న్యూఢిల్లీ: ఐపీఎల్–2013లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి ఏడేళ్ల శిక్షా కాలాన్ని ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగియనున్న భారత వెటరన్ పేసర్ శ్రీశాంత్ త్వరలోనే క్రికెట్ ఆడనున్నాడు. కేరళ ఆటగాడైన శ్రీశాంత్‌ను ఆ జట్టు రంజీ ట్రోఫీల్లో అవకాశం కోసం తీవ్రంగా ఎదురుచూస్తున్నాడు. కాగా రాబోయే రోజుల్లో అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకుంటానని సోషల్ మీడియాలో శ్రీకాంత్ తెలిపాడు. అయితే ప్రస్తుతం తనకు 37 ఏళ్లని, ఇంకా కేవలం ఏడేళ్లు మాత్రమే తనకు అవకాశముందని అన్నాడు. ఉన్న సమయాన్ని అద్భుతంగా ఉపయోగించుకొని మెరుగ్గా రాణిస్తానని తెలిపాడు.
కాగా, వచ్చే ఏడాది ఐపీఎల్‌తో పాటు వరల్డ్‌కప్‌ల్లో ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇటీవల శ్రీశాంత్ పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా వచ్చే ఏడాది ఐపీఎల్‌కు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. అయితే క్రికెట్ అంటే తనకు ప్రాణమని, ఏ జట్టులోనైనా ఆడేందుకు సిద్దమని శ్రీశాంత్ తెలిపాడు. మరోవైపు ఐపీఎల్‌లో ఏ జట్టులో ఆడేందుకు మొదటి ప్రాధాన్యత ఇస్తారని అడగగా, తాను ముంబై ఇండియన్స్‌తో ఆడటానికి ఇష్టపడతానని అన్నాడు. గతంలో ముంబైకు ఆడిన సందర్భంలో తనకు లభించిన మద్దతు కారణంగానే ఆ జట్టుకు మొదటి ప్రాముఖ్యత ఇస్తానని శ్రీశాంత్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment