Redbull team driver
-
బ్రేక్ ముగిసింది... స్టీరింగ్ పిలుస్తోంది
ఫార్ములావన్ సీజన్లో వరుసగా ఐదు నెలలపాటు ట్రాక్‌పై రయ్..రయ్..రయ్ మంటూ దూసుకెళ్లిన కార్లకు గత 26 రోజులుగా విరామం లభించింది. విరామం ముగియడంతో మళ్లీ ట్రాక్‌పైకి రావడానికి కార్లు, డ్రైవర్లు సిద్ధమయ్యారు. మొత్తం 24 రేసుల ఈ సీజన్లో ఇప్పటివరకు 14 రేసులు ముగిశాయి. 15వ రేసుకు నెదర్లాండ్స్‌లోని జాండ్వర్ట్ సర్క్యూట్ ముస్తాబయింది. శుక్రవారం డ్రైవర్లందరూ ప్రాక్టీస్ చేశారు. శనివారం క్వాలిఫయింగ్ సెషన్‌ను నిర్వహిస్తారు. ఆదివారం ప్రధాన రేసు జరుగుతుంది. సీజన్‌లోని తొలి అర్ధభాగంలో డిఫెండింగ్ వరల్డ్ చాంపియన్ మాక్స్ వెర్స్టాపెన్ ఆధిపత్యం చలాయించి ఏడు రేసుల్లో గెలిచాడు. రెండో భాగంలో మిగిలిన పది రేసుల్లో ఇతర జట్ల డ్రైవర్లు గేర్ మార్చి వెర్స్టాపెన్ దూకుడుకు బ్రేక్‌లు వేస్తారా లేదా వేచి చూడాలి. జాండ్వర్ట్ (నెదర్లాండ్స్): గత మూడేళ్లుగా సొంతగడ్డపై రెడ్‌బుల్ జట్టు డ్రైవర్, నెదర్లాండ్స్ స్టార్ మాక్స్ వెర్‌స్టాపెన్‌కు ఎదురులేదు. స్వదేశంలో ‘హ్యాట్రిక్’ విజయాలతో జోరు మీదున్న వెర్స్టాపెన్ వరుసగా నాలుగోసారి టైటిల్ సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. 2021 సీజన్‌తో ఫార్ములావన్ క్యాలెండర్లో తిరిగి వచి్చన డచ్ గ్రాండ్‌ప్రిలో ఈసారీ గెలిచి అత్యధికసార్లు ఈ రేసు నెగ్గిన జిమ్ క్లార్క్ సరసన చేరాలని వెర్స్టాపెన్ భావిస్తున్నాడు. జిమ్ క్లార్క్ 1963, 1964, 1965, 1967లో డచ్ గ్రాండ్‌ప్రి చాంపియన్‌గా నిలవగా.. వెర్స్టాపెన్ 2021 నుంచి 2023 వరకు మూడేళ్ల పాటు వరుసగా విజయాలు సాధించాడు. గత మూడు రేసుల్లోనూ ‘పోల్ పొజిషన్’తో ప్రధాన రేసు ప్రారంభించిన 26 ఏళ్ల వెర్‌స్టాపెన్‌కు ఇది కెరీర్లో 200వ రేసు కావడం విశేషం. ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన 14 రేసుల్లో ఏడింటిలో నెగ్గిన వెర్స్టాపెన్... డ్రైవర్స్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 277 పాయింట్లతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇటీవలి కాలంలో నిలకడైన ప్రదర్శన చేస్తున్న బ్రిటన్ డ్రైవర్ లాండో నోరిస్ (మెక్లారెన్) 199 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా... చార్లెస్ లెక్లెర్క్ (ఫెరారీ) 177 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. మెర్సిడెస్ రేసర్ లూయిస్ హామిల్టన్ 150 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది వెర్స్టాపెన్ అత్యధికంగా తొమ్మిదిసార్లు పోడియంపై (టాప్–3) నిలవగా... నోరిస్ ఎనిమిదిసార్లు ఆ ఘనత సాధించాడు. ట్రాక్ ఎలా ఉందంటే! ఇసుక దిబ్బలకు ప్రసిద్ధి అయిన జాండ్వర్ట్లో ఈ రేసు జరగనుంది. సముద్ర తీరానికి అతి సమీపంలోని రిసార్ట్‌లోని అహ్లాదకర వాతావరణం అటు అభిమానులను, ఇటు రేసర్లను మరింత ఉత్సాహపరచనుంది. అనూహ్య మలుపులు, ఊహించని ఎత్తుపల్లాలతో డ్రైవర్లకు ఈ ట్రాక్ సవాలు విసరనుంది. 