
స్పీల్‌బెర్గ్: నాటకీయ పరిణామాల మధ్య సాగిన ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మార్క్ వెర్‌స్టాపెన్ విజేతగా నిలిచాడు. 71 ల్యాప్‌లపాటు సాగిన ఈ రేసును వెర్‌స్టాపెన్ గంటా 21 నిమిషాల 56.024 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఫెరారీ జట్టు డ్రైవర్లు రైకోనెన్, వెటెల్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.
‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ వాల్తెరి బొటాస్ 13వ ల్యాప్‌లో... అతని సహచరుడు హామిల్టన్ 62వ ల్యాప్‌లో వైదొలిగారు. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు పెరెజ్ ఆరో స్థానంలో, ఒకాన్ ఏడో స్థానంలో నిలిచారు. సీజన్‌లో తొమ్మిది రేసులు ముగిశాక డ్రైవర్స్ చాంపియన్‌షిప్ రేసులో వెటెల్ (146 పాయింట్లు) తొలి స్థానంలో, హామిల్టన్ (145 పాయింట్లు), రైకోనెన్ (101 పాయింట్లు) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment