Formula One Star Charles Leclerc Costly Richard Mille Watch Stolen In Italy - Sakshi
Sakshi News home page

Charles Leclerc: 'మీ అభిమానం తగలెయ్య.. రెండున్నర కోట్ల వాచ్‌ కొట్టేశారు'

Apr 20 2022 4:40 PM | Updated on Apr 20 2022 5:46 PM

Formula One Star Charles Leclerc Costly Richard Mille Watch Stolen Italy - Sakshi

ఫార్ములా వన్‌ స్టార్‌ చార్లెస్ లెక్లెర్‌కు చేదు అనుభవం ఎదురైంది. తనను కలవడానికి వచ్చిన అభిమానుల్లో గుర్తుతెలియని ఒక వ్యక్తి చార్లెస్‌ చేతికున్న ఖరీదైన వాచ్‌ను కొట్టేశాడు. కొట్టేసిన ఆ వాచ్‌ పేరు రిచర్డ్‌ మిల్లే.. దాని ఖరీదు ఇండియన్‌ కరెన్సీలో అక్షరాలా దాదాపు రూ.2.4 కోట్లకు పైగా. అభిమానం పేరుతో కలవడానికి వచ్చి విలువైన వస్తువును కొట్టేయడమేంటని చార్లెస్‌ తెగ బాధపడిపోయాడు. 

విషయంలోకి వెళితే.. వచ్చేవారం ఇటలీ వేదికగా జరగనున్న ఇమోలా గ్రాండ్ ప్రిక్స్‌ జరగనుంది. టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు చార్లెస్‌​ లెక్లెర్‌ సోమవారం ఇటలీలో అడుగుపెట్టాడు. చార్లెస్‌తో పాటు స్నేహితులు, ట్రైనర్‌ ఆండ్రియా ఫెరారీ ఉన్నారు.  టుస్కాన్ నగరం వియారెగియోలో చార్లెస్‌కు హోటల్‌ గది కేటాయించారు. అయితే అప్పటికే అతను ఉంటున్న హోటల్‌ ముందు తనను కలవడానికి జనాలు గూమికూడి ఉన్నారు.

వారి అభిమానానికి మురిసిపోయిన చార్లెస్‌ స్వయంగా వారినిక కలవడానికి వచ్చాడు. అయితే ఆ గుంపులో నుంచే ఒక తెలియని వ్యక్తి చార్లెస్‌​ చేతికున్న వాచ్‌ను కొట్టేశాడు. తన వాచ్‌ కొట్టేసిన విషయాన్ని చార్లెస్‌ స్వయంగా పోలీసులకు చెప్పి రిపోర్ట్‌ చేశాడు. చార్లెస్‌ రిపోర్డు ఆధారంగా పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. కాగా నిజంగానే దొంగతనం చేశారా.. లేక ముందుస్తు ప్లాన్‌ అమలు చేసి ఈ పని చేశారా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.

చదవండి: Pele: మరోసారి ఆసుపత్రిలో చేరిన బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ దిగ్గజం

Wimbledon 2022: రష్యన్‌ టెన్నిస్‌ ప్లేయర్లకు షాక్‌.. వింబుల్డన్‌కు దూరమయ్యే అవకాశం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement