న్యూఢిల్లీ: ఢిల్లీ క్యాపిటల్స్ ఆట ఈ మ్యాచ్ ముందువరకు తీసికట్టుగానే ఉంది. గెలిచిన మ్యాచ్‌లలో కూడా అంతంతమాత్రం పడుతూ లేస్తూ సాగిన ఆటతో పట్టికలో చివరి స్థానంలో ఉంది. అయితే శనివారం కానీ బెంగళూరుపై దంచిన తీరు, లక్ష్యఛేదనలో దూకుడు మాత్రం ఈ సీజన్‌లో మేటి మ్యాచ్‌లలో ఒకటిగా నిలిపింది. మెరుపుల విందు పంచిన ఈ మ్యాచ్‌లో ఓపెనర్ ఫిల్ సాల్ట్ (45 బంతుల్లో 87; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) విధ్వంస రచనతో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో బెంగళూరుపై జయభేరి మోగించింది.
మొదట బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఓపెనర్లు కోహ్లి (46 బంతుల్లో 55; 5 ఫోర్లు), డుప్లెసిస్ (32 బంతుల్లో 45; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. మ్యాక్స్‌వెల్ (0) డకౌటైనా... మహిపాల్ (29 బంతుల్లో 54 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) దంచేయడంతో బెంగళూరు భారీ స్కోరు చేసింది. తర్వాత ఢిల్లీ 16.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఫిల్ సాల్ట్ ఉప్పెనకు వార్నర్ (14 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్), మార్‡్ష (17 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్), రోసో (22 బంతుల్లో 35 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్‌లు) కలిసి క్యాపిటల్స్‌ను గెలిపించారు.
స్కోరు వివరాలు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) ఖలీల్ (బి) ముకేశ్ 55; డుప్లెసిస్ (సి) అక్షర్ (బి) మార్‡్ష 45; మ్యాక్స్‌వెల్ (సి) సాల్ట్ (బి) మార్‡్ష 0; మహిపాల్ నాటౌట్ 54; దినేశ్ కార్తీక్ (సి) వార్నర్ (బి) ఖలీల్ 11; రావత్ నాటౌట్ 8; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 181.
వికెట్ల పతనం: 1–82, 2–82, 3–137, 4–172.
బౌలింగ్: ఖలీల్ 4–0–45–1, అక్షర్ 3–0–17–0, ఇషాంత్ 3–0–29–0, ముకేశ్ 3–0–30–1, మార్‡్ష 3–0–21–2, కుల్దీప్ 4–0–37–0.
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) డుప్లెసిస్ (బి) హాజల్‌వుడ్ 22; సాల్ట్ (బి) కరణ్ శర్మ 87; మార్‡్ష (సి) మహిపాల్ (బి) హర్షల్ 26; రోసో నాటౌట్ 35; అక్షర్ నాటౌట్ 8; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (16.4 ఓవర్లలో 3 వికెట్లకు) 187.
వికెట్ల పతనం: 1–60, 2–119, 3–171.
బౌలింగ్: సిరాజ్ 2–0–28–0, మ్యాక్స్‌వెల్ 1.4–0–14–0, హాజల్‌వుడ్ 3–0–29–1, హసరంగ 4–0–32–0, కరణ్‌శర్మ 3–0–33–1, మహిపాల్ 1–0–13–0, హర్షల్ 2–0–32–1.
సిరాజ్ వర్సెస్ సాల్ట్
బెంగళూరు గత మ్యాచ్‌లో కోహ్లి–గంభీర్–నవీన్ ఘటన వివాదం రేపగా...ఇప్పుడు సి రాజ్ కూడా మైదానంలో ప్రత్యర్థి ఆటగాడిపై దూషణలకు దిగాడు. సిరాజ్ ఓవర్లో సాల్ట్ వరుసగా 6, 6, 4 కొట్టగా తర్వాతి షార్ట్ పిచ్ బంతిని అంపైర్ వైడ్‌గా ప్రకటించాడు. దాంతో సిరాజ్ దూసుకుపోయి సాల్ట్‌ను ఏదో అన్నాడు. వార్నర్ వారించే ప్రయత్నం చేసినా అతను ఆగలేదు. కెప్టె న్ డుప్లెసిస్ పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది.
7000: ఐపీఎల్‌లో 7 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా కోహ్లి నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment