'శ్రీశాంత్ పై నిషేధంలో బీసీసీఐ చీఫ్ శ్రీనివాసన్ దే కీలక పాత్ర' | Sreesanth to move court against life ban: Lawyer | Sakshi
Sakshi News home page

'శ్రీశాంత్ పై నిషేధంలో బీసీసీఐ చీఫ్ శ్రీనివాసన్ దే కీలక పాత్ర'

Sep 15 2013 6:53 PM | Updated on Sep 1 2017 10:45 PM

'శ్రీశాంత్ పై నిషేధంలో బీసీసీఐ చీఫ్ శ్రీనివాసన్ దే కీలక పాత్ర'

'శ్రీశాంత్ పై నిషేధంలో బీసీసీఐ చీఫ్ శ్రీనివాసన్ దే కీలక పాత్ర'

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలను ఎదుర్కొంటున్న భారత ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ పై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు విధించిన నిషేధంపై కోర్టులో సవాల్ చేయనున్నాడని అతని తరపు న్యాయవాదులు తెలిపారు.

కోచి: 

బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై కోర్టులో పిటిషన్ వేయనున్నట్టు శ్రీశాంత్ న్యాయవాది రెబెకా జాన్ ఢిల్లీలో స్థానిక మీడియా టెలివిజన్ కు తెలిపారు. అంతేకాక శ్రీశాంత్ పై జీవిత కాల నిషేధం విధించడంలో బీసీసీఐ చీఫ్ ఎన్ శ్రీనివాసన్ దే కీలక పాత్ర అని ఆరోపించారు. 
 
కోర్టు తీర్పుకోసం వేచిచూడకుండా.. ఢిల్లీ పోలీసులు ఇచ్చిన కొన్ని పేపర్ల ఆధారంగా శ్రీశాంత్ పై వేటు వేయడం అన్యాయం అని అన్నారు. ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన శ్రీశాంత్, అంకిత్ చవాన్ లపై బీసీసీఐ శుక్రవారం జీవితకాలపు నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే. 
 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement