడానికి భారతీయ పౌరులు ఇష్టపడటంలేదు కాబట్టే సీఎం వివరణ తర్వాత కూడా ‘అయితే’ అనేది ఇంకా ధ్వనిస్తూనే ఉంది. సిద్ధరామయ్య పరిశుద్ధంగా ఉండొచ్చు గానీ, తాను కూడా అవినీతి పరులుగా అనుమానిస్తున్న వర్గానికి చెందిన వారు అనే వాస్తవం ఆయనకు వ్యతిరేకంగా పరిణమించే అవకాశం ఉంది. ఆయన తన అమాయకత్వాన్ని నిరూపించుకోవలసిందే.
నేరారోపణ చేసినవారే దాన్ని రుజువు చేయ వలసి ఉన్న నేర న్యాయ చట్టంలాగా కాకుండా, రాజకీయాల్లో ఇది స్పష్టంగా ఎరుకకు సంబంధిం చిన అంశంగా ఉంటుంది. అణకువ లేదా నిరుపేద నేపథ్యం కలిగి రాజకీయాల్లో మాత్రమే తను ఎదిగివచ్చినప్పుడు, అత్యంత విలాసవంతమైన గడియారాలను, మైమరిపించే కళ్లద్దాలు, చెప్పులను వాడటం అనేది తప్పనిసరిగా ప్రశ్నలను లేవనెత్తు తుంది. సిద్ధరామయ్య ప్రకటించిన ఆస్తుల వివరాలు అలాంటి విలాసప్రాయమైన అభి రుచులకు అనుకూలంగా లేవనుకోండి.
అయితే నమ్మకం వేరు, సమ్మతి అనేది వేరు. ఎందుకంటే రాజకీయ నేతలు ఒక వర్గంగా తమవైన అరల్లో ఇమిడివుండే అస్థిపంజరాలుగా ఉంటారు. రాజకీయాల్లోకి రాకముందు వారు ఎలా ఉండే వారు? వారి ఆస్తులేవి? రెండు ఎన్నికల మధ్య ఐచ్ఛికంగా ప్రకటించవలసిన అఫిడవిట్లలో చూపిన విధంగా వారి ఆస్తులు పెరిగిన తీరు ఏది? వంటివి సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి.
రాజకీయాలు అంటే సీట్లు సంపాదించడ మేననీ, అప్పటి నుంచి ప్రజా సంరక్షకత్వం అనేది తొలగిపోయి నీకది నాకిది అనేది ముందుకొస్తుం దని, దీంతో వారు ధరించే జుబ్బాతో మొదలుపెట్టి, కులీన జీవన శైలి మొదలవుతుందని ప్రజల్లో పేరు కుపోయిన విశ్వాసాన్ని ఇది బలోపేతం చేస్తుంది.
ఇంతవరకు ప్రతి ఎన్నికలోనూ అభ్యర్థులు తమ ఆస్తుల వివరాలను పొందుపర్చవలసి ఉండేది కానీ ఆ వివరాలు పౌరులకు, ఓటర్లకు తెలియవు. తదుపరి ఎన్నికలకు గాను అఫిడవిట్లు వచ్చేసరికి వారి ఆస్తులు విపరీతంగా పెరిగి ఉంటాయి. అలా ఎలా జరుగుతుంది అనేదాంట్లోనే అసలు కథంతా ఉంది. అయితే బహిరంగంగా వివరించే కథ మాత్రం ఇది కాదు. అఫిడవిట్లలో కొన్ని సంఖ్యలను పూరిస్తే ఎన్నికల కమిషన్ సంతృప్తి చెందుతుంది. ఇదొక లాంఛనప్రాయమైన తంతులా మారింది.
కార్యాలయంలో కూర్చున్న తొలి ఆరునెలల కాలంలోనే ఒక పురపాలక సంస్థ లేదా జిల్లా పరిషత్ కౌన్సిలర్ జీవనశైలి మరింత ఆడం బరంగా, డాబుసరిగా కనిపిస్తున్నప్పుడు వాటి సంకేతాలు స్పష్టంగా ఉనికిలోకి వస్తాయి. ప్రజలకు మంచి చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చామంటూ చేసే ప్రకటనలు అవినీతికి పొగ- తెరలుగా మాత్రమే కనిపిస్తాయి.