72 ల్యాప్‌లు.. డచ్ గ్రాండ్‌ప్రి సర్క్యూట్లో మొత్తం 72 ల్యాప్‌లు ఉన్నాయి. అందులో ఒక్కో ల్యాప్ 4.2 కిలోమీటర్లు కాగా... పూర్తి రేసు దూరం 307 కిలోమీటర్లు.రెడ్‌బుల్ రేసర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ (నెదర్లాండ్స్) కెరీర్లో ఇది 200వ రేసు. ఫార్ములావన్ చరిత్రలో 200 రేసులు పూర్తి చేసుకోనున్న 23వ డ్రైవర్‌గా వెర్స్టాపెన్ గుర్తింపు పొందనున్నాడు. 392 రేసులతో ఫెర్నాండో అలోన్సో అగ్రస్థానంలో ఉన్నాడు. హామిల్టన్‌దే రికార్డు డచ్ గ్రాండ్‌ప్రిలో అత్యంత వేగంగా ల్యాప్ పూర్తి చేసిన రికార్డు బ్రిటన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ పేరిట ఉంది. 2021 రేసులో భాగంగా హామిల్టన్ 1 నిమిషం 11.097 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు.సొంతగడ్డపై పోటీ పడేటప్పుడు కాస్త ఒత్తిడి ఉండటం సహజమే. గత ఏడాది ఇక్కడ పోటీ పడ్డప్పుడు పూర్తి విశ్వాసంతో బరిలోకి దిగి విజేతగా నిలిచా. ఈ సారి ఇంకా ఎక్కువ పోటీ ఉండనుంది. మరింత మెరుగయ్యేందుకు ప్రయతి్నస్తా. –వెర్స్టాపెన్, రెడ్‌బుల్ డ్రైవర్ నేటి క్వాలిఫయింగ్ సెషన్ సాయంత్రం గం. 6:30 నుంచి ఫ్యాన్ కోడ్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
Formula 1: అన్‌స్టాపబుల్ వెర్స్టాపెన్.. కెరీర్లో 22వ విజయం
Emilia Romagna Grand Prix- ఇమోలా (ఇటలీ): ఫార్ములావన్ తాజా సీజన్లో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్, ప్రపంచ చాంపియన్ మాక్స్ వెర్స్టాపెన్ రెండో విజయం సాధించాడు. ఇటలీలో ఆదివారం జరిగిన ఎమిలియా రొమానా గ్రాండ్‌ప్రిలో వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. 63 ల్యాప్‌ల రేసును పోల్ పొజిషన్‌తో ప్రారంభించిన వెర్స్టాపెన్ అందరికంటే వేగంగా గంటా 32 నిమిషాల 07.986 సెకన్లలో ముగించి కెరీర్లో 22వ విజయాన్ని అందుకున్నాడు. రెడ్‌బుల్‌కే చెందిన పెరెజ్ రెండో స్థానంలో నిలిచాడు. లాండో నోరిస్ (మెక్లారెన్)కు మూడో స్థానం దక్కింది. సీజన్‌లోని తదుపరి రేసు మయామి గ్రాండ్‌ప్రి మే 6న జరుగుతుంది. చదవండి: IPL 2022: ముంబై ఓటమి నం.8 -
వెర్‌స్టాపెన్‌కు తొమ్మిదో ‘పోల్’
ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ తొమ్మిదో పోల్ పొజిషన్ సొంతం చేసుకున్నాడు. యూఎస్ఏ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో వెర్స్టాపెన్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 32.910 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. మెర్సిడెస్ జట్టు డ్రైవర్ హామిల్టన్ రెండో స్థానంలో, రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ పెరెజ్ మూడో స్థానంలో నిలిచారు. ఈ సీజన్లో వెర్స్టాపెన్ ఏడు రేసుల్లో విజేతగా నిలిచి 262.5 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. -
Azerbaijan Grand Prix: వెర్‌స్టాపెన్‌కు కలిసిరాని అదృష్టం
బాకు (అజర్బైజాన్): ఈ సీజన్లో మూడో విజయం ఖాయమనుకుంటున్న దశలో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్‌కు అదృష్టం కలిసి రాలేదు. అజర్బైజాన్ గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలవాల్సిన అతను ఒక్క పాయింట్ కూడా సంపాదించకుండా రేసు నుంచి వైదొలగాల్సి వచ్చింది. అజర్బైజాన్ రాజధాని బాకు నగర వీధుల్లో జరిగిన 51 ల్యాప్‌ల రేసులో వెర్స్టాపెన్ 46వ ల్యాప్ వరకు ఆధిక్యంలో ఉన్నాడు. సర్క్యూట్‌పై రయ్ రయ్‌మంటూ దూసుకుపోతున్న దశలో వెర్స్టాపెన్ కారు ఎడమ టైరు పంక్చర్ అయింది. దాంతో నియంత్రణ కోల్పోయిన వెర్స్టాపెన్ కారు కాంక్రీట్ గోడకు బలంగా ఢీ కొట్టింది. ఫలితంగా వెర్స్టాపెన్ కారు నుంచి బయటకు వచ్చి రేసు నుంచి వైదొలిగాడు. వెర్స్టాపెన్ ఘటన తర్వాత రేసును అరగంటపాటు ఆపారు .ఆ తర్వాత సేఫ్టీ కార్ల నడుమ రేసును మళ్లీ కొనసాగించగా... రెడ్‌బుల్ జట్టుకే చెందిన సెర్గియో పెరెజ్ విజేతగా అవతరించాడు. దాంతో వెర్స్టాపెన్ ఘటనతో నిరాశలో ఉన్న రెడ్‌బుల్ బృందంలో ఆనందం వెల్లివెరిసింది. ఆరో స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన పెరెజ్ అందరికంటే ముందుగా 2 గంటల 13 నిమిషాల 36.410 సెకన్లలో లక్ష్యానికి చేరి విజేతగా నిలిచాడు. ఈ సీజన్లో పెరెజ్‌కిది తొలి విజయం కాగా కెరీర్లో రెండోది. ప్రపంచ మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ (ఆస్టన్ మార్టిన్) రెండో స్థానంలో... పియరీ గ్యాస్లీ (ఆల్ఫా టారీ) మూడో స్థానంలో నిలిచారు. పోల్ పొజిషన్ నుంచి రేస్‌ను ఆరంభించిన ఫెరారీ డ్రైవర్ లెక్లెర్క్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ప్రపంచ చాంపియన్ హామిల్టన్ (మెర్సిడెస్) 15వ స్థానంలో నిలిచాడు. సీజన్‌లోని తదుపరి రేసు ఫ్రాన్స్ గ్రాండ్‌ప్రి ఈనెల 20న జరుగుతుంది. సీజన్లో ఐదు రేసులు ముగిశాక డ్రైవర్స్ చాంపియన్ షిప్ టైటిల్ పాయింట్ల పట్టికలో వెర్స్టాపెన్ (105 పాయింట్లు), హామిల్టన్ (101 పాయింట్లు), పెరెజ్ (69 పాయింట్లు), లాండో నోరిస్ (66 పాయింట్లు) వరుసగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు. A message from the #AzerbaijanGP winner... sounds good right, @SChecoPerez? 😉🇲🇽 pic.twitter.com/fRiGgVZIdR — Red Bull Racing Honda (@redbullracing) June 6, 2021 -
హామిల్టన్ హవా
బుడాపెస్ట్: మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఈ సీజన్లో ఎనిమిదో విజయాన్ని నమోదు చేశాడు. ఆదివారం జరిగిన హంగేరి గ్రాండ్‌ప్రిలో 70 ల్యాప్‌ల రేసును మూడో స్థానం నుంచి ప్రారంభించిన అతను అందరికంటే ముందుగా గంటా 35 నిమిషాల 3.796 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. కెరీర్లో తొలిసారి పోల్ పొజిషన్ సాధించిన రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ చివర్లో ఆధిక్యాన్ని కోల్పోయి రెండో స్థానంతో సరిపెట్టుకోగా... ఫెరారీ డ్రైవర్ వెటెల్ మూడో స్థానంలో నిలిచాడు. తదుపరి బెల్జియం గ్రాండ్‌ప్రి సెప్టెంబర్ 1న జరుగుతుంది. -
వెల్డన్... వెర్స్టాపెన్
హాకెన్‌హీమ్ : జర్మనీ గ్రాండ్‌ప్రిలో రెడ్‌బుల్ డ్రైవర్ వెర్స్టాపెన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. 21 ఏళ్ల ఈ డచ్ యువ రేసర్ జర్మన్ ట్రాక్‌పై దుమ్మురేపాడు. రేసును అందరికంటే ముందుగా పూర్తి చేసి విజేతగా నిలిచాడు. 64 ల్యాపుల ఈ రేసులో అతనికి ఆదివారం బాగా కలిసొచ్చింది. మేటి రేసర్ల కార్లు ఢీకొనడం, వర్షం వల్ల గజిబిజిగా సాగిన ఈ రేసులో వెర్స్టాపెన్ చివరకు విజేతగా నిలిచాడు. అతను గంటా 44 నిమిషాల 31.275 సెకన్లలో పూర్తి చేసి ఈ సీజన్లో రెండో టైటిల్ సాధించాడు. ఓవరాల్‌గా అతని కెరీర్లో ఇది ఏడో విజయం. నాలుగుసార్లు ఫార్ములావన్ చాంపియన్‌షిప్ దక్కించుకున్న ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్‌కు అందనంత వేగంగా కార్‌ను బుల్లెట్లా పరుగెత్తించాడు. దీంతో వెటెల్ 1గం:44ని:38.608 సెకన్ల టైమింగ్‌తో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. టోరో రోసో డ్రైవర్ డానిల్ క్వియాట్ (1గం:44ని:39.580 సెకన్లు) మూడో స్థానంలో నిలిచాడు. డిఫెండింగ్ చాంపియన్, మెర్సిడెస్ స్టార్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్‌కు ఈ రేసు తీవ్ర నిరాశను మిగిల్చింది. తన కెరీర్లో 200వ రేసు బరిలోకి దిగిన హామిల్టన్ కారు ప్రమాదానికి గురవడంతో చాలా ఆలస్యంగా 1గం:44ని:50.942 సెకన్లలో రేసును పూర్తిచేశాడు. ప్రమాదంతో పాటు అగచాట్లతో ఆరు సార్లు అతని కారుకు బ్రేకులు పడ్డాయి. దీంతో కనీసం ఒక్క పాయింటైనా అతను పొందలేకపోయాడు. గత 23 రేసుల్లో ఈ మెర్సిడెస్ డ్రైవర్ పాయింట్ కూడా గెలవలేకపోవడం ఇదే మొదటిసారి. ఈ రేసులో పలువురి కార్లు ఢీకొనడంతో హేమాహేమీలైన డ్రైవర్లు అసలు రేసునే పూర్తి చేయలేకపోయారు. బొటాస్ (మెర్సిడెస్), హుల్కెన్‌బర్గ్ (రెనౌ), రికియార్డో (రెనౌ)లు రేసు నుంచి వైదొలిగారు. సీజన్‌లోని తదుపరి రేసు ఆగస్టు 4న హంగేరి గ్రాండ్‌ప్రి జరుగుతుంది. -
విజేత వెర్స్టాపెన్
స్పీల్బెర్గ్: నాటకీయ పరిణామాల మధ్య సాగిన ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మార్క్ వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. 71 ల్యాప్లపాటు సాగిన ఈ రేసును వెర్స్టాపెన్ గంటా 21 నిమిషాల 56.024 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఫెరారీ జట్టు డ్రైవర్లు రైకోనెన్, వెటెల్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ వాల్తెరి బొటాస్ 13వ ల్యాప్‌లో... అతని సహచరుడు హామిల్టన్ 62వ ల్యాప్‌లో వైదొలిగారు. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు పెరెజ్ ఆరో స్థానంలో, ఒకాన్ ఏడో స్థానంలో నిలిచారు. సీజన్లో తొమ్మిది రేసులు ముగిశాక డ్రైవర్స్ చాంపియన్‌షిప్ రేసులో వెటెల్ (146 పాయింట్లు) తొలి స్థానంలో, హామిల్టన్ (145 పాయింట్లు), రైకోనెన్ (101 పాయింట్లు) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. -
వెటెల్ ‘హ్యాట్రిక్’ పోల్
