PC: IPL.com
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి మధ్య వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఐపీఎల్-2023లో ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ సందర్భంగా వీరిద్దరూ ఒకరికి ఒకరు ఎదురు పడినప్పటికీ కనీసం పలకరించుకోకుండా తప్పించుకున్నారు. అంతటితో ఆగలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ వీరిద్దరూ వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్‌గా మారింది.
అయితే ఢిల్లీతో మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లి ఇన్‌స్టాగ్రామ్‌లో గంగూలీని అన్‌ఫాలో చేశాడు. ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. అయితే తాజాగా ఇప్పుడు దాదా వంతు వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో గంగూలీ కూడా కోహ్లిని ఆన్ ఫాలో చేశాడు. నెటిజన్లు ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఎందుకీ ఈ విభేదాలు?
గంగూలీ - కోహ్లీల మధ్య కోల్డ్ వార్ 2021 నుంచే కొనసాగుతుంది. టీ20 ప్రపంచకప్-2021 తర్వాత విరాట్ కోహ్లి భారత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. కానీ టీ20 కెప్టెన్సీకి విరాట్ గుడ్‌బై చెప్పినప్పటికీ.. వన్డేల్లో, టెస్టుల్లో మాత్రం కొనసాగాలని భావించాడు. అయితే అందరిని ఆశ్చర్యపరుస్తూ బీసీసీఐ వన్డే కెప్టెన్సీ నుంచి కూడా కోహ్లిని తప్పించింది. అతడి స్థానంలో రోహిత్ శర్మను భారత కెప్టెన్‌గా బీసీసీఐ ఎంపిక చేసింది.
దీంతో తనకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కెప్టెన్సీ నుంచి తప్పించారని కోహ్లి ఆరోపణలు చేశాడు. అందుకు బదులుగా.. ఇది భారత క్రికెట్ బోర్డు, సెలక్టర్లు తీసుకున్న నిర్ణయమని అప్పటి బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ సమాధానమిచ్చాడు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది..
Comments
Please login to add a commentAdd a comment