S Sreesanth
-
IPL 2024: సంజూను కెప్టెన్‌గా తప్పించాల్సిందే: శ్రీశాంత్ విమర్శలు
IPL 2024: ఐపీఎల్-2024 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ అనుకున్న ఫలితాలు రాబట్టాలనుకుంటే కెప్టెన్‌ను మార్చాలని భారత మాజీ బౌలర్ శ్రీశాంత్ అన్నాడు. సంజూ శాంసన్‌కు నిలకడలేదని.. అతడిని సారథ్య బాధ్యతల నుంచి తప్పించాలని సూచించాడు. రాయల్స్‌కు రోహిత్ శర్మ వంటి అనుభవజ్ఞుడైన నాయకుడి అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. కాగా కేరళ వికెట్ కీపర్ సంజూ శాంసన్ 2021 నుంచి రాజస్తాన్ రాయల్స్ సారథిగా పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. గత మూడు ఎడిషన్లలో మొత్తంగా 45 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ టీమిండియా బ్యాటర్.. 22 మ్యాచ్‌లు గెలిపించాడు. గతేడాది సంజూ నాయకత్వంలోనే.. దాదాపు పద్నాలుగేళ్ల తర్వాత రాయల్స్ తొలిసారి ఫైనల్ చేరింది. అయితే, తాజా ఎడిషన్‌లో మాత్రం ప్లే ఆఫ్స్ చేరడంలోనూ విఫలమైంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు పలు ఫ్రాంఛైజీలు ఇప్పటికే తమ కెప్టెన్లను మారుస్తున్న విషయం తెలిసిందే. టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్ తిరిగి కేకేఆర్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించనుండగా.. ఓపెనర్ శుబ్‌మన్ గిల్ గుజరాత్ టైటాన్స్ సారథి అయ్యాడు. తాజాగా ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాకు బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో కేరళ మాజీ పేసర్ శ్రీశాంత్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ మేరకు.. ‘‘నా అభిప్రాయం ప్రకారం రాజస్తాన్ రాయల్స్ సిస్టం మొత్తాన్ని పూర్తిగా మార్చివేయాలి. ముఖ్యంగా చాలా మంది ఆటగాళ్లను మార్చాలి. నేను రాజస్తాన్‌కు ఆడినపుడు మేనేజ్మెంట్ అన్ని విషయాల్లో జాగ్రత్త వహించేది. అప్పుడు రాహుల్ ద్రవిడ్ భాయ్ కెప్టెన్. సారథిగా జట్టును ఎలా ముందుకు నడిపించాలన్న అంశం పట్ల ఆయనకు పూర్తిగా అవగాహన ఉండేది. మైదానంలో ఎలాంటి ప్రణాళికలు అమలు చేయలన్న విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించేవాడు. ఇప్పుడు ఆ జట్టుకు సంజూ కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే, తను కెప్టెన్సీని సీరియస్‌గా తీసుకోవాలి. నాకెందుకో జోస్ బట్లర్‌ని కెప్టెన్ చేస్తే బాగుంటుందనిపిస్తోంది. అతడికి టీ20 వరల్డ్‌కప్ గెలిచిన రికార్డు ఉంది. వన్డే వరల్డ్‌కప్-2023లో అతడు బాగా ఆడకపోయాడన్న మాట వాస్తవమే. అయితే, కెప్టెన్‌గా తనకున్న అనుభవం జట్టుకు ఉపయోగపడుతుంది. లేదంటే.. నిలకడైన ప్రదర్శనతో ముందుకు సాగుతున్న ఆటగాడి వైపు రాయల్స్ చూడాలి. రోహిత్ శర్మ లాంటి నాయకుడి అవసరం జట్టుకు ఉంది. టీమ్‌ను గెలిపించే కెప్టెన్ కావాలి, అంతేగానీ రెండు మ్యాచ్‌లు గెలిచి నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయేవాళ్ల వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు’’ అంటూ శ్రీశాంత్ పరోక్షంగా సంజూ శాంసన్‌ను విమర్శించాడు. అమావాస్య- పున్నానికోసారి ఆడే వాళ్లను కెప్టెన్‌గా ఉంచితే ఫలితం ఉండదని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇదిలా ఉంటే.. రాయల్స్‌కు ఆడిన సమయంలోనే శ్రీశాంత్ మీద ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. చదవండి: IPL 2024: ఇలా చేయడానికి సిగ్గుండాలంటూ ఫైర్!.. పోస్ట్ డిలీట్ చేసిన సూర్య భార్య -
గంభీర్ నన్ను ఫిక్సర్ అన్నాడు.. దూషించాడు: శ్రీశాంత్ ఆరోపణ
గౌతమ్ గంభీర్...ఎస్.శ్రీశాంత్...భారత జట్టు తరఫున కలిసి 49 మ్యాచ్‌లు ఆడారు. 2007 టి20, 2011 వన్డే వరల్డ్ కప్ విజయాల్లో భాగస్వాములు. రిటైర్మెంట్ తర్వాత ‘సీనియర్లు’గా లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్ఎల్సీ)లో ఆడుతున్నారు. కానీ ఆవేశకావేశాలకు మారుపేరైన వీరిద్దరు ఇలాంటి వెటరన్ టోర్నీలో కూడా గొడవ పడ్డారు. గంభీర్ తనను పదే పదే ‘ఫిక్సర్’ అంటూ దూషించాడని శ్రీశాంత్ ఆరోపించాడు. బుధవారం ఇండియా క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ తర్వాత ఒక వీడియో విడుదల చేసిన శ్రీశాంత్ ‘నా తప్పు ఏమీ లేకపోయినా గంభీర్ నన్ను అనరాని మాటలు అన్నాడు. అది సరైంది కాదు’ అని అన్నాడు. అయితే ఆ తర్వాత కొద్ది సేపటికే మరో వీడియోలో దానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించాడు. S Sreesanth on Gautam Gambhir: "He kept calling me a fixer".pic.twitter.com/qPtSdEXTjp — Mufaddal Vohra (@mufaddal_vohra) December 7, 2023 ‘ఫిక్సర్, ఫిక్సర్, నువ్వు ఫిక్సర్‌వి అంటూ పదే పదే గంభీర్ అన్నాడు. నేను నవ్వుతూ ఉన్నా అతను మాత్రం అలాంటి దూషణలు కొనసాగించాడు. నేను ఒక్క చెడు మాట కూడా మాట్లాడలేదు. అసలు అతనికి ఎందుకు కోపం వచి్చందో, ఎందుకు అలా అన్నాడో నాకు అస్సలు అర్థం కాలేదు’ అని వివరించాడు. ఈ ఘటనపై గంభీర్ వైపు నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదు కానీ తాను చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోను ట్విట్టర్లో పెట్టాడు. Smile when the world is all about attention! pic.twitter.com/GCvbl7dpnX — Gautam Gambhir (@GautamGambhir) December 7, 2023 ఎల్ఎల్సీలో తగిన నిబంధనలు, ప్రమాణాలు పాటిస్తున్నామని, ఘటనపై విచారణ చేస్తామని మాత్రం టోర్నీ నిర్వాహకులు ప్రకటించారు. ఆ తర్వాత దీనిని కొనసాగించిన శ్రీశాంత్... ‘నువ్వు అందరితో ఇలాగే ఉంటావు, సీనియర్లను కూడా గౌరవించవు. నన్ను అలా అనే హక్కు నీకు లేదు. అయినా నువ్వు సుప్రీం కోర్టుకంటే ఎక్కువా’ అని ప్రశ్నించాడు. 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో శ్రీశాంత్‌పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించగా... సుప్రీం కోర్టు ఆదేశాలతో దానిని ఏడేళ్లకు తగ్గించడంతో 2020లో అతని నిషేధం ముగిసింది. -
బాహాబాహీకి దిగిన గంభీర్-శ్రీశాంత్
లెజెండ్స్ లీగ్ 2023లో భాగంగా గుజరాత్ జెయింట్స్-ఇండియా క్యాపిటల్స్ మధ్య నిన్న (డిసెంబర్ 6) జరిగిన మ్యాచ్ సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్ (ఇండియా క్యాపిటల్స్ కెప్టెన్), శ్రీశాంత్ (గుజరాత్ జెయింట్స్) గొడవపడ్డారు. క్యాపిటల్స్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ సందర్భంగా ఈ ఇద్దరు బాహాబాహీకి దిగినంత పని చేశారు. శ్రీశాంత్ బౌలింగ్‌లో గంభీర్ వరుసగా సిక్స్, ఫోర్ కొట్టిన అనంతరం గొడవ మొదలైంది. వరుస బంతుల్లో 10 పరుగులు రావడంతో సహనం కోల్పోయిన శ్రీశాంత్.. ఆమరుసటి బంతిని డాట్ బాల్‌గా మలిచి గంభీర్‌ను కవ్వించాడు. అసలే ముక్కోపి అయిన గంభీర్.. శ్రీశాంత్ కవ్వింపుకు నోటితో సమాధానం చెప్పాడు. మ్యాచ్ మధ్యలో కొద్ది సేపు ఈ ఇద్దరి మధ్య మాటల యుద్దం జరిగింది. సహచర ఆటగాళ్లు ఇద్దరికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అంపైర్లు ఈ ఇద్దరూ బాహాబాహీకి దిగకుండా వారించారు. ఓ దశలో పరిస్థితి చేయి దాటిపోయేలా కనిపించింది. గంభీర్-శ్రీశాంత్ కొట్టుకుంటారేమోనని అంతా అనుకున్నారు. అయితే అలా జరగలేదు. గొడవ సద్దుమణిగిన అనంతరం మ్యాచ్ సాఫీగా సాగింది. గొడవ తర్వాత గంభీర్ మరింత చెలరేగి ఆడాడు. ఈ మ్యాచ్‌లో అతను 30 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్ సాయంతో 51 పరుగులు చేసి ఔటయ్యాడు. Heated conversation between Gautam Gambhir and S Sreesanth in the LLC. pic.twitter.com/Cjl99SWAWK — Mufaddal Vohra (@mufaddal_vohra) December 7, 2023 ఈ మ్యాచ్‌లో గంభీర్‌తో పాటు మిగతా బ్యాటర్లు కూడా రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. 3 ఓవర్లు వేసిన శ్రీశాంత్ వికెట్ పడగొట్టి 35 పరుగులు సమర్పించుకున్నాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్..క్రిస్ గేల్ (55 బంతుల్లో 84; 9 ఫోర్లు, 4 సిక్సర్లు), కెవిన్ ఓబ్రెయిన్ (33 బంతుల్లో 57ప 7 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో లక్ష్యానికి దగ్గర వరకు వెళ్లి ఓటమిపాలైంది. గేల్, ఓబ్రెయిన్ మినహా మిగతా ఆటగాళ్లు ఎవరూ రాణించకపోవడంతో గుజరాత్ లక్ష్యానికి 13 పరుగుల దూరంలో నిలిచిపోయింది. కాగా, గంభీర్, శ్రీశాంత్‌లకు గొడవలేమీ కొత్త కాదు. ఈ ఇద్దరూ మైదానంలో చాలా సందర్భాల్లో వేర్వేరు ఆటగాళ్లతో బాహాబాహీకి దిగారు. గంభీర్.. విరాట్ కోహ్లి, షాహిద్ అఫ్రిది లాంటి వారితో గొడవపడగా. శ్రీశాంత్ సహచరుడు హర్భజన్ సింగ్ చేతిలో చెంపదెబ్బ తిని వార్తల్లో నిలిచాడు. గంభీర్ ఇటీవలి ఐపీఎల్ సీజన్ సందర్భంగానూ విరాట్ కోహ్లితో గొడవపడ్డాడు. -
T20 WC: ‘వరల్డ్‌కప్-2024లో కెప్టెన్ రోహిత్ శర్మనే! కోహ్లి కూడా..’
వన్డే వరల్డ్‌కప్-2023 ముగిసి రెండు రోజులు కూడా పూర్తికాకముందే టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ ఆసక్తికర వ్యాఖ్యలతో ముందుకువచ్చాడు. వచ్చే ఏడాది జరుగనున్న టీ20 ప్రపంచకప్ టోర్నీకి తన జట్టును ఇప్పుడే ఎంపిక చేసుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ సహా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి తన టీమ్‌లో స్థానమిచ్చాడు. వారిద్దరూ కచ్చితంగా టీ20 వరల్డ్‌కప్ ఆడే ఛాన్స్ ఉందని శ్రీశాంత్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా గత కొన్నాళ్లుగా రోహిత్, కోహ్లి టీ20 సిరీస్‌లకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023 కోసం పూర్తిస్థాయిలో సన్నద్ధం కావడం సహా.. 2024 ప్రపంచకప్ నాటికి యువ జట్టును సిద్ధం చేసే క్రమంలో మేనేజ్మెంట్ ఈ ఇద్దరు స్టార్లకు విశ్రాంతినిచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నవంబరు 19న జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమిపాలు కాగా.. ‘విరాహిత్’ ద్వయం తీవ్ర నిరాశకు లోనయ్యారు. కచ్చితంగా ట్రోఫీ గెలుస్తుందనుకున్న నమ్మకంతో బరిలోకి దిగిన భారత జట్టు.. అనూహ్య రీతిలో ఆసీస్ చేతిలో ఓడిపోవడంతో.. టీ20లలో రోహిత్, కోహ్లి భవితవ్యంపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో కేరళ ఫాస్ట్‌బౌలర్ శ్రీశాంత్ స్పోర్ట్స్‌కీడాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘రోహిత్ శర్మ ఆడతాడా లేదా అన్నది ఇప్పుడు అందరి ముందు ఉన్న పెద్ద ప్రశ్న. నా అభిప్రాయం ప్రకారం టీ20 వరల్డ్‌కప్‌లో కూడా రోహిత్ శర్మనే కెప్టెన్‌గా ఉంటాడు. ఎందుకంటే ఐదు ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన ఘనత అతడి సొంతం. అయితే, టోర్నీ నాటికి రోహిత్ సారథ్యం వహిస్తాడా లేదంటే హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పజెప్పుతారా అన్నది అప్పటి పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఇక యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ సైతం పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధిస్తే కచ్చితంగా జట్టులోకి వస్తాడు. అయితే మూడో కీపర్ ఆప్షన్‌గానే అతడి పేరు ఉంటుంది. అయితే, మనకో మ్యాచ్ విన్నర్ కాబట్టి బ్యాటర్‌గా తనకు స్థానం దక్కడం ఖాయమనిపిస్తోంది. అయితే ఫామ్‌ను బట్టి అతడి ఎంపిక విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది’’ అని శ్రీశాంత్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా గతేడాది డిసెంబరులో కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రిషభ్ పంత్.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఐపీఎల్-2024 నాటి అతడు మైదానంలో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 వరల్డ్‌కప్-2024 జూన్ 4న మొదలుకానుంది. టీ20 వరల్డ్‌కప్-2024కు శ్రీశాంత్ ఎంచుకున్న జట్టు: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ -
‘శార్దూల్ ఎందుకు? సిరాజ్‌ను ఎందుకు ఆడిస్తున్నారు?.. అసలేంటి ఇదంతా?’
ICC WC 2023- Team India: టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు భారత మాజీ పేసర్ శ్రీశాంత్ అండగా నిలిచాడు. మేనేజ్మెంట్ అన్నీ ఆలోచించిన తర్వాతే తుదిజట్టును ఎంపిక చేస్తుందని.. మ్యాచ్ సాగుతున్న తీరును బట్టి విమర్శలు చేయడం సరికాదని హితవు పలికాడు. కొంతమంది ‘టోపీ మాస్టర్లు’ మాత్రం అంతా తమకే తెలుసునన్నట్లు మాట్లాడతారంటూ సిరాజ్‌ను విమర్శించిన వారిపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో టీమిండియా ఆరంభ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై సిరాజ్ ఒక వికెట్ తీయగలిగాడు. అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో ధారాళంగా పరుగులిచ్చి పవర్ ప్లేలో మ్యాజిక్ చేయలేకపోయినప్పటికీ 6.3 ఓవర్లలో కేవలం 26 పరుగులు మాత్రమే ఇచ్చి పొదుపుగానే బౌలింగ్ చేశాడు. అయితే, రెండో మ్యాచ్‌లో మాత్రం ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. అఫ్గనిస్తాన్‌తో ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ మైదానంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సిరాజ్ ఏకంగా 76 పరుగులిచ్చాడు. 9 ఓవర్ల బౌలింగ్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ నేపథ్యంలో.. మహ్మద్ షమీని కాదని సిరాజ్‌ను ఎంపిక చేసి మేనేజ్మెంట్ తప్పుచేసిందంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు వచ్చాయి. ఈ విషయంపై స్పందించిన కేరళ మాజీ బౌలర్ శ్రీశాంత్.. ‘‘మ్యాచ్ మొదలుకావడానికి ముందు.. అసలేంటి ఇదంతా? ‘‘అయ్యో.. శార్దూల్‌ను ఎందుకు ఆడిస్తున్నారు? అంటూ గగ్గోలుపెట్టారు. మ్యాచ్ మొదలైన తర్వాత.. సిరాజ్ పరుగులిస్తూ ఉంటే.. ‘‘ఈరోజు సిరాజ్‌ను ఎందుకు ఆడిస్తున్నారు?’’ అంటూ కామెంట్లు చేశారు. వాళ్లంతా ‘టోపీ మాస్టర్లు’. ఇదిలా ఉంటే.. కెమెరా మాటిమాటికీ షమీ, అశ్విన్‌పైకి గురిపెట్టి చూపిస్తూనే ఉండటం దేనికి సంకేతం. యాజమాన్యం ఎంపిక చేసిన జట్టుకు మనం మద్దతుగా నిలవాలి కదా!’’ అని స్పోర్ట్స్‌కీడాతో చెప్పుకొచ్చాడు. కాగా అఫ్గన్‌తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా ఒక మార్పుతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. తదుపరి పాకిస్తాన్‌తో వెటరన్ స్పిన్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో.. పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఆడాడు. ఈ క్రమంలో అశూను కాదని శార్దూల్‌ను ఎందుకు ఆడిస్తున్నారంటూ సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు కెప్టెన్ రోహిత్ శర్మ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మరికొందరు సిరాజ్‌ను టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలో శ్రీశాంత్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక ఆసీస్ మీద 6, అఫ్గనిస్తాన్ మీద 8 వికెట్ల తేడాతో గెలుపొందిన టీమిండియా అక్టోబరు 14న పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. చదవండి: WC: క్యాన్సర్‌తో పోరాడుతూ వరల్డ్‌కప్ ఆడాను.. డెంగ్యూ వల్ల గిల్..: యువీ -
అవును.. నాకు ధోనితో విభేదాలున్నాయి.. కానీ! గంభీర్‌కు స్ట్రాంగ్ కౌంటర్?
MS Dhoni: మిస్టర్ కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఘనత అతడి సొంతం. అంతేకాదు.. మొహమాటానికి తావు లేకుండా జట్టు ఎంపిక మొదలు.. మైదానంలో వ్యూహాల అమలు వరకు ఆటకు సంబంధించిన ప్రతీ విషయంలో పక్కాగా ఉండటం తనకు అలవాటు. ఈ క్రమంలో కొన్నిసార్లు ధోని విమర్శల పాలయ్యాడు కూడా! ముఖ్యంగా ఒకప్పటి స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌కు ధోని అన్యాయం చేశాడంటూ.. అతడి తండ్రి యోగ్రాజ్ బాహాటంగానే మండిపడిన విషయం తెలిసిందే. అదే విధంగా వన్డే వరల్డ్‌కప్-2011 జట్టులో రోహిత్ శర్మను కాదని.. పీయూశ్ చావ్లా వైపే మొగ్గు చూపడం ధోనికే చెల్లింది. అవును.. నాకు ధోనితో విభేదాలున్నాయి.. ఈ నేపథ్యంలో మాజీ పేసర్ శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనకూ ఒకప్పుడు ధోనితో విభేదాలు ఉన్నాయంటూ వార్తల్లోకెక్కాడు. కాగా ధోని సారథ్యంలో 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టులో ఈ కేరళ బౌలర్ సభ్యుడన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తొట్టతొలి పొట్టి క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్తాన్ ఆటగాడు మిస్బా ఉల్ హక్ ఇచ్చిన క్యాచ్ పట్టి భారత్‌ను విజయతీరాలకు చేర్చడంలో శ్రీశాంత్ పోషించిన పాత్రను ఎవరూ మరువలేరు. ఈ నేపథ్యంలో ధోనితో విభేదాలు అంటూ అతడు చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. అది నిజం.. కానీ ధోని భాయ్ స్టైలే వేరు ‘‘ధోని భాయ్‌తో నాకు విభేదాలున్న మాట వాస్తవమే. అయితే.. క్రికెట్ పరంగా గత కొన్నేళ్లలో మనం సాధించిన విజయాలు చూస్తే.. ధోని తమకు మద్దతుగా నిలవలేదని ఒక్క ఆటగాడు కూడా చెప్పలేడు. అయితే.. కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితుల కారణంగా కెప్టెన్ కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. సారథ్య బాధ్యతలు మోయడం అంత తేలికేమీ కాదు’’ అని మాజీ ఫాస్ట్‌బౌలర్ శ్రీశాంత్ స్పోర్ట్స్‌కీడాతో పేర్కొన్నాడు. ధోని ఎప్పుడూ లైమ్‌లైట్‌లోకి రావాలని కోరుకోలేదు అదే విధంగా.. ‘‘నేను మాట్లాడే మాటలు వివాదానికి దారితీయొచ్చు.. చాలా మంది.. ‘‘అదేంటి ఒకరిద్దరు గురించే ఎక్కువగా మాట్లాడతారు? జట్టుమొత్తం కలిస్తేనే కదా విజయాలు సాధించేది’’ అని అంటూ ఉంటారు. కానీ ధోని ఎప్పుడూ తాను లైమ్‌లైట్‌లోకి రావాలని కోరుకోలేదు. జట్టునే ముందుంచే వాడు. అంతేకాదు జట్టులో కొత్త సభ్యుల చేతికి ట్రోఫీని ఇచ్చే సంప్రదాయాన్ని కూడా తనే మొదలుపెట్టాడు. జట్టు బాగుంటే చాలని భావిస్తాడు ధోని. మేము రెండుసార్లు వరల్డ్‌కప్ గెలవడంలో ప్రతి ఒక్క ఆటగాడి పాత్ర ఉంది. ఇది కాదనలేని సత్యం. గంభీర్‌కు స్ట్రాంగ్ కౌంటర్? అయితే.. పడవలో ఎంత మంది సెలబ్రిటీలు ఉన్నా.. దానిని గమ్యస్థానానికి చేర్చడంలో కెప్టెన్‌దే ప్రధాన పాత్ర కదా! ఫ్లైట్‌లో ఆటోపైలట్ ఆప్షన్ ఉన్నంత మాత్రాన పైలట్ అవసరం లేకుండా పోదు కదా!’’అని ధోనికి క్రెడిట్ ఇచ్చాడు శ్రీశాంత్. కాగా ఇటీవలి కాలంలో 2007, 2011 వరల్డ్‌కప్ విన్నర్ గౌతం గంభీర్.. తామంతా కష్టపడినా ధోనికి మాత్రమే ఎక్కువ హైప్ వచ్చిందంటూ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీశాంత్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చదవండి: WC: అలాంటి వాళ్లకు నో ఛాన్స్! అందుకే అతడిని ఎంపిక చేయలేదు: చీఫ్ సెలక్టర్ -
రెచ్చిపోయిన శ్రీశాంత్.. చెలరేగిన పాక్ బౌలర్లు
యూఎస్ మాస్టర్స్ టీ10 లీగ్ 2023లో టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ చెలరేగిపోయాడు. మోరిస్విల్లే యూనిటీ తరఫున బరిలోకి దిగిన శ్రీశాంత్.. టెక్సస్ ఛార్జర్స్‌తో ఇవాళ (ఆగస్ట్ 23) జరిగిన మ్యాచ్‌లో 2 ఓవర్లలో కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అతనికి సౌతాఫ్రికా మాజీ టెస్ట్ బౌలర్ డేన్ పైడ్ట్ (2/15), విండీస్ నవీన్ స్టివర్ట్ (1/5) తోడవ్వడంతో టెక్సస్ ఛార్జర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 109 పరుగులకు పరిమితమైంది. ✌️wickets in his first over for Sreesanth 💪#MVUvTXC #CricketsFastestFormat #USMastersT10 #T10League #SunshineStarsSixes pic.twitter.com/Pm5kAUyimb — US Masters T10 (@USMastersT10) August 23, 2023 ఛార్జర్స్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ మాజీ డారెన్ స్టీవెన్స్ 18 బంతుల్లో 36 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలువగా.. బెన్ డంక్ (15), తిసాక పెరీరా (12), ఉపుల్ తరంగ (13) తలో చేయి వేశారు. మహ్మద్ హఫీజ్ (8), ముక్తర్ అహ్మద్ (2), సోహైల్ తన్వీర్ (6) సింగిల్ డిజిట్ స్కోర్లకే ఔటయ్యారు. Difference maker in his first outing with the ball 💪 Hafeez, take a bow! 🙇♂️🙇♀️#MVUvTXC #CricketsFastestFormat #USMastersT10 #T10League #SunshineStarsSixes pic.twitter.com/tKfJDx0U2G — US Masters T10 (@USMastersT10) August 23, 2023 K̶e̶y̶ Massive wickets 🤝 Professor Hafeez@MHafeez22#MVUvTXC #CricketsFastestFormat #USMastersT10 #T10League #SunshineStarsSixes pic.twitter.com/erlsKDVEBu — US Masters T10 (@USMastersT10) August 23, 2023 చెలరేగిన పాక్ బౌలర్లు.. 110 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మోరిస్విల్లే యూనిటీ.. పాక్ బౌలర్లు మహ్మద్ హఫీజ్ (2-0-10-3), సోహైల్ తన్వీర్ (2-0-8-2), విండీస్ బౌలర్ ఫిడేల్ ఎడ్వర్డ్స్ (2-0-10-2), లంక బౌలర్ తిసార పెరీరా (2-0-16-1) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 75 పరుగులకే పరిమితమైంది. షెహన్ జయసూర్య (22) టాప్ స్కోరర్‌గా నిలువగా.. మిగతా బ్యాటర్లలో కోరె ఆండర్సన్ (16 నాటౌట్) ఒక్కడే రెండంకెల స్కోర్ చేశాడు. ఫలితంగా టెక్సస్ ఛార్జర్స్ 34 పరుగుల తేడాతో మోరిస్విల్లేను ఓడించింది. -
ధోని నమ్మకం నిలబెట్టిన ప్రపంచకప్ విజేత, 2 సార్లు ఐపీఎల్ ‘విన్నర్’.. ఇప్పుడు పోలీస్
మనం అనుకున్న కెరీర్లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్నామని భావిస్తున్న తరుణంలో.. ఒక్కోసారి అనూహ్య రీతిలో జీవితం మలుపు తిరుగుతుంది. నీ మజిలీ ఇది కాదు.. ఇంకేదో ఉందనే సంకేతాలు ఇస్తుంది. అందుకు తగ్గట్లుగానే మనం కూడా మారాల్సి ఉంటుంది. టీ20 ప్రపంచకప్-2007 టీమిండియా ‘హీరో’ జోగీందర్ శర్మ జీవితంలో ఇలాగే జరిగింది. మొట్టమొదటి విజేతగా భారత్ 2007లో పొట్టి ఫార్మాట్లో ప్రవేశపెట్టిన వరల్డ్‌కప్ టోర్నీలో ధోని సేన ఫైనల్‌కు చేరుకుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తుదిపోరులో తలపడింది. సౌతాఫ్రికాలోని జొహన్నస్‌బర్గ్‌లో ఉన్న ది వాండరర్స్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో దాయాదిని మట్టికరిపించింది. ఆఖరి నిమిషం వరకు తీవ్ర ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ధోని సేన 5 పరుగుల తేడాతో పాక్‌ను ఓడించి తొట్టతొలి టీ20 ప్రపకంచప్ విజేతగా నిలిచింది. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన టీమిండియా ఈ మేరకు సరికొత్త చరిత్ర సృష్టించి రికార్డుల్లోకెక్కింది. ధోని నమ్మకం నిలబెట్టాడు ఇక ఈ మ్యాచ్‌లో ఏమాత్రం అనుభవం లేని జోగీందర్ శర్మకు ఆఖరి ఓవర్లో ధోని బంతినివ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, అతడు ఏమాత్రం తడబడలేదు. పాక్ గెలవాలంటే నాలుగు బంతుల్లో 6 పరుగులు అవసరమైన వేళ తెలివిగా బౌలింగ్ చేశాడు. అతడి బౌలింగ్‌లో పాక్ క్రికెటర్ మిస్బా ఉల్ హక్ స్కూప్ షాట్ ఆడగా.. శ్రీశాంత్ అద్భుత రీతిలో క్యాచ్ అందుకున్నాడు. దీంతో భారత్‌కు చిరస్మరణీయ విజయం దక్కింది. ఈ క్రమంలో ధోని జట్టులో భాగమై విన్నింగ్ వికెట్ తీసిన జోగీందర్ శర్మకు మంచి పేరు వచ్చింది. ఈ మ్యాచ్‌లో అతడు మొత్తంగా 3.3 ఓవర్లు బౌలింగ్ చేసి 20 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. రెండుసార్లు ఐపీఎల్ విన్నర్ ఇక ఆ మరుసటి ఏడాది.. ఐపీఎల్లో ధోని సారథ్యంలోని చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు జోగీందర్. 2008- 2012 వరకు అదే ఫ్రాంఛైజీతో కొనసాగాడు. 2010, 2011లో సీఎస్కే ట్రోఫీ గెలిచిన సందర్భాల్లో భాగమయ్యాడు. పోలీస్ ఉన్నతాధికారిగా 1983, అక్టోబరు 23న హర్యానాలో జన్మించిన ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ జోగీందర్ శర్మ ప్రస్తుతం పోలీస్ అధికారిగా పనిచేస్తున్నారు. టీమిండియా టీ20 ప్రపంచకప్ హీరోగా నిలిచిన జోగీందర్‌ను హర్యానా ప్రభుత్వం ఈ మేరకు సముచిత గౌరవంతో సత్కరించింది. ప్రస్తుతం ఆయన డిప్యూటీ సూపరింటెండెంట్ హోదాలో ఉన్నట్లు సమాచారం. కాగా కోవిడ్ విజృంభణ సమయంలో జోగీందర్ ఫ్రంట్‌లైన్ వర్కర్‌గా హిసార్‌లో సేవలు అందించారు కూడా! కాగా జోగీందర్ 2007లో ఆడిన ప్రపంచకప్ టోర్నీలో ఫైనల్ మ్యాచే జోగీందర్ ఆడిన చివరి అంతర్జాతీయ టీ20 కూడా!! ఎన్ని మ్యాచ్‌లు అంటే ఇక టీమిండియా తరఫున మొత్తంగా 4 వన్డేలు, 4 టీ20లు ఆడిన జోగీందర్.. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 289 వికెట్లు తీయడంతో పాటు 2689 పరుగులు చేశారు. అంతర్జాతీయ కెరీర్లో వన్డేల్లో ఒకటి, టీ20లలో నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నారు. రైట్ఆర్మ్ పేసర్ అయిన జోగీందర్ 2007లో చివరి అంతర్జాతీయ మ్యాచ్.. 2011లో ఆఖరి ఐపీఎల్ మ్యాచ్ ఆడారు. చదవండి: ధోని నమ్మకం నిలబెట్టిన ప్రపంచకప్ విజేత, 2 సార్లు ఐపీఎల్ ‘విన్నర్’.. ఇప్పుడు పోలీస్ -
DC Vs RCB: విరాట్ సెంచరీ కొట్టు.. ఆర్సీబీని గెలిపించు! అదే దాదాకు నువ్విచ్చే కానుక
IPL 2023 DC Vs RCB: ఐపీఎల్-2023లో మరో ఆసక్తికరపోరుకు రంగం సిద్ధమైంది. అరున్ జైట్లీ స్టేడియంలో శనివారం నాటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. తాజా ఎడిషన్‌లో తొలి ముఖాముఖి పోరులో ఆర్సీబీ.. ఢిల్లీని చిత్తు చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 15న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 23 పరుగుల తేడాతో ఓడించింది. అప్పుడు హాఫ్ సెంచరీ ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి అర్ధ శతకం(50)తో మెరిసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం ద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే.. గత మ్యాచ్‌లో టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్‌ను ఢిల్లీ 5 పరుగుల స్వల్ప తేడాతో ఓడించిన సంగతి తెలిసిందే. గుజరాత్‌ను ఓడించి మరోవైపు.. ఆర్సీబీ సైతం లక్నో సూపర్ జెయింట్స్‌పై ప్రతీకార మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇలా లో స్కోరింగ్ మ్యాచ్‌లలో అటు ఆర్సీబీ.. ఇటు ఢిల్లీ విజయం సాధించాయి. ఇదే జోష్‌లో ముఖాముఖి పోరుకు సై అంటున్నాయి. దాదాతో జగడం ఇక చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ- ఢిల్లీ మ్యాచ్ ముగిసిన అనంతరం విరాట్ కోహ్లి- ఢిల్లీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మధ్య జరిగిన ఘటన క్రికెట్ ప్రేమికులకు గుర్తుండే ఉంటుంది. దాదా బీసీసీఐ బాస్‌గా ఉన్న సమయంలోనే కోహ్లి అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి గుడ్ బై చెప్పడం.. ఈ విషయంలో పరస్పరం ఆరోపణలు చేసుకున్న తీరు అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్సీబీ- ఢిల్లీ మ్యాచ్ ముగిసిన తర్వాత ఆటగాళ్లతో కరచాలనం చేస్తున్న సమయంలో కోహ్లి.. గంగూలీకి షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి విముఖత చూపాడు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో పెద్ద ఎత్తున మీమ్స్ పుట్టుకొచ్చాయి. ఈ క్రమంలో తాజా మ్యాచ్‌లో ఎలాంటి సన్నివేశాలు చూడాల్సి వస్తుందోనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రసవత్తర పోరు స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్లో గోల్డెన్ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. డీసీ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుందనడంలో సందేహం లేదు. ఇందులో మనం విరాట్ కోహ్లి వర్సెస్ వార్నర్ వార్ చూడొచ్చు. అదే విధంగా అన్రిచ్ నోర్జేను ఆర్సీబీ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో కూడా చూసేందుకు ఆసక్తిగా ఉన్నా. విరాట్ సెంచరీ కొట్టు ఇక అన్నింటికంటే ఆసక్తికరమైంది ఏమిటంటే.. విరాట్ ఈ మ్యాచ్‌లో సెంచరీ కొడితే చూడాలని ఉంది. శతకం సాధించడమే దాదాకు అతడు ఇచ్చే నిజమైన కానుక. విరాట్.. నువ్వు నీ లాగే ఉండు.. ఆర్సీబీ కోసం ఈ మ్యాచ్‌ను గెలిపించు’’ అంటూ శ్రీశాంత్ కింగ్ ఫ్యాన్స్‌ను ఉత్సాహపరిచేలా మాట్లాడాడు. కాగా ఐపీఎల్-2023 సీజన్లో కోహ్లి ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్‌లలో కలిపి 364 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 82(నాటౌట్). చదవండి: బ్లడీ.. అసలు..! మాట జారిన కోహ్లి.. అదే గొడవకు కారణం! బీసీసీఐకి మెసేజ్ కూడా! ఆర్సీబీకి డీకే, రాజస్థాన్‌కు పరాగ్, సన్‌రైజర్స్‌కు మయాంక్.. మరి ఢిల్లీకి..? '@ImVKohli getting a 100 will be a great tribute to Dada', @sreesanth_36 anticipates a great #RivalryWeek clash between @DelhiCapitals & @RCBTweets! Tune-in to #DCvRCB at #IPLonStar Today | Pre-show at 7 PM & LIVE action at 7:30 PM | Star Sports Network#BetterTogether pic.twitter.com/CxzBgDh6vr — Star Sports (@StarSportsIndia) May 6, 2023 -
రిచర్డ్ లెవి విధ్వంసం వృధా.. ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలకరత్నే దిల్షన్
లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ-2023లో భాగంగా నాగ్‌పూర్ నింజాస్‌తో నిన్న (మార్చి 26) జరిగిన మ్యాచ్‌లో చండీఘడ్ ఛాంప్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నింజాస్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేయగా.. ఛాంప్స్ మరో 9 బంతులు మిగిలుండగానే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నింజాస్ ఇన్నింగ్స్‌లో రిచర్డ్ లెవి (29 బంతుల్లో 71; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా.. తిలకరత్నే దిల్షన్ (46 బంతుల్లో 86 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి ఛాంప్స్ను విజయతీరాలకు చేర్చాడు. దిల్షన్‌కు మరో ఎండ్‌లో గౌరవ్ తోమర్ (50) బాధ్యతాయుతమైన అర్ధసెంచరీతో సహకరించాడు. ఈ మ్యాచ్‌లో బ్యాట్‌తో పాటు బంతిలోనూ (2/40) చెలరేగిన దిల్షన్.. కీలకమైన రిచర్డ్ లెవి, అభిమన్యు వికెట్లు పడగొట్టాడు. నిన్ననే జరిగిన మరో రెండు మ్యాచ్‌ల్లో గౌహతి అవెంజర్స్- వైజాగ్ టైటాన్స్.. పట్నా వారియర్స్-ఇండోర్ కింగ్స్ తలపడగా అవెంజర్స్, ఇండోర్ నైట్స్ జట్లు విజయం సాధించాయి. అవెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టైటాన్స్ 78 పరుగులకే చాపచుట్టేయగా.. అవెంజర్స్ 7.3 ఓవర్లలోనే ఆడుతూ పాడుతూ 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇండోర్ నైట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వారియర్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేయగా.. ఇండోర్ నైట్స్ మరో ఓవర్ మిగిలుండగానే 8 వికెట్లు కోల్పోయి అతికష్టం మీద లక్ష్యాన్ని ఛేదించింది. తద్వారా 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. సురేశ్ రైనా సారధ్యం వహిస్తున్న ఇండోర్ నైట్స్ టీమ్‌లో ఏకంగా ముగ్గురు డకౌట్లు కాగా.. దిల్షన్ మునవీర (53), పర్విందర్ సింగ్ (31) పోరాడి గెలిపించారు. -
WC 2022: అతడికి అంత సీన్ లేదు! ఒకవేళ టీమిండియా టైటిల్ గెలిస్తే..
ICC T20 World Cup 2022: టీమిండియా మెంటల్ కండిషనింగ్ హెల్త్‌కోచ్‌గా నియమితుడైన ప్యాడీ ఆప్టన్‌పై భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతడి నియామకంతో జట్టుకు పెద్దగా ఒరిగేదేమీ లేదని, అద్భుతాలు చేయడం అతడికి చేతకాదని వ్యాఖ్యానించాడు. ఒకవేళ భారత్ టీ20 ప్రపంచకప్ గెలిస్తే ఆ ఘనత ఆటగాళ్లు, ద్రవిడ్ భాయ్‌కు మాత్రమే దక్కుతుందని పేర్కొన్నాడు. వన్డే వరల్డ్‌కప్-2011 సమయంలో ప్యాడీ అప్టన్ భారత సిబ్బందిలో భాగమైన సంగతి తెలిసిందే. కాగా ఆటగాళ్ల మానసిక ఒత్తిడిని దూరం చేయగల నిపుణుడిగా పేరొందిన అతడు భారత్ టైటిల్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక టీమిండియా ప్రస్తుత హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో అతడికి మంచి సంబంధాలు ఉన్నాయి. ప్యాడీ అప్టన్(PC: BCCI) ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్‌కప్-2022 సన్నాహకాల్లో భాగంగా అప్టన్‌ను మరోసారి టీమిండియా మెంటల్ కండిషనింగ్ హెల్త్‌కోచ్‌గా బీసీసీఐ నియమించింది. ఈ క్రమంలో వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియాతో ఇప్పటికే అతడు జట్టుకట్టాడు. అతడి వల్ల ఏమీకాదు! ఈ పరిణామాల గురించి మిడ్-డేతో శ్రీశాంత్ మాట్లాడుతూ.. ‘‘అతడు(అప్టన్) అద్భుతాలు చేయలేడు. ఒకవేళ మనం టీ20 వరల్డ్‌కప్ గెలిస్తే అది కేవలం మన ఆటగాళ్ల ప్రదర్శన.. రాహుల్ భాయ్ అనుభవం వల్లే! మనకు పటిష్టమైన జట్టు ఉంది. అంతేగానీ.. మనం ఇప్పుడు ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో ఆ వ్యక్తి జట్టుతో ఉన్నా లేకున్నా పెద్దగా తేడా ఏమీ ఉండదు’’ అని పేర్కొన్నాడు. ఇక 2011 నాటి ప్రపంచకప్ విజయంలో అప్టన్ పాత్ర కేవలం ఒక శాతం మాత్రమేనని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు. రాహుల్ భాయ్‌తో కలిసి పనిచేశాడు కాబట్టే! ‘‘99 శాతం పనిని పూర్తి చేసింది గ్యారీ కిర్‌స్టన్.. అప్టన్ ఆయనకు కేవలం అసిస్టెంట్ మాత్రమే. రాజస్తాన్ రాయల్స్‌లో భాగంగా రాహుల్ భాయ్‌తో కలిసి పనిచేశాడు కాబట్టే మళ్లీ టీమిండియా సిబ్బందిలో భాగం కాగలిగాడు. నిజానికి అతడు మంచి యోగా టీచర్. కాబట్టి రాహుల్ భాయ్ కచ్చితంగా అతడి సేవలు వాడుకుంటాడు’’ అని శ్రీశాంత్ పేర్కొన్నాడు. కాగా ఈ కేరళ పేసర్ గతంలో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. క్యాష్ రిచ్ లీగ్-2013 సీజన్లో భాగంగా శ్రీశాంత్‌తో పాటు ద్రవిడ్, అప్టన్ కూడా ఈ ఫ్రాంఛైజీ తరఫున పనిచేశారు. ఈ నేపథ్యంలో శ్రీశాంత్, ద్రవిడ్- అప్టన్ ద్వయం మధ్య విభేదాలు తలెత్తినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో తన ఆటోబయోగ్రఫీలో అప్టన్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ సమయంలో తుది జట్టులో చోటు దక్కని కారణంగా శ్రీశాంత్.. తనను, ద్రవిడ్‌ను అసభ్య పదజాలంతో దూషించాడని రాశాడు. ఈ నేపథ్యంలో శ్రీశాంత్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇదిలా ఉంటే.. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో మసకబారిన శ్రీశాంత్ కెరీర్ అర్ధంతరంగా ముగిసిపోయిన విషయం తెలిసిందే. ఇక 2007 టీ20 ప్రపంచకప్, 2011 వరల్డ్‌కప్, గెలిచిన టీమిండియాలో శ్రీశాంత్ సభ్యుడన్న సంగతి తెలిసిందే. చదవండి: WC 2023: అందుకే గబ్బర్ కెప్టెన్ అయ్యాడు! రోహిత్ శర్మ కోరుకుంటున్నది అదే! -
కోహ్లి కెప్టెన్సీలో గనుక నేను ఆడి ఉంటే.. ఇండియా 3 ప్రపంచకప్‌లు గెలిచేది!
Sreesanth: టీమిండియా ఐసీసీ టోర్నీ గెలిచిన రెండు సందర్భాల్లో జట్టులో భాగమై మధుర జ్ఞాపకాలు మిగుల్చుకున్నాడు మాజీ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్. మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని సారథ్యంలో 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ సాధించిన టీమిండియాలో అతడు సభ్యుడు. అయితే, స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా శ్రీశాంత్ కెరీర్ మసకబారిపోయింది. #OnThisDay in 2007! The @msdhoni-led #TeamIndia created history as they lifted the ICC World T20 Trophy. 🏆 👏 Relive that title-winning moment 🎥 👇 pic.twitter.com/wvz79xBZJv — BCCI (@BCCI) September 24, 2021 ఈ నేపథ్యంలో నిషేధం ఎదుర్కొన్న శ్రీశాంత్.. దేశవాళీ క్రికెట్లో అడుగుపెట్టినా.. జాతీయ జట్టులో పునరాగమనం చేయలేకపోయాడు. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చిలో అతడు అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. Etched in our memories FOREVER! ☺️ ☺️ 🗓️ #OnThisDay in 2011, #TeamIndia won the ODI World Cup for the second time. 🏆 🙌 pic.twitter.com/HcsrWzJGJ1 — BCCI (@BCCI) April 2, 2022 ఇదిలా ఉంటే.. 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ తర్వాత టీమిండియా ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేదన్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లి సారథిగా విజయవంతమైనా.. పలు చిరస్మరణీయ విజయాలు అందించినా.. మేజర్ టోర్నీ మాత్రం గెలవలేకపోయాడు. ఈ నేపథ్యంలో తాజాగా శ్రీశాంత్ తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నేనే గనుక జట్టులో ఉండి ఉంటే! టైమ్స్ నౌతో మాట్లాడిన శ్రీశాంత్.. ‘‘ఒకవేళ నేను విరాట్ కెప్టెన్సీలో గనుక ఆడి ఉంటే.. కచ్చితంగా 2015, 2019, 2021 వరల్డ్‌కప్ టైటిల్ గెలిచేవాళ్లం’’ అని వ్యాఖ్యానించాడు. ఇక యార్కర్లు సంధించడంలో ప్రావీణ్యం ఉన్న ఈ 39 ఏళ్ల బౌలర్.. టెన్నిస్ బాల్‌తో యార్కర్లు వేయడం తన కోచ్ ప్రాక్టీసు చేయించారని తెలిపాడు. పరిస్థితులకు తగ్గట్లుగా... బ్యాటర్ ఆటతీరును సరిగ్గా అంచనా వేయగలిగితే యార్కర్లు వేయడం సులువేనని శ్రీశాంత్ పేర్కొన్నాడు. ఈ విషయంలో బుమ్రా కూడా ఇదే చెబుతాడని పేర్కొన్నాడు. కాగా యార్కర్లు వేయడంలో స్పెషలిస్టు అయిన జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం టీమిండియాలో పేస్ దళానికి నాయకుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఇక శ్రీశాంత్ భారత్ తరఫున 27 టెస్ట్‌ల్లో 87 వికెట్లు, 53 వన్డేల్లో 75 వికెట్లు, 10 టీ20ల్లో 7 వికెట్లు పడగొట్టాడు. ఇక 2007 టీ20 ప్రపంచకప్ టోర్నీలో భాగంగా పాకిస్తాన్‌తో ఫైనల్లో శ్రీశాంత్ 4 ఓవర్లు బౌలింగ్ చేసి 44 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. అయితే, మ్యాచ్ ఆఖరి ఓవర్లో పాక్ ప్లేయర్ మిస్బా ఉల్ హక్ ఆడిన స్కూప్ షాట్‌కు శ్రీశాంత్ పట్టిన క్యాచ్‌తో ఇండియా విజయం ఖరారైన దృశ్యాలు ఎల్లప్పుడూ గుర్తుండిపోయాయి. ఇక 2011 వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంకతో ఫైనల్ మ్యాచ్‌లో శ్రీశాంత్ ఎనిమిది ఓవర్లు బౌలింగ్ చేసి 52 పరుగులు ఇచ్చాడు. కానీ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. చదవండి: India Vs West Indies 2022: విండీస్‌తో టీమిండియా వన్డే, టీ20 సిరీస్.. షెడ్యూల్, జట్లు, పూర్తి వివరాలు! Virat Kohli: ఒక్క 20 నిమిషాలు చాలు.. కోహ్లి సమస్యను పరిష్కరిస్తా! నేను కూడా ఆ ఇబ్బంది ఎదుర్కొన్నా! -
రిటైర్మెంట్ అనంతరం శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
Sreesanth Retirement: క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైరవుతున్నట్టు రెండ్రోజుల (మార్చి 9న) కిందట ప్రకటించిన టీమిండియా వివాదాస్పద బౌలర్ శాంతకుమరన్ శ్రీశాంత్.. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు. రిటైర్మెంట్ గురించి తన రంజీ జట్టు కేరళకు ముందే సమాచారమందించినా పట్టించుకోలేదని, ఆరేళ్లపాటు టీమిండియాకు ఆడిన ఆటగాడికి కనీస మర్యాదగా వీడ్కోలు ఉంటుందని ఆశించానని, అయితే కొన్ని శక్తుల వల్ల తాను అందుకు కూడా నోచుకోలేకపోయానని సంచలన వ్యాఖ్యలు చేశాడు. రిటైర్మెంట్ గురించి కేరళ జట్టు యాజమాన్యానికి ముందే సమాచారమిచ్చినా, గుజరాత్‌తో మ్యాచ్‌లో నన్ను ఆడించలేదని వాపోయాడు. ఈ మేరకు ఓ స్థానిక టీవీ ఛానెల్లో తన ఆవేదనను వ్యక్తం చేశాడు. కాగా, ప్రస్తుత రంజీ సీజన్లో భాగంగా మార్చి 9న కేరళ-గుజరాత్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆడి, ఆటకు వీడ్కోలు పలకాలని శ్రీశాంత్ భావించాడు. అయితే శ్రీ ప్రకటనను ఏమాత్రం పట్టించుకోని కేరళ జట్టు యాజమాన్యం అతన్ని బెంచ్‌కే పరిమితం చేసింది. తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం ఇటీవలే బంతిని అందుకున్న శ్రీశాంత్.. ప్రస్తుత రంజీ సీజన్లో ఓ మ్యాచ్ ఆడాడు. మేఘాలయాతో జరిగిన ఆ మ్యాచ్‌లో అతను రెండు వికెట్లు పడగొట్టాడు. 2007 టీ20 ప్రపంచకప్‌తో పాటు 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన టీమిండియాలో సభ్యుడైన శ్రీశాంత్.. భారత్ తరఫున 27 టెస్ట్‌ల్లో 87 వికెట్లు, 53 వన్డేల్లో 75 వికెట్లు, 10 టీ20ల్లో 7 వికెట్లు పడగొట్టాడు. చదవండి: బీసీసీఐ ద్వంద్వ వైఖరి.. కోహ్లి విషయంలో అలా, రోహిత్ కోసం ఇలా..! -
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా వివాదాస్పద బౌలర్
Sreesanth Announces Retirement: టీమిండియా వివాదాస్పద బౌలర్, కేరళ క్రికెటర్ శాంతకుమరన్ నాయర్ శ్రీశాంత్ (39) క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు బుధవారం ట్విటర్ వేదికగా ప్రకటించాడు. టీమిండియాకు ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవమని, ఆ స్థాయికి చేరేందుకు సహకరించిన కుటుంబ సభ్యులకు, జట్టు సహచరులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలంటూ తన ట్వీట్లో పేర్కొన్నాడు. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని చాలా బాధతో, బరువెక్కిన హృదయంతో ప్రకటిస్తున్నానని తెలిపాడు. యువతరానికి అవకాశం ఇచ్చేందుకు ఫస్ట్‌క్లాస్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నానని వెల్లడించాడు. It has been an honor to represent my family, my teammates and the people of India. Nd everyone who loves the game . With much sadness but without regret, I say this with a heavy heart: I am retiring from the Indian domestic (first class and all formats )cricket , — Sreesanth (@sreesanth36) March 9, 2022 For the next generation of cricketers..I have chosen to end my first class cricket career. This decision is mine alone, and although I know this will not bring me happiness, it is the right and honorable action to take at this time in my life. I ve cherished every moment .❤️🏏🇮🇳 — Sreesanth (@sreesanth36) March 9, 2022 క్రికెట్ నుంచి తప్పుకోవాల్సిన సరైన సమయమిదేనని అభిప్రాయపడ్డాడు. బాగా ఆలోచించే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని, ఇది తన వ్యక్తిగతమని చెప్పుకొచ్చాడు. టీమిండియా తరఫున 27 టెస్ట్‌లు, 53 వన్డేలు, 10 టీ20లు ఆడిన శ్రీశాంత్ మొత్తం 169 వికెట్లు(87 టెస్ట్ వికెట్లు, 75 వన్డే, 7 టీ20 వికెట్లు) పడగొట్టాడు. ఈ వెటరన్ పేసర్ ఇటీవల జరిగిన ఐపీఎల్ 2022 మెగా వేలంలో పేరు నమోదు చేసుకున్నప్పటికీ ఏ జట్టు అతనిపై ఆసక్తి కనబర్చకపోవడంతో అమ్ముడుపోని క్రికెటర్ల జాబితాలో మిగిలిపోయాడు. శ్రీశాంత్ 50 లక్షల బేస్ ప్రైజ్ విభాగంలో మెగా వేలంలో పేరును నమోదు చేసుకున్నాడు. చదవండి: చెన్నై సూపర్ కింగ్స్‌లోకి శ్రీశాంత్...! -
కేరళ కెప్టెన్‌గా సచిన్ బేబి... జట్టులోకి శ్రీశాంత్!
Ranji Trophy KCA Sachin Baby To Lead: రంజీ ట్రోఫీ తాజా సీజన్‌కుగానూ కేరళ క్రికెట్ అసోసియేషన్ ప్రాబబుల్స్ జట్టును ప్రకటించింది. జనవరి 13 నుంచి ప్రారంభం కానున్న దేశవాళీ టోర్నీ నేపథ్యంలో సచిన్ బేబికి సారథ్య బాధ్యతలు అప్పగించినట్లు తెలిపింది. వికెట్‌కీపర్ బ్యాటర్ విష్ణు వినోద్ అతడికి డిప్యూటీగా వ్యవహరిస్తాడని పేర్కొంది. కాగా సీనియర్ పేసర్ శ్రీశాంత్‌కు జట్టులో చోటు దక్కడం విశేషం. ఇక ఎలైట్ గ్రూపు బీలో ఉన్న కేరళ జట్టు... విదర్భ(జనవరి 13-16)తో తమ మొదటి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత వరుసగా బెంగాల్, రాజస్తాన్, త్రిపుర, హర్యానాతో తలపడనుంది. రంజీ ట్రోఫీ 2021-22 కేరళ ప్రాబబుల్ జట్టు: సచిన్ బేబి(కెప్టెన్), విష్ణు వినోద్(వైస్ కెప్టెన్), ఆనంద్ క్రిష్ణన్, రోహన్ కునుమెల్ వత్సల్ గోవింద్, రాహుల్ పి, సల్మాన్ నిజర్, సంజూ శాంసన్, జలజ్ సక్సేనా, సిజో మోన్ జోసెఫ్ అక్షయ్ కేసీ, మిథున్, బాసిల్ ఎన్ పీ, నిదీశ్ ఎండీ, మను క్రిష్ణన్, బాసిల్ థంపి ఫనూస్, శ్రీశాంత్ ఎస్, అక్షయ్ చంద్రన్, వరుణ్ నాయనర్, ఆనంద్ జోసెఫ్ వినూప్ మనోహరన్, అరుణ్ ఎం, వైశక్ చంద్రన్. చదవండి: Trolls As Ajinkya Rahane In Playing XI: మరీ ఇంత దారుణమా.. పాపం విహారి.. తనకే ఎందుకిలా! -
గట్టిగా పార్టీ చేస్తే 2 లక్షలకు పైగా బిల్లు కడతాను.. అలాంటి నేను ఫిక్సింగ్ చేస్తానా..?
Sreesanth Reveals Shocking Details Behind IPL Spot Fixing Saga: 2013 ఐపీఎల్ సీజన్లో సంచలనం రేపిన స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంపై టీమిండియా మాజీ పేస్ బౌలర్ శాంతకుమరన్ శ్రీశాంత్ తొలిసారి బహిరంగంగా నోరు విప్పాడు. తాను స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడలేదని, ఉద్దేశపూర్వకంగా కొందరు తనను ఇరికించారని, దాని వల్ల తన కెరీర్ అర్ధాంతరంగా ముగిసిందని వాపోయాడు. క్లిష్ట పరిస్థితుల్లో తన వెంటే ఉన్న కుటుంబ సభ్యులు, అభిమానులు, శ్రేయోభిలాషులకు జీవితాంతం రుణపడి ఉంటానని, తాను ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవడంలో వారి పాత్ర అసమానమని, వారి ప్రార్ధనల వల్లే తాను తిరిగి సాధారణ జీవితం గడపగలుగుతున్నానని పేర్కొన్నాడు. ప్రముఖ క్రీడా వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. అభం శుభం తెలియని నన్ను కొందరు టార్గెట్ చేసి మరీ ఈ కేసులో ఇరికించారని, చూసేందుకు రఫ్‌గా కనిపించినా తానెవరికీ కీడు తలపెట్టలేదని, వీలైనంతవరకూ సాయం చేశానే కానీ.. ఎవరికీ హాని చేయలేదని, అలాంటి నా విషయంలో ఇలా జరగడం బాధాకరమన్నాడు. "గొప్పలు చెప్పుకోవడం అనుకోకపోతే.. గట్టిగా పార్టీ చేసుకుంటే రెండు, మూడు లక్షల వరకు బిల్లు కట్టే నేను.. కేవలం 10 లక్షల కోసం ఫిక్సింగ్‌కు పాల్పడతానా" అంటూ ప్రశ్నించాడు. ఫిక్సింగ్ ఆరోపణల సమయంలో తన కాలి బొటన వేలికి 12 సర్జరీలైనా కూడా 130 కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్ చేశానని, ఆ సమయంలో ఒక ఓవర్లో 14 పరుగులు అవసరం కాగా.. నాలుగు బంతుల్లో ఐదు పరుగులు మాత్రమే ఇచ్చానని, ఆ మ్యాచ్‌లో నోబాల్ కానీ వైడ్ బాల్ కానీ వేయలేదని.. అలాంటిది నేను ఎలా ఫిక్సింగ్ చేస్తానని అని ఈ కేరళ స్పీడ్‌స్టర్ ప్రశ్నించాడు. చేతి నిండా డబ్బు ఉండి, కెరీర్ అత్యుత్తమ దశలో ఉన్న తరుణంలో ఎవ్వరూ అలాంటి పనికి పాల్పడరని పేర్కొన్నాడు. కాగా, శ్రీశాంత్ 2013 ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడుతూ.. స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో దోషిగా తేలాడు. అతనితో సహా మరో ఇద్దరు రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్ల (అంకిత్ చవాన్, అజిత్ చండీలా)పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. తన నిషేధంపై కోర్టును అశ్రయించిన శ్రీశాంత్‌కు.. 2019లో ఊరట లభించింది. సుప్రీం కోర్టు అతని నిషేధ కాలాన్ని తగ్గించాలని బీసీసీఐని ఆదేశించడంతో.. శిక్ష ఏడేళ్లకు కుదించబడింది. 2020 సెప్టెంబర్‌తో ఆ నిషేధం పూర్తయింది. అప్పటి నుంచి శ్రీ.. దేశవాళీ క్రికెట్లో కేరళ జట్టు తరఫున ఆడుతున్నాడు. శ్రీశాంత్ భారత్ తరఫున 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 87, వన్డేల్లో 75, టీ20ల్లో 7 వికెట్లు పడగొట్టాడు. అలాగే 44 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 40 వికెట్లు తీశాడు. భారత్ గెలిచిన 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌లలో శ్రీశాంత్ సభ్యుడు. చదవండి: టీమిండియాలోకి శ్రేయస్.. ఆ నలుగురిపై వేటు పడనుందా..? -
బౌండరీ కొట్టగానే శ్రీశాంత్ స్టైల్‌ను దింపేశాడు..
యూరోపియన్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో భాగంగా సెప్టెంబర్ 22న జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రొమానియాకు చెందిన పావెల్ ఫ్లోరిన్ అనే క్రికెటర్ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్‌లో భాగంగా హంగేరీ జట్టు 11వ బ్యాటర్‌గా వచ్చిన అతను బౌండరీ కొట్టగానే టీమిండియా వెటరన్ స్పీడస్టర్ శ్రీశాంత్‌లా సెలబ్రేషన్‌ను చేసుకున్నాడు. విషయంలోకి వెళితే.. బౌలర్ ఆఫ్‌స్టంప్ దిశగా బంతి వేశాడు. వెంటనే ఫ్లోరిన్ మొకాళ్లపై కూర్చొని డీప్స్వేర్ లెగ్ మీదుగా కళ్లు చెదిరే షాట్ ఆడాడు. అనంతరం పైకి లేచి డ్రెస్సింగ్‌రూమ్ వైపు చూస్తూ బ్యాట్‌ను స్వింగ్ చేయడం ప్రారంభించాడు. అయితే అతను సెలబ్రేట్ చేసుకున్న విధానం శ్రీశాంత్ సెలబ్రేషన్‌ను గుర్తుచేసింది. 2006-07లో దక్షిణాఫ్రికా పర్యటనలో జోహెన్నెస్‌బర్గ్ వేదికగా మొదటి టెస్టు మ్యాచ్ సందర్భంగా ఇది చోటుచేసుకుంది. ఆ మ్యాచ్‌లో 11వ బ్యాటర్‌గా వచ్చిన శ్రీశాంత్‌కు ఆండ్రూ నెల్ బౌన్సర్లు సంధించాడు. దీంతో చిర్రెత్తికొచ్చిన శ్రీశాంత్ తర్వాతి బంతిని లాంగాన్ దిశగా కళ్లు చెదిరే సిక్స్ కొట్టాడు. దీంతో తన సంతోషాన్ని తట్టుకోలేక బ్యాట్‌ను స్వింగ్ చేస్తూ డ్యాన్స్ చేయడం అప్పట్లో వైరల్‌గా మారింది. అంతేకాదు ఈ మ్యాచ్ శ్రీశాంత్‌కు మరపురానిగా మిగిలింది. ఓవరాల్‌గా బౌలర్‌గా ఈ మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లు తీసుకున్న శ్రీశాంత్ ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు అందుకోవడం విశేషం. తాజాగా ఫ్లోరిన్‌ను శ్రీశాంత్‌తో పోలుస్తూ ఫ్యాన్స్ కామెంట్ చేశారు. చదవండి: Rohit Sharma: రోహిత్ శర్మ అరుదైన ఘనత.. ఐపీఎల్ చరిత్రలో తొలి బ్యాటర్‌గా it's my first boundary in the European Cricket Championship so a celebration is needed !!! @EuropeanCricket #cricket pic.twitter.com/CQI4bRNSib — Pavel Florin (@PavelFlorin13) September 22, 2021 -
'పో.. వెళ్లి బౌలింగ్ చేయ్ బ్రో'
ముంబై: టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోనిలో కోపం అనేది చాలా అరుదుగా చూస్తుంటాం. ఏ విషయమైనా సరే తన కూల్ కెప్టెన్సీతో అక్కడి పరిస్థితినే మార్చేస్తాడు. అంతర్జాతీయ క్రికెట్ సహా ఐపీఎల్‌లోనూ ఇలాంటి ఘటనలు చాలానే చూశాం. మరి అలాంటి ధోని టీమిండియా వివాదాస్పద బౌలర్ ఎస్. శ్రీశాంత్‌కి ఒక సందర్భంలో వార్నింగ్ ఇచ్చాడంటూ మరో భారత క్రికెటర్ రాబిన్ ఊతప్ప పేర్కొన్నాడు. 2007 టీ20 ప్రపంచకప్ తర్వాత ఇది చోటు చేసుకుందని తెలిపాడు. స్టాండప్ కమేడియన్ సౌరభ్ పంత్ యూట్యూబ్ చానెల్‌కు ఊతప్ప ఇంటర్య్వూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ధోని, శ్రీశాంత్‌ల మధ్య జరిగిన ఘటనను ప్రస్తావించాడు. ''టీ20 వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాతో హైదరాబాద్ వేదికగా ఓ టీ20 మ్యాచ్ ఆడుతున్నాం. ఆ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ ఆండ్రూ సైమండ్స్ లేదా హస్సీనా అనేది నాకు సరిగా గుర్తు లేదు. కానీ.. శ్రీశాంత్ విసిరిన బంతిని అతనికే డైరెక్ట్‌గా హిట్ చేశాడు. వెంటనే బంతిని అందుకున్న శ్రీశాంత్ బెయిల్స్‌ని ఎగరగొట్టి.. హౌ ఈజ్ దట్..? హౌ ఈజ్ దట్..? అంటూ గట్టిగా అరిచాడు. దాంతో.. అతని వద్దకి పరుగెత్తుకుంటూ వెళ్లిన ధోని కోపంతో శ్రీశాంత్‌ను పక్కకు తోసి 'వెళ్లి బౌలింగ్ చెయ్ బ్రో' అంటూ హెచ్చరించాడు. స్వతహగా చాలా దూకుడుగా ఉండే శ్రీశాంత్‌ని కూడా ధోని చక్కగా హ్యాండిల్ చేయడం తాను ఎప్పటికీ మరిచిపోను. అందుకే కూల్ మాస్టర్ అనే పేరు ధోనీకి సరిగ్గా సరిపోతుంది'' అని ఉతప్ప వెల్లడించాడు. కాగా ఐపీఎల్ 2013లో స్ఫాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో శ్రీశాంత్ ఏడేళ్ల నిషేధం ఎదుర్కొన్నాడు. అయితే.. ఈ ఏడాది ఐపీఎల్లో మళ్లీ ఆడేందుకు ఈ పేసర్ ప్రయత్నించగా.. ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి కనబర్చలేదు. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి ఈ ఏడాది వచ్చిన రాబిన్ ఉతప్పకి కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం ధోనీ కల్పించలేదు. ఇక సీఎస్కే ఐపీఎల్ 14వ సీజన్లో దుమ్మురేపింది. యూఏఈలో గతేడాది జరిగిన ఐపీఎల్ సీజన్‌ను మరిపిస్తూ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు.. 2 ఓటములతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. చదవండి: వార్నర్ మళ్లీ మొదలుపెట్టాడు.. ఈసారి రౌడీ బేబీతో -
రెచ్చగొట్టి మరీ సిక్స్ కొట్టించాడు.. ఎప్పటికి మరిచిపోను
జోహన్నెస్‌బర్గ్: టీమిండియా సీనియర్ బౌలర్ శ్రీశాంత్ తన కెరీర్లో ఆట కంటే వివాదాలతోనే ఎక్కువ ఫేమస్ అయ్యాడు. అయితే అతని బౌలింగ్‌తో ప్రత్యర్థులను భయపెట్టిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. బ్యాటింగ్ లెజెండ్స్ జాక్ కలిస్, బ్రియాన్ లారాలను తన బౌలింగ్‌తో ఇబ్బంది పెట్టాడు. బౌలింగ్‌లో తన పవరేంటో చూపెట్టిన శ్రీశాంత్ ఒక మ్యాచ్‌లో తన బ్యాటింగ్ పవర్ చూపించాడు. ఆ మ్యాచ్‌లో శ్రీశాంత్ చేసింది ఏడు పరుగులు.. కొట్టింది ఒకే ఒక్క సిక్స్. కానీ ఆ సిక్స్ ప్రత్యర్థి బౌలర్‌కు ఎప్పటికి గుర్తుండి పోయేలా చేశాడు. 2006లో టీమిండియా ఐదు వన్డేలు.. మూడు టెస్టులు, ఒక టీ20 ఆడేందుకు దక్షిణాఫ్రికాలో పర్యటించింది. టెస్టు సిరీస్‌లో భాగంగా వాండరర్స్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరిగింది. దక్షిణాఫ్రికా బౌలర్ ఆండ్రూ నెల్ అప్పటికే మూడు వికెట్లు తీసి జోరు మీద ఉన్నాడు. క్రీజులో ఉన్న శ్రీశాంత్‌ను చూస్తూ ఏదో స్లెడ్జ్ చేశాడు. అసలే కోపానికి చిరునామాగా ఉండే శ్రీశాంత్‌కు అతని మాటలు మరింత కోపం తెప్పించాయి. ఆండ్రూ వేసిన బంతిని భారీ సిక్స్ బాదాడు. అంతే ఆండ్రూ ముఖంలో కోపం.. శ్రీశాంత్‌లో నవ్వు ఒకేసారి కనిపించాయి. ఇంతటితో ఆగకుండా శ్రీశాంతక్ష తన బ్యాట్‌ను అతనివైపు చూస్తూ.. పనిచేసుకో అన్నట్లుగా స్వింగ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో వైరల్‌గా మారింది. కాగా ఆ మ్యాచ్‌లో శ్రీశాంత్ బౌలింగ్‌లో 8 వికెట్లతో దుమ్మురేపి టీమిండియాకు 123 పరుగులతో భారీ విజయాన్నిఅందించాడు. తాజాగా ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ డేల్ స్టెయిన్‌ను ఇంటర్వ్యూ చేసింది. మీకు ఎప్పటికి గుర్తుండిపోయేలా.. చిల్ అనిపించేలా.. బ్యాట్స్‌మన్ కొట్టిన షాట్ గురించి చెప్పండి అంటే అడిగాడు. దానికి శ్రీశాంత్ కొట్టిన సిక్స్‌ను గుర్తుచేసుకున్నాడు. ''ఆండ్రూ నెల్ బౌలింగ్‌లో శ్రీశాంత్ కొట్టిన సిక్స్ ఎప్పటికి మరిచిపోను. అతన్ని గెలికి మరీ సిక్స్ కొట్టించాడు. సిక్స్ కొట్టిన అనంతరం శ్రీశాంత్ తన బ్యాట్‌ను స్వింగ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకున్న మూమెంట్ ఇప్పటికి గుర్తుంది. ఎప్పుడు గుర్తొచ్చినా నన్ను చిల్ చేస్తుంది'' అంటూ చెప్పుకొచ్చాడు. Sreesanth and his slog off Andre Nel for 6 with the swinging bat celebration. Legendary — Dale Steyn (@DaleSteyn62) May 15, 2021 ఇక శ్రీశాంత్ ఆండ్రూ నెల్తో జరిగిన కాంట్రవర్సీ గురించి తర్వాత స్పందించాడు. ''ఆరోజు మ్యాచ్‌లో నేను బ్యాటింగ్ చేస్తుంటే నా దగ్గరకు వచ్చి ఇండియన్స్‌కు పెద్ద మనసు ఉండదని.. మీతో పోలిస్తే మేము చాలా బెటర్ అంటూ కామెంట్స్ చేశాడు. నాకు కోపం వచ్చింది.. అప్పటికే మా ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా ఔటయ్యారు. ఆండ్రూకు మా స్కోర్‌బోర్డు చూపిస్తూ..' మేం ఆధిక్యంలో ఉన్నాం.. తర్వాత ఏ జరుగుతుందో నువ్వే చూడు' అని సైగ చేసి సిక్స్ బాదాను.. అంతే అతని కళ్లలో కోపం చూసి నేను సెలబ్రేట్ చేసుకున్నా'' అంటూ తెలిపాడు. ఇక శ్రీశాంత్ టీమిండియా తరపున 27 టెస్టుల్లో 87 వికెట్లు.. 53 వన్డేల్లో 75 వికెట్లు.. 10టీ20ల్లో 7 వికెట్లు తీశాడు. చదవండి: 'ఆ నెంబర్ మరిచిపోలేదు.. అందుకే స్పందించాడు' -
8 ఏళ్ల తర్వాత కూడా అదే తీరు
తిరువనంతపురం : టీమిండియా క్రికెటర్.. కేరళ స్పీడస్టర్ శ్రీశాంత్ 8 ఏళ్ల తర్వాత మళ్లీ మైదానంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఇటీవలే సయ్యద్ ముస్తాక్ టోర్నీకి సంబంధించి కేరళ జట్టు ప్రాబబుల్స్‌లో శ్రీశాంత్ చోటు దక్కించుకున్నాడు. జనవరి 10 నుంచి సయ్యద్ ముస్తాక్ టోర్నీ జరగనుంది. ఈ క్రమంలో తన ప్రాక్టీస్‌ను ఆరంభించిన శ్రీశాంత్ 8 ఏళ్ల తర్వాత అదే కోపాన్ని చూపించడం ఆసక్తికరంగా మారింది. (చదవండి : 'ఆ మ్యాచ్‌లో నన్ను గెట్ అవుట్ అన్నారు') ఆది నుంచి టీమిండియాలో అగ్రెసివ్ క్రికెటర్‌గా పేరు పొందిన శ్రీశాంత్‌కు బాధ వేసినా.. సంతోషం కలిగినా అస్సలు తట్టుకోలేడు. ఎదుటివారిని బోల్తా కొట్టించేందుకు తనదైన శైలిలో కవ్వింపు చర్యలకు పాల్పడేవాడు. శ్రీశాంత్ కెరీర్లో ఇలాంటివి చాలానే చూశాం. తాజాగా శ్రీశాంత్ సయ్యద్ ముస్తాక్ టోర్నీ సన్నాహకంగా వార్మప్ మ్యాచ్‌ల్లో ఆడుతున్నాడు. ఈ సందర్భంగా శ్రీశాంత్ వేసిన బంతిని ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ భారీ షాట్ ఆడాడు. ఆ షాట్‌ను కోపంతో చూస్తూ శ్రీశాంత్ మళ్లీ పాతరోజులకు వెళ్లిపోయాడు. పిచ్‌పై నిలబడి బ్యాట్స్‌మన్‌పై స్లెడ్జింజ్‌కు దిగాడు. కాగా శ్రీశాంత్ బౌలింగ్ వీడియోనూ కేరళ క్రికెట్ అసోసియేషన్ యూట్యూబ్‌లో షేర్ చేసింది. కాగా శ్రీశాంత్ చర్యపై నెటిజన్లు తమదైశ శైలిలో కామెంట్లు చేస్తున్నారు. 8 ఏళ్ల తర్వాత కూడా శ్రీశాంత్ తీరులో ఏ మార్పు లేదు. శ్రీశాంత్ అంటేనే కోపానికి మారుపేరు.. అతను అలా ఉంటేనే కరెక్ట్.. అని పేర్కొన్నారు. కాగా 2013 ఐపీఎల్ సీజన్లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో బీసీసీఐ శ్రీశాంత్‌తో పాటు అంకిత్ చవాన్, అజిత్ చండీలాపై జీవితకాలం నిషేధం విధించింది. అయితే బీసీసీఐ శ్రీశాంత్‌పై విధించిన నిషేధాన్ని ఏడేళ్లకి కుదించగా.. గతేడాది సెప్టెంబరుతో అది ముగిసింది. -
ఇటు శ్రీశాంత్... అటు యువీ
న్యూఢిల్లీ : స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి ఏడేళ్ల పాటు క్రికెట్‌కు దూరమైన పేస్ బౌలర్ ఎస్. శ్రీశాంత్ తొలిసారి ప్రధాన స్రవంతిలోకి అడుగు పెట్టేందుకు చేరువ య్యాడు. ముస్తాక్ అలీ టి20 ట్రోఫీ కోసం కేరళ జట్టు ప్రకటించిన ప్రాబబుల్స్‌లో శ్రీశాంత్‌కు చోటు దక్కింది. ఇటీవలే నిషేధం ముగియడంతో 38 ఏళ్ల శ్రీశాంత్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. 2013 ఐపీఎల్లో అతను తన చివరి మ్యాచ్ ఆడాడు. ఇదే టోర్నీ కోసం పంజాబ్ ప్రకటించిన ప్రాబబుల్స్‌లో సీనియర్ క్రికెటర్ యువరాజ్ సింగ్‌ను కూడా ఎంపిక చేశారు. గత ఏడాది జూన్‌లో యువీ రిటైర్మెంట్ ప్రకటించాడు. యువీ అధికారికంగా ‘రిటైర్’ అయ్యాడు కాబట్టి కెనడా గ్లోబల్ టి20 లీగ్, అబుదాబి టి10 టోర్నీలో కూడా ఆడేందుకు బీసీసీఐ అనుమతి ఇచ్చింది. ఇప్పుడు యువీ మళ్లీ ఆడాలంటే బీసీసీఐ అనుమతి తప్పనిసరి. మరోవైపు బెంగాల్ జట్టు ప్రకటించిన ప్రాబబుల్స్‌లో అవకాశం దక్కించుకున్న ఆల్‌రౌండర్ మొహమ్మద్ కైఫ్... భారత పేసర్ షమీ తమ్ముడు కావడం విశేషం. క్వాలిఫయర్‌తో భారత్ తొలి పోరు దుబాయ్ : న్యూజిలాండ్ వేదికగా 2022 ఫిబ్రవరి–మార్చిలో జరిగే మహిళల వన్డే క్రికెట్ ప్రపంచకప్ షెడ్యూల్‌ను మంగళవారం విడుదల చేశారు. 8 జట్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగే ఈ మెగా ఈవెంట్లో భారత్ తమ తొలి పోరును మార్చి 6న క్వాలిఫయర్‌తో ఆడనుంది. ఆ తర్వాత భారత్ వరుసగా న్యూజిలాండ్ (మార్చి 10న), క్వాలిఫయర్ (మార్చి 12న), ఇంగ్లండ్ (మార్చి 16న), ఆస్ట్రేలియా (మార్చి 19న), క్వాలిఫయర్ (మార్చి 22న), దక్షిణాఫ్రికా (మార్చి 27న) జట్లతో తలపడుతుంది. -
నాకు మిగిలింది ఏడేళ్లు మాత్రమే: శ్రీశాంత్
న్యూఢిల్లీ: ఐపీఎల్–2013లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి ఏడేళ్ల శిక్షా కాలాన్ని ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగియనున్న భారత వెటరన్ పేసర్ శ్రీశాంత్ త్వరలోనే క్రికెట్ ఆడనున్నాడు. కేరళ ఆటగాడైన శ్రీశాంత్‌ను ఆ జట్టు రంజీ ట్రోఫీల్లో అవకాశం కోసం తీవ్రంగా ఎదురుచూస్తున్నాడు. కాగా రాబోయే రోజుల్లో అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకుంటానని సోషల్ మీడియాలో శ్రీకాంత్ తెలిపాడు. అయితే ప్రస్తుతం తనకు 37 ఏళ్లని, ఇంకా కేవలం ఏడేళ్లు మాత్రమే తనకు అవకాశముందని అన్నాడు. ఉన్న సమయాన్ని అద్భుతంగా ఉపయోగించుకొని మెరుగ్గా రాణిస్తానని తెలిపాడు. కాగా, వచ్చే ఏడాది ఐపీఎల్‌తో పాటు వరల్డ్‌కప్‌ల్లో ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇటీవల శ్రీశాంత్ పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా వచ్చే ఏడాది ఐపీఎల్‌కు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. అయితే క్రికెట్ అంటే తనకు ప్రాణమని, ఏ జట్టులోనైనా ఆడేందుకు సిద్దమని శ్రీశాంత్ తెలిపాడు. మరోవైపు ఐపీఎల్లో ఏ జట్టులో ఆడేందుకు మొదటి ప్రాధాన్యత ఇస్తారని అడగగా, తాను ముంబై ఇండియన్స్‌తో ఆడటానికి ఇష్టపడతానని అన్నాడు. గతంలో ముంబైకు ఆడిన సందర్భంలో తనకు లభించిన మద్దతు కారణంగానే ఆ జట్టుకు మొదటి ప్రాముఖ్యత ఇస్తానని శ్రీశాంత్ పేర్కొన్నాడు. -
‘అలా అయితే ఈ ఏడాది ఐపీఎల్‌లోనే ఆడతా’
న్యూఢిల్లీ: ఐపీఎల్–2013లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి ఏడేళ్ల శిక్షా కాలాన్ని ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగించుకోబోతున్న భారత వెటరన్ పేసర్ శ్రీశాంత్ రీఎంట్రీ దాదాపు షురూ అయ్యింది. కేరళ ఆటగాడైన శ్రీశాంత్‌ను ఆ జట్టు రంజీ ట్రోఫీల్లో తీసుకోవడానికి ఇప్పటికే సుముఖంగా ఉన్న నేపథ్యంలో అతని పునరాగమనం ఖాయమైంది. కాగా, వచ్చే ఏడాది ఐపీఎల్‌తో పాటు వరల్డ్‌కప్‌ల్లో ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్న శ్రీశాంత్ తనకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నాడు. దీనిలో భాగంగా వచ్చే ఏడాది ఐపీఎల్‌కు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. (‘భజ్జీపై నిషేధం వద్దని ఏడుస్తూ వేడుకున్నా’) క్రిక్ ట్రేకర్‌తో ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్లో మాట్లాడిన శ్రీశాంత్.. ఐపీఎల్లో ఏయే జట్లకు ఆడాలనే ఉందనే విషయాన్ని వెల్లడించాడు. తన తొలి ప్రాధాన్యత ముంబై ఇండియన్స్‌గా శ్రీశాంత్ పేర్కొన్నాడు. గతంలో ముంబైకు ఆడిన సందర్భంలో తనకు లభించిన మద్దతు కారణంగానే ఆ జట్టుకు మొదటి ప్రాముఖ్యత ఇస్తున్నట్లు తెలిపాడు. సచిన్ టెండూల్కర్‌తో పాటు సపోర్టింగ్ స్టాఫ్ నుంచి తనకు ఎంతగానో సహకారం లభించిన విషయాన్ని శ్రీశాంత్ ప్రస్తావించాడు. మరొకవైపు విరాట్ కోహ్లి నేతృత్వం వహించే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో పాటు, ఎంఎస్ ధోని సారథ్యం వహించే చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే)కు కూడా ఆడాలని ఉందన్నాడు. ఈ మూడు జట్లలో ఒకదానికి ఆడాలని అనుకుంటన్నట్లు శ్రీశాంత్ మనసులోని మాటను వెల్లడించాడు. కాగా, చివరకు ఏ జట్టు తనను తీసుకున్నా ఆడతానన్నాడు. ‘ ముంబైకు తొలి ప్రాధాన్యత. ఆ తర్వాత ఆర్సీబీ, సీఎస్కేలకు ఆడాలనుకుంటున్నా. ఒక వేళ ఆ మూడు జట్లు కాకపోతే ఏ జట్టు తీసుకున్నా ఆడతా. క్రికెట్ అభిమానిగా ముంబై ఇండియన్స్ అంటే బాగా ఇష్టం. దిగ్గజ క్రికెటర్ సచిన్ పాజీని కలిసే అవకాశం ఉంటుంది. సచిన్ నుంచి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. అవకాశం వస్తే ముంబైకు ఆడటానికి సిద్ధంగా ఉన్నా’ అని శ్రీశాంత్ తెలిపాడు. కాగా, ఈ ఏడాది ఐపీఎల్ జరిగితే చాలా మంది విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉండకపోవచ్చన్న శ్రీశాంత్.. అప్పుడు మరింతమంది భారత ఆటగాళ్లకు అవకాశం లభిస్తుందన్నాడు. అలా జరిగితే తనకు కూడా చాన్స్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ అరంగేట్రంలోనే ముంబై ఇండియన్స్‌కు శ్రీశాంత్ ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. -
‘భజ్జీపై నిషేధం వద్దని ఏడుస్తూ వేడుకున్నా’
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)చరిత్రలో మనకు బాగా గుర్తుండిపోయే వివాదాస్పద ఘటనల్లో హర్భజన్ సింగ్-శ్రీశాంత్‌ల మధ్య రగడ. 2008 సీజన్లో శ్రీశాంత్‌ను హర్భజన్ సింగ్ బహిరంగంగా చెంపపై కొట్టడం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ఐపీఎల్ ఆరంభపు సీజన్లోనే కింగ్స్ పంజాబ్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓడిపోయిన తర్వాత శ్రీశాంత్ చెంపను భజ్జీ చెల్లుమనిపించాడు. అయితే ఆ తర్వాత వెంటనే శ్రీశాంత్‌కు భజ్జీ క్షమాపణలు చెప్పడం, అదే రాత్రి ఇద్దరూ కలిసి డిన్నర్ చేయడంతో దానికి ముగింపు పలకాలనుకున్నారు. కాగా, ఈ వ్యవహారాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సీరియస్‌గా తీసుకుంది. ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది. అయితే బీసీసీఐ ఏర్పాటు చేసిన కమిషన్ విచారణకు హాజరైన క్రమంలో భజ్జీపై ఎటువంటి నిషేధం విధించవద్దని శ్రీశాంత్ వేడుకున్నాడట. (‘టీమిండియా.. పేస్ బౌలింగ్‌తో భయపెడితేనే’) ఈ విషయాన్ని శ్రీశాంత్ తాజాగా వెల్లడించాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌తో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై నిషేధాన్ని ముగించుకోనున్న శ్రీశాంత్.. తన రీఎంట్రీపై ఆసక్తిగా ఉన్నాడు. ఐపీఎల్‌తో పాటు వరల్డ్‌కప్‌ల్లో ఆడాలనే లక్ష్యంగా పెట్టుకున్నానన్నాడు. తాజాగా క్రికెట్ ఎడిక్టర్‌తో మాట్లాడిన శ్రీశాంత్.. భజ్జీతో వివాదాన్ని గుర్తు చేసుకున్నాడు. ‘ ఆ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్(సచిన్ పాజీ) ఉన్న జట్టులోనే నేను, భజ్జీ ఉన్నాం. నా చెంపపై భజ్జీ కొట్టిన తర్వాత సచిన్ మా మధ్య వివాదాన్ని సద్దుమణిగేలా చేశాడు. అందుకు సచిన్‌కు థాంక్స్ చెప్పాలి. ఆ రోజు రాత్రి మేమంతా కలిసి డిన్నర్ చేశాం. కానీ మీడియా మాత్రం మా మధ్య జరిగిన గొడవను పెద్దదిగా చేసి చూపించింది. దాంతో బీసీసీఐ విచారణకు ఆదేశించింది. నానావతీ సర్ నన్ను విచారించారు. వీడియో క్లిప్పింగ్ చూపించి ఏమి జరిగిందని అడిగారు. నేను ఏడుస్తూ భజ్జీపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని వేడుకున్నాను. మా మధ్య వివాదం ముగిసిందని చెప్పా. మేమిద్దరం కలిసే ఆడతామని తెలిపా. మా నుంచి భజ్జీని వేరు చేయొద్దని విన్నవించా. అతనొక మ్యాచ్ విన్నర్. భారత్ తరఫున హ్యాట్రిక్ సాధించిన బౌలర్లలో భజ్జీ ఒకడు. నాకు భజ్జీ సోదర సమానుడు. ఆ వివాదాన్ని పెద్దది చేయొద్దని చెప్పా. అది ముగిసిన అధ్యాయమని విచారణలో తెలిపా. భజ్జీ ఎప్పుడూ ఒక లెజెండ్‌గానే ఉంటాడు’ అని శ్రీశాంత్ పేర్కొన్నాడు.(233 ఏళ్ల ఎంసీసీ చరిత్రలో..) -
శ్రీశాంత్.. నీ కోసమే వెయిటింగ్
తిరువనంతపురం: స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఏడేళ్ల పాటు నిషేధానికి గురైన శ్రీశాంత్ తన రీఎంట్రీపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌తో శ్రీశాంత్‌పై నిషేధం ముగియనుండటంతో క్రికెట్ పునరాగమనం కోసం యత్నాలు ఆరంభించాడు. దేశవాళీ సీజన్లో భాగంగా తన రాష్ట్ర రంజీ జట్టు కేరళతో ఆడాలనే యత్నంలో ఉన్నాడు. దీనిపై కేరళ బ్యాట్స్‌మన్ సచిన్ బేబీ మాట్లాడుతూ. శ్రీశాంత్ కోసం నిరీక్షిస్తున్నట్లు తెలిపాడు. గత ఏడేళ్లుగా శ్రీశాంత్ కేరళ జట్టుకు దూరమైన విషయాన్ని కాస్త బాధగా చెప్పిన సచిన్ బేబీ.. అతను ఎప్పుడూ జట్టుకు సలహాలు ఇస్తూ ఉండేవాడనే విషయాన్ని వెల్లడించాడు. గతంలో ప్రాక్టీస్ సెషన్లో కూడా శ్రీశాంత్ బౌలింగ్ చేసేవాడన్నాడు. (శ్రీశాంత్ మళ్లీ వస్తున్నాడు...) శ్రీశాంత్ పేస్‌లో స్వింగ్ ఎక్కువగా ఉండటంతో తాను ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడేవాడినని సరదాగా వ్యాఖ్యానించాడు. టెలివిజన్ కామేంటేటర్, ప్రజెంటర్ అరుణ్ వేణుగోపాల్‌తో ఇన్‌స్టా లైవ్ సెషన్లో అనేక విషయాలను సచిన్ బేబీ షేర్ చేసుకున్నాడు. ‘ నాకు శ్రీశాంత్ సోదరుడు లాంటివాడు. కేరళ తరఫున మళ్లీ ఆడతాడని ఏడేళ్ల నుంచి ఎదురుచూస్తున్నా.మా జట్టులోని ఆటగాళ్లంతా శ్రీశాంత్ రీఎంట్రీ ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటున్నారు. మేమిద్దరం గత కొన్నేళ్లుగా కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాం. నాకు శ్రీశాంత్ చాలా సాయం చేశాడు. ఇప్పుడు కూడా కలిసే పని చేస్తున్నాం. శ్రీశాంత్‌తో ప్రాక్టీస్ ప్రయాణం కొనసాగుతూనే ఉంది. కేరళ జట్టుకు సలహాలు ఇస్తూ సహకరిస్తున్నాడు. అతను నెట్స్‌లో బౌలింగ్ అమోఘంగా వేస్తున్నాడు. ఇది వరకు శ్రీశాంత్ బౌలింగ్ ప్రాక్టీస్ వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ఇక శ్రీశాంత్ తన ఫిట్‌నెస్‌పై శ్రద్ధ చూపించాల్సి ఉంది’ అని కేరళ మాజీ కెప్టెన్ సచిన్ బేబీ తెలిపాడు. భారత్ తరఫున 27 టెస్టులు ఆడిన శ్రీశాంత్ 87 వికెట్లు పడగొట్టాడు. 53 వన్డేల్లో 75 వికెట్లు, 10 టి20ల్లో 7 వికెట్లు తీశాడు. 2007లో టి20 ప్రపంచ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్ నెగ్గిన జట్లలో అతను సభ్యుడు కావడం విశేషం. 2013 ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడుతూ స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో దోషిగా తేలడంతో బీసీసీఐ ఏ స్థాయిలోనూ క్రికెట్ ఆడకుండా అతనిపై జీవిత కాల నిషేధం విధించింది. శ్రీశాంత్ దీనిని సవాల్ చేస్తూ కోర్టులో పోరాడాడు. హైకోర్టు కూడా అతనిపై నిషేధాన్ని సమర్థించింది. అయితే సుప్రీం కోర్టులో మాత్రం ఈ కేరళ పేసర్‌కు ఊరట లభించింది. శ్రీశాంత్‌ను దోషిగానే గుర్తించిన సుప్రీం... జీవిత కాల శిక్షను మాత్రమే తగ్గించమంటూ బీసీసీఐకి సూచించింది. దాంతో అతని శిక్షను ఏడేళ్లకు తగ్గిస్తూ బోర్డు అంబుడ్స్‌మన్ డీకే జైన్ నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం ఈ ఏడాది సెప్టెంబరుతో అతని శిక్షా కాలం పూర్తి కానుంది. (‘చాలాసార్లు చనిపోవాలనుకున్నా’)