ప్రధాన రేసు మధ్యాహ్నం గం. 2.45 నుంచి ఈఎస్‌పీఎన్‌లో ప్రత్యక్ష ప్రసారం గత రెండేళ్లుగా తనకు కలిసొచ్చిన ఇండియన్ గ్రాండ్‌ప్రి రేసు సర్క్యూట్లో ముచ్చటగా మూడోసారి సెబాస్టియన్ వెటెల్ దుమ్ము రేపాడు. శుక్రవారం ప్రాక్టీస్ సెషన్లో ఆధిపత్యం చెలాయించిన ఈ రెడ్‌బుల్ జట్టు డ్రైవర్... శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లోనూ అదే జోరును కొనసాగించాడు. అందరికంటే వేగంగా ల్యాప్‌ను పూర్తి చేసిన ఈ జర్మన్ డ్రైవర్ వరుసగా మూడోఏడాది ఈ రేసులో ‘పోల్ పొజిషన్’ను దక్కించుకున్నాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించనున్న వెటెల్ టాప్-5లో నిలిస్తేచాలు ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా వరుసగా నాలుగో ఏడాది డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకుంటాడు. గ్రేటర్ నోయిడా: ఈ సీజన్లో వరుసగా ఆరో టైటిల్ సాధించడమే లక్ష్యంగా రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ ఇండియన్ గ్రాండ్‌ప్రిలో బరిలోకి దిగనున్నాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో వెటెల్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 24.119 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. క్వాలిఫయింగ్‌లోని మొత్తం మూడు సెషన్స్‌లోనూ వెటెలే అగ్రస్థానంలో నిలిచాడు. 2011లో తొలిసారి మొదలైన ఇండియన్ గ్రాండ్‌ప్రిలో వెటెల్‌కిది వరుసగా మూడో పోల్ పొజిషన్ కావడం విశేషం. గత రెండేళ్లుగా అతను ‘పోల్ పొజిషన్’ సాధించడమేకాకుండా ప్రధాన రేసులోనూ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసులో వెటెల్ గెలిస్తే ఇండియన్ గ్రాండ్‌ప్రిలో ‘హ్యాట్రిక్’ నమోదు చేయడంతోపాటు ఈ సీజన్లో వరుసగా ఆరు టైటిల్స్‌తో ‘డబుల్ హ్యాట్రిక్’ ఘనతను తన ఖాతాలో వేసుకుంటాడు. అంతేకాకుండా వరుసగా నాలుగో ఏడాది డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను కైవసం చేసుకుంటాడు. ప్రస్తుతం వెటెల్ 297 పాయింట్లతో అగ్రస్థానంలో... ఫెర్నాండో అలోన్సో (ఫెరారీ) 207 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఆదివారం జరిగే రేసులో వెటెల్ కనీసం టాప్-5లో నిలిస్తే ఈ సీజన్‌లోని మిగతా మూడు రేసుల ఫలితాలతో ఎలాంటి సంబంధం లేకుండా ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ ఖాయమవుతుంది. ఇక సొంతగడ్డపై భారత్‌కు చెందిన ‘సహారా ఫోర్స్ ఇండియా’ జట్టు డ్రైవర్లు ఆకట్టుకోలేకపోయారు. పాల్ డి రెస్టా 12వ స్థానం నుంచి... సుటిల్ 13వ స్థానం నుంచి పోటీపడతారు. అడ్డంకులు సృష్టించొద్దు: మాల్యా భవిష్యత్‌లో ఇండియన్ గ్రాండ్‌ప్రి రేసు నిర్వహణకు ఎలాంటి అడ్డంకులు సృష్టించవద్దని... రేసు సాఫీగా సాగేందుకు సాధ్యమైనంతగా సహకరించాలని సహారా ఫోర్స్ ఇండియా జట్టు యజమాని విజయ్ మాల్యా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ‘ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో ఫార్ములావన్‌కు ప్రభుత్వాల నుంచి లభించే మద్దతు, సహకారం గురించి కేంద్ర ప్రభుత్వం తెలుసుకోవాలి. ఇండియన్ గ్రాండ్‌ప్రి విషయంలో ప్రభుత్వం అడ్డంకులు సృష్టించకూడదు. రేసు నిర్వహణకు ప్రభుత్వం సహకరించాలి’ అని విజయ్ మాల్యా కోరారు. ఈ వారాంతం అద్భుతంగా ఉంది. కారు పనితీరు బాగుంది. బుద్ధ సర్క్యూట్ నాకెంతో ఇష్టం. సర్క్యూట్ మధ్య భాగం నచ్చింది. వేగాన్ని అందుకునే మలుపులు డ్రైవర్లకు సవాలుగా నిలుస్తాయి. క్వాలిఫయింగ్ ఫలితం జట్టుకు ఉపయోగకరం. ఆదివారం తుది ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాలి. నా దృష్టి అంతా రేసుపైనే. ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ గురించి ఆలోచించడంలేదు. ప్రతి ఒక్కరూ ఇక్కడ అదే ప్రశ్న అడుగుతున్నారు. సుదీర్ఘంగా సాగే ఈ రేసులో ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలో రేసుకు ముందే నిర్ణయిస్తాం. -వెటెల్ -
వెటెల్ ‘హ్యాట్రిక్’
సింగపూర్: తొలి ల్యాప్‌లో కాస్త తడబాటును మినహాయిస్తే... ఆద్యంతం స్పష్టమైన ఆధిపత్యాన్ని కనబరిచిన రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ ఈ సీజన్లో ఏడో విజయాన్ని నమోదు చేశాడు. ఆదివారం జరిగిన సింగపూర్ గ్రాండ్‌ప్రి రేసులో ఈ జర్మన్ డ్రైవర్ విజేతగా నిలిచాడు. 61 ల్యాప్‌ల రేసును వెటెల్ గంటా 59 నిమిషాల 13.132 సెకన్లలో పూర్తి చేశాడు. వరుసగా మూడో ఏడాది ఈ టైటిల్‌ను నెగ్గి ‘హ్యాట్రిక్’ సాధించాడు. అంతేకాకుండా గత మూడు రేసులను (బెల్జియం, ఇటలీ, సింగపూర్) నెగ్గి మరో ‘హ్యాట్రిక్’ సాధించాడు. విజేత వెటెల్‌కు, రెండో స్థానంలో నిలిచిన అలోన్సోకు మధ్య తేడా 32 సెకన్లు ఉండటం ఈ రేసులో వెటెల్ ఆధిపత్యానికి నిదర్శనం. ఈ సీజన్లో ఏడు విజయాలు నమోదు చేసిన వెటెల్ 247 పాయింట్లతో డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 187 పాయింట్లతో అలోన్సో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ సీజన్లో మరో ఆరు రేసులు మిగిలి ఉన్నాయి. ఇదే జోరును కొనసాగిస్తే వెటెల్ వరుసగా నాలుగో ఏడాది ప్రపంచ చాంపియన్‌గా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన వెటెల్‌కు రెండో స్థానంలో ఉన్న రోస్‌బర్గ్ నుంచి గట్టిపోటీ ఎదురైంది. ఆరంభంలో ఓవర్టేక్తో రోస్‌బర్గ్ ఆధిక్యంలోకి వెళ్లగా రెండో మలుపు వద్ద వెటెల్ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రోస్బర్గ్ను ఓవర్టేక్ చేసి ఆధిక్యంలోకి వెళ్లాడు. అటునుంచి వెటెల్‌కు తిరుగులేకుండా పోయింది. తొలుత 10 సెకన్ల ఆధిక్యాన్ని సంపాదించిన వెటెల్ ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని పెంచుకుంటూపోయాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్లకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. సుటిల్ 10వ స్థానంలో నిలిచి ఒక పాయింట్ నెగ్గగా... పాల్ డి రెస్టా 54వ ల్యాప్‌లో వైదొలిగాడు. సీజన్‌లోని తదుపరి రేసు కొరియా గ్రాండ్‌ప్రి అక్టోబరు 6న జరుగుతుంది.