Wins
-
బీజేపీ ‘మహా’ విజయం
మహారాష్ట్రపై కాషాయజెండా నిండుగా రెపరెపలాడింది. హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల పోరులో బీజేపీ సారథ్యంలోని మహాయుతి ఘనవిజయం సాధించింది. ఏకంగా నాలుగింట మూడొంతుల సీట్లు ఒడిసిపట్టింది! అధికార కూటమి దెబ్బకు కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి కకావికలమైంది. ప్రధాన ప్రతిపక్ష హోదాకు కావాల్సిన 29 స్థానాలు విపక్షాల్లో ఏ పార్టీకీ దక్కకపోవడం విశేషం. అయితే, మహారాష్ట్రలో తలబొప్పి కట్టిన విపక్ష ఇండియా కూటమికి జార్ఖండ్ ఫలితాలు ఊరటనిచ్చాయి. జేఎంఎం సారథ్యంలోని ఇండియా కూటమి హోరాహోరీ పోరులో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని నిలువరించి అధికారాన్ని నిలబెట్టుకుంది. ముంబై/రాంచీ: మహారాష్ట్రపై కాషాయజెండా నిండుగా రెపరెపలాడింది. హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల పోరులో బీజేపీ సారథ్యంలోని మహాయుతి ఘనవిజయం సాధించింది. ఏకంగా నాలుగింట మూడొంతుల సీట్లు ఒడిసిపట్టింది! శనివారం వెల్లడైన ఫలితాల్లో 288 స్థానాలకు గాను ఏకంగా 233 సీట్లను కైవసం చేసుకుని దుమ్ము రేపింది. అధికార కూటమి దెబ్బకు కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి కకావికలైంది. కేవలం 49 సీట్లకు పరిమితమై ఘోర పరాజయం చవిచూసింది. ఉదయం ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచీ ఆద్యంతం బీజేపీ కూటమి జోరే కొనసాగింది. రౌండు రౌండుకూ ఆధిక్యాన్ని పెంచుకుంటూ మధ్యాహా్ననికల్లా మెజారిటీ మార్కు 145ను, ఆ తర్వాత చూస్తుండగానే 200 స్థానాలనూ దాటేసింది. చివరికి 233 స్థానాలు సొంతం చేసుకుంది. ఇటీవలి హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ హ్యాట్రిక్ కొట్టిన బీజేపీ తాజాగా మహారాష్ట్రలోనూ దక్కిన అఖండ విజయంతో అంతులేని సంబరాల్లో మునిగిపోయింది. ఆ పార్టీ 149 సీట్లలో పోటీ చేయగా ఏకంగా 132 చోట్ల విజయం సాధించడం విశేషం! మహారాష్ట్రలో ఆ పారీ్టకి ఇన్ని అసెంబ్లీ సీట్లు రావడం ఇదే తొలిసారి. బీజేపీ భాగస్వాములైన సీఎం ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివసేన 57, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 41 స్థా నాలు గెలుచుకున్నాయి. మహాయుతి అభ్యర్థుల్లో ఏకంగా 15 మంది లక్షకు పైగా మెజారిటీ సాధించడం విశేషం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ ఫలితాలు బీజేపీకి ఎనలేని ఉత్సాహాన్ని అందించాయి. మరోవైపు 101 సీట్లలో బరిలో దిగిన ఎంవీఏ కూటమి సారథి కాంగ్రెస్ కేవలం 16 సీట్లే నెగ్గింది. పీసీసీ చీఫ్ నానా పటోలే అతి కష్టమ్మీద గట్టెక్కగా పృథీ్వరాజ్ చవాన్, బాలాసాహెబ్ థోరట్ వంటి దిగ్గజాలు ఓటమి చవిచూశారు. ఎంవీఏ భాగస్వాముల్లో 95 స్థానాల్లో పోటీ చేసిన ఉద్ధవ్ ఠాక్రే శివసేన 20, 86 చోట్ల బరిలో దిగిన రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కేవలం 10 చోట్ల విజయం సాధించాయి. ఈ ఫలితాలు ఉద్ధవ్ రాజకీయ భవితవ్యాన్ని ప్రశ్నార్ధకంగా మార్చడమే గాక శరద్ పవార్‌కు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానానికి తెర దించాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధాన ప్రతిపక్ష హోదాకు కావాల్సిన 29 స్థానాలు విపక్షాల్లో ఏ పారీ్టకీ దక్కకపోవడం విశేషం! విపక్షాలకు జార్ఖండ్ ఊరట మహారాష్ట్రలో తల బొప్పి కట్టిన విపక్ష ఇండియా కూటమికి జార్ఖండ్ ఫలితాలు ఊరటనిచ్చాయి. అక్కడ జేఎంఎం సారథ్యంలోని ఇండియా కూటమి హోరాహోరీ పోరులో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని నిలువరించి అధికారాన్ని నిలబెట్టుకుంది. 81 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా 56 చోట్ల విజయం సాధించింది. కూటమి సారథి జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) దుమ్ము రేపింది. 43 స్థానాల్లో బరిలో దిగిన సీఎం హేమంత్ సోరెన్ పార్టీ ఏకంగా 34 సీట్లలో విజయ కేతనం ఎగరవేయడం విశేషం. దాని భాగస్వాముల్లో 30 చోట్ల పోటీ చేసిన కాంగ్రెస్ 16, 6 చోట్ల బరిలో దిగిన ఆర్జేడీ 4, 4 చోట్ల పోటీ చేసిన సీపీఐ (ఎంఎల్–ఎల్) 2 స్థానాలను గెలుచుకున్నాయి. ఎన్డీఏ కూటమి కేవలం 23 సీట్లకే పరిమితమైంది. బీజేపీ 21 చోట్ల గెలుపొందింది. -
Donald Trump: ట్రంప్ రికార్డులు.. చరిత్రలో అతిపెద్ద పునరాగమనం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ జయకేతనం ఎగురవేశారు. 132 ఏళ్ల అనంతరం మధ్యలో ఒక విరామం తర్వాత రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి అభ్యర్థిగా ఆయన చరిత్ర సృష్టించారు. సంచలనాలు, వివాదాలకు మారుపేరైన ట్రంప్ బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచారు. వ్యాపారం, స్థిరాస్తి, మీడియా రంగాల్లో తన ప్రతిభాపాటవాలతో రాణించారు. వ్యాపార కుటుంబంలో జన్మించిన ట్రంప్ విలక్షణ నాయకుడిగా పేరుపొందారు. రాజకీయ రంగంలో అగ్రస్థానానికి చేరుకోవడమే కాదు, అమెరికా రాజకీయాలపై తనదైన ముద్ర వేయడం విశేషం. 1982లోనే ఫోర్బ్స్ జాబితాలోకి.. ట్రంప్ అసలు పేరు డొనాల్డ్ జాన్ ట్రంప్. 1946 జూన్ 14న న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో జన్మించారు. ఆయన తల్లిదండ్రు లు ఫ్రెడ్ ట్రంప్, మేరీ అన్నే మెక్లి యోడ్ ట్రంప్. మొత్తం ఐదుగురు సంతానంలో ట్రంప్ నాలుగో సంతానం. ఫ్రెడ్ ట్రంప్ అమెరికాలో విజయవంతమైన రియల్ ఎస్టేట్ డెవలపర్‌గా పేరు ప్రఖ్యాతులు గడించారు. డొనాల్డ్ ట్రంప్ బాల్యం న్యూయార్క్‌లోనే గడిచింది. న్యూయార్క్ మిలటరీ అకాడమీలో చదువు కున్నారు. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాకు చెందిన వార్టన్ స్కూల్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్లో ఉన్నత విద్య అభ్యసించారు. 1968లో కామర్స్‌లో గ్రాడ్యుయేట్ పట్టా అందుకున్నారు. కాలేజీలో చదువు పూర్తయ్యాక ట్రంప్ 1971లో తన తండ్రి వ్యాపార సంస్థలోకి అడుగుపెట్టారు. తమ సంస్థను ‘ట్రంప్ ఆర్గనైజేషన్’గా పేరుమార్చారు. ట్రంప్ గ్రూప్‌నకు సంబంధించిన హోటళ్లు, క్యాసినోలు, గోల్ఫ్ కోర్సులను మరింత విస్తరింపజేశారు. తన పేరిట కొన్ని ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చారు. అనతికాలంలోనే ట్రంప్ బ్రాండ్‌కు మంచి పేరొచ్చింది. విజయవంతమైన వ్యాపారవేత్తగా డొనాల్డ్ ట్రంప్ పేరు మార్మోగిపోయింది. 200 మిలియన్ డాలర్ల సంపదతో 1982లో తొలిసారి ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో చేరారు. 2023లో ఆ సంపద విలువ 631 మిలియన్ డాలర్లతో సమానం. 2004లో ప్రారంభమైన అప్రెంటీస్ అనే టీవీ రియాలిటీ షోను ట్రంప్ స్వయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువయ్యారు. ఇంటింటా అందరికీ అభిమాన పాత్రుడయ్యారు. ఆయనలో మంచి రచయిత కూడా ఉన్నారు. 14కుపైగా పుస్తకాలు రాశారు. 1987లో విడుదలైన ‘ద ఆర్ట్ ఆఫ్ ద డీల్’ అనే పుస్తకం విపరీతమైన పాఠకాదరణ పొందింది. నెరవేరిన స్వప్నం డొనాల్డ్ ట్రంప్‌కు చిన్నప్పటి నుంచి రాజకీయాలంటే ఆసక్తి ఉండేది. 1980వ దశకంలో రాజకీయ రంగంలో ప్రవేశించారు. రిపబ్లిన్ పార్టీలో చేరారు. అధ్యక్షుడు కావాలన్నది ట్రంప్ కల. అందుకోసం ఎంతగానో శ్రమించారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు సాగించారు. మొదట్లో ఆ ప్రయత్నాలు ఫలించకపోయినా నిరాశ చెందలేదు. మరింత పట్టుదలతో కృషిచేశారు. 2015 జూన్ 16న రిపబ్లిన్ అభ్యర్థిగా ఆయన పేరు బలంగా తెరపైకి వచ్చింది. ప్రైమరీ ఎన్నికల్లో పలువురు అభ్యర్థులను వెనక్కి నెట్టి, ఎట్టకేలకు 2016 జూలైలో అధ్యక్ష ఎన్నికల బరిలో ట్రంప్ నిలిచారు. రిపబ్లికన్ అభ్యర్థిగా ఆయన పేరు అధికారికంగా ఖరారైంది. 2016 నవంబర్ 8న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ సంచలన విజయం సాధించారు. డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ను ఓడించారు. రష్యా ప్రభుత్వం ఆయన విజయానికి సహకరించినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ట్రంప్ 2017 జనవరి 20 నుంచి 2021 జనవరి 20వ తేదీ దాకా అగ్రరాజ్యానికి 45వ అధ్యక్షుడిగా సేవలందించారు. పన్ను సంస్కరణలు, వలస విధానం, విదేశీ వ్యవహారాలపై ట్రంప్ ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. కొన్ని కీలకమైన పన్నులను తగ్గించారు. విదేశాలతో వాణిజ్య ఒప్పందాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. నాలుగేళ్ల పాలనలో యుద్ధాలకు దూరంగా ఉన్నారు. కానీ, చైనాతో వాణిజ్య యుద్ధానికి తెరతీశారు. శత్రుదేశంగా భావించే ఉత్తర కొరియాలో కాలుమోపిన తొలి అమెరికా అధ్యక్షుడిగా(పదవిలో ఉండగానే) ట్రంప్ చరిత్రకెక్కారు. వలసలపై కొంత కఠినంగానే వ్యవహరించారు. కొన్ని ఇస్లామిక్ దేశాల నుంచి ప్రజలు అమెరికాకు రాకుండా నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికా–మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మించేందుకు సైనిక నిధులను మళ్లించారు. తన పదవీ కాలంలో ముగ్గురిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా నియమించారు. ట్రంప్ పాలనలోనే కోవిడ్–19 మహమ్మారి వచ్చిపడింది. ఈ విపత్తును ఎదుర్కోవడంలో ట్రంప్ తీవ్ర అలసత్వం వహించారన్న ఆరోపణలు వచ్చాయి. వాతావరణ మార్పులకు సంబంధించిన పారిస్ ఒప్పందం, ఇరాన్‌తో అణు ఒప్పందం నుంచి వైదొలిగారు. ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్‌తో మూడుసార్లు సమావేశమయ్యారు. కానీ, అణ్వాయుధాల నియంత్రణ దిశగా ఆయనను ఓప్పించలేకపోయారు. ట్రంప్ వేగంగా, స్థిరంగా నిర్ణయాలు తీసుకుంటారన్న పేరుంది. అదే ఆయనను బలమైన నాయకుడిగా మార్చింది. రెండు సార్లు అభిశంసన అధ్యక్షుడిగా ట్రంప్ పాలనాకాలం పలు వివాదాలతో గడిచింది. శృంగార తార స్మార్మీ డేనియల్స్‌కు చెల్లించిన సొమ్మును రికార్డుల్లో చూపించకుండా వాటిని తారుమారు చేసిన ‘హష్ మనీ’ కేసులో న్యూయార్క్ కోర్టు ఈ ఏడాది మే నెలలో ట్రంప్‌ను దోషిగా తేల్చింది. ఒక నేరంలో అమెరికా అధ్యక్షుడు దోషిగా తేలడం ఇదే మొదటిసారి. ఈ కేసులో ట్రంప్‌కు ఇంకా శిక్ష విధించలేదు. మరికొన్ని కేసుల్లోనూ ఆయనపై ఆరోపణలు వచ్చాయి. అమెరికా కాంగ్రెస్‌లో దిగువ సభ అయిన ప్రతినిధుల సభలో ట్రంప్ రెండుసార్లు అభిశంసనకు(ఇంపీచ్మెంట్) గురయ్యారు. ఉక్రెయిన్ విషయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో 2019 డిసెంబర్లో అభిశంసనను ఎదుర్కొన్నారు. తన మద్దతుదారులతో క్యాపిటల్ భవనం వద్ద ఘర్షణను ప్రేరేపించినట్లు విమర్శలు వెల్లువెత్తడంతో 2021 జనవరిలో మరోసారి అభిశంసనకు గురయ్యారు. రెండుసార్లు అభిశంసనకు గురైన తొలి అధ్యక్షుడిగా అపకీర్తి పొందారు. అయితే, కాంగ్రెస్‌లో ఎగువ సభ అయిన సెనేట్ మాత్రం ఈ రెండు సందర్భాల్లో ట్రంప్‌ను నిర్దోషిగా తేల్చింది. 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ చేతిలో పరాజయం పాలయ్యారు. అయినప్పటికీ రిపబ్లికన్ పార్టీలో ట్రంప్ ప్రభావం చెక్కుచెదరలేదు. అందుకే అదే పార్టీ నుంచి మరోసారి పోటీ చేయగలిగారు. ఈ ఏడాది ఎన్నికల ప్రచారంలో ఉండగా ఆయనపై రెండుసార్లు హత్యాయత్నం జరిగింది. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారు. మాజీ అధ్యక్షుడిగానూ ట్రంప్ నిత్యం వార్తల్లో వ్యక్తిగా నిలవడం కావడం విశేషం. కేసులు, విచారణలతో ట్రంప్ పేరు ప్రపంచవ్యాప్తంగా ప్రజల నోట్లో నానింది. 3 వివాహాలు.. ఐదుగురు సంతానం 78 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్ కుటుంబం పెద్దదే. మూడు వివాహాలు చేసుకున్నారు. తొలుత చెక్ రిపబ్లిక్కు చెందిన మోడల్ ఇవానాను పెళ్లాడారు. 1977 నుంచి 1990 దాకా ఆమెతో కలిసున్నారు. తర్వాత విడాకులు తీసుకున్నారు. అనంతరం సినీ నటి మార్లా మాపిల్స్‌ను వివాహం చేసుకున్నారు. 1993 నుంచి 1999 దాకా వారి బంధం కొనసాగింది. విడాకులతో వేరయ్యారు. 2005లో స్లొవేనియా మోడల్ మెలాని యాతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఇరువురూ కలిసే ఉంటున్నారు. ట్రంప్‌కు ముగ్గురు భార్యలతో మొత్తం ఐదుగురు సంతానం ఉన్నారు. మొదటి భార్య ఇవానాతో డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఇవాంక, ఎరిక్, రెండో భార్య మార్లాతో టిఫానీ జన్మించారు. మూడో భార్య మెలానియాతో బారోన్ ట్రంప్ జన్మించాడు. మద్యం, సిగరెట్, డ్రగ్స్ తీసుకోవడం తనకు అలవాటు లేదని ట్రంప్ పలు సందర్భాల్లో చెప్పారు. ఆయన రోజుకు నాలుగు నుంచి ఐదు గంటలు మాత్రమే నిద్రిస్తారు. ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యం ఇస్తారు. గోల్ఫ్ ఆయనకు ఇష్టమైన క్రీడ. అదే ఆయన వ్యాయామం కూడా. ఇతర వ్యాయామాలేవీ చేయరు. నడక(వాకింగ్) కూడా పెద్దగా ఇష్టపడరు. మానవ శరీరం ఒక బ్యాటరీ లాంటిదని, అందులో సహజంగానే మనిషికి కావాల్సిన శక్తి ఉంటుందని, వ్యాయామాలతో ఆ శక్తి హరించుకుపోతుందని ట్రంప్ నమ్ముతారు. ట్రంప్ రికార్డులు→ ట్రంప్ ఖాతాలో అరుదైన ఘనత చేరింది. ఒక విరామం తర్వాత మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇలా జరగడం గత 132 ఏళ్లలో ఇదే తొలిసారి. గ్రోవర్ క్లీవ్‌లాండ్ తర్వాత ఈ రికార్డు ట్రంప్ సొంతమైంది. క్లీవ్‌లాండ్ 1885 నుంచి 1889 దాకా 22వ అధ్యక్షుడిగా, 1893 నుంచి 1897 దాకా 24వ అధ్యక్షుడిగా పనిచేశారు. ట్రంప్ 2017 నుంచి 2021 వరకు ఒకసారి అధ్యక్షుడిగా వ్యవహరించారు. మధ్యలో ఒక విరామంతో 2025 నుంచి 2029 దాకా మరో సారి అధ్యక్షుడిగా పని చేయబోతున్నారు. → 78 ఏళ్ల వయసులో ట్రంప్ మరోసారి అధ్యక్ష ఎన్నిక ల్లో గెలిచారు. అమెరికా చరిత్రలో అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గిన అత్యంత వృద్ధుడు ట్రంప్. → గత 20 సంవత్సరాల్లో పాపులర్ ఓటుతో గెలిచిన మొదటి రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్చరిత్రలో అతిపెద్ద పునరాగమనం నాలుగేళ్ల క్రితం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల ఫలితాలను జీర్ణించుకోలేక ఆయన అభిమానులు రాజధాని వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ భవనం వద్ద వీరంగం సృష్టించారు. వారి నిరసన హింసాత్మకంగా మారింది. ఈ వ్యవహారం చివరకు ట్రంప్ మెడకు చుట్టుకుంది. 2020 నాటి ఎన్నికల్లో పరాజయంతో ట్రంప్ రాజకీయ జీవితం ముగిసినట్లేనని అప్పట్లో రాజకీయ పరిశీలకులు తేల్చిచెప్పారు. పలు వివాదాల్లో ఇరుక్కుపోవడంతోపాటు హష్ మనీ కేసులో దోషిగా తేలిన ట్రంప్ ఇక ఎప్పటికీ రాజకీయ రంగంలో కనిపించే అవకాశం లేదని వాదించారు. వారి అభిప్రాయాలను ఫటాపంచలు చేస్తూ ట్రంప్ మరోసారి సమరోత్సాహంతో దూసుకొచ్చారు. 78 ఏళ్ల వయసులో అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. సరిగ్గా నాలుగేళ్ల తర్వాత మరోసారి వైట్‌హౌస్‌లో కాలు పెట్టబోతున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
US Election 2024 నాన్సీ పెలోసీ వరుసగా 20వ సారి గెలుపు, ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒక విశేషం చోటు చేసుకుంది. 2024 అమెరికా ఎన్నికల ఫలితాలతో కాలిఫోర్నియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న డెమోక్రటిక్ ప్రతినిధి నాన్సీ పెలోసి యుఎస్ హౌస్ స్థానానికి తిరిగి ఎన్నికయ్యారు. దీంతో ఈ స్థానం నుంచి వరుసగా 20 సార్లు గెలుపొందిన మహిళగా ఖ్యాతి దక్కించుకున్నారు. అంతేకాదు హౌస్ స్పీకర్‌గా ఎన్నికైన తొలి మహిళ కూడా నాన్సీ పెలోసి రికార్డు సృష్టించిన ఘనత కూడా ఆమె సొంతం. 1987లో తొలిసారిగా కాలిఫోర్నియాలో జరిగిన ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. 2003 నుండి హౌస్ డెమొక్రాట్లకు నాయకత్వం వహించారు. హౌస్ ఆఫ్ కాంగ్రెస్‌లో ప్రధాన పార్టీకి నాయకత్వం వహించిన తొలి మహిళ. 2007- 2011 వరకు, తిరిగి 2019- 2023 వరకు హౌస్ స్పీకర్‌గా వ్యవహరించారు. ఎక్కువ కాలం పనిచేసిన హౌస్ డెమోక్రాటిక్ నాయకురాలు పెలోసి. అలాగే చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన హౌస్ స్పీకర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. ఎఫర్డబుల్ కేర్ రక్షణ చట్టంతో సహా కొన్ని కీలకమైన చట్టాలను ఆమోదించడంలో పెలోసి కీలక పాత్ర పోషించారు. అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై అభిశంసన లాంటి ఇతర ముఖ్యమైన సందర్భాలలో పార్టీలో ఆమె పాత్ర కీలకం.రాజకీయ వారసత్వం: రాజకీయంగా చురుకైన కుటుంబం నుండి వచ్చారు. నాన్సీ పెలోసి బాల్టిమోర్‌లో జన్మించారు. ఆమె తండ్రి రాజకీయ మేత్త మేయర్ , కాంగ్రెస్ సభ్యుడు థామస్ డి'అలెసాండ్రో జూనియర్. వాషింగ్టన్ ట్రినిటీ కళాశాల నుండి నాన్సీ 1962లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. వ్యాపారవేత్త పాల్ పెలోసిని వివాహం చేసున్నారు. -
శ్రీలంక అధ్యక్షుడు దిస్సనాయకే
కొలంబో: శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికల్లో మార్క్సిస్ట్ నేత అనూర కుమార దిస్సనాయకే (56) విజయం సాధించారు. దేశ ఎన్నికల చరిత్రలోనే తొలిసారిగా రెండో రౌండ్ ఓట్ల లెక్కింపులో ఫలితం తేలడం విశేషం. జనతా విముక్తి పెరమున అధినేత అయిన దిస్సనాయకే తన సమీప ప్రత్యరి్థ, ఎస్‌జేబీ నేత సజిత్ ప్రేమదాసపై విజయం సాధించారు. అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే (75) తొలి రౌండ్లోనే వైదొలి గారు. తొలి రౌండ్ ఓట్ల లెక్కింపులో దిస్సనాయకే 42.31% ఓట్లతో తొలి స్థానంలో, ప్రేమదాస 32.8 శాతంతో రెండో స్థానంలో నిలవగా విక్రమసింఘే 17.27 శాతంతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. అయితే ఏ ఒక్కరికీ విజయానికి కావాల్సిన 50 శాతం రాకపోవడంతో ద్వితీయ ప్రాధమ్య ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతను తేల్చారు. శ్రీలంక 9వ అధ్యక్షుడిగా దిస్సనాయకే సోమవారం ప్రమాణం చేస్తారని నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్పీపీ) ప్రకటించింది. దిస్సనాయకేకు భారత ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.ఏకేడీ.. ఎట్టకేలకు! ఏకేడీగా పిలుచుకునే అనూర దిస్సనాయకే నార్త్ సెంట్రల్ ప్రావిన్స్ లోని థంబుట్టెగామలో జన్మించారు. కొలంబో సమీపంలోని కెలనియా యూనివర్సిటీలో డిగ్రీ చదువుకున్నారు. 1987లో జేవీపీలో చేరారు. 1971, 1987, 1990ల్లో ప్రభుత్వాలను కూలదోసేందుకు జేవీపీ హింసా మార్గం తొక్కింది. ఇది భారత వ్యతిరేకి కూడా. అప్పట్లో రాజీవ్ గాం«దీ–జయవర్థనే ప్రభుత్వాల ఒప్పందం శ్రీలంక సార్వ¿ౌమత్వానికి భంగకరమని భావించేది. గత ఫిబ్రవరిలో దిస్సనాయకే భారత్‌లో పర్యటించాక పార్టీ వైఖరిలో మార్పువచి్చంది. 90ల్లో జేవీపీ ప్రజాస్వామ్య విధానాల పట్ల మొగ్గాక పారీ్టలో దిస్సనాయకేకు ప్రాధాన్యం పెరిగింది. 2000 ఎన్నికల్లో మొదటిసారి ఎంపీ అయ్యారు. 2014లో పార్టీ అధ్యక్షుడయ్యారు. 2019 ఎన్నికల్లో జేవీపీకి దక్కిన ఓట్లు కేవలం మూడు శాతమే. -
US Open 2024: సభలెంకా... విజయ ఢంకా
న్యూయార్క్: గత మూడేళ్లుగా ఊరిస్తున్న యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌ను బెలారస్ స్టార్ అరీనా సబలెంకా నాలుగో ప్రయత్నంలో సొంతం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ సబలెంకా 7–5, 7–5తో ప్రపంచ ఆరో ర్యాంకర్ జెస్సికా పెగూలా (అమెరికా)పై గెలిచింది. గంటా 53 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సబలెంకా కీలకదశలో పాయింట్లు గెలిచి విజయాన్ని ఖరారు చేసుకుంది. విజేతగా నిలిచిన సబలెంకాకు 36 లక్షల డాలర్లు (రూ. 30 కోట్ల 23 లక్షలు), రన్నరప్ జెస్సికా పెగూలాకు 18 లక్షల డాలర్లు (రూ. 15 కోట్ల 11 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఈ టోర్నీలో గత ఏడాది రన్నరప్‌గా నిలిచిన సబలెంకా 2021, 2022లలో సెమీఫైనల్లో ని్రష్కమించింది. తన కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడిన పెగూలా అనుభవరాహిత్యంతో ఓటమి పాలైంది. తొలి సెట్ కోల్పోయినప్పటికీ రెండో సెట్లో కోలుకున్న పెగూలా 5–3తో ఆధిక్యంలోకి వెళ్లింది. మరో గేమ్ గెలిచిఉంటే పెగూలా రెండో సెట్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచేది. కానీ కెరీర్లో నాలుగో గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతున్న సబలెంకా తన ప్రత్యర్థికి అలాంటి అవకాశం ఇవ్వలేదు. ఒక్కసారిగా విజృంభించిన ఈ బెలారస్ స్టార్ వరుసగా నాలుగు గేమ్‌లు గెల్చుకొని 7–5తో సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. సబలెంకా కెరీర్లో ఇది మూడో గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్. 2023, 2024 ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన సబలెంకా తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను దక్కించుకుంది. 2019లో నాన్న చనిపోయాక మా ఇంటìæపేరును టెన్నిస్ చరిత్రలో భాగంగా చేయాలనే లక్ష్యంతో ముందుకుసాగాను. నా టెన్నిస్ ప్రయాణం నిరాటంకంగా, ఎల్లవేళలా కొనసాగేందుకు నా కుటుంబ సభ్యులు ఎంతో కృషి చేశారు. గత మూడేళ్లుగా ఈ టోరీ్నలో నేను ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను. టోర్నీలలో విన్నర్స్ ట్రోఫీపై నా పేరు చూసుకుంటున్నపుడు ఎంతో గర్వంగా అనిపిస్తుంది. –సబలెంకా -
US Open 2024: జ్వెరెవ్ శుభారంభం
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) శుభారంభం చేశాడు. సోమవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో నాలుగో సీడ్ జ్వెరెవ్ 6–2, 6–7 (5/7), 6–3, 6–2తో మాక్సిమిలన్ మార్టెరర్ (జర్మనీ)పై గెలుపొందాడు. 2 గంటల 53 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జ్వెరెవ్ 21 ఏస్‌లు సంధించాడు. తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి ప్రత్యర్థి సరీ్వస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. మరోవైపు 2020 చాంపియన్ డొమినిక్ థీమ్ (ఆ్రస్టియా) తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. 13వ సీడ్ బెన్ షెల్టన్ (అమెరికా) గంటా 50 నిమిషాల్లో 6–4, 6–2, 6–2తో థీమ్‌ను ఓడించి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. మహిళల సింగిల్స్‌లో ఏడో సీడ్ కిన్వెన్ జెంగ్ (చైనా) కష్టపడి రెండో రౌండ్లోకి అడుగు పెట్టింది. తొలి రౌండ్లో కిన్వెన్ జెంగ్ 4–6, 6–4, 6–2తో అనిసిమోవా (అమెరికా)పై గెలిచింది. 12వ సీడ్ దరియా కసత్కినా (రష్యా), 24వ సీడ్ డొనా వెకిచ్ (క్రొయేíÙయా), 27వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) కూడా తొలి రౌండ్లో గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించారు. మరోవైపు తొమ్మిదో సీడ్ మరియా సాకరి (గ్రీస్) గాయం కారణంగా తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. యఫాన్ వాంగ్ (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో సాకరి తొలి సెట్‌ను 2–6తో కోల్పోయింది. ఈ దశల గాయం కారణంగా సాకరి మ్యాచ్ నుంచి తప్పుకుంది. -
సాహో బల్లెం వీరుడా.. రజతంతో మెరిసిన నీరజ్ (ఫొటోలు)
-
48 ఓట్ల అత్యల్ప మెజారిటీతో గెలుపు!
ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజారిటీయే కాదు.. అత్యల్ప మెజారిటీ కూడా నమోదైంది. మహారాష్ట్రలోని ముంబై వాయవ్య నియోజకవర్గంలో అనూహ్య ఫలితం వెలువడింది. శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) వర్సెస్ శివసేన (సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని పార్టీ) పోరు హోరాహోరీగా సాగింది. ఈ పోరులో చివరి వరకు విజయం ఇరుపక్షాల మధ్య దోబూచులాడింది. చివరకు కేవలం 48 ఓట్ల అతితక్కువ మెజారిటీతో శివసేన అభ్యర్థి రవీంద్ర దత్తారాం వాయ్‌కర్ తన సమీప ప్రత్యర్థి అమోల్ కీర్తికర్‌పై గెలుపొందారు. వాయ్‌కర్‌కు 4,52,644 ఓట్లు లభించగా అమోల్‌కు 4,52,596 ఓట్లు లభించాయి. రౌండ్ రౌండ్‌కు ఆధిక్యం ఇరు పారీ్టల అభ్యర్థుల మధ్య మారుతూ వచి్చంది. ఒక రౌండ్లో అయితే అమోల్ కేవలం ఒక ఓటుతో ఆధిక్యంలో కాసేపు కొనసాగారు. ఈ ఎన్నికల్లో కేరళలోని అత్తింగల్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అదూర్ ప్రకాశ్ కేవలం 684 ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్థిపై విజయం సాధించారు. రాజస్తాన్‌లోని జైపూర్ రూరల్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి రావు రాజేంద్ర సింగ్ 1,615 ఓట్ల తేడాతో గెలిచారు. చత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ నుంచి బీజేపీ అభ్యర్థి భోజ్‌రాజ్ నాగ్ 1,884 ఓట్ల తేడాతో విజయం కైవసం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థి ముకేశ్ రాజ్‌పుత్ 2,678 ఓట్ల తేడాతో నెగ్గారు. -
WPL 2024: ప్లేఆఫ్స్‌కు ఢిల్లీ
న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో గత ఏడాది రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఏడాదీ ప్లేఆఫ్స్ దశకు అర్హత సాధించింది. ఆదివారం ఆఖరి బంతిదాకా సాగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ పరుగు తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుపై గెలుపొందింది. ఈ సీజన్లో ఢిల్లీకిది ఐదో విజయం. మొదట ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. పవర్‌ప్లేలో ఓపెనర్లు మెగ్ లానింగ్ (26 బంతుల్లో 29; 5 ఫోర్లు), షఫాలీ వర్మ (18 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్) 54 పరుగులతో శుభారంభమిచ్చారు. తర్వాత ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జెమీమా రోడ్రిగ్స్ (36 బంతుల్లో 58; 8 ఫోర్లు, 1 సిక్స్), అలైస్ క్యాప్సీ (32 బంతుల్లో 48; 8 ఫోర్లు) క్రీజులో ఉన్నంతసేపు స్కోరు బోర్డును ఉరుకులు పెట్టించారు. మూడో వికెట్‌కు ఇద్దరు కలిసి 61 బంతుల్లోనే 97 పరుగులు జోడించారు. జెమీమా 26 బంతుల్లో అర్ధసెంచరీ సాధించింది. స్పిన్నర్ శ్రేయాంక 4 వికెట్లు తీసింది. అనంతరం బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసి ఓడింది. ఓపెనర్, కెపె్టన్ స్మృతి మంధాన (5) విఫలమైనా... టాపార్డర్‌లో సోఫీ మోలినెక్స్ (30 బంతుల్లో 33; 5 ఫోర్లు), ఎలీస్ పెరీ (32 బంతుల్లో 49; 7 ఫోర్లు, 1 సిక్స్) బెంగళూరును నడిపించారు. ఓవర్ వ్యవధిలో ఇద్దరు పెవిలియన్ చేరారు. ఈ దశలో రిచా ఘోష్ (29 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), సోఫీ డివైన్ (16 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్స్‌లు) మ్యాచ్‌పై ఆశలు రేపారు. చివరి ఓవర్లో బెంగళూరు విజయానికి 17 పరుగులు కావాల్సి ఉండగా, రిచా రెండు భారీ సిక్స్‌లు బాదింది. ఒక బంతి 2 పరుగుల విజయ సమీకరణం వద్ద రిచా రనౌట్ కావడంతో పరుగు తేడాతో ఢిల్లీ గట్టెక్కింది. నేడు గుజరాత్ జెయింట్స్‌తో యూపీ వారియర్స్ తలపడుతుంది. 10 పాయింట్లతో ముంబై ఇండియన్స్, ఢిల్లీ ఇప్పటికే ‘ప్లే ఆఫ్స్’ చేరగా... ఆరు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న యూపీ ప్లే ఆఫ్స్ దశకు అర్హత పొందే అవకాశాలు సజీవంగా ఉండాలంటే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో గుజరాత్‌పై తప్పనిసరిగా గెలవాలి. -
WPL 2024: సూపర్ స్మృతి...
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోరీ్నలో తొలి అంచెపోటీలను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు విజయంతో ముగించింది. ఓపెనర్, కెపె్టన్ స్మృతి మంధాన (50 బంతుల్లో 80; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), టాపార్డర్ బ్యాటర్ ఎలీస్ పెరీ (37 బంతుల్లో 58; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగడంతో బెంగళూరు 23 పరుగుల తేడాతో యూపీ వారియర్స్‌పై గెలుపొందింది. ఈ లీగ్‌లో ఆర్సీబీకిది మూడో విజయం. మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిరీ్ణత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ఆంధ్ర అమ్మాయి సబ్బినేని మేఘన (21 బంతుల్లో 28; 5 ఫోర్లు)తో ఒపెనింగ్ వికెట్‌కు చకచకా 51 పరుగులు జతచేసిన స్మృతి ఆ తర్వాత పెరీ అండతో దూకుడు పెంచింది. ఇద్దరు ధనాధన్ ఆటతీరు కనబరచడంతో యూపీ బౌలర్లకు కష్టాలు తప్పలేదు. రెండో వికెట్‌కు 10.4 ఓవర్లలో 95 పరుగులు జతచేశారు. మంధాన 34 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. 146 పరుగుల వద్ద స్మృతి ని్రష్కమించగా, 33 బంతుల్లో అర్ధశతకం సాధించిన పెరీ ఆఖరి ఓవర్లో అవుటైంది. రిచా ఘోష్ (10 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) మెరిపించింది. ఆంధ్ర అమ్మాయి అంజలి శర్వాణి, దీప్తి శర్మ, సోఫీ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం భారీలక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యూపీ వారియర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేయగలిగింది. కెపె్టన్, ఓపెనర్ అలీసా హీలీ (38 బంతుల్లో 55; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) పవర్‌ప్లేలో దంచేసింది. మరో ఓపెనర్ కిరణ్ నవ్‌గిరే (18) సహా చమరి ఆటపట్టు (8), గ్రేస్ హారిస్ (5), శ్వేత సెహ్రావత్ (1) స్వల్ప వ్యవధిలో ని్రష్కమించడంతో యూపీ లక్ష్యానికి దూరమైంది. దీప్తి శర్మ (22 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్), పూనమ్ (24 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్) కాసేపు పోరాడారు. నేటి నుంచి ఢిల్లీ వేదికపై రెండో అంచె పోటీలు జరుగుతాయి. మంగళవారం జరిగే పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడుతుంది. -
కుమారులకి వంట నేర్పిస్తే.. ఏం జరుగుతుందో ఈ అమ్మ చూపించింది!