తమ ఆస్తుల వివరాలు, వాటి మొత్తం విలువ జాబితాను మాత్రమే అభ్యర్థి నుంచి కోరటంతో సరిపెట్టుకోకుండా వాటిని వారెలా సంపాదించా రన్న ప్రశ్నను ఎన్నికల కమిషన్ ఎందుకు సంధించ లేదు? ఆదాయపన్ను బారి నుంచి తప్పించు కోవడానికి సామాన్య వ్యాపారి సైతం తన రసీదు పుస్తకాలను ఎలా తారుమారు చేస్తాడో మనందరికీ తెలుసు కాబట్టి, తాముచూపే లెక్కలకు జవాబు దారీగా ఉండాలని ఎన్నికల కమిషన్ కోరినట్లయితే కనీసం కొంత నైతికతకు చోటుంటుంది.
సొంతవ్యాపార ప్రయోజనాలు కలిగివున్న వారు సైతం ఆ సంస్థలో తమ భాగస్వామ్యాన్ని సాంకేతికంగా చూపకపోవచ్చు. అంతమాత్రాన ఇలాంటివారు ఆ సంస్థలో క్రియాశీలకంగా లేరని అర్థం కాదు. అంటే శాసనం అర్థాన్ని, దాని స్ఫూర్తిని గౌరవించకపోవడం ఒక వాస్తవ అంశంగా ఉంటోం ది. ఛగన్ భుజ్‌బల్ కుటుంబాన్ని తీసుకోండి. తానూ, తన కుమారుడు, మేనల్లుడు... ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఏకకాలంలోనే ఈ కుటుంబం నుంచి వచ్చారు, అదేసమయంలో వీరికి వ్యాపార ప్రయోజనాలు కూడా ఉండేవి.
ఇక వినోద్ తావ్డే అనే మంత్రి ఉదంతం కూడా ఉంది. తాను ఒక కంపెనీతో సంబంధం కలిగి ఉన్న విషయాన్ని ఈయన ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపర్చలేదు. తర్వాత ఇచ్చిన వివరణలో తాను ఆ కంపెనీకి గౌరవనీయ డెరైక్టర్‌గానే ఉన్నానని చెప్పారు. కార్పొరేట్ చట్టం ప్రకారం స్వతంత్ర డెరైక్టర్లుగా వ్యవహరించే వారు ఉండవచ్చు. అయితే గౌరవనీయమైన అనే పదం తగిలించుకున్నంత మాత్రాన అతడు డెరైక్టర్ కాదని అర్థం కాదు.
వివరాలు బహిర్గతం చేయడం నుంచి దుర్మార్గం అనేది విడిగా ఉండదు. కానీ ప్రత్యేకించి అనుమానించదగిన వాస్తవాంశాలతో (నరేంద్ర మోదీకి సతీమణి ఉన్నారా లేదా స్మృతి ఇరానీ యేల్ యూనివర్శిటీ పట్టభద్రురాలేనా వంటివి మాత్రమే కాకుండా) అఫిడవిట్‌ని ఎలా పూరించారు అనే దాన్ని ఇది నొక్కి చెబుతుంది. ఇలాంటి అంశాలను లాంఛనప్రాయంగా మాత్రమే పూరిస్తున్నారు.
విషయానికి వస్తే, దేశవ్యాప్తంగా కూడా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, కానిస్టేబుల్ వంటి వారి బదిలీ విషయంలో కూడా డబ్బు చేతులు మారుతున్నందున అవినీతి బలంగా పాతుకుపోయింది. తనకు వచ్చిన బహుమతులపై చెలరేగిన వివాదం పట్ల ఆశ్చర్యం వ్యక్తపరుస్తూ సిద్ధరామయ్య చేసిన ప్రకటనలు అవి వాస్తవమే అయినప్పటికీ, అవి సమస్యను ప్రభావితం చేయకుండా ఉండవు. తాటిచెట్టు కింద కూర్చుని కనపడినంతమాత్రానే తాగుబోతులుగా లెక్కిస్తుంటారు. రాజకీయ వర్గానికి దేశంలో ప్రస్తుతం ఉన్న గుర్తింపు ఇలాగే ఉంది.
మహేష్ విజాపుర్కార్, వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
ఈమెయిల్: mvijapurkar@gmail.com