కోహ్లి (PC: IPL)- గంగూలీ
IPL 2023 DC Vs RCB: ఐపీఎల్-2023లో మరో ఆసక్తికరపోరుకు రంగం సిద్ధమైంది. అరున్ జైట్లీ స్టేడియంలో శనివారం నాటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. తాజా ఎడిషన్‌లో తొలి ముఖాముఖి పోరులో ఆర్సీబీ.. ఢిల్లీని చిత్తు చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 15న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 23 పరుగుల తేడాతో ఓడించింది.
అప్పుడు హాఫ్ సెంచరీ
ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి అర్ధ శతకం(50)తో మెరిసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం ద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే.. గత మ్యాచ్‌లో టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్‌ను ఢిల్లీ 5 పరుగుల స్వల్ప తేడాతో ఓడించిన సంగతి తెలిసిందే.
గుజరాత్‌ను ఓడించి
మరోవైపు.. ఆర్సీబీ సైతం లక్నో సూపర్ జెయింట్స్‌పై ప్రతీకార మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇలా లో స్కోరింగ్ మ్యాచ్‌లలో అటు ఆర్సీబీ.. ఇటు ఢిల్లీ విజయం సాధించాయి. ఇదే జోష్‌లో ముఖాముఖి పోరుకు సై అంటున్నాయి.
దాదాతో జగడం
ఇక చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ- ఢిల్లీ మ్యాచ్ ముగిసిన అనంతరం విరాట్ కోహ్లి- ఢిల్లీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మధ్య జరిగిన ఘటన క్రికెట్ ప్రేమికులకు గుర్తుండే ఉంటుంది. దాదా బీసీసీఐ బాస్‌గా ఉన్న సమయంలోనే కోహ్లి అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి గుడ్ బై చెప్పడం.. ఈ విషయంలో పరస్పరం ఆరోపణలు చేసుకున్న తీరు అందరికీ తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆర్సీబీ- ఢిల్లీ మ్యాచ్ ముగిసిన తర్వాత ఆటగాళ్లతో కరచాలనం చేస్తున్న సమయంలో కోహ్లి.. గంగూలీకి షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి విముఖత చూపాడు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో పెద్ద ఎత్తున మీమ్స్ పుట్టుకొచ్చాయి. ఈ క్రమంలో తాజా మ్యాచ్‌లో ఎలాంటి సన్నివేశాలు చూడాల్సి వస్తుందోనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
రసవత్తర పోరు
స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్‌లో గోల్డెన్ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. డీసీ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుందనడంలో సందేహం లేదు. ఇందులో మనం విరాట్ కోహ్లి వర్సెస్ వార్నర్ వార్ చూడొచ్చు. అదే విధంగా అన్రిచ్ నోర్జేను ఆర్సీబీ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో కూడా చూసేందుకు ఆసక్తిగా ఉన్నా.
విరాట్ సెంచరీ కొట్టు
ఇక అన్నింటికంటే ఆసక్తికరమైంది ఏమిటంటే.. విరాట్ ఈ మ్యాచ్‌లో సెంచరీ కొడితే చూడాలని ఉంది. శతకం సాధించడమే దాదాకు అతడు ఇచ్చే నిజమైన కానుక. విరాట్.. నువ్వు నీ లాగే ఉండు.. ఆర్సీబీ కోసం ఈ మ్యాచ్‌ను గెలిపించు’’ అంటూ శ్రీశాంత్ కింగ్ ఫ్యాన్స్‌ను ఉత్సాహపరిచేలా మాట్లాడాడు. కాగా ఐపీఎల్-2023 సీజన్‌లో కోహ్లి ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్‌లలో కలిపి 364 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 82(నాటౌట్).
చదవండి: బ్లడీ.. అసలు..! మాట జారిన కోహ్లి.. అదే గొడవకు కారణం! బీసీసీఐకి మెసేజ్ కూడా!
ఆర్సీబీకి డీకే, రాజస్థాన్‌కు పరాగ్, సన్‌రైజర్స్‌కు మయాంక్.. మరి ఢిల్లీకి..?
'@ImVKohli getting a 100 will be a great tribute to Dada', @sreesanth_36 anticipates a great #RivalryWeek clash between @DelhiCapitals & @RCBTweets!
— Star Sports (@StarSportsIndia) May 6, 2023
Tune-in to #DCvRCB at #IPLonStar
Today | Pre-show at 7 PM & LIVE action at 7:30 PM | Star Sports Network#BetterTogether pic.twitter.com/CxzBgDh6vr
Comments
Please login to add a commentAdd a comment