
Emilia Romagna Grand Prix- ఇమోలా (ఇటలీ): ఫార్ములావన్ తాజా సీజన్‌లో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్, ప్రపంచ చాంపియన్ మాక్స్ వెర్‌స్టాపెన్ రెండో విజయం సాధించాడు. ఇటలీలో ఆదివారం జరిగిన ఎమిలియా రొమానా గ్రాండ్‌ప్రిలో వెర్‌స్టాపెన్ విజేతగా నిలిచాడు. 63 ల్యాప్‌ల రేసును పోల్ పొజిషన్‌తో ప్రారంభించిన వెర్‌స్టాపెన్ అందరికంటే వేగంగా గంటా 32 నిమిషాల 07.986 సెకన్లలో ముగించి కెరీర్‌లో 22వ విజయాన్ని అందుకున్నాడు.
రెడ్‌బుల్‌కే చెందిన పెరెజ్ రెండో స్థానంలో నిలిచాడు. లాండో నోరిస్ (మెక్‌లారెన్)కు మూడో స్థానం దక్కింది. సీజన్‌లోని తదుపరి రేసు మయామి గ్రాండ్‌ప్రి మే 6న జరుగుతుంది.
చదవండి: IPL 2022: ముంబై ఓటమి నం.8