
ముంబై: గతేడాది ఐపీఎల్ టోర్నీని ఆలస్యం చేసిన కరోనా మహమ్మారి చివరకు ఆపలేకపోయింది. మెరుపుల లీగ్ యూఏఈలో విజయవంతమైంది. అయితే ఐపీఎల్ బ్రాండ్ విలువపై మాత్రం కోవిడ్ ప్రభావం చూపింది. 2019 సీజన్‌తో పోలిస్తే 2020 ఐపీఎల్ విలువ 3.6 శాతం తగ్గింది. 2019లో ఐపీఎల్ క్రితం సీజన్ కంటే 7 శాతం పెరుగుదల నమోదు చేసి రూ. 47,500 కోట్లకు లీగ్ విలువను పెంచుకుంది. కానీ గత సీజన్ కరోనా దెబ్బ వల్ల రూ.45,800 కోట్లకు తగ్గింది. ఫ్రాంచైజీల్లో వరుసగా ఐదో ఏడాది కూడా ముంబై ఇండియన్స్ అత్యధిక బ్రాండ్ విలువను కలిగి వుంది. స్వల్పంగా 5.9 శాతం క్షీణించినా... అపర కుబేరుడు అంబానీ టీమ్ రూ.761 కోట్లతో టాప్‌లో ఉంది. తర్వాత చెన్నై, కోల్‌కతాలు వరుసగా రూ.611 కోట్లు, రూ.543 కోట్లతో టాప్–3లో నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment