RCB VS DC: Ravi Shastri Dig At Ganguly, He Must Have Thought It's Nice Upstairs - Sakshi
Sakshi News home page

Sourav Ganguly: గంగూలీ స్థాయి పెరిగిందనుకుంటున్నాడు.. అధికారం మాత్రం ఉండదు: రవిశాస్త్రి ఘాటు వ్యాఖ్యలు

Published Sun, Apr 16 2023 11:51 AM | Last Updated on Sun, Apr 16 2023 12:22 PM

RCB VS DC: Ravi Shastri Dig At Ganguly He Must Have Thought Its Nice Upstairs - Sakshi

రవిశాస్త్రి- గంగూలీ (PC: BCCI/IPL)

IPL 2023 RCB Vs DC: ఐపీఎల్‌-2023 సీజన్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌కు అస్సలు కలిసి రావడం లేదు. క్యాష్‌ రిచ్‌ లీగ్‌ పదహారో సీజన్‌ ఆరంభానికి ముందే ఢిల్లీ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ రోడ్డు ప్రమాదం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో పగ్గాలు చేపట్టిన డేవిడ్‌ వార్నర్‌ బ్యాటర్‌గా పర్వాలేదనిపిస్తున్నా.. సారథిగా మాత్రం విజయవంతం కాలేకపోతున్నాడు.

ఐదో‘సారీ’
వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఓటమి పాలైన ఢిల్లీ.. బెంగళూరులో ఆర్సీబీతో శనివారం నాటి మ్యాచ్‌లోనూ పాత కథే పునరావృతం చేసింది. ఫాఫ్‌ డుప్లెసిస్‌ బృందం చేతిలో 23 పరుగుల తేడాతో పరాజయం పాలై తమ ఓటముల సంఖ్యను ఐదుకు పెంచుకుంది. ఈ ఎడిషన్‌లో ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క విజయం కూడా నమోదు చేయకుండా పాయింట్ల పట్టికలో ఆఖరిస్థానంలో నిలిచింది.

స్థాయి మరింత పెరిగిందేమో!
కాగా ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్‌ ఢిల్లీ హెడ్‌కోచ్‌గా ఉండగా.. భారత మాజీ స్టార్‌, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగళూరులో ఆర్సీబీతో ఢిల్లీ మ్యాచ్‌ సందర్భంగా టీమిండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి గంగూలీని ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.

ఢిల్లీ ఓటమికి చేరువవుతున్న తరుణంలో కామెంట్రీ చేస్తూ.. ‘‘బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ... ఈ పదవితో తన స్థాయి మరింత పెరిగింది అనుకుంటున్నాడేమో!’’ అని వ్యాఖ్యానించాడు. డైరెక్టర్‌ పదవి పేరుకే పెద్దది కానీ.. అధికారం ప్రదర్శించే వీలు ఉండదన్న అర్థంలో సెటైర్‌ వేశాడు.

శుభ పరిణామం కాదు
అదే విధంగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌ వరుస ఓటములకు కారణాలు విశ్లేషించుకోవాలని.. పాంటింగ్‌, వార్నర్‌వంటి దిగ్గజాలు ఉన్నా ఒక్క విజయం కూడా సాధించకపోవడం ఏమిటని రవిశాస్త్రి ప్రశ్నించాడు. స్వల్ప తేడాతో ఓడినా పర్వాలేదని.. కానీ కనీస పోరాటం లేకుండా ప్రత్యర్థి చేతిలో చిత్తు కావడం మంచి పరిణామం కాదని విమర్శించాడు. 

భలే చెప్పావు రవి భాయ్‌!
ఇదిలా ఉంటే.. ఢిల్లీతో మ్యాచ్‌ సందర్భంగా కోహ్లి మైదానంలో ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో గంగూలీ వైపు సీరియస్‌గా చూసిన దృశ్యాలు వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. తాజాగా రవిశాస్త్రి వ్యాఖ్యలు కూడా నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.

‘‘భలే చెప్పావు రవి భాయ్‌. కోహ్లిని అవమానకరరీతిలో వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన దాదాకు ఇప్పుడు పెద్ద పదవే దక్కింది. దానితో పాటే గౌరవం కూడా’’ అంటూ కింగ్‌ కోహ్లి ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు. కాగా కోహ్లి, రవిశాస్త్రిల మధ్య మంచి అనుబంధం ఉందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

చదవండి: 38 సార్లు అరెస్ట్‌! జైలర్‌ చొరవతో ఇలా! వివాహేతర సంబంధాలు.. ఈ ‘హీరో’ విలన్‌ కూడా!
IPL 2023: మా ఓటమికి కారణం అదే..! అవునా.. ఓర్వలేకే చెత్త కామెంట్లు!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement