యూరోపియన్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో భాగంగా సెప్టెంబర్ 22న జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రొమానియాకు చెందిన పావెల్ ఫ్లోరిన్ అనే క్రికెటర్ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్‌లో భాగంగా హంగేరీ జట్టు 11వ బ్యాటర్‌గా వచ్చిన అతను బౌండరీ కొట్టగానే టీమిండియా వెటరన్ స్పీడస్టర్ శ్రీశాంత్‌లా సెలబ్రేషన్‌ను చేసుకున్నాడు. విషయంలోకి వెళితే.. బౌలర్ ఆఫ్‌స్టంప్ దిశగా బంతి వేశాడు. వెంటనే ఫ్లోరిన్ మొకాళ్లపై కూర్చొని డీప్‌స్వేర్ లెగ్ మీదుగా కళ్లు చెదిరే షాట్ ఆడాడు. అనంతరం పైకి లేచి డ్రెస్సింగ్‌రూమ్ వైపు చూస్తూ బ్యాట్‌ను స్వింగ్ చేయడం ప్రారంభించాడు. అయితే అతను సెలబ్రేట్ చేసుకున్న విధానం శ్రీశాంత్ సెలబ్రేషన్‌ను గుర్తుచేసింది.
2006-07లో దక్షిణాఫ్రికా పర్యటనలో జోహెన్నెస్‌బర్గ్ వేదికగా మొదటి టెస్టు మ్యాచ్ సందర్భంగా ఇది చోటుచేసుకుంది. ఆ మ్యాచ్‌లో 11వ బ్యాటర్‌గా వచ్చిన శ్రీశాంత్‌కు ఆండ్రూ నెల్ బౌన్సర్లు సంధించాడు. దీంతో చిర్రెత్తికొచ్చిన శ్రీశాంత్ తర్వాతి బంతిని లాంగాన్ దిశగా కళ్లు చెదిరే సిక్స్ కొట్టాడు. దీంతో తన సంతోషాన్ని తట్టుకోలేక బ్యాట్‌ను స్వింగ్ చేస్తూ డ్యాన్స్ చేయడం అప్పట్లో వైరల్‌గా మారింది. అంతేకాదు ఈ మ్యాచ్ శ్రీశాంత్‌కు మరపురానిగా మిగిలింది. ఓవరాల్‌గా బౌలర్‌గా ఈ మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లు తీసుకున్న శ్రీశాంత్ ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు అందుకోవడం విశేషం. తాజాగా ఫ్లోరిన్‌ను శ్రీశాంత్‌తో పోలుస్తూ ఫ్యాన్స్ కామెంట్ చేశారు.
చదవండి: Rohit Sharma: రోహిత్ శర్మ అరుదైన ఘనత.. ఐపీఎల్ చరిత్రలో తొలి బ్యాటర్‌గా
it's my first boundary
— Pavel Florin (@PavelFlorin13) September 22, 2021
in the European Cricket Championship so a celebration is needed !!! @EuropeanCricket #cricket pic.twitter.com/CQI4bRNSib
Comments
Please login to add a commentAdd a comment