బహుశా ‘మాస్టర్ చెఫ్‘ విజేతగా 25 లక్షలు ఇంటికి తీసుకొస్తాడు. అబ్బాయిలు వంట గదిలోకి వస్తే ‘ఏంట్రా ఆడపిల్లలాగా‘ అని మందలిస్తారు. కాని వంట స్త్రీలకూ, పురుషులకూ రావాలి. పిల్లలు ఎంత బాగా చదువుకున్నా వారికి కొద్దో గొప్పో వంట తెలిసుండాలి. ‘మాస్టర్ చెఫ్’ తాజా విజేత ఆషిక్ మా అమ్మ నేర్పిన వంట వల్లే గెలిచాను అన్నాడు. మంగళూరులో చిన్న జ్యూస్ షాప్ నడుపుకునే ఆషిక్ ఇంత పెద్ద గెలుపుతో ప్రపంచాన్ని ఆకర్షించాడు. ‘సోనీ లివ్’ చానల్ వారి ప్రఖ్యాత రియాలిటీ షో ‘మాస్టర్ షెఫ్’ సీజన్ 8 ఆడిషన్స్ రౌండ్లో ఆషిక్ చేసిన మంగళూరు స్టయిల్ ఫిష్ ఫ్రైను జడ్జీలు వెంటనే ఓకే చేయలేదు. ‘కొంత బాగుంది కొంత బాగలేదు. మళ్లీ చెప్తాం’ అన్నారు. కాని ఆ తర్వాత ఆషిక్‌కు అవకాశం ఇచ్చారు. అప్పటినుంచి అంటే అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 8 ఫైనల్స్ వరకూ ఆషిక్ చేసిన వంటకాల ప్రయాణం ఉద్వేగభరితంగానే సాగింది. ఎందుకంటే అతడు వంటను శాస్త్రోక్తంగా నేర్చుకోలేదు. అమ్మ దగ్గర ఇంట్లో వంటగదిలో నేర్చుకున్నాడు. 24 ఏళ్ల కుర్రాడు మంగళూరుకు చెందిన ఆషిక్ వయసు 24 ఏళ్లు. దిగువ మధ్యతరగతి కుటుంబం. ఇంటర్ తర్వాత హోటల్ మేనేజ్మెంట్ చేద్దామనుకున్నాడు. కాని ఫీజు కట్టే పరిస్థితి లేక కట్టలేదు. ఏం చేయాలి. వంట బాగా వచ్చు. యూ ట్యూబ్‌లో చూసి రకరకాల వంటకాలు చేయడం నేర్చుకున్నాడు. దానికి కారణం చిన్నప్పటి నుంచి అతని ఆటలన్నీ వంట గదిలోనే సాగేవి. నానమ్మ వంట చేస్తుంటే అక్కడే కూచుని చెంబులు తప్పేళాలతో ఆడుకునేవాడు. అమ్మ హయాం వచ్చేసరికి వంటలో సాయం పట్టడం మొదలెట్టాడు. తల్లి – ‘ఏమిటీ ఆడంగి పనులు’ అని తిట్టకుండా కొడుకును ప్రోత్సహించింది. ఇంటికి ఎవరొచ్చినా ఆషిక్ వంట చేసే పద్ధతి చూసి ఆశ్చర్యపోయేవారు. ఆ ఆత్మవిశ్వాసంతో మంగళూరులో ‘కులుక్కి’ పేరుతో చిన్న జ్యూస్ షాప్ పెట్టాడు ఆషిక్. అయితే అది సగటు జ్యూస్షాప్ కాదు. ఆషిక్ కనిపెట్టిన రకరకాల ఫ్లేవర్లు, మిక్స్డ్ కాంబినేషన్లు అందులో దొరుకుతాయి. జనం బాగా కనెక్ట్ అయ్యారు. అతని జ్యూస్ షాప్ మంచి హిట్. కాని ఇంకా జీవితంలో సాధించాలి అంటే ఏదైనా పెద్దగా చేయాలనుకున్నాడు ఆషిక్. ‘మాస్టర్ షెఫ్’ అందుకు వేదికగా నిలిచింది. విఫలమైనా ముందుకే 2022 మాస్టర్ షెఫ్ ఆడిషన్స్‌కు వచ్చిన ఆషిక్ రిజెక్ట్ అయ్యాడు. ‘చాలా డిప్రెషన్లోకి వెళ్లాను. మళ్లీ ఏమీ వండలేననే అనుకున్నాను. కాని సాధించాలి... మనసుపెట్టి పోరాడాలి అని నిశ్చయించుకున్నాను. 2023 ఆడిషన్స్ వచ్చేవేళకు చాలా కష్టపడి తర్ఫీదు అయ్యాను సొంతగా. షో ముందుకు వెళ్లేకొద్దీ సవాళ్లు ఎదురైనా ఛేదిస్తూ విజేతగా నిలిచాను’ అన్నాడు ఆషిక్. ఫైనల్స్ ఎపిసోడ్లో ఆషిక్ తల్లిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆమె సమక్షంలోనే ఆషిక్‌ను విజేతగా ప్రకటించారు. కొడుకు విజేత అవుతాడో లేదోనని ఆమె ఉత్కంఠగా ఎదురు చూసింది. ఆపై కొడుకు విజయానికి పులకించిపోయింది. కాగా ఈ సీజన్లో మేఘాలయాకు చెందిన స్కూల్ ప్రిన్సిపల్ నంబి మొదటి రన్నర్ అప్‌గా, జమ్ము–కశ్మీర్‌కు చెందిన రుక్సర్ అనే ఫుడ్ టెక్నిషియన్ సెకండ్ రన్నర్ అప్‌గా నిలిచారు. ప్రసిద్ధ షెఫ్‌లు వికాస్ ఖన్నా, రణ్వీర్ బ్రార్, గరిమా అరోర జడ్జీలుగా వ్యవహరించారు. రొయ్యలతో ఆషిక్ చేసిన ‘క్రిస్పీ ప్యారడైజ్’ అనే వంటకాన్ని రుచి చూసిన జడ్జ్ రణ్వీర్ బ్రార్ తన సంతకం కలిగిన కిచెన్ నైఫ్ బహూకరించడం విశేషం. హోటల్ రంగంలోగాని, స్వయం ఉపాధికిగాని పాకశాస్త్రం నేడు చాలా అవసరంగా ఉంది. మంచి షెఫ్‌లకు చాలా డిమాండ్ ఉంది. అదెలా ఉన్నా తెల్లారి లేస్తే మూడుపూట్లా తినాలి కనుక, వంట కేవలం ఆడవారి వ్యవహారం అనే భావన పోయి, ఇకమీదైనా అబ్బాయిలకు తల్లులు కనీసం అవసరమైనంత వంట నేర్పడం మంచింది. ఏమో... వారు ఇంకా బాగా నేర్చుకుంటే మరో మాస్టర్ షెఫ్ అవుతారేమో. ఏ ప్లేట్‌కు ఏ పదార్థం రాసి పెట్టుందో ఎవరు (రుచి) చూసొచ్చారు కనుక. (చదవండి: ఆ మహిళ కడుపునొప్పే షాకివ్వగా..బయటపడ్డ మరో ట్విస్ట్ చూసి కంగుతిన్న వైద్యులు) -
Rajasthan: బీజేపీ జయ భేరి... 115 స్థానాల్లో ఘన విజయం
జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జయ భేరి మోగించింది. 115 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. రాజస్థాన్‌లో మొత్తం 200 స్థానాలు ఉండగా ఒక చోట అభ్యర్థి మరణించడంతో అక్కడ ఎన్నిక వాయిదా వేశారు. దీంతో 199 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ గెలుపు 69 స్థానాలకే పరిమితమైంది. దీంతో అధికారాన్ని ఆ పార్టీ కోల్పోయింది. ఇక భారత్ ఆదివాసీ పార్టీ 3 సీట్లు గెలుచుకుని ప్రభావం చూపింది. బీఎస్పీ సైతం 2 స్థానాల్లో గెలుపొందింది. రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ), రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్టీపీ)లకు ఒక్కొక్క సీటు దక్కాయి. మరోవైపు 8 చోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. రాజస్థాన్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 100 స్థానాలు అవసరం కాగా బీజేపీ 115 సీట్లు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమైంది. -
అర్జెంటీనా అధ్యక్ష ఎన్నికల్లో జేవియర్ ఘన విజయం
బ్యూనోస్ ఎయిరీస్ (అర్జెంటీనా): అర్జెంటీనా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ ఆర్థికవేత్త, టీవీ విశ్లేషకుడు జేవియర్ మిలే ఘన విజయం సాధించారు. ఆర్థిక మంత్రి సెర్గియో మస్సాను మట్టికరిపిస్తూ 55.7 శాతం ఓట్లతో అధికారాన్ని కైవసం చేసుకున్నారు. 99.4 శాతం ఓట్లను లెక్కించగా ప్రత్యర్థి సెర్గియోకు 44.3 శాతం ఓట్లు పడ్డాయి. ఈ దక్షిణ అమెరికా దేశంలో 1983లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చూస్తే ఒక నేతకు అధిక మెజారిటీ రావడం ఇదే తొలిసారి. -
ఫ్యాన్ ప్రభంజనం.. హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎదురుదెబ్బ
సాక్షి, అనంతపురం జిల్లా: ఎన్నిక ఏదైనా, ఎప్పుడొచ్చినా వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టిస్తోంది. ఫ్యాన్ స్పీడ్‌కు ప్రత్యర్థులు నలవలేకపోతున్నారు. తాజాగా, పలు పంచాయితీలు, వార్డులకు జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులు విజయం సాధించారు. దీంతో వైఎస్సార్సీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎదురుదెబ్బ తగిలింది. చలివెందుల పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారు విజయం సాధించారు. 337 ఓట్లతో సర్పంచ్‌గా ఉపేంద్రరెడ్డి గెలుపొందారు. తాడిపత్రిలో.. తాడిపత్రిలో జేసీ బ్రదర్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. జేసీ సొంత మండలం పెద్దపప్పూరులో టీడీపీ ఓటమి చెందింది. దేవునుప్పలపాడు పంచాయతీలో వైఎస్సార్ సీపీ మద్దతుదారు కాటమయ్య గెలుపొందారు.తాడిపత్రి నియోజకవర్గంలో ఐదు వార్డుల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారుల ఘన విజయం సాధించారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో జరిగిన పంచాయితీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఒక్కొక్కటిగా ఫలితాలు వెలువడుతున్నాయి. మెజార్టీ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు.. బలపర్చిన అభ్యర్థులే జయకేతనం ఎగరేస్తున్నారు. మొత్తం 35 సర్పంచ్, 245 వార్డు మెంబర్ల స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. -
ఫ్రెండ్ అంకుల్ కోసం: ఇండోర్ అమ్మడి ఘనత
సాక్షి, ముంబై: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన 20 ఏళ్ల అస్మీ జైన్ ప్రఖ్యాత యాపిల్ WWDC23 స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్‌ని గెల్చుకుంది. స్విఫ్ట్ కోడింగ్ లాంగ్వేజ్‌ని ఉపయోగించి అద్భుతమైన ఒరిజినల్ యాప్‌ను రూపొందించనందుకుగాను ఈ ఘనతను దక్కించుకుంది. అస్మి జైన్‌తో పాటు, ఈ ఏడాది స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్ విజేతలలో మార్టా మిచెల్ కాలియెండో , యెమి అజెసిన్ కూడా ఉన్నారు. వార్షిక వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్‌లో (ఈసంవత్సరం జూన్ 5న)కి ముందు, యాపిల్ ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులకు స్విఫ్ట్ కోడింగ్ లాంగ్వేజ్‌ని ఉపయోగించి అసలైన యాప్ ప్లేగ్రౌండ్ చాలెంజ్‌ను నిర్వహిస్తుంది. గ్లోబల్ యాపిల్ డెవలపర్ కమ్యూనిటీకి WWDC23 ఈవెంట్‌ను వ్యక్తిగతంగా హాజరయ్యేలా ఛాలెంజ్ విజేతలకు కూడా అనుమతి ఉంటుంది. బ్రెయిన్ సర్జరీ చేయించుకున్న తన స్నేహితురాలి మేనమామకు సహాయం చేసేలా యాప్‌ను రూపొందించి ఈ అవార్డును దక్కించుకుంది. బ్రెయిన్ సర్జరీ కారణంగా కంటి అంగ వైకల్యంతో పాటు ముఖం పక్షవాతానికి గురైంది. దీంతో ఇండోర్‌లోని మెడి-క్యాప్స్ యూనివర్శిటీకి చెందిన జైన్ రంగంలోకి దిగింది. స్క్రీన్ చుట్టూ కదులుతున్న బంతిని ఫాలో అయ్యేందుకు ప్రయత్నిస్తున్న యూజర్కంటి కదలికలను ట్రాక్ చేయడానికి యాప్ ప్లేగ్రౌండ్ని డిజైన్ చేసింది. దీని ప్రాథమిక ఉద్దేశ్యం కంటి కండరాలను బలోపేతం చేయడంలో సహాయపడటం. అయితే వివిధ రకాల కంటి పరిస్థితులు, గాయాలైన సందర్భాల్లో కూడా దీనిని ఉపయోగించవచ్చని జైన్ భావిస్తోంది. ఇది ప్రభావవంతంగా, యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా చూడడమే తన తదుపరి లక్ష్యం అని కూడా చెప్పింది. (ఇండియా నిజంగా మొబైల్ తయారీ దిగ్గజంగా మారిపోయిందా? రఘురామ రాజన్ సంచలన వ్యాఖ్యలు) హెల్త్ చాలెంజెస్ ఎదుర్కొనేలా కోడింగ్‌ని ఉపయోగించి యాపల్ ప్లే గ్రౌండ్ రూపకల్పనలో పట్ల జైన్‌కు అభిరుచే ఆమెను ఈ స్థాయిలో ఉంచింది. అలాగే జైన్ తోటి విద్యార్థులతో కలిసి విశ్వవిద్యాలయంలో ఒక ఫోరమ్‌ను కూడా స్థాపించారు. ఈ ప్లాట్‌ఫారమ్ సపోర్ట్ సిస్టమ్‌గా పనిచేస్తుంది. (IPL 2023: ‘మోస్ట్ ఆర్డర్ డిష్’ టైటిల్‌ఎవరిదో తెలుసా? ) కాగా ప్రతీ ఏడాది వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్‌లో భాగంగా, స్విఫ్ట్ కోడింగ్ లాంగ్వేజ్‌ని ఉపయోగించి అసలైన యాప్ రూపొంచే చాలెంజ్ యాపిల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకిస్తుంది. గతంతో పోలిస్తే విజేతల సంఖ్యను 350 నుంచి 375కి పెంచామనీ, తద్వారా మరింత మంది ఔత్సాహిక విద్యార్థులు ఈ ఈవెంట్లో చేరవచ్చని భావించినట్టు తెలిపింది. 30 కంటే ఎక్కువ దేశాల్లో ఆరోగ్య సంరక్షణ, క్రీడలు, వినోదం, పర్యావరణం లాంటి విభిన్న టాపిక్స్ ఇందులో ఉంటాయని కంపెనీ పేర్కొంది. మరిన్ని స్ఫూర్తిదాయక, విజేతల కథనాలు, బిజినెస్ అప్డేట్స్ కోసం చదవండి : సాక్షిబిజినెస్ -
కర్ణాటకలో కాంగ్రెస్‌దే అధికారం
కర్ణాటకలో కాంగ్రెస్‌దే అధికారం -
IPL 2023: ఢిల్లీ ధనాధన్
న్యూఢిల్లీ: ఢిల్లీ క్యాపిటల్స్ ఆట ఈ మ్యాచ్ ముందువరకు తీసికట్టుగానే ఉంది. గెలిచిన మ్యాచ్‌లలో కూడా అంతంతమాత్రం పడుతూ లేస్తూ సాగిన ఆటతో పట్టికలో చివరి స్థానంలో ఉంది. అయితే శనివారం కానీ బెంగళూరుపై దంచిన తీరు, లక్ష్యఛేదనలో దూకుడు మాత్రం ఈ సీజన్లో మేటి మ్యాచ్‌లలో ఒకటిగా నిలిపింది. మెరుపుల విందు పంచిన ఈ మ్యాచ్‌లో ఓపెనర్ ఫిల్ సాల్ట్ (45 బంతుల్లో 87; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) విధ్వంస రచనతో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో బెంగళూరుపై జయభేరి మోగించింది. మొదట బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఓపెనర్లు కోహ్లి (46 బంతుల్లో 55; 5 ఫోర్లు), డుప్లెసిస్ (32 బంతుల్లో 45; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. మ్యాక్స్‌వెల్ (0) డకౌటైనా... మహిపాల్ (29 బంతుల్లో 54 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) దంచేయడంతో బెంగళూరు భారీ స్కోరు చేసింది. తర్వాత ఢిల్లీ 16.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఫిల్ సాల్ట్ ఉప్పెనకు వార్నర్ (14 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్), మార్‡్ష (17 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్), రోసో (22 బంతుల్లో 35 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్‌లు) కలిసి క్యాపిటల్స్‌ను గెలిపించారు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) ఖలీల్ (బి) ముకేశ్ 55; డుప్లెసిస్ (సి) అక్షర్ (బి) మార్‡్ష 45; మ్యాక్స్‌వెల్ (సి) సాల్ట్ (బి) మార్‡్ష 0; మహిపాల్ నాటౌట్ 54; దినేశ్ కార్తీక్ (సి) వార్నర్ (బి) ఖలీల్ 11; రావత్ నాటౌట్ 8; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 181. వికెట్ల పతనం: 1–82, 2–82, 3–137, 4–172. బౌలింగ్: ఖలీల్ 4–0–45–1, అక్షర్ 3–0–17–0, ఇషాంత్ 3–0–29–0, ముకేశ్ 3–0–30–1, మార్‡్ష 3–0–21–2, కుల్దీప్ 4–0–37–0. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) డుప్లెసిస్ (బి) హాజల్‌వుడ్ 22; సాల్ట్ (బి) కరణ్ శర్మ 87; మార్‡్ష (సి) మహిపాల్ (బి) హర్షల్ 26; రోసో నాటౌట్ 35; అక్షర్ నాటౌట్ 8; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (16.4 ఓవర్లలో 3 వికెట్లకు) 187. వికెట్ల పతనం: 1–60, 2–119, 3–171. బౌలింగ్: సిరాజ్ 2–0–28–0, మ్యాక్స్‌వెల్ 1.4–0–14–0, హాజల్‌వుడ్ 3–0–29–1, హసరంగ 4–0–32–0, కరణ్‌శర్మ 3–0–33–1, మహిపాల్ 1–0–13–0, హర్షల్ 2–0–32–1. సిరాజ్ వర్సెస్ సాల్ట్ బెంగళూరు గత మ్యాచ్‌లో కోహ్లి–గంభీర్–నవీన్ ఘటన వివాదం రేపగా...ఇప్పుడు సి రాజ్ కూడా మైదానంలో ప్రత్యర్థి ఆటగాడిపై దూషణలకు దిగాడు. సిరాజ్ ఓవర్లో సాల్ట్ వరుసగా 6, 6, 4 కొట్టగా తర్వాతి షార్ట్ పిచ్ బంతిని అంపైర్ వైడ్‌గా ప్రకటించాడు. దాంతో సిరాజ్ దూసుకుపోయి సాల్ట్‌ను ఏదో అన్నాడు. వార్నర్ వారించే ప్రయత్నం చేసినా అతను ఆగలేదు. కెప్టె న్ డుప్లెసిస్ పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది. 7000: ఐపీఎల్లో 7 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. -
IPL 2023: కోల్‌కతా ప్రతీకారం
సన్‌రైజర్స్ విజయానికి ఒకదశలో 30 బంతుల్లో 38 పరుగులే కావాలి... చేతిలో 5 వికెట్లు ఉన్నాయి. కెప్టెన్ మార్క్రమ్ కూడా అప్పుడే జోరు పెంచాడు... సొంత గడ్డపై గెలుపు ఖాయమనిపించింది. కానీ అంతా తలకిందులైంది. ఓటమి దిశగా వెళుతున్న కోల్‌కతా ఒక్కసారిగా పుంజుకుంది. పదునైన బౌలింగ్‌తో పరుగులు ఇవ్వకుండా కట్టడి చేసి చివరి వరకు ఆటను తీసుకొచ్చింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వరుణ్ చక్రవర్తి వేసిన ఆఖరి ఓవర్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా 3 పరుగులే వచ్చాయి. దాంతో నైట్‌రైడర్స్ ఊపిరి పీల్చుకోగా, రైజర్స్ నిరాశలో మునిగింది. సాక్షి, హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్‌లో ఎదురైన పరాజయానికి ఉప్పల్ స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) ప్రతీకారం తీర్చుకుంది. గురువారం జరిగిన ఈ ఐపీఎల్ మ్యాచ్‌లో కోల్‌కతా 5 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. రింకూ సింగ్ (35 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్), నితీశ్ రాణా (31 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. అనంతరం హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 166 పరుగులే చేయగలిగింది. మార్క్రమ్ (40 బంతుల్లో 41; 4 ఫోర్లు), క్లాసెన్ (20 బంతుల్లో 36; 1 ఫోర్, 3 సిక్స్‌లు) రాణించినా ఫలితం దక్కలేదు. కీలక భాగస్వామ్యం... ఒక్కరూ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడకపోయినా... కీలక ఆటగాళ్లంతా తలా ఓ చేయి వేయడంతో కోల్‌కతా చెప్పుకోదగ్గ స్కోరు సాధించగలిగింది. మార్కో జాన్సెన్ తన తొలి ఓవర్లోనే గుర్బాజ్ (0), వెంకటేశ్ అయ్యర్ (7)లను అవుట్ చేసి ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. జేసన్ రాయ్ (19 బంతుల్లో 20; 4 ఫోర్లు) కూడా ధాటిగా ఆడటంలో విఫలమయ్యాడు. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 43 పరుగులకు చేరింది. ఈ దశలో కెప్టెన్ రాణా, రింకూ కీలక భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 40 బంతుల్లో 61 పరుగులు జోడించారు. కార్తీక్ త్యాగి ఓవర్లో వరుస బంతుల్లో 4, 6, 6తో రాణా దూకుడు ప్రదర్శించాడు. అయితే మార్క్రమ్ అద్భుత క్యాచ్‌కు రాణా వెనుదిరగ్గా... ఆండ్రీ రసెల్ (15 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కూడా ఎక్కువసేపు నిలవలేదు. సన్‌రైజర్స్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఇన్నింగ్స్ చివర్లో కూడా కేకేఆర్ ఆశించినన్ని పరుగులు చేయలేకపోయింది. ఆఖరి 5 ఓవర్లలో ఆ జట్టు 42 పరుగులే సాధించింది. క్లాసెన్ మెరిసినా... ఛేదనలో రైజర్స్ కూడా తడబడింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (18), అభిషేక్ శర్మ (9)లతో పాటు తక్కువ వ్యవధిలో రాహుల్ త్రిపాఠి (9 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్), హ్యారీ బ్రూక్ (0) వికెట్లను జట్టు కోల్పోయింది. అయితే మార్క్రమ్, క్లాసెన్ భాగస్వామ్యం ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. చక్కటి షాట్లతో, సమన్వయంతో వీరిద్దరు పరుగులు రాబట్టారు. తన తొలి ఫోర్ కొట్టేందుకు మార్క్రమ్ 23 బంతులు తీసుకున్నా... అనుకూల్ రాయ్ ఓవర్లో రెండు సిక్సర్లతో క్లాసెన్ దూకుడు ప్రదర్శించాడు. ఐదో వికెట్‌కు 47 బంతుల్లో 70 పరుగులు జోడించిన అనంతరం క్లాసెన్ వెనుదిరిగాడు. అయితే మార్క్రమ్ క్రీజ్‌లో ఉన్నంత వరకు రైజర్స్ గెలుపుపై ధీమాగానే ఉంది. 20 బంతుల్లో 27 పరుగులు చేయాల్సిన స్థితిలో కెప్టెన్ వెనుదిరిగారు. తర్వాతి బ్యాటర్లు మిగిలిన పనిని పూర్తి చేయలేకపోయారు. సమద్ (18 బంతుల్లో 21; 3 ఫోర్లు) కొంత పోరాడినా లాభం లేకపోయింది. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: జేసన్ రాయ్ (సి) మయాంక్ అగర్వాల్ (బి) కార్తీక్ త్యాగి 20; గుర్బాజ్ (సి) బ్రూక్ (బి) జాన్సెన్ 0; వెంకటేశ్ అయ్యర్ (సి) క్లాసెన్ (బి) జాన్సెన్ 7; నితీశ్ రాణా (సి అండ్ బి) మార్క్రమ్ 42; రింకూ సింగ్ (సి) సమద్ (బి) నటరాజన్ 46; రసెల్ (సి) నటరాజన్ (బి) మార్కండే 24; నరైన్ (సి) మయాంక్ అగర్వాల్ (బి) భువనేశ్వర్ 1; శార్దుల్ ఠాకూర్ (సి) సమద్ (బి) నటరాజన్ 8; అనుకూల్ రాయ్ (నాటౌట్) 13; హర్షిత్ (రనౌట్) 0; వైభవ్ అరోరా (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–8, 2–16, 3–35, 4–96, 5–127, 6–130, 7–151, 8–168, 9–168. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–33–1, జాన్సెన్ 3–0–24–2, కార్తీక్ త్యాగి 2–0–30–1, మార్క్రమ్ 3–0–24–1, నటరాజన్ 4–0–30–2, మార్కండే 4–0–29–1. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (సి) రసెల్ (బి) శార్దుల్ ఠాకూర్ 9; మయాంక్ అగర్వాల్ (సి) గుర్బాజ్ (బి) హర్షిత్ 18; రాహుల్ త్రిపాఠి (సి) వైభవ్ అరోరా (బి) రసెల్ 20; మార్క్రమ్ (సి) రింకూ సింగ్ (బి) వైభవ్ అరోరా 41; హ్యారీ బ్రూక్ (ఎల్బీ) (బి) అనుకూల్ రాయ్ 0; క్లాసెన్ (సి) రసెల్ (బి) శార్దుల్ ఠాకూర్ 36; సమద్ (సి) అనుకూల్ రాయ్ (బి) వరుణ్ చక్రవర్తి 21; జాన్సెన్ (సి) గుర్బాజ్ (బి) వైభవ్ అరోరా 1; భువనేశ్వర్ (నాటౌట్) 5; మార్కండే (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1–29, 2–37, 3–53, 4–54, 5–124, 6–145, 7–152, 8–165. బౌలింగ్: హర్షిత్ 4–0–27–1, వైభవ్ 3–0–32–2, శార్దుల్ 3–0– 23–2, రసెల్ 1–0–15–1, అనుకూల్ రాయ్ 3–0–26–1, నరైన్ 2–0–16–0, వరుణ్ చక్రవర్తి 4–0–20–1. ఐపీఎల్లో నేడు రాజస్తాన్ X గుజరాత్ (రాత్రి గం. 7:30 నుంచి) స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం -
రెండేళ్ల తరువాత రోహిత్ శర్మ విధ్వంసం..
-
వరల్డ్ కార్ ఆఫ్ ద ఇయర్ ఇదే...
హ్యుందాయ్ ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ కార్ ఐయోనిక్ (Ioniq 6) న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఆటో షోలో 2023 వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. దీంతో పాటు వరల్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ అలాగే వరల్డ్ కార్ డిజైన్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను కూడా అందుకుని సత్తా చాటింది. హ్యుందాయ్ మోటార్ కంపెనీకి ఇది ఒక విజయవంతమైన క్షణం. ఎందుకంటే ఐయోనిక్6 కంటే ముందు వచ్చిన ఐయోనిక్ 5 కార్కు గతేడాది మూడు అవార్డులూ వచ్చాయి. మరో ఆనందకరమైన విషయం ఏంటంటే హ్యుందాయ్ అండ్ జెనెసిస్ గ్లోబల్ డిజైన్ సెంటర్ అధినేత, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సాంగ్యుప్ లీ ఇటీవల 2023 వరల్డ్ కార్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యారు. న్యూయార్క్ అంతర్జాతీయ ఆటో షోలో ఐయోనిక్6 తోపాటు మరికొన్ని ఇతర అసాధారణమైన వాహనాలు కూడా కొన్ని అవార్డులు అందుకున్నాయి. లూసిడ్ ఎయిర్ 2023 వరల్డ్ లగ్జరీ కార్ అవార్డును, కియా EV6 GT వరల్డ్ పెర్ఫార్మెన్స్ కార్ అవార్డును గెలుచుకున్నాయి. సిట్రోయెన్ C3 వరల్డ్ అర్బన్ కార్ అవార్డు విజేతగా నిలిచింది. భారతదేశంలో ఐయోనిక్6ను హ్యుందాయ్ ఇంకా పరిచయం చేయలేదు. అయితే ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఈ కార్‌ను ప్రదర్శించింది. వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల విజేతలను 32 దేశాల నుంచి 100 మంది ఆటోమోటివ్ జర్నలిస్టుల ప్యానెల్ ఎంపిక చేసింది. ఓవరాల్ వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు అర్హత పొందాలంటే వాటి ఉత్పత్తి పరిమాణం సంవత్సరానికి కనీసం 10,000 యూనిట్లు ఉండాలి. వాటి ధర ప్రాథమిక మార్కెట్లలో లగ్జరీ కార్ స్థాయి కంటే తక్కువ ఉండాలి. అలాగే కనీసం రెండు దేశాల్లో అమ్మకానికి అందుబాటులో ఉండాలి. -
కొంపముంచిన వాన..అయితేనేం పంజాబ్ లక్కీ ఛాన్స్
-
FIH Pro League: ‘షూటౌట్’లో భారత్ గెలుపు
రూర్కెలా: సొంతగడ్డపై ప్రొ హాకీ లీగ్ దశను భారత పురుషుల జట్టు విజయంతో ముగించింది. ఆస్ట్రేలియా జట్టుతో బుధవారం జరిగిన రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లో టీమిండియా ‘షూటౌట్’లో 4–3 గోల్స్ తేడాతో గెలుపొందింది. అంతకుముందు నిర్ణీత సమయం పూర్తయ్యాక రెండు జట్లు 2–2తో సమఉజ్జీగా నిలిచాయి. రెగ్యులర్ టైమ్‌లో భారత్ తరఫున వివేక్ సాగర్ ప్రసాద్ (2వ ని.లో), సుఖ్జీత్ సింగ్ (47వ ని.లో)... ఆస్ట్రేలియా తరఫున నాథన్ ఎఫార్మస్ (37వ ని.లో), టిమ్ హోవర్డ్ (52వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ‘షూటౌట్’లో తొలి ఐదు షాట్లలో భారత్ నుంచి కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, సుఖ్జీత్ సింగ్, దిల్‌ప్రీత్ సింగ్ సఫలమవ్వగా... హార్దిక్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్ విఫలమయ్యారు. ఆస్ట్రేలియా తరఫున జేక్ హార్వీ, క్రెయిగ్ మరైస్, జాక్ వెల్చ్ గోల్స్ చేయగా... జేక్ వెటన్, నాథన్ ఎఫార్మస్ గురి తప్పారు. దాంతో ‘షూటౌట్’లో రెండు జట్లు 3–3తో సమంగా నిలిచాయి. ‘సడెన్‌డెత్’లో తొలి షాట్‌ను హర్మన్‌ప్రీత్ గోల్‌గా మలచగా... ఆస్ట్రేలియా ప్లేయర్ జాక్ వెల్చ్ షాట్‌ను భారత గోల్‌కీపర్ శ్రీజేశ్ నిలువరించడంతో టీమిండియా విజయం ఖాయమైంది. -
హిమాచల్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిపై ఉత్కంఠ
-
FIFA World Cup Qatar 2022: ‘ఘన’మైన విజయం
దోహా: తొలి మ్యాచ్‌లో చక్కటి ప్రదర్శన కనబర్చినా... చివరకు పోర్చుగల్ ముందు తలొగ్గిన ఆఫ్రికా దేశం ఘనా తర్వాతి పోరులో సత్తా చాటింది. తమకంటే బలమైన, ర్యాంకింగ్స్‌లో ఎంతో మెరుగ్గా ఉన్న దక్షిణ కొరియాను చిత్తు చేసి గ్రూప్ ‘హెచ్’లో సమరాన్ని ఆసక్తికరంగా మార్చింది. ఈ మ్యాచ్‌లో ఘనా 3–2 గోల్స్ తేడాతో కొరియాపై విజయం సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మొహమ్మద్ కుడూస్ (34వ, 68వ ని.లో) రెండు గోల్స్‌తో చెలరేగగా, మొహమ్మద్ సలిసు (24వ ని.లో) మరో గోల్ చేశాడు. కొరియా ఆటగాడు చో గూసంగ్ (58వ, 61వ ని.లో) రెండు గోల్స్ సాధించాడు. ఘనా ఆరంభం నుంచి దూకుడుగా ఆడింది. ఆ జట్టు ఫార్వర్డ్లు దూసుకుపోవడంతో తొలి 24 నిమిషాల్లోనైతే బంతి పూర్తిగా కొరియా ఏరియాలోనే కనిపించింది. చివరకు ఘనా ఫలితం రాబట్టింది. జోర్డాన్ ఆయూ ఎడమ వైపు నుంచి కొట్టిన ఫ్రీ కిక్‌ను హెడర్‌తో కెప్టెన్ ఆండ్రూ ఆయూ నియంత్రణలోకి తెచ్చుకోగా, ఆ వెంటనే సలిసు గోల్‌గా మలిచాడు. మరో పది నిమిషాల్లోనే ఘనా ఆధిక్యం పెంచుకుంది. ఈసారి కూడా జోర్డాన్ ఆయూనే పాస్ అందించగా... కుడూస్ హెడర్‌తో బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపడంతో విస్తుపోవడం కొరియా వంతైంది. తొలి అర్ధభాగంలో ఘనా ఆట చూస్తే కొరియా చిత్తుగా ఓడుతుందనిపించింది. అయితే విరామం తర్వాత కొరియా కోలుకుంది. 168 సెకన్ల వ్యవధిలో చో గూసంగ్ చేసిన రెండు హెడర్ గోల్స్ ఒక్కసారిగా మ్యాచ్ పరిస్థితిని మార్చేశాయి. లీ కాంగ్ ఇచ్చిన క్రాస్తో తొలి గోల్ చేసిన గూసంగ్, రెండో గోల్‌తో అద్భుతాన్ని ప్రదర్శించాడు. కిమ్ జిన్ కిక్ కొట్టగా, గోల్ పోస్ట్ ముందు గిడియాన్ మెన్సాను తప్పించి గాల్లోకి ఎగురుతూ గోల్ సాధించడం హైలైట్‌గా నిలిచింది. స్కోరు సమం కావడంతో మళ్లీ హోరాహోరీ మొదలైంది. అయితే కొరియా డిఫెన్స్ వైఫల్యాన్ని సొమ్ము చేసుకుంటూ కుడూస్ మళ్లీ జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత కొరియా ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. చివర్లో ఘనా గోల్‌కీపర్ లారెన్స్ అతీ జిగీ మెరుపు వేగంతో కదులుతూ గోల్స్‌ను అడ్డుకోవడం విశేషం. మ్యాచ్ తర్వాత పెనాల్టీ విషయంలో రిఫరీ ఆంథోనీ టేలర్‌తో వాదనకు దిగిన కొరియా కోచ్ బెంటో రెడ్‌కార్డుకు గురయ్యాడు. ప్రపంచకప్‌లో నేడు ఈక్వెడార్ X సెనెగల్ రాత్రి గం. 8:30 నుంచి నెదర్లాండ్స్ X ఖతర్ రాత్రి గం. 8:30 నుంచి ఇరాన్ X అమెరికా అర్ధరాత్రి గం. 12:30 నుంచి ఇంగ్లండ్ X వేల్స్ అర్ధరాత్రి గం. 12:30 నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమా చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం. -
FIFA World Cup Qatar 2022: అర్జెంటీనా నిలిచింది
తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో ఎదురైన అనూహ్య ఓటమి నుంచి అర్జెంటీనా వెంటనే తేరుకుంది. ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ లో నాకౌట్ దశకు అర్హత పొందే అవకాశాలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఈ మాజీ చాంపియన్ జట్టు సమష్టి ప్రదర్శనతో రాణించింది. తనదైన రోజున ఎంతటి మేటి జట్టునైనా ఓడించే సత్తాగల మెక్సికోను ఏమాత్రం తేలిగ్గా తీసుకోకుండా ఆడిన అర్జెంటీనా రెండు గోల్స్ తేడాతో విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. పోలాండ్‌తో జరిగే చివరి మ్యాచ్‌లో అర్జెంటీనా గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ప్రిక్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంటే సౌదీ అరేబియా–మెక్సికో మ్యాచ్ ఫలితంపై అర్జెంటీనా జట్టు నాకౌట్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. పోలాండ్ చేతిలో ఓడితే మాత్రం అర్జెంటీనా లీగ్ దశలోనే ఇంటిముఖం పడుతుంది. దోహా: టైటిల్ ఫేవరెట్స్‌లో ఒక జట్టుగా ఖతర్‌కు వచ్చిన అర్జెంటీనా తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో ఓడిపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కానీ తొలి మ్యాచ్‌లో ఎదురైన పరాభవం నుంచి తేరుకున్న అర్జెంటీనా రెండో మ్యాచ్‌లో స్థాయికి తగ్గట్టు ఆడింది. గ్రూప్ ‘సి’లో భాగంగా మెక్సికోతో భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 2–0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఆట 64వ నిమిషంలో కెప్టెన్ లయనెల్ మెస్సీ గోల్‌తో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లిన అర్జెంటీనా... 87వ నిమిషంలో ఎంజో ఫెర్నాండెజ్ గోల్‌తో విజయాన్ని ఖాయం చేసుకుంది. నాకౌట్ చేరే అవకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో అర్జెంటీనా జాగ్రత్తగా ఆడింది. మరోవైపు మెక్సికో ఫార్వర్డ్ అలెక్సిక్ వెగా అవకాశం వచ్చినపుడల్లా అర్జెంటీనా రక్షణ శ్రేణి ఆటగాళ్లకు ఇబ్బంది పెట్టాడు. 45వ నిమిషంలో వెగా కొట్టిన షాట్‌ను అర్జెంటీనా గోల్‌కీపర్ సమర్థంగా అడ్డుకున్నాడు. రెండో అర్ధభాగంలో అర్జెంటీనా ఆటగాళ్లు తమ దాడుల్లో పదును పెంచారు. చివరకు 64వ నిమిషంలో కుడివైపు నుంచి డిమారియా ఇచ్చిన పాస్‌ను అందుకున్న మెస్సీ 25 గజాల దూరం నుంచి షాట్ కొట్టగా మెక్సికో గోల్‌కీపర్ డైవ్ చేసినా బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పోకుండా అడ్డుకోలేకపోయాడు. దాంతో అర్జెంటీనా బోణీ కొట్టింది. ఖాతా తెరిచిన ఉత్సాహంతో అర్జెంటీనా మరింత జోరు పెంచింది. మెస్సీ అందించిన పాస్‌ను ఎంజో ఫెర్నాండెజ్ అందుకొని షాట్ కొట్టగా బంతి మెక్సికో గోల్‌పోస్ట్‌లోనికి వెళ్లింది. దాంతో ప్రపంచకప్ చరిత్రలో అర్జెంటీనా చేతిలో మెక్సికోకు నాలుగో ఓటమి ఎదురైంది. ప్రపంచకప్‌లో నేడు కామెరూన్ X సెర్బియా మధ్యాహ్నం గం. 3:30 నుంచి దక్షిణ కొరియా X ఘనా సాయంత్రం గం. 6:30 నుంచి బ్రెజిల్ X స్విట్జర్లాండ్ రాత్రి గం. 9:30 నుంచి పోర్చుగల్ X ఉరుగ్వే అర్ధరాత్రి గం. 12:30 నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమా చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
ISL 2022: హైదరాబాద్‌ను గెలిపించిన యాసిర్
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) వరుసగా ఐదో విజయం నమోదు చేసింది. జంషెడ్‌పూర్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఎఫ్‌సీ 1–0 గోల్‌తో జంషెడ్పూర్ ఎఫ్‌సీ జట్టును ఓడించింది. ఆట 48వ నిమిషంలో మొహమ్మద్ యాసిర్ సాధించిన గోల్‌తో హైదరాబాద్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత చివరి వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ 16 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. -
జులన్‌కు క్లీన్‌స్వీప్ కానుక
లండన్: అంతర్జాతీయ మహిళల క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్, భారత సీనియర్ పేసర్ జులన్ గోస్వామి కెరీర్ విజయంతో ముగిసింది. ఇంగ్లండ్ జట్టుతో శనివారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని టీమిండియా 16 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. ఈ విజయంతో భారత్ సిరీస్‌ను 3–0తో నెగ్గి కెరీర్లో చివరి మ్యాచ్ ఆడిన 39 ఏళ్ల జులన్ గోస్వామికి క్లీన్‌స్వీప్ కానుకగా ఇచ్చింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ 45.4 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. స్మృతి మంధాన (50; 5 ఫోర్లు), దీప్తి శర్మ (68 నాటౌట్; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. 29 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్‌ను స్మృతి, దీప్తి శర్మ ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు వీరిద్దరు 58 పరుగులు జత చేశారు. స్మృతి అవుటయ్యాక ఒకవైపు వికెట్లు పడుతుంటే మరోవైపు దీప్తి పట్టుదలతో ఆడి అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. ఇంగ్లండ్ బౌలర్లలో కేటీ క్రాస్ (4/26), ఫ్రేయా కెంప్ (2/24), ఎకిల్‌స్టోన్ (2/27) రాణించారు. అనంతరం 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 43.3 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. కెరీర్లో చివరి మ్యాచ్ ఆడిన జులన్ గోస్వామి బ్యాటింగ్‌లో ‘డకౌట్’కాగా... బౌలింగ్‌లో 10 ఓవర్లలో మూడు మెయిడెన్లు వేసి 30 పరుగులిచ్చి 2 వికెట్లు తీసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రేణుక సింగ్ (4/29), స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్ (2/38) కూడా ఇంగ్లండ్‌ను దెబ్బ తీశారు. మొత్తం 340 పరుగులు చేసి రెండు వికెట్లు తీసిన హర్మన్‌ప్రీత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించింది. 355: జులన్ గోస్వామి మూడు ఫార్మాట్లలో కలిపి తీసిన వికెట్ల సంఖ్య. జులన్ 12 టెస్టుల్లో 44 వికెట్లు... 204 వన్డేల్లో 255 వికెట్లు... 68 టి20ల్లో 56 వికెట్లు పడగొట్టింది. 7: మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం భారత జట్టుకిది ఏడోసారి (బంగ్లాదేశ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లపై ఒకసారి... శ్రీలంకపై మూడుసార్లు). ఇంగ్లండ్‌పై తొలిసారి. -
ప్రపంచ చాంపియన్ లింథోయ్
సరజెవో (బోస్నియా అండ్ హెర్జిగొవినా): ప్రపంచ జూడో చాంపియన్‌షిప్‌లో భారత అమ్మాయి లింథోయ్ చనంబమ్ సంచలనం సృష్టించింది. క్యాడెట్ విభాగంలో (57 కేజీల కేటగిరీ) ఆమె విజేతగా నిలిచింది. మణిపూర్‌కు చెందిన 15 ఏళ్ల లింథోయ్ శుక్రవారం జరిగిన ఫైనల్లో 1–0 తేడాతో రీస్ బియాంకా (బ్రెజిల్)ను ఓడించింది. 8 నిమిషాల 38 సెకన్ల పాటు సాగిన బౌట్లో భారత జుడోకా సత్తా చాటింది. ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత జూడోకా ఒకరు ప్రపంచ చాంపియన్ కావడం ఇదే తొలిసారి. పురుషులు లేదా మహిళల విభాగాల్లో సీనియర్, జూనియర్, క్యాడెట్... ఇలా ఏ విభాగంలోనూ ఇప్పటి వరకు భారత్‌నుంచి ఎవరూ విజేతగా నిలవలేదు. గత జూలైలో బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా కేడెట్ జూడో చాంపియన్‌షిప్‌లో లింథోయ్ కూడా స్వర్ణం సాధించింది. -
సాత్విక్–చిరాగ్ ‘డబుల్స్’ ధమాకా
భారత అమ్మాయిల జోడి 11 ఏళ్ల క్రితమే ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పతకం పని పట్టింది. ఈ టోర్నీ చరిత్రలో ఇన్నేళ్లయినా పురుషుల జోడీ వల్ల ఒక్క పతకం కూడా రాలేదు. ఇప్పుడా లోటు ఆంధ్రప్రదేశ్ ఆటగాడు సాత్విక్ సాయిరాజ్ వల్ల తీరింది. చిరాగ్‌శెట్టితో జతకట్టిన తెలుగు తేజం తనకన్నా మెరుగైన రెండో ర్యాంకింగ్ జోడీని కంగు తినిపించాడు. సెమీస్ చేరడం ద్వారా సాత్విక్–చిరాగ్‌లకు కనీసం కాంస్య పతకం ఖాయమైంది. టోక్యో: మన షట్లర్లు దూసుకెళుతున్నారు. కామన్వెల్త్గేమ్స్, ఏషియాడ్, ఒలింపిక్స్, థామస్–ఉబెర్ కప్, ప్రపంచ చాంపియన్‌షిప్ ఇలా ఏ మెగా ఈవెంట్ అయినా సరికొత్త చరిత్ర సృష్టిస్తూ సాగుతున్నారు. తాజాగా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పురుషుల డబుల్స్‌లో అందని ద్రాక్షయిన పతకాన్ని ఇప్పుడు అందుకోనున్నారు. అంతర్జాతీయ సర్క్యూట్లో స్థిరంగా రాణిస్తున్న సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి–చిరాగ్ శెట్టి ఈ టోక్యో ఈవెంట్లో ఆ ఘనత సాధించారు. పురుషుల డబుల్స్‌లో ప్రపంచ ఏడో ర్యాంక్ జోడీ సెమీస్ చేరడంతో కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నారు. క్వార్టర్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకు జంటపై భారత ద్వయం ఆటను చూస్తే పతకం రంగు మారినా ఆశ్చర్యం లేదు. అంతలా డిఫెండింగ్ చాంపియన్స్‌పై సత్తా చాటారు. రెండో గేమ్‌లో పుంజుకున్న స్థానిక మేటి ర్యాంకింగ్ జోడీని నిర్ణాయక గేమ్‌లో ఓడించి మరీ సెమీస్ చేరిన తీరు అద్భుతం! శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో సాత్విక్–చిరాగ్ శెట్టి జోడి 24–22, 15–21, 21–14తో ప్రపంచ రెండో ర్యాంకు, డిఫెండింగ్ చాంపియన్ టకురో హోకి–యుగో కొబయాషి (జపాన్) జంటను కంగుతినిపించింది. గంటా 15 నిమిషాల పాటు జరిగిన ఈ హోరాహోరీ పోరాటంలో భారత జోడీదే పైచేయి అయ్యింది. తొలిగేమ్‌లో ఆరంభం నుంచే పట్టుబిగించిన సాత్విక్–చిరాగ్ 12–5తో జోరు పెంచారు.అయితే వరుసగా ఏడు పాయింట్లు సాధించిన డిఫెండింగ్ చాంపియన్ జంట 16–14తో పోటీలో పడింది. ఈ గేమ్ ఆఖరిదాకా పట్టుసడలించని పోరాటం చేసిన భారత జంటే గేమ్ గెలుచుకుంది. కానీ రెండో గేమ్‌లో పుంజుకున్న జపాన్ షట్లర్లు భారత ఆటగాళ్లకు చెక్‌పెట్టారు. నిర్ణాయక మూడో గేమ్‌లో సాత్విక్ జంటే అదరగొట్టింది. 16–9తో ఆధిక్యంలోకి వెళ్లిన భారత జోడీ అదే వేగంతో పాయింట్లను సాధిస్తూ మ్యాచ్‌ను గెలిచింది. మరో పురుషుల డబుల్స్ జోడీ ఎం.ఆర్.అర్జున్–ధ్రువ్ కపిలకు క్వార్టర్స్‌లో చుక్కెదురైంది. అర్జున్–ధ్రువ్ 8–21, 14–21తో మూడు సార్లు చాంపియన్లుగా నిలిచిన మొహమ్మద్ అహసాన్–సెతియవాన్ (ఇండోనేసియా) చేతిలో పరాజయం పాలయ్యారు. భారత@13 డబుల్స్‌లో భారత్‌కిది రెండో పతకం. మహిళల డబుల్స్‌లో ఇదివరకే (2011లో) గుత్తాజ్వాల–అశ్విని పొన్నప్ప కాంస్యం గెలుచుకుంది. ఓవరాల్‌గా అయితే ఈ మెగా ఈవెంట్ చరిత్రలో భారత్‌కిది 13వ పతకం. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు స్వర్ణం సహా ఐదు పతకాలు నెగ్గగా, సైనా రజత, కాంస్య పతకాలు సాధించింది. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ (రజతం), లక్ష్యసేన్ (కాంస్యం), సాయిప్రణీత్ (కాంస్యం), దిగ్గజం ప్రకాశ్ పదుకొనె (కాంస్యం) పతక విజేతలుగా నిలిచారు. -
CWG 2022: పసిడి పట్టు.. ఆరు పతకాలతో మెరిసిన భారత రెజ్లర్లు
అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ భారత రెజ్లర్లు కామన్వెల్త్ గేమ్స్‌లో శుక్రవారం ఆరు పతకాలతో అదరగొట్టారు. స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, దీపక్ పూనియా, సాక్షి మలిక్ స్వర్ణ పతకాలతో సాధించగా... అన్షు మలిక్ రజతం... దివ్య కక్రాన్, మోహిత్ గ్రెవాల్ కాంస్య పతకాలు సంపాదించారు. బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ ఈవెంట్స్‌లోనూ భారత క్రీడాకారులు రాణించి పతకాల దిశగా మరో అడుగు ముందుకేశారు. బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత రెజ్లర్లు మరోసారి తమ ‘పట్టు’ చాటుకున్నారు. రెజ్లింగ్ ఈవెంట్ తొలి రోజు బరిలో దిగిన ఆరు వెయిట్ కేటగిరీల్లోనూ పతకాలతో మెరిశారు. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో బజరంగ్ పూనియా (65 కేజీలు), దీపక్ పూనియా (86 కేజీలు) పసిడి పతకాలు సాధించగా... మోహిత్ గ్రెవాల్ (125 కేజీలు) కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్ (62 కేజీలు) మూడో ప్రయత్నంలో కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకాన్ని సాధించగా... అన్షు (57 కేజీలు) రజతం... దివ్య కక్రాన్ (68 కేజీలు) కాంస్యం సొంతం చేసుకున్నారు. కేవలం రెండు పాయింట్లు ఇచ్చి... పురుషుల 65 కేజీల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ బజరంగ్‌కు ఏదశలోనూ పోటీ ఎదురుకాలేదు. లాచ్లాన్ మౌరిస్ మెక్నీల్ (కెనడా)తో జరిగిన ఫైనల్లో బజరంగ్ 9–2తో గెలిచి స్వర్ణం దక్కించుకున్నాడు. తొలి రౌండ్లో లోవీ బింగామ్ (నౌరూ)పై, క్వార్టర్ ఫైనల్లో జీన్ గలియాన్ (మారిషస్)పై, సెమీఫైనల్లో జార్జి రామ్ (ఇంగ్లండ్)పై బజరంగ్ గెలిచాడు. స్వర్ణం గెలిచే క్రమంలో బజరంగ్ తన ప్రత్యర్థులకు కేవలం రెండు పాయింట్లు మాత్రమే ఇవ్వడం విశేషం. తొలిసారి కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొన్న దీపక్ పూనియా ఫైనల్లో 3–0తో మొహమ్మద్ ఇనామ్ (పాకిస్తాన్)పై గెలిచాడు. సెమీఫైనల్లో దీపక్ 3–1తో అలెగ్జాండర్ మూర్ (కెనడా)పై, క్వార్టర్ ఫైనల్లో 10–0తో కసెబామా (సియరీ లియోన్)పై, తొలి రౌండ్లో 10–0తో మాథ్యూ ఒక్జెనామ్ (న్యూజిలాండ్)పై విజయం సాధించాడు. 125 కేజీల కాంస్య పతక పోరులో మోహిత్ గ్రెవాల్ ‘బై ఫాల్’ పద్ధతిలో ఆరోన్ జాన్సన్ (జమైకా)పై గెలుపొందాడు. సూపర్ సాక్షి... మహిళల 62 కేజీల విభాగం ఫైనల్లో సాక్షి మలిక్ ‘బై ఫాల్’ పద్ధతిలో కెనడా రెజ్లర్ అనా పౌలా గోడినెజ్‌ను ఓడించి తొలిసారి ఈ క్రీడల్లో స్వర్ణం సాధించింది. 2014 గ్లాస్గో గేమ్స్‌లో రజతం, 2018 గోల్డ్‌కోస్ట్ గేమ్స్‌లో కాంస్యం నెగ్గిన సాక్షి మూడో ప్రయత్నంలో పసిడి పతకాన్ని ముద్దాడింది. ఫైనల్లో ఒకదశలో సాక్షి 0–4తో వెనుకబడింది. అయితే ఆ తర్వాత పుంజుకొని అనా పౌలా భుజాన్ని కొన్ని సెకన్లపాటు మ్యాట్‌కు అట్టిపెట్టి ‘బై ఫాల్’ పద్ధతిలో విజయాన్ని అందుకుంది. 57 కేజీల ఫైనల్లో అన్షు మలిక్ 3–7తో ఒడునాయో అడెకురోయె (నైజీరియా) చేతిలో ఓడిపోయింది. 68 కేజీల విభాగం కాంస్య పతక పోరులో దివ్య కక్రాన్ కేవలం 20 సెకన్లలో తన ప్రత్యర్థి టైగర్ లిలీ లెమాలి (టోంగా)పై గెలిచింది. -
షూటింగ్ పోటీల్లో అజిత్ సత్తా.. 4 బంగారు పతకాలు కైవసం
Ajith Kumar Wins Medals In Tamilnadu 47Th State Shooting Championship: ప్రముఖ నటుడు, కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సినిమాల్లోనే కాకుండా ఇతర రంగాలలోనూ తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆయనకు బైక్ రేసింగ్ అంటే ఎంతో ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే బైక్ రేసింగ్, రైఫిల్ షూటింగ్లో ఆయన పలు పతకాలను గెలుచుకున్నారు. ప్రస్తుతం తన 61వ చిత్రానికి సంబంధించిన కార్యక్రమాల్లో బిజీగా ఉన్న అజిత్ రైఫిల్ షూటర్‌గా బంగారు పతకాలను, కాంస్య పతకాలను గెలుచుకోవడం సినీ ఇండస్ట్రీలో విశేషంగా మారింది. తమిళనాడు రాష్ట్రస్థాయిలో 47వ రైఫిల్ షూటింగ్ పోటీలు తిరుచ్చిలో ఈనెల 26వ తేదీ నుంచి రైఫిల్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ పోటీలలో 1300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కాగా ఈ పోటీలో పాల్గొనడానికి అజిత్ టీమ్ చెన్నై సమీపంలోని మౌరై వీరపురం పోలీసు ట్రైనింగ్ అకాడమీలో తీవ్రంగా రైఫిల్ షూటింగ్ ప్రాక్టీస్ చేసింది. ఇక ఈనెల 27వ తేదీన అజిత్ టీమ్ తిరుచ్చిలో జరిగిన పోటీలో పాల్గొని 4 బంగారు పతకాలను, 2 కాంస్య పతకాలను గెలుచుకుంది. సెంటర్ ఫైర్ పిస్టల్, స్తందర్డ్ పిస్టల్ వస్టర్, 50 మీటర్ల ప్రీ పిస్టల్ మాస్టర్, స్టాండర్డ్ పిస్టల్ మాస్టర్ కేటగిరీల్లో పసిడి పతకాలను, 50 మీటర్ల ప్రీ పిస్టల్, స్టాండర్డ్ పిస్టల్ కేటగిరీలో కాంస్య పతకాలను సాధించారు. దీంతో అజిత్ అభిమానులు ఆయన్ను షూటింగ్ స్టార్ అంటూ కొనియాడుతున్నారు. చదవండి: నిర్మాతగా మారిన బ్యూటిఫుల్ హీరోయిన్.. ఈ ఏడాది దుమ్మురేపిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే.. -
జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం
సాక్షి, విశాఖపట్నం: మహా విశాఖ నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ (స్థాయీ సంఘం) ఎన్నిక బుధవారం జరిగింది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. మొత్తం 10 స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ విజయం సాధించింది. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో 9 నామినేషన్లు వేసి టీడీపీ ఓటమి పాలైంది. టీడీపీ నుంచి వైఎస్సార్సీపీ స్టాండింగ్ కమిటీ అభ్యర్థికి అదనపు ఓట్లు వచ్చాయి. చదవండి: కేంద్రంతో కుస్తీ పడుతున్నాం.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు -
అదానీ గ్రూప్ చేతికి ఇజ్రాయెల్ పోర్టు
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్‌లోని పోర్ట్ ఆఫ్ హైఫా ప్రైవేటీకరణ టెండర్‌ను దేశీ దిగ్గజం అదానీ గ్రూప్‌లో భాగమైన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఏపీసెజ్), గాడోట్ గ్రూప్ కన్సారి్టయం దక్కించుకుంది. దీనితో పోర్ట్ ఆఫ్ హైఫాను నిర్వహించే హైఫా పోర్ట్ కంపెనీలో 100 శాతం వాటాల కొనుగోలు హక్కులు కన్సార్షియంకు లభిస్తాయి. ఏపీసెజ్ ప్రకటన ప్రకారం ఇందులో అదానీ పోర్ట్స్‌కు 70 శాతం, గాడోట్ గ్రూప్‌నకు 30 శాతం వాటాలు ఉంటాయి. డీల్ విలువ 1.18 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 9,422 కోట్లు). ఏపీసెజ్‌ను అంతర్జాతీయంగా లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ కార్యకలాపాలతో పాటు రవాణా దిగ్గజంగా తీర్చిదిద్దే దిశగా ఇది కీలకమైన అడుగని కంపెనీ సీఈవో కరణ్ అదానీ పేర్కొన్నారు. భారత్‌కు అత్యంత కీలకమైన వ్యూహాత్మక భాగస్వామ్య దేశాల్లో ఒకటైన ఇజ్రాయెల్‌లోనూ, అలాగే యూరప్‌లోని పోర్టుల రంగంలోనూ తమ కార్యకలాపాలు మరింతగా విస్తరించేందుకు ఇది తోడ్పడగలదని వివరించారు. హైఫా పోర్టును మరింత అభివృద్ధి చేసేందుకు ఏపీసెజ్‌తో భాగస్వామ్యం ఎంతగానో ఉపయోగపడగలదని గాడోట్ సీఈవో ఓఫర్ లించెవ్‌స్కీ పేర్కొన్నారు. కార్గో హ్యాండ్లింగ్‌లో తమకు, పోర్టు కార్యకలాపాల నిర్వహణలో అదానీ గ్రూప్‌నకు అపార అనుభవాలు ఉండటం .. హైఫా పోర్టును మరింత అభివృద్ధి చేసేందుకు ఉపయో గపడుతుందన్నారు. ఇజ్రాయెల్‌లో మూడో అతి పెద్ద నగరమైన హైఫాకి దగ్గర్లో పోర్ట్ ఆఫ్ హైఫా ఉంది. 2021లో ఇక్కడ 1.46 మిలియన్ల టీఈయూ (ట్వెంటీ ఫుట్ ఈక్వివాలెంట్ యూనిట్లు) కంటైనర్లను, 2.56 మిలియన్ టన్నుల కార్గోనూ హ్యాండిల్ చేశారు. మరోవైపు, అదానీ గ్రూప్‌లో రవాణా వ్యాపార విభాగంగా ఏపీసెజ్ కొనసాగుతోంది. -
Austrian Grand Prix: లెక్లెర్క్ ఖాతాలో మూడో విజయం
ఫెరారీ జట్టు డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో మూడో విజయం నమోదు చేశాడు. స్పీల్బర్గ్లో ఆదివారం జరిగిన ఆస్ట్రియా గ్రాండ్‌ప్రిలో లెక్లెర్క్ చాంపియన్‌గా నిలిచాడు. నిర్ణీత 71 ల్యాప్‌లను లెక్లెర్క్ అందరికంటే వేగంగా గంటా 24 నిమిషాల 24.312 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) రెండో స్థానంలో, హామిల్టన్ (మెర్సిడెస్) మూడో స్థానంలో నిలిచారు. సీజన్‌లోని తదుపరి రేసు ఫ్రెంచ్ గ్రాండ్‌ప్రి ఈనెల 24న జరుగుతుంది. -
Wimbledon 2022: 35వ ప్రయత్నంలో క్వార్టర్స్‌కు
లండన్: 15 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ జర్మనీ టెన్నిస్ క్రీడాకారిణి తాత్యానా మరియా తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించింది. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 34 ఏళ్ల తాత్యానా మరియా 5–7, 7–5, 7–5తో 2017 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్, 12వ సీడ్ జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా)పై సంచలన విజయం సాధించింది. 2 గంటల 8 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో మరియా తొలి సెట్‌ను కోల్పోయి రెండో సెట్లో 4–5 స్కోరు వద్ద తన సర్వీస్‌లో రెండు మ్యాచ్ పాయింట్లను కాపాడుకుంది. మ్యాచ్ మొత్తంలో తొమ్మిది ఏస్‌లు సంధించిన మరియా తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. ఒస్టాపెంకో ఏకంగా 57 అనవసర తప్పిదాలు చేయడం గమనార్హం. 2007 నుంచి ఇప్పటిదాకా 34 గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో పోటీపడిన మరియా మూడో రౌండ్ దాటి ముందుకెళ్లలేకపోయింది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో జూల్ నిమియర్ (జర్మనీ) 6–2, 6–4తో హీతెర్ వాట్సన్ (బ్రిటన్)పై, మేరీ బుజ్కోవా (చెక్ రిపబ్లిక్) 7–5, 6–2తో కరోలినా గార్సియా (ఫ్రాన్స్)పై గెలుపొంది తమ కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించారు. నాదల్ పదోసారి... పురుషుల సింగిల్స్‌లో రెండుసార్లు చాంపియన్, స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ పదోసారి వింబుల్డన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ నాదల్ 6–1, 6–2, 6–4తో లొరెంజో సొనెగో (ఇటలీ)పై గెలిచాడు. ఐదో సీడ్ అల్కరాజ్ ఓటమి మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) 1–6, 4–6, 7–6 (10/8), 3–6తో పదో సీడ్ జానిక్ సినెర్ (ఇటలీ) చేతిలో ఓడిపోయాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో తొమ్మిదో సీడ్ కామెరాన్ నోరీ (బ్రిటన్) 6–4, 7–5, 6–4తో టామీ పాల్ (అమెరికా)పై గెలుపొందాడు. -
IPL 2022: గుజరాత్ గుబాళింపు.. అరంగేట్రంలోనే విజేతగా నిలిచి
మార్చి 28, 2022... ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ మొదటి మ్యాచ్... షమీ వేసిన తొలి బంతికే లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అవుట్! అలా అద్భుతంగా మొదలైన ప్రయాణం రెండు నెలల తర్వాత చాంపియన్‌గా నిలిచే వరకు సాగింది. కొత్త జట్టుగా ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన గుజరాత్ అన్ని రంగాల్లో విశేషంగా రాణించి టైటిల్‌ను చేజిక్కించుకుంది. గ్రూప్ టాపర్‌గా నిలవడమే కాకుండా రెండు నాకౌట్ మ్యాచ్‌లలోనూ తమ బలాన్ని ప్రదర్శించింది. ఫలితంగా 15 ఏళ్ల లీగ్ చరిత్రలో మరో కొత్త జట్టు ఖాతాలో ట్రోఫీ చేరింది. గత ఫైనల్ మ్యాచ్‌లకు భిన్నంగా పూర్తి ఏకపక్షంగా సాగిన పోరులో రాజస్తాన్ రాయల్స్ చేతులెత్తేసింది. పేలవ బ్యాటింగ్‌తో తక్కువ స్కోరుకే పరిమితమైన జట్టు కనీసం పోరాడేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. ఛేదనలో ఎలాంటి తడబాటు లేకుండా దూసుకుపోయిన గుజరాత్ సొంతగడ్డ అహ్మదాబాద్‌లో చిరస్మరణీయ విజయాన్ని లిఖించింది. అహ్మదాబాద్: 19వ ఓవర్ తొలి బంతి... మెక్కాయ్ బౌలింగ్‌లో బంతిని డీప్‌స్క్వేర్ లెగ్ దిశగా శుబ్‌మన్ గిల్ సిక్సర్ బాదాడు...అంతే! ప్రపంచంలోని అతి పెద్ద క్రికెట్ మైదానం నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్‌కు హాజరైన 1,04,859 మందితో మైదానమంతా హోరెత్తగా, గుజరాత్ ఆటగాళ్లంతా సంబరాల్లో మునిగిపోయారు. ఆదివారం జరిగిన ఐపీఎల్ 15వ సీజన్ ఫైనల్లో 7 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌ను ఓడించి గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్–2022 విజేతగా నిలిచింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (35 బంతుల్లో 39; 5 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్ మ్యాచ్’ హార్దిక్ పాండ్యా (3/17) మూడు ప్రధాన వికెట్లతో ప్రత్యర్థి వెన్నువిరిచాడు. అనంతరం గుజరాత్ 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 133 పరుగులు చేసి గెలిచింది. శుబ్‌మన్ గిల్ (43 బంతుల్లో 45 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), హార్దిక్ పాండ్యా (30 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్), డేవిడ్ మిల్లర్ (19 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. సమష్టి వైఫల్యం... ఫైనల్‌కు ముందు 824 పరుగులు... అద్భుత ప్రదర్శనతో బట్లర్ ఒంటిచేత్తో రాజస్తాన్‌ను ఇక్కడి వరకు తీసుకొచ్చాడు. తుది పోరులో కూడా అతను చెలరేగితేనే గెలిచే అవకాశాలు ఉండగా... బట్లర్‌ను కట్టడి చేయడంలో టైటాన్స్ సఫలమైంది. గత మ్యాచ్ వరకు 45 సిక్సర్లు కొట్టిన అతను ఈ మ్యాచ్‌లో ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోగా, దాదాపు చివరి వరకు అతని స్ట్రయిక్‌రేట్ వంద పరుగులు దాటలేదు. గుజరాత్ పదునైన బౌలింగ్ ముందు ఇతర బ్యాటర్లు కూడా విఫలం కావడంతో రాజస్తాన్ ఇన్నింగ్స్ పేలవంగా ముగిసింది. యశస్వి జైస్వాల్ (16 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్స్‌లు), దేవ్‌దత్ పడిక్కల్ (10 బంతుల్లో 2) ఖాతా తెరిచేందుకే చెరో ఎనిమిది బంతులు తీసుకోగా... మధ్యలో వరుసగా 28 బంతుల పాటు బౌండరీ రాలేదంటే పరిస్థితి అర్థమవుతుంది. కెప్టెన్ సంజు సామ్సన్ (11 బంతుల్లో 14; 2 ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడటంలో విఫలమయ్యాడు. టీమ్‌లో ఉన్న మరో హిట్టర్ హెట్‌మైర్ (12 బంతుల్లో 11; 2 ఫోర్లు) కూడా ప్రభావం చూపలేకపోవడంతో రాయల్స్ చేసేందుకు ఏమీ లేకపోయింది. 13వ ఓవర్ తొలి బంతికి బట్లర్ అవుట్ కావడంతో రాజస్తాన్ భారీ స్కోరు ఆశలు ముగిసిపోయాయి. ఆడుతూ పాడుతూ... ఛేదనలో గుజరాత్‌కు ఎలాంటి సమస్యా రాలేదు. వృద్ధిమాన్ సాహా (7 బంతుల్లో 5; 1 ఫోర్), మాథ్యూ వేడ్ (10 బంతుల్లో 8; 1 సిక్స్) విఫలమైనా... గిల్, హార్దిక్ భాగస్వామ్యం జట్టును విజయం దిశగా నడిపించింది. రాజస్తాన్ బౌలర్లు వీరిద్దరిని ఇబ్బంది పెట్టలేకపోయారు. ప్రశాంతంగా ఆడిన గిల్, హార్దిక్ మూడో వికెట్‌కు 53 బంతుల్లో 63 పరుగులు జోడించారు. హార్దిక్‌ను చహల్ అవుట్ చేసినా... లక్ష్యం మరీ చిన్నది కావడంతో గుజరాత్ సునాయాసంగా గెలుపువైపు దూసుకుపోయింది. శుబ్‌మన్ గిల్, డేవిడ్ మిల్లర్ నాలుగో వికెట్‌కు 29 బంతుల్లో 47 పరుగులు జోడించి విజయాన్ని అందించారు. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) సాయికిషోర్ (బి) యశ్ 22; బట్లర్ (సి) సాహా (బి) హార్దిక్ 39; సామ్సన్ (సి) సాయికిషోర్ (బి) హార్దిక్ 14; పడిక్కల్ (సి) షమీ (బి) రషీద్ 2; హెట్‌మైర్ (సి అండ్ బి) హార్దిక్ 11; అశ్విన్ (సి) మిల్లర్ (బి) సాయికిషోర్ 6; పరాగ్ (బి) షమీ 15; బౌల్ట్ (సి) తెవాటియా (బి) సాయికిషోర్ 11; మెక్కాయ్ (రనౌట్) 8; ప్రసిధ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 130. వికెట్ల పతనం: 1–31, 2–60, 3–79, 4–79, 5–94, 6–98, 7–112, 8–130, 9–130. బౌలింగ్: షమీ 4–0–33–1, యశ్ దయాళ్ 3–0–18–1, ఫెర్గూసన్ 3–0–22–0, రషీద్ ఖాన్ 4–0–18–1, హార్దిక్ పాండ్యా 4–0–17–3, సాయికిషోర్ 2–0–20–2. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (బి) ప్రసిధ్ 5; గిల్ (నాటౌట్) 45; వేడ్ (సి) పరాగ్ (బి) బౌల్ట్ 8; హార్దిక్ (సి) యశస్వి (బి) చహల్ 34; మిల్లర్ (నాటౌట్) 32; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (18.1 ఓవర్లలో 3 వికెట్లకు) 133. వికెట్ల పతనం: 1–9, 2–23, 3–86, బౌలింగ్: బౌల్ట్ 4–1–14–1, ప్రసిధ్ కృష్ణ 4–0–40–1, చహల్ 4–0–20–1, మెక్కాయ్ 3.1–0–26–0, అశ్విన్ 3–0–32–0. .@gujarat_titans - The #TATAIPL 2022 Champions! 👏 👏 🏆 👍 The @hardikpandya7-led unit, in their maiden IPL season, clinch the title on their home ground - the Narendra Modi Stadium, Ahmedabad. 🙌🙌 @GCAMotera A round of applause for the spirited @rajasthanroyals! 👏 👏 #GTvRR pic.twitter.com/LfIpmP4m2f — IndianPremierLeague (@IPL) May 29, 2022 -
ఢిల్లీ అవుట్... బెంగళూరు రైట్‌రైట్
ముంబై: సీజన్ ఆసాంతం నిరాశపరిచిన ముంబై ఇండియన్స్ తమ చివరి మ్యాచ్‌లో అభిమానుల్ని మురిపించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ను ముంచి... రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ప్లేఆఫ్స్‌కు పంపింది. శనివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రోహిత్ బృందం 5 వికెట్ల తేడాతో ఢిల్లీపై గెలిచింది. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ చేజేతులా ఓడి లీగ్ దశకే పరిమితమైంది. పేలవ ఫీల్డింగ్కుతోడు కెప్టెన్ పంత్ నాయకత్వలోపం ఢిల్లీకి శాపమైంది. తొలుత ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. పృథ్వీ షా (24; 2 ఫోర్లు, 1 సిక్స్), రిషభ్ పంత్ (39; 4 ఫోర్లు, 1 సిక్స్), రోవ్‌మన్ పావెల్ (34 బంతుల్లో 43; 1 ఫోర్, 4 సిక్సర్లు) మెరిపించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బుమ్రా 3 వికెట్లు తీశాడు. తర్వాత ముంబై 19.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసి నెగ్గింది. ఇషాన్ కిషన్ (35 బం తుల్లో 48; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) , టిమ్ డేవిడ్ (11 బంతుల్లో 34; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరిపించారు. కష్టంగానే మొదలైనా... ముంబై లక్ష్యఛేదన కష్టంగానే మొదలైంది. రోహిత్ (2) నిరాశపరిస్తే... ఇషాన్, బ్రెవిస్ (33 బంతుల్లో 37; 1 ఫోర్, 3 సిక్సర్లు) జట్టును నడిపించారు. కుల్దీప్ 12వ ఓవర్ మూడో బంతికి కిషన్‌ను పెవిలియన్ చేర్చాడు. ఐదో బంతికి బ్రెవిస్ వికెట్ దక్కేది కానీ సునాయాసమైన క్యాచ్‌ను పంత్ నేలపాలు చేశాడు. లేదంటే మ్యాచ్‌ను ఈ ఓవర్ మలుపు తిప్పేది. 15వ ఓవర్లో బ్రెవిస్‌ను శార్దుల్ బౌల్డ్ చేశాడు. మరుసటి బంతికి ‘డేంజర్’ బ్యాటర్ డేవిడ్ అవుటవ్వాలి. అతని బ్యాట్ అంచును తాకుతూ వెళ్లిన బంతిని పంత్ అందుకున్నప్పటికీ అప్పీల్‌ను అంపైర్ తోసి పుచ్చాడు. పంత్ రివ్యూ కోరలేదు. దీంతో డేవిడ్ సిక్సర్లతో ముంబైని గెలుపు తీరానికి తెచ్చాడు. ఆఖర్లో అతనితోపాటు తిలక్ (21; 1 ఫోర్, 1 సిక్స్) అవుటైనా... రమణ్‌దీప్ (13 నాటౌట్) లాంఛనాన్ని పూర్తిచేశాడు. -
డికాక్ విధ్వంసం.. ఉత్కంఠ పోరులో లక్నోదే విజయం
ముంబై: ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యం... ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లూ ఆడిన జోడీ... ఐపీఎల్ చరిత్రలో మూడో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు... ఈ ఘనతలన్నీ ఒక్క మ్యాచ్‌లోనే వచ్చాయి. విధ్వంసకర బ్యాటింగ్‌తో క్వింటన్ డికాక్ రికార్డులు కొల్లగొట్టగా, కేఎల్ రాహుల్ సహాయక పాత్రలో నిలిచాడు. వీరిద్దరి జోరుతో 2022 సీజన్లో కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్ సగర్వంగా ‘ప్లే ఆఫ్స్’లోకి అడుగు పెట్టింది. ఆసక్తికరంగా సాగిన ఈ పోరులో లక్నో 2 పరుగులతో కేకేఆర్‌పై విజయం సాధించింది. ముందుగా లక్నో 20 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 210 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డికాక్ (70 బంతుల్లో 140 నాటౌట్; 10 ఫోర్లు, 10 సిక్స్‌లు) అజేయ సెంచరీకి రాహుల్ (51 బంతుల్లో 68; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ తోడైంది. అనంతరం కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్లకు 208 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (29 బంతుల్లో 50; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), నితీశ్ రాణా (22 బంతుల్లో 42; 9 ఫోర్లు), రింకూ సింగ్ (15 బంతుల్లో 40; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), స్యామ్ బిల్లింగ్స్ (24 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. అభేద్య భాగస్వామ్యం... డికాక్, రాహుల్ భాగస్వామ్యం సాధారణంగానే ప్రారంభమైంది. ఇద్దరూ కొన్ని చక్కటి షాట్లతో ఆకట్టుకున్నా... లక్నో అసలు ఆట చివరి 5 ఓవర్లలో కనిపించింది. 15 ఓవర్లు ముగిసేసరికి టీమ్ స్కోరు 122 పరుగులు కాగా, తర్వాతి 5 ఓవర్లలో ఏకంగా 88 పరుగులు వచ్చాయి! ఇందులో చాలా వరకు రాహుల్ ప్రేక్షక పాత్రకు (16 పరుగులు) పరిమితం కాగా... డికాక్ (71 పరుగులు) రెచ్చిపోయాడు. 59 బంతుల్లోనే డికాక్ శతకం పూర్తయింది. డికాక్‌కు ఐపీఎల్లో ఇది రెండో సెంచరీ. ఆ తర్వాత సౌతీ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్ లక్నో బ్యాటింగ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఈ ఓవర్లో రాహుల్ ఒక సిక్స్ కొట్టగా, డికాక్ వరుసగా మూడు బంతుల్లో 6, 6, 6తో చెలరేగాడు. రసెల్ వేసిన ఆఖరి ఓవర్లో డికాక్ వరుస బంతుల్లో 4, 4, 4, 4 కొట్టడం విశేషం. చివరి వరకు పోరాడినా... మొహసిన్ తన వరుస ఓవర్లలో వెంకటేశ్ (0), తోమర్ (4)లను అవుట్ చేయడంతో కోల్‌కతా ఛేదన పేలవంగా మొదలైంది. చివర్లో రింకూ, నరైన్ 19 బంతుల్లోనే 58 పరుగులు జోడించి జట్టు గెలుపు అవకాశాలు పెంచారు. స్టొయినిస్ వేసిన ఆఖరి ఓవర్లో విజయం కోసం 21 పరుగులు చేయాల్సి ఉండగా రింకూ సింగ్ వరుసగా 4, 6, 6, 2తో గెలుపునకు చేరువగా తెచ్చాడు. 2 బంతుల్లో 3 పరుగులు సాధించాల్సిన స్థితిలో ఐదో బంతికి లూయిస్ అద్భుత క్యాచ్‌తో రింకూ ఆట ముగియగా, చివరి బంతికి ఉమేశ్ బౌల్డయ్యాడు. స్కోరు వివరాలు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: డికాక్ (నాటౌట్) 140; రాహుల్ (నాటౌట్) 68; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 210. బౌలింగ్: ఉమేశ్ 4–0–34–0, సౌతీ 4–0–57–0, నరైన్ 4–0–27–0, వరుణ్ 4–0– 38–0, రసెల్ 3–0–45–0, రాణా 1–0–9–0. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: వెంకటేశ్ (సి) డికాక్ (బి) మొహసిన్ 0; అభిజిత్ తోమర్ (సి) రాహుల్ (బి) మొహసిన్ 4; రాణా (సి) స్టొయినిస్ (బి) గౌతమ్ 42; శ్రేయస్ (సి) హుడా (బి) స్టొయినిస్ 50; బిల్లింగ్స్ (స్టంప్డ్) డికాక్ (బి) బిష్ణోయ్ 36; రసెల్ (సి) హుడా (బి) మొహసిన్ 5; రింకూ (సి) లూయీస్ (బి) స్టొయినిస్ 40; నరైన్ (నాటౌట్) 21; ఉమేశ్ (బి) స్టొయినిస్ 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 208. వికెట్ల పతనం: 1–0, 2–9, 3–65, 4–131, 5–142, 6–150, 7–208, 8–208. బౌలింగ్: మొహసిన్ 4–0– 20–3, హోల్డర్ 4–0–45–0, అవేశ్ 4–0–60–0, గౌతమ్ 2–0–23–1, బిష్ణోయ్ 4–0–34–1, స్టొయినిస్ 2–0–23–3. ఆ క్యాచ్ పట్టి ఉంటే... డికాక్ వ్యక్తిగత స్కోరు 12 పరుగుల వద్ద అతను కొట్టిన షాట్ థర్డ్‌మాన్ దిశగా వెళ్లగా, తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న అభిజిత్ తోమర్ ఒత్తిడిలో బంతి గమనాన్ని సరిగా అంచనా వేయలేక క్యాచ్ వదిలేశాడు. ఐపీఎల్లో నేడు గుజరాత్ టైటాన్స్ X బెంగళూరు రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో. -
విజేత వెర్స్టాపెన్
మయామి (అమెరికా): ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో ప్రపంచ చాంపియన్ మాక్స్ వెర్స్టాపెన్ మూడో విజయం సాధించాడు. అమెరికాలో జరిగిన మయామి గ్రాండ్‌ప్రి ప్రధాన రేసులో వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) విజేతగా నిలిచాడు. నిర్ణీత 57 ల్యాప్‌ల రేసును వెర్స్టాపెన్ అందరికంటే వేగంగా గంటా 34 నిమిషాల 24.258 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఫెరారీ జట్టు డ్రైవర్లు చార్లెస్ లెక్లెర్క్ రెండో స్థానంలో, కార్లోస్ సెయింజ్ మూడో స్థానంలో నిలిచారు. లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్)కు ఆరో స్థానం లభించింది. సీజన్లో ఐదు రేసులు ముగిశాక లెక్లెర్క్ 104 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో ఉండగా... వెర్స్టాపెన్ 85 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. సీజన్‌లోని తదుపరి రేసు స్పెయిన్ గ్రాండ్‌ప్రి ఈనెల 22న బార్సిలోనాలో జరుగుతుంది. -
హాంకాంగ్ పాలకునిగా జాన్ లీ ఎన్నిక
హాంకాంగ్: హాంకాంగ్ పాలకునిగా చైనా అనుకూల జాన్ లీ ఆదివారం ఎన్నికయ్యారు. 1,500 మంది కమిటీ సభ్యుల్లో 1,416 మంది లీకి ఓటేశారు. కమిటీలో మెజారిటీ సభ్యులు చైనా మద్దతుదారులే కావడంతో ఎన్నిక సులభమైంది. ఎన్నికల్లో ఆయన ఒక్కరే పోటీ చేశారు. జూన్ 1న కేరీ లామ్ స్థానంలో లీ బాధ్యతలు చేపడతారు. హాంకాంగ్ సెక్యూరిటీ చీఫ్‌గా చైనా అండతో నగరంలో ప్రజాస్వామ్య ఉద్యమాన్ని లీ కఠినంగా అణచివేశారన్న అపవాదు ఉంది. చైనాకు విధేయులుగా ఉన్నవారే పోటీ చేయగలిగేలా హాంకాంగ్ ఎన్నికల చట్టాల్లో చైనా గతేడాది మార్పులు చేసింది. హాంకాంగ్‌ను పూర్తిగా విలీనం చేసుకొనేందుకు డ్రాగన్ దేశం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
సన్‌రైజర్స్‌కు షాకిచ్చిన రషీద్ ఖాన్, తెవాటియా
ముంబై: రషీద్ ఖాన్ గత సీజన్ దాకా సన్‌రైజన్స్ తురుపుముక్క. ఎన్నో మ్యాచ్‌లను తన స్పిన్‌తో గెలిపించాడు. ఈసారి గుజరాత్ స్పిన్నరైన రషీద్ మాజీ జట్టుపై తన ఐపీఎల్ కెరీర్లోనే చెత్త బౌలింగ్ ప్రదర్శన నమోదు చేశాడు. గతంలో వికెట్ తీయని సందర్భంలో 35 పరుగు లకుమించి ఇవ్వని రషీద్ ఈ సారి 4 ఓవర్లలో 45 పరుగులు ఇచ్చాడు! అయితే బంతితో చేయలేని మాయను రషీద్ (11 బంతుల్లో 31 నాటౌట్; 4 సిక్సర్లు) బ్యాట్‌తో చూపించి లెక్క సరిచేశాడు. ఓటమికి దగ్గరైన టైటాన్స్‌ను ఒక్క ఓవర్‌తో గెలిపించాడు. 6 బంతుల్లో 22 పరుగులు చేయాల్సిన ఉండగా క్రీజులో తెవాటియా, రషీద్ నిలిచారు. గుజరాత్ గెలుపు ఆశలు అడుగంటిన దశలో జాన్సెన్ ఆఖరి ఓవర్ వేయగా... తెవాటియా మొదటి బంతిని 6 కొట్టాడు. రెండో బంతికి సింగిల్ వచ్చింది. ఇక రషీద్ వరుసగా 6, 0, 6, 6తో మ్యాచ్‌ను గెలిపించాడు. ఆఖరి బంతికి 3 పరుగులు చేయాల్సి వుండగా సిక్సర్ కొట్టడంతో గుజరాత్ శిబిరంలో ఆనందానికి అవధుల్లేవు. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో టైటాన్స్ 5 వికెట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు షాకిచ్చింది. హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (42 బంతుల్లో 65; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), మార్క్రమ్ (40 బంతుల్లో 56; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. తర్వాత గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 199 పరుగులు చేసి గెలిచింది. వృద్ధిమాన్ సాహా (38 బంతుల్లో 68; 11 ఫోర్లు, 1 సిక్స్), తెవాటియా (21 బంతుల్లో 40 నాటౌట్ 4 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక పాత్ర పోషించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఉమ్రాన్ మలిక్ (5/25) ఐదు వికెట్లతో చెలరేగినా జట్టుకు ఓటమి తప్పలేదు. రాణించిన అభిషేక్, మార్క్రమ్ విలియమ్సన్ (5)ను క్లీన్‌బౌల్ట్ చేసిన షమీ, ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి (16) పని పట్టాడు. వరుసగా 6, 4, 4 కొట్టి ఊపుమీదున్న త్రిపాఠి ఎల్బీగా పెవిలియన్ చేరాడు. పవర్‌ప్లేలో స్కో రు 53 పరుగులకు చేరింది. జోసెఫ్, ఫెర్గూసన్, రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఇద్దరు యథేచ్ఛగా షాట్లు బాదారు. అభిషేక్ సిక్సర్ తో సన్‌రైజర్స్ 11.1 ఓవర్లో 100 పరుగుల్ని అధిగమించింది. అతని అర్ధ సెంచరీ (33 బంతుల్లో; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) పూర్తయ్యింది. 96 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి అల్జారీ జోసెఫ్ ముగింపు పలికాడు. 35 బంతుల్లో మార్క్రమ్ (2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఫిఫ్టీ కూడా పూర్తయినప్పటికీ హైదరాబాద్ స్వల్ప వ్యవధిలో పూరన్ (3), మార్క్రమ్, వాషింగ్టన్ సుందర్ (3) వికెట్లను కోల్పోయింది. సిక్సర్లతో విరుచుకుపడ్డ శశాంక్ సీజన్లో 5 మ్యాచ్‌లాడినా ఒక్కసారి కూడా బ్యాటింగ్ అవకాశం రాని శశాంక్ సింగ్ (6 బంతుల్లో 25 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఈ ఆరో మ్యాచ్‌లో ఫెర్గూసన్ ఓవర్‌ను చితకబాదాడు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ తొలి బంతిని జాన్సెన్ 6 కొట్టి మూడో బంతికి పరుగు తీసి శశాంక్‌కు స్ట్రయిక్ ఇచ్చాడు. మిగిలిన మూడు బంతుల్ని 6, 6, 6 సిక్సర్లుగా దంచేశాడు. సాహా ధనాధన్ గుజరాత్ టైటాన్స్ పరుగుల వేట రెండో ఓవర్ నుంచి ఊపందుకుంది. వృద్ధిమాన్ సాహా 4, 6తో వేగాన్ని జత చేశాడు. అక్కడ్నుంచి వరుస బౌండరీలతో టైటాన్స్ దూకుడుగా సాగిపోయింది. 9 పరుగుల రన్‌రేట్ ప్రత్యర్థి శిబిరంలో గుబులు రేపుతుండగా... ఉమ్రాన్ తన తొలి ఓవర్లో (ఇన్నింగ్స్ 8వ) ఊరటనిచ్చాడు. శుబ్‌మన్ గిల్ (24 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్)ను బౌల్డ్ చేశాడు. అయినా సాహా తన ధాటిని కొనసాగిస్తుండగా మరుసటి ఓవర్లో హార్దిక్ పాండ్యా (10)ను ఉమ్రాన్ డగౌట్‌కు పంపించేశాడు. సాహా 28 బంతుల్లోనే (8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకం బాదేశాడు. బుల్లెట్ వేగంతో విలవిల సాహా జోరు మీదుండగా, హిట్టర్ మిల్లర్ జత య్యాడు. అప్పటికీ లక్ష్యం రేసులోనే ఉన్న టైటాన్స్‌ను ఉమ్రాన్ మలిక్ బుల్లెట్ బంతులు కకావికలం చేసింది. 14వ ఓవర్లో సాహా జోరుకు కళ్లెం వేశాడు. 151 కి.మీ.వేగంతో దూసుకొచ్చిన బంతి సాహాను బౌల్డ్ చేసింది. తిరిగి 16వ ఓవర్లో మిల్లర్ (17), అభినవ్ (0) క్లీన్‌బౌల్డ్ చేశాడు. తెవాటియాకు రషీద్ జతవ్వగా... 24 బంతుల్లో 56 పరుగుల సమీకరణం గుజరాత్‌కు క్లిష్టంగా మారింది. ఆఖరి దాకా క్రీజులో ఉన్న ఈ జోడీ అద్భుతాన్నే చేసింది. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ (బి) జోసెఫ్ 65; విలియమ్సన్ (బి) షమీ 5; త్రిపాఠి (ఎల్బీ) (బి) షమీ 16; మార్క్రమ్ (సి) మిల్లర్ (బి) యశ్ 56; పూరన్ (సి) గిల్ (బి) షమీ 3; సుందర్ రనౌట్ 3; శశాంక్ నాటౌట్ 25; జాన్సెన్ నాటౌట్ 8; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 195. వికెట్ల పతనం: 1–26, 2–44, 3–140, 4–147, 5–161, 6–162. బౌలింగ్: షమీ 4–0–39–3, యశ్ 4–0–24–1, జోసెఫ్ 4–0–35–1, రషీద్ 4–0–45–0, ఫెర్గూసన్ 4–0–52–0. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (బి) ఉమ్రాన్ 68; గిల్ (బి) ఉమ్రాన్ 22; హార్దిక్ (సి) జాన్సెన్ (బి) ఉమ్రాన్ 10; మిల్లర్ (బి) ఉమ్రాన్ 17; తెవాటియా నాటౌట్ 40; అభినవ్ (బి) ఉమ్రాన్ 0; రషీద్ నాటౌట్ 31; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–69, 2–85, 3–122, 4–139, 5–140. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–33–0, జాన్సెన్ 4–0–63–0, నటరాజన్ 4–0–43–0, సుందర్ 4–0–34–0, ఉమ్రాన్ 4–0–25–5. WHAT. A. GAME! 👌👌 WHAT. A. FINISH! 👍👍 We witnessed an absolute thriller at the Wankhede and it's the @gujarat_titans who edged out #SRH to seal a last-ball win! 🙌 🙌 Scorecard ▶️ https://t.co/r0x3cGZLvS #TATAIPL #GTvSRH pic.twitter.com/jCvKNtWN38 — IndianPremierLeague (@IPL) April 27, 2022 -
విజేత శశికిరణ్
చెన్నై: ఫాగర్నెస్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ కృష్ణన్ శశికిరణ్ విజేతగా నిలిచాడు. నార్వేలో ముగిసిన ఈ టోర్నీలో శశికిరణ్ నిర్ణీత 9 రౌండ్ల తర్వాత 7 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ఆర్యన్ చోప్రా కూడా 7 పాయింట్లు సాధించినా మెరుగైన టైబ్రేక్ స్కోరుతో శశికిరణ్కు టైటిల్ దక్కింది. ఆర్యన్ చోప్రాకు రెండో ర్యాంక్ లభించింది. తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఎరిగైసి అర్జున్ 6.5 పాయింట్లతో 5వ ర్యాంక్‌లో నిలిచాడు. -
IPL 2022: సన్‌రైజర్స్ మారలేదు...
ముంబై: సన్‌రైజర్స్ ఆట మారలేదు. ఈ సీజన్ ఐపీఎల్లో ఖాతా తెరవలేదు. కీలక తరుణంలో విలువైన వికెట్లు తీసిన ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవేశ్ ఖాన్ (4/24), హోల్డర్ (3/34) లక్నో సూపర్‌జెయింట్స్‌ను గెలిపించారు. 12 పరుగులతో లక్నో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (50 బంతుల్లో 68; 6 ఫోర్లు, 1 సిక్స్), దీపక్ హుడా (33 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 157 పరుగులే చేయగల్గింది. రాహుల్ త్రిపాఠి (30 బంతుల్లో 44; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఆకట్టుకున్న సుందర్ వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన బంతులతో ఓపెనర్ డికాక్ (1), ఎవిన్ లూయిస్ (1)లను పెవిలియన్ చేర్చగా, మనీశ్ పాండే (11) తన వైఫల్యం కొనసాగించాడు. లక్నో పవర్‌ప్లేలో 32 పరుగులే చేసింది. జోరు తగ్గిన జట్టు ఇన్నింగ్స్‌ను కెప్టెన్ రాహుల్, దీపక్ హుడా నిలబెట్టారు. ఈ క్రమంలో మొదట హుడా 31 బంతుల్లో (3 ఫోర్లు, 3 సిక్సర్లు), తర్వాత రాహుల్ 40 బంతుల్లో (5 ఫోర్లు) అర్ధసెంచరీలు సాధించారు. నటరాజన్ ఒకే ఓవర్లో రాహుల్, కృనాల్ పాండ్యా (6)లను అవుట్ చేయడంతో ఆఖర్లో రావల్సినన్ని పరుగులు రాలేదు. పడుతూ... లేస్తూ... ఓపెనర్లు కేన్ విలియమ్సన్ (16), అభిషేక్ శర్మ (13)లను అవేశ్ ఖాన్ తక్కువ స్కోరుకే వెనక్కి పంపేశాడు. పవర్‌ప్లేలో హైదరాబాద్ స్కోరు 40/2. రాహుల్ త్రిపాఠి కాస్త వేగంగా ఆడటంతో రన్‌రేట్ క్రమంగా మెరుగవుతూ వచ్చింది. పూరన్ (24 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆశలు రేపినా, అవేశ్ వరుస బంతుల్లో పూరన్‌తో పాటు సమద్ (0)ను అవుట్ చేయడంతో ఆశలన్నీ ఆవిరయ్యాయి. చివరి 6 బంతులకు 16 పరుగులు చేయాల్సిన దశలో ఆఖరి ఓవర్ వేసిన హోల్డర్ కేవలం 3 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇక వరుసగా సన్‌రైజర్స్ రెండో పరాజయం చవిచూడటంతో ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు. మన రాత మారదా ఇక అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్కోరు వివరాలు లక్నో సూపర్‌జెయింట్స్ ఇన్నింగ్స్: రాహుల్ (ఎల్బీ) (బి) నటరాజన్ 68; డికాక్ (సి) విలియమ్సన్ (బి) సుందర్ 1; లూయిస్ (ఎల్బీ) (బి) సుందర్ 1; పాండే (సి) భువనేశ్వర్ (బి) షెఫర్డ్ 11; హుడా (సి) త్రిపాఠి (బి) షెఫర్డ్ 51; బదోని రనౌట్ 19; కృనాల్ (బి) నటరాజన్ 6; హోల్డర్ నాటౌట్ 8; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 169. వికెట్ల పతనం: 1–8, 2–16, 3–27, 4–114, 5–144, 6–150, 7–169. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–25–0, సుందర్ 4–0–28–2, షెఫర్డ్ 4–0–42–2, ఉమ్రాన్ 3–0–39–0, సమద్ 1–0–8–0, నటరాజన్ 4–0–26–2. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) పాండే (బి) అవేశ్ 13; విలియమ్సన్ (సి) టై (బి) అవేశ్ 16; త్రిపాఠి (సి) బిష్ణోయ్ (బి) కృనాల్ 44; మార్క్రమ్ (సి) రాహుల్ (బి) కృనాల్ 12; పూరన్ (సి) హుడా (బి) అవేశ్ 34; సుందర్ (సి) రాహుల్ (బి) హోల్డర్ 18; సమద్ (సి) డికాక్ (బి) అవేశ్ 0; షెఫర్డ్ (సి)బదోని (బి) హోల్డర్ 8; భువనేశ్వర్ (సి) డికాక్ (బి) హోల్డర్ 1; ఉమ్రాన్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1–25, 2–38, 3–82, 4–95, 5–143, 6–143, 7–154, 8–156, 9–157. బౌలింగ్: హోల్డర్ 4–0–34–3, కృనాల్ పాండ్యా 4–0–27–2, అవేశ్‌ఖాన్ 4–0–24–4, ఆండ్రూ టై 4–0–39–0, రవి బిష్ణోయ్ 4–0–29–0. ఐపీఎల్లో నేడు రాజస్తాన్ X బెంగళూరు వేదిక: ముంబై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం. Brilliant bowling performance by #LSG as they defend their total of 169/7 and win by 12 runs 👏👏 Scorecard - https://t.co/89IMzVls6f #SRHvLSG #TATAIPL pic.twitter.com/MY2ZhM3Mqe — IndianPremierLeague (@IPL) April 4, 2022 -
గిల్ గెలిపించాడు...
పుణే: ఐపీఎల్లో కొత్త టీమ్ గుజరాత్ టైటాన్స్ మరో విజయంతో సత్తా చాటింది. శనివారం జరిగిన పోరులో టైటాన్స్ 14 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్ (46 బంతుల్లో 84; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చగా... కెప్టెన్ హార్దిక్ పాండ్యా (27 బంతుల్లో 31; 4 ఫోర్లు) రాణించాడు. ఢిల్లీ బౌలర్లలో ముస్తఫిజుర్ రహమాన్ 3, ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 157 పరుగులు చేసి ఓడిపోయింది. కెప్టెన్ రిషభ్ పంత్ (29 బంతుల్లో 43; 7 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ లోకీ ఫెర్గూసన్ (4/28) నాలుగు వికెట్లతో క్యాపిటల్స్ పని పట్టగా, షమీకి 2 వికెట్లు దక్కాయి. గుజరాత్ బ్యాటింగ్‌లో గిల్ ఇన్నింగ్సే హైలైట్‌గా నిలిచింది. ప్రతీ బౌలర్‌ను సమర్థంగా ఎదుర్కొని పరుగులు రాబట్టిన అతను 32 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అక్షర్ పటేల్ ఓవర్లో రెండు భారీ సిక్సర్లతో దూకుడు కనబర్చిన గిల్... ఖలీల్ ఓవర్లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి సెంచరీ అవకాశం చేజార్చుకున్నాడు. తొలి 10 ఓవర్లలో 66 పరుగులే చేయగలిగిన గుజరాత్... తర్వాతి 10 ఓవర్లలో 105 పరుగులు రాబట్టింది. అనంతరం హార్దిక్ తొలి బంతికే సీఫెర్ట్ (3) వికెట్ తీసి ఢిల్లీని దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత ఫెర్గూసన్ ఒకే ఓవర్లో పృథ్వీ షా (10), మన్దీప్ (18)లను అవుట్ చేయడంతో ఢిల్లీ కష్టాలు పెరిగాయి. ఈ దశలో లలిత్ యాదవ్ (22 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్), పంత్ కలిసి జట్టు ఇన్నింగ్స్‌ను నడిపించారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 41 బంతుల్లోనే 61 పరుగులు జోడించారు. అయితే లలిత్ అనూహ్యంగా రనౌట్ కావడంతో క్యాపిటల్స్ పతనం మొదలైంది. 6 ఓవర్లలో 54 పరుగులు చేయాల్సిన స్థితిలో పంత్ వెనుదిరగడంతో ఢిల్లీ గెలుపుపై ఆశలు కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన అక్షర్ పటేల్, శార్దుల్ కూడా అవుటవ్వ డంతో ఢిల్లీ లక్ష్యానికి దూరంగా నిలిచింది. -
ఐటీఎఫ్ టోర్నీ సింగిల్స్ చాంపియన్ సహజ
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి సహజ యామలపల్లి విజేతగా అవతరించింది. నాగ్‌పూర్‌లో ఆదివారం జరిగిన సింగిల్స్ ఫైనల్లో సహజ 6–5తో ఆధిక్యంలో ఉన్న దశలో ఆమె ప్రత్యర్థి, మూడో సీడ్ ఎమిలీ సీబోల్డ్ (జర్మనీ) గాయం కారణంగా వైదొలిగింది. దాంతో సహజను విజేతగా ప్రకటించారు. సహజ కెరీర్లో ఇదే తొలి ఐటీఎఫ్ సింగిల్స్ టైటిల్ కావడం విశేషం. -
మెహబూబ్ సిస్టర్స్.. అరవై దాటినా పతకాల వేట
అమలాపురం టౌన్ (తూర్పుగోదావరి): పట్టణానికి చెందిన మెహబూబ్ సిస్టర్స్ షకీలా, షాహీరా మాస్టర్ అథ్లెటిక్ పోటీలకు దేశంలో ఎక్కడికి వెళ్లినా పతకాలు గెలిచి వస్తారు. ఇద్దరికీ అరవై ఏళ్ల వయస్సు దాటినా ఇరవై ఏళ్ల వయసులో ఉన్నట్లే చలాకీగా ఆటలాడేస్తారు. వయసులు మా శరీరానికే గాని మనసులకు కాదని అంటారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు ఎస్పీవీ హైస్కూల్ క్రీడా మైదానంలో ఈ నెల 8,9 తేదీల్లో జరిగిన 40వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ స్పోర్ట్స్ మీట్–2022 పోటీల్లో మెహబూబ్ సిస్టర్స్ షాట్ పుట్, లాంగ్ జంప్, డిస్కస్ త్రోలో నాలుగు బంగారు, రెండు వెండి పతకాలు సాధించారు. చదవండి: చిట్టివలస టూ అమెరికా.. రూ. కోటి ఉపకారవేతనంతో రేష్మ ఎంపిక షకీలా 60 ప్లస్ విభాగంలో షాట్ పుట్, లాంగ్ జంప్, డిస్కస్ త్రోలో మొదటి స్థానాల్లో నిలిచి మూడు బంగారు పతకాలను కైవసం చేసుకున్నారు. షాహీరా 70 ప్లస్ విభాగంలో లాంగ్ జంప్‌లో మొదటి స్థానాన్ని సాధించి బంగారు పతకాన్ని, లాంగ్ జంప్, డిస్కస్ త్రోలో ద్వితీయ స్థానాలు సాధించి రెండు వెండి పతకాలను కైవసం చేసుకున్నారు. విజేతలైన మెహబూబ్ సిస్టర్స్‌ను జిల్లా మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు బి.కృష్ణమూర్తి, ఎం.బాపిరాజు అభినందించారు. -
19 ఏళ్ల నిరీక్షణకు తెర...
అర్హుస్ (డెన్మార్క్): థామస్ కప్ పురుషుల టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో 19 ఏళ్ల తర్వాత ఇండోనేసియా జట్టు మళ్లీ విజేతగా నిలిచింది. చైనా జట్టుతో ఆదివారం జరిగిన ఫైనల్లో ఇండోనేసియా 3–0తో గెలిచి 14వసారి థామస్ కప్‌ను సొంతం చేసుకుంది. చివరిసారి ఇండోనేసియా జట్టు 2002లో ఈ మెగా ఈవెంట్‌ను దక్కించుకుంది. తొలి మ్యాచ్‌లో జిన్‌టింగ్ 18–21, 21–14, 21–16తో లు గ్వాంగ్ జును ఓడించాడు. రెండో మ్యాచ్‌లో అల్ఫియాన్–అర్దియాంతో జోడీ 21–12, 21–19తో హిజి టింగ్–జౌ హావో డాంగ్ జంటపై గెలిచింది. మూడో మ్యాచ్‌లో జొనాథన్ క్రిస్టీ 21–14, 18–21, 21–14తో లి ఫి షెంగ్‌పై నెగ్గి ఇండోనేసియాకు విజయాన్ని ఖరారు చేశాడు. మరోవైపు ఉబెర్ కప్ మహిళల టీమ్ చాంపియన్íÙప్ ఫైనల్లో చైనా 3–1తో జపాన్ను ఓడించి 15వసారి చాంపియన్‌గా నిలిచింది. -
ఐపీఎల్: ఢిల్లీ ధమాకా.. ప్లే ఆఫ్స్‌కు చేరువ
అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నీ తాజా సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జోరు కనబరుస్తోంది. రాజస్తాన్ రాయల్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఢిల్లీ 33 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి చేరుకొని ప్లే ఆఫ్స్‌కు చేరువైంది. తొలుత ఢిల్లీ 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ శ్రేయస్ అయ్యర్ (32 బంతుల్లో 43; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ఆకట్టుకోగా... హెట్‌మైర్ (16 బంతుల్లో 28; 5 ఫోర్లు), రిషభ్ పంత్ (24 బంతుల్లో 24; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ముస్తఫిజుర్ (2/22), చేతన్ సకారియా (2/33) రాణించారు. ఛేదనలో రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 121 పరుగులు చేసి ఓడిపోయింది. కెపె్టన్ సంజూ సామ్సన్ (53 బంతుల్లో 70 నాటౌట్; 8 ఫోర్లు, సిక్స్) జట్టు విజయం కోసం ఒంటరి పోరాటం చేశాడు. అన్రిచ్ నోర్జే 2 వికెట్లు తీశాడు. అయ్యర్ కీలక ఇన్నింగ్స్ టాస్ గెలిచిన రాజస్తాన్ సారథి సామ్సన్ ఢిల్లీని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. పిచ్ మందకొడిగా ఉండటంతో పరుగులు సాధించేందుకు ఢిల్లీ ఓపెనర్లు పృథ్వీ షా (10), శిఖర్ ధావన్ (8; 1 ఫోర్) కష్టపడ్డారు. పృథ్వీ షా స్వేచ్ఛగా షాట్లను ఆడలేకపోయాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో హీరోగా నిలిచిన కార్తీక్ త్యాగి ధావన్ రూపంలో రాజస్తాన్‌కు తొలి వికెట్‌ను అందించాడు. మరికాసేపటికే పృథ్వీ షా కూడా పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో క్రీజులో ఉన్న శ్రేయస్ అయ్యర్ కీలక ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. పిచ్‌కు తగ్గట్టు తన ఆటను మార్చుకున్న అతడు భారీ షాట్ల జోలికి పోకుండా సింగిల్స్, డబుల్స్‌కు ప్రాధాన్యమిచ్చాడు. మరో ఎండ్‌లో ఉన్న కెపె్టన్ పంత్ కూడా స్ట్రయిక్ రొటేట్ చేసేందుకే మొగ్గు చూపాడు. కుదురుకున్నాక బ్యాటింగ్ గేర్ మార్చిన శ్రేయస్ అయ్యర్ వరుస ఓవర్లలో రెండు సిక్సర్లు బాది స్కోరు బోర్డును పెంచే ప్రయత్నం చేశాడు. ముస్తఫిజుర్ బౌలింగ్‌లో వికెట్ల మీదకు ఆడుకున్న పంత్ పెవిలియన్‌కు చేరాడు. దాంతో 62 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే తెవాటియా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన శ్రేయస్ అయ్యర్ స్టంపౌట్ అయ్యాడు. హెట్‌మైర్ క్రీజులోకి రాగానే దూకుడు ప్రదర్శించాడు. 15వ ఓవర్లో రెండు ఫోర్లు... 16వ ఓవర్లో మరో మూడు ఫోర్లు బాది ఢిల్లీకి భారీ స్కోరును అందించేలా కనిపించాడు. అయితే ముస్తఫిజుర్ బౌలింగ్‌లో అతడు అవుటయ్యాడు. అనంతరం ధాటిగా ఆడే బ్యాట్స్‌మెన్ లేకపోవడంతో ఢిల్లీ 154 పరుగులకు పరిమితమైంది. సామ్సన్ మినహా... ఛేదనలో రాజస్తాన్ జట్టు ఆరంభం నుంచే తడబడింది. ఓపెనర్లు లివింగ్‌స్టోన్ (1), యశస్వి జైస్వాల్ (5), మిల్లర్ (7) అలా వచ్చి ఇలా వెళ్లారు. దాంతో రాజస్తాన్ 17 పరుగులకే 3 వికెట్లను కోల్పోయింది. ఈ దశలో క్రీజులో ఉన్న సామ్సన్, మహిపాల్ లొమ్రోర్ (24 బంతుల్లో 19; 1 సిక్స్) కాసేపు వికెట్లు పడకుండా అడ్డుకున్నారు. ఈ జోడీని రబడ విడదీశాడు. 15వ ఓవర్లో మూడు ఫోర్లు బాదిన సామ్సన్ 39 బంతుల్లో అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. మరో ఎండ్ నుంచి సహకారం అందకపోవడం... చేయాల్సిన రన్‌రేట్ భారీగా పెరగడంతో సామ్సన్ చివరి వరకు నిలిచినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) లివింగ్‌స్టోన్ (బి) సకారియా 10; ధావన్ (బి) కార్తీక్ త్యాగి 8; శ్రేయస్ అయ్యర్ (స్టంప్డ్) సామ్సన్ (బి) తెవాటియా 43; పంత్ (బి) ముస్తఫిజుర్ 24; హెట్‌మైర్ (సి) సకారియా (బి) ముస్తఫిజుర్ 28; లలిత్ యాదవ్ (నాటౌట్) 14; అక్షర్ పటేల్ (సి) మిల్లర్ (బి) సకారియా 12; అశి్వన్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 154. వికెట్ల పతనం: 1–18, 2–21, 3–83, 4–90, 5–121, 6–142. బౌలింగ్: ముస్తఫిజుర్ 4–0–22–2, మహిపాల్ లొమ్రోర్ 1–0–5–0, సకారియా 4–0–33–2, కార్తీక్ త్యాగి 4–0–40–1, షమ్సీ 4–0–34–0, తెవాటియా 3–0–17–1. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: లివింగ్‌స్టోన్ (సి) పంత్ (బి) అవేశ్ ఖాన్ 1; జైస్వాల్ (సి) పంత్ (బి) నోర్జే 5; సామ్సన్ (నాటౌట్) 70; మిల్లర్ (స్టంప్డ్) పంత్ (బి) అశి్వన్ 7; మహిపాల్ లొమ్రోర్ (సి) అవేశ్ ఖాన్ (బి) రబడ 19; పరాగ్ (బి) పటేల్ 2; తెవాటియా (సి) హెట్‌మైర్ (బి) నోర్జే 9; షమ్సీ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 121. వికెట్ల పతనం: 1–6, 2–6, 3–17, 4–48, 5–55, 6–99. బౌలింగ్: అవేశ్ ఖాన్ 4–0–29–1, నోర్జే 4–0–18–2, అశ్విన్ 4–0–20–1, రబడ 4–0–26–1, అక్షర్ పటేల్ 4–0–27–1. -
ఐకానిక్ మహాభారత్ సాంగ్‌ను ఆలపించిన ముస్లిం: నెటిజన్లు ఫిదా!
సాక్షి, హైదరాబాద్: అలనాటి పాపులర్ టెలివిజన్ సీరియల్ ‘మహాభారత్’ టైటిట్ సాంగ్‌ను ఆసాంతం అద్భుతంగా ఆలపించి ఒక ముస్లిం ప్రశంసలందుకుంటున్నారు. ఆయన స్వరానికి, స్పష్టమైన ఉచ్చారణకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ ఐకానిక్ ట్రాక్‌ను హృద్యంగా ఆలపించిన ఈ వీడియోను మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎస్‌వై ఖురైషి షేర్ చేశారు. బీటింగ్ ది స్టీరియోటైప్స్ అంటూ ఆయన షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హిందూ ఇతిహాసాల ఆధారంగా రూపొందించిన రామాయణ, మహాభారత సీరియల్స్ టెలివిజన్ చరిత్రలో గొప్ప సంచలనం రేపాయి. ఆదివారం ఉదయం ప్రసారమయ్యే వీటి కోసం జనం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేశారు. తాజా వీడియోతో ఈ ఐకానిక్ టైటిల్ సాంగ్ వినపడగానే అందరూ టెలివిజన్ సెట్ల ముందుకు చేరిపోయే వైనాన్ని గుర్తు చేసుకుంటున్నారు. నిమిషం, 9 సెకన్ల నిడివి గల ఈ వీడియో నెటిజనులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దిస్ ఈజ్ ఇండియా అంటూ కమెంట్ చేస్తున్నారు. లక్షా12 వేలకు పైగా వ్యూస్, రీట్వీట్లు, లైక్స్‌తో ఈ వీడియో సందడి చేస్తోంది. -
మాజీ మంత్రి దేవినేని ఉమాకు ఘోర పరాభవం
సాక్షి, విజయవాడ: పరిషత్ ఎన్నికల్లో మాజీ మంత్రి దేవినేని ఉమాకు ఘోర పరాభవం ఎదురైంది. దేవినేని ఉమ నియోజకవర్గం మైలవరంలో వైఎస్సార్సీపీ హవా ప్రదర్శించింది. గొల్లపూడిలో 10 ఎంపీటీసీలకు 10 వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటివరకు 14 జడ్పీటీసీ స్థానాలు వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. -
వినుకొండ యువకుడి ప్రతిభ: పరుగు పందెంలో పసిడి పతకం!
వినుకొండ (నూజెండ్ల): అంతర్జాతీయ పోటీల్లో గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన షేక్ అబ్దుల్లా 5 కిలో మీటర్ల పరుగు పందెం విభాగంలో తొలి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించాడు. భూటాన్‌లో ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు 3వ సౌత్ ఏషియన్ రూరల్ గేమ్స్ జరిగాయి. ఈ పోటీల్లో మొత్తం 4 దేశాల నుంచి 25 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కాగా, అబ్దుల్లా గతంలో కేంద్ర యువజన క్రీడల మంత్రిత్వ శాఖ నేతృత్వంలో యూత్ రూరల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ నిర్వహించిన జాతీయస్థాయి రన్నింగ్ పోటీల్లో 2 సార్లు, అంతర్జాతీయ స్థాయిలో నేపాల్‌లో జరిగిన పోటీల్లో 2 సార్లు గోల్డ్ మెడల్ సాధించాడు. ప్రభుత్వ ప్రోత్సాహం వల్లే.... అంతర్జాతీయ స్థాయి పోటీలకు వెళ్లే ముందు అబ్దుల్లా ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం అబ్దుల్లాకు రూ. 50 వేల ఆర్థికసాయాన్ని చేసింది. ఈ మొత్తాన్ని గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ సమక్షంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అబ్దుల్లాకు అందజేశారు. దీనిపై అబ్దుల్లా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తనను ప్రోత్సహిస్తే 2024 ఒలింపిక్స్‌లో కూడా ప్రతిభ కనబరుస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. -
చేసిన పాపం ఎక్కడికిపోతుంది: రాజ్‌కుంద్రాపై నిర్మాత ఫైర్
సాక్షి, ముంబై: నీలిచిత్రాల కేసులో అరెస్టయిన బాలీవుడ్ నటి, శిల్పా శెట్టి భర్త రాజ్‌కుంద్రాకు మరో భారీ షాక్ తగిలింది. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాపై న్యాయ పోరాటంలో నటుడు, నిర్మాత సచిన్ జోషి విజయం సాధించారు. ఎస్జీపీఎల్ సత్యయుగ్ గోల్డ్ స్కీమ్ వివాదంలో జోషికి సంబంధించిన బంగారాన్ని ఆయనకు అప్పగించాలని, అలాగే చట్టపరమైన చర్యలకు గాను మరో 3 లక్షల రూపాయలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి, సత్యగ్ గోల్డ్ బంగారు పథకంలో తనను మోసం చేశారని ఆరోపించిన సచిన్ జోషి ఈ ఏడాది జనవరిలో వారిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో తాజాగా కోర్టు జోషికి అనుకూలంగా తీర్పునిచ్చింది. జోషికి కిలో బంగారాన్ని అప్పగించడంతోపాటు, కోర్టు ఖర్చుల కింద మూడు లక్షలు రూపాయలు చెల్లించాలని బొంబాయి హైకోర్టు ఆదేశించింది. శిల్పా, రాజ్, ‘సత్యయుగ్ గోల్డ్’ కంపెనీలో అప్పటికి డైరెక్టర్లుగా ఉన్నారు. తక్కువ రేటుకే బంగారం స్కీం పేరుతో పలువురి వద్ద డబ్బులు సేకరించారు. ఇది తమకు చెల్లించలేదని ఆరోపణలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే జోషి కేసులో తాజా తీర్పు వెలువడింది. ఈ తీర్పుపై స్పందించిన సచిన్ జోషి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరేళ్లు తను కష్టపడి దాచుకున్న డబ్బును అక్రమంగా కాజేయాలని చూశారు. 18లక్షలు విలువ చేసే బంగారం తిరిగి ఇవ్వటానికి కుంద్రా సంస్థ 25 లక్షలు డిమాండ్ చేసిందని మండిపడ్డారు. తనబంగారాన్ని తనకివ్వమని అడిగితే, రివర్స్‌లో తనపైనే బురద చల్లారంటూ ఆనాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చివరికి న్యాయమే గెలిచిందని సంతోషం వ్యక్తం చేశారు. చేసిన పాపాలు ఎక్కడిపోతాయి...కర్మ అనుభవించక తప్పదంటూ వ్యాఖ్యానించారు. శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా బాధితులు ఇంకా చాలామంది ఉన్నారని పేర్కొన్నారు. అంతకుముందు పోర్న్ వీడియో స్కాంలో ముంబై పోలీసులు రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసిన వెంటనే సచిన్ జోషి భార్య, నటి ఊర్వశి శర్మ తన ఇన్‌స్టా స్టోరీలో..‘చేసిన పాపంవెంటాడుతుంది’ అంటూ ఒక పోస్ట్ పెట్టడం విశేషం. మరోవైపు సోమవారం అర్థరాత్రి అరెస్ట్ చేసినరాజ్‌కుంద్రా రిమాండ్‌ను మరో మూడు రోజుల పాటు పొడిగించారు. రాజ్ అరెస్ట్ అక్రమమని బెయిల్ మంజూరుచేయాలన్న పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. అనంతరం జూలై 27వరకు పోలీసు కస్టడీ విధించింది. -
జొకోవిచ్ జైత్రయాత్ర
లండన్: ఈ ఏడాది తన అద్వితీయ ఆటతీరు కొనసాగిస్తూ సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆరోసారి చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ జొకోవిచ్ 3 గంటల 24 నిమిషాల్లో 6–7 (4/7), 6–4, 6–4, 6–3తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ బెరెటిని (ఇటలీ)పై గెలుపొందాడు. తద్వారా తన కెరీర్లో 20వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సాధించాడు. ఈ క్రమంలో పురుషుల టెన్నిస్ చరిత్రలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారులుగా ఫెడరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ (స్పెయిన్–20 చొప్పున) పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్ సమం చేశాడు. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 17 లక్షల పౌండ్లు (రూ. 17 కోట్ల 61 లక్షలు), రన్నరప్ బెరెటినికి 9 లక్షల పౌండ్లు (రూ. 9 కోట్ల 32 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఈ సీజన్లో ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ చాంపియన్‌గా నిలిచిన 34 ఏళ్ల జొకోవిచ్ సెప్టెంబర్లలో జరిగే యూఎస్ ఓపెన్‌లోనూ గెలిస్తే రాడ్ లేవర్ (1969లో) తర్వాత ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ ఘనత సాధించిన ప్లేయర్‌గా రికార్డు సృష్టిస్తాడు. తొలి సెట్ కోల్పోయినా... కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతున్న బెరెటిని ఆరంభంలో తడబడ్డాడు. కెరీర్లో 30వ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతున్న జొకోవిచ్ నాలుగో గేమ్‌లో బెరెటిని సర్వీస్‌ను బ్రేక్ చేసి అదే జోరు కొనసాగించి 5–2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే నెమ్మదిగా తేరుకున్న బెరెటిని వరుసగా మూడు గేమ్‌లు గెలిచి స్కోరును 5–5తో సమం చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో బెరెటిని పైచేయి సాధించి తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. తొలి సెట్ కోల్పోయినా అపార అనుభవజ్ఞుడైన జొకోవిచ్ ఒత్తిడికి లోనుకాకుండా సహజశైలిలో ఆడాడు. వరుసగా మూడు సెట్లను సొంతం చేసుకొని బెరెటిని ఆశలను వమ్ము చేశాడు. జొకోవిచ్ 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఆస్ట్రేలియన్ ఓపెన్ (9): 2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019, 2020, 2021 ఫ్రెంచ్ ఓపెన్ (2): 2016, 2021: వింబుల్డన్ (6): 2011, 2014, 2015, 2018, 2019, 2021 యూఎస్ ఓపెన్ (3): 2011, 2015, 2018 -
ఇన్నింగ్స్ ఓటమి దిశగా విండీస్
వెల్లింగ్టన్: విండీస్‌తో రెండో టెస్టులో న్యూజిలాండ్ విజయం దాదాపుగా ఖాయమైనట్లే. వెలుతురులేమితో మూడోరోజు ఆదివారం ఆట నిలిచి పోయే సమయానికి వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 65.4 ఓవర్లలో 6 వికెట్లకు 244 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవాలంటే విండీస్ ఇంకా 85 పరుగులు చేయాల్సి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 124/8తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన విండీస్ మరో 7 పరుగులే జోడించి 131 పరుగులవద్ద ఆలౌటైంది. న్యూజి లాండ్ బౌలర్లు జేమీసన్ (5/34), సౌతీ (5/32) విండీస్ వికెట్ల పతనాన్ని శాసించారు. 329 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించకుండా విండీస్‌ను ఫాలోఆన్ ఇన్నింగ్స్ ఆడించింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ విండీస్ బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. కివీస్ బౌలర్లు బౌల్ట్ (3/75), జేమీసన్ (2/43) విజృంభించగా... జాన్ క్యాంప్‌బెల్ (109 బంతుల్లో 68; 8 ఫోర్లు), కెప్టెన్ జేసన్ హోల్డర్ (89 బంతుల్లో 60 బ్యాటింగ్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీలతో విండీస్‌ను ఆదుకున్నారు. చివర్లో సిల్వా (25 బ్యాటింగ్)తో కలిసి హోల్డర్ ఏడో వికెట్‌కు అజేయంగా 74 పరుగుల్ని జోడించాడు. అనంతరం దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో ఆటను నిలిపివేశారు. -
జార్జియా రీకౌంటింగ్‌లో బైడెన్ గెలుపు
వాషింగ్టన్: రిపబ్లికన్లకు గట్టి పట్టున్న జార్జియా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల రీకౌంటింగ్‌లో డెమొక్రాటిక్ జోబైడెనే గెలుపు సాధించారు. దీంతో 1992 తర్వాత ఈ రాష్ట్రంలో గెలిచిన డెమొక్రాట్ అభ్యర్థిగా బైడెన్ నిలిచారు. ఇటీవల జరిగిన కౌంటింగ్‌లో ట్రంప్ కన్నా బైడెన్‌కు 14వేల ఓట్ల మెజార్టీ లభించింది. ఇరువురి మధ్య మెజార్టీ స్వల్పం కావడంతో ఇక్కడ బ్యాలెట్లను మాన్యువల్‌గా రీకౌంటింగ్ చేశారు. రీకౌంటింగ్‌లో బైడెన్‌కు 12,284 ఓట్ల మెజార్టీ లభించింది. రీకౌంటింగ్ కచ్చితత్వంతో జరిపామని జార్జియా స్టేట్ సెక్రటరీ బ్రాడ్రాఫెన్స్పెర్గర్ చెప్పారు. గత ఫలితాల్లో ఎలాంటి భారీ అవకతవకలు జరగలేదని ఆడిట్లో తేలినట్లు అధికారులు వెల్లడించారు. తమ ఎన్నికల అధికారుల కృషి కారణంగానే స్వల్పకాలంలో రీకౌంటింగ్ పూర్తయిందన్నారు. శుక్రవారం ఈ రీకౌంటింగ్ ఫలితాలన్నీ సర్టిఫై చేయవచ్చని అంచనా. ఈ గెలుపుతో బైడెన్‌కు జార్జియాలోని 16 ఎలక్ట్రోరల్ ఓట్లు లభిస్తాయి. దీంతో ఆయనకు వచ్చిన ఓట్లు 306కు చేరతాయి. 2016లో ట్రంప్ ఈ రాష్ట్రాన్ని హిల్లరీతో పోటీపడి గెలుచుకున్నారు. తాజా రీకౌంటింగ్‌పై ట్రంప్ లీగల్ అధికారులు స్పందిస్తూ ఇంకా సర్టిఫై కాకముందే మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోందన్నారు. న్యాయం జరిగేందుకున్న అన్ని లీగల్ మార్గాలను పరిశీలిస్తామన్నారు. మళ్లీ డబ్ల్యూహెచ్‌వోలో చేరతాం: బైడెన్ తమ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటయ్యాక తిరిగి ప్రపంచ ఆరోగ్య సమాఖ్య(డబ్ల్యూహెచ్‌వో)లో చేరతామని అమెరికా ప్రెసిడెంట్ ఎలక్ట్ జోబైడెన్ స్పష్టం చేశారు. అయితే, డబ్ల్యూహెచ్‌వోలో సంస్కరణలు అవసరమన్నారు. చైనాతో సంబంధాలపై మాట్లాడుతూ ‘శిక్షించడంపై కన్నా నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని చైనాకు అవగాహన కల్పించడం ముఖ్యం’ అని చెప్పారు. ఇతర దేశాలతో కలిసి చైనాకు అవగాహన కలిగించేందుకు యత్నిస్తామని చెప్పారు. పారిస్ పర్యావరణ ఒప్పందంలో కూడా మరలా చేరతామన్నారు. అమెరికా–చైనా సంబంధాలు ట్రంప్ హయాంలో బాగా దెబ్బతిన్నాయి. -
కోల్‌కతా... ఇంకా ఉంది!
దుబాయ్: ఆఖరి పోరులో కెప్టెన్ మోర్గాన్ బ్యాట్‌తో, కమిన్స్ బంతితో శివాలెత్తారు. దీంతో కోల్‌కతా 60 పరుగుల తేడాతో రాజస్తాన్‌ను ఓడించి ఇంటికి పంపించింది. కానీ నైట్‌రైడర్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడం ఇంకా ఖాయం కాలేదు. లీగ్‌లో ముందంజ వేసేందుకు ఆ జట్టు రెండు రోజులు నిరీక్షించాలి. చివరి రెండు మ్యాచ్‌ల ఫలితాలతో ముడిపడిన భవిష్యత్తు కోసం ఎదురుచూడాలి. మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీస్కోరు చేసింది. ఇయాన్ మోర్గాన్ (35 బంతుల్లో 68; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు) చెలరేగాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులకే పరిమితమైంది. బట్లర్ (22 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడగా, పవర్‌ప్లేలోనే 4 వికెట్లు పడగొట్టిన ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ప్యాట్ కమిన్స్ (4/34) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. శివమెత్తిన మోర్గాన్... నితీశ్ రాణా (0), నరైన్ (0), దినేశ్ కార్తీక్ (0) డకౌటైనా కోల్‌కతా స్కోరు హోరెత్తింది. శుబ్‌మన్ గిల్ (24 బంతుల్లో 36; 6 సిక్స్‌లు), రాహుల్ త్రిపాఠి (34 బంతుల్లో 39; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి ధాటిగా ఆడాడు. రెండో వికెట్‌కు 72 పరుగులు జోడించాక ఇన్నింగ్స్ తడబడి ఓ దశలో వందకు (99/5) ముందే సగం వికెట్లను కోల్పోయింది. అయితే మోర్గాన్ చెలరేగి 14వ ఓవర్ నుంచి కోల్‌కతా బ్యాటింగ్ మరో దశకు వెళ్లింది. మోర్గాన్, రసెల్ రాయల్స్ బౌలర్లపై ఆకాశమే హద్దుగా చెలరేగారు. శ్రేయస్ గోపాల్ వేసిన 14వ ఓవర్లో మోర్గాన్ (4, 4, 6, 6) బంతిని నాలుగుసార్లు బౌండరీ దాటించాడు. ఆ తర్వాత రస్సెల్ ఆర్చర్ ఓవర్లో 4, 6 కొట్టిన అతను, కార్తీక్ త్యాగి వేసిన 16వ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాదేశాడు. మూడో బంతిని కవర్స్ మీదుగా ఆడగా... అక్కడ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ మిల్లర్ చక్కగా క్యాచ్ అందుకోవడంతో రసెల్ మెరుపులకు చుక్కెదురైంది. దీంతో తర్వాత రెండు ఓవర్లు జోరు చల్లబడింది. 17, 18వ ఓవర్లలో ఆరేసి పరుగులే వచ్చాయి. కానీ మళ్లీ 19వ ఓవర్లో మోర్గాన్... స్టోక్స్‌ను దంచేశాడు. మొదట కమిన్స్ సిక్స్ కొట్టాడు. తర్వాతి మూడు బంతుల్ని ఆడిన మోర్గాన్ 6, 6, 4గా తరలించాడు. దీంతో ఈ ఓవర్లో ఏకంగా 24 పరుగులొచ్చాయి. చివరి 7 ఓవర్లలోనే కోల్‌కతా 91 పరుగులు చేసింది. సిక్సర్‌తో మొదలై... అంతలోనే కుదేల్ భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ కమిన్స్ తొలి బంతినే ఉతప్ప (6) సిక్సర్‌గా మలిచాడు. తర్వాత స్టోక్స్ (18) ఫోర్, సిక్స్ బాదాడు. ఐదు బంతుల్లోనే 19 పరుగులు రాగా, చివరి బంతికి ఉతప్ప ఔటయ్యాడు. కమిన్స్ మరుసటి ఓవర్లో స్టోక్స్, కెప్టెన్ స్మిత్ (4)లను పెవిలియన్‌కు పంపాడు. సామ్సన్ (1) శివమ్ మావి అవుట్ చేయగా... పవర్ ప్లేలో మూడో ఓవర్ వేసిన కమిన్స్... పరాగ్ (0)ను డకౌట్ చేశాడు. అద్బుతమైన 3–0–29–4 స్పెల్‌తో తన సత్తాను ప్రదర్శించాడు. దీంతో ఐదు ఓవర్లకే సగం వికెట్లు(37/5)ను కోల్పోయిన రాజస్తాన్ లక్ష్యానికి దూరమైంది. బట్లర్, తేవటియా (27 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్), శ్రేయస్ గోపాల్ (23 బంతుల్లో 23; 2 ఫోర్లు) చేసిన పరుగులు... ఆడిన ఆట... రాయల్స్ 20 ఓవర్లు పూర్తి చేయడానికే సరిపోయాయి తప్ప గెలిచేందుకు ఏమాత్రం సరిపోలేదు. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: శుబ్‌మన్ (సి) బట్లర్ (బి) తేవటియా 36; రాణా (సి) సామ్సన్ (బి) ఆర్చర్ 0; త్రిపాఠి (సి) ఉతప్ప (బి) గోపాల్ 39; నరైన్ (సి) స్టోక్స్ (బి) తేవటియా 0; మోర్గాన్ (నాటౌట్) 68; కార్తీక్ (సి) స్మిత్ (బి) తేవటియా 0; రసెల్ (సబ్) మిల్లర్ (బి) త్యాగి 25; కమిన్స్ (సి) సామ్సన్ (బి) త్యాగి 15; నాగర్కోటి (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 191. వికెట్ల పతనం: 1–1, 2–73, 3–74, 4–94, 5–99, 6–144, 7–184. బౌలింగ్: ఆర్చర్ 4–0–19–1, ఆరోన్ 2–0–22–0, గోపాల్ 3–0–44–1, స్టోక్స్ 3–0–40–0, తేవటియా 4–0–25–3, కార్తీక్ త్యాగి 4–0–36–2. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (సి) నాగర్కోటి (బి) కమిన్స్ 6; స్టోక్స్ (సి) కార్తీక్ (బి) కమిన్స్ 18; స్మిత్ (బి) కమిన్స్ 4; సామ్సన్ (సి) కార్తీక్ (బి) మావి 1; బట్లర్ (సి) కమిన్స్ (బి) వరుణ్ 35; పరాగ్ (సి) కార్తీక్ (బి) కమిన్స్ 0; తేవటియా (సి) కార్తీక్ (బి) వరుణ్ 31; గోపాల్ (నాటౌట్) 23; ఆర్చర్ (సి) మావి (బి) కమలేశ్ 6; త్యాగి (సి అండ్ బి) మావి 2; ఆరోన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (19.4 ఓవర్లలో 9 వికెట్లకు) 131. వికెట్ల పతనం: 1–19, 2–27, 3–32, 4–32, 5–37, 6–80, 7–105, 8–125, 9–129. బౌలింగ్: కమిన్స్ 4–0–34–4, శివమ్ మావి 4–1–15–2, వరుణ్ 4–0–20–2, నరైన్ 4–0–37–0, నాగర్కోటి 4–0–24–1. -
కోల్‌కతాకు చెన్నై దెబ్బ
చెన్నై సూపర్ కింగ్స్ పోతూ పోతూ కోల్‌కతానూ లీగ్ నుంచే తీసుకెళ్లనుంది. మిగిలున్న రెండు మ్యాచ్‌ల్ని తప్పనిసరిగా గెలిచినా... అంతంత మాత్రమే ప్లే ఆఫ్స్ అవకాశాలున్న నైట్‌రైడర్స్‌పై సూపర్‌కింగ్స్ దెబ్బ వేసింది. ఈ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ వీరోచితంగా పోరాడగా... జడేజా మెరుపు బ్యాటింగ్‌తో ఉత్కంఠను విజయం వైపు మార్చేశాడు. 30 పరుగులు చేయాల్సిన సమయంలో జడేజా ఒక్కడే 29 పరుగులు బాది గెలిపించాడు. దుబాయ్: ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నాక చెన్నై ఇప్పుడు వరుసగా గెలుస్తోంది. గత మ్యాచ్‌లో బెంగళూరును చిత్తు చేసిన సూపర్‌కింగ్స్... తాజాగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను కోలుకోలేని దెబ్బతీసింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు చేసింది. నితీశ్ రాణా (61 బంతుల్లో 87; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించాడు. ఇన్‌గిడి 2 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన చెన్నై సూపర్‌కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 178 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రుతురాజ్ గైక్వాడ్ (53 బంతుల్లో 72; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెన్నై గెలిచేందుకు అవసరమైన ఇన్నింగ్స్ ఆడేయగా... జడేజా ఆఖర్లో సిక్సర్లతో జట్టును గెలిపించాడు. రాయుడు (20 బంతుల్లో 38; 5 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడాడు. రఫ్ఫాడించిన రాణా తొలి బంతి పడగానే శుబ్‌మన్ గిల్ బౌండరీతో కోల్‌కతాకు మంచి ఆరంభమిచ్చాడు. ఆ మరుసటి బంతి కూడా లైన్ దాటింది. నితీశ్ రాణా కూడా ఓ ఫోర్ కొట్టడంతో ఆ ఓవర్లో 13 పరుగులొచ్చాయి. అయితే సామ్ కరన్, ఇన్‌గిడి కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో తర్వాత 4 ఓవర్లలో 20 పరుగులే వచ్చాయి. ఇక ఆరో ఓవర్‌ను రాణా రఫ్ఫాడించాడు. సాన్‌ట్నర్ బౌలింగ్‌లో వరుసగా 4, 4, 6తో 15 పరుగులు పిండుకున్నాడు. తర్వాత స్వల్ప వ్యవధిలో గిల్ (17 బంతుల్లో 26; 4 ఫోర్లు), సునీల్ నరైన్ (7) అవుట్ కావడంతో రన్‌రేట్ మందగించింది. కాసేపు నితీశ్‌తో జతకలిసిన రింకూ సింగ్ (11 బంతుల్లో 11; 1 ఫోర్) కూడా ఎక్కువ సేపు నిలువకపోయినా... ఉన్నంతసేపయినా ధాటిగా ఆడలేకపోయాడు. దీంతో కాస్త చూసుకొని ఆడిన నితీశ్ రాణా 44 బంతుల్లో (7 ఫోర్లు, 1 సిక్స్) ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. భారీ సిక్సర్లతో... కోల్‌కతా చేతిలో వికెట్లున్న స్కోరు ఆశించినంత వేగం అందుకోలేకపోయింది. తొలి 50 పరుగుల్ని 6.2 ఓవర్లలో చేసిన కోల్‌కతా రెండో 50 (100) పరుగులు చేసేందుకు మరో 8 ఓవర్లు పట్టింది. ఇలా ఆలస్యంగా... 15వ ఓవర్లో మూడంకెల స్కోరును అధిగమించిది. అప్పటిదాకా నింపాదిగా ఆడుతున్న నితీశ్ తర్వాత ఒక్కసారిగా చెలరేగాడు. చెన్నై స్పిన్నర్ కరణ్ శర్మపై భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అతను వేసిన 16వ ఓవర్లో డీప్ మిడ్‌వికెట్, డీప్ స్క్వేర్‌లెగ్, లాంగాన్‌ల మీదుగా వరుసగా మూడు సిక్సర్లు బాదేశాడు. దీంతో ఆ ఓవర్లోనే కోల్‌కతా ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 19 పరుగులు వచ్చాయి. మరుసటి ఓవర్లోనూ రాణా దూకుడు కొనసాగింది. చెన్నై సారథి ధోని వెంటనే పేసర్ దీపక్ చహర్‌కు బంతిని అప్పగించగా... 17వ ఓవర్లో రాణా రెండు బౌండరీలు కొట్టాడు. ఇతని జోరుకు 18వ ఓవర్లో ఇన్‌గిడి బ్రేకువేయగా... ఆఖరి ఓవర్లలో మోర్గాన్ (15), దినేశ్ కార్తీక్ ( 10 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు) బౌండరీలతో స్కోరు పెంచారు. మొదటి 15 ఓవర్లు ఆడి 106/3 స్కోరు చేసిన నైట్‌రైడర్స్ చివరి 5 ఓవర్లలో 66 పరుగులు చేసింది. నడిపించిన రుతురాజ్ లక్ష్యఛేదనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ తొలి ఓవర్లో పరుగులు చేసేందుకు ఇబ్బందిపడ్డా... రెండో ఓవర్ నుంచి సిక్స్, మూడో ఓవర్లో బౌండరీలతో జోరందుకుంది. వాట్సన్ స్క్వేర్‌లెగ్ మీదుగా సిక్సర్ బాదగా... తర్వాత ఓవర్లో రుతురాజ్, వాట్సన్ చెరో ఫోర్ కొట్టారు. వరుణ్ చక్రవర్తి వేసిన ఆరో ఓవర్లో రుతురాజ్ లాంగాఫ్‌లో భారీ సిక్సర్ బాదేశాడు. పవర్ ప్లేలో వికెట్ కోల్పోకుండా చెన్నై 44 పరుగులు చేసింది. జట్టు స్కోరు 8వ ఓవర్లో 50 పరుగులకు చేరగా... అదే ఓవర్లో వాట్సన్ (14)ను చక్రవర్తి పెవిలియన్‌కు పంపాడు. రుతురాజ్‌కు రాయుడు జతయ్యాడు. నితీశ్ రాణా వేసిన పదో ఓవర్లో వరుసగా రాయుడు వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. 16 పరుగులు రావడంతో జోరు తగ్గిన చెన్నైలో జోష్ నింపాడు. ఆ తర్వాత ఓవర్‌ను రుతురాజ్ తన వంతుగా బాదేశాడు. ఫెర్గూసన్ బౌలింగ్‌లో 4, 6 కొట్టాడు. 37 బంతుల్లో (4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రుతురాజ్ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. 12వ ఓవర్లో రాయుడు కూడా కవర్స్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు. చెన్నై 100 పరుగులకు చేరుకుంది. ఇలా మెరుపులతో సాగిపోతున్న చెన్నై స్వల్పవ్యవధిలో కష్టాలెదురయ్యాయి. మొదట రాయుడు, ఆరు బంతుల తేడాతో కెప్టెన్ ధోని ఔటయ్యారు. చెన్నై విజయానికి 32 బంతుల్లో ఇంకా 52 పరుగులు కావాలి. గెలిపించిన జడేజా ఓవర్‌కు పది పరుగులు చేయాల్సిన పరిస్థితి చెన్నైది. ఇలాంటి దశలో సూపర్‌కింగ్స్‌కు వెన్నెముకగా నిలిచిన రుతురాజ్ గైక్వాడ్ కూడా ఔట్ కావడంతో చెన్నై శిబిరంలో కలవరం మొదలైంది. రవీంద్ర జడేజా క్రీజులోకి రాగా ఆఖరి 12 బంతుల్లో 30 పరుగులు చేయాలి. 19వ ఓవర్ వేసిన ఫెర్గూసన్ లయతప్పాడు. దీన్ని అనువుగా మలచుకున్న జడేజా రెచ్చిపోయాడు. 4, 3, 6, 4 చకచకా పరుగులు జతచేశాడు. వైడ్, నోబాల్తోకలిపి ఫెర్గూసన్ 20 పరుగులిచ్చాడు. ఆట ఆఖరి ఓవర్‌కు చేరింది. చెన్నై 10 పరుగులు చేయాల్సివుండగా... కమలేశ్ నాగర్కోటి 0, 2, 1, 0 డాట్ బాల్స్‌తో ఒత్తిడి పెంచాడు. 2 బంతుల్లో 7 పరుగులు చేయాల్సిన దశలో కాస్త ఉత్కంఠ రేగినా... జడేజా డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్స్ బాదేశాడు. ఇక బంతి మిగలగా పరుగు చేస్తే సరిపోతుంది. కానీ దీన్ని కూడా జడేజా లాంగాన్ మీదుగా సిక్సర్ బాదేయడంతో చెన్నై గెలిచి కోల్‌కతాను ముంచింది. తాజా ఫలితంతో ఇప్పుడు అధికారికంగా ముంబై ఇండియన్స్ ‘ప్లే ఆఫ్స్’కు చేరింది. మరోవైపు కోల్‌కతా ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా కోల్పోయినట్లే! స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: గిల్ (బి) కరణ్ శర్మ 26; నితీశ్ రాణా (సి) స్యామ్ కరన్ (బి) ఇన్‌గిడి 87; నరైన్ (సి) జడేజా (బి) సాన్‌ట్నర్ 7; రింకూ సింగ్ (సి) రాయుడు (బి) జడేజా 11; మోర్గాన్ (సి) రుతురాజ్ (బి) ఇన్‌గిడి 15; దినేశ్ కార్తీక్ (నాటౌట్) 21; రాహుల్ త్రిపాఠి (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 172. వికెట్ల పతనం: 1–53, 2–60, 3–93, 4–137, 5–167. బౌలింగ్: దీపక్ చహర్ 3–0–31–0, స్యామ్ కరన్ 3–0–21–0, ఇన్‌గిడి 4–0–34–2, సాన్‌ట్నర్ 3–0–30–1, జడేజా 3–0–20–1, కరణ్ శర్మ 4–0–35–1. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: వాట్సన్ (సి) రింకూ (బి) వరుణ్ 14; రుతురాజ్ (బి) కమిన్స్ 72; రాయుడు (సి) నరైన్ (బి) కమిన్స్ 38; ధోని (బి) వరుణ్ 1; స్యామ్ కరన్ (నాటౌ ట్) 13; జడేజా (నాటౌట్) 31; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 178. వికెట్ల పతనం: 1–50, 2–118, 3–121, 4–140. బౌలింగ్: కమిన్స్ 4–0–31–2, నాగర్కోటి 3–0–34–0, నరైన్ 4–0–23–0, ఫెర్గూసన్ 4–0–54–0, వరుణ్ 4–0–20–2, నితీశ్ రాణా 1–0–16–0. -
సూపర్ స్టోక్స్...
అబుదాబి: కీలక సమయంలో రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు బెన్ స్టోక్స్ (60 బంతుల్లో 107 నాటౌట్; 14 ఫోర్లు 3 సిక్సర్లు) అద్భుత సెంచరీతో తన విలువ చాటుకున్నాడు. ఒత్తిడిని లెక్కచేయకుండా అద్భుత బ్యాటింగ్‌తో ముంబై ఇండియన్స్ బౌలింగ్‌ను తుత్తునీయలు చేశాడు. రాజస్తాన్ ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచాడు. దీంతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ముంబై ఇండియన్స్‌పై 8 వికెట్లతో రాజస్తాన్ రాయల్స్ ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై... హార్దిక్ పాండ్యా (21 బంతుల్లో 60 నాటౌట్; 2 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 20 ఓవర్లలో 5 వికెట్లకు 195 పరుగులు చేసింది. అతని ధాటికి ముంబై చివరి 5 ఓవర్లలో 79 పరుగుల్ని పిండుకుంది. సూర్యకుమార్ (40; 4 ఫోర్లు, 1 సిక్స్), సౌరభ్ తివారీ ( 34; 4 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నారు. ఆర్చర్, గోపాల్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం 196 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్తాన్ మరో 10 బంతులు మిగిలి ఉండగానే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ బెన్ స్టోక్స్ విజృంభణకు, సంజూ సామ్సన్ (31 బంతుల్లో 54 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు జతకూడటంతో రాజస్తాన్ ఐదో విజయాన్ని అందుకుంది. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు అజేయంగా 82 బంతుల్లో 152 పరుగులు జోడించారు. సంక్షిప్త స్కోర్లు: ముంబై ఇండియన్స్: 195/5 (హార్దిక్ పాండ్యా 60 నాటౌట్, సూర్యకుమార్ 40; ఆర్చర్ 2/31, శ్రేయస్ గోపాల్ 2/30), రాజస్తాన్ రాయల్స్: 196/2 (స్టోక్స్ 107 నాటౌట్, సంజూ సామ్సన్ 54 నాటౌట్; ప్యాటిన్సన్ 2/40). -
కేకేఆర్‌పై పంజాబ్ ప్రతాపం
పంజాబ్ తెలుసుగా... 220 పైచిలుకు పరుగులు చేసినా కూడా ఓడింది. సూపర్ ఓవర్లో రెండంటే రెండు పరుగులు చేసిన జట్టు. ఒక్కమాటలో చెప్పాలంటే ఐపీఎల్ తొలి సగం మ్యాచ్‌ల్లో వరుసబెట్టి నిరాశపరిచింది. కానీ ఈ కింగ్స్... చెన్నై కింగ్స్‌లా కాదు! మొదటన్నీ ఓడినా... తర్వాతన్నీ గెలుచుకుంటూ వస్తోంది. ఇప్పుడు ఆరో విజయంతో ‘ప్లే ఆఫ్స్’ దారిలో పడింది. షార్జా: ఈ సీజన్లో పంజాబ్‌ను చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం, అనుమానం కలుగకమానదు. ఒకదశలో ఏడింట ‘ఆరు’ ఓడిపోయిన జట్టు... వరుసగా విజయబావుటా ఎగరేస్తున్న జట్టు ఇదేనా అని కచ్చితంగా అనిపిస్తుంది. కానీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తన ప్రత్యర్థి జట్టపై పంజా విసురుతోంది. ఇది నిజం. అది కూడా వరుసగా! సోమవారం పంజాబ్ 8 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై గెలిచింది. మొదట కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 149 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్ (45 బంతుల్లో 57; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), కెప్టెన్ మోర్గాన్ (25 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. షమీ 3 వికెట్లు పడగొట్టాడు. తర్వాత పంజాబ్ 18.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ క్రిస్ గేల్ (29 బంతుల్లో 51; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరిపించగా... మన్దీప్ (56 బంతుల్లో 66 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) గెలిపించాడు. షమీ తడఖా... పంజాబ్ కెప్టెన్ రాహుల్ టాస్ నెగ్గగానే ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కోల్‌కతా ఇన్నింగ్స్ మొదలైన రెండో బంతికే మ్యాక్స్‌వెల్... నితీశ్ రాణా (0)ను డకౌట్ చేశాడు. రెండో ఓవర్ వేసిన షమీ తన తడాఖా చూపాడు. నాలుగో బంతికి రాహుల్ త్రిపాటి (7)ని, ఆఖరి బంతికి దినేశ్ కార్తీక్ (0)ను డకౌట్ చేశాడు. ఒక్కసారిగా 10/3 స్కోరుతో కోల్‌కతా కష్టాల్లో పడింది. ఈ దశలో ఓపెనర్ గిల్, కెప్టెన్ మోర్గాన్ నిలకడగా ఆడి వికెట్ల పతనాన్ని కాసేపు నిలువరించారు. శుబ్‌మన్ ఫిఫ్టీ... ఆత్మరక్షణలో పడిపోయిన నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌ను శుబ్‌మన్, మోర్గాన్లే నడిపించారు. ఈ జోడీ ఆడినంతవరకు పరుగులకు ఢోకా లేకుండా పోయింది. అయితే ఈ భాగస్వామ్యం ముగిశాక మళ్లీ తర్వాత వచ్చిన వారు కూడా ముందరి బ్యాట్స్‌మెన్‌నే అనుసరించారు. గేల్... మెరుపుల్! కింగ్స్ లక్ష్యఛేదన ఫోర్‌తో మొదలైంది. కమిన్స్ తొలి బంతిని రాహుల్ బౌండరీకి తరలించాడు. జట్టు స్కోరు 47 పరుగుల వద్ద రాహుల్ (25 బంతుల్లో 28; 4 ఫోర్లు) ఔటయ్యాడు. దీంతో గేల్ క్రీజ్‌లోకి వచ్చాడు. వరుణ్ చక్రవర్తి, నరైన్ బౌలింగ్ల్లో భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మరోవైపు ఓపెనర్ మన్దీప్ చూడచక్కని బౌండరీలతో నిలకడగా పరుగులు చేశాడు. 49 బంతుల్లో అర్ధసెంచరీ చేశాడు. జట్టు 13.4 ఓవర్లలో 100 పరుగులను అధిగమించింది. కాసేపటికే గేల్ ఫిఫ్టీ 25 బంతుల్లోనే పూర్తయ్యింది. వీళ్లిద్దరు రెండో వికెట్‌కు సరిగ్గా 100 పరుగులు జత చేశాక గేల్ ఔటైనా... మిగతా లాంఛనాన్ని పూరన్ (2 నాటౌట్)తో కలిసి మన్దీప్ పూర్తి చేశాడు. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: శుబ్‌మన్ గిల్ (సి) పూరన్ (బి) షమీ 57; నితీశ్ రాణా (సి) గేల్ (బి) మ్యాక్స్‌వెల్ 0; రాహుల్ త్రిపాఠి (సి) కేఎల్ రాహుల్ (బి) షమీ 7; దినేశ్ కార్తీక్ (సి) రాహుల్ (బి) షమీ 0; మోర్గాన్ (సి) అశ్విన్ (బి) రవి బిష్ణోయ్ 40; నరైన్ (బి) జోర్డాన్ 6; నాగర్కోటి (బి) అశ్విన్ 6; కమిన్స్ (ఎల్బీడబ్ల్యూ) (బి) రవి బిష్ణోయ్ 1; ఫెర్గూసన్ (నాటౌట్) 24; వరుణ్ చక్రవర్తి (బి) జోర్డాన్ 2; ప్రసిధ్ కృష్ణ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 149. వికెట్ల పతనం: 1–1, 2–10, 3–10, 4–91, 5–101, 6–113, 7–114, 8–136, 9–149. బౌలింగ్: మ్యాక్స్‌వెల్ 2–0–21–1, షమీ 4–0–35–3, అర్‡్షదీప్ సింగ్ 2–0– 18–0, మురుగన్ అశ్విన్ 4–0–27–1, జోర్డాన్ 4–0–25–2, రవి బిష్ణోయ్ 4–1–20–2. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వరుణ్ 28; మన్దీప్ సింగ్ (నాటౌట్) 66; క్రిస్ గేల్ (సి) ప్రసిధ్ కృష్ణ (బి) ఫెర్గూసన్ 51; పూరన్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (18.5 ఓవర్లలో 2 వికెట్లకు) 150. వికెట్ల పతనం: 1–47, 2–147. బౌలింగ్: కమిన్స్ 4–0–31–0, ప్రసి«ధ్ కృష్ణ 3–0–24–0, వరుణ్ చక్రవర్తి 4–0–34–1, నరైన్ 4–0–27–0, ఫెర్గూసన్ 3.5–0–32–1. -
వరుణ్ పాంచ్ పటాకా
వరుణ్ చక్రవర్తి (4–0–20–5) ... ఈ మ్యాచ్‌కు ముందు ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో తీసిన వికెట్లు 7. ఒక మ్యాచ్‌లో గరిష్టంగా పడగొట్టిన వికెట్లు 2. అందుకే ఈ మ్యాచ్‌లోనూ అతనిపై పెద్దగా అంచనాల్లేవు. కానీ ఒక స్పెల్ అతన్ని అందరూ గుర్తుంచుకునేలా చేసింది. బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించింది. పటిష్ట ఢిల్లీ క్యాపిటల్స్ పతనాన్ని శాసించింది. బ్యాటింగ్‌లో నరైన్, నితీశ్ రాణా మెరుపులు... వరుణ్ చక్రవర్తి మాయాజాలం కోల్‌కతాకు ఘనవిజయాన్ని అందించాయి. అబుదాబి: బ్యాటింగ్, బౌలింగ్ రంగాల్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఐపీఎల్ టి20 టోర్నీలో ఆరో విజయాన్ని నమోదు చేసింది. ఈ సీజన్లో అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తోన్న ఢిల్లీ క్యాపిటల్స్‌పై 59 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 194 పరుగులు చేసింది. ఓపెనర్ నితీశ్ రాణా (53 బంతుల్లో 81; 13 ఫోర్లు, 1 సిక్స్), సునీల్ నరైన్ (32 బంతుల్లో 64; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 56 బంతుల్లోనే 115 పరుగుల్ని జోడించి మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. నోర్జే, రబడ, స్టొయినిస్ తలా 2 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వరుణ్ చక్రవర్తి (5/20) మాయాజాలానికి దాసోహమైంది. 20 ఓవర్లలో 9 వికెట్లకు 135 పరుగులే చేసి ఓటమి పాలైంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (38 బంతుల్లో 47; 5 ఫోర్లు), రిషభ్ పంత్ (33 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్) పోరాడారు. కమిన్స్ 3 వికెట్లు పడగొట్టాడు. తడబాటు... కోల్‌కతా ఇన్నింగ్స్ నెమ్మదిగా మొదలైంది. దూకుడుగా ఆడే ప్రయత్నంలో శుభ్‌మన్ గిల్ (9) రెండో ఓవర్లోనే అవుటయ్యాడు. నితీశ్ రాణా క్రీజులో కుదురుకునేందుకు ప్రయత్నిస్తుండగా... నోర్జే అద్భుత యార్కర్‌కు త్రిపాఠి (13) వద్ద సమాధానం లేకపోయింది. ఈ రెండు వికెట్లను దక్కించుకున్న నోర్జే పవర్‌ప్లేలో కోల్‌కతాను 36/2తో కట్టడి చేశాడు. దినేశ్ కార్తీక్ (3) కూడా చేతులెత్తేశాడు. ఎదురు దాడి... ఈ దశలో క్రీజులోకి వచ్చిన నరైన్ ఎదురుదాడి చేశాడు. అశ్విన్ బౌలింగ్‌లో వరుసగా 6,4 బాదాడు. రాణా కూడా బ్యాట్ ఝళిపించడంతో తుషార్ 18 పరుగుల్ని సమర్పించుకున్నాడు. ఈ ఓవర్లో నరైన్ రెండు ఫోర్లు, రాణా సిక్సర్ ఢిల్లీపై ఆధిపత్యం చాటుకున్నారు. బౌలర్ ఎవరైనా బాదడమే లక్ష్యంగా పెట్టుకున్న వీరిద్దరూ చకచకా పరుగులు సాధించారు. ఓవర్లో కనీసం రెండు బౌండరీలు ఉండేలా వీరి విధ్వంసం సాగింది. ఈ క్రమంలో తొలుత 35 బంతుల్లో నితీశ్ అర్ధసెంచరీ అందుకున్నాడు. స్టొయినిస్ బౌలింగ్‌లో దూకుడు పెంచిన నరైన్ 6, 4 బాది అర్ధసెంచరీకి చేరువయ్యాడు. అశ్విన్ ఓవర్లో ఔటయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్న అతను 24 బంతుల్లోనే ఆ మార్క్‌ను అందుకున్నాడు. 4, 6తో 15 పరుగులు పిండుకున్నాడు. తర్వాత కాసేపటికే నరైన్‌ను అవుట్ చేసి రబడ ఈ జోడీని విడదీశాడు. కానీ మరో ఎండ్‌లో రాణా మాత్రం తడబడలేదు. అదే ఓవర్లో ఓ బౌండరీ బాదిన రాణా నోర్జే బౌలింగ్‌లో మరో ఫోర్‌తో ధాటి కొనసాగించాడు. మోర్గాన్ ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు. రబడ బౌలింగ్‌లో 6,4 బాదాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో వరుస బంతుల్లో వీరిద్దరినీ అవుట్ చేసిన స్టొయినిస్ కోల్‌కతాను 200లోపే కట్టడి చేశాడు. ఆరంభంలోనే షాక్... భారీ లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు తొలి బంతికే షాక్ తగిలింది. రహానే (0)ను అవుట్ చేసిన కమిన్స్ ప్రమాదకరంగా కనిపించాడు. అనుకున్నట్లే మూడో ఓవర్లో అద్భుత బంతితో ధావన్ (6) ఆఫ్‌స్టంప్‌ను గిరాటేసిన కమిన్స్ కోల్‌కతా శిబిరంలో ఆనందాన్ని నింపాడు. మరోవైపు ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను శ్రేయస్ భుజానికెత్తుకున్నాడు. దీంతో పవర్‌ప్లేలో ఢిల్లీ కూడా కోల్‌కతా చేసిన స్కోరే సాధించింది. పంత్ జతగా అయ్యర్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. వికెట్‌కు ప్రాధాన్యమిచ్చిన వీరిద్దరూ ఆచితూచి బౌండరీలు బాదుతూ పరుగులు జోడించారు. వరుణ్ తిప్పేశాడు... ఈ జంట క్రీజులో కుదురుకుంటోన్న సమయంలో వరుణ్ తొలిసారిగా బంతిని అందుకున్నాడు. వేసిన రెండో బంతికే పంత్‌ను పెవిలియన్ చేర్చాడు. సిక్స్ కొట్టి జోరు కనబరిచిన హెట్‌మైర్ (10), క్రీజులో పాతుకుపోయిన శ్రేయస్‌లను వరుస బంతుల్లో అవుట్ చేసి మ్యాచ్ గతిని మార్చేశాడు. దీంతో 15 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ 110/5 తో నిలిచింది. ఢిల్లీ విజయ సమీకరణం 30 బంతుల్లో 85 పరుగులుగా ఉండగా 16వ ఓవర్లో మళ్లీ బంతినందుకున్న వరుణ్ తొలి బంతికి స్టొయినిస్ (6), ఐదో బంతికి అక్షర్ (9)లను అవుట్ చేసి ఢిల్లీని దెబ్బ తీశాడు. ఆ తర్వాత ఢిల్లీ కోలుకోలేకపోయింది. చివరి రెండు ఓవర్లలో రబడ (9)ను కమిన్స్, తుషార్ (1)ను ఫెర్గూసన్ అవుట్ చేసి కోల్‌కతాకు ఘనవిజయాన్ని అందించారు. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: గిల్ (సి) అక్షర్ పటేల్ (బి) నోర్జే 9; నితీశ్ రాణా (సి) తుషార్ (బి) స్టొయినిస్ 81; రాహుల్ త్రిపాఠి (బి) నోర్జే 13; దినేశ్ కార్తీక్ (సి) పంత్™ (బి) రబడ 3; సునీల్ నరైన్ (సి) రహానే (బి) రబడ 64; మోర్గాన్ (సి) రబడ (బి) స్టొయినిస్ 17; కమిన్స్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 194. బౌలింగ్: 1–11, 2–35, 3–42, 4–157, 5–194, 6–194. బౌలింగ్: తుషార్ దేశ్‌పాండే 4–0–40–0, నోర్జే 4–0–27–2, రబడ 4–0–33–2, అక్షర్ పటేల్ 1–0–7–0, స్టొయినిస్ 4–0–41–2, రవిచంద్రన్ అశ్విన్ 3–0–45–0. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: రహానే (ఎల్బీడబ్ల్యూ) (బి) కమిన్స్ 0; ధావన్ (బి) కమిన్స్ 6; శ్రేయస్ అయ్యర్ (సి) నాగర్కోటి (బి) వరుణ్ 47; రిషభ్ పంత్ (సి) గిల్ (బి) వరుణ్ 27; హెట్‌మైర్ (సి) రాహుల్ త్రిపాఠి (బి) వరుణ్ 10; స్టొయినిస్ (సి) రాహుల్ త్రిపాఠి (బి) వరుణ్ 6; అక్షర్ పటేల్ (బి) వరుణ్ 9; రబడ (సి) రాహుల్ త్రిపాఠి (బి) కమిన్స్ 9; రవిచంద్రన్ అశ్విన్ (నాటౌట్) 14; తుషార్ దేశ్‌పాండే (సి) మోర్గాన్ (బి) ఫెర్గూసన్ 1; నోర్జే (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 135. వికెట్ల పతనం: 1–0, 2–13, 3–76, 4–95, 5–95, 6–110, 7–112, 8–132, 9–135. బౌలింగ్: కమిన్స్ 4–0–17–3, ప్రసిధ్ కృష్ణ 2–0–19–0, కమలేశ్ నాగర్కోటి 2–0–11–0, ఫెర్గూసన్ 4–0–30–1, నరైన్ 4–0–37–0, వరుణ్ చక్రవర్తి 4–0–20–5. అంకితం! నితీశ్ రాణాకు అత్యంత ఆత్మీయుడైన అతని మామ సురీందర్ మార్వా గురువారం మరణించారు. మ్యాచ్‌లో అర్ధసెంచరీ సాధించిన అనంతరం ఆయన పేరుతో ఉన్న కేకేఆర్ జెర్సీని ప్రదర్శిస్తూ రాణా ఇలా నివాళి అర్పించాడు. -
పండగ పంజాబ్‌దే...
విజయలక్ష్యం 127 పరుగులు... స్కోరు 100/3... మరో 24 బంతుల్లో 27 పరుగులు చేస్తే చాలు... కానీ ఇలాంటి స్థితి నుంచి కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ పరాజయాన్ని వెతుక్కుంటూ వెళ్లింది. 23 బంతుల్లో మిగిలిన 7 వికెట్లు చేజార్చుకొని కుప్పకూలింది. కట్టుదిట్టమైన బౌలింగ్, చక్కటి ఫీల్డింగ్‌కు తోడు ఓటమిని అంగీకరించని తత్వం, పట్టుదలతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అనూహ్య విజయాన్ని అందుకుంది. ఈ సీజన్లో అనేక మ్యాచ్‌లలో చివరి క్షణం వరకు తీవ్ర ఉత్కంఠను అనుభవించిన రాహుల్ సేన కీలక సమయంలో ఒత్తిడిని తట్టుకొని సగర్వంగా నిలబడింది. ఓటమి ఖాయమైన మ్యాచ్‌ను గెలుచుకొని సత్తా చాటింది. తాజా ఫలితం సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను బాగా దెబ్బ తీసింది. దుబాయ్: ఐపీఎల్–2020లో మరో అనూహ్య ఫలితం... గెలవాల్సిన స్థితిలో ఉండి కూడా హైదరాబాద్ జట్టు చేజేతులా ఓటమిని ఆహ్వానించింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 12 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 126 పరుగులే చేయగలిగింది. నికోలస్ పూరన్ (28 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రషీద్ ఖాన్ (2/14) కింగ్స్ ఎలెవన్ బ్యాట్స్‌మెన్ పని పట్టగా... హోల్డర్, సందీప్ కూడా చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 19.5 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌటైంది. డేవిడ్ వార్నర్ (20 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే దూకుడుగా ఆడాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ క్రిస్ జోర్డాన్ (3/17), అర్‡్షదీప్ సింగ్ (3/23) పంజాబ్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. అందరూ అందరే... తొలి బంతి నుంచి చివరి బంతి వరకు పంజాబ్ ఇన్నింగ్స్ పేలవంగా సాగింది. సన్‌రైజర్స్ కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు జట్టు బ్యాట్స్‌మెన్ తేలిపోయారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (27 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్), మన్దీప్ సింగ్ (17) దూకుడుగా ఆడటంలో విఫలమయ్యారు. ఫలితంగా ఈ జోడి తొలి వికెట్‌కు 30 బంతుల్లో 37 పరుగులే జోడించగలిగింది. సందీప్ బౌలింగ్‌లో మన్దీప్ వెనుదిరగ్గా, పవర్‌ప్లేలో స్కోరు 47 పరుగులకు చేరింది. అయితే 66 పరుగుల వద్ద పంజాబ్‌కు అసలు దెబ్బ పడింది. వరుస బంతుల్లో గేల్ (20 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ అవుట్ కావడంతో జట్టు పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఎప్పటిలాగే మ్యాక్స్‌వెల్ (12) విఫలం కాగా, దీపక్ హుడా (0) నిలబడలేకపోయాడు. మరో ఎండ్‌లో ఉన్న పూరన్ మాత్రం కాస్త పోరాడే ప్రయత్నం చేసినా అతని బ్యాటింగ్‌లో కూడా ధాటి లోపించింది. తొలి పది ఓవర్లలో 66 పరుగులు చేసిన పంజాబ్, తర్వాతి పది ఓవర్లలో 60 పరుగులే చేయగలిగింది. జట్టు ఇన్నింగ్స్‌లో మొత్తం 7 ఫోర్లు, 2 సిక్సర్లు మాత్రమే ఉన్నాయి. 75 బంతులు... బౌండరీనే లేదు! పంజాబ్ పస లేని బ్యాటింగ్‌కు ఇదో ఉదాహరణ. 120 బంతుల ఇన్నింగ్స్‌లో ఒకదశలో వరుసగా 75 బంతుల పాటు (12.3 ఓవర్లు) బ్యాట్స్‌మెన్ ఒక్క ఫోర్ కూడా కొట్టలేకపోయారు. హోల్డర్ వేసిన ఆరో ఓవర్ చివరి బంతికి గేల్ ఫోర్ కొట్టగా... ఖలీల్ వేసిన 19వ ఓవర్ మూడో బంతికి పూరన్ ఫోర్ కొట్టాడు. జట్టు ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగు చేయని డాట్ బంతులు మొత్తం 48 ఉన్నాయి! నాన్న చనిపోయినా... పంజాబ్ ఓపెనర్ మన్దీప్ భారమైన హృదయంతో మ్యాచ్ ఆడాడు. అతని తండ్రి శుక్రవారమే చనిపోయారు. అయితే స్వస్థలం కూడా వెళ్లలేని స్థితిలో మన్దీప్ కొనసాగాడు. ఈ నేపథ్యంలో పంజాబ్ ఆటగాళ్లు నల్లరంగు రిబ్బన్లు ధరించి బరిలోకి దిగారు. గత మ్యాచ్‌లో గాయపడిన మయాంక్ స్థానంలో మన్దీప్ జట్టులోకి వచ్చాడు. వార్నర్ జోరు... స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వార్నర్, బెయిర్‌స్టో (20 బంతుల్లో 19; 4 ఫోర్లు) జట్టుకు శుభారంభం అందించారు. పంజాబ్‌తో ఆడిన గత 9 మ్యాచ్‌లలో వరుసగా ప్రతీసారి అర్ధ సెంచరీ చేసిన అద్భుత రికార్డు ఉన్న వార్నర్ ఇప్పుడు కూడా అదే జోరును ప్రదర్శించాడు. తొలి రెండు ఓవర్లలో ఒక్కో సిక్స్ కొట్టిన అతను, షమీ ఓవర్లో మరో రెండు ఫోర్లు బాదాడు. అయితే బిష్ణోయ్ బౌలింగ్‌లో రివర్స్‌స్వీప్‌కు ప్రయత్నించి కీపర్‌కు క్యాచ్ ఇవ్వడంతో అతను పదో హాఫ్ సెంచరీ అవకాశం కోల్పోయాడు. మరో రెండు పరుగులకే బెయిర్‌స్టో కూడా అవుట్ కాగా, సమద్ (7) విఫలమయ్యాడు. ఈ దశలో మనీశ్ పాండే (29 బంతుల్లో 15), విజయ్ శంకర్ (27 బంతుల్లో 26; 4 ఫోర్లు) కలిసి జట్టును విజయం దిశగా నడిపించారు. మరీ నెమ్మదిగా ఆడి 33 పరుగులు జోడించేందుకు 44 బంతు లు తీసుకున్నారు. గత మ్యాచ్‌లో చెలరేగిన పాండే అయితే ఒక్కో పరుగు కోసం తంటాలు పడ్డాడు. చివరకు భారీ షాట్‌కు యత్నించి అవుటయ్యాడు. స్కోరు వివరాలు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: రాహుల్ (బి) రషీద్ 27; మన్దీప్ (సి) రషీద్ (బి) సందీప్ 17; గేల్ (సి) వార్నర్ (బి) హోల్డర్ 20; పూరన్ (నాటౌట్) 32; మ్యాక్స్‌వెల్ (సి) వార్నర్ (బి) సందీప్ 12; దీపక్ హుడా (స్టంప్డ్) బెయిర్‌స్టో (బి) రషీద్ 0; జోర్డాన్ (సి) ఖలీల్ (బి) హోల్డర్ 7; మురుగన్ అశ్విన్ (రనౌట్) 4; రవి బిష్ణోయ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 126. వికెట్ల పతనం: 1–37; 2–66; 3–66; 4–85; 5–88; 6–105; 7–110. బౌలింగ్: సందీప్ శర్మ 4–0–29–2; ఖలీల్ 4–0–31–0; హోల్డర్ 4–0–27–2; రషీద్ ఖాన్ 4–0–14–2; నటరాజన్ 4–0–23–0. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) రాహుల్ (బి) బిష్ణోయ్ 35; బెయిర్‌స్టో (బి) అశ్విన్ 19; పాండే (సి) (సబ్) సుచిత్ (బి) జోర్డాన్ 15; సమద్ (సి) జోర్డాన్ (బి) షమీ 7; శంకర్ (సి) రాహుల్ (బి) అర్‡్షదీప్ 26; హోల్డర్ (సి) మన్దీప్ (బి) జోర్డాన్ 5; గార్గ్ (సి) జోర్డాన్ (బి) అర్‡్షదీప్ 3; రషీద్ (సి) పూరన్ (బి) జోర్డాన్ 0; సందీప్ (సి) అశ్విన్ (బి) అర్‡్షదీప్ 0; నటరాజన్ (నాటౌట్) 0; ఖలీల్ (రనౌట్) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్) 114. వికెట్ల పతనం: 1–56; 2–58; 3–67; 4–100; 5–110; 6–112; 7–112; 8–114; 9–114; 10–114. బౌలింగ్: షమీ 4–0–34–1; అర్‡్షదీప్ 3.5–0–23–3; అశ్విన్ 4–0–27–1; బిష్ణోయ్ 4–0–13–1; జోర్డాన్ 4–0–17–3. టర్నింగ్ పాయింట్... 17వ ఓవర్ తొలి బంతికి జోర్డాన్ బౌలింగ్‌లో పాండే అవుట్ కావడంతో రైజర్స్ పతనం మొదలైంది. సబ్‌స్టిట్యూట్ సుచిత్ బౌండరీ లైన్ వద్ద గాల్లో లేచి అద్భుతంగా క్యాచ్ పట్టాడు. తర్వాతి ఓవర్లో శంకర్ వెనుదిరగ్గా, 19వ ఓవర్లో రెండు, 20వ ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయిన జట్టు ఓటమిని ఖాయం చేసుకుంది. జోర్డాన్, బౌండరీ లైన్ వద్ద గాల్లోకి ఎగిరి పాండే క్యాచ్ పట్టిన సుచిత్ -
‘సిక్సర’ పాండే
హైదరాబాద్ చావోరేవో తేల్చుకుంది. రాజస్తాన్‌ను బంతితో ఉక్కిరి బిక్కిరి చేసింది. బ్యాట్‌తో చకచకా పరుగులు జతచేసింది. ముఖ్యంగా మనీశ్ పాండే ఆట నిజంగా హైలైట్సే! ఆరంభంలోనే స్టార్ ఓపెనర్ల (వార్నర్, బెయిర్‌స్టో)ను కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో ఉన్న దశలో మనీశ్ సిక్సర్లతో శివతాండవం చేశాడు. ఇన్నింగ్స్ ఆసాంతం అతని మెరుపులు...విజయ్ శంకర్‌తో కలిసి జోడించిన పరుగులు రాజస్తాన్‌ను చిత్తు చేశాయి. దుబాయ్: ఓడితే ముందడుగు కష్టమయ్యే పరిస్థితుల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ శ్రమించింది. ముందు బౌలింగ్‌తో తర్వాత మెరుపు బ్యాటింగ్‌తో ప్రత్యర్థిని చిత్తు చేసింది. గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 8 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌పై జయభేరి మోగించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. సంజూ సామ్సన్ (26 బంతుల్లో 36; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడాడు. హోల్డర్ 3 వికెట్లు తీశాడు. తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసి గెలిచింది. మనీశ్ పాండే (47 బంతుల్లో 83 నాటౌట్; 4 ఫోర్లు, 8 సిక్స్‌లు) సిక్సర్ల జడివాన కురిపించాడు. విజయ్ శంకర్ (51 బంతుల్లో 52 నాటౌట్; 6 ఫోర్లు) రాణించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 93 బంతుల్లోనే అభేద్యంగా 140 పరుగులు జత చేశారు. సన్‌రైజర్స్ జట్టులో గాయపడిన కేన్ విలియమ్సన్, బాసిల్ తంపి స్థానాల్లో హోల్డర్, నదీమ్‌లను తీసుకుంది. చప్పగా సాగిన రాజస్తాన్ ఇన్నింగ్స్ ఇకపై ఆడే మ్యాచ్‌లన్నీ గెలిచి తీరాల్సిన స్థితిలో రాజస్తాన్ రాయల్స్ బాధ్యత విస్మరించింది. ముందు బ్యాటింగ్‌కు దిగిన రాయల్స్ బ్యాట్స్‌మెన్‌లో ఆ నిర్లక్ష్యం కనబడింది. రెండు ఫోర్లు, ఓ సిక్స్ కొట్టిన ఓపెనర్ రాబిన్ ఉతప్ప (19) రనౌటయ్యాడు. మరో ఓపెనర్ స్టోక్స్ (32 బంతుల్లో 30; 2 ఫోర్లు) చేసిన పరుగుల కంటే ఆడిన బంతులే ఎక్కువ. ఇతను, సంజూ సామ్సన్ చాలా సేపే క్రీజులో ఉన్నా... అప్పటికీ చేతిలో 9 వికెట్లున్నా... పెద్దగా బ్యాట్‌కు పనిచెప్పలేదు. దీంతో 8.1 ఓవర్ల పాటు క్రీజులో ఉన్న ఈ జోడీ కొట్టింది మూడే బౌండరీలు... సిక్సయితే ఒక్కటే! నింపాదిగా సాగిన వీరిద్దరి ఆట రాజస్తాన్ ఇన్నింగ్స్‌కు ఏమాత్రం అక్కరకు రాకుండా పోయింది. ఇదే అదనుగా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో హైదరాబాద్ పట్టు బిగించింది. సామ్సన్ను హోల్డర్, స్టోక్స్‌ను రషీద్ ఖాన్ వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చారు. ఆ తర్వాత బట్లర్ (9), కెప్టెన్ స్మిత్ (19) వచ్చినా రాజస్తాన్ రాత మార్చలేకపోయారు. స్మిత్‌ను, కాస్తోకూస్తో మెరిపించిన రియాన్ పరాగ్ (12 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్)ను కూడా హోల్డరే ఔట్ చేశాడు. ఆఖర్లో ఆర్చర్ (7 బంతుల్లో 16 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) కొట్టిన సిక్స్ ఫోర్‌తో రాయల్స్ 150 పరుగులు దాటగలిగింది. ఆరంభానికి ఆర్చర్ తూట్లు ఏమంత కష్టసాధ్యం కానీ లక్ష్యమే అయినా... హైదరాబాద్ తడబడింది. రాయల్స్ పేసర్ ఆర్చర్ నిప్పులు చెరిగే బౌలింగ్‌తో సన్‌రైజర్స్ ఆరంభానికి తూట్లు పొడిచాడు. వరుస ఓవర్లలో డాషింగ్ ఓపెనర్లిద్దరినీ ఔట్ చేయడంతో హైదరాబాద్ ఆత్మరక్షణలో పడింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన ఆర్చర్ నాలుగో బంతికి వార్నర్ (4)ను అవుట్ చేశాడు. తన మరుసటి ఓవర్లో (ఇన్నింగ్స్ 3వ) బెయిర్‌స్టో (10)ను బౌల్డ్ చేశాడు. 16 పరుగులకే 2 వికెట్లు కోల్పోవడంతో రాజస్తాన్ శిబిరంలో ఉత్సాహం ఒక్కసారిగా ఉరకలెత్తింది. భారీ భాగస్వామ్యం... అయితే రాయల్స్ ఆనందం అంతలోనే ఆవిరైంది. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన మనీశ్‌పాండే ప్రత్యర్థి బౌలర్లపై సిక్సర పిడుగులతో చెలరేగాడు. కార్తీక్ త్యాగి తొలి ఓవర్లో రెండు బౌండరీలు బాదిన పాండే... స్టోక్స్ వేసిన వరుసటి ఓవర్లో డీప్ స్క్వేర్ లెగ్, మిడ్ వికెట్ల మీదుగా రెండు సిక్సర్లు కొట్టాడు. మరో ఎండ్‌లో విజయ్ శంకర్ నింపాదిగా అడుతూ పాండేకు అండగా నిలిచాడు. అంతటితో ఆగని మనీశ్... త్యాగి మళ్లీ బంతి బౌలింగ్‌కు దిగితే తను మళ్లీ భారీ షాట్లు బాదాడు. ఒక ఫోర్, 2 సిక్సర్లు కొట్టడంతో ఆ ఓవర్లో 18 పరుగులు వచ్చాయి. 5.4 ఓవర్లలో హైదరాబాద్ స్కోరు 50 దాటేసింది. తర్వాత కాసేపటికే శ్రేయస్ గోపాల్ ఓవర్లో పాండే మరో సిక్స్ బాదాడు. 28 బంతుల్లో తనూ ఫిఫ్టీ (3 ఫోర్లు, 5 సిక్సర్లు) పూర్తి చేసుకున్నాడు. విజయ్ శంకర్ కూడా అడపాదడపా బౌండరీలు కొట్టడంతో హైదరాబాద్ స్కోరు, జోరు ఏమాత్రం తగ్గలేదు. 12.3 ఓవర్లలోనే సన్ 100 పరుగులను చేరుకుంది. వీరిద్దరి భాగస్వామ్యం ఇలాగే దూసుకెళ్లడంతో సమీకరణం సులువైంది. ఆఖరి 30 బంతుల్లో 37 పరుగులే చేయాలి. ఈ దశలో 16వ ఓవర్ వేసిన ఆర్చర్ బౌలింగ్‌లో శంకర్ వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. ఈ ఓవర్లో 13 పరుగులు రావడంతో మిగిలిన నాలుగు ఓవర్లలో బంతికో పరుగు చేసేలా మారిపోయింది. మనీశ్ ఓవర్‌కో సిక్స్ బాదడంతో 11 బంతులు మిగిలుండగానే హైదరాబాద్ గెలిచింది. పాండే, శంకర్ అబేధ్యమైన మూడో వికెట్‌కు 140 పరుగులు జోడించడం విశేషం. సన్‌రైజర్స్ తరఫున గతంలో పలు శతక భాగస్వామ్యాలు ఉన్నాయి. కానీ విదేశీ ఆటగాడి ప్రమేయం లేకుండా... ఇద్దరు భారత ఆటగాళ్లే కలిసి వంద పరుగులకు పైగా భాగస్వామ్యం నమోదు చేయడం మాత్రం ఇదే తొలిసారి. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (రనౌట్) 19; స్టోక్స్ (బి) రషీద్ ఖాన్ 30; సామ్సన్ (బి) హోల్డర్ 36; బట్లర్ (సి) నదీమ్ (బి) శంకర్ 9; స్మిత్ (సి) మనీశ్ పాండే (బి) హోల్డర్ 19; పరాగ్ (సి) వార్నర్ (బి) హోల్డర్ 20; తేవటియా (నాటౌట్) 2; ఆర్చర్ (నాటౌట్) 16; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 154. వికెట్ల పతనం: 1–30, 2–86, 3–86, 4–110, 5–134, 6–135. బౌలింగ్: సందీప్ శర్మ 4–0–31–0, హోల్డర్ 4–0–33–3, శంకర్ 3–0–15–1, నటరాజన్ 4–0–46–0, రషీద్ 4–0–20–1, నదీమ్ 1–0–9–0. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) స్టోక్స్ (బి) ఆర్చర్ 4; బెయిర్‌స్టో (బి) ఆర్చర్ 10; మనీశ్ పాండే (నాటౌట్) 83; విజయ్ శంకర్ (నాటౌట్) 52; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (18.1 ఓవర్లలో 2 వికెట్లకు) 156. వికెట్ల పతనం: 1–4, 2–16. బౌలింగ్: ఆర్చర్ 4–0–21–2, అంకిత్ రాజ్‌పుత్ 1–0–11–0, కార్తీక్ త్యాగి 3.1–0–42–0, స్టోక్స్ 2–0–24–0, గోపాల్ 4–0–32–0, తేవటియా 4–0–25–0. హోల్డర్‌కు సహచరుల అభినందన -
ఐపీఎల్లో సి‘రాజ్’
మొహమ్మద్ సిరాజ్... కోల్‌కతాతో మ్యాచ్‌కు ముందు ఐపీఎల్లో అతి చెత్త బౌలర్లలో ఒకడిగా గుర్తింపు... కనీసం 100కు పైగా ఓవర్లు వేసిన 92 మంది బౌలర్లలో అందరికంటే ఎక్కువగా 9.29 ఎకానమీతో అతను పరుగులిచ్చాడు... సోషల్ మీడియాలో అతనిపై లెక్కలేనన్ని ట్రోలింగ్లు... కానీ ఒక అద్భుత స్పెల్ అతడిని ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేసింది. తన తొలి రెండు ఓవర్లలో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా అతను తీసిన 3 వికెట్లు బెంగళూరు విజయానికి పునాది వేశాయి. సిరాజ్‌తో పాటు ఇతర బెంగళూరు బౌలర్లు కూడా చెలరేగడంతో నైట్‌రైడర్స్ కుప్పకూలింది. చెత్త బ్యాటింగ్‌తో 84 పరుగులకే పరిమితమై ఓటమికి ఆహ్వానం పలికింది. ఆ తర్వాత సునాయాస విజయాన్ని అందుకున్న కోహ్లి సేన అదనంగా రన్‌రేట్‌ను కూడా మెరుగుపర్చుకొని రెండో స్థానానికి దూసుకుపోయింది. అబుదాబి: ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఆట మరింత పదునెక్కింది. గొప్ప బ్యాటింగ్ వనరులున్నా పేలవ బౌలింగ్‌తో పలు మ్యాచ్‌లు చేజార్చుకున్న ఆ జట్టు ఈసారి కేవలం బౌలింగ్ ప్రదర్శనతోనే భారీ విజయాన్ని అందుకుంది. బుధవారం జరిగిన పోరులో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (34 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సిరాజ్ (3/8) చెలరేగగా, చహల్ (2/15) ఆకట్టుకున్నాడు. అనంతరం బెంగళూరు 13.3 ఓవర్లలో 2 వికెట్లకు 85 పరుగులు సాధించింది. దేవదత్ పడిక్కల్ (17 బంతుల్లో 25; 3 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మోర్గాన్ మినహా... కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) బ్యాటింగ్ తీరు చూస్తే ఐపీఎల్లో అన్ని చెత్త రికార్డులు ఆ జట్టు తమ పేరిట లిఖించుకునేలా కనిపించింది. సిరాజ్ దెబ్బకు రాహుల్ త్రిపాఠి (1), నితీశ్ రాణా (0), బాంటన్ (10) వెనుదిరగ్గా... సైనీ బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్ (1) చెత్త షాట్ ఆడి నిష్క్రమించాడు. దినేశ్ కార్తీక్ (4) కూడా చేతులెత్తేయడంతో ఆదుకునే భారం మోర్గాన్‌పై పడింది. నిలదొక్కుకునేందుకు సమయం తీసుకున్న కేకేఆర్ కెప్టెన్ కొన్ని చక్కటి షాట్లతో ఇన్నింగ్స్‌ను నడిపించాడు. అయితే మరో భారీ షాట్‌కు ప్రయత్నించి సుందర్ బౌలింగ్‌లో మోర్గాన్ అవుట్ కావడంతో కనీస స్కోరు సాధించాలన్న కోల్‌కతా ఆశలు సన్నగిల్లాయి. చివర్లో ఫెర్గూసన్ (19 నాటౌట్), కుల్దీప్ (12) నిలబడటంతో జట్టు ఆలౌట్ కాకుండా ఉండిపోయింది. ఈ క్రమంలో ఐపీఎల్లో ఆలౌట్ కాకుండా అతి తక్కువ స్కోరు (గతంలో పంజాబ్ 92/8) చేసిన జట్టుగా నిలిచింది. మొత్తంగా కోల్‌కతా ఐపీఎల్లో తమ అత్యల్ప స్కోరు (67)ను దాటగలిగింది. చకచకా... లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పడిక్కల్, ఫించ్ తొలి వికెట్‌కు 38 బంతుల్లో 46 పరుగులు జోడించారు. వీరిద్దరు ఒకే స్కోరు వద్ద అవుటైనా... గుర్కీరత్ (26 బంతుల్లో 21 నాటౌట్; 4 ఫోర్లు), కోహ్లి (17 బంతుల్లో 18 నాటౌట్; 2 ఫోర్లు) కలిసి మిగతా పనిని పూర్తి చేశారు. ఈ జంట 31 బంతుల్లో 39 పరుగులు జత చేయడంతో మరో 39 బంతులు మిగిలి ఉండగానే బెంగళూరు గెలిచింది. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: శుబ్‌మన్ (సి) మోరిస్ (బి) సైనీ 1; త్రిపాఠి (సి) డివిలియర్స్ (బి) సిరాజ్ 1; రాణా (బి) సిరాజ్ 0; బాంటన్ (సి) డివిలియర్స్ (బి) సిరాజ్ 10; కార్తీక్ (ఎల్బీ) (బి) చహల్ 4; మోర్గాన్ (సి) గుర్కీరత్ (బి) సుందర్ 30; కమిన్స్ (సి) పడిక్కల్ (బి) చహల్ 4; కుల్దీప్ (రనౌట్) 12; ఫెర్గూసన్ (నాటౌట్) 19; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 84. వికెట్ల పతనం: 1–3; 2–3; 3–3; 4–14; 5–32; 6–40; 7–57; 8–84. బౌలింగ్: మోరిస్ 4–1–16–0; సిరాజ్ 4–2–8–3; సైనీ 3–0–23–1; ఉదాన 1–0–6–0; చహల్ 4–0–15–2; సుందర్ 4–1–14–1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: పడిక్కల్ (రనౌట్) 25; ఫించ్ (సి) కార్తీక్ (బి) ఫెర్గూసన్ 16; గుర్కీరత్ (నాటౌట్) 21; కోహ్లి (నాటౌట్) 18; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (13.3 ఓవర్లలో 2 వికెట్లకు) 85. వికెట్ల పతనం: 1–46; 2–46. బౌలింగ్: కమిన్స్ 3–0–18–0; ప్రసిధ్ కృష్ణ 2.3–0–20–0; వరుణ్ చక్రవర్తి 4–0–28–0; ఫెర్గూసన్ 4–0–17–1. కొత్త బంతితో బౌలింగ్ చేసే అవకాశం ఇచ్చిన కోహ్లికి కృతజ్ఞతలు. మేం మైదానంలోకి వెళ్లినప్పుడు ముందుగా దాని గురించి అనుకోలేదు. కానీ సిద్ధంగా ఉండు అని విరాట్ చెప్పాడు. కొత్త బంతితో నేను చాలా సాధన చేస్తున్నాను. అది ఇక్కడ పని చేసింది. రాణాను అవుట్ చేసిన బంతి చాలా బాగా పడింది. –సిరాజ్ కొత్త బంతిని మోరిస్, సుందర్ పంచుకోవాలనేది మొదటి ఆలోచన. కానీ దానిని మార్చి సిరాజ్‌ను ముందుకు తెచ్చాం. ప్రతీది మా ప్రణాళిక ప్రకారమే చేశాం. గత ఏడాది సిరాజ్ అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈసారి నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్ చేశాడు. దాని ఫలితాలు ఇప్పుడు కనిపించాయి. –కోహ్లి సూపర్ స్పెల్... 0,0,0,0,0,0... 0,0,0,0,0,0... 1,0,0,0,1,0... 1,1,1,1,1,1... నాలుగు ఓవర్లలో సిరాజ్ బౌలింగ్ ప్రదర్శన ఇది. కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా అతను చెలరేగాడు. సిరాజ్ బౌలింగ్ చూస్తుంటే ప్రతీ బంతికి వికెట్ తీస్తాడేమో అనిపించింది. తాను ఆడిన గత మ్యాచ్‌లో గేల్ చితక్కొట్టడంతో 3 ఓవర్లలోనే 0/44 గణాంకాలు నమోదు చేసిన అతడిపై కెప్టెన్ కోహ్లి మళ్లీ నమ్మకముంచాడు. దానిని నిలబెట్టుకుంటూ ఈ హైదరాబాదీ చెలరేగాడు. ఒక్క బౌండరీ కూడా కొట్టే చాన్స్ ఇవ్వకుండా అతను ఆధిక్యం ప్రదర్శించడం విశేషం. భారీగా పరుగులిస్తాడంటూ తనపై ఉన్న విమర్శలకు అతను ఈ మ్యాచ్‌తో తగిన సమాధానమిచ్చాడు. ఆర్సీబీ తరఫున మూడో ఏడాది ఆడుతున్న అతను ఎట్టకేలకు తన పదునేమిటో చూపించాడు. ఈ సీజన్లో సిరాజ్‌కు ఇప్పటి వరకు కొత్త బంతిని పంచుకునే అవకాశం రాలేదు. ఈ మ్యాచ్‌లో కూడా రెండో ఓవర్ వేసేందుకు సుందర్ సన్నద్ధమవుతుండగా... అతడిని ఆపి సిరాజ్‌కు కోహ్లి బంతిని అప్పగించాడు. చక్కటి స్వింగ్‌తో త్రిపాఠిని దెబ్బ తీసిన అతను తర్వాతి బంతికే రాణాకు క్లీన్‌బౌల్డ్ చేయడం హైలైట్‌గా నిలిచింది. మరుసటి ఓవర్లో బాంటన్ కూడా సిరాజ్ స్వింగ్‌కు తలవంచాడు. ఈ స్పెల్ తర్వాత విరామం తీసుకున్న అతను మళ్లీ 19వ ఓవర్లో తిరిగొచ్చి అన్నీ సింగిల్స్ ఇచ్చాడు. ఒక దశలో ఐపీఎల్లో అత్యంత పొదుపైన బౌలింగ్ ప్రదర్శన (ఫిడేల్ ఎడ్వర్డ్స్–4 ఓవర్లలో 6 పరుగులు) నమోదు చేసేలా కనిపించినా చివరి ఓవర్‌తో గణాంకాలు కాస్త మారాయి. అయితే లీగ్ చరిత్రలో తొలిసారి రెండు మెయిడిన్ ఓవర్లు వేసిన బౌలర్‌గా అతను గుర్తింపు పొందాడు. ఈ బౌలింగ్ జోరు చూస్తే లీగ్‌లో అతను మరింతగా చెలరేగేందుకు కావాల్సిన జోష్‌ను ఇచ్చిందనడంలో సందేహం లేదు. ► ఐపీఎల్లో ఒక బౌలర్ 2 మెయిడిన్లు వేయడం ఇదే తొలిసారి (సిరాజ్) ► ఐపీఎల్లో ఒక టీమ్ 4 మెయిడిన్లు వేయడం ఇదే తొలిసారి (సిరాజ్ 2, మోరిస్ 1, సుందర్ 1). గతంలో ఏ జట్టూ 2 ఓవర్లకు మించి మెయిడిన్లు వేయలేదు. ► లీగ్‌లో పూర్తి ఓవర్లు ఆడి ఆలౌట్ కాకుండా ఒక జట్టు చేసిన అత్యల్ప స్కోరు ఇదే (84/8) -
ట్రంప్ గెలుస్తాడంటున్న జ్యోతిష్కులు
వాషింగ్టన్: ఈ దఫా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు గెలుస్తారని జ్యోతిష్కులు, న్యూమరాలజిస్టులు అంచనాలు వేస్తున్నారు. లైఫ్ పాత్ నంబర్, మాస్టర్ ఇయర్ ఆధారంగా ట్రంప్ విజయం ఖాయమని జ్యోతిష్కులు భావిస్తున్నట్లు యాహూ న్యూస్ తెలిపింది. న్యూమరాలజిస్టులు లైఫ్ పాత్ నంబర్, మాస్టర్ ఇయర్ ఆధారంగా జాతకాలు చెబుతారు. లైఫ్‌పాత్ నంబర్ అంచనా ఒక వ్యక్తి జన్మతేదీలో అంకెలను ఒక ప్రత్యేక పద్ధతిలో కూడడం ద్వారా లైఫ్‌పాత్ నంబర్‌ను నిర్ణయిస్తారు. దీన్ని డెస్టినీ నంబర్ అనికూడా అంటారు. ట్రంప్ బర్త్‌డేట్: 14–06–1946. ఇందులో అంకెలను ప్రత్యేక పద్ధతిలో కూడితే 22 వస్తుంది. ఇది ట్రంప్ లైఫ్‌పాత్ నంబర్. ఈ నెంబర్ వచ్చిన వ్యక్తులు మాస్టర్ బిల్డర్స్ అని న్యూమరాలజిస్టులు చెబుతున్నారు. వీరివన్నీ భారీ ప్రణాళికలు, భారీ విజయాలని, వీరికి ఆత్మ విశ్వాసం ఎక్కువని తెలిపారు. వ్యాపారం, రాజకీయాల్లో ఈ నంబరున్న వ్యక్తులు బాగా రాణిస్తారన్నారు. ఇక జోబైడెన్ బర్త్‌డేట్: 20–11–1942. ఇందులో అంకెలను ప్రత్యేక పద్దతిలో కూడితే 2 వస్తుంది. ఇది అత్యంత తక్కువ శక్తి ఉన్న నంబరని, ఈ నంబరు వ్యక్తులు ఎంత పనిచేసినా గుర్తింపు పొందలేరని నిపుణులు విశ్లేషించారు. ఇక ఎన్నికలు జరిగే 2020 సంవత్సరాన్ని చూస్తే ఇది ట్రంప్‌కు మాస్టర్ ఇయర్ అని వివరించారు. -
చెన్నై చతికిలపడింది
‘ఒకే రోజు మూడు సూపర్ ఓవర్లతో ఐపీఎల్లో అద్భుతం చూశారు కదా... రేపు టెస్టు మ్యాచ్ చూడవచ్చు, లెక్క సరిపోతుంది’... ఆదివారం ఒక సగటు క్రికెట్ అభిమాని సరదా వ్యాఖ్య ఇది. ఇప్పుడు సరిగ్గా అలాగే జరిగింది. పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య జరిగిన పోరు ఏమాత్రం ఆసక్తి రేపకుండా చప్పగా సాగింది. పరుగు తీయడమే కష్టంగా మారినట్లు, బౌండరీ బాదడం అంటే బ్రహ్మాండం బద్దలు కొట్టాలేమో అన్నంత భారంగా చెన్నై బ్యాటింగ్ చేసింది. ఛేదనలో రాజస్తాన్ కూడా తడబడ్డా... స్మిత్, బట్లర్ భాగస్వామ్యంతో కీలక గెలుపును తమ ఖాతాలో వేసుకుంది. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 78 బంతుల్లో అభేద్యంగా 98 పరుగులు జోడించి మరో 15 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందించారు. అబుదాబి: ఐపీఎల్లో ఆడిన 10 సార్లూ ప్లే ఆఫ్ చేసిన అరుదైన రికార్డు ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి ముందంజ వేయడంపై ఆశలు వదులుకోవాల్సిందే! సీజన్ మొత్తం తడబడుతూనే వస్తున్న ఈ మాజీ చాంపియన్ ఏడో పరాజయంతో తమ ప్లే ఆఫ్ అవకాశాలను దాదాపుగా దూరం చేసుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌పై ఘన విజయం సాధించి ప్లే ఆఫ్ రేసులో నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఈ సీజన్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టుకు ఇదే అత్యల్ప స్కోరు. రవీంద్ర జడేజా (30 బంతుల్లో 35; 4 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, ఎమ్మెస్ ధోని (28 బంతుల్లో 28; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. అనంతరం రాజస్తాన్ రాయల్స్ 17.3 ఓవర్లలో 3 వికెట్లకు 126 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ జాస్ బట్లర్ (48 బంతుల్లో 70 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ స్టీవ్ స్మిత్ (34 బంతుల్లో 26 నాటౌట్; 2 ఫోర్లు) కలిసి జట్టును విజయతీరం చేర్చారు. సమష్టి వైఫల్యం... మ్యాచ్ మ్యాచ్‌కూ మరింత పేలవ ప్రదర్శన కనబరుస్తున్న చెన్నై జట్టు బ్యాటింగ్ బలహీనత మరోసారి కనిపించింది. ఇన్నింగ్స్ మొత్తంలో 12 ఫోర్లు, 1 సిక్స్ మాత్రమే ఉండగా... భారీ షాట్లు ఆడే ప్రయత్నం కూడా బ్యాట్స్‌మెన్ చేయకపోవడం పరిస్థితిని సూచిస్తోంది. పేరుకు ధోని, జడేజా మధ్య 51 పరుగుల భాగస్వామ్యం నెలకొన్నా... అదీ 46 బంతుల్లో రావడం దూకుడులేమిని స్పష్టంగా చూపించింది. డు ప్లెసిస్ (10)ను తొందరగా అవుట్ చేసి రాజస్తాన్‌కు ఆర్చర్ శుభారంభం అందించాడు. యువ బౌలర్ త్యాగి తన తొలి ఓవర్లో 3 బౌండరీలు ఇచ్చినా... అదే ఓవర్లో వాట్సన్ (8)ను వెనక్కి పంపించాడు. స్టోక్స్ వేసిన ఐదో ఓవర్లో చెన్నై 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 15 పరుగులు రాబట్టింది. పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు స్కోరు 43 పరుగులకు చేరింది. ఆ తర్వాత మూడు పరుగుల వ్యవధిలో స్యామ్ కరన్ (25 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్), రాయుడు (13) వెనుదిరిగారు. 10 ఓవర్లలో 56 పరుగులు చేసిన చెన్నై స్కోరు 15 ఓవర్లలో 89 పరుగులకు చేరింది. అనంతరం రెండో పరుగు తీసే ప్రయత్నంలో ధోని రనౌటయ్యాడు. జడేజా చలవతో ఆఖరి 5 ఓవర్లలో 3 ఫోర్లతో చెన్నై 36 పరుగులు జోడించగలిగింది. 49 బంతుల తర్వాత... చెన్నై ఇన్నింగ్స్‌లో ఐదో ఓవర్ చివరి బంతికి రాయుడు ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత జట్టు మరో బౌండరీ కోసం ఏకంగా 8.1 ఓవర్లు ఎదురు చూడాల్సి వచ్చింది. త్యాగి వేసిన 14వ ఓవర్ రెండో బంతికి త్యాగి ధోని మళ్లీ ఫోర్ కొట్టాడు. ఒక టి20 మ్యాచ్‌లో రెండు బౌండరీల మధ్య విరామం 49 బంతులు! రాజస్తాన్ ఇద్దరు లెగ్ స్పిన్నర్లు శ్రేయస్ గోపాల్, రాహుల్ తేవటియా ఎంతో ప్రభావం చూపించారు. వీరిద్దరు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో 8 ఓవర్లలో కలిపి 32 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీశారు. పైగా ఒక్క ఫోర్ కూడా ఇవ్వకపోవడం విశేషం. భారీ భాగస్వామ్యం... రాజస్తాన్‌కు కూడా సరైన ఆరంభం లభించలేదు. పవర్‌ప్లే ముగిసేలోపే పేలవ షాట్లతో స్టోక్స్ (19), ఉతప్ప (4), సామ్సన్ (0) వెనుదిరిగారు. ఈ దశ లో స్మిత్, బట్లర్ కూడా సమర్థంగా ప్రత్యర్థిని ఎదుర్కొన్నారు. ఛేదించాల్సిన లక్ష్యం చిన్నది కావడంతో ఎలాంటి సాహసాలకు పోకుండా జాగ్రత్తగా, చక్కటి సమన్వయంతో ఆడారు. బట్లర్ తనదైన శైలిలో దూకుడుగా ఆడగా, స్మిత్ అతడికి సహకరించాడు. శార్దుల్ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన బట్లర్... చావ్లా ఓవర్లో వరుసగా 3 ఫోర్లు కొట్టి 37 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్లో మేం ఇక ముందుకు వెళ్లకపోవచ్చు. ప్రతీసారి అన్నీ మనం అనుకున్నట్లు జరగవు. మా సన్నద్ధతలో ఏదైనా లోపం ఉందేమో చూడాలి. ఎందుకంటే సన్నాహాలను బట్టే ఫలితాలు ఉంటాయి. మన సన్నద్ధత బాగుంటే ఫలితాలు సాధించాలనే ఒత్తిడి దరిచేరదు. లోపాలను చక్కదిద్దుకునే పనిలో ఉన్నాం. 4–5 మ్యాచ్‌లు ముగిసిన తర్వాత తుది జట్టులో పదే పదే మార్పులు చేయడం మంచిది కాదు. అలా చేస్తే ఆటగాళ్లలో అభద్రతాభావం పెరిగిపోతుంది. యువ ఆటగాళ్లను ఆడించడం లేదనే విమర్శ లో వాస్తవం ఉంది. అయితే మేం ఆశించినంత ప్రత్యేకత మా కుర్రాళ్లలో లేకపోవడం కూడా కారణం కావచ్చు. మున్ముందు వారికి అవకాశం ఇస్తే ఒత్తిడి లేకుండా ఆడతారేమో. –ఎమ్మెస్ ధోని, చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ ధోని@200 ఐపీఎల్లో ధోని 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకొని లీగ్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇందులో 170 మ్యాచ్‌లు చెన్నై తరఫున ఆడగా... చెన్నై నిషేధానికి గురైన రెండేళ్లలో పుణే సూపర్ జెయింట్స్ తరఫున మరో 30 మ్యాచ్‌లు ఆడాడు. లీగ్‌లో ధోని మొత్తం 4,596 పరుగులు సాధించగా... తాజా మ్యాచ్‌తో ఒక్క సీఎస్కే తరఫునే ధోని ఐపీఎల్లో 4 వేల పరుగుల మైలురాయిని (మొత్తం 4,022) కూడా దాటాడు. స్కోరు వివరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: స్యామ్ కరన్ (సి) బట్లర్ (బి) గోపాల్ 22; డు ప్లెసిస్ (సి) బట్లర్ (బి) ఆర్చర్ 10; వాట్సన్ (సి) తేవటియా (బి) త్యాగి 8; రాయుడు (సి) సామ్సన్ (బి) తేవటియా 13; ధోని (రనౌట్) 28; జడేజా (నాటౌట్) 35; కేదార్ జాదవ్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 125. వికెట్ల పతనం: 1–13; 2–26; 3–53; 4–56; 5–107. బౌలింగ్: ఆర్చర్ 4–0–20–1; అంకిత్ రాజ్‌పుత్ 1–0–8–0; కార్తీక్ త్యాగి 4–0–35–1; స్టోక్స్ 3–0–27–0; శ్రేయస్ గోపాల్ 4–0–14–1; రాహుల్ తేవటియా 4–0–18–1. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: స్టోక్స్ (బి) చహర్ 19; ఉతప్ప (సి) ధోని (బి) హాజల్‌వుడ్ 4; సామ్సన్ (సి) ధోని (బి) చహర్ 0; స్మిత్ (నాటౌట్) 26; బట్లర్ (నాటౌట్) 70; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (17.3 ఓవర్లలో 3 వికెట్లకు) 126. వికెట్ల పతనం: 1–26; 2–28; 3–28. బౌలింగ్: దీపక్ చహర్ 4–1–18–2; హాజల్‌వుడ్ 4–0–19–1; జడేజా 1.3–0–11–0; శార్దుల్ 4–0–34–0; స్యామ్ కరన్ 1–0–6–0; చావ్లా 3–0–32–0. -
సూపరో... సూపరు
ఉత్కంఠకు రూపం ఉంటే అది కూడా ఊపిరి బిగపట్టుకుని ఆస్వాదించేది. బంతి బంతికీ తారుమారవుతున్న ఆధిపత్యాన్ని చూసి అబ్బురపడేది. ప్రతి యేటా మండే ఎండలో అభిమానులకు క్రికెట్ వినోదాన్ని పంచే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఈసారి వర్షా కాలంలో జరుగుతున్నా అభిమానులు మాత్రం చివరి బంతి వరకు తుది ఫలితం ఎలా ఉంటుందోనని ఆలోచిస్తూ, అనుక్షణం చోటు చేసుకుంటున్న మలుపులకు మురిసిపోతూ తన్మయత్వంతో తడిసి ముద్దవుతున్నారు. ఇప్పటివరకు 12 ఐపీఎల్ సీజన్లు జరిగినా ఏ సీజన్లోనూ జరగని అత్యద్భుతం ఆదివారం చోటు చేసుకుంది. ఒకే రోజు రెండు ఐపీఎల్ మ్యాచ్‌లు ‘సూపర్ ఓవర్’కు దారి తీశాయి. తొలుత అబుదాబి వేదికగా జరిగిన ‘సూపర్’ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓడించగా... దుబాయ్ వేదికగా ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ విజేత కూడా ‘సూపర్ ఓవర్’లోనే తేలింది. అయితే ఈ మ్యాచ్ ఫలితం ఒక సూపర్ ఓవర్లో కాకుండా రెండు సూపర్ ఓవర్లలో తేలడం విశేషం. గతంలో సూపర్ ఓవర్లోనూ రెండు జట్ల స్కోర్లు సమమైతే ఎక్కువ బౌండరీలు సాధించిన జట్టును విజేతగా ప్రకటించేవారు. గతేడాది న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్ల మధ్య వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ‘సూపర్ ఓవర్’ కూడా టై కావడం... ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించడం జరిగింది. అయితే ఈ ఫలితంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. దాంతో సూపర్ ఓవర్లోనూ స్కోర్లు సమమైతే ఏదో ఒక జట్టు గెలిచేవరకు సూపర్ ఓవర్‌ను ఆడించాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిబంధన తెచ్చింది. ఐపీఎల్లో ఆదివారం ఈ నిబంధనను అమలు చేశారు. అబుదాబి: బంతితో అంతా తానై ఆడించిన లాకీ ఫెర్గూసన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టును గట్టెక్కించాడు. ముందు 15 పరుగులకు 3 వికెట్లు... ఆ తర్వాత సూపర్ ఓవర్లో 3 బంతుల్లో 2 పరుగులుచ్చి 2 వికెట్లు తీసిన ఈ న్యూజిలాండ్ పేసర్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చుక్కలు చూపించాడు. వార్నర్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్‌ను గెలిపించేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. కానీ ఒత్తిడిలో తడబడి ఓటమివైపు నిలబడ్డాడు. ఆద్యంతం టన్నులకొద్దీ వినోదాన్ని పంచిన ఈ మ్యాచ్‌లో చివరకు గెలుపు కోల్కతావైపే నిలిచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్ (37 బంతుల్లో 36; 5 ఫోర్లు) టాప్ స్కోరర్. కెప్టెన్ మోర్గాన్ (23 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్), దినేశ్ కార్తీక్ (14 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుతో జట్టు మంచి స్కోరు అందుకుంది. అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా 20 ఓవర్లలో 6 వికెట్లకు సరిగ్గా 163 పరుగులు చేయడంతో మ్యాచ్ ‘టై’ అయ్యింది. కెప్టెన్ వార్నర్ (33 బంతుల్లో 47 నాటౌట్; 5 ఫోర్లు), బెయిర్‌స్టో (28 బంతుల్లో 36; 7 ఫోర్లు), విలియమ్సన్ (19 బంతుల్లో 29; 4 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నారు. ఫెర్గూసన్ (3/15) ఈ ఐపీఎల్లో తాను ఆడిన తొలి మ్యాచ్‌లోనే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం అందుకున్నాడు. నిదానంగా మొదలై.... దూకుడుగా ముగిసి మండే ఎండలో కోల్‌కతా ఇన్నింగ్స్ నెమ్మదిగానే సాగింది. తొలి మూడు ఓవర్లలో 15 పరుగులే చేసింది. తర్వాత రాహుల్ త్రిపాఠి 6, 4... గిల్ వరుసగా మూడు బౌండరీలు బాదడంతో పవర్‌ప్లేలో 48 పరుగులు చేసిన కోల్‌కతా త్రిపాఠి వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత మరో వికెట్ కోసం బౌలర్లు శ్రమించాల్సి వచ్చింది. నితీశ్ రాణా (20 బంతుల్లో 29; 3 ఫోర్లు, 1 సిక్స్))తో కలిసి గిల్ అడపాదడపా బౌండరీలు బాదుతూ స్ట్రయిక్ రొటేట్ చేశాడు. దీంతో 10 ఓవర్లకు కోల్‌కతా 77/1తో నిలిచింది. అప్పటికే కుదురుకున్న గిల్, రాణా వరుస ఓవర్లలో... ప్రియమ్ గార్గ్ అద్భుత ఫీల్డింగ్‌కు పెవిలియన్ బాట పట్టారు. కాసేపటికే రసెల్ (11 బంతుల్లో 9; 1 ఫోర్) కూడా వెనుదిరగడంతో కోల్‌కతా 15 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 105 పరుగులే చేయగలి గింది. ఈ దశలో మోర్గాన్, కార్తీక్ చెలరేగి చివరి ఐదు ఓవర్లలో 58 పరుగులు రాబట్టారు. చివరి ఓవర్లో మోర్గాన్ 4, 6 సహాయంతో 16 పరుగులు చేసి చివరి బంతికి అవుటయ్యాడు. విలియమ్సన్ పట్టుదల... ఫీల్డింగ్‌లో గాయపడిన విలియమ్సన్ ఓపెనర్‌గా వచ్చి ఆశ్చర్యపరిచాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతుండటంతో సింగిల్స్ కోసం ఆరాటపడకుండా బౌండరీల ద్వారా పరుగులు సాధించాడు. బెయిర్‌స్టో కూడా విలియమ్సన్కు అండగా నిలవడంతో పవర్‌ప్లేలో సన్‌రైజర్స్ 58 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. ఇందులో 46 (10 ఫోర్లు, 1 సిక్స్) పరుగులు బౌండరీల ద్వారా రావడం విశేషం. పవర్‌ప్లే తర్వాతి తొలి బంతికే విలియమ్సన్‌ను అవుట్ చేసి ఫెర్గూసన్ రైజర్స్ జోరుకు కళ్లెం వేశాడు. ఫెర్గూసన్ వైవిధ్యం... వార్నర్ పోరాటం విలియమ్సన్ ఔటయ్యాక హైదరాబాద్ ఇన్నింగ్స్ తడబడింది. అద్భుత బంతితో ప్రియమ్ గార్గ్ (4)ను బౌల్డ్ చేసిన ఫెర్గూసన్ జట్టును ఒత్తిడిలోకి నెట్టాడు. మరుసటి ఓవర్లోనే బెయిర్‌స్టోను వరుణ్ అవుట్ చేశాడు. ఈ దశలో మరోసారి బంతి అందుకున్న ఫెర్గూసన్ చక్కటి యార్కర్‌తో మనీశ్ పాండే (6)ను పెవిలియన్ చేర్చి రైజర్స్‌ను ఆత్మరక్షణలోకి నెట్టాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా వార్నర్ పోరాటం ఆపలేదు. విజయ్ శంకర్ (7)తో కలిసి స్ట్రయిక్ రొటేట్ చేశాడు. దీంతో 15 ఓవర్లకు 109/4తో నిలిచింది. సమద్ (15 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్) వచ్చాక ఆటలో వేగం పెరిగింది. ఉన్నంత వరకు ధాటిగా ఆడిన సమద్... కెప్టెన్‌పై భారాన్ని తగ్గించాడు. అప్పటివరకు బౌలింగ్‌తో బెంబేలెత్తించిన ఫెర్గూసన్ తెలివైన ఫీల్డింగ్‌తో సమద్‌ను అవుట్ చేయడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక్కడే మ్యాచ్ పూర్తి మలుపు తిరిగింది. చివరి ఓవర్లో ఉత్కం‘టై’... చివరి ఓవర్లో సన్‌రైజర్స్ విజయానికి 18 పరుగులు కావాలి. బౌలర్ రసెల్ బంతి అందుకున్నాడు. అనుభవాన్నంతా రంగరించి ఆడుతున్న వార్నర్, అప్పుడే వచ్చిన రషీద్ ఖాన్ క్రీజులో ఉన్నారు. రసెల్ తొలి బంతిని నోబాల్ వేశాడు. ఆ తర్వాత ‘ఫ్రీ హిట్’ బంతిపై రషీద్ ఒక్క పరుగు తీసి వార్నర్‌కు స్ట్రయిక్ ఇచ్చాడు. వార్నర్ జూలు విదిల్చి వరుసగా మూడు బంతుల్లో మూడు ఫోర్లు కొట్టాడు. దాంతో సన్‌రైజర్స్ విజయానికి చివరి బంతికి రెండు పరుగులు అవసరమయ్యాయి. మూడు ఫోర్లు కొట్టి జోరుమీదున్న వార్నర్ ఆఖరి బంతికి గురి తప్పాడు. రసెల్ వేసిన బంతి వార్నర్ ప్యాడ్ లకు తగిలి ఆఫ్‌సైడ్ కు వెళ్లిపోయింది. వార్నర్, రషీద్ ఒక పరుగు మాత్ర మే పూర్తి చేయడంతో స్కోర్లు సమమయ్యాయి. రెండు జట్లు సూపర్ ఓవర్‌కు సిద్ధమయ్యాయి. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: గిల్ (సి) గార్గ్ (బి) రషీద్ 36; త్రిపాఠి (బి) నటరాజన్ 23; రాణా (సి) గార్గ్ (బి) శంకర్ 29; రసెల్ (సి) శంకర్ (బి) నటరాజన్ 9; మోర్గాన్ (సి) పాండే (బి) థంపి 34; దినేశ్ కార్తీక్ (నాటౌట్) 29; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 163. వికెట్ల పతనం: 1–48, 2–87, 3–88, 4–105, 5–163. బౌలింగ్: సందీప్‌శర్మ 4–0– 27–0, థంపి 4–0–46–1, నటరాజన్ 4–0– 40–2, విజయ్ శంకర్ 4–0–20–1, రషీద్ ఖాన్ 4–0–28–1. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: బెయిర్‌స్టో (సి) రసెల్ (బి) వరుణ్ 36; విలియమ్సన్ (సి) రాణా (బి) ఫెర్గూసన్ 29; గార్గ్ (బి) ఫెర్గూసన్ 4; వార్నర్ (నాటౌట్) 47; మనీశ్ పాండే (బి) ఫెర్గూసన్ 6; శంకర్ (సి) గిల్ (బి) కమిన్స్ 23; సమద్ (సి) గిల్ (బి) శివమ్ మావి 23; రషీద్ ఖాన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 163. వికెట్ల పతనం: 1–58, 2–70, 3–70, 4–82, 5–109, 6–146. బౌలింగ్: కమిన్స్ 4–0–28–1, మావి 3–0– 34–1, వరుణ్ 4–0–32–1, రసెల్ 2–0– 29–0, ఫెర్గూసన్ 4–0–15–3, కుల్దీప్ 3–0– 18–0. ► లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో వార్నర్ నాలుగో స్థానంలో ఉన్నాడు. కోహ్లి (186 మ్యాచ్‌ల్లో 5,759 పరుగులు), రైనా (193 మ్యాచ్‌ల్లో 5,368 పరుగులు), రోహిత్ శర్మ (197 మ్యాచ్‌ల్లో 5,158 పరుగులు) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ► ఐపీఎల్ టోర్నీ చరిత్రలో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు సూపర్ ఓవర్లో విజయం సాధించడం ఇదే ప్రథమం. గతంలో మూడుసార్లు ఆ జట్టు సూపర్ ఓవర్లో ఓడింది. ► ఐపీఎల్ టోర్నీ చరిత్రలో 5 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి విదేశీ క్రికెటర్‌గా డేవిడ్ వార్నర్ నిలిచాడు. 2009లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన వార్నర్ ఇప్పటివరకు 135 మ్యాచ్‌లు ఆడి 5,037 పరుగులు సాధించాడు. ఇందులో 4 సెంచరీలు, 46 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ► టోర్నీ చరిత్రలో ‘టై’ అయిన మ్యాచ్‌లు ► ఐపీఎల్ టోర్నీ చరిత్రలో ఒకే సీజన్లో నాలుగు మ్యాచ్‌లు ‘టై’గా ముగియడం ఇదే మొదటిసారి. ఈ సీజన్లో ఢిల్లీ –పంజాబ్; ముంబై –బెంగళూరు; ముంబై–పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్‌లు ‘టై’గా ముగిసి తుది ఫలితం సూపర్ ఓవర్లో వచ్చింది. -
ధావన్ తొడగొట్టాడు
సుదీర్ఘ టి20 కెరీర్లో పలు చిరస్మరణీయ విజయాలు అందించిన ‘గబ్బర్’ అలియాస్ శిఖర్ ధావన్‌కు సెంచరీ లేని లోటు మాత్రం ఇప్పటి వరకు ఉండేది. అయితే ఇప్పుడు తొలి శతకాన్ని సాధించి ఆ కోరికను కూడా తీర్చుకున్నాడు. అదీ సరైన సమయంలో, జట్టుకు అవసరమైన సందర్భంలో సాధించడం దానిని మరింత ప్రత్యేకంగా మార్చింది. ఛేదనలో సహచరులంతా విఫలమైన వేళ, తనొక్కడే శిఖరంలా చివరి వరకు నిలిచి బౌండరీల వర్షం కురిపించిన ధావన్ ఢిల్లీకి అద్భుత విజయాన్ని అందించాడు. గత రెండు మ్యాచ్‌లలో అర్ధ సెంచరీ చేసిన అతను తన ప్రదర్శనకు మరింత దూకుడు జత చేయడంతో చెన్నైకి ఓటమి తప్పలేదు. క్యాపిటల్స్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొనడంలో ఇబ్బందిపడి సాధారణ స్కోరుకే పరిమితమైన సూపర్ కింగ్స్ బౌలింగ్‌లోనూ సత్తా చాటలేక పరాజయాన్ని కొనితెచ్చుకుంది. షార్జా: ఐపీఎల్లో తమ జోరును కొనసాగిస్తూ ఢిల్లీ క్యాపిటల్స్ మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 5 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. ముందుగా చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. డుప్లెసిస్ (47 బంతుల్లో 58; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేయగా... అంబటి తిరుపతి రాయుడు (25 బంతుల్లో 45 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్సర్లు), షేన్ వాట్సన్ (28 బంతుల్లో 36; 6 ఫోర్లు) రాణించారు. అనంతరం ఢిల్లీ 19.5 ఓవర్లలో 5 వికెట్లకు 185 పరుగులు సాధించి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ శిఖర్ ధావన్ (58 బంతుల్లో 101 నాటౌట్; 14 ఫోర్లు, 1 సిక్స్) అజేయ శతకం సాధించగా... చివరి ఓవర్లో అక్షర్ పటేల్ (5 బంతుల్లో 21 నాటౌట్; 3 సిక్స్‌లు) అదరగొట్టాడు. డుప్లెసిస్ అర్ధ సెంచరీ... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నైకి సరైన ఆరంభం లభించలేదు. తుషార్ బౌలింగ్‌లో ఇన్నింగ్స్‌లో మూడో బంతికే స్యామ్ కరన్ (0) అవుటయ్యాడు. అయితే డు ప్లెసిస్, వాట్సన్ భాగస్వామ్యం జట్టును ముందుకు నడిపించింది. నోర్జే ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌తో ప్లెసిస్ దూకుడు ప్రదర్శించగా, పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 39 పరుగులకు చేరింది. ఆ తర్వాత అశ్విన్ ఓవర్లో వీరిద్దరు కలిసి 15 పరుగులు రాబట్టడంతో 10 ఓవర్లలో చెన్నై 85 పరుగులు చేయగలిగింది. తుషార్ ఓవర్లో సిక్స్, ఫోర్ బాదిన డుప్లెసిస్ 39 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరు తక్కువ వ్యవధిలో వెనుదిరగ్గా 15 ఓవర్లలో స్కోరు 112 పరుగుల వద్ద నిలిచింది. రెండో వికెట్‌కు ప్లెసిస్, వాట్సన్ 67 బంతుల్లో 87 పరుగులు జోడించారు. మెరుపు బ్యాటింగ్... ఇన్నింగ్స్ ఆఖరి 5 ఓవర్లు సూపర్ కింగ్స్‌కు బాగా కలిసొచ్చాయి. ధోని (3) మళ్లీ విఫలమైనా... రాయుడు, జడేజా జోడి ఒకరితో మరొకరు పోటీపడి చెలరేగారు. ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడి జడేజా 4 సిక్సర్లు, రాయుడు 3 సిక్సర్లు, ఒక ఫోర్ బాదడంతో మొత్తం 67 రావడం విశేషం. నోర్జే వేసిన చివరి ఓవర్లో జడేజా కొట్టిన రెండు వరుస సిక్స్‌లు ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచాయి. బౌలర్ చావ్లా స్థానంలో తుది జట్టులోకి వచ్చిన జాదవ్‌కు బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. అతనొక్కడే... విజయతీరం చేరే వరకు ఢిల్లీ ఇన్నింగ్స్ మొత్తం ధావన్ చుట్టూనే సాగింది. రెండో బంతికే పృథ్వీ షా (0) అవుట్ కాగా, రహానే (8) కూడా విఫలమయ్యాక ధావన్ బాధ్యతగా బ్యాటింగ్ చేశాడు. చివర్లో కొట్టిన ఒక్క సిక్సర్ మినహా అతను ఫోర్ల ద్వారానే తన జోరును ప్రదర్శించాడు. స్యామ్ కరన్, జడేజా, కరణ్ శర్మ... ఇలా ఏ బౌలర్‌నూ వదలకుండా ఒక్కో ఓవర్లో రెండేసి ఫోర్లు కొడుతూ సాగిపోయిన ధావన్ 29 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో శ్రేయస్ అయ్యర్ (23 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్స్), స్టొయినిస్ (14 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్సర్లు) కొంత సహకరించినా...మొత్తంగా మ్యాచ్‌లో ధావన్ షోనే కనిపించింది. వ్యక్తిగత స్కోర్లు 25, 50, 79 వద్ద ధావన్ ఇచ్చిన క్యాచ్‌లు చెన్నై వదిలేయడం కూడా అతనికి కలిసొచ్చింది. కొంత ఉత్కంఠ... చివరి 2 ఓవర్లలో ఢిల్లీ విజయానికి 21 పరుగులు కావాల్సి ఉండగా... 19వ ఓవర్లో స్యామ్ 4 పరుగులు మాత్రమే ఇచ్చి క్యారీ (4)ని అవుట్ చేశాడు. 99 పరుగుల స్కోరు వద్ద ధావన్ కీపర్ క్యాచ్ కోసం అప్పీల్ చేసిన ధోని రివ్యూకు కూడా వెళ్లాడు. అయితే రీప్లేలో అది నాటౌట్‌గా తేలింది. తర్వాతి బంతికి సింగిల్ తీసిన శిఖర్ ఐపీఎల్‌లోనే కాకుండా తన టి20 కెరీర్లో తొలి సెంచరీని అందుకున్నాడు. జడేజా వేసిన చివరి ఓవర్లో 17 పరుగులు అవసరం కాగా... అక్షర్ పటేల్ మూడు సిక్సర్లు బాది క్యాపిటల్స్‌కు గెలుపును ఖాయం చేశాడు. జడేజా ఎందుకంటే... సాధారణంగా చెన్నై బౌలర్లలో డెత్ ఓవర్లలో, ప్రత్యర్థి ఎన్ని పరుగులు చేయాల్సి ఉన్నా సరే చివరి ఓవర్‌ను బ్రేవో బౌలింగ్ చేయడం పరిపాటి. ఐపీఎల్లో ఇది చాలా సార్లు కనిపించింది. అయితే ఈసారి స్పిన్నర్ జడేజా వేయడం ఆశ్చర్యం కలిగించింది. మ్యాచ్ తర్వాత ధోని దీనిపై స్పష్టతనిచ్చాడు. ఫిట్‌గా లేని బ్రేవో మైదానం బయటే ఉండిపోవడం అందుకు కారణమని వెల్లడించాడు. మిగిలిన బౌలర్లలో కరణ్ శర్మ, జడేజా మాత్రమే ప్రత్యామ్నాయం. కరణ్కంటే జడేజా అనుభవాన్ని ధోని నమ్మాడు. నిజానికి క్రీజ్‌లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ ఉన్నప్పుడు లెఫ్టార్మ్ స్పిన్నర్‌ను చితక్కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ బౌలర్‌ను కెప్టెన్‌ను ఉపయోగించరు. చివరి ఓవర్‌కు ముందు వరకు జడేజా ఒకే ఒక ఓవర్ వేయడానికి కూడా ధావన్ క్రీజ్‌లో ఉండటమే కారణం. అయితే చివరకు అలా చేయాల్సి వచ్చి జడేజా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ చేతిలోనే చావుదెబ్బ తిన్నాడు. అయితే అది శిఖర్ కాకుండా స్వయంగా లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన అక్షర్ పటేల్ కావడం విశేషం. స్కోరు వివరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: స్యామ్ కరన్ (సి) నోర్జే (బి) తుషార్ 0; డుప్లెసిస్ (సి) ధావన్ (బి) రబడ 58; వాట్సన్ (బి) నోర్జే 36; రాయుడు (నాటౌట్) 45; ధోని (సి) క్యారీ (బి) నోర్జే 3; జడేజా (నాటౌట్) 33; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 179 వికెట్ల పతనం: 1–0; 2–87; 3–109; 4–129. బౌలింగ్: తుషార్ 4–0–39–1; రబడ 4–1–33–1; అక్షర్ 4–0–23–0; నోర్జే 4–0–44–2; అశ్విన్ 3–0–30–0; స్టొయినిస్ 1–0–10–0. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి అండ్ బి) చహర్ 0; ధావన్ (నాటౌట్) 101; రహానే (సి) స్యామ్ కరన్ (బి) చహర్ 8; అయ్యర్ (సి) డుప్లెసిస్ (బి) బ్రేవో 23; స్టొయినిస్ (సి) రాయుడు (బి) శార్దుల్ 24; క్యారీ (సి) డుప్లెసిస్ (బి) స్యామ్ కరన్ 4; అక్షర్ పటేల్ (నాటౌట్) 21; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19.5 ఓవర్లలో 5 వికెట్లకు) 185. వికెట్ల పతనం: 1–0; 2–26; 3–94; 4–159; 5–159. బౌలింగ్: దీపక్ చహర్ 4–1–18–2; స్యామ్ కరన్ 4–0–35–1; శార్దుల్ 4–0–39–1; జడేజా 1.5–0–35–0; కరణ్ శర్మ 3–0–34–0; బ్రేవో 3–0–23–1. ► ఐపీఎల్ టోర్నీలోనే కాకుండా తన టి20 కెరీర్లోనే శిఖర్ ధావన్‌కిది తొలి సెంచరీ కావడం విశేషం. తన 265వ ఇన్నింగ్స్‌లో ధావన్ సెంచరీ సాధించాడు. ► ఈ సీజన్లో ఢిల్లీ గెలిచిన ఏడు మ్యాచ్‌ల్లో ఏడుగురు వేర్వేరు ఆటగాళ్లకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు భించాయి. ► ఈ ఐపీఎల్ సీజన్లో నమోదైన సెంచరీల సంఖ్య. ధావన్‌కంటే ముందు మయాంక్, రాహుల్ ఒక్కో శతకం కొట్టారు. ► ఐపీఎల్ టోర్నీ చరిత్రలో ఢిల్లీ జట్టు బ్యాట్స్‌మన్ సెంచరీ చేయడం ఇది తొమ్మిదోసారి. -
ఏబీ... మళ్లీ
‘మిస్టర్ 360’ ప్లేయర్ డివిలియర్స్ సిక్సర్ల మోత... పేసర్ క్రిస్ మోరిస్ వికెట్ల విన్యాసాలు... కెప్టెన్ కోహ్లి కూల్ ఇన్నింగ్స్... వెరసి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరో సాధికారిక విజయాన్ని కైవసం చేసుకుంది. ఒకదశలో ఓటమి తప్పదా అనిపించే స్థితిలో ఉన్న బెంగళూరును డివిలియర్స్ తన మెరుపు ఇన్నింగ్స్‌తో ఒంటిచేత్తో గట్టెక్కించాడు. మరోవైపు బ్యాట్స్‌మెన్ రాణించినా, బౌలర్లు విఫలం కావడంతో రాజస్తాన్ రాయల్స్ ఆరో ఓటమిని ఆహ్వానించింది. దుబాయ్: విజయ సమీకరణం ఎంత క్లిష్టంగా ఉన్నా... క్రీజులో డివిలియర్స్ ఉన్నాడంటే జట్టుకు విజయంపై ఎక్కడలేని భరోసా ఉంటుందని మరోసారి నిరూపితమైంది. ఐపీఎల్–13లో అబ్రహామ్ బెంజమిన్ (ఏబీ) డివిలియర్స్ మళ్లీ విశ్వరూపం ప్రదర్శించడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మరోసారి ఓటమి బాటను వీడి విజయతీరాలను చేరుకుంది. శనివారం రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో బెంగళూరు 7 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 177 పరుగులు చేసింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (36 బంతుల్లో 57; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీతో అదరగొట్టాడు. ఓపెనర్ రాబిన్ ఉతప్ప (22 బంతుల్లో 41; 7 ఫోర్లు, 1 సిక్స్) దూకుడు కనబరిచాడు. మోరిస్ 4 వికెట్లతో రాయల్స్‌ను కట్టడి చేయగా... చహల్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ డివిలియర్స్ (22 బంతుల్లో 55 నాటౌట్; 1 ఫోర్, 6 సిక్స్‌లు) మెరుపులతో బెంగళూరు 19.4 ఓవర్లలో 3 వికెట్లకు 179 పరుగులు చేసి నెగ్గింది. దేవదత్ పడిక్కల్ (35; 2 ఫోర్లు), కెప్టెన్ కోహ్లి (32 బంతుల్లో 43; 1 ఫోర్, 2 సిక్స్‌లు), గురుకీరత్ సింగ్ (17 బంతుల్లో 19 నాటౌట్; 1 ఫోర్) ఆకట్టుకున్నారు. సిక్సర్ల హోరు... బెంగళూరు విజయ సమీకరణం చివరి 30 బంతుల్లో 64 పరుగులు. కార్తీక్ త్యాగి వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్ మినహా మిగతా నాలుగు ఓవర్లలో కనీసం ఓ సిక్సర్ బాదిన డివిలియర్స్... 19వ ఓవర్లో ఉనాద్కట్‌పై రెచ్చిపోయాడు. తొలి మూడు బంతుల్లో వరుసగా మిడ్ వికెట్, లాంగాన్, స్క్వేర్ లెగ్‌లో సిక్సర్లతో విజృంభించాడు. ఐదో బంతికి గురుకీరత్ ఫోర్ కొట్టడంతో ఆ ఓవర్లో అత్యధికంగా 25 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్లో బెంగళూరు విజయానికి 10 పరుగులు అవసరమయ్యాయి. తొలి బంతిపై గురుకీరత్ రెండు పరుగులు, రెండో బంతికి సింగిల్ తీశాడు. మూడో బంతి ఎదుర్కొన్న డివిలియర్స్ రెండు పరుగులు తీశాడు. దాంతో బెంగళూరు విజయ సమీకరణం 3 బంతుల్లో 5 పరుగులుగా మారింది. డివిలియర్స్ మరో అవకాశం ఇవ్వకుండా నాలుగో బంతిని డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్సర్‌గా మలిచి జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (సి) ఫించ్ (బి) చహల్ 41; స్టోక్స్ (సి) డివిలియర్స్ (బి) మోరిస్ 15; సామ్సన్ (సి) మోరిస్ (బి) చహల్ 9; స్మిత్ (సి) షాబాజ్ అహ్మద్ (బి) మోరిస్ 57; బట్లర్ (సి) సైనీ (బి) మోరిస్ 24; రాహుల్ తేవటియా (నాటౌట్) 19; ఆర్చర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) మోరిస్ 2; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 177. వికెట్ల పతనం: 1–50, 2–69, 3–69, 4–127, 5–173, 6–177. బౌలింగ్: సుందర్ 3–0–25–0, మోరిస్ 4–0–26–4, ఉదాన 3–0–43–0, సైనీ 4–0–30–0, చహల్ 4–0–34–2, షాబాజ్ అహ్మద్ 2–0–18–0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: దేవదత్ పడిక్కల్ (సి) స్టోక్స్ (బి) తేవటియా 35; ఫించ్ (సి) ఉతప్ప (బి) శ్రేయస్ గోపాల్ 14; కోహ్లి (సి) తేవటియా (బి) కార్తీక్ త్యాగి 43; డివిలియర్స్ (నాటౌట్) 55; గురుకీరత్ సింగ్ (నాటౌట్) 19; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (19.4 ఓవర్లలో 3 వికెట్లకు) 179. వికెట్ల పతనం: 1–23, 2–102, 3–102. బౌలింగ్: ఆర్చర్ 3.4–0–38–0, గోపాల్ 4–0–32–1, కార్తీక్ త్యాగి 4–0–32–1, ఉనాద్కట్ 4–0–46–0, రాహుల్ తేవటియా 4–0–30–1. -
ముంబై... జై జై
టోర్నీ జరిగేకొద్దీ ముంబై హోరెత్తిస్తోంది. ఆల్‌రౌండ్ సత్తా చాటుతోంది. బౌలింగ్‌తో కట్టేసి, మెరుపు బ్యాటింగ్‌తో లక్ష్యాన్ని చుట్టేస్తోంది. తొలుత రాహుల్ చహర్ స్పిన్ మాయాజాలం రోహిత్ సేనకు బలంకాగా... ఓపెనర్లు రోహిత్, డికాక్ దూకుడుతో లక్ష్యం కూడా సులువైంది. వరుసగా ఐదో విజయంతో, ఓవరాల్‌గా ఆరో విజయంతో, మెరుగైన రన్‌రేట్‌తో ముంబై పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. అబుదాబి: వరుసగా ఐదు పరాజయాల తర్వాత గత మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ గెలిచింది. దీనికి విరుద్ధంగా ముంబై ఇండియన్స్ వరుసగా ఐదో విజయం సాధించింది. ఐపీఎల్లో శుక్రవారం జరిగిన పోరులో రోహిత్ సేన 8 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసింది. టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. కమిన్స్ (36 బంతుల్లో 53 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించాడు. మోర్గాన్ (29 బంతుల్లో 38 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. స్పిన్నర్ రాహుల్ చహర్ 2 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ 16.5 ఓవర్లలో 2 వికెట్లకు 149 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ డికాక్ (44 బంతుల్లో 78 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగాడు. అతనికే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం దక్కింది. రోహిత్ శర్మ (36 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. కోల్‌కతా తమ తుదిజట్టులో రెండు మార్పులు చేసింది. టామ్ బాంటన్, కమలేశ్ నాగర్కోటి స్థానాల్లో క్రిస్ గ్రీన్, శివమ్ మావిలను తీసుకుంది. ముంబై జేమ్స్ ప్యాటిన్సన్పు పక్కనబెట్టి కూల్టర్నీల్ను తీసుకుంది. టాప్–4 బ్యాట్లెత్తారు... కోల్‌కతా టాపార్డర్ బ్యాట్స్‌మెన్ వైఫల్యం ఇన్నింగ్స్‌ను వెంటాడింది. టాప్–4 బ్యాట్స్‌మెన్ రాహుల్ త్రిపాఠి (7), శుబ్‌మన్ గిల్ (21), నితీశ్ రాణా (5), దినేశ్ కార్తీక్ (4) ఎవరూ క్రీజులో నిలిచేందుకు ప్రయత్నించలేదు. చెత్తషాట్లకు భారీ మూల్యం చెల్లించుకున్నారు. మూడో ఓవర్లో రాహుల్‌ను బౌల్ట్ పెవిలియన్ చేర్చగా... కాసేపటికే నితీశ్‌ను కూల్టర్‌నీల్ ఔట్ చేశాడు. పవర్ ప్లే (6 ఓవర్లు)లో 33 పరుగులకే 2 కీలక వికెట్లను కోల్పోయింది. కోల్‌కతాకు ఈ కష్టాలు చాలవన్నట్లు స్పిన్నర్ రాహుల్ చహర్ రెండు వరుస బంతుల్లో శుబ్‌మన్, దినేశ్ కార్తీక్‌లను ఔట్ చేయడంతో కోల్‌కతా 42 పరుగులకే 4 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. హిట్టర్ రసెల్, కొత్త కెప్టెన్ మోర్గాన్ క్రీజులో ఉండగా... 9వ ఓవర్లో జట్టు స్కోరు 50 పరుగులకు చేరింది. ఓ సిక్స్, ఫోర్ కొట్టిన రసెల్ (12)కు బుమ్రా చెక్‌పెట్టాడు. దీంతో 11వ ఓవర్లోనే నైట్‌రైడర్స్ సగం వికెట్లను కోల్పోయింది. స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ మోర్గాన్ ఒక్కడే మిగిలాడు. ధాటిగా ఆడిన కమిన్స్... అయితే ఆ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ ఇన్నింగ్స్‌ను నడిపించలేదు. కమిన్స్ మెరుపులతో కోల్‌కతా గాడిన పడింది. కూల్టర్‌నీల్ వేసిన 13వ ఓవర్లో కమిన్స్ డీప్ స్క్వేర్‌లో భారీ సిక్సర్ బాదాడు. మరో రెండు బౌండరీలు కూడా కొట్టడంతో 16 పరుగులు వచ్చాయి. స్పిన్నర్లు రాహుల్ చహర్, కృనాల్ బౌలింగ్‌కు దిగడంతో మళ్లీ పరుగుల రాక తగ్గిపోయింది. బౌల్ట్ వేసిన 17వ ఓవర్లో మోర్గాన్ ఫోర్‌తో కోల్‌కతా ఆలస్యంగా 100 పరుగులను అధిగమించింది. మరుసటి ఓవర్ వేసిన బుమ్రా కేవలం 5 పరుగులే ఇవ్వడంతో కోల్‌కతా 18 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లకు 113 పరుగులే చేసింది. బౌల్ట్ బౌలింగ్‌లో కమిన్స్ బ్యాట్ ఝులిపించాడు. వరుసగా 6, 4 బాదడంతో 14 పరుగులు వచ్చాయి. కూల్టర్‌నీల్ ఆఖరి ఓవర్లో బౌండరీతో కమిన్స్ అర్ధసెంచరీ (35 బంతుల్లో) పూర్తయ్యింది. మోర్గాన్ ఎట్టకేలకు బ్యాట్‌కు పనిచెప్పడంతో 2 భారీ సిక్సర్లు నమోదయ్యాయి. దీంతో 21 పరుగులు రావడంతో జట్టు స్కోరు 148 పరుగులకు చేరింది. 8వ ఓవర్లో క్రీజులోకి వచ్చిన మోర్గాన్ ఆఖరిదాకా అజేయంగా నిలిచినా 40 పరుగులైనా చేయలేకపోయాడు. ఫోర్‌తో జోరు కొనసాగింపు... ఏమంత కష్టసాధ్యంకాని లక్ష్యానికి ఓపెనర్లు రోహిత్ శర్మ, డికాక్ చక్కని ఆరంభమిచ్చారు. ఇన్నింగ్స్ తొలి బంతినే ఫోర్‌గా మలచిన రోహిత్ తర్వాత కూడా తన జోరు కొనసాగించాడు. మొదట్లో ‘హిట్‌మ్యాన్’ ధాటికి వెనుకబడిన డికాక్ దంచేందుకు ఎంతోసేపు పట్టలేదు. కమిన్స్, గ్రీన్ ఓవర్లలో చకచకా ఫోర్లు బాదేశాడు. ప్రత్యర్థి బౌలర్ల భరతం పట్టడంలో రోహిత్‌ను మించిపోయాడు. ముంబై 5.4 ఓవర్లలో 50 పరుగులకు చేరింది. తర్వాత ప్రసిధ్ కృష్ణ 7వ ఓవర్లో డికాక్ 2 బౌండరీలు, ఓ భారీ సిక్సర్ కొట్టాడు. రోహిత్ రెండు పదుల వద్దే తచ్చాడుతుంటే డికాక్ ఏకంగా 25 బంతుల్లోనే అర్ధశతకాన్ని (8 ఫోర్లు, 2 సిక్సర్లు) సాధించాడు. కమిన్స్, రస్సెల్, ప్రసిధ్ కృష్ణ, గ్రీన్ ఇలా కోల్‌కతా కెప్టెన్ పదే పదే బౌలర్లను మార్చినా... డికాక్ జోరును ఏమార్చలేకపోయాడు. 10 ఓవర్లు ముగిసేసరికి ముంబై 9 పరుగుల రన్‌రేట్‌తో ముంబై 90 పరుగులు చేసింది. తర్వాతి ఓవర్లోనే ‘హిట్‌మ్యాన్’ అవుట్ కావడంతో 94 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం ముగిసింది. శివమ్ మావి ఈ జోడీని విడగొట్టాడు. సూర్యకుమార్ యాదవ్ (10)ను వరుణ్ పెవిలియన్ చేర్చాడు. స్వల్ప వ్యవధిలో 2 వికెట్లు పడినా... డికాక్, హార్దిక్ పాండ్యా (11 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడటంతో ముంబై 17వ ఓవర్ పూర్తవకముందే లక్ష్యాన్ని ఛేదించింది. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: త్రిపాఠి (సి) సూర్యకుమార్ (బి) బౌల్ట్ 7; గిల్ (సి) పొలార్డ్ (బి) రాహుల్ చహర్ 21; నితీశ్ రాణా (సి) డికాక్ (బి) కూల్టర్‌నీల్ 5; దినేశ్ కార్తీక్ (బి) రాహుల్ చహర్ 4; మోర్గాన్ (నాటౌట్) 39; రసెల్ (సి) డికాక్ (బి) బుమ్రా 12; కమిన్స్ (నాటౌట్) 53; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 148. వికెట్ల పతనం: 1–18, 2–33, 3–42, 4–42, 5–61. బౌలింగ్: బౌల్ట్ 4–0–32–1, కూల్టర్‌నీల్ 4–0–51–1, బుమ్రా 4–0–22–1, కృనాల్ పాండ్యా 4–0–23–0, రాహుల్ చహర్ 4–0–18–2. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) దినేశ్ కార్తీక్ (బి) శివమ్ మావి 35; డికాక్ (నాటౌట్) 78; సూర్యకుమార్ యాదవ్ (బి) వరుణ్ 10; హార్దిక్ పాండ్యా (నాటౌట్) 21; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (16.5 ఓవర్లలో 2 వికెట్లకు) 149. వికెట్ల పతనం: 1–94, 2–111. బౌలింగ్: క్రిస్ గ్రీన్ 2.5–0–24–0, కమిన్స్ 3–0–28–0, ప్రసిధ్ కృష్ణ 2–0–30–0, రసెల్ 2–0–15–0, వరుణ్ చక్రవర్తి 4–0–23–1, శివమ్ మావి 3–0–24–1. -
పంజాబ్ మళ్లీ గెలిచిందోచ్!
ఐపీఎల్లో అట్టడుగున నిలిచిన జట్టు పంజాబ్. గెలిచే మ్యాచ్‌ల్ని ఓడిన జట్టు కూడా పంజాబే! రెండొందల పైచిలుకు స్కోరు చేసినా పరాజయాన్ని పలకరించిన జట్టు కింగ్స్ ఎలెవనే. ఇలాంటి జట్టు ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఏడింట ఒకే ఒక మ్యాచ్ గెలిచింది. అది బెంగళూరుపైనే! ఇప్పుడు కూడా ఐదు వరుస పరాజయాల తర్వాత మళ్లీ బెంగళూరుపైనే గెలిచి హమ్మయ్య గెలిచామనిపించింది. కింగ్స్ ఎలెవన్ అభిమానుల్ని ఊరటనిచ్చింది. లీగ్‌లో ముందడుగు వేసే అవకాశాల్ని సజీవంగా నిలుపుకుంది. షార్జా: ఎట్టకేలకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మళ్లీ గెలిచింది. మరుగున పడిన ఆశలకు ఊపిరి పోసింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 8 వికెట్ల తేడాతో బెంగళూరుపై గెలుపొందింది. టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 171 పరుగులు చేసింది. కోహ్లి (39 బంతుల్లో 48; 3 ఫోర్లు) రాణించగా... మోరిస్ (8 బంతుల్లో 25 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్‌లు) మెరిపించాడు. తర్వాత కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రాహుల్ (49 బంతుల్లో 61 నాటౌట్; 1 ఫోర్, 5 సిక్సర్లు), గేల్ (45 బంతుల్లో 53; 1 ఫోర్ 5 సిక్స్‌లు), మయాంక్ అగర్వాల్ (25 బంతుల్లో 45; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడారు. దూకుడుగా మొదలై... మ్యాక్స్‌వెల్ తొలి ఓవర్లో లాంగ్ లెగ్‌లో భారీ సిక్సర్ బాదిన ఫించ్, షమీ రెండో ఓవర్లో ఫోర్ కొట్టాడు. కాస్త ఆలస్యంగా బ్యాట్‌కు పనిచెప్పిన దేవ్‌దత్ పడిక్కల్ త్వరగానే పెవిలియన్ చేరాడు. షమీ వేసిన నాలుగో ఓవర్లో డీప్ స్క్వేర్ లెగ్‌లో అతను సిక్స్ బాదాడు. 4 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు 38/0 స్కోరు చేసింది. కానీ ఆ తర్వాతి ఓవర్ తొలి బంతికే దేవ్‌దత్ చెత్త షాట్‌తో వికెట్ పారేసుకున్నాడు. కోహ్లి వస్తూనే రెండు వరుస బౌండరీలు కొట్టాడు. 5.2 ఓవర్లలో బెంగళూరు 50 పరుగులకు చేరింది. జట్టు కుదుటపడే సమయంలో ఫించ్‌కు (18 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్) మురుగన్ అశ్విన్ చెక్ పెట్టాడు. ఏబీని కాదని... ఈ దశలో లెగ్ స్పిన్‌ను ఏబీ డివిలియర్స్ సరిగా ఆడలేడనే ఆలోచనతో ఆర్సీబీ టీమ్ వాషింగ్టన్ సుందర్‌ను ముందుగా బ్యాటింగ్‌కు పంపింది. ఈ ఎత్తుగడ ఏ మాత్రం జట్టుకు లాభించలేదు. కోహ్లితో సుందర్ జోడీ కుదర్లేదు. 10 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు 2 వికెట్లకు 83 పరుగులు చేసింది. మరుసటి ఓవర్లో సుందర్ (13)ను మురుగన్ అశ్విన్ పెవిలియన్ పంపాడు. మళ్లీ బెంగళూరు చేసిన తప్పే మళ్లీ చేసింది. ఈ సారీ కూడా ఏబీని కాదని శివమ్ దూబేను పంపింది. 11 నుంచి 14 ఓవర్లదాకా స్కోరు వేగం పూర్తిగా తగ్గింది. నాలుగు ఓవర్లలో బెంగళూరు 19 పరుగులే చేసింది. బిష్ణోయ్ వేసిన 15వ ఓవర్లో 2 భారీ సిక్సర్లు బాదిన దూబే (19 బంతుల్లో 23; 2 సిక్స్‌లు)ను తర్వాతి ఓవర్లోనే జోర్డాన్ అవుట్ చేశాడు. 17వ ఓవర్లో బ్యాటింగ్‌కు వచ్చిన డివిలియర్స్ (2)ను షమీ 18వ ఓవర్లో పెవిలియన్ చేర్చాడు. రెండు బంతుల వ్యవధిలో కోహ్లి కూడా అవుటవడంతో డివిలియర్స్‌ను ఆపి ఆఖర్లో దించిన ఆర్సీబీ అంచనా తలకిందులైంది. షమీ వేసిన ఆఖరి ఓవర్లో మోరిస్ భారీషాట్లతో విరుచుకుపడటంతో ఆర్సీబీ ఇన్నింగ్స్‌లోనే అత్యధికంగా 24 పరుగులు వచ్చాయి. ఓపెనర్ల శుభారంభం మోరిస్ వేసిన తొలి ఓవర్లో ఒకే పరుగు చేయడంతో పంజాబ్ ఇన్నింగ్స్ మొదలైంది. తర్వాత బౌండరీలతో పుంజుకుంది. ఆ వెంటే సిక్సర్లతో హోరెత్తింది. రాహుల్ రెండో ఓవర్లో ఫోర్ కొట్టాడు. ఈ రెండు ఓవర్లు ముగిసినా... మయాంక్ అగర్వాల్ ఖాతానే తెరవలేదు. మూడో ఓవర్లో మళ్లీ రాహులే సిక్సర్‌తో మెరిపించాడు. 3 ఓవర్లలో పంజాబ్ స్కోరు 18/0. ఇక నాలుగో ఓవర్‌ను స్పిన్నర్ చహల్ బౌలింగ్ చేయగా... మయాంక్ బ్యాట్ ఝులిపించాడు. సిక్స్‌తో పాటు రెండు ఫోర్లు కొట్టాడు. ఈ ఓవర్లో 15 పరుగులు పిండుకున్నాడు. ఆ తర్వాత కూడా సిక్స్ లేదంటే ఫోర్‌తో ఓవర్లు సాగిపోయాయి. కింగ్స్ ఎలెవన్ జట్టు ఆరో ఓవర్లో 50 పరుగులకు చేరింది. రాహుల్ ఫిఫ్టీ పంజాబ్ ఓపెనర్లు కుదురుకోవడంతో పరుగుల వేగం పెరిగింది. రాహుల్ కంటే ధాటిగా ఆడుతున్న మయాంక్ (25 బంతుల్లో 45; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు)కు ఎట్టకేలకు చహల్ చెక్ పెట్టాడు. 8వ ఓవర్లో బౌలర్ తలమీదుగా సిక్స్‌కొట్టిన అగర్వాల్ ఆ తర్వాతి బంతికే బౌల్డయ్యాడు. దీంతో 78 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. సిరాజ్ వేసిన 12వ ఓవర్లో రాహుల్ వరుసగా 2 సిక్సర్లు బాదడంతో పంజాబ్ వంద పరుగులను అధిగమించింది. రాహుల్ 37 బంతుల్లో (1 ఫోర్, 4 సిక్స్‌లు) అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. గేల్ ధనాధన్ తొలి మ్యాచ్ ఆడుతున్న గేల్ తొలి 14 బంతుల్లో 6 పరుగులే చేసినా, సుందర్ ఓవర్లో భారీ సిక్సర్లతో టచ్‌లోకి వచ్చాడు. తర్వాత సిరాజ్ బౌలింగ్‌లో గేల్ 4, 6 కొడితే రాహుల్ మరో సిక్స్ బాదాడు. దీంతో ఆ ఓవర్లో ఏకంగా 20 పరుగులొచ్చాయి. 17వ ఓవర్లో గేల్ తనదైన శైలిలో లాంగాన్‌లో 2 సిక్సర్లను బాదేశాడు. దీంతోనే అతని అర్ధశతకం 36 బంతుల్లో పూర్తయ్యింది. 18 బంతుల్లో 11 పరుగులు చేయాల్సి వుండగా... మోరిస్ (18వ), ఉదాన (19వ) రెండు ఓవర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కేవలం 9 పరుగులే వచ్చాయి. ఆఖరి ఓవర్లో విజయానికి 2 పరుగులు అవసరం కాగా చహల్ కూడా పేసర్లలాగే వైవిధ్యమైన బంతులేశాడు. 4 బంతుల్లో పరుగు మాత్రమే ఇచ్చాడు. స్కోరు సమమైంది. ఐదో బంతికి గేల్ రనౌటయ్యాడు. ఆఖరి బంతికి పరుగు చేయాల్సిన సమయంలో ఉత్కంఠ రేగింది. కానీ పూరన్ భారీ సిక్సర్‌తో ఈ ఉత్కంఠను, లక్ష్యాన్ని ఛేదించాడు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: ఫించ్ (బి) మరుగున్ అశ్విన్ 20; పడిక్కల్ (సి) పూరన్ (బి) అర్‡్షదీప్ 18; కోహ్లి (సి) రాహుల్ (బి) షమీ 48; సుందర్ (సి) జోర్డాన్ (బి) అశ్విన్ 13; దూబే (సి) రాహుల్ (బి) జోర్డాన్ 23; డివిలియర్స్ (సి) హుడా (బి) షమీ 2; మోరిస్ (నాటౌట్) 25; ఉదాన (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–38, 2–62, 3–86, 4–127, 5–134, 6–136. బౌలింగ్: మ్యాక్స్‌వెల్ 4–0–28–0, షమీ 4–0–45–2, అర్‡్షదీప్ 2–0–20–1, రవి బిష్ణోయ్ 3–0–29–0, మురుగన్ అశ్విన్ 4–0–23–2, జోర్డాన్ 3–0–20–1. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: రాహుల్ (నాటౌట్) 61; మయాంక్ (బి) చహల్ 45; గేల్ (రనౌట్) 53; పూరన్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 177. వికెట్ల పతనం: 1–78, 2–171. బౌలింగ్: మోరిస్ 4–0–22–0, సైనీ 4–0–21–0, చహల్ 3–0–35–1, ఉదాన 2–0–14–0, సిరాజ్ 3–0–44–0, సుందర్ 4–0–38–0. కోహ్లి @ 200 మ్యాచ్‌ల్లో సెంచరీలు కొట్టే విరాట్... మ్యాచ్‌ల పరంగా డబుల్ సెంచరీ సాధించాడు. ఐపీఎల్ పుట్టినప్పటినుంచి ఆర్సీబీని వీడని కెప్టెన్ కోహ్లి ఈ జట్టు తరఫున గురువారం 200వ మ్యాచ్ ఆడాడు. ఇందులో 185 ఐపీఎల్‌లోనే ఆడగా... మిగతా 15 మ్యాచ్‌లు చాంపియన్స్ లీగ్ (రద్దయింది)లో ఆడాడు. -
ఢిల్లీ సిక్సర్...
దుబాయ్: ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మరో విజయం సాధించింది. బుధవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో క్యాపిటల్స్ 13 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌పై గెలుపొందింది. లీగ్‌లో ఢిల్లీకిది ఆరో విజయం కాగా... రాయల్స్ ఐదో ఓటమి చవిచూసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 161 పరుగులు చేసింది. ధావన్ (33 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (43 బంతుల్లో 53; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), రాణించారు. అర్చర్ 3 వికెట్లు తీశాడు. తర్వాత రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 148 పరుగులే చేసి ఓడింది. స్టోక్స్ (35 బంతుల్లో 41; 6 ఫోర్లు) మెరుగ్గా ఆడాడు. నోర్జే, తుషార్ దేశ్‌పాండే చెరో 2 వికెట్లు తీశారు. నోర్జేకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ధావన్ దంచేశాడు... ‘సున్నా’కే పృథ్వీ షా అవుటయ్యాడు. ఢిల్లీ ఇన్నింగ్స్ మొదలైన తొలి బంతికే అర్చర్ అతన్ని పెవిలియన్‌కు పంపాడు. అనుభవజ్ఞుడైన రహానే (2) కూడా ఆర్చర్ స్వింగ్‌కు తలవంచాడు. ఈ దశలో ధావన్ దూకుడు పెంచాడు. రెండో ఓవర్లోనే బౌండరీ కొట్టిన ఈ ఎడంచేతి బ్యాట్స్‌మన్... త్యాగి నాలుగో ఓవర్లో షార్ట్ ఫైన్ లెగ్‌లో భారీ సిక్సర్ బాదాడు. ఇదే ఊపుతో తర్వాతి రెండు ఓవర్లలోనూ ధావన్, కెప్టెన్ అయ్యర్ ఫోర్లు కొట్టడంతో పవర్ ప్లే (6 ఓవర్లు)లో ఢిల్లీ 47/2 స్కోరు చేసింది. తర్వాత స్పిన్నర్లను చూసి ఆడిన వీరిద్దరు బంతుల్ని మాత్రం వృథా చేయకుండా ఒకట్రెండు పరుగులు, అడపాదడపా బౌండరీలు బాదడంతో 10 ఓవర్లు ముగిసేసరికి రన్‌రేట్‌ను ఇంచుమించు 8 పరుగులకు పెంచుకుంది. ఆ మరుసటి ఓవర్లోనే ధావన్ 30 బంతుల్లో (6 ఫోర్లు, 1 సిక్స్) ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. తర్వాత గోపాల్ 12వ ఓవర్ తొలి బంతిని మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ బాదిన ధావన్ అదే ఓవర్లో అవుటయ్యాడు. అయ్యర్ అర్ధ శతకం... శిఖర్ అవుటయ్యాక శ్రేయస్ అయ్యర్ వేగం పెంచాడు. ఫోర్లు, సిక్సర్లు బాదుతూ స్కోరు బోర్డును పరుగెత్తించాడు. ఉనాద్కట్ వేసిన 16వ ఓవర్లో అతను లాంగాన్, డీప్ మిడ్వికెట్ల మీదుల సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో అయ్యర్ 40 బంతుల్లో అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. తర్వాతి ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించి లాంగాఫ్‌లో ఆర్చర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 16వ ఓవర్లో అతను అవుటయ్యే సరికి జట్టు స్కోరు 132/4. కానీ మిగిలిన 4 ఓవర్లలో ఆశించినన్ని పరుగులు రాలేదు. స్టొయినిస్ (18), క్యారీ (14)లు మెరిపించకపోవడంతో ఢిల్లీ 24 బంతుల్లో 29 పరుగులే చేయగలిగింది. దూకుడుగా మొదలై... రాజస్తాన్ లక్ష్యఛేదన బౌండరీతో మొదలైంది. బట్లర్‌తో ఓపెనింగ్ చేసిన స్టోక్స్ ఫోర్ బాదాడు. బట్లర్ కూడా బౌండరీ కొట్టడంతో రబడ తొలి ఓవర్లోనే 10 పరుగులు ఇచ్చుకున్నాడు. తర్వాత తుషార్ ఓవర్లో స్టోక్స్ 2 ఫోర్లు కొట్టాడు. ఇక మూడో ఓవర్లో అయితే బట్లర్ చెలరేగాడు. నోర్జే బౌలింగ్‌లో ఓ సిక్స్, వరుస రెండు ఫోర్లు కొట్టాడు. ఇంకో బంతి మిగిలుండగానే 16 పరుగులొచ్చాయి. కానీ ఆఖరి బంతికి బట్లర్ బౌల్డయ్యాడు. 3 ఓవర్లలో 37/1 స్కోరుతో ఉన్న రాయల్స్‌కు తర్వాతి ఓవర్లోనే అశ్విన్ పెద్ద షాకిచ్చాడు. స్టార్ బ్యాట్స్‌మన్ స్మిత్ (1)ను రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు. స్కోరుజోరు ఒక్కసారిగా పడిపోయింది. తర్వాత 3 ఓవర్లలో కేవలం 13 పరుగులే రాగా... 6 ఓవర్లలో జట్టు స్కోరు 50కి చేరింది. క్రీజులో కుదురుకున్న సామ్సన్, స్టోక్స్ ధాటిగా ఆడటంతో ఏడో ఓవర్ నుంచి మళ్లీ పుంజుకుంది. 8.5 రన్‌రేట్‌తో 10 ఓవర్లు ముగిసేసరికి 85/2 స్కోరు చేసింది. కానీ వరుస ఓవర్లలో స్టోక్స్, సామ్సన్ (18 బంతుల్లో 25; 2 సిక్స్‌లు) అవుటవ్వడం రాజస్తాన్‌కు ప్రతికూలమైనా... ఉతప్ప (27 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్) రన్‌రేట్ పడిపోనివ్వలేదు. అశ్విన్ కట్టడి... 15 ఓవర్లలో రాజస్తాన్ రాయల్స్ స్కోరు 5 వికెట్లకు 123 పరుగులుగా ఉంది. ఆఖరి 5 ఓవర్లలో 39 పరుగులు చేయాల్సిన సమీకరణం ఏమంత క్లిష్టమైంది కాదు. పైగా హిట్టర్లు తేవటియా, రాబిన్ ఉతప్ప క్రీజులో ఉన్నారు. కానీ స్పిన్నర్ అశ్విన్ పొదుపైన బౌలింగ్‌తో మ్యాచ్‌ను రసవత్తరంగా మార్చాడు. 16వ ఓవర్లో అతను కేవలం 2 పరుగులే ఇవ్వడం... తర్వాత పేసర్లు నోర్జే, రబడ పట్టుబిగించేందుకు అవకాశం కల్పించింది. ఇందుకు తగ్గట్లే నోర్జే 17వ ఓవర్లో రాబిన్ ఉతప్ప వికెట్ తీయడంతో పాటు 4 పరుగులే ఇచ్చాడు. రబడ కూడా ఆర్చర్ (1)ను అవుట్ చేసి మూడే పరుగులిచ్చాడు. దీంతో ఆఖరి ఓవర్ సమీకరణం రాజస్తాన్‌కు క్లిష్టమైంది. గెలిపించేందుకు 6 బంతుల్లో 22 పరుగులు చేయడం తేవటియా (14 నాటౌట్) వల్ల కాలేదు. తుషార్ దేశ్‌పాండే ఈ ఓవర్లో 8 పరుగులిచ్చి శ్రేయస్ గోపాల్ (6)ను అవుట్ చేశాడు. నాడు... బౌండరీ వెలుపల! తుషార్ దేశ్‌పాండే ఐపీఎల్ పుట్టినపుడే మైదానంలో కాలుపెట్టాడు. కానీ... గీత దాటలేదు (బౌండరీ వెలుపలే ఉన్నాడు). 13 ఏళ్ల తర్వాత మైదానంలోకి అడుగుపెట్టాడు. ఈసారి గీత దాటాడు (బౌండరీ లోపల). అంటే ఆటగాడిగా అరంగేట్రం చేశాడు. అసలు సంగతి ఏంటటే... 2008లో ప్రారంభమైన ఐపీఎల్లో తుషార్ అండర్–13 కేటగిరీలో బాలుడు. ముంబైలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లకు ఈ పిల్లాడు ‘బాల్‌బాయ్’గా పనిచేశాడు. ఇప్పుడేమో 25 ఏళ్ల ఈ పేసర్ రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగాడు. విధ్వంసక బ్యాట్స్‌మన్ స్టోక్స్‌తో పాటు శ్రేయస్ గోపాల్‌లను అవుట్ చేసి వికెట్ల ఖాతా తెరిచాడు. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (బి) ఆర్చర్ 0; ధావన్ (సి) కార్తీక్ (బి) గోపాల్ 57; రహానే (సి) ఉతప్ప (బి) ఆర్చర్ 2; అయ్యర్ (సి) ఆర్చర్ (బి) త్యాగి 53; స్టొయినిస్ (సి) తేవటియా (బి) ఆర్చర్ 18; క్యారీ (సి) ఆర్చర్ (బి) ఉనాద్కట్ 14; అక్షర్ పటేల్ (సి) త్యాగి (బి) ఉనాద్కట్ 7; అశ్విన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 161. వికెట్ల పతనం: 1–0, 2–10, 3–95, 4–132, 5–153, 6–157, 7–161. బౌలింగ్: ఆర్చర్ 4–0–19–3, ఉనాద్కట్ 3–0–32–2, కార్తీక్ త్యాగి 4–0–30–1, స్టోక్స్ 2–0–24–0, శ్రేయస్ గోపాల్ 4–0–31–1, రాహుల్ తేవటియా 3–0–23–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: స్టోక్స్ (సి) (సబ్) లలిత్ యాదవ్ (బి) తుషార్ దేశ్‌పాండే 41; బట్లర్ (బి) నోర్జే 22; స్మిత్ (సి అండ్ బి) అశ్విన్ 1; సామ్సన్ (బి) అక్షర్ పటేల్ 32; రియాన్ పరాగ్ (రనౌట్) 1; రాహుల్ తేవటియా(నాటౌట్) 14; ఆర్చర్ (సి) రహానే (బి) రబడ 1; శ్రేయస్ గోపాల్ (సి) (సబ్) లలిత్ యాదవ్ (బి) తుషార్ దేశ్‌పాండే 6; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 148. వికెట్ల పతనం: 1–37, 2–40, 3–86, 4–97, 5–110, 6–135, 7–138, 8–148. బౌలింగ్: రబడ 4–0–28–1, తుషార్ దేశ్‌పాండే 4–0–37–2, నోర్జే 4–0–33–2, అశ్విన్ 4–0–17–1, అక్షర్ పటేల్ 4–0–32–1. -
రాయల్స్ రైజింగ్..
12 ఓవర్లు ముగిసేసరికి రాయల్స్ స్కోరు 78/5. మేటి బ్యాట్స్‌మెన్ అందరూ పెవిలియన్ చేరుకున్నారు. దాంతో రాజస్తాన్ ఓటమి ఖాయంగానే కనిపించింది. స్వల్ప లక్ష్యాల్ని కాచుకునే సన్‌రైజర్స్ బౌలింగ్ దళం ముందర మిగతా రాయల్స్ బ్యాట్స్‌మెన్ ఏం నిలుస్తారులే అనుకున్నారంతా. కానీ రాహుల్ తేవటియా, రియాన్ పరాగ్ అందరి అంచనాలను తల్లకిందులు చేశారు. సన్‌రైజర్స్ బౌలర్ల భరతంపట్టిన ఈ జోడీ రాయల్స్‌కు అద్భుత విజయం అందించింది. స్లో పిచ్‌పై రైజర్స్ బ్యాట్స్‌మెన్ శ్రమించిన చోటే వీరిద్దరూ సులువుగా పరుగులు సాధించారు. వచ్చిన ప్రతీ బౌలర్ పరుగులు సమర్పించుకోవడంతో మరో బంతి మిగిలి ఉండగానే రాజస్తాన్ విజయాన్నందుకుంది. వరుసగా నాలుగు పరాజయాల తర్వాత రాజస్తాన్ గెలుపు బాట పట్టగా... హైదరాబాద్ ఖాతాలో నాలుగో ఓటమి చేరింది. దుబాయ్: రాజస్తాన్ రాయల్స్‌కు ఊరటనిచ్చే విజయం దక్కింది. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో రాయల్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 158 పరుగులు చేసింది. మనీశ్ పాండే (44 బంతుల్లో 54; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీతో మెరిశాడు. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (38 బంతుల్లో 48; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. విలియమ్సన్ (12 బంతుల్లో 22 నాటౌట్; 2 సిక్సర్లు), ప్రియమ్ గార్గ్ (8 బంతుల్లో 15; 1 ఫోర్, 1 సిక్స్) వేగంగా ఆడారు. అనంతరం ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రాహుల్ తేవటియా (28 బంతుల్లో 45 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రియాన్ పరాగ్ (26 బంతుల్లో 42; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో రాజస్తాన్ 19.5 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు సాధించింది. వీరిద్దరూ అజేయంగా ఆరో వికెట్‌కు 85 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. ఖలీల్, రషీద్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. తొలుత తడబాటు... 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌కు ఆరంభంలోనే దెబ్బ పడింది. రైజర్స్ బౌలర్లు చెలరేగడంతో బెన్ స్టోక్స్ (5), బట్లర్ (16), స్మిత్ (5) పవర్‌ప్లే లోపే పెవిలియన్ చేరారు. తర్వాత సంజూ సామ్సన్ (26; 3 ఫోర్లు), ఉతప్ప (18; 1 ఫోర్, 1 సిక్స్) కాస్త పోరాడినా రషీద్‌ఖాన్ ముందు వారి ఆటలు సాగలేదు. క్రీజులోకి రియాన్ పరాగ్, రాహుల్ తేవటియా వచ్చినప్పటికీ 15 ఓవర్లకు రాజస్తాన్ 94/5తో నిలిచింది. విజయానికి 30 బంతుల్లో 65 పరుగులు కావాలి. ఈదశలో సన్‌రైజర్స్ స్కోరు (96/2) కూడా దాదాపు అంతే. అలవోకగా పరుగులు... అప్పటివరకు సింగిల్స్‌కే పరిమితమైన పరాగ్ 16వ ఓవర్ చివరి బంతికి సిక్స్‌తో జోరు పెంచాడు. సందీప్ శర్మ బౌలింగ్‌లో తేవటియా 6, పరాగ్ రెండు వరుస బౌండరీలు బాదడంతో 18 పరుగులు జతయ్యాయి. రషీద్ వేసిన 18వ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు బాదిన తేవటియా... నటరాజన్ తర్వాతి ఓవర్లో 4,6 దంచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 6 బంతుల్లో 8 పరుగులు చేయాల్సి ఉండగా మొదటి నాలుగు బంతుల్లో 6 పరుగులు వచ్చాయి. ఐదో బంతికి సిక్సర్ బాదిన పరాగ్ జట్టుకు ఊరటనిచ్చే విజయాన్ని అందించాడు. ఆకట్టుకున్న వార్నర్, మనీశ్.. ఆట ఆరంభంలో సన్‌రైజర్స్ అతి జాగ్రత్తకు పోయింది. నాలుగో ఓవర్లో వార్నర్ కొట్టిన ఫోర్‌తో బౌండరీల ఖాతా తెరచింది. ఆ తర్వాత ఓ భారీ సిక్సర్ బాదిన బెయిర్‌స్టో (16) మరుసటి బంతికే ఔటయ్యాడు. పవర్‌ప్లేలో సన్‌రైజర్స్ స్కోరు 26/1. మనీశ్ వచ్చాక పరుగుల వేగం కాస్త పెరిగింది. ఏడో ఓవర్ తేవటియా బౌలింగ్‌లో మనీశ్, తర్వాతి ఓవర్లో వార్నర్ చెరో సిక్సర్‌తో అలరించారు. ఈ దశలో రాజస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో 10–15 ఓవర్ల మధ్య వీరిద్దరు కలిసి కేవలం 2 సిక్సర్లు మాత్రమే బాదగలిగారు. బ్యాట్ ఝళిపించేందుకు సిద్ధమవుతున్న ఈ జంటను 15వ ఓవర్లో వార్నర్‌ను అవుట్ చేసి ఆర్చర్ విడదీశాడు. దీంతో రెండో వికెట్‌కు 73 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 16వ ఓవర్లో 4, 6 బాదిన మనీశ్ 13 పరుగులు రాబట్టడంతో జట్టు స్కోరు 100 పరుగులు దాటింది. తర్వాత మనీశ్ పెవిలియన్ చేరినా... విలియమ్సన్ రెండు సిక్సర్లు బాదడంతో 19వ ఓవర్లో అత్యధికంగా 19 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్లో 6,4 బాదిన ప్రియమ్ గార్గ్ జట్టు స్కోరును 150 పరుగులు దాటించాడు. చివరి 30 బంతుల్లో 62 పరుగులు సాధించింది. ఆ క్యాచ్ పట్టి ఉంటే... అందివచ్చిన అవకాశాన్ని వదులుకుంటే ఒక్కోసారి భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌కు ఈ అనుభవం ఎదురైంది. ఖలీల్ అహ్మద్ వేసిన ఇన్నింగ్స్‌లో 16వ ఓవర్ మూడో బంతికి రియాన్ పరాగ్ భారీ షాట్ ఆడగా బంతి గాల్లోకి లేచింది. డీప్ మిడ్వికెట్లో ప్రియమ్ గార్గ్ క్యాచ్‌ను వదిలేశాడు. దాంతో పరాగ్ బతికిపోయాడు. అప్పటికి పరాగ్ 12 పరుగులతో ఉన్నాడు. ఒకవేళ పరాగ్ క్యాచ్‌ను గార్గ్ పట్టిఉంటే సన్‌రైజర్స్‌కు తుది ఫలితం మరోలా ఉండేదేమో. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (బి) ఆర్చర్ 48; బెయిర్‌స్టో (సి) సామ్సన్ (బి) త్యాగి 16; మనీశ్ (సి) తేవటియా (బి) ఉనాద్కట్ 54; విలియమ్సన్ (నాటౌట్) 22; ప్రియమ్ గార్గ్ (రనౌట్) 15; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 158. వికెట్ల పతనం: 1–23, 2–96, 3–122, 4–158. బౌలింగ్: ఆర్చర్ 4–0–25–1, శ్రేయస్ గోపాల్ 4–0–31–0, కార్తీక్ త్యాగి 3–0–29–1, ఉనాద్కట్ 4–0–31–1, తేవటియా 4–0–35–0, బెన్‌స్టోక్స్ 1–0–7–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: స్టోక్స్ (బి) ఖలీల్ అహ్మద్ 5; బట్లర్ (సి) బెయిర్‌స్టో (బి) ఖలీల్ అహ్మద్ 16; స్మిత్ (రనౌట్) 5; సంజూ సామ్సన్ (సి) బెయిర్‌స్టో (బి) రషీద్ ఖాన్ 26; ఉతప్ప (ఎల్బీడబ్ల్యూ) (బి) రషీద్ ఖాన్ 18; రియాన్ పరాగ్ (నాటౌట్) 42; రాహుల్ తేవటియా (నాటౌట్) 45; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19.5 ఓవర్లలో 5 వికెట్లకు) 163. వికెట్ల పతనం: 1–7, 2–25, 3–26, 4–63, 5–78. బౌలింగ్: సందీప్ 4–0–32–0, అహ్మద్ 3.5–0–37–2, నటరాజన్ 4–1–32–0, అభిషేక్ శర్మ 1–0–11–0, రషీద్ ఖాన్ 4–0–25–2, విజయ్ శంకర్ 3–0–22–0. -
‘స్వీట్ స్వియాటెక్’
పారిస్ గడ్డపై పోలండ్ గర్ల్ మెరిసింది... తొలి మ్యాచ్‌నుంచి ఒక్క సెట్ కూడా కోల్పోకుండా దూసుకొచ్చిన ఇగా స్వియాటెక్ చివరి వరకు అదే జోరు కొనసాగించి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను అందుకొని కొత్త చరిత్ర సృష్టించింది. విజేతగా నిలిచే క్రమంలో ఎన్నో ఘనతలు తన ఖాతాలో వేసుకున్న 19 ఏళ్ల ఈ అమ్మాయి ఆనందానికి ఎర్ర మట్టి కోట వేదికైంది. మరో వైపు ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌తో ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించిన సోఫియా కెనిన్ మాత్రం ఏమాత్రం పోరాటం ప్రదర్శించకుండా పరాజయంపాలైంది. పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను ఇగా స్వియాటెక్ (పోలండ్) గెలుచుకుంది. శనివారం ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో స్వియాటెక్ 6–4, 6–1 తేడాతో నాలుగో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా)ను చిత్తు చేసింది. గంటా 24 నిమిషాల్లో ఈ మ్యాచ్ ముగిసింది. ఈ టోర్నీకి ముందు 54వ ర్యాంక్‌తో అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన పోలండ్ ప్లేయర్ తాజా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 17వ స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. విజేతగా నిలిచిన స్వియాటెక్‌కు 16 లక్షల యూరోలు (సుమారు రూ. 13 కోట్ల 82 లక్షలు), రన్నరప్‌గా నిలిచిన కెనిన్‌కు 8 లక్షల యూరోలు (సుమారు రూ. 7 కోట్ల 34 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. అలవోకగా... మ్యాచ్ ఆరంభంనుంచే ఆధిపత్యం ప్రదర్శించిన స్వియాటెక్ ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి 3–0తో ఆధిక్యంలోకి దూసుకుపోయింది. అయితే కోలుకున్న కెనిన్ పట్టుదలగా ఆడటంతో స్కోరు 3–3కు చేరింది. ఈ దశలో మళ్లీ బ్రేక్ సాధించిన పోలండ్ అమ్మాయి 5–3తో ముందంజ వేసింది. తర్వాతి గేమ్‌ను కెనిన్‌కు కోల్పోయినా మరుసటి గేమ్‌లో మళ్లీ చెలరేగి సెట్‌ను గెలుచుకుంది. రెండో సెట్లో ఆమెకు తిరుగులేకుండా పోయింది. తొలి గేమ్‌లో స్వియాటెక్ సర్వీస్‌ను కెనిన్ బ్రేక్ చేసి 1–0తో ఆధిక్యం సాధించింది. అయితే ఇక్కడినుంచి ఇగా చెలరేగిపోయింది. వరుసగా ఆరు గేమ్‌లు గెలుచుకొని టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇగా షాట్లకు ప్రత్యర్థి వద్ద సమాధానం లేకపోయింది. తుది పోరులో స్వియాటెక్ 25 విన్నర్లు కొట్టగా 17 అన్ఫోర్స్డ్ ఎర్రర్స్ మాత్రమే చేసింది. స్వియాటెక్ ఘనతలివీ... ► పోలండ్ తరఫున గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన తొలి మహిళ ► అన్‌సీడెడ్‌గా దిగి ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన రెండో మహిళ ► గత 40 ఏళ్లలో పురుషుల, మహిళల విభాగాల్లో కెరీర్లో తొలి టైటిల్‌గా గ్రాండ్‌స్లామ్‌ను గెలిచిన నాలుగో క్రీడాకారిణి ► మోనికా సెలెస్ (18 ఏళ్ల 187) రోజుల తర్వాత పిన్న వయసులో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన (19 ఏళ్ల 132 రోజులు) మహిళ. ► 1975 తర్వాత ఇంత తక్కువ ర్యాంక్ (54) ఉన్న క్రీడాకారిణి ఫ్రెంచ్ ఓపెన్ గెలవడం ఇదే మొదటిసారి. -
పరాజయం పిలిచింది...
మ్యాచ్‌లో విజయానికి 17 బంతుల్లో 21 పరుగులు కావాలి... చేతిలో 9 వికెట్లు ఉన్నాయి...ఇలాంటి స్థితిలో ఎంత బలహీన జట్టయినా గెలుపును అందుకుంటుంది. కానీ అలా చేయగలిగితే అది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఎందుకవుతుంది.. గత మ్యాచ్‌లాగే పేలవ బ్యాటింగ్‌లో తడబడిన టీమ్ చివరకు 18 పరుగులు మాత్రమే చేసి ఓట మిని ఆహ్వానించింది. మరోసారి అతి జాగ్రత్తకు పోయిన కెప్టెన్ రాహుల్ క్రీజ్‌లో ఉన్నా, పంజా బ్‌కు పరాజయం తప్పలేదు. బ్యాటింగ్‌లో మెరుపు ప్రదర్శన కనబర్చిన కెప్టెన్ దినేశ్ కార్తీక్ కెప్టెన్సీలో కూడా ప్రత్యేకత కనబర్చడంతో నైట్‌రైడర్స్ చివరి క్షణాల్లో మరో విజయాన్ని అందుకుంది. మ్యాచ్ ఆఖరి బంతికి సిక్సర్ కొడితే స్కోరు సమమయ్యే అవకాశం ఉండగా మ్యాక్స్‌వెల్ కొట్టిన షాట్ బౌండరీకి రెండంగుళాలు ముందు పడి ఫోర్‌గా మారడంతో పంజాబ్‌కు ఓటమి తప్పలేదు. అబుదాబి: వరుసగా రెండో మ్యాచ్‌లోనూ తక్కువ లక్ష్యాన్ని కాపాడుకుంటూ కోల్‌కతా నైట్‌రైడర్స్ సత్తా చాటింది. శనివారం పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 2 పరుగులతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కెప్టెన్ దినేశ్ కార్తీక్ (29 బంతుల్లో 58; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్ధ సెంచరీ సాధించాడు. శుబ్‌మన్ గిల్ (47 బంతుల్లో 57; 5 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. అనంతరం పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులు చేసి ఓడిపోయింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (58 బంతుల్లో 74; 6 ఫోర్లు), మయాంక్ (39 బంతుల్లో 56; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. సూపర్ కార్తీక్ పవర్ ప్లేలో 25/1... 10 ఓవర్లలో 60/2... 15 ఓవర్లకు 101/3. ఈ స్కోరు చూస్తే ఎవరికైనా కోల్‌కతా ఇన్నింగ్స్ ఎంత నెమ్మదిగా సాగిందో అర్థమవుతోంది. 150 పరుగులు దాటితే అదే గొప్ప అని భావించారంతా. కానీ కెప్టెన్ దినేశ్ కార్తీక్ ధాటికి చివరి 30 బంతుల్లో 63 పరుగులు సాధించిన కోల్‌కతా ప్రత్యర్థికి మంచి లక్ష్యాన్ని నిర్దేశించింది. కోల్‌కతా ఇన్నింగ్స్‌లో కార్తీక్ ఆటే హైలైట్. గత మ్యాచ్ హీరో రాహుల్ త్రిపాఠి (4), రాణా (2), మోర్గాన్ (23 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్), రసెల్ (5) వేగంగా పరుగులు చేయడంలో విఫలమైన వేళ.. కార్తీక్ స్వేచ్ఛగా ఆడాడు. జట్టు స్కోరు 63/3 వద్ద క్రీజులోకి వచ్చిన అతను... అప్పటికే క్రీజులో కుదురుకున్న గిల్‌కు అవకాశమిస్తూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. ఈ క్రమంలో గిల్ 42 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. మరోవైపు అర్‡్షదీప్ వేసిన 16వ ఓవర్లో మూడు బౌండరీలతో కార్తీక్ దూకుడు పెంచాడు. అదే ఊపులో వరుసగా 4, 6, 4 బాది జోర్డాన్ బౌలింగ్‌లో 18 పరుగులు రాబట్టాడు. షమీ వేసిన మరుసటి ఓవర్లోనే వరుసగా రెండు ఫోర్లు బాదిన కార్తీక్ 22 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. వెంటనే గిల్ రనౌట్‌గా వెనుదిరగడంతో నాలుగో వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మారని తీరు... మొదట్లో ప్రశాంతంగా సాగిన పంజాబ్ ఇన్నింగ్స్ చివర్లో బోల్తా కొట్టింది. ఎలాగైనా జట్టును గెలిపించేందుకు బరిలోకి దిగిన రాహుల్ రెండో ఓవర్లోనే ఔటయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్నాడు. దీన్ని సద్వినియోగం చేసుకున్న అతను అడపాదడపా బౌండరీలు బాదుతూ ఇన్నింగ్స్ నడిపించాడు. మరోవైపు మయాంక్ ధాటిగా ఆడాడు. ప్రసిధ్ బౌలింగ్‌లో సిక్స్‌తో సహా రెండు ఫోర్లు బాదిన మయాంక్... కమలేశ్ ఓవర్లో వరుసగా రెండు బౌండరీలతో జోరు పెంచాడు. కమిన్స్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లతో రాహుల్ 42 బంతుల్లో అర్ధసెంచరీ అందుకోగా... మయాంక్ 33 బంతుల్లో ఈ ఫీట్‌ను సాధించాడు.తొలి వికెట్‌కు 115 పరుగుల్ని జోడించిన ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ పంజాబ్‌ను పటిష్ట స్థితిలో నిలిపారు. 34 బంతుల్లో 50 పరుగులు చేయాల్సిన స్థితిలో మయాంక్ ఔటయ్యాడు. చేతిలో ఇంకా 9 వికెట్లుండటంతో పంజాబ్ విజయం దాదాపు ఖాయంగానే తోచింది. కానీ తర్వాతే ఇన్నింగ్స్ తడబడింది. నరైన్ బంతికి పూరన్ (16) క్లీన్‌బౌల్డ్ కావడంతో పతనం ప్రారంభమైంది. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్ రైడర్స్ ఇన్నింగ్స్: రాహుల్ త్రిపాఠి (బి) షమీ 4; గిల్ (రనౌట్) 57; రాణా (రనౌట్) 2; మోర్గాన్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) బిష్ణోయ్ 24; కార్తీక్ (రనౌట్) 58; రసెల్ (సి) ప్రభ్ సిమ్రన్ (బి) అర్‡్షదీప్ 5; కమిన్స్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–12, 2–14, 3–63, 4–145, 5–150, 6–164. బౌలింగ్: షమీ 4–0–30–1, అర్‡్షదీప్ 4–1–25–1, జోర్డాన్ 4–0–37–0, ముజీబ్ 4–0–44–0, బిష్ణోయ్ 4–0–25–1. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: రాహుల్ (బి) ప్రసిధ్ 74; మయాంక్ (సి) గిల్ (బి) ప్రసి«ధ్ 56; పూరన్ (బి) నరైన్ 16; ప్రభ్ సిమ్రన్ (సి) రాణా (బి) ప్రసిధ్ 4; మ్యాక్స్‌వెల్ (నాటౌట్) 10; మన్దీప్ (సి) (సబ్) గ్రీన్ (బి) నరైన్ 0; జోర్డాన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1–115, 2–144, 3–149, 4–151, 5–158. బౌలింగ్: కమిన్స్ 4–0–29–0, ప్రసి«ధ్ 4–0–29–3, కమలేశ్ 3–0–40–0, వరుణ్ 4–0–27–0, నరైన్ 4–0–28–2, రాణా 1–0–7–0. నరైన్ బౌలింగ్‌పై సందేహాలు! కోల్‌కతా జట్టుకు కొత్త సమస్య వచ్చి పడింది! పంజాబ్‌తో మ్యాచ్‌ను గెలిపించిన జట్టు స్పిన్నర్ సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్‌పై ఫీల్డ్ అంపైర్లు సందేహం వ్యక్తం చేశారు. అతని బౌలింగ్ సందేహాస్పదంగా, నిబంధనలకు విరుద్ధంగా ఉందని వారు నివేదిక ఇచ్చారు. అయితే ప్రస్తుతానికి అతనిపై ఎలాంటి చర్య తీసుకోవడం లేదు. ఐపీఎల్లో నరైన్ బౌలింగ్‌ను కొనసాగించవచ్చని, మరో సారి యాక్షన్‌పై సందేహం వ్యక్తం చేస్తే సస్పెండ్ చేస్తామని గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించింది. -
విరాట్ వీరబాదుడు
పరుగు పెట్టని స్కోరు బోర్డుకు కోహ్లి మెరుగులు దిద్దాడు. బౌలర్ల అడ్డగా మారిన పిచ్‌పై తన బ్యాటింగ్ తడఖా చూపించాడు. బెంగళూరు ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఆఖర్లో మెరిపించాడు. తర్వాత పని తమ బౌలర్లకు అప్పగించాడు. జట్టును గెలిపించాడు. దుబాయ్: బంతులు నిప్పులు చెరిగేచోట కోహ్లి బ్యాట్ గర్జించింది. ఇరు జట్లలో ఏ బ్యాట్స్‌మెన్‌కు సాధ్యం కానీ ఇన్నింగ్స్‌తో అతను బెంగళూరును గెలిపించాడు. శనివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 37 పరుగులతో చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఓడించింది. మొదట బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లకు 169 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కోహ్లి (52 బంతుల్లో 90 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆఖర్లో చెలరేగాడు. దేవ్‌దత్ పడిక్కల్ (34 బంతుల్లో 33; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. తర్వాత చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులే చేయగల్గింది. రాయుడు (40 బంతుల్లో 42; 4 ఫోర్లు), ఐపీఎల్లో అరంగేట్రం చేసిన జగదీశన్ (28 బంతుల్లో 33; 4 ఫోర్లు) రాణించారు. మోరిస్ 3, వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు తీశారు. ఫించ్ 2, ఏబీ 0 పిచ్ బౌలింగ్‌కు సహకరించడంతో బెంగళూరు పరుగు పరుగుకు చాలానే కష్టపడింది. పవర్ ప్లే (6 ఓవర్లు)లో కేవలం 36 పరుగులే చేసిన ఆర్సీబీ జట్టు ఎంతో ఆలస్యంగా... 8వ ఓవర్లో 50 పరుగులు చేసింది. అలాగని వికెట్లను టపాటపా కోల్పోలేదు. ఓపెనర్ ఫించ్ (2) ఒక్కడే ఔటయినప్పటికీ తొలి సిక్స్ పదో ఓవర్లో వచ్చింది. ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ ఆ సిక్సర్ కొట్టాడు. అలాగని ఫోర్లు బాదారనుకుంటే పొరపాటు. పడిక్కల్, కోహ్లి కలిసి ఈ 10 ఓవర్లలో కొట్టిన బౌండరీలు కూడా నాలుగే! మరుసటి ఓవర్లో దేవ్దత్తోపాటు డివిలియర్స్ (0)కూడా ఔటయ్యాడు. వీళ్లిద్దరిని శార్దుల్ పెవిలియన్ చేర్చాడు. క్రీజులో కోహ్లి ఉన్నా...ఆ తర్వాత కూడా పరిస్థితి మారకపోవడంతో ఆర్సీబీ స్కోరు 100 చేరేందుకు మరో 8 (16వ)ఓవర్లు అవసరమయ్యాయి. కోహ్లి బాదితే... కోహ్లి ఆడితే... 30 బంతుల్లో 34 (2 ఫోర్లు)! అదే కోహ్లి బాదితే... 52 బంతుల్లో 90 నాటౌట్ (4 ఫోర్లు, 4 సిక్స్‌లు). చూశారా ఎంత తేడా ఉందో! కోహ్లినా మజాకా! మూడో ఓవర్లో క్రీజులోకి వచ్చాడు. 14 ఓవర్ల పాటు కోహ్లి ఆడాడు. 15వ ఓవర్ నుంచి బాదేశాడు. ఫోర్లు, సిక్సర్లు తక్కువే అయినా... అతని ఫిట్నెస్ అసాధారణం కావడంతో సింగిల్స్ డబుల్స్‌తోనే అన్ని పరుగులు చేశాడు. అప్పటిదాకా వన్డేలా కనబడిన మ్యాచ్ 15వ ఓవర్ నుంచే టి20గా మారిపోయింది. అదే ఓవర్లో సుందర్ (10) అవుటైతే శివమ్ దూబే (22 నాటౌట్) జతయ్యాడు. 17వ ఓవర్లో దూబే, కోహ్లి చెరో ఫోర్ కొట్టారు.ఆ ఫోర్‌తో కోహ్లి 39 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తయ్యింది. శార్దుల్ వేసిన ఆ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. 18వ ఓవర్ చుక్కలు చూపించింది. సామ్ కరన్ బౌలింగ్‌లో దూబే మొదట సిక్స్ బాదాడు. తర్వాత కోహ్లి లాంగాన్, స్క్వేర్ లెగ్‌ల మీదుగా రెండు సిక్సర్లు బాదడంతో 24 పరుగులు వచ్చాయి. 19వ ఓవర్లో మరో సిక్స్ లాంగాన్‌లో పడింది. 20వ ఓవర్లో బౌండరీ ఒక్కటే కొట్టినా చకచకా బంతికి రెండేసి పరుగులు తీశాడు. ఈ 2 ఓవర్లలో 14 చొప్పున పరుగులు రావడంతో బెంగళూరు పోరాడే లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. చివరి 6 ఓవర్లలో బెంగళూరు 83 పరుగులు సాధించింది. ఇందులో 56 పరుగులు కోహ్లివే. చతికిలపడిన చెన్నై... పిచ్ పరిస్థితులను గుర్తెరిగిన బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో చెన్నై పరుగులు చేయడంలో బెంగళూరు కంటే వెనుకబడిపోయింది. తొలి 5 ఓవర్లలో వరుసగా 4, 2, 7, 6, 2 పరుగులతో 21 స్కోరే చేసింది. ఓపెనర్ డుప్లెసిస్ (8) వికెట్‌నూ కోల్పోయింది. తర్వాత వాట్సన్ (14) కూడా చేతులెత్తేశాడు. 10 ఓవర్లు ముగిసే చెన్నై స్కోరు 47/2. ఇందులో ఏ ఒక్క ఓవర్లోనూ పట్టుమని 10 పరుగులైనా చేయలేకపోయింది. నానాకష్టాలు పడిన చెన్నై... 11వ ఓవర్లో జట్టు స్కోరు 50 పరుగులకు చేరుకుంది. జగదీశన్, రాయుడు క్రీజులో పాతుకుపోయినా... పరుగులు, మెరుపులు కష్టతరం కావడంతో చేయాల్సిన లక్ష్యం కాస్తా కొండంత అయ్యింది. మూడో వికెట్‌కు ఎంతో కష్టపడుతూ 64 పరుగులు జోడించాక జగదీశన్ రనౌటయ్యాడు. తర్వాత ధోని (10) వచ్చాడు. చెన్నై ఇన్నింగ్స్‌లో ఏకైక సిక్సర్ కొట్టాడు. ఆ వెంటనే అతనూ పెవిలియన్ చేరాడు. కుదురుగా ఆడిన రాయుడు క్లీన్బౌల్డయ్యాక ఇంకెవరూ కనీసం 8 పరుగులైనా చేయలేకపోయారు. సామ్ కరన్ (0), జడేజా (7), బ్రేవో (7) తేలిగ్గానే అవుటయ్యారు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: పడిక్కల్ (సి) డుప్లెసిస్ (బి) శార్దుల్ 33; ఫించ్ (బి) చహర్ 2; కోహ్లి (నాటౌట్) 90; డివిలియర్స్ (సి) ధోని (బి) శార్దుల్ 0; సుందర్ (సి) ధోని (బి) స్యామ్ కరన్ 10; దూబే (నాటౌట్) 22; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 169. వికెట్ల పతనం: 1–13, 2–66, 3–67, 4–93. బౌలింగ్: దీపక్ చహర్ 3–0–10–1, స్యామ్ కరన్ 4–0–48–1, శార్దుల్ ఠాకూర్ 4–0–40–2, బ్రేవో 3–0–29–0, కరణ్ శర్మ 4–0–34–0, జడేజా 2–0–7–0. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: వాట్సన్ (బి) సుందర్ 14; డుప్లెసిస్ (సి) మోరిస్ (బి) సుందర్ 8; రాయుడు (బి) ఉదాన 42; జగదీశన్ (రనౌట్) 33; ధోని (సి) గురుకీరత్ (బి) చహల్ 10; స్యామ్ కరన్ (సి) డివిలియర్స్ (బి) మోరిస్ 0; జడేజా (సి) గురుకీరత్ (బి) మోరిస్ 7; బ్రేవో (సి) పడిక్కల్ (బి) మోరిస్ 7; దీపక్ చహర్ (నాటౌట్) 5; శార్దుల్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 132. వికెట్ల పతనం: 1–19, 2–25, 3–89, 4–106, 5–107, 6–113, 7–122, 8–126. బౌలింగ్: మోరిస్ 4–0–19–3, సైనీ 4–0–18–0, ఉదాన 4–0–30–1, సుందర్ 3–0–16–2, చహల్ 4–0–35–1, దూబే 1–0–14–0. -
‘సూపర్’ సీక్వెల్
మనం ఇన్నాళ్లు సీక్వెల్ సినిమాలెన్నో చూశాం. కానీ ఇప్పుడే సీక్వెల్‌గా ఉత్కం‘టై’న మ్యాచ్‌లు చూస్తున్నాం. మొన్న షమీ చెలరేగితే... రోహిత్ అదరగొట్టేశాడు. కానీ ఆ ‘టైబ్రేక్’లో వీళ్లిద్దరు సీనియర్లు. ఇప్పుడైతే శార్దుల్‌కు అంతగా అనుభవమే లేదు. పైగా భారత్‌కు మ్యాచ్‌పై పట్టులేదు. ఎవరికీ గెలుపుపై ఆశే లేదు. ఇలాంటి సమయంలో సంచలన బౌలింగ్‌తో శార్దుల్ కివీస్‌ను కట్టడి చేయడంతో స్కోర్లు సమమైంది. అంతే ఆట సూపర్కెళ్లింది. భారత్ చితగ్గొట్టింది. అలా రెండో సీక్వెల్ ‘టైబ్రేక్’లోనూ టీమిండియానే పైచేయి సాధించింది. క్లీన్‌స్వీప్ దారిలో నాలుగో అడుగు పడింది. ఇక మిగిలిందొక్కటే! న్యూజిలాండ్‌పై 20వ ఓవర్‌ను చూస్తే... వారెవ్వా శార్దుల్ అనే అంటాం. చివరకు ‘సూపర్’ ఫలితాన్ని చూస్తే మాత్రం ఏ కాస్త కనికరమున్నా... అయ్యో పాపం కివీస్ అనిపిస్తుంది. ఎందుకంటే వరుసగా ఆఖరిదాకా వచ్చి ఓడిపోయిందని జాలనిపిస్తుంది. ఇలా సూపర్ ఓవర్లో పదేపదే ఓడితే మాత్రం కచ్చితంగా ఎవరైన పాపమనే అంటారు. గత పదేళ్లుగా ఆరు మ్యాచ్‌ల్లో (ఒక వన్డే కలుపుకొని) సూపర్దాకా వెళ్లిన న్యూజిలాండ్ గెలుపును మాత్రం సాకారం చేసుకోలేకపోయింది. చివరి ఓవర్లో 7 పరుగులు చేయాల్సి ఉండగా...ఏకంగా 4 వికెట్లు కోల్పోయి 6 పరుగులే చేయడంతో స్కోర్లు సమమయ్యాయి. వెల్లింగ్టన్: గత మ్యాచ్ టై... ఈ మ్యాచ్ టై... అప్పుడు సూపర్, ఇప్పుడు సూపర్... అయినా విన్నర్ మారలేదు. కివీస్ తలరాత కూడా మారలేదు. మూడో మ్యాచ్‌లో ఆఖరి బంతులు భారత్‌కు అనూహ్య గెలుపునివ్వగా... ఈ మ్యాచ్‌లో శార్దుల్ అద్బుత బౌలింగ్ ప్రదర్శన భారత్ గెలిచేందుకు ఊపిరి పోసింది. శుక్రవారం కూడా ఉత్కంఠరేపిన ఈ మ్యాచ్‌లో భారత్ సూపర్ ఓవర్లో గెలిచింది. మొదట భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 165 పరుగులు చేసింది. మనీశ్ పాండే (36 బంతుల్లో 50 నాటౌట్; 3 ఫోర్లు) ఆదుకున్నాడు. సోధి 3, బెన్నెట్ 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన న్యూజిలాండ్ కూడా 20 ఓవర్లలో 7 వికెట్లకు సరిగ్గా 165 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ తప్పలేదు. మన్రో (47 బంతుల్లో 64; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), సీఫెర్ట్ (39 బంతుల్లో 57; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. శార్దుల్‌కు 2 వికెట్లు దక్కాయి. ఆదుకున్న పాండే మనీశ్ పాండే షాట్ మళ్లీ టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత ఇన్నింగ్స్ రాహుల్ (26 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించాడు. అతనితో ఇన్నింగ్స్ ఆరంభించిన సంజూ సామ్సన్ (8) సహా కెప్టెన్ కోహ్లి (11), శ్రేయస్ అయ్యర్ (1), శివమ్ దూబే (12) అంతా విఫలం కాగా... టీమిండియా 12 ఓవర్లు ముగియక ముందే 88 పరుగులకే 6 వికెట్లను కోల్పోయింది. ఈ దశలో మనీశ్ పాండే చేసిన ఫిఫ్టీనే ‘శతక’మంత సాయం చేసింది. టెయిలెండర్లు శార్దుల్ (15 బంతుల్లో 20; 2ఫోర్లు), సైనీ (11 నాటౌట్) అండతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. మన్రో, సీఫెర్ట్... ఫిఫ్టీ–ఫిఫ్టీ ఏమంత కష్టం కానీ లక్ష్యఛేదనకు దిగిన న్యూజిలాండ్ ‘పవర్ ప్లే’లో గప్టిల్ (4) వికెట్ కోల్పోయింది. మన్రో, సీఫెర్ట్‌ల రెండో వికెట్ భాగస్వామ్యం 74 పరుగులకు చేరడం, జట్టు స్కోరు వందకు సమీపించడంతో భారత్ ఆశలు ఆవిరయ్యాయి. ఎట్టకేలకు రనౌట్ రూపంలో మన్రో, పరుగు వ్యవధిలో బ్రూస్ (0) ఔట్ కావడంతో చిగురించిన ఆశలపై సీఫెర్ట్, టేలర్ (18 బంతుల్లో 24; 2 ఫోర్లు) నీళ్లుచల్లారు. 19 ఓవర్లలో కివీస్ స్కోరు 159/3. అప్పటికే సీఫెర్ట్ అర్ధసెంచరీ పూర్తయ్యింది. టేలర్ ఔట్ – సీఫెర్ట్ రనౌట్ ఇంకా చేతిలో 7 వికెట్లుండటం... 6 బంతుల్లో విజయానికి 7 పరుగులు అవసరముండటంతో కివీస్ విజయం దాదాపు ఖాయమైంది. కానీ చివరి ఓవర్ తొలి బంతి నుంచే గెలుపు మలుపు తీసుకుంది. శార్దుల్ వేసిన ఫుల్లెంత్ డెలివరీని లాఫ్టెడ్ షాట్ ఆడగా అది మిడ్ వికెట్లో అయ్యర్ చేతికి చిక్కింది. క్రీజ్‌లోకి వచ్చిన మిచెల్ వస్తూనే బౌండరీ కొట్టాడు. ఇక మిగిలింది 3 పరుగులైతే 4 బంతులున్నాయి. మూడో బంతి మిచెల్‌ను బీట్ అయి కీపర్ చేతుల్లోకి వెళ్లగా పరుగందుకున్న సీఫెర్ట్ వచ్చే లోపే రాహుల్ వికెట్లకు గిరాటేయడంతో అతను రనౌటయ్యాడు. ఉత్కంఠ ఉన్నపళంగా పెరిగింది. నాలుగో బంతికి ఓ పరుగుతీశాడు. ఐదో బంతిని మిచెల్ (4) గాల్లోకి లేపాడు. మిడాఫ్‌లో ఉన్న దూబే క్యాచ్ పట్టడంతో అవుటయ్యాడు. ఇక ఆఖరి బంతికి 2 పరుగులు చేయాల్సి వుండగా సాన్‌ట్నర్ ఒక పరుగు మాత్రమే పూర్తి చేశాడు. రెండో పరుగు తీసేందుకు ప్రయత్నించగా డీప్ పాయింట్లో ఉన్న సామ్సన్ ఎలాంటి పొరపాటు చేయకుండా బంతిని కీపర్‌కు అందించాడు. రెప్పపాటు వ్యవధిలోనే రాహుల్ వికెట్లను కూల్చేయడంతో సాన్‌ట్నర్ (2) రనౌట్. మ్యాచ్ టై అయ్యింది. ఇప్పటికే సిరీస్‌ను గెలుచుకున్న భారత్ ఈ మ్యాచ్‌లో రోహిత్, జడేజా, షమీలకు విశ్రాంతినిచ్చి సంజూ సామ్సన్, వాషింగ్టన్ సుందర్, సైనిలకు అవకాశమిచ్చింది. కానీ ఈ ముగ్గుర్లో ఎవరూ రాణించలేదు. కివీస్ కెప్టెన్ విలియమ్సన్ కూడా గాయంతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. ‘ప్రత్యర్థి ఎంత బాగా ఆడుతున్నా చివరి వరకు ప్రశాంతంగా ఉండి పోరాడాలని ఈ రెండు మ్యాచ్‌లు నాకు నేర్పించాయి. ఇంతకంటే అద్భుతమైన మ్యాచ్‌లను ఆశించలేం. గతంలో ఎప్పుడూ సూపర్ ఓవర్ ఆడని మేం ఇప్పుడు వరుసగా రెండు గెలిచాం. సూపర్ ఓవర్లో సామ్సన్తో ఓపెనింగ్ చేయించాలనుకున్నా నా అనుభవం పనికొస్తుందని రాహుల్ చెప్పడంతో నేనే బ్యాటింగ్‌కు వచ్చాను. మా ప్రదర్శన పట్ల గర్వపడుతున్నా’ –విరాట్ కోహ్లి, భారత కెప్టెన్ స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (సి)సాన్‌ట్నర్ (బి) సోధి 39; సామ్సన్ (సి) సాన్‌ట్నర్ (బి) కుగ్లీన్ 8; కోహ్లి (సి) సాన్‌ట్నర్ (బి) బెన్నెట్ 11; అయ్యర్ (సి) సీఫెర్ట్ (బి) సోధి 1; దూబే (సి) బ్రూస్ (బి) సోధి 12; పాండే నాటౌట్ 50; సుందర్ (బి) సాన్‌ట్నర్ 0; శార్దుల్ (సి) సౌతీ (బి) బెన్నెట్ 20; చహల్ (సి) íసీఫెర్ట్ (బి) సౌతీ 1; సైనీ నాటౌట్ 11; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–14, 2–48, 3–52, 4–75, 5–84, 6–88, 7–131, 8–143. బౌలింగ్: సౌతీ 4–0–28–1, కుగ్లీన్ 4–0–39–1, సాన్‌ట్నర్ 4–0–26–1, బెన్నెట్ 4–0–41–2, సోధి 4–0–26–3. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ (సి) రాహుల్ (బి) బుమ్రా 4; మన్రో రనౌట్ 64; íసీఫెర్ట్ రనౌట్ 57; బ్రూస్ (బి) చహల్ 0; టేలర్ (సి) అయ్యర్ (బి) ఠాకూర్ 24; మిచెల్ (సి) దూబే (బి) ఠాకూర్ 4; సాన్‌ట్నర్ రనౌట్ 2; కుగ్లీన్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–22, 2–96, 3–97, 4–159, 5–163, 6–164, 7–165. బౌలింగ్: శార్దుల్ 4–0–33–2, సైనీ 4–0–29–0, బుమ్రా 4–0–20–1, చహల్ 4–0–38–1, సుందర్ 2–0–24–0, దూబే 2–0–14–0. -
రాణి రాంపాల్ అరుదైన ఘనత
న్యూఢిల్లీ: భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్ కెరీర్లో మరో ఘనత చేరింది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వ ‘పద్మశ్రీ’ అవార్డుకు ఎంపికైన రాణికి ఇప్పుడు క్రీడా రంగానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయి పురస్కారం లభించింది. 2019 ‘వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్’గా రాణి ఎంపికైంది. ఈ అవార్డుకు ఎంపికైన తొలి హాకీ క్రీడాకారిణి ఆమెనే కావడం విశేషం. ఈ అవార్డు విజేత కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులను భాగం చేస్తూ పోలింగ్ నిర్వహించారు. ఇందులో రాణికి మొత్తం 1,99,477 ఓట్లు పోలయ్యాయి. రెండో స్థానంలో నిలిచిన ఉక్రెయిన్ కరాటే క్రీడాకారిణి స్టానిస్లావ్ హŸరునాకు 92 వేల ఓట్లు మాత్రమే పడ్డాయంటే రాంపాల్ సాధించిన ఆధిక్యం ఎలాంటిదో అర్థమవుతుంది. గత ఏడాది భారత జట్టు ఎఫ్ఐహెచ్ సిరీస్ ఫైనల్స్ గెలవగా రాణి ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’గా ఎంపికైంది. ఆమె నాయకత్వంలోనే భారత జట్టు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. 25 రకాల క్రీడాంశాల నుంచి ఒక్కో క్రీడా సమాఖ్య ఒక్కో ప్లేయర్‌ను ఈ అవార్డు కోసం నామినేట్ చేస్తుంది. 2019లో ప్రదర్శనను పరిగణలోకి తీసుకొని అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ఈసారి రాణి పేరును ప్రతిపాదించింది. విజేతగా నిలిచిన రాణిని ఎఫ్ఐహెచ్, భారత హాకీ సమాఖ్య (హెచ్ఐ) అభినందించాయి. -
పారిస్‌లో జైకోవిచ్
పారిస్: ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ పారిస్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నమెంట్లో చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 6–3, 6–4తో అన్‌సీడెడ్ డెనిస్ షపోవలోవ్ (కెనడా)పై విజయం సాధించాడు. 65 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్‌కు ఏ దశలోనూ ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురుకాలేదు. రెండు సెట్లలో ఒక్కోసారి షపోవలోవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ తన సర్వీస్‌ను ఒక్కసారీ కోల్పోలేదు. విజేతగా నిలిచే క్రమంలో జొకోవిచ్ తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా సమర్పించుకోలేదు. చాంపియన్ జొకోవిచ్‌కు 9,95,720 యూరోల (రూ. 7 కోట్ల 84 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ షపోవలోవ్‌కు 5,03,730 యూరోల (రూ. 3 కోట్ల 96 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 600 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 34 జొకోవిచ్ కెరీర్లో ఇది 34వ మాస్టర్స్ సిరీస్ టైటిల్. అత్యధిక మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ గెలిచిన క్రీడాకారుల జాబితాలో జొకోవిచ్ రెండో స్థానంలో ఉన్నాడు. 35 టైటిల్స్‌తో రాఫెల్ నాదల్ (స్పెయిన్) అగ్రస్థానంలో ఉన్నాడు. 5 కెరీర్లో అత్యధిక సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో జాన్ మెకన్రో (అమెరికా)తో కలిసి జొకోవిచ్ (77 టైటిల్స్) సంయుక్తంగా ఐదో స్థానానికి చేరాడు. ఈ జాబితాలో జిమ్మీ కానర్స్ (అమెరికా–109 టైటిల్స్), ఫెడరర్ (స్విట్జర్లాండ్–103), ఇవాన్ లెండిల్ (అమెరికా–94), రాఫెల్ నాదల్ (స్పెయిన్–84 టైటిల్స్) వరుసగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు. -
చాంపియన్ యాష్లే బార్టీ
షెన్జెన్ (చైనా): మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సీజన్ ముగింపు ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో ప్రపంచ నంబర్‌వన్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీ తుది పోరులో యాష్లే బార్టీ 6–4, 6–3తో డిఫెండింగ్ చాంపియన్ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్)పై గెలిచింది. గతంలో స్వితోలినాతో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన బార్టీ మెగా ఫైనల్లో మాత్రం తన ఆధిపత్యాన్ని చాటుకుంది. విజేతగా నిలిచిన యాష్లే బార్టీకి 44 లక్షల 20 వేల డాలర్లు (రూ. 31 కోట్ల 17 లక్షలు).... రన్నరప్ స్వితోలినాకు 24 లక్షల డాలర్లు (రూ. 16 కోట్ల 92 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఓ టెన్నిస్ టోర్నమెంట్లో విజేతకు ఇంత భారీ మొత్తం ప్రైజ్‌మనీ ఇవ్వడం ఇదే తొలిసారి. గతేడాది సింగపూర్‌లో జరిగిన డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీలో విజేతగా నిలిచిన తర్వాత స్వితోలినా ఖాతాలో మరో టైటిల్ చేరలేదు. ఈ టోర్నీలో స్వితోలినా లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో నెగ్గడంతోపాటు సెమీఫైనల్లోనూ గెలిచి ఫైనల్ చేరింది. ఒకవేళ స్వితోలినా ఫైనల్లో గెలిచుంటే టోర్నీ నిబంధనల ప్రకారం అజేయంగా నిలిచినందుకు ఆమెకు 47 లక్షల 25 వేల డాలర్లు (రూ. 33 కోట్ల 32 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించేవి. 86 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో బార్టీ తొలి సెట్ పదో గేమ్‌లో స్వితోలినా సర్వీస్‌ను బ్రేక్ చేసి సెట్‌ను గెల్చుకుంది. రెండో సెట్లో ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డా... ఎనిమిదో గేమ్‌లో స్వితోలినా సర్వీస్‌ను బ్రేక్ చేసి తన సర్వీస్‌నూ నిలబెట్టుకొని బార్టీ విజేతగా నిలిచింది. ఈ ఏడాది బార్టీ మొత్తం నాలుగు టైటిల్స్ సాధించింది. సీజన్‌ను 15వ ర్యాంక్‌తో ప్రారంభించిన బార్టీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరింది. ఆ తర్వాత మయామి ఓపెన్‌లో... ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో చాంపియన్‌గా నిలిచింది. బర్మింగ్హమ్ ఓపెన్‌లోనూ టైటిల్ సాధించి కెరీర్లో తొలిసారి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకుంది. ఈ ఏడాదిని ఆమె నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించనుంది. 2 ఇవాన్ గూలాగాంగ్ (1976లో) తర్వాత డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీ టైటిల్ సాధించిన రెండో ఆస్ట్రేలియా క్రీడాకారిణిగా యాష్లే బార్టీ నిలిచింది. 5 సీజన్ ముగింపు టోర్నీ ఫైనల్స్‌లో బరిలోకి దిగిన తొలిసారే విజేతగా అవతరించిన ఐదో క్రీడాకారిణిగా బార్టీ గుర్తింపు పొందింది. గతంలో సెరెనా విలియమ్స్ (అమెరికా–2001లో), మరియా షరపోవా (రష్యా–2004లో), పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్–2011లో), సిబుల్కోవా (స్లొవేకియా–2016లో) ఈ ఘనత సాధించారు. బాబోస్–మ్లాడెనోవిచ్ జంటకు డబుల్స్ టైటిల్ డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీ డబుల్స్ విభాగంలో తిమియా బాబోస్ (హంగేరి)–క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్) జంట టైటిల్ సాధించింది. ఫైనల్లో ఈ జంట 6–1, 6–3తో సు వె సెయి (చైనీస్ తైపీ)– బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) జోడీపై గెలిచింది. టోర్నీ మొత్తంలో అజేయంగా నిలిచినందుకు తిమియా–క్రిస్టినా జంటకు 10 లక్షల డాలర్ల (రూ. 7 కోట్లు) ప్రైజ్‌మనీ లభించింది. -
దులీప్ ట్రోఫీ విజేత ఇండియా రెడ్
బెంగళూరు: దేశవాళీ క్రికెట్ సీజన్ ఆరంభ టోర్నీ దులీప్ ట్రోఫీని ఇండియా రెడ్ కైవసం చేసుకుంది. శనివారం ఇక్కడ ముగిసిన ఫైనల్లో ఆ జట్టు ఇన్నింగ్స్ 38 పరుగుల తేడాతో ఇండియా గ్రీన్‌పై విజయం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 345/6 తో నాలుగో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన రెడ్ 388 పరుగులకు ఆలౌటైంది. దీంతో 157 పరుగుల ఆధిక్యం దక్కింది. అనంతరం రెండో ఇన్నిం గ్స్‌కు దిగిన గ్రీన్‌ను ఆఫ్ స్పిన్నర్ అక్షయ్ వాఖరే (5/13) హడలెత్తించాడు. పేసర్ అవేశ్ ఖాన్ (3/38) కూడా ఓ చేయి వేయడంతో గ్రీన్ 39.5 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటైంది. సిద్దేశ్ లాడ్ (80 బంతుల్లో 42; 6 ఫోర్లు), హైదరాబాదీ బ్యా ట్స్‌మన్, ఓపెనర్ అక్షత్ రెడ్డి (47 బంతుల్లో 33; 7 ఫోర్లు) మాత్రమే కాస్త ప్రతిఘటన కనబర్చారు. అక్షయ్, అవేశ్ ధాటికి వీరిద్దరు కాక కెప్టెన్ ఫైజ్ ఫజల్ (10) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగాడు. స్పిన్నర్ మయాంక్ మార్కండే గాయంతో బ్యాటింగ్‌కు దిగలేదు. రెడ్ తరఫున భారీ శతకంతో అదరగొట్టిన ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (153)కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. సంక్షిప్త స్కోర్లు ఇండియా గ్రీన్ తొలి ఇన్నింగ్స్: 231; ఇండియా రెడ్ తొలి ఇన్నింగ్స్: 388 (ఈశ్వరన్ 153; అంకిత్ రాజ్‌పుత్ 3/101, ధర్మేంద్ర జడేజా 3/93), ఇండియా గ్రీన్ రెండో ఇన్నింగ్స్: 119 (అక్షత్ రెడ్డి 33; అక్షయ్ వాఖరే 5/13).