IPL 2020
-
కుటుంబంలో పెను విషాదం.. అందుకే ఆ నిర్ణయం: రైనా
‘‘అప్పుడు కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అందుకే పంజాబ్‌కు వెళ్లాల్సి వచ్చింది. మా అంకుల్ కుటుంబంలో మరణాలు సంభవించాయి. ఒంటికి నూనె రాసుకుని దాడులకు పాల్పడే కచ్చా గ్యాంగ్.. గ్యాంగ్స్టర్స్ వాళ్ల కుటుంబం మొత్తాన్ని చంపేశారు. అప్పుడు మా బామ్మ కూడా అక్కడే ఉంది. పఠాన్‌కోట్‌లో ఈ దుర్ఘటన జరిగింది. అందుకే నేను అక్కడికి వెళ్లాను. అప్పటికే ఐపీఎల్లో బయో బబుల్ నిబంధనలు మొదలయ్యాయి. కాబట్టి తిరిగి జట్టుతో కలిసే పరిస్థితి లేదు. ఆ ఘటనతో మా నాన్న అప్పటికే నైరాశ్యంలో మునిగిపోయారు. అప్పుడు నాకు నా కుటుంబమే మొదటి ప్రాధాన్యంగా కనిపించింది. క్రికెట్ కావాలంటే ఎప్పుడైనా ఆడుకోవచ్చు. కష్టకాలంలో మాత్రం ఫ్యామిలీకి అండగా ఉండాలని ఆలోచించాను. ఈ విషయాన్ని నేను ఎంఎస్ ధోని, మేనేజ్మెంట్కు చెప్పాను. అందుకే జట్టును వీడాను. నేను తిరిగి వచ్చిన తర్వాత 2021 సీజన్ ఆడాను. 2021లో ట్రోఫీ గెలిచాం. అయితే, అంతకు గతేడాది ముందు మా కుటుంబంలో ఇలాంటి పెను విషాదం చోటుచేసుకుంది. అప్పటికే కోవిడ్-19 కారణంగా అందరూ డిప్రెషన్లో మునిగిపోయి ఉన్నారు. అలాంటి సమయంలో ఇలా ఆప్తులను కోల్పోవడం నిజంగా మా అందరినీ కుంగదీసింది. కాబట్టి ఆట కంటే ఫ్యామిలీ వైపే మొగ్గుచూపాను’’ అని చెన్నై సూపర్ కింగ్స్ మాజీ క్రికెటర్ సురేశ్ రైనా చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్-2020 ఆరంభానికి ముందే జట్టును వీడేందుకు గల కారణాలను తాజాగా లలన్‌టాప్ షోలో వెల్లడించాడు. విపత్కర పరిస్థితుల్లో కుటుంబానికి తోడుగా ఉండేందుకు ఆ సీజన్ మొత్తానికి దూరమయ్యానని రైనా చెప్పుకొచ్చాడు. అయితే, మరుసటి ఏడాది తిరిగి వచ్చిన తర్వాత సీఎస్కే మరోసారి చాంపియన్‌గా నిలవడం సంతోషాన్నిచ్చిందని రైనా హర్షం వ్యక్తం చేశాడు. కాగా ఐపీఎల్-2020లో చెన్నై దారుణ ప్రదర్శనతో విమర్శల పాలైన విషయం తెలిసిందే. పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం ఆరు గెలిచి పాయింట్ల పట్టిక(అప్పటికి ఎనిమిది జట్లు)లో ఏడో స్థానంలో నిలిచింది. రైనాతో పాటు కీలక ఆటగాళ్లు దూరం కావడంతో విఫలమై పరాభవం మూటగట్టుకుంది. అయితే, 2021లో విజేతగా నిలిచి నాలుగోసారి ట్రోఫీని ముద్దాడింది సీఎస్కే. 2022లో మళ్లీ దారుణంగా ఆడి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానాని(పద్నాలుగు గెలిచినవి నాలుగు)కి దిగజారిన సీఎస్కే అనూహ్య రీతిలో గతేడాది ఐదోసారి చాంపియన్‌గా అవతరించింది. ఇక ఉత్తరప్రదేశ్‌కు చెందిన సురేశ్ రైనా తన ఐపీఎల్ కెరీర్లో 205 మ్యాచ్‌లు ఆడి 5528 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది. తన ఆట తీరుతో రైనా ‘మిస్టర్ ఐపీఎల్’గా ప్రసిద్ధి పొందాడు. అదే విధంగా ‘చిన్న తలా’గా సీఎస్కే ఫ్యాన్స్ అభిమానం పొందాడు. కాగా రైనా ధోనికి అత్యంత ఆప్తుడన్న విషయం తెలిసిందే. చదవండి: T20 Captain: ‘రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే.. ఎనీ డౌట్?’ -
'కోహ్లి స్లెడ్జింగ్ వేరే లెవెల్.. తలదించుకొనే బ్యాటింగ్ కొనసాగించా'
ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ టీమిండియా మెషిన్ గన్ విరాట్ కోహ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి స్లెడ్జింగ్ వేరే లెవెల్లో ఉంటుందని.. మనం తట్టుకోవడం కష్టమంటూ పేర్కొన్నాడు. గౌరవ్ కపూర్ నిర్వహించిన బ్రేక్‌ఫాస్ట్ విత్ చాంపియన్స్ యూట్యూబ్ షోలో సూర్యకుమార్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2020 సీజన్లో ముంబై ఇండియన్స్, ఆర్సీబీ మధ్య కీలకమైన ప్లేఆఫ్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో కోహ్లితో జరిగిన అనుభవాన్ని సూర్య ఆసక్తికరంగా చెప్పుకొచ్చాడు. ''165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగాం. అయితే రెండు వికెట్లు కోల్పోవడంతో మా చేజింగ్ కాస్త స్లోగా సాగుతుంది. ఎలాగైనా మ్యాచ్ గెలవాలనే పట్టుదలతో ఎవరు ఏం చేసినా నా బ్యాటింగ్ ఫోకస్‌ను కోల్పోకూడదని భావించాను. కానీ అప్పటి ఆర్సీబీ కెప్టెన్ కోహ్లి రూపంలో నాకు ఎదురుగా కనిపించాడు. గ్రౌండ్లో ఉంటే కోహ్లి ఎనర్జీ లెవెల్స్ వేరుగా ఉంటాయి. అతను పొరపాటు స్లెడ్జింగ్‌కు దిగాడో తట్టుకోవడం కష్టం. ఒక రకంగా కోహ్లికి ఎనర్జీ లాంటిది. తన చర్యలతో ప్రత్యర్థి జట్ల బ్యాట్స్మెన్లను కన్ఫూజ్ చేస్తాడు. అతని మాయలో పడకూడదని గట్టిగా ఫిక్స్ అయ్యా. పైగా ఇరుజట్లకు అది కీలక మ్యాచ్. ఓడిన జట్టు ఇంటికి.. గెలిచిన జట్టు ఫైనల్‌కు. ఈ పరిస్థితుల్లో కోహ్లి కళ్లలో పడకూడదనే ఉద్దేశంతో బ్యాటింగ్ కొనసాగించా. కోహ్లి నాకు ఎదురుగా ఉన్నప్పుడు తలదించుకొని బ్యాటింగ్ చేశా. దీనివల్ల నా ఫోకస్ దెబ్బతినలేదు. నేను బ్యాటింగ్ చేస్తున్నంత సేపు కోహ్లిని నేను ఏమి అనలేదు.. నన్ను కోహ్లి ఎలాంటి స్లెడ్జ్ చేయలేదు. మ్యాచ్ విజయానికి చేరువవుతున్న తరుణంలో మనుసులో ఈ విధంగా అనుకున్నా.'' ఇంతవరకు అంతా సక్రమంగానే జరిగింది. ఇంకో 10 సెకన్లు ఓపిక పడితే మ్యాచ్ గెలుస్తాం.. ఈ సమయంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదు''.. ఇక కోహ్లి ఒక సందర్బంలో నా దగ్గరికి వచ్చాడు. కానీ అదే సమయంలో నా బ్యాట్ కిందపడిపోవడంతో ఏం మాట్లాడకుండా బ్యాట్ తీసుకోవడానికి కిందకు వంగాను. కోహ్లి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మేము మ్యాచ్ గెలవడం.. ఆపై టైటిల్ గెలవడం జరిగిపోయింది'' అంటూ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2020 సీజన్లో ముంబై ఇండియన్స్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్లో ముంబై ఇండియన్స్ ఐదు వికెట్ల తేడాతో నెగ్గి ఐదోసారి ఐపీఎల్ టైటిల్ ఎగురేసుకపోయింది. చదవండి: IPL 2022: కోహ్లి చెత్త రికార్డు.. ప్లీజ్.. భారంగా మారొద్దు.. ఇకనైనా! Kohli-Wasim Jaffer: కోహ్లి పరిస్థితిని కళ్లకు కట్టిన టీమిండియా మాజీ క్రికెటర్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రాయల్స్ రాజసం
అబుదాబి: యశస్వీ జైస్వాల్ (21 బంతుల్లో 50; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) ‘పవర్’ గేమ్, శివమ్ దూబే (42 బంతుల్లో 64 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్ రాజస్తాన్ రాయల్స్‌ను గెలిపించాయి. ఐపీఎల్లో శనివారం జరిగిన భారీ స్కోర్ల మ్యాచ్‌లో రాయల్స్ ఏడు వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌కు షాక్ ఇచి్చంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్‌కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 189 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రుతురాజ్ గైక్వాడ్ (60 బంతుల్లో 101 నాటౌట్; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) ‘శత’గ్గొడితే... ఆఖర్లో రవీంద్ర జడేజా (15 బంతుల్లో 32 నాటౌట్) చితగ్గొట్టాడు. తర్వాత రాజస్తాన్ రాయల్స్ 17.3 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసి గెలిచింది. యశస్వీ, దూబే అర్ధసెంచరీలతో చెలరేగారు. వరుసగా నాలుగు విజయాల తర్వాత చెన్నైకిదే తొలి ఓటమి. తాజా గెలుపుతో రాజస్తాన్ ‘ప్లే ఆఫ్స్’ రేసులో సజీవంగా ఉంది. రుతురాజ్ సూపర్ ఇన్నింగ్స్... చెన్నై ఆట రుతురాజ్ బౌండరీతో మొదలైంది. ఆఖరి బంతికి అతడు కొట్టిన సిక్సర్‌తోనే ఇన్నింగ్స్ ముగిసింది. జట్టు చేసిన 189 పరుగుల్లో అతనొక్కడే వందకొట్టాడు. డుప్లెసిస్ (25; 2 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి తొలి వికెట్‌కు 47 పరుగులు, మొయిన్ అలీ (17 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్)తో కలిసి మూడో వికెట్‌కు 57 పరుగులు జోడించాడు. అతని వేగంతో జట్టు 14వ ఓవర్లో 100 పరుగులు దాటింది. గైక్వాడ్ 43 బంతుల్లో (6 ఫోర్లు) అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. జడేజా ఆఖర్లో దూకుడుగా ఆడాడు. ఆఖరి బంతిని సిక్సర్‌గా బాదడంతో రుతురాజ్ 60 బంతుల్లో సెంచరీ సాధించాడు. తొలి బంతి నుంచే... భారీస్కోరు చేశామన్న చెన్నై ధీమా సన్నగిల్లేందుకు ఎంతో సేపు పట్టలేదు. లూయిస్ (12 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి యశస్వీ జైస్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రత్యేకించి హాజల్‌వుడ్‌పై వీరంగమే చేశాడు. అతని రెండు ఓవర్లను (2, 5వ) జైస్వాలే ఆడి... ఆ 12 బంతుల్లో 2, 4, 0, 2, 4, 4, 0, 6, 6, 4, 6, 0 విధ్వంసంతో 38 పరుగులు పిండుకున్నాడు. అలా రాజస్తాన్ నాలుగో ఓవర్లలోనే 50 పరుగులు దాటేయగా... యశస్వీ 19 బంతుల్లోనే (6 ఫోర్లు, 3 సిక్సర్లు) ఫిఫ్టీ కొట్టాడు. ఆరో ఓవర్లో లూయిస్‌ను శార్దుల్ పెవిలియన్ చేర్చా డు. పవర్ ప్లేలో రాయల్స్ 81/1 స్కోరు చేసింది. ఏడో ఓవర్ తొలి బంతికి యశస్వీ విధ్వంసానికి ఆసిఫ్ చెక్ పెట్టాడు. అనంతరం కెప్టెన్ సామ్సన్ (28; 4 ఫోర్లు) , శివమ్ దూబే జట్టును విజయానికి చేరువ చేశారు. దూబే 31 బంతుల్లో (2 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ శతకం చేశాడు. మూడో వికెట్‌కు ఇద్దరు 89 పరుగులు జోడించారు. సామ్సన్ ఔటైనా... దూబే, గ్లెన్ ఫిలిప్స్ (14 నాటౌట్; ఫోర్, సిక్స్) జట్టును విజయతీరానికి చేర్చారు. స్కోరు వివరాలు చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (నాటౌట్) 101; డుప్లెసిస్ (స్టంప్డ్) సామ్సన్ (బి) తెవాటియా 25; రైనా (సి) దూబే (బి) తెవాటియా 3; అలీ (స్టంప్డ్) సామ్సన్ (బి) తెవాటియా 21; రాయుడు (సి) ఫిలిప్స్ (బి) సకారియా 2; జడేజా (నాటౌట్) 32; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 189. వికెట్ల పతనం: 1–47, 2–57, 3–114, 4–134. బౌలింగ్: ఆకాశ్ సింగ్ 4–0–39–0, సకారియా 4–0–31–1, ముస్తఫిజుర్ 4–0–51–0, తెవాటియా 4–0–39–3, మార్కండే 3–0–26–0, ఫిలిప్స్ 1–0–3–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: లూయిస్ (సి) హాజల్‌వుడ్ (బి) శార్దుల్ 27; జైస్వాల్ (సి) ధోని (బి) ఆసిఫ్ 50; సామ్సన్ (సి) గైక్వాడ్ (బి) శార్దుల్ 28; శివమ్ దూబే (నాటౌట్) 64; ఫిలిప్స్ (నాటౌట్) 14; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం ( 17.3 ఓవర్లలో 3 వికెట్లకు) 190. వికెట్ల పతనం: 1–77, 2–81, 3–170. బౌలింగ్: స్యామ్ కరన్ 4–0–55–0, హాజల్‌వుడ్ 4–0–54–0, శార్దుల్ 4–0–30–2, ఆసిఫ్ 2.1–0–18–1, మొయిన్ అలీ 2.2–0–23–0, జడేజా 1–0–9–0. -
Suryakumar Yadav: కోహ్లి నన్ను స్లెడ్జ్ చేశాడు.. సంతోషం!
వెబ్‌డెస్క్: సూర్యకుమార్ యాదవ్.. గత కొన్నేళ్లుగా పొట్టి ఫార్మాట్లో అద్భుతమైన ఆటతో ఆకట్టుకుంటున్న క్రికెటర్. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. స్వదేశంలో ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భాగంగా టీమిండియా ప్రాబబుల్స్‌లో చోటు దక్కించుకున్న సూర్యకుమార్ యాదవ్.. రెండో టీ20 ద్వారా అరంగేట్రం చేశాడు. అయితే, ఆ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లి, మరో అరంగేట్ర ఆటగాడు ఇషాన్ కిషన్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో సూర్యకుమార్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఈ క్రమంలో నాలుగో టీ20 ద్వారా టీమిండియాకు ఆడాలన్న తన కల నెరవేర్చుకున్న సూర్య.. సిక్సర్‌తో అంతర్జాతీయ క్రికెట్లో పరుగుల ఖాతా తెరిచాడు. అంతేగాక, తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ కొట్టిన ఐదో భారత క్రికెటర్‌గా ఘనత సాధించాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్ గురించి కాసేపు పక్కన పెడితే.. తనకెంతగానో గుర్తింపు తీసుకువచ్చిన ఐపీఎల్, ముఖ్యంగా తాను ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై జట్టు అంటే సూర్యకుమార్‌కు ప్రత్యేక అభిమానం అన్న సంగతి తెలిసిందే. కోహ్లి వర్సెస్ సూర్య! ఇక గతేడాది సీజన్లో అద్భుతంగా రాణించిన సూర్య... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన కీలకమైన మ్యాచ్‌లో జట్టును గెలిపించి.. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచి ఐపీఎల్-2020 ఆల్బమ్‌లో మరో జ్ఞాపకాని చేర్చుకున్నాడు. అతడి ఇన్నింగ్స్ కారణంగా, ముంబై ఎనిమిదో విజయం తన ఖాతాలో వేసుకుని ప్లేఆఫ్స్‌కు చేరువైంది. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి, సూర్యకుమార్ మధ్య జరిగిన ఘటన ఐపీఎల్ ప్రేమికులకు గుర్తుండే ఉంటుంది. ఈ మ్యాచ్‌లో 13వ ఓవర్లో కోహ్లి బంతిని షైన్ చేస్తూ సూర్య వద్దకు వచ్చిన కోహ్లి దూకుడుగా వ్యవహరించాడు. అద్భుతమైన షాట్లు ఆడుతున్న అతడితో వాగ్వాదానికి సిద్ధమయ్యాడు. అయితే సూర్యకుమార్ ఏమాత్రం స్పందన లేకుండా కళ్లతోనే బదులిస్తూ, కోహ్లికి దూరంగా వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాజాగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన లైవ్ చాట్‌లో ఈ ఘటన గురించి ప్రస్తావన రాగా సూర్యకుమార్ తనదైన శైలిలో స్పందించాడు. ‘‘కోహ్లి మైదానంలో చాలా ఎగ్జైటెడ్‌గా ఉంటాడు. కేవలం నాతోనే కాదు, ఏ బ్యాట్స్‌మెన్‌తోనైనా అలాగే దూకుడుగా ఉంటాడు. నిజానికి తను నన్ను స్లెడ్జ్ చేసినందుకు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే... నేను బాగా ఆడితే మ్యాచ్ గెలుస్తామని తను భావించాడు. నా వికెట్ తీయాలని, తద్వారా గెలుపొందాలని వారి వ్యూహం. అంటే, నా బ్యాటింగ్ వల్ల వారికి ప్రమాదం పొంచి ఉందనే అర్థం కదా. అయితే ఇదంతా ఆట వరకే. నిజానికి కోహ్లి అంటే నాకు చాలా గౌరవం ఉంది. ఘటన తర్వాత, మైదానం వెలుపల తను నాతో ఎంతో నార్మల్‌గా ఉన్నాడు’’ అని చెప్పుకొచ్చాడు. అదే విధంగా, తనకు అవకాశం వచ్చినపుడు కచ్చితంగా బౌలింగ్ కూడా చేస్తానని పేర్కొన్నాడు. కాగా ఆ మ్యాచ్‌లో సూర్యకుమార్ (43 బంతుల్లో 79 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) సూపర్ ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. చదవండి: England Tour: ‘బయో బబుల్’లోకి కోహ్లి, రోహిత్ -
కాస్కోండి.. మిమ్ముల్ని చితక్కొట్టడానికి వస్తున్నాడు!
ముంబై: గత ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఏడో స్థానానికి పరిమితం కావడంతో ఆ జట్టులో పస అయిపోయిదంటూ విమర్శలు వినిపించాయి. ఈ సీజన్ ఆరంభానికి ముందు కూడా ‘సీనియర్ సిటిజన్ అంటూ వ్యంగ్యాస్త్రాలు మొదలయ్యాయి. ఐపీఎల్-14 సీజన్లో కూడా గత జట్టుతోనే సీఎస్కే బరిలోకి దిగడమే అందుకు కారణం కావొచ్చు. అయితే సూపర్ కింగ్స్‌కు కర్త, కర్మ, క్రియగా సర్వం తానే అయి నడిపించే ధోని ఉండగా ఏదీ అసాధ్యం కాదని ఆ జట్టు నమ్ముతోంది. అందుకు తగ్గట్టుగానే ధోని అందరికంటే ముందుగానే ఐపీఎల్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. వరుసగా ధోని ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలను చూస్తే ఫుల్ రిథమ్‌లో కనిపిస్తున్నాడు. భారీ షాట్లు కొట్టడంలో సిద్ధహస్తుడైన ధోని.. ఈసారి మాత్రం తన పవర్ ఏమిటో మళ్లీ చూపించాలనే ఉద్దేశమే అతని ప్రాక్టీస్‌లో కనిపిస్తోంది. ఇదే విషయాన్ని సీఎస్కే కూడా తాజాగా స్సష్టం చేసింది. బౌలర్లు.. మిమ్ముల్ని చితక్కొట్టడానికి తలా పరాక్ ఫుల్లీ లోడెడ్‌గా వస్తున్నాడు..విజిల్‌పోడు’ అంటూ ప్రత్యర్థి జట్లకు వార్నింగ్ కూడా ఇచ్చేసింది. దీనికి సంబంధించిన వీడియోను సీఎస్కే ఫ్రాంచైజీ ఇన్స్టాలోషేర్ చేసింది. సీఎస్కే ఫ్యాన్స్‌ను అలరించే ఈ వీడియోలో కొన్ని ధోని మార్కు షాట్లు ఉన్నాయి. వన్ హ్యాండెడ్ షాట్ కూడా ఇందులో ఉంది. గత ఐపీఎల్ సీజన్లో సీఎస్కే జట్టు తరఫున సురేశ్ రైనా ఆడకపోవడం కూడా ప్రభావం చూపించింది. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల యూఏఈ నుంచి రైనా ఉన్నపళంగా స్వదేశానికి వచ్చేశాడు. దానిపై అప్పట్లో పెద్ద విమర్శలే వచ్చాయి. అసలు రైనా భవితవ్యం ఏమిటి అని ప్రశ్న తలెత్తింది. అప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన రైనా.. సీఎస్కే జట్టును వీడి రావడంపై అనేక అనుమానాలు వచ్చాయి. కానీ ఈసారి రైనా తిరిగి సీఎస్కే ఆడుతుండటంతో గత సీజన్ ఘటనకు ఫుల్స్టాప్ పడింది. ఇప్పుడు రైనా రాకతో సీఎస్కే మంచి జోష్‌లోనే ఉంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో రైనా రెండో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్లో 5,368 పరుగులు సాధించాడు. ఇక్కడ చదవండి: IPL 2021: వాంఖడేలో మ్యాచ్‌లపై ఎంసీఏ స్పష్టత ఆర్సీబీ నా మాట వినండి.. ఏబీని అలా చేయవద్దు! View this post on Instagram A post shared by Chennai Super Kings (@chennaiipl) -
మెరుపులాంటి ఫీట్లు.. మతిపోయే క్యాచ్‌లు
క్యాచెస్ విన్ మ్యాచెస్.. ఇది అక్షర సత్యం. క్యాచ్‌లు పడితేనే క్రికెట్ మ్యాచ్‌లను గెలవలం. క్యాచ్‌లు డ్రాప్ చేసిన కారణంగానే వరల్డ్‌కప్ లాంటి మెగా ట్రోఫీలను కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. క్రికెట్ మ్యాచ్‌లో క్యాచ్‌లకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. మ్యాచ్ టర్న్ కావడంలో ఫీల్డర్లు అందుకునే అద్భుతమైన క్యాచ్‌లు కీలక పాత్ర పోషిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. వరల్డ్ క్రికెట్లోనే కాదు.. ఐపీఎల్ వంటి క్యాష్ రిచ్ లీగ్‌లో కూడా ఫీల్డర్లు ఫీల్డింగ్ విన్యాసాలతో ఆకట్టుకున్న సందర్భాలు ఎన్నో. బౌండరీల వద్ద స్టన్నింగ్ క్యాచ్‌లు, సింగిల్ హ్యాండెడ్ క్యాచ్‌లు, అమాంతం గాల్లోకి ఎగిరి ఫీల్డర్లు ఒడిసి పట్టుకునే క్యాచ్‌లు ఇలా ఎన్నో ఉన్నాయి. గత ఐపీఎల్ సీజన్లో కూడా అద్భుతమైన ఫీల్డింగ్ మెరుపుల్ని చూశాం. ఈ సీజన్లో కూడా ఆ విన్యాసాల్ని కచ్చితంగా చూస్తాం కూడా. మరి ఐపీఎల్-14 సీజన్ ఆరంభం కానున్న తరుణంలో ఈ లీగ్ చరిత్రలో కొన్ని అత్యుత్తమ క్యాచ్‌లు గురించి ఒకసారి చూద్దాం. క్రిస్ లిన్(కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్, 2014) ఆర్సీబీ-కేకేఆర్ జట్ల మధ్య షార్జాలో జరిగిన మ్యాచ్ అది. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయానికి 9 పరుగులు కావాలి. క్రీజ్‌లో ఏబీ డివిలియర్స్, అల్బీ మోర్కెల్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. ఇది ఆర్సీబీకి ఏ మాత్ర కష్టం కూడా కాదు. చివరి ఓవర్‌ను వినయ్ కుమార్ అందుకున్నాడు. మొదటి మూడు బంతులకు సింగిల్స్ వచ్చాయి. నాల్గో బంతికి ఏబీ స్ట్రైకింగ్‌కు వచ్చాడు. ఆ సమయంలో ఆర్సీబీకి ఆరు పరుగులు అవసరం. ఇక మ్యాచ్ ఫినిష్ చేయాలనుకున్నాడు ఏబీ. వినయ్ కుమార్ వేసిన నాల్గో బంతిని భారీ షాట్ ఆడాడు. అది గాల్లో బౌండరీ లైన్ దాటేస్తే ఆర్సీబి గెలుస్తుంది. కానీ కేకేఆర్ ఫీల్డర్ క్రిస్ లిన్ అ అవకాశం ఇవ్వలేదు. బౌండరీ లైన్‌కు కొద్దిగా ముందుగా ఉన్న లిన్ దాన్ని బౌండరీ దాటనివ్వలేదు. గాల్లోనే బంతిని అందుకున్నాడు. అదే సమయంలో నియంత్రణను సైతం కోల్పోలేదు. బంతిని క్యాచ్‌గా పట్టి బౌండరీ లైన్‌కు కొన్ని సెంటిమీటర్ల దూరంలో అద్భుతమైన బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ క్యాచ్‌ను సిక్స్ కానివ్వలేదు. ఆ మ్యాచ్‌లో కేకేఆర్ రెండు పరుగుల తేడాతో గెలిచింది. క్రిస్ లిన్ పట్టిన క్యాచ్ ఒక అసాధారణమైన క్యాచ్‌గా నిలిచిపోయింది. ఏబీ డివిలియర్స్(ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్, 2018) ఏబీడీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇతను 360 డిగ్రీల ఆటగాడు. అటు బ్యాటింగ్‌లోనూ ఇటు ఫీల్డింగ్‌లోనూ ఏబీదీ ప్రత్యేకమైన శైలి. ఈ ఆధునిక క్రికెట్లో అత్యుత్తుమ అథ్లెట్ ఏబీ. ఏబీ తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన క్యాచ్‌లు తీసుకున్నాడు. అందులో 2018లో బెంగళూరు వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో పట్టిన ఒక క్యాచ్ అతన్ని బెస్ట్ ఫీల్డర్లలో మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. ఆ మ్యాచ్ బెంగళూరు 219 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. ఈ క్రమంలోనే ఎస్ఆర్హెచ్ ధాటిగానే ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. అలెక్స్ హేల్స్ మంచి టచ్‌లో ఉన్న సమయంలో ఏబీ పట్టిన క్యాచ్ ఆ మ్యాచ్‌కే హైలైట్ కావడమే కాదు.. ఐపీఎల్ చరిత్రలోనే బెస్ట్ క్యాచ్‌ల్లో ఒకటిగా నిలిచింది. మొయిన్ అలీ వేసిన ఎనిమిదో ఓవర్ చివరి బంతికి హేల్స్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడాడు. అది సిక్స్ అనుకున్నారంతా. కానీ అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న ఏబీడీ స్టన్నింగ్ క్యాచ్‌తో హేల్స్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఆ బంతి ఏబీ పైనుంచి వెళ్లిపోతున్న క్రమంలో కరెక్ట్ పొజిషన్ తీసుకుని ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి క్యాచ్ అందుకున్న తీరు అమోఘం. అదే సమయంలో అంతే కచ్చితత్వంతో నియంత్రణ కోల్పోకుండా బౌండరీ లైన్ లోపాలే పడ్డాడు. ఈ క్యాచ్ కెప్టెన్ కోహ్లితో పాటు ఫ్యాన్స్‌లో కూడా మంచి మజాను తీసుకొచ్చింది. సూపర్‌మ్యాన్‌ను తలపించే ఆ క్యాచ్ ఇప్పటికీ అభిమానుల్లో మదిలో మెదులుతూనే ఉంటుంది. ట్రెంట్ బౌల్ట్(ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ డేర్‌డెవిల్స్, 2018) 2018లో ఢిల్లీ డేర్ డెవిల్స్-ఆర్సీబీల మధ్య జరిగిన రెండు లీగ్ మ్యాచ్‌ల్లో కూడా ఆర్సీబీనే విజయం సాధించింది. కాగా, ఇరు జట్ల మధ్య బెంగళూరులో జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో మాత్రం ఢిల్లీ ఆటగాడు ట్రెంట్ బౌల్ట్ క్యాచ్ నిజంగానే అద్భుతం. ఏబీ డివిలియర్స్-విరాట్ కోహ్లిలు భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్న క్రమంలో ఢిల్లీకి ఒక మంచి బ్రేక్ త్రూ దొరికిన సందర్భం అది. కోహ్లి ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్‌కు కాస్త ముందు బౌల్ట్ అందుకున్న తీరు ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయింది. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో ఒక బంతిని లెగ్ సైడ్ వైపు ఫుల్ టాస్‌గా వేయగా, కోహ్లి దాన్ని బౌండరీగా తరలించాలనే భారీ షాట్ ఆడాడు. రాకెట్ స్పీడ్‌లో ఆ బంతిని కోహ్లి హిట్ చేయగా, అంతే స్పీడ్‌లో మిడ్ వికెట్ బౌండరీ లైన్ వద్ద ఉన్న గాల్లోకి ఎగిరి బంతిపై అంచనా తప్పకుండా అందుకున్నాడు. అదే సమయంలో తన నియంత్రణ కోల్పోకుండా బౌండరీ లైన్‌కు కొద్దిగా ముందుకు పడిపోయాడు. అతను బంతిని పట్టుకుని బౌండరీ లైన్ తాకాడా అనే అనుమానం వచ్చినా బ్యాలెన్స్ చేసుకుని లైన్‌కు ముందే ల్యాండ్ అయ్యాడు. ఈ మ్యాజికల్ క్యాచ్‌కు అందులోనూ కోహ్లి క్యాచ్ కావడంతో ఆర్సీబీ అభిమానులంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. కీరోన్ పొలార్డ్(ముంబై వర్సెస్ సీఎస్కే, 2019) ప్రపంచ అత్యుత్తమ ఫీల్డర్లు కీరోన్ పొలార్డ్ ఒకడు. క్యాచ్‌ల విషయంలో తనదైన మార్క్ చూపిస్తూ అభిమానులకు షాక్‌లు ఇస్తూ ఉంటాడు పొలార్డ్. పొలార్డ్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌ల్లో ఒకటి ఐపీఎల్లో కూడా ఉంది. ముంబైలోని వాంఖేడే స్టేడియం వేదికగా సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో పొలార్డ్ మెరుపులాంటి క్యాచ్‌ను అందుకున్నాడు. అది కూడా సురేష్ రైనా ఇచ్చిన క్యాచ్‌ను సింగిల్ హ్యాండ్‌తో అందుకుని ఔరా అనిపించాడు. ముంబై బౌలర్ జేసన్ బెహ్రెన్‌డార్ఫ్ వేసిన షార్ట్ పిచ్ డెలివరీని డీప్ పాయింట్ మీదుగా సిక్స్ తరలించాలనుకున్నాడు రైనా. ఆ పొజిషన్లో బౌండరీ లైన్ వద్ద ఉన్న పొలార్డ్ మాత్రం అందుకు అవకాశం ఇవ్వలేదు. ఆ బంతిని గాల్గోకి ఎగరకుండా వదిలేస్తే అది సిక్స్ వెళ్లడం ఖాయం. కానీ పొలార్డ్ మాత్రం బంతి గమనాన్ని కచ్చితంగా అంచనా వేసి గాల్లోకి ఎగిరాడు. బంతి దగ్గరకు వచ్చే వరకూ అలానే ఉండి ఒక్కసారిగా జంప్ తీసుకున్నాడు. అంతే వేగంతో క్యాచ్ అందుకున్నాడు. అది క్యాచ్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలవడమే కాకుండా ఆ సీజన్లో బెస్ట్ క్యాచ్ అయ్యింది. డేవిడ్ హస్సీ(కేకేఆర్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ -2010) ఫిరోజ్ షా కోట్ల మైదానంలో కేకేఆర్‌తో జరిగిన ఆ మ్యాచ్ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు కీలకమైనది. ఆ మ్యాచ్‌లో ఢిల్లీ 40 పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నాలుగు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేయగా, కేకేఆర్ 137 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. కానీ ఆ మ్యాచ్‌లో కేకేఆర్ ఆటగాడు హస్పీ పట్టిన క్యాచ్ హైలైట్. ఢిల్లీ ఆఖరి ఓవర్ ఆడుతున్న సమయంలో చార్ల్ లాంగ్వెల్దత్ వేసిన ఫుల్ టాస్ బంతిని కాలింగ్‌వుడ్ లాంగాన్ షాట్ ఆడాడు. అది బౌండరీ దాటడం ఖాయం అనుకున్న సమయంలో హస్సీ మెరుపులాగా బంతిపైకి దూసుకొచ్చాడు. ముందు బంతిని సింగిల్ హ్యాండ్‌తో బౌండరీ దాటకుండా ఆపి మెల్లగా బయటకు తోసేశాడు. ఆ తర్వాత బౌండరీ లైన్ లోపలికి వెళ్లిన హస్పీ మళ్లీ బయటకొచ్చి క్యాచ్ అందుకున్నాడు. -
మళ్లీ టాప్‌లో ముంబై.. రెండో స్థానంలో చెన్నై
ముంబై: గతేడాది ఐపీఎల్ టోర్నీని ఆలస్యం చేసిన కరోనా మహమ్మారి చివరకు ఆపలేకపోయింది. మెరుపుల లీగ్ యూఏఈలో విజయవంతమైంది. అయితే ఐపీఎల్ బ్రాండ్ విలువపై మాత్రం కోవిడ్ ప్రభావం చూపింది. 2019 సీజన్‌తో పోలిస్తే 2020 ఐపీఎల్ విలువ 3.6 శాతం తగ్గింది. 2019లో ఐపీఎల్ క్రితం సీజన్ కంటే 7 శాతం పెరుగుదల నమోదు చేసి రూ. 47,500 కోట్లకు లీగ్ విలువను పెంచుకుంది. కానీ గత సీజన్ కరోనా దెబ్బ వల్ల రూ.45,800 కోట్లకు తగ్గింది. ఫ్రాంచైజీల్లో వరుసగా ఐదో ఏడాది కూడా ముంబై ఇండియన్స్ అత్యధిక బ్రాండ్ విలువను కలిగి వుంది. స్వల్పంగా 5.9 శాతం క్షీణించినా... అపర కుబేరుడు అంబానీ టీమ్ రూ.761 కోట్లతో టాప్‌లో ఉంది. తర్వాత చెన్నై, కోల్‌కతాలు వరుసగా రూ.611 కోట్లు, రూ.543 కోట్లతో టాప్–3లో నిలిచాయి. -
బెట్టింగ్ కోసం ఏకంగా ఐపీఎల్ ఆటగాడికే ఫోన్?
న్యూఢిల్లీ: ఎంటర్టైన్మెంట్ ఈవెంట్‌గా పాపులర్ అయిన క్యాష్ రిచ్ టోర్నీ ఐపీఎల్ అదే స్థాయిలో వివాదాలకు కేంద్రంగా నిలిచింది. కొన్నేళ్ల క్రితం రాజస్తాన్ రాయల్స్ ఆటగాళ్లు అజిత్ చండీలా, శ్రీశాంత్, అంకిత్ చవాన్ బెట్టింగ్ ఆరోపణలతో నిషేదానికి గురికాగా, తాజాగా మరోసారి బెట్టింగ్‌కు సంబంధించిన విషయమొకటి వెలుగు చూసింది. ఐపీఎల్లో బెట్టింగ్ ఎలా పెట్టాలి? ఏ జట్టుపై డబ్బులు పెడితే బాగుటుంది, అంతర్గతంగా టీమ్ విషయాలు తెలపాలంటూ ఢిల్లీకి చెందిన ఓ నర్స్ ఐపీఎల్ ఆటగాడిని సంప్రదించినట్టు ఓ స్టడీ రిపోర్టు తెలిపింది. ఈ విషయాన్ని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం చీఫ్ అజిత్ సింగ్ ధ్రువీకరించారు. ఐపీఎల్ 2020 జరుగుతున్న క్రమంలో ఢిల్లీలో నర్స్‌గా పనిచేస్తున్న ఓ మహిళ బెట్టింగ్ పెట్టేందుకు సహాయం చేయాలని, వివరాలు చెప్పాలని ఒక ఆటగాడిని ఫోన్ ద్వారా సంప్రదించిన మాట వాస్తమేనని అజిత్ సింగ్ అన్నారు. అయితే, ఆ విషయాన్ని సదరు ఆటగాడు తమ దృష్టికి తేగా విచారణ చేపట్టామని ఆయన పేర్కొన్నారు. ఆటగాడికి ఆ నర్స్ ఎవరో, ఎక్కడ ఉంటుందో తెలియదని అన్నారు. అవగాహన లేకే ఆమె అలా ప్రవర్తించిందని, ఆమెకు బెట్టింగ్ ముఠాలతో ఎటువంటి సంబంధం లేదని విచారణలో తేలిందని అజిత్ సింగ్ స్పష్టం చేశారు. దాంతో ఆ విషయాన్ని అక్కడితో వదిలేశామని తెలిపారు. కాగా, ఐపీఎల్ 13వ సీజన్ సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు దుబాయ్‌లో జరిగిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా ట్రోఫీని చేజిక్కించుకున్న ముంబై ఇండియన్స్, ఐదు సార్లు విజేతగా నిలిచిన జట్టుగా రికార్డు సృష్టించింది. (చదవండి: టెస్టు సిరీస్: కేఎల్ రాహుల్ అవుట్) -
2020 క్రీడలు: ఒక వైరస్... ఒక 36...
ప్రతీ ఏటా క్రీడల క్యాలెండర్... ఫలితాలు, రికార్డులు, అవార్డులు, పురస్కారాలతో కనిపించేది. చాంపియన్ల విజయగర్జనతో, దిగ్గజాల మైలురాళ్లతో, ఆటకే వన్నెతెచ్చిన ఆణిముత్యాల నిష్క్రమణలతో ముగిసేది. కానీ ఈ ఏడాది మాత్రం కంటికి కనిపించని వైరస్ క్రీడల క్యాలెండర్‌ను కలవరపెట్టింది. కరోనా కాలం క్రీడలకు కష్టకాలాన్నే మిగిల్చింది. టోక్యో ఒలింపిక్స్, యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీలాంటి మెగా ఈవెంట్స్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేసింది. ఆస్ట్రేలియాలో జరగాల్సిన టి20 ప్రపంచకప్‌ను ఆపేసింది. మరెన్నో క్రీడలను రద్దు చేసింది. ప్రేక్షకుల్ని మైదానానికి రాకుండా చేసింది. కొత్తగా ‘బయో బబుల్’ను పరిచయం చేసింది. ఒకవైపు కరోనా కల్లోలం కొనసాగుతుండగా... మరోవైపు ఫార్ములావన్‌లో హామిల్టన్ రయ్‌మంటూ దూసుకెళ్లాడు. 15 ఏళ్ల తర్వాత బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ మళ్లీ రింగ్‌లోకి అడుగుపెట్టాడు. ఎవ్వరూ ఊహించని విధంగా భారత క్రికెట్ జట్టు 36కే ఆలౌటై షాక్ ఇచ్చింది. మొత్తానికి 2020 కొందరికి తీపి గుర్తులు, మరికొందరికి చేదు గుళికల్ని పంచివెళ్లింది. అవేంటో చూద్దాం...! –సాక్షి క్రీడా విభాగం మహాబలుడు మళ్లీ వచ్చాడు! అమెరికా బాక్సింగ్ యోధుడు, ప్రపంచ హెవీవెయిట్ మాజీ చాంపియన్ మైక్ టైసన్ మళ్లీ రింగ్‌లో దిగేందుకు ‘సై’ అన్నాడు. 15 ఏళ్ల తర్వాత పంచ్ విసిరేందుకు కసరత్తులు కూడా చేశాడు. 54 ఏళ్ల వయసులో ప్రత్యర్థి రాయ్ జోన్స్ జూనియర్‌తో ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో తలపడ్డాడు. త్వరలో హోలీఫీల్డ్‌తో టైసన్ ఢీకొట్టేందుకు అమెరికన్ ప్రొఫెషనల్ బాక్సింగ్ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. దిగ్గజాలను తీసుకెళ్లింది... ఈ ఏడాది... క్రీడాభిమానులను దుఃఖసాగరంలో ముంచింది. ఆయా క్రీడలకు తమ ఆటతీరుతో, అలుపెరగని పోరాటంతో వన్నె తెచ్చిన దిగ్గజాలను తీసుకెళ్లింది. అమెరికాను ఊపేసే నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ)లో సూపర్ స్టార్ హోదా పొందిన కోబీ బ్రయాంట్ తన అభిమానులతో శాశ్వత సెలవు తీసుకున్నాడు. హెలికాప్టర్ ప్రమాదంలో బ్రయాంట్‌తోపాటు అతని 13 ఏళ్ల కుమార్తె దుర్మరణం పాలైంది. ఇది ఈ సంవత్సరం క్రీడాలోకంలో పెను విషాదంగా నిలిచింది. అలాగే ఫుట్‌బాల్ మాంత్రికుడు, అర్జెంటీనా దిగ్గజం డీగో మారడోనా మరణం క్రీడాలోకాన్ని శోకంలో ముంచింది. గుండెపోటుతో అతను మృతి చెందాడు. భారత హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ సీనియర్, అలనాటి ఫుట్‌బాల్ మేటి పీకే బెనర్జీ, చున్నీ గోస్వామి ఆరోగ్య సమస్యలతో కన్నుమూశారు. క్రికెట్లో చేతన్ చౌహాన్, రాజిందర్ గోయెల్, ఆస్ట్రేలియన్ డీన్ జోన్స్‌లు అనారోగ్యంతో 2020లో తనువు చాలించారు. ‘రికార్డు’ల హామిల్టన్ మార్చి 15న ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రితో మొదలవ్వాల్సిన ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్‌కు కరోనా అంతరాయం కలిగించింది. 22 రేసులున్న ఎఫ్1 సీజన్‌ను చివరకు 17 రేసులకు కుదించారు. ప్రేక్షకులకు ప్రవేశం లేకుండా రేసులను నిర్వహించారు. మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకొని ఏడోసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. ఈ క్రమంలో మైకేల్ షుమాకర్ (జర్మనీ) పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. అంతేకాకుండా ఎఫ్1లో అత్యధిక రేసుల్లో గెలిచిన డ్రైవర్‌గా షుమాకర్ (91) పేరిట ఉన్న రికార్డును హామిల్టన్ (95) తిరగరాశాడు. ఆన్లైన్లో ఎత్తులు... కరోనా మహమ్మారి పలు క్రీడా టోర్నమెంట్లపై ప్రభావం చూపినా మేధో క్రీడ చెస్ మాత్రం కొత్త ఎత్తులకు ఎదిగింది. ముఖాముఖి టోర్నీలకు బ్రేక్ పడినా ఆన్లైన్లో నిరాటంకంగా టోర్నీలు జరిగాయి. తొలిసారి ఆన్లైన్లో నిర్వహించిన ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్టు రష్యాతో కలిసి సంయుక్త విజేతగా నిలిచింది. భారత్, రష్యా మధ్య ఫైనల్ కీలకదశలో ఉన్నపుడు సాంకేతిక సమస్య తలెత్తడంతో నిర్వాహకులు రెండు జట్లను విజేతగా ప్రకటించారు. చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణ పతకం నెగ్గిన భారత జట్టులో తెలుగు తేజాలు పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక సభ్యులుగా ఉన్నారు. ఆన్లైన్లోనే జరిగిన ప్రపంచ యూత్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు నిహాల్ సరీన్, గుకేశ్, రక్షిత స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు. ఐపీఎల్ అలరించింది ఈ ఏడాదిలో తొలి మూడు నెలలు క్రికెట్ సాగినా... ఆ తర్వాత కరోనా వైరస్‌తో బ్రేక్ వచ్చింది. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన మహిళల టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఐదోసారి విశ్వవిజేతగా నిలిచి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. తొలిసారి ఫైనల్ చేరిన భారత మహిళల జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. మరోవైపు కరోనా వైరస్‌తో భారత్‌లో దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ మధ్యలోనే ఆగిపోయింది. కరోనా తీవ్రరూపం దాల్చడంతో దాదాపు నాలుగు నెలలు క్రికెట్ ఆట సాగలేదు. జూలై చివరి వారంలో ఇంగ్లండ్–వెస్టిండీస్ జట్ల మధ్య ‘బయో బబుల్’ వాతావరణంలో మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ మొదలైంది. ప్రతీ ఏటా వేసవిలో వినోదాన్ని పంచే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నీ కరోనా కారణంగా ఆలస్యమైంది. ఒకదశలో ఈ టోర్నీ జరుగుతుందా లేదా అనే అనుమానం కలిగినా... చివరకు ఐపీఎల్ భారత్ దాటింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ‘బయో బబుల్’ వాతావరణంలో సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు ఐపీఎల్ 13వ సీజన్ నిరాటంకంగా సాగింది. ముంబై ఇండియన్స్ జట్టు ఐదోసారి చాంపియన్‌గా నిలిచింది. ఆగస్టు 15న ఎమ్మెస్ ధోని హఠాత్తుగా క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నానని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అదే రోజున సురేశ్ రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఐపీఎల్ ముగిశాక భారత జట్టు దుబాయ్ నుంచి నేరుగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. అడిలైడ్ వేదికగా జరిగిన డే–నైట్ తొలి టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 36 పరుగులకే ఆలౌటై తమ టెస్టు చరిత్రలో అత్యల్ప స్కోరును నమోదు చేసి ఓటమి పాలైంది. అయితే మెల్బోర్న్లో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయం అందుకొని 2020 ఏడాదిని ఘనంగా ముగించింది. ఫెడరర్...నాదల్ 20–20 ఈ 2020 ఏడాది ఇద్దరు టెన్నిస్ సూపర్స్టార్ల టైటిళ్ల సంఖ్యను ట్వంటీ–ట్వంటీగా సమం చేసింది. స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియన్ ఓపెన్ (2018)తో 20వ టైటిల్ సాధించాడు. ఇతనికి సరైనోడు... సమఉజ్జీ అని టెన్నిస్ ప్రపంచం ప్రశంసలందుకున్న రాఫెల్ నాదల్ దీనికి న్యాయం చేశాడు. ఫ్రెంచ్ ఓపెన్‌తో ఈ స్పానిష్ లెజెండ్ కూడా 20వ టైటిల్‌తో ఫెడరర్ సరసన నిలిచాడు. ఇలా ఈ ఆల్‌టైమ్ గ్రేట్ స్టార్స్ ఇపుడు 20–20 స్టార్స్ అయ్యారు. కరోనా కారణంగా ఈ ఏడాది మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీలు మాత్రమే జరిగాయి. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జొకోవిచ్ విజేతగా నిలువగా... కరోనా దెబ్బకు 1945 తర్వాత వింబుల్డన్ టోర్నమెంట్‌ను నిర్వాహకులు తొలిసారి రద్దు చేశారు. ప్రేక్షకులు లేకుండా యూఎస్ ఓపెన్‌ను నిర్వహించగా... ఆస్ట్రియా ఆటగాడు డొమినిక్ థీమ్ విజేతగా నిలిచి కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను అందుకున్నాడు. సెప్టెంబర్‌కు వాయిదా పడిన ఫ్రెంచ్ ఓపెన్‌లో రాఫెల్ నాదల్ తన ఆధిపత్యం చాటుకొని 13వసారి చాంపియన్‌గా నిలిచాడు. యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ సందర్భంగా తాను కొట్టిన బంతి లైన్ అంపైర్‌కు తగలడంతో సస్పెన్షన్‌కు గురైన సెర్బియా స్టార్ జొకోవిచ్ ఆరోసారి సీజన్‌ను నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించాడు. పీట్ సంప్రాస్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. -
2020లో ఐపీఎల్ టాప్, ఎలాగంటే..
సాక్షి, అమరావతి : మన దేశంలో కోవిడ్ మహమ్మారిపైనా క్రికెట్ ఆధిపత్యం సాధించింది. కోవిడ్ వైరస్ నిలువెల్లా వణికించిన తరుణంలోనూ గూగుల్‌లో అత్యధిక శాతం మంది క్రికెట్‌పైనే ఆసక్తి చూపించారు. 2020లో గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన అంశంగా ఐపీఎల్ నిలిచింది. దాని తర్వాతే కరోనా వైరస్ గురించి జనం వెతికారు. ఈ రెండింటి తర్వాత అమెరికా ఎన్నికలు, పీఎం కిసాన్ యోజన, బిహార్ ఎన్నికల అంశాలు వరుసగా మూడు, నాలుగు, ఐదవ స్థానాల్లో ఉన్నాయి. 2020లో ఎక్కువ మంది వెతికిన అంశాల జాబితాను గూగుల్ ఇటీవల విడుదల చేసింది. త్రిపుర రాష్ట్రంలో అత్యధికంగా ఐపీఎల్ క్రికెట్ గురించి సెర్చ్ చేయగా, మన రాష్ట్రంలో 41 శాతం మంది మాత్రమే దీని ఆరా తీశారు. తెలంగాణలో మన కంటె ఒక్క శాతం ఎక్కువ మంది సెర్చ్ చేశారు. ఏపీలో ఈ అంశంపై విశాఖపట్నం, భీమవరం, చిత్తూరు నుంచి అత్యధికంగా.. నంద్యాల, అనంతపురంలో అతి తక్కువగా శోధించారు. కరోనాపై హిందూపూర్, చిత్తూరులో ఎక్కువ ఆసక్తి కరోనా వైరస్ గురించి గోవా, జమ్మూ–కశ్మీర్, మేఘాలయ రాష్ట్రాల్లో 90 శాతం మంది సెర్చ్ చేయగా, మన రాష్ట్రంలో 42 శాతం, తెలంగాణలో 54 శాతం సెర్చ్ చేశారు. మన రాష్ట్రంలో ఈ అంశాన్ని హిందూపూర్, శ్రీకాకుళం, చిత్తూరు ప్రాంతాల్లో ఎక్కువ మంది సెర్చ్ చేయగా.. విశాఖ, విజయవాడ ప్రాంతాల్లో చాలా తక్కువ మంది సెర్చ్ చేయడం గమనార్హం. కేరళలో అతి తక్కువగా 30 శాతం మంది మాత్రమే దీని గురించి వెతికారు. (చదవండి: అదే టీమిండియా కొంపముంచింది..) మన చూపంతా అమెరికా ఎన్నికలపైనే అమెరికా ఎన్నికల గురించి మన రాష్ట్రంలో 38 శాతం మంది, తెలంగాణలో 42 శాతం మంది సెర్చ్ చేయడం విశేషం. ఐపీఎల్, కరోనా అంశాల సెర్చింగ్‌లో 20వ స్థానంలో ఉన్న ఏపీ ఈ అంశంలో నాలుగో స్థానంలో ఉండడం విశేషం. ఆశ్చర్యకరంగా పీఎం కిసాన్ యోజన ఈ సంవత్సరం టాప్ సెర్చింగ్ జాబితాలో ఉంది. దీన్ని బట్టి రైతుల అంశం ప్రజల్లో విస్తృతంగా నానుతున్నట్లు స్పష్టమైంది. ప్రముఖ వ్యక్తుల్లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్, టీవీ జర్నలిస్టు అర్నాబ్ గోస్వామి, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్, అమితాబ్, కమలా హారిస్ గురించిన సమాచారం కోసం ఎక్కువ మంది వెతికారు. ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన దిల్ బేచారాను ఎక్కువ మంది సెర్చ్ చేశారు. తమిళ సినిమా సూరారై పొట్రు, బాలీవుడ్ సినిమాలు తన్హజి, శకుంతలాదేవి గురించి ఆ తర్వాత అన్వేషించారు. టీవీ, వెబ్ సిరీస్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన క్రైం డ్రామా మనీ హీస్ట్ గురించి ఎక్కువ మంది అన్వేషించారు. స్కామ్‌స్టర్ హర్షద్ మెహతా స్టోరీ, హిందీ బిగ్‌బాస్–14 గురించి ఆ తర్వాత ఎక్కువగా వెతికారు. (చదవండి: ఒలింపిక్స్‌కు మళ్లీ ఎంత కష్టమొచ్చే..!) తాజా పరిణామాలపై ఇలా.. వార్తలకు సంబంధించి నిర్భయ కేసు, లాక్డౌన్స్, ఇండియా–చైనా సరిహద్దు పరిణామాలు, మిడతల దండు, రామ మందిరం సమాచారం కోసం ఎక్కువ మంది సెర్చ్ చేశారు. లాక్డౌన్ కారణంలో ఇళ్లల్లోనే ఉండిపోయిన జనం పన్నీర్ ఎలా తయారు చేయాలనే దానిపై గూగుల్‌లో ఎక్కువగా వెతికారు. ఆ తర్వాత ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలి, పాన్–ఆధార్‌కార్డు ఎలా లింక్ చేసుకోవాలి, ఇంట్లోనే శానిటైజర్ ఎలా తయారు చేసుకోవాలి వంటి వాటి గురించి అన్వేషించారు. కరోనా వైరస్ అంటే ఏమిటి (వాట్ ఈజ్) అనే దాని గురించి అత్యధిక మంది సెర్చ్ చేశారు. అలాగే సోషల్ మీడియా ట్రెండ్ అయిన బినాడ్ గురించి, ప్లాస్మా థెరపీ గురించి వెతికారు. స్థానికంగా తమ ఇళ్లకు ఏవి దగ్గరగా ఉన్నాయో తెలుసుకునేందుకు నెటిజన్లు గూగుల్‌లో అన్వేషించారు. దగ్గరలోని ఫుడ్ షెల్టర్స్ గురించి అత్యధికులు అన్వేషించారు. దగ్గరలో కోవిడ్ టెస్ట్, మద్యం షాపు గురించి జనం వెతికారు. క్రికెట్‌పైనా జనం ఆసక్తి మన దేశంలో క్రికెట్‌కు సంబంధించిన అంశాలపైనే జనం ఆసక్తి చూపుతారు. ఏ సంవత్సరమైనా క్రికెట్‌పైనే మన వాళ్లకు ఆసక్తి ఎక్కువ అని ఈ ట్రెండ్స్‌ని బట్టి అర్థమవుతోంది. విద్యా సంబంధిత అంశాలు, ఓటీటీ ప్లాట్‌ఫాంలు, రాజకీయ అంశాలు, ఎన్నికల గురించి తెలుసుకునేందుకు కూడా మన రాష్ట్ర ప్రజలు ఉత్సుకత ప్రదర్శిస్తారు. – శ్రీ తిరుమల, డిజిటల్ మార్కెటింగ్ నిపుణుడు, విజయవాడ -
ఇక అగస్త్య డ్యూటీ...
ముంబై: నాలుగు నెలల పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), ఆస్ట్రేలియా సిరీస్ అంటూ క్రికెట్లో తలమునకలై ఉన్న హార్దిక్ పాండ్యా శనివారం కొత్త బాధ్యతల్ని స్వీకరించాడు. తన నాలుగు నెలల కొడుకు అగస్త్య బాగోగుల్ని పాండ్యా భుజానికెత్తుకున్నాడు. ఆసీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కే ఎంపికైన హార్దిక్ భారత్‌కు తిరిగి వచ్చేశాడు. ఇంటికి చేరుకోగానే తన బుజ్జాయి అగస్త్యకు పాలు పట్టిస్తూ సేదతీరాడు. ఆ ఫొటోను ట్విట్టర్లో పంచుకున్న పాండ్యా ‘జాతీయ విధుల నుంచి తండ్రి బాధ్యతల్లోకి’ అనే వ్యాఖ్యను జతచేశాడు. ఆసీస్‌తో వన్డేలు, టి20ల్లో అదరగొట్టిన పాండ్యాకు టెస్టు జట్టులో చోటు దక్కలేదు. ‘వన్డే, టి20 సిరీస్ ముగియగానే ఇంటికి వెళ్లేందుకే ప్రణాళికలు వేసుకున్నా. నేను వదిలి వచ్చినప్పుడు అగస్త్య 15 రోజుల పసికందు. ఇప్పుడు 4 నెలల చిన్నారి. అతన్ని చాలా మిస్ అయ్యా. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్లాలా అని ఎదురు చూశా’ అని పాండ్యా పేర్కొన్నాడు. -
'డ్రింక్స్ తాగడానికే ఐపీఎల్‌కు వచ్చేవాడు'
ఢిల్లీ : టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌పై మరోసారి తనదైన శైలిలో ట్రోల్ చేశాడు. మ్యాక్స్‌వెల్ ఐపీఎల్లో క్రికెట్ ఆడటానికి రాడని.. హోటల్ రూంలో తనకు ఫ్రీగా ఇచ్చే డ్రింక్స్ కోసం వస్తాడని ట్రోల్ చేశాడు. కాగా గతంలో కూడా ఇదే విధంగా ట్రోల్ చేశాడు. ఐపీఎల్ 13వ సీజన్లో దారుణ ప్రదర్శన చేసిన మ్యాక్స్‌వెల్‌ను కింగ్స్ పంజాబ్ 10 కోట్లు పెట్టి కొన్నందుకు ఆ జట్టుకు చీర్ లీడర్‌గా మారాడని పేర్కొన్నాడు. (చదవండి : అది బీసీసీఐ-రోహిత్‌లకు మాత్రమే తెలుసు: సచిన్) 'ఐపీఎల్లో ఆడేటప్పుడు, ఆసీస్‌కు ఆడేటప్పుడు మనం రెండు రకాల మ్యాక్స్‌వెల్‌ను చూప్తాం. ఆసీస్‌కు ఆడేటప్పుడు వరుసగా రెండు మ్యాచ్‌లు విఫలమైతే తనను ఎక్కడ తీస్తారో అనే భయం అతనికి ఉంటుంది. అందుకే ఆసీస్ జట్టుకు ఆడుతున్నప్పుడు అతని ప్రవర్తన, ఆటతీరు పూర్తిగా మారిపోంతుంది. కానీ ఐపీఎల్లో అలాంటి ఒత్తిడి ఉండదు. మ్యాచ్‌లు ఆడినా.. ఆడకపోయినా.. సదరు యాజమాన్యం ఆటగాళ్లకు అందించాల్సిన మొత్తం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే మ్యాక్స్‌వెల్ ఐపీఎల్‌కు వస్తే ఎంజాయ్ మూమెంట్లో కనిపిస్తాడు. అందుకే ఇతర ఆటగాళ్లను ఎంకరేజ్ చేయడం..తోటి క్రికెటర్లతో కలిసి విహారయాత్రలు చేయడం.. ఆట ముగిసిన తర్వాత ఫ్రీగా అందించే డ్రింక్స్‌ను తన హోటల్ రూంకు తీసుకెళ్లి తాగుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. అందుకే ఐపీఎల్లో మ్యాక్స్‌వెల్ ఉన్నప్పుడు అతని ఆట సీరియస్‌గా అనిపించదు. ఐపీఎల్లో క్రికెట్ ఆడడం కన్నా.. తన వచ్చిన పని మీద ఎక్కువ దృష్టి పెట్టేవాడని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. (చదవండి : టీమిండియాకు మరో షాక్) అయితే సెహ్వాగ్ కామెంట్స్‌పై మ్యాక్స్‌వెల్ స్పందించాడు.' వీరు చేసిన వ్యాఖ్యలపై నేను మాట్లాడదలచుకోలేదు. ఎవరి అభిప్రాయం వారికి ఉంటుంది. ఐపీఎల్లో మంచి ప్రదర్శన చేయనందుకు అతనికి నాపై కోపం ఉన్నట్టుంది. అతని వ్యాఖ్యలు నన్ను ఏ మాత్రం ఇబ్బంది పెట్టవు. అంటూ తెలిపాడు. కాగా మ్యాక్స్‌వెల్ ఐపీఎల్ 13వ సీజన్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌కు ఆడిన సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్ 2019లో జరిగిన ఐపీఎల్ వేలంలో మ్యాక్స్‌వెల్‌ను రూ.10 కోట్లు వెచ్చించి కొన్న సంగతి తెలిసిందే. కాగా ఐపీఎల్లో 13 మ్యాచ్‌లాడిన అతను 105 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్లో దారుణ ప్రదర్శన కనబరిచిన మ్యాక్స్‌వెల్ ఆసీస్ టూర్లో మాత్రం మంచి ప్రదర్శన నమోదు చేశాడు.మూడు వన్డేలు కలిపి 167 పరుగులు, మూడు టీ20లు కలిపి 78 పరుగులు చేశాడు. (చదవండి : త్యాగి బౌన్సర్.. కుప్పకూలిన ఆసీస్ బ్యాట్స్‌మెన్) -
ఈ ఏడాది ట్విట్టర్లో ఎక్కువగా చర్చించిందేంటంటే..
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది ప్రజలు అత్యధికంగా చర్చించిన అంశం కోవిడ్ అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ట్విట్టర్లో కూడా 2020లో అత్యధికంగా ప్రజలు చర్చించుకుంది దీని గురించే.. కోవిడ్‌కు సంబంధించిన విశ్వసనీయ సమాచారం, నిపుణులతో అనుసంధానం కోసంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ట్విట్టర్లో ప్రజలు విస్తృతంగా చర్చించారు. ఫ్రంట్‌లైన్ వర్కర్ల పట్ల ఈ ఏడాది ప్రజలు కృతజ్ఞతలను ప్రకటించారు. ట్విట్టర్ ద్వారా ఫ్రంట్ లైన్ వర్కర్లకు కృతజ్ఞతలు తెలపడం ప్రపంచ వ్యాప్తంగా 20% పెరగ్గా, ప్రత్యేకంగా వైద్యులకు కృతజ్ఞతలు తెలపడం 135%, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలపడం 30% పెరిగింది. మరికొన్ని రోజుల్లో 2020 ముగియనుండటంతో ఈ ఏడాది ట్విట్టర్ వేదికగా ప్రజలు చర్చించిన అంశాలను సోమవారం ఆ సంస్థ బహిర్గతం చేసింది. చదవండి: ట్విట్టర్ లవర్స్ కి గుడ్ న్యూస్ ఇంకా సుశాంత్, హాథ్రస్ ఘటనలు.. సమకాలిక అంశాల (కరెంట్ అఫైర్స్)లో కోవిడ్–19 మహమ్మారి (#covid19) అత్యధిక హ్యాష్‌ట్యాగ్ ట్వీట్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఆత్మహత్యకు పాల్పడిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు నివాళి (# sushantsinghrajput) అర్పిస్తూ నెటిజన్లు పెట్టిన ట్వీట్లు రెండో అత్యధిక హ్యాష్‌ట్యాగ్ ట్వీట్లుగా నిలిచాయి. ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్లో దళితబాలికపై సామూహిక అత్యాచారం, హత్య ఘటన(# hathrs)పై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై కూడా ట్విట్టర్లో విస్తృత చర్చ జరిగింది. మూడో అత్యధిక హ్యాష్‌ట్యాగ్ ట్వీట్లు దీనిపై నెటిజన్లు చేశారు. చదవండి: ట్విటర్ లో మరో కొత్త ఫీచర్ క్రీడల్లో ‘విజిల్‌పొడు’కూడా.. ఇక క్రీడలకు సంబంధించిన అత్యధికంగా #ఐపీఎల్2020 గురించి ట్విట్టర్లో చర్చ జరగగా, ఆ తర్వాత మహేంద్రసింగ్ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ టీం హ్యాష్‌ట్యాగ్(# విజిల్‌పొడు), మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శనకు ట్విట్టర్లో # టీమిండియా హ్యాష్‌టాగ్‌తో విస్తృత అభినందనలు లభించాయి. గోల్డెన్ ట్వీట్లలో విజయ్‌తో అభిమానుల సెల్ఫీ! ఈ ఏడాది అత్యధిక సంఖ్యలో రిట్వీట్స్, లైక్స్, కోట్ ట్వీట్స్‌ను పొందిన ట్వీట్లను గోల్డెన్ ట్వీట్లుగా ట్విట్టర్ ప్రకటించింది. తమిళ సూపర్‌స్టార్ విజయ్ వేలాది మంది తన అభిమానులతో దిగిన సెల్ఫీ ఫొటోను గత ఫిబ్రవరిలో ట్విట్టర్లో పోస్టు చేయగా, ఈ ఏడాది అత్యధిక రిట్వీట్స్ అందుకుని గోల్డెన్ ట్వీట్‌గా నిలిచింది. తమిళ సినీ అభిమానులు విస్తృతంగా ఈ ట్వీట్‌ను షేర్ చేశారు.భారతీయ క్రికెట్ జట్టు కెపె్టన్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మ ప్రెగ్నెన్సీకి సంబంధించిన శుభవార్తను అభిమానులతో పంచుకోవడానికి చేసిన ట్వీట్ ఈ ఏడాది అత్యధిక లైకులు అందుకుని గోల్డెన్ ట్వీట్‌గా నిలిచింది. ‘సరిలేరు నీకెవ్వరు..’ ఇటు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ నటించిన హిందీ సినిమా #దిల్బెచారపై ట్విట్టర్లో అభిమానులు అత్యధికంగా చర్చించారు. హీరో సూర్య నటించిన తమిళ సినిమా # సూరారిపొట్రును తమిళ సినీ అభిమానులు మాస్టర్ పీస్‌గా ప్రకటించారు. ఇక అత్యధిక చర్చ జరిగిన తెలుగు సినిమాగా మహేష్‌బాబు, రష్మిక మందన్న నటించిన తెలుగు సినిమా # సరిలేరునీకెవ్వరు నిలిచింది. ఈ ఏడాది ట్విట్టర్లో ప్రపంచవ్యాప్తంగా సినిమాలు, టీవీ గురించి నిమిషానికి 700 ట్వీట్లు చేశారు. బినోద్పై నవ్వులే నవ్వులే.. ఇక #బినోద్( Binod) అత్యధిక హ్యాష్‌ట్యాగ్ ట్వీట్లు అందుకున్న మీమ్(Meme of the year)గా నిలిచింది. సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు పోస్టులకు సంబంధం లేకుండా అసంబద్ధమైన, హాస్యాస్పదమైన కామెంట్లు పెడుతుంటారు. ఇలానే ఓ పోస్టు కింద బినోద్ అనే వ్యక్తి తన పేరును కామెంట్‌గా పెట్టడంతో అతడి పేరు వైరల్‌గా మారి చర్చనీయాంశమైంది. ► కోవిడ్‌తో ప్రభావితమైన వారిని ఆదుకోవడానికి రూ.500 కోట్ల విరాళాన్ని ప్రకటిస్తూ టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటా చేసిన ట్వీట్ విస్తృత ప్రశంసలు పొంది మరో గోల్డెన్ ట్వీట్‌గా నిలిచింది. ►కోవిడ్ బారినపడి ఆస్పత్రిలో చేరినట్టు తెలుపుతూ బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేయగా, ఆయన త్వరగా కోలుకోవాలని భారీ సంఖ్యలో అభిమానాలు ‘కోట్ రీట్వీట్’చేయడంతో.. ఇది కూడా గోల్డెన్ ట్వీట్‌గా మారింది. ►కోవిడ్ మహమ్మారిపై పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వర్కర్లకు కృతజ్ఞతగా రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు దీపాలు వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆయన దీపాలు వెలిగిస్తూ పెట్టిన ట్వీట్.. రాజకీయ నేతల విభాగంలో అత్యధిక రీట్వీట్లు అందుకుంది. ►క్రికెట్‌కు ధోని చేసిన సేవను కొనియాడుతూ ప్రధాని మోదీ పంపిన ప్రశంసా పత్రాన్ని ధోని ట్వీట్ చేయగా, అభిమానులు భారీ సంఖ్యలో రీట్వీట్ చేశారు. అత్యధిక రీట్వీట్లు పొందిన ఒక క్రీడాకారుడి ట్వీట్ ఇదే.. తీపి గుర్తులు యాది చేసుకున్నరు.. డీడీలో రామాయణం సీరియల్‌ను పున:ప్రసారం చేయడంతో చాలా మంది తమ పాత తీపి గుర్తులను #రామాయణ్‌తో ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. మహేశ్‌బాబు నటించిన పోకిరి సినిమా 14 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా # పోకిరి.. మహాభారత్ సీరియల్‌ను మళ్లీ డీడీలో పున:ప్రసారం చేయడంతో # మహా భారత్.. అనే హ్యాష్ ట్యాగ్‌లతో ట్విట్టర్లో ప్రజలు చర్చించారు. వీటితో పాటు ప్రజలు # ఫొటోగ్రఫీ, #యోగా, # పొయెట్రీను సైతం బాగానే చర్చించారు. -
ఎస్ఐ గోవింద్‌పై సస్పెన్షన్ వేటు
సాక్షి, కామారెడ్డి : బెట్టింగ్ కేసులో అవినీతి ఆరోపణలతో మరో పోలీస్ అధికారిపై వేటు పడింది. ఈ కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన కామారెడ్డి పట్టణ ఎస్ఐ గోవింద్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు నిజామాబాద్ రేంజ్ ఐజీ శివశంకర్ రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో ఇప్పటికే పట్టణ సీఐ జగదీశ్ కూడా సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. సీఐకి చెందిన లాకర్ నుంచి 34 లక్షల నగదు, తొమ్మిది లక్షల విలువైన బంగారాన్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మధ్యవర్తి సుజయ్ సైతం అరెస్ట్ అయ్యాడు. కామారెడ్డి పోలీసు శాఖను ఏసీబీ విచారణ పర్వం వారం రోజుల పాటు కుదిపేసింది. (కామారెడ్డి పోలీసుల్లో ఐపీఎల్ బెట్టింగ్ గుబులు!) స్పెషల్’.. నిద్రలోకి! సాక్షిప్రతినిధి, నిజామాబాద్: పోలీసు శాఖలో ‘ప్రత్యేక విభా గం’ పనితీరు ప్రశ్నార్థకంగా మారింది. స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) విధులు మరిచి సేద తీరుతున్నట్లే కనిపిస్తోంది. ఎంతో కీలకమైన ఈ నిఘా వ్యవస్థ తరచూ విఫలమవుతోందా..? అవినీతి పోలీసుల సమాచార సేకరణలో అట్టర్ ఫ్లాప్ అవుతోందా..? అంటే అవుననే అంటున్నాయి పోలీసు వర్గా లు. ఓ సీఐ స్థాయి అధికారి.. ఎస్సైలు, ఏఎస్సైలు.. క్షేత్ర స్థాయిలో ప్రతి రెండు, మూడు పోలీస్స్టేషన్లకు ప్రత్యేకంగా కానిస్టేబుళ్లతో కూడిన ప్రత్యేక విభాగం పోలీస్ బాస్‌లకు మూడోకన్ను లాంటిది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారి కదలికలు, పాస్‌పోర్టులు, జాబ్ ఎంక్వైయిరీ వంటి విధులతో పాటు జిల్లాలో పోలీసు అధికారుల అవినీతి, అక్రమాలపై ఎప్పటికప్పుడు పోలీసు బాస్‌లకు సమాచారం అందించే నిఘా వ్యవస్థ ఇది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న స్పెషల్ బ్రాంచ్ పనితీరు ప్రశ్నార్థకంగా మారింది. నిఘా పెట్టట్లేదా? పోలీసు అధికారుల అవినీతి, అక్రమాలను ఈ విభాగం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో కొందరు పోలీసు అధికారులు విచ్చ లవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు. సివిల్ తగాదాల్లో తలదూర్చి రూ.లక్షలు దండుకుంటున్నారు. స్టేషన్లనే సెటిల్మెంట్లకు అడ్డాలుగా చేసి, పెద్ద ఎత్తున వెనకేసుకుంటున్నారు. గుట్కా, మట్కా, ఇసుక, మొరం వంటి రెగ్యులర్ మామూళ్లతో పాటు స్టేషన్లలో నమోదవుతున్న కేసుల నుంచి కాసులు దండుకుంటున్నారు. అవినీతి నిరోధక శాఖ వల పన్ని పట్టుకుంటేనే ఈ అక్రమార్కుల వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయే తప్ప.. పోలీసు శా ఖ అంతర్గత నిఘా వ్యవస్థ ద్వారా ఏ అధికారిపైనా చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడమే ఇందుకు నిదర్శనమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. (కామారెడ్డి సీఐ జగదీశ్ అరెస్టు) ఏసీబీ పట్టుకుంటేనే వెలుగులోకి.. అవినీతి నిరోధకశాఖ దృష్టి సారిస్తేనే అధికారుల అ వినీతి బాగోతం వెలుగులోకి వస్తోంది. నెల క్రితం రియల్ ఎస్టేట్ ప్లాటు తగాదాలో తలదూర్చిన బోధన్ సీఐ రాకేశ్, ఎస్ఐ మొగులయ్య రూ.50 వేలు, రూ.లక్షకు పైగా విలువైన సెల్‌ఫోన్‌ను లంచంగా తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. అంతకు ముందు బాన్సువాడ సీఐ టాటాబాబు కూడా ఓ కాంట్రాక్టర్ వద్ద లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. తాజాగా కామారెడ్డి సీఐ జగదీశ్ అవినీతి బా గోతం ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ జిల్లాలో పని చేసిన ఆయ న లాకర్లలో రూ.34 లక్షల నగదు, స్థిరాస్తుల పేప ర్లు, బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. ఏసీబీ వల పన్ని పట్టుకుంటేనే పోలీసు శాఖలోని అవినీతి అక్రమాలు వెలుగు చూస్తున్నాయే తప్ప తమ శాఖ ప్రతిష్టను మసకబార్చేలా వ్యవహరిస్తున్న అవినీతి అధికారులపై ఈ స్పెషల్ బ్రాంచ్ నిఘా కరువైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసు బాస్‌ల దృష్టికి తీసుకెళ్లడం లేదా..? విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్న పోలీసు అధికారుల వ్యవహారాలను ఎస్బీ అధికారులు పోలీసు బాస్ దృష్టికి తీసుకెళ్లడం లేదా..? లేక ఎస్బీ ఎప్పటికప్పుడు ఇస్తున్న నివేదికలు బుట్టదాఖలవుతున్నాయా..? అనే అంశం ఇప్పుడు తెరపైకి వస్తోంది. ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల అండదండలతో ‘ఆదాయ’ మార్గాలున్న స్టేషన్లలో విధులు నిర్వరిస్తున్న ఈ అవినీతి అధికారుల పట్ల ఉక్కుపాదం మోపడంలో పోలీసు బాస్‌లు కఠినంగా వ్యవహరించడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. -
సాక్షి, జీవాలతో డ్యాన్స్ చేసిన ధోనీ
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ భార్య సాక్షి, కుమార్తె జీవాతో కలిసి ఓ పార్టీలో డ్యాన్స్ చేశాడు. కుటుంబంతో పాటు వేడుకకు హాజరైన సన్నిహితులతో కలిసి సెప్టులేస్తూ సందడి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ ట్విటర్లో పోస్ట్ చేసింది. "ఇది చూసేటప్పుడు మనం నవ్వకుండా ఉండగలమా? ఖచ్చితంగా కాదు" అని క్యాప్షన్ జతచేసింది. ఈ వీడియో ధోని అభిమానులు, నెటిజన్లను ఆకట్టకుంటోంది. కాగా ఈ ఏడాది ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోని ఫ్రాంఛైజ్ క్రికెట్లో కొనసాగతున్న సంగతి తెలిసిందే. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా సీఎస్కేకు సారథ్యం వహిస్తునన్న ధోని.. 39 ఏళ్ల ధోని 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20లు ఆడాడు. కాగా ఐపీఎల్ టోర్నమెంట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ధోనీ ఒకడు. సీఎస్కే 2010, 2011, 2018 సీజన్లలో మూడు టైటిళ్లను సొంతం చేసుకుంది. 2020 వరకు ఆడిన ప్రతీ సీజన్లో దాదాపుగా ప్లేఆఫ్స్ చేరుకుంది. కానీ 13వ సీజన్లోనే మొదటిసారిగా ప్లేఆఫ్ చేరకుండానే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. ఈ క్రమంలో ధోని రిటైర్ అవుతాడంటూ ఊహాగానాలు వినిపించగా.. "పసుపు జెర్సీలో ఈ మ్యాచ్ మీ చివరిది కదా?" అని విలేకరులు అడిగినపప్పుడు "ఖచ్చితంగా కాదు" అని ధోనీ గట్టిగా స్పందించాడు. 204 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ధోనీ 4632 పరుగులు చేశాడు. ఇందులో 22 హాఫ్ సెంచరీలు(136.75 స్ట్రైక్ రేట్) ఉన్నాయి. ఐపీఎల్లో అత్యధిక స్కోరు సాధించిన ఆటగాళ్ల స్థానంలో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. Can we stop ourselves from smiling while watching this? Definitely Not. 😊 #WhistlePodu #Yellove @msdhoni @SaakshiSRawat 🦁💛 pic.twitter.com/cuD8x3J7oS — Chennai Super Kings (@ChennaiIPL) November 26, 2020 -
ఓపెనర్‌గా తనే సరైన ఆప్షన్: సచిన్
న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ మయాంక్ అగర్వాల్‌పై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసలు కురిపించాడు. టీమిండియా ఆసీస్ టూర్ నేపథ్యంలో టెస్టుల్లో ఓపెనర్ స్థానానికి అతడే సరైన ఆప్షన్ అని పేర్కొన్నాడు. ఐపీఎల్-2020లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన మయాంక్ అగర్వాల్ టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన విషయం తెలిసిందే. తొలిసారిగా మూడు ఫార్మాట్లలోనూ(వన్డే, టీ20, టెస్టు) జట్టు సభ్యుడిగా చోటు సంపాదించుకున్న మయాంక్ తనను తాను నిరూపించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్లో ఓపెనర్‌గా మైదానంలోకి అడుగుపెట్టాలంటే కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ల రూపంలో అతడికి గట్టి పోటీ ఎదురుకానుంది. కానీ టెస్టుల్లో మాత్రం ఈ పరిస్థితి ఉండదని సచిన్ అభిప్రాయపడ్డాడు. టీమిండియా ఆసీస్ టూర్, మయాంక్ ఆటతీరు గురించి సచిన్ మాట్లాడుతూ.. ‘‘ మయాంక్ స్కోరు(రన్స్) ఎంతో మెరుగ్గా ఉంది. కాబట్టి కచ్చితంగా ఒక మంచి ఓపెనర్ అవుతాడు. ఒకవేళ రోహిత్ ఫిట్నెస్ సాధించి, జట్టుతో చేరితే మయాంక్ తనకు మంచి జోడీ అవుతాడు. పృథ్వీ షా, కేఎల్ రాహుల్‌ల విషయంలో మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చెప్పలేం. నాకు తెలిసి ఫాంలో ఉన్నవాళ్లను పక్కనపెట్టే అవకాశం ఉండదు’’ అని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున 11 మ్యాచ్‌లు ఆడిన మయాంక్ అగర్వాల్ 424(స్ట్రైక్ రేటు 156.45) పరుగులు చేశాడు. (చదవండి: రోహిత్ స్థానంలో అయ్యర్!) ఆసీస్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది ఇక ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉందన్న లిటిల్ మాస్టర్.. కంగారూ బ్యాట్స్‌మెన్‌ను సమర్థవంతంగా కట్టడి చేసేందుకు టీమిండియా ఇప్పటికే పూర్తిస్థాయిలో సన్నద్ధమై ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపాడు. ‘‘స్మిత్, వార్నర్ వంటి సీనియర్లకు లబుషేన్ తోడైతే ఆసీస్ బ్యాటింగ్ యూనిట్ మరింత మెరుగవుతుంది. ఈసారి ఇరు జట్ల మధ్య పోరు మరింత రసవత్తరంగా మారనుంది. ఇందుకు భారత జట్టు సిద్ధంగా ఉంది. నిజానికి కెప్టెన్ కోహ్లి జట్టుతో లేకపోవడం తీర్చలేని లోటే. అయితే ఆ అవకాశాన్ని యువ ఆటగాళ్లు సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది’’ అని సచిన్ అభిప్రాయపడ్డాడు. కాగా గాయం కారణంగా రోహిత్ శర్మ ఆసీస్ టూర్‌కు దూరమైన సంగతి తెలిసిందే. అయితే చివరి రెండు టెస్టులకైనా అతడు అందుబాటులోకి వస్తే జట్టుకు ఉపయోగకరంగా ఉంటుందని బీసీసీఐ భావిస్తోంది. అలా జరగని పక్షంలో హిట్‌మాన్ స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను రిజర్వ్ ఆటగాడిగా తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తోంది.(చదవండి: ఐపీఎల్ 2020: బీసీసీఐ ఆదాయం ఎంతంటే!) -
నాలుగున్నర నెలల్లో 22 సార్లు : గంగూలీ
సాక్షి, ముంబై: బీసీసీఐ అధ్యక్షుడు, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు. చుట్టూ కరోనా పాజిటివ్ కేసులు ఉన్నప్పటికీ ఒక్కసారి కూడా కరోనా వైరస్ బారిన పడకుండా, జాగ్రత్తలు తీసుకుంటూ లీగ్‌ను ముగించామంటూ సంతోషం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి ఆందోళన మధ్య ఐపీఎల్-2020ను విజయవంతంగా ముగించడం గర్వంగా ఉందన్నారు. దుబాయ్‌లో ఐపీఎల్ నిర్వహణలో బిజీగా బిజీగా గడిపిన గంగూలీ, రానున్న ఆస్ట్రేలియా పర్యటనపై మంగళవారం వర్చువల్ మీడియా సమావేశంలో మాట్లాడారు. గత నాలుగున్నర నెలల్లో 22 సార్లు పరీక్షలు చేయించుకున్నానని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. తన చుట్టూ కేసులు ఉండటం వల్లే అన్ని సార్లు టెస్ట్ చేయించుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ముఖ్యంగా పెద్దవాళ్లైన తల్లిదండ్రులతో కలిసి ఉన్నాను. మొదట్లో చాలా భయపడ్డా. తన కోసం కాదు కానీ చుట్టూ ఉన్నవారికి తన వల్ల వైరస్ సోకకూడదుకదా అందుకే.. అంటూ హైజీన్ టెక్నాలజీ బ్రాండ్ లివింగ్ గార్డ్ ఏజీ బ్రాండ్ అంబాసిడర్ గంగూలీ పేర్కొన్నారు. సిడ్నీలో 14 రోజుల సెల్ఫ్ క్వారంటైన్ తరువాత ఆటగాళ్లందరూ క్షేమంగా ఉన్నారన్నారు. వారంతా ఆరోగ్యంగా ఆటకు సిద్ధంగా ఉన్నారని గంగూలీ ప్రకటించారు. ఆస్ట్రేలియాలో కూడా కరోనా కేసులు పెద్దగా లేవని బీసీసీఐ చీఫ్ చెప్పారు. అలాగే దేశీయంగా క్రికెట్ చాలా త్వరలోనే ప్రారంభంకానుంది. ఇంగ్లాండ్ భారత్ పర్యటనలో భాగంగానాలుగు టెస్ట్ మ్యాచ్‌లు, మూడు వన్డేలు, ఐదు టి టీ20 మ్యాచ్‌లు ఆడనుందని చెప్పారు. అలాగే దేశమంతా కరోనా సెకండ్‌వేవ్ గురించి మాట్లాడుతున్నారు ఈ క్రమంలో 8-10 జట్లు వచ్చినపుడు కొంచెం కష్టమవుతుందని చెప్పారు. ముంబై, న్యూఢిల్లీలో కేసులు బాగా పెరిగినట్టు తెలుస్తోంది కాబట్టి చాలా అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని అంచనా వేయాలని గంగూలీ వెల్లడించారు. ఆస్ట్రేలియా పర్యటనలో నవంబర్ 27 న సిడ్నీ క్రికెట్ మైదానంలో భారత్ తొలి వన్డే ఆడనుంది. -
అక్షరాలా రూ. 4,000 కోట్ల ఆదాయం!
ముంబై: కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రీడలు ఆగిపోయాయి. కనీసం చిన్న స్థాయి టోర్నీ కూడా నిర్వహించలేని పరిస్థితి. మన దేశంలోనైతే రోజురోజుకూ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇలాంటి సమయంలో కూడా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2020లో కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నిర్వహణ గురించి ఆలోచించింది. ► సాధారణంగా ప్రతీ ఏటా నిర్వహించే ఏప్రిల్–మే షెడ్యూల్ సమయం గడిచిపోయినా ఆశలు కోల్పోలేదు. కోవిడ్–19 కాలంలో ఎన్నో కష్టాలకోర్చి క్రికెట్ నిర్వహించడం అవసరమా అని ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గలేదు. ► అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలన్నీ ఆలోచించి చివరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో విజయవంతంగా ఐపీఎల్‌ను నిర్వహించింది. బీసీసీఐ ఎందుకు ఇంతగా శ్రమించిందో తాజా లెక్కలు చూస్తే అర్థమవుతుంది. ► ఐపీఎల్–13 సీజన్ ద్వారా భారత బోర్డుకు ఏకంగా రూ. 4 వేల కోట్ల ఆదాయం వచ్చింది. లీగ్ జరపకుండా ఉండే ఇంత భారీ మొత్తాన్ని బోర్డు కోల్పోయేదేమో! తాజా సీజన్ ఐపీఎల్‌ను టీవీలో వీక్షించినవారి సంఖ్య గత ఏడాదికంటే 25 శాతం ఎక్కువగా ఉండటం విశేషం. –మరోవైపు ఐపీఎల్ సాగిన కాలంలో బోర్డు మొత్తంగా 1800 మందికి 30 వేల (ఆర్టీ–పీసీఆర్) కరోనా పరీక్షలు నిర్వహించడం మరో విశేషం. ఖర్చులు తగ్గించుకొని... సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు ఎలాంటి అంతరాయం లేకుండా జరిగిన 60 మ్యాచ్‌ల ఐపీఎల్ నిర్వహణకు సంబంధించి బోర్డు కోశాధికారి అరుణ్ ధుమాల్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ► ఐపీఎల్ తొలి మ్యాచ్‌కు దాదాపు రెండు నెలల ముందు ఎగ్జిబిషన్ టోర్నీ సమయంలో వరల్డ్ నంబర్‌వన్ టెన్నిస్ ప్లేయర్ జొకోవిచ్‌కు కరోనా రావడంతో మా లీగ్ నిర్వహణపై కూడా సందేహాలు కనిపించాయి. చాలా మంది మమ్మల్ని ముందుకు వెళ్లవద్దని వారించారు. ఎవరైనా క్రికెటర్‌కు కరోనా వస్తే ఎలా అని వారు అడిగారు. అయితే మేం వాటిని పట్టించుకోలేదు. ∙గత ఐపీఎల్‌తో పోలిస్తే బీసీసీఐ 35 శాతం నిర్వహణా ఖర్చులు తగ్గించుకుంది. నిర్వహణకు శ్రీలంక నుంచి కూడా ప్రతిపాదన వచ్చినా యూఏఐ వైపు మొగ్గు చూపాం. మూడు నగరాల మధ్యలో బస్సులో ప్రయాణించే అవకాశం ఉండటంతో అలా కూడా ఖర్చు తగ్గించాం. ► సుమారు 40 సార్లు కాన్ఫరెన్స్ కాల్స్ ద్వారా గంటలకొద్దీ చర్చలు సాగాయి. బయో సెక్యూర్ బబుల్ కోసం రెస్ట్రాటా అనే కంపెనీ సహకారం తీసుకున్నాం. బీసీసీఐ అధికారులు ముందుగా వెళ్లి ఐపీఎల్ ఫ్రాంచైజీల కోసం కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. క్వారంటైన్ విషయంలో దుబాయ్ ప్రభుత్వం ఆటగాళ్లకు సడలింపులు ఇచ్చినా... యూఏఈ ప్రభుత్వం ససేమిరా అంది. చివరకు ఎంతో శ్రమించి వారిని కూడా ఒప్పించగలిగాం. ఇంత చేసినా ఆరంభంలోనే చెన్నై బృందంలో చాలా మందికి కరోనా వచ్చినట్లు తేలడంలో ఆందోళన కలిగింది. అయితే ఆ తర్వాత అంతా కోలుకున్నారు. మొత్తంగా యూఏఈ ప్రభుత్వ సహకారంతో లీగ్ సూపర్ హిట్ కావడం సంతోషకరం. చివరకు మాకు రూ. 4 వేల కోట్ల ఆదాయం కూడా వచ్చింది. -
ఐపీఎల్ 2020: బీసీసీఐ ఆదాయం ఎంతంటే!
న్యూఢిల్లీ: క్యాష్ రిచ్ ఈవెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ కరోనా కాలంలోనూ భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి సిరులు కురిపించింది. యూఏఈ వేదికగా నిర్వహించిన ఐపీఎల్-13వ సీజన్‌కు గానూ బోర్డు సుమారు 4 వేల కోట్ల రూపాయాల ఆదాయాన్ని ఆర్జించింది. బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమల్ ఈ విషయాన్ని వెల్లడించారు. అదే విధంగా గతేడాదితో పోలిస్తే ఈసారి టీవీ వ్యూయర్షిప్ కూడా 25 శాతం మేర పెరిగిందని పేర్కొన్నారు. కాగా మహమ్మారి కరోనా దెబ్బకు క్రీడా ఈవెంట్లన్నీ వాయిదా పడ్డ వేళ ఐపీఎల్ నిర్వహణపై కూడా సందేహాలు తలెత్తిన విషయం తెలిసిందే. కోవిడ్ విజృంభణ నేపథ్యంలో మార్చి 29న మొదలు కావాల్సిన ఐపీఎల్-2020 సీజన్‌ను తొలుత వాయిదా వేశారు.(చదవండి: కోహ్లి త్వరలోనే ఆ ఘనత సాధిస్తాడు: భజ్జీ) ఆ తర్వాత జూన్-జులై నెలల్లో టోర్నీ నిర్వహణకు సన్నాహాలు చేసినా సాధ్యం పడకపోవడంతో.. ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేద్దామని బీసీసీఐ పెద్దలు భావించారు. అయితే టోర్నీ నిర్వహణకు యూఏఈ అనుకూలమని భావించిన బోర్డు.. అక్కడి అధికారులతో సంప్రదించగా సానుకూల స్పందన లభించింది. దీంతో కోవిడ్ నిబంధనల నడుమ సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు కొనసాగిన టోర్నీని బీసీసీఐ విజయవంతంగా పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో అత్యంత సంపన్న బోర్డుగా పేరొందిన బీసీసీఐ భారీ ఎత్తున ఆదాయం గడించినట్లు అరుణ్ ధుమాల్ తెలిపారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘‘గతేడాది ఐపీఎల్‌తో పోలిస్తే ఈసారి 35 శాతం మేర నిర్వహణ ఖర్చు తగ్గింది. కరోనా కాలంలో 4 వేల కోట్ల రూపాయాల ఆదాయం ఆర్జించాం. డిపెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్- చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య జరిగిన ఆరంభ మ్యాచ్‌కు విపరీతమైన ఆదరణ లభించింది. టీవీ వ్యూయర్షిప్ 25 శాతం వరకు పెరిగింది. తొలుత మాపై సందేహాలు వ్యక్తం చేసిన వారే ఐపీఎల్‌ను విజయవంతంగా పూర్తిచేసినందుకు మాకు ధన్యవాదాలు తెలిపారు. ఒకవేళ ఈ సీజన్ నిర్వహించకపోయి ఉంటే క్రికెటర్లు ఓ ఏడాది కాలాన్ని కోల్పేయేవారు’’ అని చెప్పుకొచ్చారు. (చదవండి: యూఏఈకి బీసీసీఐ బంపర్ బొనాంజ!) ఇక కోవిడ్ కాలంలో టోర్నీ నిర్వహణలో తీసుకున్న జాగ్రత్తల గురించి చెబుతూ.. ‘‘ఈ టీ20 లీగ్‌లో 53 రోజులపాటు మొత్తంగా 60 మ్యాచ్‌లు జరిగాయి. ఈ మెగా ఈవెంట్లో భాగంగా 1800 మందికి సుమారు 30 వేల మేర కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాం. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన పక్షంలో వారు కోలుకునేంత వరకు అన్ని రకాల చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. క్వారంటైన్ కోసం సుమారు 200 గదులు బుక్ చేశాం’’ అని అరుణ్ ధుమల్ పేర్కొన్నారు. కాగా ఐపీఎల్-13వ సీజన్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ముంబై ఇండియన్స్ ట్రోఫీని ఎగురేసుకుపోయిన సంగతి తెలిసిందే. తద్వారా ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన జట్టుగా రోహిత్ సేన చరిత్ర సృష్టించింది. -
‘ఆ క్లిప్స్ చూస్తూ కోహ్లి బిగ్గరగా నవ్వుతాడు’
సిడ్నీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిలో చాలా కోణాలున్నాయని ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా తెలిపాడు. మైదానంలో చూసే కోహ్లికి, ఆఫ్ ద ఫీల్డ్ చూసే కోహ్లికి చాలా తేడా ఉంటుందన్నాడు. ఈ ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీకి ఆడిన జంపా.. కోహ్లితో తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నాడు. ప్రతీ ఒక్కరి విషయంలో కోహ్లి చాలా హుందాగా ఉంటాడని ఈ మేరకు జంపా తెలిపాడు. మైదానంలో ప్రత్యర్థి జట్ల విషయంలో దూకుడుగా ఉండే కోహ్లి, మైదానం బయట మాత్రం ఆటగాళ్లతో చాలా సౌకర్యవంతంగా ఉంటాడన్నాడు. సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో జంపా పలు విషయాలను షేర్ చేసుకున్నాడు.(‘రాయుడ్ని ఎంపిక చేయకపోవడం మా తప్పే’) ‘ఆర్సీబీతో నా తొలి ఇంటరాక్షన్ కొత్తగా అనిపించలేదు. అందుకు కారణం కెప్టెన్ కోహ్లినే. నాతో ఎంతో పరిచయం ఉన్నట్లు కోహ్లి ప్రవర్తించేవాడు. ఆటకు సంబంధించి ప్రతీ విషయాన్ని చెప్పేవాడు. నేను దుబాయ్‌లో దిగిన వెంటనే వాట్సాప్ మెసేజ్ చేశాడు.నేను బాగా పరిచయం ఉన్న వ్యక్తిలా చాట్ చేశాడు. కోహ్లి దూకుడు ఏదైనా ఉందంటే అది మైదానం వరకే ఉంటుంది. కాంపిటేషన్‌ను బాగా ఇష్టపడతాడు. ఏజట్టుకు ఆడినా గెలుపే లక్ష్యంగా ముందుకు వెళతాడు. ఓటమిని అసహ్యించుకుంటాడు. ట్రెయినింగ్ సెషన్లో కానీ గేమ్‌లో కానీ పోటీ ఉండాలని కోహ్లి కోరుకుంటాడు. ఒక్క సారి ఫీల్డ్‌ను వదిలి పెడితే కూల్‌గా వ్యవహరిస్తాడు. కోహ్లి యూట్యూబ్ క్లిప్స్‌ను ఆస్వాదిస్తాడు. బస్సులో ప్రయానించేటప్పుడు యూట్యూబ్ క్లిప్స్ చూసి బిగ్గరగా నవ్వుతాడు. ఒక సరదా రనౌట్ క్లిప్‌ను చూసి కొన్ని వారాల పాటు తలచుకుని తలచుకుని నవ్వుకున్నాడు’ అని జంపా తెలిపాడు. -
కామారెడ్డి పోలీసుల్లో ఐపీఎల్ బెట్టింగ్ గుబులు!
-
పోలీసుల్ని కుదిపేస్తున్న బెట్టింగ్ కేసు!
సాక్షి, కామారెడ్డి: ఐపీఎల్ బెట్టింగ్ వ్యవహారం జిల్లా పోలీస్ శాఖను కుదిపేస్తోంది. బెట్టింగ్ కేసులో నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ.5 లక్షలు లంచం డిమాండ్ చేసిన కామారెడ్డి సీఐ జగదీశ్‌ను ఇప్పటికే ఏసీబీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించింది. రెండు రోజుల నుంచి అతని ఇంట్లో సోదాలు చేస్తోంది. నేడు కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉంది. సీఐ సన్నిహితుల పాత్రపైనా ఏసీబీ అధికారులు ఆరాతీస్తున్నారు. ఇక బెట్టింగ్ రాయుళ్లకు మధ్యవర్తిగా వ్యవహరించిన సుజయ్ కూడా ఏసీబీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో సుజయ్ ద్వారా మామూళ్లు తీసుకున్న పోలీసుల వివరాలను ఏసీబీ సేకరిస్తున్నట్టు సమాచారం. మామూళ్ల విషయంలో ఎస్సైలు, డీఎస్పీ లక్ష్మీనారాయణ పాత్రతో పాటు కింది స్థాయి సిబ్బంది హస్తం ఉందని ఏసీబీ అనుమానం వ్యక్తం చేసింది. నిన్న రాత్రి నుంచి డీఎస్పీ కార్యాలయంతో పాటు ఇంట్లో కూడా ఏసీబీ సోదాలు చేస్తోంది. గత రాత్రి కామారెడ్డి డీఎస్పీని విచారించారు. ఇక మామూళ్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఎస్సైలలో ఒకరు సెలవులో ఉండగా.. మరొకరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో బెట్టింగ్ రాయుళ్లతో చేతులు కలిపిన పోలీస్ అధికారుల్లో టెన్షన్ మొదలైంది. విచారణ అనంతరం పూర్తి వివరాలు ఏసీబీ అధికారులు తెలిపారు. (చదవండి: బెయిల్ కోసం కామారెడ్డి సీఐ చేతివాటం) -
‘ఐపీఎల్‌కు వెళ్లకుండా ఆపండి’
మెల్బోర్న్: ఫ్రాంచైజీ క్రికెట్‌పై మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశాడు ఆసీస్ మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్. అక్టోబర్‌లో టీ20 వరల్డ్‌కప్ ఆరంభం కావాల్సిన ఉన్నప్పటికీ కరోనా వైరస్ కారణంగా అది వచ్చే ఏడాదికి వాయిదా పడింది. కాగా, ఆ సమయంలోనే ఐపీఎల్‌ను బీసీసీఐ నిర్వహించింది. దీనిని తీవ్రంగా తప్పుబట్టాడు బోర్డర్. ప్రపంచస్థాయి గేమ్స్‌కు ప్రాధాన్యత ఇవ్వకుండా ఐపీఎల్ వంటి లీగ్స్‌కు ఎందుకు ప్రయారిటీ ఇస్తున్నారని ప్రశ్నించాడు. ఈ విషయంలో ఆయా దేశాల క్రికెట్ బోర్డులు మేల్కోనాల్సిన అవసరం ఉందన్నాడు. ఆటగాళ్లను ఐపీఎల్‌కు వెళ్లకుండా ఆపాలని డిమాండ్ చేశాడు. తొలి ప్రాధాన్యత ఏదనే విషయం అందరికీ తెలిసినా, ఇక్కడ డబ్బు మాయలో అంతా పడిపోతున్నారన్నాడు. ఇది మంచి పరిణామం కాదని బోర్డర్ విమర్శించాడు. (వేరే జట్లకు చేయగలడా.. ఆ అవసరం నాకు లేదు: రోహిత్) లోకల్ టోర్నీల కంటే వరల్డ్ గేమ్స్‌కే ప్రాముఖ్యత ఇవ్వాలన్నాడు. ఈ విషయంలో బోర్డులు ఆటగాళ్లను కట్టడి చేయాల్సిన ఇక నుంచైనా చేయాలన్నాడు. ఇక కోహ్లి వంటి దూకుడైన ఆటగాళ్లు, టీమిండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి క్రికెట్ జట్లు టెస్టు క్రికెట్‌ను బ్రతికించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నాడు. పెరుగుతున్న ఫ్రాంచైజీ క్రికెట్ నుంచి టెస్టు క్రికెట్‌ను కాపాడాలని బోర్డర్ విన్నవించాడు.గత నెలలో బీసీసీఐపై బోర్డర్ విమర్శలు చేశాడు. బీసీసీఐ ఎప్పుడూ మైండ్ గేమ్ ఆడుతూ తమకు అనువుగా ప్రణాళికను ప్లాన్ చేసుకుంటుందని విమర్శించాడు. టీ20 వరల్డ్‌కప్ స్థానంలో ఐపీఎల్ నిర్వహించడంతో బోర్డర్ మండిపడ్డాడు. వరల్డ్ క్రికెట్లో తాము శక్తివంతులమని బీసీసీఐ భావిస్తోందని, ఆర్థికంగా బలంగా ఉన్నా విషయాల్లో కచ్చితత్వం అనేది అవసరమని బోర్డర్ పేర్కొన్నాడు. -
కోహ్లి ఎప్పుడూ దూకుడుగానే ఉంటాడు..
న్యూఢిల్లీ: ‘‘అసలు ఆరోజు జరిగింది అంత పెద్ద విషయమేమీ కాదు. హోరాహోరీగా మ్యాచ్ జరుగుతున్న వేళ ఆ ఘటన చోటుచేసుకుంది. నిజానికి అది అంతగా హైలెట్ అవ్వడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది’’ అంటూ ముంబై ఇండియన్స్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్, ఆర్సీబీ సారథి, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో తనకు ఎదురైన అనుభవం గురించి చెప్పుకొచ్చాడు. ఐపీఎల్-2020 సీజన్లో సూర్యకుమార్ యాదవ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. రాయల్ చాలెంజర్స్ జట్టుతో జరిగిన కీలకమైన మ్యాచ్‌లో జట్టును విజయతీరాలకు చేర్చి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. సదరు మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొందిన డిపెండింగ్ చాంపియన్, ముంబై ఎనిమిదో విజయం తన ఖాతాలో వేసుకుని ప్లేఆఫ్స్‌కు చేరువైంది. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా సూర్యకుమార్, కోహ్లి మధ్య జరిగిన ఘటన క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. (చదవండి: మూడోసారి తండ్రైన ఏబీ డివిల్లియర్స్) ఈ మ్యాచ్‌లో 13వ ఓవర్లో కోహ్లి బంతిని షైన్ చేస్తూ యాదవ్ వద్దకు వచ్చి దూకుడు ప్రదర్శించాడు. అయితే అతడు మాత్రం ఏమాత్రం స్పందన లేకుండా కళ్లతోనే బదులిస్తూ కోహ్లి నుంచి దూరంగా వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో నెటిజన్లు కోహ్లి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా.. అప్పటికే ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరే టీమిండియా జట్టును ప్రకటించగా, సూర్యకుమార్‌కు అందులో చోటు దక్కకపోవడంతో.. దేశవాళీ, ఫ్రాంఛైజ్ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నా.. అతడిని ఉద్దేశపూర్వకంగానే జాతీయ జట్టులోకి ఎంపిక చేయలేదంటూ విమర్శలు గుప్పించారు.(చదవండి: సూర్యకుమార్‌పై ప్రశంసలు.. కాస్త ఓపిక పట్టు!) ఇక ఆనాటి ఘటనపై స్పందించిన సూర్యకుమార్ యాదవ్ స్పోర్ట్స్ తక్‌తో మాట్లాడుతూ.. ‘‘కేవలం ముంబై ఇండియన్స్‌పై ఆడిన మ్యాచ్‌లోనే కాదు.. ప్రతీ మ్యాచ్‌లోనూ తాను ఎనర్జిటిక్‌గానే కనిపిస్తాడు. టీమిండియాకు ఆడినా, ఫ్రాంఛైజ్ క్రికెట్ అయినా, ప్రత్యర్థి జట్టు ఏదైనా సరే తను అంతే దూకుడుగా ఉంటాడు. నిజానికి ఆనాటి మ్యాచ్ ఆర్సీబీకి ఎంతో కీలకమైంది. బహుశా అందుకే అలా జరిగిందేమో. కానీ మ్యాచ్ ముగిసిన తర్వాత తను నార్మల్ అయిపోయాడు. అంతేకాదు బాగా ఆడావంటూ నాకు శుభాకాంక్షలు తెలిపాడు కూడా’’ అని కోహ్లి గురించి చెప్పుకొచ్చాడు. ఇక తనను ఆసీస్ పర్యటనకు ఎంపిక చేయకపోవడం నిరాశ కలిగించినప్పటికీ, ఏదేమైనా షో కొనసాగుతూనే ఉంటుందని నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. ఇదిలా ఉండగా.. రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై జట్టు ఐపీఎల్-2020 ట్రోఫీని సొంతం చేసుకుని, ఐదోసారి టైటిల్‌ను ఎగురేసుకుపోయిన సంగతి తెలిసిందే. Surya Kumar Yadav’s Stare At Virat Kohli Goes Viral On Social Media#viratkholi #SuryakumarYadav #StareWar #IPL2020 pic.twitter.com/wdnwg2JWi5 — Sagar (@disagar_) October 29, 2020 -
అలా సెహ్వాగ్ వార్తల్లో ఉంటాడు: మాక్స్వెల్
మెల్బోర్న్: టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనపై చేసిన విమర్శలపై ఆసీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ స్పందించాడు. తనపై ఉన్న అయిష్టాన్ని వెళ్లగక్కడం వీరూకు ఇష్టమని, తను ఏదైనా మాట్లాడగలడంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020 సీజన్లో మ్యాక్స్‌వెల్ దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు తరఫున బరిలోకి దిగిన అతడు 13 మ్యాచ్‌ల్లో కేవలం 108 పరుగులు మాత్రమే చేశాడు. ఒక్క సిక్సర్ కూడా కొట్టలేక చతికిలబడ్డాడు. దీంతో అతడిపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ‘‘10 కోట్ల చీర్లీడర్’’ అంటూ సెహ్వాగ్ మాక్స్‌వెల్‌ను ఎద్దేవా చేశాడు. కోట్లు పెట్టి కొన్న జట్టుకు న్యాయం చేయలేదనే ఉద్దేశంతో, యూఏఈలో అత్యంత ఖరీదైన వెకేషన్ ట్రిప్‌ను ఎంజాయ్ చేశాడంటూ విమర్శించాడు. (చదవండి: ‘రాహుల్ కెప్టెన్సీ అద్భుతమని చెప్పలేను’) ఇక వీరూ వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన మాక్స్వెల్.. ది వెస్ట్రన్ ఆస్ట్రేలియన్‌తో మాట్లాడుతూ.. ‘‘మరేం పర్లేదు. వీరూ నా మీద ఉన్న అయిష్టాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. తనకు నచ్చింది మాట్లాడే హక్కు అతడికి ఉంది. ఇలాంటి వ్యాఖ్యలతో తను తరచుగా మీడియాలో కనిపిస్తూ ఉంటాడు. బాగుంది. దీని గురించి నేను పట్టించుకోను’’ అని పేర్కొన్నాడు. కాగా మ్యాక్స్‌వెల్, వెస్టిండీస్ బౌలర్ షెల్డన్ కాట్రెల్ల ప్రదర్శనపై తీవ్ర అసహనంతో ఉన్న పంజాబ్ జట్టు యాజమాన్యం వారిపై వేటు వేసేందుకు సిద్ధమైంది. వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్‌కు మరో ఆరు నెలల సమయం మాత్రమే ఉండటంతో... భారీ మార్పులు చేపట్టేందుకు సమాయత్తమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సీజన్లో తొలి అర్ధభాగంలో ఒకే ఒక్క మ్యాచ్ గెలిచిన పంజాబ్.. ఆ తర్వాత వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచింది. అయితే చివరి రెండు మ్యాచుల్లో ఓడటంతో లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది. -
‘రాహుల్ కెప్టెన్సీ అద్భుతమని చెప్పలేను’
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2020 సీజన్లో భాగంగా తొలిసారిగా కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన కేఎల్ రాహుల్ తన బాధ్యతను సమర్థవంతంగా నెరవేర్చాడు. తొలుత వరుస వైఫల్యాలతో డీలా పడిన జట్టును.. ప్లే ఆఫ్స్ దిశగా దూసుకుపోయేలా ముందుండి నడిపించాడు. అయితే చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలు కావడంతో పంజాబ్ లీగ్ దశలోనే వెనుదిరిగినప్పటికీ అభిమానుల మనసు గెలుచుకుంది. సీజన్ మొదటి అర్ధభాగంలో కేవలం ఒకే ఒక్క విజయం సాధించిన పంజాబ్ జట్టు.. ఊహించలేని విధంగా వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి సత్తా చాటింది. ఈ నేపథ్యంలో వ్యక్తిగతంగా అద్భుత ప్రదర్శన కనబరిచిన కేఎల్ రాహుల్ .. సారథిగానూ మంచి మార్కులే కొట్టేశాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. (చదవండి: కోట్లు పెట్టి కొన్నాం, వదిలించుకోక తప్పదు!) అదే విధంగా ఈ సీజన్లో 14 మ్యాచుల్లో 55.83 సగటుతో 670 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌ను గెల్చుకున్న ఈ కర్ణాటక బ్యాటర్‌పై ప్రశంసలు వెల్లువెత్తాయి. కాగా టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా మాత్రం కేఎల్ రాహుల్ పూర్తిస్థాయిలో తన సామర్థ్యాన్ని వినియోగించుకోలేదని అభిప్రాయపడ్డాడు. కెప్టెన్‌గా అతడికి పదికి ఏడున్నర మార్కులు వేస్తానని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కెప్టెన్ కేఎల్ రాహుల్ నాయకత్వ లక్షణాలపై తన యూట్యూబ్ చానెల్ వేదికగా స్పందిస్తూ.. ‘‘రాహుల్ కెప్టెన్సీ అద్భుతమని చెప్పలేను. అలాగని మరీ అంత బాగాలేదని చెప్పలేను. 50-50గా ఉంది. జట్టు వైఫల్యాలకు కెప్టెన్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. మెరుగైన ప్రదర్శన కనబరిచే జట్టు(పదకొండు మందిని)ను ఎంచుకోవడంలో అతడు తడబడ్డాడు. ఎంపికలో యాజమాన్య నిర్ణయం కూడా ఉంటుందని తెలుసు. అయితే రాహుల్ కూడా తన మార్కు చూపాల్సింది. ఏదేమైనా ఈ సీజన్లో రాహుల్ బాగానే ఆకట్టుకున్నాడు. అయితే సారథిగా తను ఇంకొంత మెరుగవ్వాల్సి ఉందనేది నా అభిప్రాయం. ఈ విషయంలో అతడికి నేను 10కి 7.5 మార్కులు ఇస్తున్నా’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.(కోహ్లిపై ట్రోలింగ్.. ఆర్సీబీ వివరణ) -
ధోనిని వదిలించుకోండి.. లేకుంటే నష్టమే
న్యూఢిల్లీ: ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఈసారి చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) ఘోరపరాభవం పొందిన విషయం తెలిసిందే. 2011లో తన స్కిల్స్‌తో టీమిండియాకు ప్రపంచ కప్ అందించిన ధోని గతేడాది వన్డేకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2020లో అతడు ఆడతాడో లేదోనని అనుమానాలు వ్యక్తం అవుతున్న తరుణంలో ధోని సీఎస్కే తరపున ఆడుతున్నట్లు ఆ జట్టు యాజమాన్యం స్పష్టం చేసింది. ఇక ఈ ఐపీఎల్ సీఎస్కే చెత్త ప్రదర్శన కారణంగా ఆటగాడిగా ధోని చివరి రోజులు లెక్కబెడుతున్నాడని, ఫిట్నెస్ కొల్పోయాడంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేగాక కెప్టెన్‌గా టీంను నడిపించడంలో మానసికంగా కూడా విఫలమయ్యాడంటూ విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా సైతం ధోని గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ ఐపీఎల్లో ధోని ఆటను ఉద్దేశిస్తూ.. అతడిని వచ్చే ఐపీఎల్ వేలానికి విడుదల చేసి మళ్లీ తక్కువ రేటుకు కొనుగోలు చేసుకోండి’ అని సీఎస్కే యాజమాన్యానికి సూచించాడు. (చదవండి: ధోని కెప్టెన్సీ వదులుకుంటే.. అతడికే అవకాశం!) చదవండి: ‘కడక్‌నాథ్’ కోళ్ల బిజినెస్‌లోకి ధోని ఎంట్రీ! ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ... ఒకవేళ వచ్చే ఏడాది ఐపీఎల్ సీఎస్కే మెగా ఆక్షన్(వేలంపాట) ఉన్నట్లైతే ధోనీని రిలీజ్ చేయమని చెన్నై జట్టు యాజమాన్యానికి చెప్పాడు. ఒకవేళ ధోనీని అలాగే ఉంచుకుంటే సీఎస్కే రూ. 15 కోట్లు నష్టపోతుందన్నాడు. కాబట్టి సీఎస్కే యాజమాన్యం ధోనీని వచ్చే ఏడాది ఆక్షన్ పూల్‌కు(వేలంపాట) విడుదల చేసి.. అక్కడ రైట్ టూ మ్యాచ్ కార్డును సీఎస్కే ఉపయోగించుకోవాలన్నాడు. అంటే ధోనిని మళ్లీ వేలంలో తక్కువ ధరకు కొనుగోలు చేసుకొమ్మని సీఎస్కేకు సలహా ఇచ్చాడు. ఎందుకంటే అతడిని అలాగే ఉంచుకుంటే సీఎస్కే ధోనికి రూ. 15 కోట్లు చెల్లించుకోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో మాత్రం ఇలా చెప్తున్నాను తప్పా ధోనిని వదులుకొమ్మని కాదని స్పష్టం చేశాడు. ఈ విధంగా సీఎస్కే యాజమాన్యం చేస్తే చైన్నై జట్టుకు డబ్బులు మిగులుతాయని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. (చదవండి: చంపేస్తామంటూ బెదిరింపులు.. షకీబ్ క్షమాపణ) -
ఐపీఎల్: యూఏఈకి బీసీసీఐ బంపర్ బొనాంజ!
దుబాయ్: కరోనా అడ్డంకులను దాటుకుని ఐపీఎల్ 13వ సీజన్ సక్సెస్ అయిందంటే కారణం వేదిక యూఏఈ కావడమే! రెండున్నర నెలలపాటు క్రికెట్ అభిమానులను అలరించిన ఐపీఎల్ 2020 నిర్వహణకు సంబంధించి యూఏఈకి బీసీసీఐ భారీ మొత్తంలోనే ముట్టజెప్పినట్టు జాతీయ మీడియా తెలిపింది. దాదాపు రూ.100 కోట్ల రూపాయలు యూఏఈకి అందినట్టు సమాచారం. కాగా, ఏప్రిల్-మే నెలల్లో భారత్‌లో నిర్వహించాల్సిన ఐపీఎల్ 13 వ సీజన్ కరోనా విజృంభణతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. అనంతరం జూన్-జులై నెలల్లో టోర్నీ నిర్వహణకు సన్నాహాలు చేసినా సాధ్యం కాలేదు. దాంతో ఈ ఏడాది ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేద్దామని భావించారు. (చదవండి: సీఎస్కే కెప్టెన్‌గా అతడికే అవకాశం!) అయితే, టోర్నీ నిర్వహణకు యూఏఈ అనుకూలమని భావించిన బీసీసీఐ అధికారులు.. అక్కడి అధికారులతో సంప్రదింపులు జరిపారు. 2014 ఐపీఎల్‌కు వేదికైన యూఏఈ.. ఐపీఎల్ 2020కి ఓకే చెప్పడంతో మార్గం సుగమమైంది. బీసీసీఐ, ఐపీఎల్ సిబ్బంది, ఆటగాళ్లు, యూఏఈ అధికారుల సహకారంతో సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు ఐపీఎల్ తాజా సీజన్ దిగ్విజయంగా కొనసాగింది. ఇదిలాఉండగా.. వచ్చే ఏడాది ప్రారంభంలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగనున్న టెస్టు సిరీస్ కూడా యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. (చదవండి: ‘కడక్‌నాథ్’ కోళ్ల బిజినెస్‌లోకి ధోని ఎంట్రీ!) -
ధోని కెప్టెన్సీ వదులుకుంటే.. అతడికే అవకాశం!
న్యూఢిల్లీ: చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు పగ్గాలను సౌతాఫ్రికా క్రికెటర్ ఫాఫ్ డుప్లెసిస్ చేపట్టే అవకాశాలు ఉన్నాయని టీమిండియా బ్యాటింగ్ మాజీ కోచ్ సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డాడు. ఆటగాడిగా కొనసాగేందుకే మొగ్గుచూపే క్రమంలో ధోని కెప్టెన్సీ విధుల తప్పుకొని, ఆ బాధ్యతలను డుప్లెసిస్‌కు అప్పగిస్తాడని భావిస్తున్నానన్నాడు. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్లో సీఎస్కే కొత్త కెప్టెన్ చూడబోతున్నామని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్- 2020 సీజన్లో ప్లే ఆఫ్స్ దశలోనే నిష్క్రమించిన తొలి జట్టుగా చెన్నై అపఖ్యాతి మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. మూడుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా, దాదాపు ఐదుసార్లు రన్నరప్‌గా నిలిచిన సీఎస్కే లీగ్ దశలోనే ఇంటిబాట పట్టడం టోర్నీ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ సీజన్ ఆరంభానికి ముందే ఆటగాళ్లు కరోనా బారిన పడటం, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఆదిలోనే జట్టుకు దూరం కావడం వంటి అంశాలు జట్టు వైఫల్యాలపై ప్రభావం చూపాయి. వరుస ఓటములు వెంటాడటంతో ధోని సేన ప్లేఆఫ్స్‌కు కూడా చేరకుండా వెనుదిరిగింది. (చదవండి: వచ్చే ఏడాది కూడా ధోనీ సారథ్యంలోనే!) ఈ క్రమంలో కెప్టెన్ ధోనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకొంటే మంచిదని, జట్టును ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందంటూ నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగారు. అయితే సీఎస్కే జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్ మాత్రం ఐపీఎల్ 2021 సీజన్లో కూడా ధోనియే, చెన్నై టీంకు సారథ్యం వహిస్తారని స్పష్టం చేశారు. అయినప్పటికీ ధోని కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పనున్నాడనే ఊహాగానాలకు తెరపడలేదు. ఈ నేపథ్యంలో సంజయ్ బంగర్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ నాకు తెలిసినంత వరకు 2011 తర్వాత ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలో మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్న సమయంలో కెప్టెన్ క్యాండిడేట్ సిద్ధంగా లేనందు వల్లే ధోని సారథ్య బాధ్యతలు మోయక తప్పలేదు. ఆ తర్వాత సరైన సమయం చూసి విరాట్ కోహ్లికి జట్టు పగ్గాలు అందించాడు. ఆ తర్వాత ధోని ఆటగాడిగా కొనసాగాడు. ఇప్పుడు కూడా ధోని అదే తరహాలో ఆలోచిస్తాడనుకుంటున్నా. వచ్చే ఏడాది తను సీఎస్కే కెప్టెన్‌గా ఉండకపోవచ్చు. డుప్లెసిస్‌కు ఆ బాధ్యతలు అప్పజెప్పి తను ఆటగాడిగా కొనసాగుతాడేమో. ఇప్పుడు వాళ్లకు డుప్లెసిస్ ఒక్కడే మెరుగైన ఆప్షన్. ఎందుకంటే అద్భుతంగా రాణించే ఆటగాడిని ఏ జట్టు వదులుకోదు. సీఎస్‌కు కెప్టెన్ అయ్యే స్థాయి ఉన్న వ్యక్తి అసలు వేలంలోకే రాడు’’ అని చెప్పుకొచ్చాడు. కాగా దక్షిణాఫ్రికా సీనియర్ బ్యాట్స్‌మన్, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఈ ఏడాది ఆరంభంలో సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. తమ జట్టుకు ఇప్పుడు కొత్త తరం నాయకత్వం అత్యవసరమని వ్యాఖ్యానిస్తూ టెస్టు, టి20 జట్ల సారథ్యానికి గుడ్‌బై చెప్పాడు. అలాంటి వ్యక్తి ఐపీఎల్-2021 సీజన్లో ధోని నిజంగానే కెప్టెన్సీ వదులుకుంటే, ఆ బాధ్యతలు స్వీకరిస్తాడా లేదా అన్నది చర్చనీయాంశం. ఇక గతంలో ధోని దమ్మున్న నాయకుడంటూ డుప్లెసిస్ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. అతనో అసాధారణ, ప్రత్యేకమైన నాయకుడంటూ మహీ నాయకత్వ లక్షణాలపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ‘ఎదుటి వ్యక్తి ఆలోచనల్ని చదవడంలో ధోని దిట్ట. మైదానంలో ఉన్నపళంగా తీసుకునే సరైన నిర్ణయాలే ధోనిని ప్రత్యేకంగా నిలిపాయి’’ అంటూ కొనియాడాడు. -
ఇదే సరైన సమయం...
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను మరింత విస్తరించేందుకు ఇది సరైన సమయమని భారత మాజీ కెప్టెన్, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. లీగ్ నాణ్యతలో రాజీ పడకుండా జట్ల సంఖ్యను పెంచినట్లయితే యువ క్రికెటర్లకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ పరంగా గత దశాబ్ధం భారత్‌కు అత్యుత్తమమని పేర్కొన్నాడు. 2011 ప్రపంచకప్, 2013 చాంపియన్స్ ట్రోఫీలను గెలుచుకోవడంతో పాటు టి20 ప్రపంచకప్‌లోనూ గొప్ప ప్రదర్శనలు నమోదయ్యాయని అన్నాడు. రాజస్తాన్ రాయల్స్ సహ యజమాని మనోజ్ బదాలే రాసిన పుస్తకం ‘ఎ న్యూ ఇన్నింగ్స్’ వర్చువల్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ద్రవిడ్ ఈ అంశంపై మాట్లాడాడు. ‘ప్రతిభపరంగా చూస్తే ఐపీఎల్‌ను విస్తరించాల్సిన సమయం వచ్చిందని నేను భావిస్తున్నా. సత్తా ఉన్న ఎందరో క్రికెటర్లకు ఈ వేదికపై ఇంకా ఆడే అవకాశం దక్కడం లేదు. ఐపీఎల్లో జట్ల సంఖ్య పెంచితే వీరందరికీ అవకాశం లభిస్తుంది. ప్రతిభ చాటేందుకు చాలామంది యువ క్రికెటర్లు సిద్ధంగా ఉన్నారు. అయితే లీగ్ నాణ్యతలో ఏమాత్రం తేడా రాకుండా ఈ విస్తరణ చేపట్టాలి. తొలుత రంజీలకు ఎంపిక కావాలంటే రాష్ట్ర సంఘాలపై ఆధారపడాల్సి వచ్చేది. క్రికెటర్లకు పరిమిత అవకాశాలుండేవి. ఇప్పడు ఐపీఎల్‌తో పరిస్థితి మారిపోయింది. కోచ్‌లుగా మేం కొంత మాత్రమే సహకరించగలం. కానీ అనుభవం ద్వారానే యువ ఆటగాళ్లు చాలా నేర్చుకుంటారు. లీగ్‌లో యువ దేవదత్... సీనియర్లు విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌లతో కలిసి బ్యాటింగ్ చేశాడు. ఈ అనుభవం జాతీయ జట్టుకు ఆడటానికి ఉపయోగపడుతుంది. ఐపీఎల్లో రాణించడం వల్లే నటరాజన్ టీమిండియాకు ఎంపికయ్యాడు’ అని ద్రవిడ్ వివరించాడు. ద్రవిడ్ అభిప్రాయాన్ని మనోజ్ స్వాగతించాడు. వచ్చే ఏడాది 9 జట్లతో కూడిన ఐపీఎల్ నిర్వహణ కచ్చితంగా సాధ్యమేనని వ్యాఖ్యానించాడు. ఈ దిశగా బీసీసీఐ ఆలోచించాలని సూచించాడు. రికార్డు స్థాయిలో ఐదోసారి ఐపీఎల్ టైటిల్ సాధించిన ముంబై ఇండియన్స్‌ను ద్రవిడ్ అభినందించాడు. ప్రపంచ స్థాయి టి20 క్రికెటర్లతో పాటు యువకులతో కూడిన ముంబై అన్ని రంగాల్లో పటిష్టంగా ఉందని వ్యాఖ్యానించాడు. -
ఆరు గంటల పాటు కృనాల్ విచారణ
ముంబై: ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాను సుదీర్ఘ విచారణ అనంతరం కస్టమ్స్ అధికారులు విడిచిపెట్టారు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్ దుబాయ్ నుంచి గురువారం ముంబై చేరుకున్నాడు. అతని వద్ద విలువైన వస్తువులు (ధ్రువపత్రాలు లేని), బంగా రం ఉండటంతో ఎయిర్పోర్ట్ అధికారులు అడ్డగించారు. పరిమితికి మించి బంగారం, అత్యంత విలువైన నాలుగు లగ్జరీ వాచ్‌లు (ఒమెగా, అంబులర్ పిగెట్ బ్రాండ్లు) దుబాయ్‌లో కొనుగోలు చేసినట్లు తెలిసింది. భారత కరెన్సీలో దీని విలువ సుమారు రూ. కోటి. ఈ విచారణ అర్ధరాత్రి దాకా సాగింది. నిబంధనలు తెలియకే ఇంతగా కొనుగోలు చేశానని, పన్నులతో పాటు జరిమానా కూడా కడతానని విచారణ సందర్భంగా అతను క్షమాపణలు చెప్పడంతో అధికారులు అతన్ని విడిచిపెట్టారు. అయితే అతను తెచ్చిన వస్తువుల్ని తిరిగివ్వలేదు. విలువైన బ్రాండ్లకు చెందిన వాచీలను కొనుగోలు చేసిన కృనాల్ దీనికి సంబంధించి కస్టమ్స్ డ్యూటీ చెల్లించలేదు. ఇప్పుడు వీటిపై 38 శాతం డ్యూటీ, అదనంగా జరిమానా చెల్లించాక... దర్యాప్తు మొత్తం పూర్తయ్యాకే వీటిని అతనికి అప్పగిస్తారు. -
రోహిత్ ఫిట్నెస్ 70%
ముంబై: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ఐదో టైటిల్ అందించిన కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఫిట్నెస్ పరంగా ఇంకా వెనుకబడే ఉన్నాడని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు గంగూలీ తెలిపాడు. ఓ ఆంగ్ల మేగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దాదా మాట్లాడుతూ ‘రోహిత్ ఇంకా 70 శాతమే ఫిట్‌గా ఉన్నాడు. అందుకనే ఈ స్టార్ ఓపెనర్‌ని వన్డే, టి20 జట్లకు ఎంపిక చేయలేదు. టెస్టు సిరీస్‌కు ఇంకా సమయం ఉండటంతో ఆలోపు పూర్తి ఫిట్నెస్ సంతరించుకుంటాడనే సంప్రదాయ ఫార్మాట్‌కు ఎంపిక చేశాం. అయినా తన ఫిట్నెస్ గురించి అతడినే ఎందుకు అడగరు’ అని వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ మధ్యలోనే ‘హిట్‌మ్యాన్’ గాయపడ్డాడు. గత నెల 18న పంజాబ్‌తో జరిగిన పోరులో రోహిత్ తొడ కండరాల గాయానికి గురయ్యాడు. దీంతో అతను తర్వాతి నాలుగు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. తర్వాత కీలకమైన ప్లే ఆఫ్ దశకు ముందు మ్యాచ్ నుంచే జట్టుకు అందుబాటులో ఉన్నాడు. ఫైనల్లో అర్ధసెంచరీ సాధించి జట్టును గెలిపించాడు. అయితే ఈ సమయంలోనే గంగూలీ అతన్ని జాగ్రత్త పడమన్నాడు. ఈ ఐపీఎలే తన కెరీర్‌కు ఆఖరు కాదని, ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమివ్వాలని సూచించాడు. రోహిత్‌లాంటి స్టార్ బ్యాట్స్‌మన్‌ను తొలగించలేదని, వైస్ కెప్టెన్ (పరిమిత ఓవర్ల ఫార్మాట్)కు విశ్రాంతి ఇచ్చామని అప్పట్లో దాదా చెప్పాడు. బోర్డు చీఫ్ సూచనల్ని ఏమా త్రం లెక్కచేయని రోహిత్ ఫైనల్ సహా వరుసగా మూడు మ్యాచ్‌లు ఆడాడు. అతను బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో పునరావాస శిబిరంలో తన ఫిట్నెస్ మెరుగుపర్చుకున్నాక టెస్టుల కోసం ఆసీస్‌కు బయల్దేరతాడు. రోహిత్‌ను పక్కనబెట్టిన సెలక్టర్లు గాయపడిన వృద్ధిమాన్ సాహా ను ఆస్ట్రేలియాకు పంపడంపై వస్తున్న విమర్శలపై గంగూలీ సమాధానమిచ్చాడు. ‘సాహా టెస్టు సిరీస్‌కల్లా కోలుకుంటాడనే అతన్ని అక్కడికి పంపాం. ఐపీఎల్ ఆద్యం తం బోర్డు ట్రెయినర్లు, భారత జట్టు ఫిజియో డాక్టర్ నితిన్ పటేల్ దుబాయ్‌లోనే ఉన్నారు. ఆటగాళ్ల గాయాలు, తీరుతెన్నుల్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉన్నారు. ఇవన్నీ జనాలకు తెలీదు. కాబట్టే ఇష్టమొచ్చినట్లు విమర్శిస్తుంటారు. కానీ బోర్డు పనేంటో బోర్డు చక్కబెడుతుంది. గాయాలు ఆటగాళ్లకు తెలుసు, ఈ సమస్యల్ని ఎలా అధిగమించాలో ఫిజియోకు, ఎన్సీఏకు తెలుసు. సాధారణ ప్రజలకేం తెలుసు’ అని గంగూలీ విమర్శకుల్ని తూర్పారబట్టాడు. -
దుబాయ్ బంగారం: కృనాల్ పాండ్యాకు షాక్
సాక్షి, ముంబై : టీమిండియా ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాకు భారీ షాక్ తగిలింది. ఐపీఎల్ 2020 క్రికెట్ సంబరం ముగిసిన అనంతరం భారత్‌కు తిరిగి వస్తుండగా ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో పాండ్యాకు ఎదురుదెబ్బ తగిలింది. దుబాయ్ నుంచి బంగారంతోపాటు ఇతర విలువైన వస్తువులను అక్రమంగా తీసుకొస్తున్నారనే ఆరోపణలతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) వర్గాలు అతడిని అడ్డుకున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) నుంచి బంగారాన్ని అక్రమంగా తీసుకువచ్చాడనే ఆరోపణలతో క్రునాల్ పాండ్యాను విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నామని డీఆర్ఐ వర్గాలు తెలిపాయి. దీనిపై నిర్దిష్ట సమాచారాన్ని వెల్లడించలేదు. కానీ పరిమితి కంటే ఎక్కువ బంగారం దీనితో పాటు మరికొన్ని విలువైన వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. హార్దిక్ పాండ్య సోదరుడైన కృనాల్ ఎడమచేతి వాటం బ్యాట్స్ మాన్, బౌలర్‌గా రాణిస్తున్నారు. పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా పాండ్యా ప్రాతినిధ్యం వహించిన ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2020 టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. Cricketer Krunal Pandya stopped by Directorate of Revenue Intelligence (DRI) at the Mumbai International Airport over suspicion of being in possession of undisclosed gold and other valuables, while returning from UAE: DRI sources pic.twitter.com/9Yk82coBgz — ANI (@ANI) November 12, 2020 -
ఐపీఎల్‌ది అన్నింటికంటే భిన్నమైన కథ
ప్రతీ ఐపీఎల్‌కు ఒక కథ ఉంటుంది... ఈ సారి ఐపీఎల్‌ది అన్నింటికంటే భిన్నమైన కథ... కరోనా ఐపీఎల్‌ను ఆపేస్తుందని అంతా అనుకున్నారు. కానీ అస్సలు జరగలేదు... ఖాళీ స్టేడియాలు బోర్ కొట్టిస్తాయని అంతా అనుకున్నారు. అయితే అదీ జరగలేదు... చెన్నై క్వాలిఫై కావడమనేది సహజసిద్ధమైన నిబంధన... కానీ అలా కూడా జరగలేదు. పది రోజుల ముందే ప్లే ఆఫ్స్ స్థానాలు ఖరారవుతాయని అనిపించింది. ఏమాత్రం అలా జరగలేదు... 224 పరుగులు చేస్తే గెలుపు ఖాయమనిపించింది. చివరకు ఇది కూడా సాధ్యం కాలేదు... ఒక సూపర్ ఓవర్‌తో ఫలితం వస్తుందని అనిపించింది. కానీ అదీ సరిపోలేదు.... అయితే ఇవన్నీ జరగకపోయినా ఒకటి మాత్రం కచ్చితంగా జరిగింది. అదే ఐపీఎల్ సూపర్ హిట్... విజేత, పరాజితుల గురించి పక్కన పెడితే అభిమానులను అలరించడంలో మాత్రం లీగ్ ఎక్కడా తగ్గలేదు. కోవిడ్–19 సమయంలో అభిమానులకు ఈ టోర్నీ పూర్తి వినోదాన్ని పంచిందనడంలో సందేహం లేదు. ఐపీఎల్–2020లో కొన్ని విశేషాలను చూస్తే... తాజా సీజన్లోనూ కొన్ని వివాదాలు ఐపీఎల్‌ను తాకాయి. అయితే అవేవీ పెద్ద సమస్యగా మారకుండా టీ కప్పులో తుఫాన్ తరహాలాంటివే కావడం వల్ల లీగ్ పేరుకు నష్టం వాటిల్లలేదు. పూర్తి వివరాలు తెలియకపోయినా... ‘బాల్కనీ’ గది ఇవ్వకపోవడం వల్లే సురేశ్ రైనా ఐపీఎల్ నుంచి వెళ్లిపోయినట్లు వార్తలు రావడం, దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ వ్యాఖ్యలు స్పష్టంగా వినకుండా తన గురించి తప్పుగా మాట్లాడారంటూ అనుష్క శర్మ ఆగ్రహం వ్యక్తం చేయడంలాంటివి జరిగాయి. గత ఐపీఎల్లో ‘మన్కడింగ్’తో వివాదం రేపిన అశ్విన్... ఈసారి అలా చేయకుండా ఫించ్‌ను హెచ్చరికతో వదిలేయడం కూడా వివాదం కాని వార్తగా నిలిచింది. ఢిల్లీతో మ్యాచ్‌కు ముందు ముంబై అధికారిక ట్విట్టర్లో ఢిల్లీ 163/5 పరుగులు చేస్తుందంటూ ట్వీట్ ఉండటం... ఢిల్లీ చివరకు దాదాపు అంతే స్కోరు (162/4) చేయడం కొంత చర్చకు దారి తీసింది. ఐపీఎల్–2020 వెలుగులకు కాస్త అడ్డుపడిన విషయం అంపైరింగ్ ప్రమాణాలు. ఈసారి లీగ్‌లో పెద్ద సంఖ్యలో అంపైరింగ్ నిర్ణయాలు తప్పులుగా తేలడమే కాదు... పలు సందర్భాల్లో వివాదంగా కూడా మారాయి. ఢిల్లీతో మ్యాచ్‌లో పంజాబ్ తీసిన సింగిల్‌ను ‘షార్ట్ రన్’గా పరిగణించడం, చివరకు అదే ఫలితానికి కారణం కావడంతో అంపైరింగ్ వివాదాలు మొదలయ్యాయి. లీగ్ నుంచి నిష్క్రమించిన రోజున కూడా కేఎల్ రాహుల్ దీని గురించి మాట్లాడాడంటే దాని ప్రభావం వారిని ఎంతగా వెంటాడిందో అర్థమవుతుంది. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముజీబ్ అవుట్ కూడా వింతగా మారింది. క్యాచ్ పట్టినట్లు తేల్చి మూడో అంపైర్ అవుట్‌గా ప్రకటించడం, ఆ తర్వాత ముజీబ్ మళ్లీ రివ్యూ కోరడం అంతా గందరగోళంగా కనిపించింది. చెన్నైతో మ్యాచ్‌లో రాజస్తాన్ బ్యాట్స్‌మన్ టామ్ కరన్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చినట్లు అంపైర్ ముందుగా ప్రకటించాడు. అయితే టామ్ సందేహం వెలిబుచ్చడంతో అంపైర్లు మళ్లీ థర్డ్ అంపైర్‌ను సంప్రదించి నాటౌట్‌గా తేల్చారు. నిజానికి అప్పటికే రివ్యూ వాడేసిన రాజస్తాన్ మళ్లీ రివ్యూ కోరడం కెప్టెన్ ధోనికి కోపం తెప్పించింది. ఆ తర్వాత హైదరాబాద్‌తో మ్యాచ్‌లో కూడా అంపైర్ పాల్ రీఫెల్ వైడ్‌ను ప్రకటించేందుకు సిద్ధమై... ధోని ఆగ్రహ చూపులతో వెనక్కి తగ్గడం కూడా తీవ్ర ఆశ్చర్యం కలిగించింది. ఎలిమినేటర్‌లో వార్నర్ విషయంలో కూడా రీప్లేలో ఎలాంటి స్పష్టత లేకపోయినా మూడో అంపైర్ అవుట్‌గా ప్రకటించడం చర్చకు దారి తీసింది. ఈ సీజన్లో ఆ జట్టు, ఈ జట్టు అని తేడా లేకుండా అభిమానులను అన్నింటికంటే ఆనందపర్చిన విషయం వర్షం లేకపోవడం! వానలకు కొరత ఉండే ఎడారి దేశంలో టోర్నీ జరగడంతో ఒక్క మ్యాచ్‌కు కూడా వర్షం అడ్డంకిగా మారలేదు. మ్యాచ్ మాత్రమే కాదు... కనీసం ఒక్క బంతి కూడా వరుణదేవుడి కారణంగా వృథా కాలేదు. 60 మ్యాచ్‌లలో మొత్తం ఓవర్లు సజావుగా సాగడం... పైగా సొంత మైదానాలు కాకపోవడంతో ఏ జట్టుకూ ప్రత్యేకంగా అనుకూలత లేకపోవడం వల్ల యూఏఈలో జరిగిన ఐపీఎల్ అన్నింటికంటే హోరాహోరీగా, ఆసక్తికరంగా సాగిందనడంలో సందేహం లేదు. ► టోర్నీ ఆరంభంలోనే కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీతో (69 బంతుల్లో 132 నాటౌట్) మెరిశాడు. ఐపీఎల్ చరిత్రలో ఒక భారత ఆటగాడు సాధించిన అత్యధిక స్కోరు ఇదే. ఈసారి లీగ్‌లో మొత్తం 5 శతకాలు నమోదయ్యాయి. ► పంజాబ్‌పై రాహుల్ తేవటియా(రాజస్తాన్) ఇన్నింగ్స్ మరచిపోలేనిది. ఏమాత్రం గెలుపు అవకాశం లేని మ్యాచ్‌లో అతను అద్భుతంగా ఆడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కాట్రెల్ ఓవర్లో 5 సిక్సర్లు బాదడం హైలైట్‌గా నిలిచింది. అప్పటి వరకు అనామకుడిగా ఉన్న తేవటియాను ఈ ఇన్నింగ్స్ హీరోను చేసింది. ► ముంబై, పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ‘డబుల్’ సూపర్ ఓవర్ నమోదు కావడం మరచిపోలేనిది. ఇరు జట్లు 176 పరుగులు చేయగా, తొలి సూపర్ ఓవర్లో కూడా సమానంగా 5 పరుగులే చేశాయి. రెండో సూపర్ ఓవర్లో ముంబై 11 పరుగులు చేయగా, పంజాబ్ 15 పరుగులు సాధించి గెలిచింది. అంతకుముందు అదే రోజు హైదరాబాద్, కోల్‌కతా మధ్య మ్యాచ్‌లో కూడా సూపర్ ఓవర్ ద్వారానే ఫలితం తేలింది. ► ముంబై ఇండియన్స్ 195 పరుగులు చేశాక మ్యాచ్‌పై ప్రత్యర్థి ఆశలు వదులుకోవాల్సిందే... కానీ వరల్డ్ నంబర్‌వన్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అద్భుతమైన ఆటతో మ్యాచ్‌ను రాజస్తాన్ రాయల్స్ పరం చేశాడు. ఛేదనలో అతను 60 బంతుల్లోనే అజేయంగా 107 పరుగులు చేయడం అనూహ్యం. ► ఐపీఎల్ చరిత్రలో వరుసగా రెండు సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా శిఖర్ ధావన్ నిలిచాడు. ముందుగా చెన్నైపై అజేయంగా 101 పరుగులు చేసిన అతను, తర్వాతి మ్యాచ్ లో పంజాబ్‌పై 106 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు ► కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మొహమ్మద్ సిరాజ్ సంచలన బౌలింగ్ ప్రదర్శన (3/8) నమోదు చేశాడు. లీగ్ చరిత్రలో రెండు మెయిడిన్ ఓవర్లు వేసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. -
ఇంతకూ నీ బాస్ ఎవరు!?
దుబాయ్: కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఎన్నో ఒడిదుల మధ్య మొదలైన ఐపీఎల్ 13వ సీజన్ దిగ్విజయంగా ముగిసింది. కోవిడ్ వైరస్ భయపెడుతున్నా కట్టుదిట్టమైన సంరక్షణా చర్యలతో తాజా సీజన్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఆటగాళ్ల ఆరోగ్యానికి ఇబ్బందులు రాకుండా ఐపీఎల్ నిర్వాహకులు, బీసీసీఐ సిబ్బంది అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఈక్రమంలో క్రికెట్ అభిమానులు, మాజీ ఆటగాళ్లు, క్రీడా విశ్లేషకులు బీసీసీఐ, ఐపీఎల్ నిర్వాహకులకు అభినందనలు చెప్తున్నారు. అసాధ్యమనుకున్న టోర్నీ నిర్వహణను చేసి చూపించారని కొనియాడుతున్నారు. అయితే, ఈ విషయంలో టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి చేసిన ఓ పొరపాటుతో అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ఢిల్లీతో ఫైనల్ పోరులో ముంబై విజయం అనంతరం ట్వీట్ చేసిన రవిశాస్త్రి ఐపీఎల్ నిర్వాహుకులకు, వైద్య సహాయకులకు కంగ్రాట్స్ చెప్పాడు. సాధ్యం కాదనుకున్న ఐపీఎల్ 2020 టోర్నీని సుసాధ్యం చేశారని కొనియాడాడు. బీసీసీఐ పెద్దలకు, ఐపీఎల్ చీఫ్‌కు థాంక్స్ చెప్పాడు. కానీ, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీని పేరును మరిచాడు. దీంతో అభిమానులు రవిశాస్త్రి తీరును ఎండగట్టారు. కావాలనే దాదాపేరును ప్రస్తావించలేదని తిట్టిపోస్తున్నారు. ‘నీ బాస్ ఎవరు?’అని ప్రశ్నిస్తున్నారు. కాగా, ఏప్రిల్-మే నెలల్లో నిర్వహించాల్సిన ఐపీఎల్ 13 వ సీజన్.. పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. కోవిడ్ దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా చాలా క్రీడా టోర్నీలు వాయిదా పడ్డాయి. అయితే, కరోనాతో ఇళ్లకే పరిమితమై బందీలుగా బతుకున్న జనాలకు క్రికెట్ అనుభూతి అవసరమని బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ భావించాడు. స్వదేశంలో కాకుండా.. గల్ఫ్ దేశాల్లో ఐపీఎల్ నిర్వహణకు గల అవకాశాలను పరిశీలించి.. దుబాయ్‌లో టోర్నీ నిర్వహణకు ఓకే చెప్పాడు. ఇక బీసీసీఐ, ఐపీఎల్ సిబ్బంది, అన్ని జట్ల ఆటగాళ్ల క్రమశిక్షణతోనే టోర్నీ విజయవంతమైందని సౌరవ్ గంగూలీ ఓ జాతీయ మీడియాతో అన్నారు. Take a BOW @JayShah, Brijesh Patel, @hemangamin and the medical staff of the @BCCI for pulling off the impossible and making it a Dream @IPL #IPL2020 #IPLfinal pic.twitter.com/5rL6oqOLmC — Ravi Shastri (@RaviShastriOfc) November 10, 2020 -
ముంబై విజయం.. ఆడిపాడిన రణ్వీర్
ముంబై: దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2020 టైటిల్ గెలవడంపట్ల బాలీవుడ్ నటులు రణ్వీర్ సింగ్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సంతోషం వ్యక్తం చేశారు. ముంబై గెలుపు ఖాయమవగానే రణ్వీర్ సింగ్ ఆ జట్టు జెర్సీని ధరించి తన సినిమాలోని పాట పాడుతూ స్టెప్పులేశాడు. దానికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇక బిగ్‌బీ అమితాబ్, అభిషేక్ బచ్చన్, మిర్జాపుర్ నటుడు అలీ ఫజల్ కూడా ట్విటర్లో తన ఆనందాన్ని తెలియజేశారు. కాగా, దుబాయ్ వేదికగా మంగళవారం జరిగిన ఐపీఎల్ ఫైనల్లో ఢిల్లీ కాపిటల్స్‌పై ముంబై 5 వికెట్ల తేడాతో గెలిచి వరుసగా రెండో సంవత్సరం ఐపీఎల్ టైటిల్‌ని సాధించింది. 2019 ఐపీఎల్ ఫైనల్లోనూ ముంబై జట్టు చెన్నైపై గెలిచిన సంగతి తెలిసిందే. (ఈ విజయం తనకే అంకితం: హార్దిక్) ఇక తాజా మ్యాచ్‌లో టాస్ గెలిచిన బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ జట్టు ట్రెంట్ బౌల్ట్ ధాటికి 22 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ (50 బంతుల్లో 65)తో జట్టును ఆదుకున్నాడు. రిషబ్ పంత్ 56 పరుగులతో రాణించాడు. దాంతో ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. తర్వాత ఛేజింగ్‌కు దిగిన ముంబై జట్టు ఓపెనర్ క్వింటన్ డికాక్ (12 బంతుల్లో 20) ధాటిగా ఆడడంతో 3 ఓవర్లలో 33 పరుగులు చేసింది. మరోవైపు రోహిత్ (51 బంతుల్లో 68 పరుగులు) కెప్టెన్ ఇన్నింగ్స్, ఇషాన్ కిషన్ (19 బంతుల్లో 33 పరుగులు) మెరుపు బ్యాటింగ్‌తో ముంబై విజయతీరాలకు చేరింది. 4 ఓవర్లలో 30 పరుగులకు 3 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు. (ముంబై ఇండియన్స్ పాంచ్ పటాకా) View this post on Instagram CHAMPIONS!!!!! Make that 5 BABY !!!!! 💙💙💙💙💙 🏆🏆🏆🏆🏆 @mumbaiindians A post shared by Ranveer Singh (@ranveersingh) on Nov 10, 2020 at 9:38am PST -
ఈ విజయం తనకే అంకితం: హార్దిక్
దుబాయ్: దుబాయ్ వేదికగా మంగళవారం జరిగిన ఐపీఎల్ ఫైనల్లో 5 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్ విజయం సాధించి అయిదో సారి ట్రోపీని తన ఖాతాలో వేసుకుంది. ఈ సందర్భంగా ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఘన విజయాన్ని తన కొడుకు అగస్త్యకు అంకితమిచ్చాడు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. అనంతరం ముంబై 18.4 ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులు సాధించి గెలిచింది. మ్యాచ్ అనంతరం.. హార్దిక్ ‘ఇది నీకోసమే.. అగస్త్య’ అంటూ ట్రోఫీని లిఫ్ట్ చేస్తున్న ఫోటో పెట్టి ట్వీట్ చేశాడు. కాగా.. హార్దిక్ పాండ్య, భార్య నటాషా దంపతులకు జులై 30న అగస్త్య జన్మించిన సంగతి తెలిసిందే. అయితే.. హార్దిక్ ఈ సీజన్లో 14 మ్యాచ్‌లలో 281 పరుగులు చేసి 178.98 స్ట్రైక్‌రేట్‌తో అద్భుత ప్రదర్శన కనపరిచాడు. అందులో 25 సిక్సర్లు బాదడం విశేషం. ముంబై ఇండియన్స్ విజయంలో హార్దిక్ కీలక పాత్ర పోషించాడు. గాయం కారణంగా బౌలింగ్‌కి దూరమైనా, తన బ్యాటింగ్‌తో ముంబైని విజయతీరాలకి చేర్చాడు. (నేను అలాంటి వాడిని కాదు: రోహిత్) మంగళవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బౌల్ట్ ధాటికి ఢిల్లీ క్యాపిటల్స్ కష్టాల్లో పడింది. బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతికే స్టొయినిస్ వెనుదిరగ్గా, అజింక్య రహానే, శిఖర్ ధావన్ అదే బాట పట్టారు. తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ అర్ధ సెంచరీలతో జట్టు స్కోర్ 156కి చేరింది. 157 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబైకి డికాక్ శుభారంభాన్ని అందించగా, రోహిత్ శర్మ దానిని కొనసాగించాడు. తర్వాత అనవసరపు సింగిల్ కోసం ప్రయత్నించిన రోహిత్‌ను రనౌట్ నుంచి రక్షించేందుకు సూర్యకుమార్ తన వికెట్‌ను త్యాగం చేశాడు. అనంతరం క్రీజ్‌లో అడుగుపెట్టిన ఇషాన్ కిషన్ కూడా దూకుడుగా ఆడటంతో ముంబై లక్ష్యం వైపు దూసుకుపోయింది. మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే ముంబై లక్ష్యాన్ని ఛేదించి అయిదో సారి ఐపీఎల్ విజేతగా నిలిచింది. (ముంబై ఇండియన్స్ పాంచ్ పటాకా) -
నేను అలాంటి వాడిని కాదు: రోహిత్
దుబాయ్: ఐపీఎల్ 13 వ సీజన్లో మొదటి నుంచి ఆదిపత్యం కనబర్చిన డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ సగర్వంగా టైటిల్ నిలబెట్టుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఐదోసారి ఐపీఎల్ ట్రోఫీని తన ఖాతాలో వేసుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (50 బంతుల్లో 65 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), రిషభ్ పంత్ (38 బంతుల్లో 56; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రెంట్ బౌల్ట్ (3/30) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. అనంతరం ముంబై 18.4 ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులు సాధించి గెలిచింది. కెప్టెన్ రోహిత్ శర్మ (51 బంతుల్లో 68; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేయగా, ఇషాన్ కిషన్ (19 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా మెరవడంతో మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే ముంబై జట్టు విజయం ఖాయమైంది. (చదవండి: కోట్లు పెట్టి కొన్నాం, వదిలించుకోక తప్పదు!) కెప్టెన్‌గా నా పని అదే: రోహిత్ ‘విజయాలను అలవాటుగా మార్చుకోవాలని టోర్నీ ఆరంభంలో నేను చెప్పాను. కుర్రాళ్లు దానిని చేసి చూపించారు. తొలి బంతి నుంచి ఇప్పటి వరకు మేం టైటిల్ లక్ష్యంగానే ఆడాం. సీజన్ మొత్తం మాకు అనుకూలంగా సాగింది. బెత్తం పట్టుకొని బాగా ఆడమనే రకం కాదు నేను. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపడమే కెప్టెన్‌గా నా పని. అందరూ బాగా ఆడుతుండటంతో అప్పటికప్పుడు తుది జట్టును మార్చుకునే సౌలభ్యం మాకు కలిగింది. ముఖ్యంగా ఇషాన్ కిషన్, సూర్యకుమార్ చాలా బాగా ఆడారు. మా విజయంతో సహాయక సిబ్బంది పాత్ర కూడా ఎంతో ఉంది. ఐదో టైటిల్ సాధించిన సమయంలో మేం అభిమానుల మధ్య లేకపోవడం నిరాశ కలిగిస్తున్నా వారు వేర్వేరు రూపాల్లో మాకు ఎంతో మద్దతు పలికి ప్రోత్సహించారు’అని పోస్టు మ్యాచ్ ప్రజెంటేషన్‌లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. (చదవండి: ఇక... అమెజాన్ ప్రైమ్ క్రికెట్) -
కోట్లు పెట్టి కొన్నాం, వదిలించుకోక తప్పదు!
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో దారుణంగా విఫలమైన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్, వెస్టిండీస్ బౌలర్ షెల్డన్ కాట్రెల్‌లపై వేటు వేసేందుకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సిద్ధమైంది. వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్‌కు మరో ఆరు నెలల సమయం మాత్రమే ఉండటంతో... ఈ ఏడాది జట్టు ప్రదర్శనపై పంజాబ్ యాజమాన్యం అప్పుడే సమీక్షను ఆరంభించింది. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్, హెడ్ కోచ్‌గా అనిల్ కుంబ్లేను కొనసాగించేందుకు సిద్ధమైంది. రాహుల్ ఈ ఏడాది అద్భుతంగా రాణించాడు. 14 మ్యాచ్‌ల్లో 55.83 సగటుతో 670 పరుగులు చేసి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి ఇచ్చే ఆరెంజ్ క్యాప్‌ను గెల్చుకున్నాడు. ఇందులో ఒక సెంచరీ, ఐదు అర్ధ సెంచరీలు ఉండటం విశేషం. అంతేకాకుండా పంజాబ్ కోచ్‌గా తనకు తొలి ఏడాదే అయినా... జట్టును వరుస ఓటముల నుంచి గెలుపు బాట పట్టించిన కుంబ్లే పనితీరుపై పంజాబ్ సంతృప్తితోనే ఉంది. అయితే వేలంలో కోట్లు వెచ్చించి తెచ్చుకున్న మ్యాక్స్‌వెల్ (రూ.10.75 కోట్లు), కాట్రెల్ (రూ.8.5 కోట్లు) ప్రదర్శనలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న పంజాబ్... వారిని వదిలించుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. (చదవండి: నేను అలాంటి వాడిని కాదు: రోహిత్) మ్యాక్స్‌వెల్ ఆడిన 13 మ్యాచ్‌ల్లో కేవలం 108 పరుగులు మాత్రమే చేశాడు. మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్, షమీ, గేల్, యువ లెగ్‌స్పిన్నర్ రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్‌లను కొనసాగించే వీలుంది. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్‌ను పటిష్టం చేసేలా కసరత్తులు ఆరంభించింది. ఈ సీజన్ తొలి అర్ధ భాగంలో కేవలం ఒకే విజయాన్ని నమోదు చేసిన పంజాబ్... అనంతరం వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించేలా కనిపించింది. అయితే చివరి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడి ఇంటి దారి పట్టింది. (చదవండి: 100 బాల్స్.. 102 రన్స్.. నో సిక్సర్స్) -
ముంబై ఇండియన్స్ పాంచ్ పటాకా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ అప్రతిహత జైత్రయాత్ర... ప్రత్యర్థి ఎవరైనా నిర్దాక్షిణ్యమైన ఆటతీరును కనబర్చిన ఈ జట్టు తుదికంటా అదే జోరును కొనసాగించింది... ఇప్పటి వరకు నాలుగు టైటిల్స్‌తో శిఖరాన నిలబడిన రోహిత్ సేన ఏకంగా ఐదోసారి చాంపియన్‌గా నిలిచి తమ ఘనతను మరింత పదిలం చేసుకుంది. తుది పోరులో ఎక్కడా, ఎలాంటి తడబాటు కనిపించకుండా సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తూ గత ఏడాది సాధించిన ట్రోఫీని నిలబెట్టుకుంది. ఐపీఎల్ తొలి ఐదు సీజన్లలో ఒక్కసారి కూడా విజయం సాధించలేకపోయిన ముకేశ్, నీతా అంబానీ టీమ్... గత ఎనిమిది సీజన్లలో ఐదుసార్లు విజేత స్థానాన్ని అందుకుందంటే లీగ్‌పై ఆ జట్టు ఎంత బలమైన ముద్ర వేసిందో అర్థమవుతుంది. ఆఖరి సమరంలో చక్కటి బౌలింగ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ను కట్టడి చేసిన ముంబై, ఆ తర్వాత అలవోకగా లక్ష్యాన్ని అందుకుంది. సాధారణ స్కోరుకే పరిమితమైన తర్వాత ఇక ప్రత్యర్థిని నిలువరించడం క్యాపిటల్స్ వల్ల కాలేదు. పుష్కర కాలం పాటు ప్రయత్నించినా ఫైనల్‌కు చేరడంలో విఫలమైన ఢిల్లీ 13వ ప్రయత్నంలో ఇక్కడి వరకు వచ్చినా... ఈసారి ఆ చిరు సంతృప్తితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గత రెండుసార్లు హోరాహోరీ ఫైనల్స్‌లో ఒకే ఒక్క పరుగుతో గట్టెక్కిన ముంబై... ఇప్పుడు ఏకపక్ష విజయంతో దీపావళికి ముందు ‘పాంచ్’ పటాకాను పేల్చింది. దుబాయ్ : ఎన్నో మలుపులు, మరెన్నో ఉత్కంఠభరిత క్షణాలు, సూపర్ ఓవర్లు, పోటాపోటీ సమరాలు, రన్రేట్ల దాగుడుమూతల తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)–2020 చివరకు కొత్త విజేత రాకుండానే ముగిసింది. రోహిత్ శర్మ సారథ్యంలోని డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ మళ్లీ టైటిల్ గెలుచుకొని ఐదోసారి ట్రోఫీని తమ ఖాతాలో వేసుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఫైనల్లో ముంబై 5 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (50 బంతుల్లో 65 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), రిషభ్ పంత్ (38 బంతుల్లో 56; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. ‘ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రెంట్ బౌల్ట్ (3/30) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. అనంతరం ముంబై 18.4 ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులు సాధించి గెలిచింది. కెప్టెన్ రోహిత్ శర్మ (51 బంతుల్లో 68; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేయగా, ఇషాన్ కిషన్ (19 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా మెరవడంతో మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే ముంబై జట్టు విజయం ఖాయమైంది. ఖర్చులు తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఈసారి ఐపీఎల్ విజేత (రూ. 10 కోట్లు), రన్నరప్ (రూ. 6 కోట్ల 25 లక్షలు) జట్లకు ఇచ్చే ప్రైజ్‌మనీలో భారీగా కోత విధించాలని నిర్ణయం తీసుకున్నట్లు గత మార్చిలో బీసీసీఐ తెలిపింది. కానీ మంగళవారం బహుమతి ప్రదానోత్సవంలో మాత్రం అలాంటి మార్పు కనిపించలేదు. గత ఏడాది మాదిరిగానే ఇచ్చినట్టే ఈసారీ అంతే ప్రైజ్‌మనీ ఇచ్చారు. విజేత ముంబై ఇండియన్స్ జట్టుకు రూ. 20 కోట్లు... రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు రూ. 12 కోట్ల 50 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి. కీలక భాగస్వామ్యం... ముంబైతో తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో సున్నాకు 3 వికెట్లు... ఈసారి కొంత మెరుగు! అయినా సరే 22 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకొని ఢిల్లీ కష్టాల్లో పడింది. బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతికే స్టొయినిస్ (0) వెనుదిరగ్గా, అజింక్య రహానే (2), శిఖర్ ధావన్ (15) అనుసరించారు. ఈ దశలో పంత్, అయ్యర్ భాగస్వామ్యం క్యాపిటల్స్‌ను నిలబెట్టింది. ముఖ్యంగా ఈ సీజన్లో ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వని పంత్ చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. కృనాల్ ఓవర్లో అతను రెండు భారీ సిక్సర్లతో జోరు చూపించగా... బౌల్ట్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన అయ్యర్, పొలార్డ్ ఓవర్లో సిక్స్ బాది ధాటిని ప్రదర్శించాడు. అయితే కూల్టర్‌నైల్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి 35 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న పంత్... అదే ఊపులో మరో షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. వీరిద్దరు 69 బంతు ల్లో 96 పరుగులు జోడించారు. పంత్ అవుటయ్యాక ఢిల్లీ ఇన్నింగ్స్ ఒక్కసారిగా పేలవంగా మారిపోయింది. 15 ఓవర్లలో జట్టు స్కోరు 118/4. మిగిలిన ఐదు ఓవర్లలో చెలరేగితే భారీ స్కోరు సాధ్యమనిపించింది. అయితే ముంబై బౌలర్ల ధాటికి పరుగులు రావడమే గగనంగా మారింది. 40 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన అయ్యర్ కూడా ధాటిగా ఆడలేకపోయాడు. బుమ్రా వేసిన 17వ ఓవర్లో 11 పరుగులు రావడం మినహా... మిగిలిన నాలుగు ఓవర్లలో ఢిల్లీ 7, 6, 6, 8 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారీ షాట్లు ఆడగల హెట్‌మైర్ (5) కూడా విఫలం కావడంతో ఢిల్లీ సాధారణ స్కోరుకే పరిమితమైంది. అలవోకగా... ఛేదనలో ముంబై పెద్దగా శ్రమించాల్సిన అవసరం రాలేదు. డికాక్ (12 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్) జట్టుకు కావాల్సిన శుభారంభాన్ని అందించగా, రోహిత్ శర్మ దానిని కొనసాగించాడు. రబడ వేసిన రెండో ఓవర్లో డికాక్ 2 ఫోర్లు, సిక్స్ బాదడంతో 18 పరుగులు వచ్చాయి. గాయం నుంచి కోలుకున్న తర్వాత గత రెండు మ్యాచ్‌లలో విఫలమైన కెప్టెన్ రోహిత్, చివరి పోరులో తన స్థాయిని ప్రదర్శించాడు. అశ్విన్ వేసిన తొలి ఓవర్లోనే సిక్సర్‌తో మొదలు పెట్టిన రోహిత్... నోర్జే ఓవర్లో మరో ఫోర్, సిక్స్, ఆ తర్వాత ప్రవీణ్ దూబే ఓవర్లో మరో రెండు సిక్సర్లు కొట్టాడు. అనంతరం లేని సింగిల్ కోసం ప్రయత్నించిన రోహిత్‌ను రనౌట్ నుంచి రక్షించేందుకు సూర్యకుమార్ (19) తన వికెట్‌ను త్యాగం చేశాడు. 36 బంతుల్లోనే రోహిత్ అర్ధసెంచరీ పూర్తయింది. మరో ఎండ్‌లో కిషన్ కూడా దూకుడుగా ఆడటంతో ముంబై వేగంగా లక్ష్యం వైపు దూసుకుపోయింది. విజయానికి చేరువైన దశలో రోహిత్, పొలార్డ్ (9), హార్దిక్ పాండ్యా (3) అవుటైనా... ముంబైకి ఇబ్బంది ఎదురు కాలేదు. నోర్జే వేసిన 19వ ఓవర్ నాలుగో బంతిని కవర్స్ దిశగా ఆడి కృనాల్ సింగిల్ తీయడంతో ముంబై జట్టు ఐదోసారి ఐపీఎల్ విజేతగా నిలిచింది. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: స్టొయినిస్ (సి) డికాక్ (బి) బౌల్ట్ 0; ధావన్ (బి) జయంత్ 15; రహానే (సి) డికాక్ (బి) బౌల్ట్ 2; అయ్యర్ (నాటౌట్) 65; పంత్ (సి) హార్దిక్ (బి) కూల్టర్‌నైల్ 56; హెట్‌మైర్ (సి) కూల్టర్‌నైల్ (బి) బౌల్ట్ 5; అక్షర్ పటేల్ (సి) (సబ్) అనుకూల్ రాయ్ (బి) కూల్టర్‌నైల్ 9; రబడ (రనౌట్) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 156. వికెట్ల పతనం: 1–0; 2–16; 3–22; 4–118; 5–137; 6–149; 7–156. బౌలింగ్: బౌల్ట్ 4–0–30–3; బుమ్రా 4–0–28–0; జయంత్ యాదవ్ 4–0–25–1; కూల్టర్‌నైల్ 4–0–29–2; హార్దిక్ పాండ్యా 3–0–30–0; పొలార్డ్ 1–0–13–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) (సబ్) లలిత్ యాదవ్ (బి) నోర్జే 68; డికాక్ (సి) పంత్ (బి) స్టొయినిస్ 20; సూర్యకుమార్ (రనౌట్) 19; ఇషాన్ కిషన్ (నాటౌట్) 33; పొలార్డ్ (బి) రబడ 9; హార్దిక్ (సి) రహానే (బి) నోర్జే 3; కృనాల్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (18.4 ఓవర్లలో 5 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1–45; 2–90; 3–137; 4–147; 5–156. బౌలింగ్: అశ్విన్ 4–0–28–0; రబడ 3–0–32–1; నోర్జే 2.4–0–25–2; స్టొయినిస్ 2–0–23–1; అక్షర్ పటేల్ 4–0–16–0; ప్రవీణ్ దూబే 3–0–29–0. ఐపీఎల్–2020 అవార్డులు పవర్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ ట్రెంట్ బౌల్ట్ (ముంబై) ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు సూపర్ స్ట్రయికర్ ఆఫ్ ద సీజన్ పొలార్డ్ (ముంబై) ప్రైజ్‌మనీ: రూ.10 లక్షలు డ్రీమ్–11 గేమ్ చేంజర్ ఆఫ్ ద సీజన్ అవార్డు కేఎల్ రాహుల్ (పంజాబ్) ప్రైజ్‌మనీ: రూ.10 లక్షలు ఫెయిర్ ప్లే అవార్డు ముంబై ఇండియన్స్ ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్) కేఎల్ రాహుల్ 670 పరుగులు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు తీసిన బౌలర్) కగిసో రబడ 30 వికెట్లు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు ఎమర్జింగ్ ప్లేయర్ దేవ్‌దత్ పడిక్కల్ 473 పరుగులు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు పొలార్డ్ ఖాతాలో 15వ టి20 టైటిల్... ముంబై ఇండియన్స్ తాజా ఐపీఎల్ టైటిల్‌తో టి20 ఫార్మాట్లో అత్యధిక టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా వెస్టిండీస్ క్రికెటర్ కీరన్ పొలార్డ్ (15 టైటిల్స్) గుర్తింపు పొందాడు. 14 టైటిల్స్‌తో డ్వేన్ బ్రేవో (వెస్టిండీస్) పేరిట ఉన్న రికార్డును పొలార్డ్ సవరించాడు. పొలార్డ్ టైటిల్స్ వివరాలు ►5 ఐపీఎల్ (ముంబై ఇండియన్స్–2013, 2015, 2017, 2019, 2020) ►2 చాంపియన్స్ లీగ్ (ముంబై ఇండియన్స్–2011, 2013) ►1 టి20 వరల్డ్ కప్ (వెస్టిండీస్–2012) ►1 స్టాన్ఫోర్డ్ టి20 కప్ (ట్రినిడాడ్ అండ్ టొబాగో–2008) ►3 కరీబియన్ టి20 కప్ (ట్రినిడాడ్ అండ్ టొబాగో–2011, 2012, 2013) ►1 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (ఢాకా గ్లాడియేటర్స్–2014) ►2 కరీబియన్ ప్రీమియర్ లీగ్ (బార్బడోస్ ట్రైడెంట్స్–2014; ట్రిన్బాగోనైట్రైడర్స్–2020) ♦ ‘బ్యాక్ టు బ్యాక్’ ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచిన రెండో జట్టు ముంబై ఇండియన్స్. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ (2010, 2011) మాత్రమే ఈ ఘనత సాధించింది. ♦ఐపీఎల్లో 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న రెండో ప్లేయర్ రోహిత్ శర్మ. ఎమ్మెస్ ధోని (204 మ్యాచ్‌లు) తొలి స్థానంలో ఉన్నాడు. ♦ఐపీఎల్ ఫైనల్లో లక్ష్యాన్ని ఛేజ్ చేసి విజేతగా నిలిచిన నాలుగో జట్టు ముంబై ఇండియన్స్. గతంలో రాజస్తాన్ రాయల్స్ (2008లో), కోల్‌కతా నైట్‌రైడర్స్ (2012, 2014లో), చెన్నై సూపర్ కింగ్స్ (2018లో) ఇలా చేశాయి. ♦పాయింట్ల పట్టికలో ‘టాప్’లో నిలిచిన జట్టు ఐపీఎల్ చాంపియన్‌గా నిలువడం ఇది నాలుగోసారి. రాజస్తాన్ రాయల్స్ (2008లో) ఒకసారి... ముంబై ఇండియన్స్ (2017, 2019, 2020) మూడుసార్లు ఈ ఘనత సాధించింది. ♦ఐపీఎల్లో ‘ఆరెంజ్ క్యాప్’ నెగ్గిన నాలుగో భారత క్రికెటర్‌గా కేఎల్ రాహుల్ నిలిచాడు. గతంలో సచిన్ టెండూల్కర్ (2010), రాబిన్ ఉతప్ప (2014), విరాట్ కోహ్లి (2016) ఈ ఘనత సాధించారు. విజయాలను అలవాటుగా మార్చుకోవాలని టోర్నీ ఆరంభంలో నేను చెప్పాను. కుర్రాళ్లు దానిని చేసి చూపించారు. తొలి బంతి నుంచి ఇప్పటి వరకు మేం టైటిల్ లక్ష్యంగానే ఆడాం. సీజన్ మొత్తం మాకు అనుకూలంగా సాగింది. బెత్తం పట్టుకొని బాగా ఆడమనే రకం కాదు నేను. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపడమే కెప్టెన్‌గా నా పని. అందరూ బాగా ఆడుతుండటంతో అప్పటికప్పుడు తుది జట్టును మార్చుకునే సౌలభ్యం మాకు కలిగింది. ముఖ్యంగా ఇషాన్ కిషన్, సూర్యకుమార్ చాలా బాగా ఆడారు. మా విజయంతో సహాయక సిబ్బంది పాత్ర కూడా ఎంతో ఉంది. ఐదో టైటిల్ సాధించిన సమయంలో మేం అభిమానుల మధ్య లేకపోవడం నిరాశ కలిగిస్తున్నా వారు వేర్వేరు రూపాల్లో మాకు ఎంతో మద్దతు పలికి ప్రోత్సహించారు. –రోహిత్ శర్మ, ముంబై కెప్టెన్ -
మళ్లీ ముంబైదే టైటిల్
దుబాయ్: డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ మళ్లీ టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. వేదిక ఏదైనా టైటిల్ వేటలో తమకు తిరుగులేదని మరోసారి నిరూపించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్ పోరులో ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో గెలిచి టైటిల్‌ను మరొకసారి ముద్దాడింది. ఇది ముంబై ఇండియన్స్ ఐదో ఐపీఎల్ టైటిల్ కావడం విశేషం. ఢిల్లీ నిర్దేశించిన 157 పరుగుల టార్గెట్‌ను ముంబై 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రోహిత్ శర్మ(68; 51 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించి విజయంలో కీలక పాత్ర పోషించగా, ఇషాన్ కిషన్( 33 నాటౌట్; 19 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్) ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. టార్గెట్‌ను ఛేదించే క్రమంలో డీకాక్-రోహిత్ శర్మలు ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. వీరిద్దరూ ఆది నుంచి విరుచుకుపడి ముంబై స్కోరును పరుగులు పెట్టించారు. స్టోయినిస్ వేసిన ఐదో ఓవర్ తొలి బంతికి డీకాక్(20; 12 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) ఔటయ్యాడు. దాంతో 45 పరుగుల వద్ద ముంబై తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో రోహిత్‌కు సూర్యకుమార్ యాదవ్ జత కలిశాడు. ఈ జోడి 45 పరుగులు జత చేసిన తర్వాత సూర్యకుమార్(19; 20 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) రనౌట్ అయ్యాడు. అటు తర్వాత రోహిత్- ఇషాన్ కిషన్‌లు జోడి 47 పరుగులు జత చేసింది. ముంబై స్కోరు 137 పరుగుల వద్ద ఉండగా రోహిత్ మూడో వికెట్‌గా ఔట్ కాగా, పొలార్డ్(9; 4 బంతుల్లో 2 ఫోర్లు) నాల్గో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. హార్దిక్ పాండ్యా(3) నిరాశపరిచాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు నష్టానికి 156 పరుగులు చేసింది. రిషభ్ పంత్(56; 38 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్స్‌లు), శ్రేయస్ అయ్యర్(65 నాటౌట్; 50 బంతుల్లో 6 ఫోర్లు, 2సిక్స్‌లు)లు రాణించడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరు చేసింది. టాస్ గెలిచిన ఢిల్లీ ఇన్నింగ్స్‌ను ధావన్-స్టోయినిస్‌లు ఆరంభించారు. తొలి ఓవర్‌ను అందుకున్న బౌల్ట్ తాను వేసిన తొలి బంతికే స్టోయినిస్‌ను పెవిలియన్‌కు పంపాడు. బుల్లెట్లా దూసుకొచ్చిన ఆ బంతికి స్టోయినిస్ వద్ద సమాధానం లేకుండా పోయింది. స్టోయినిస్ ఎలా ఆడాలని నిర్ణయించుకునేలోపే ఆ బంతి ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ డీకాక్ చేతుల్లోకి వెళ్లింది. దాంతో స్టోయినిస్ గోల్డెన్ డక్‌గా నిష్క్రమించాడు.అదే బౌల్ట్ వేసిన మూడో ఓవర్ నాల్గో బంతికి అజింక్యా రహానే(2) పెవిలియన్ చేరాడు. దాంతో 16 పరుగుల వద్ద ఢిల్లీ రెండో వికెట్‌ను కోల్పోయింది. ఆపై మరో ఆరు పరుగుల వ్యవధిలో శిఖర్ ధావన్(15) ఔటయ్యాడు. ధావన్‌ను జయంత్ యాదవ్ ఔట్ చేశాడు. దాంతో ఢిల్లీ 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో అయ్యర్-పంత్‌లు ఇన్నింగ్స్‌ను మరమ్మత్తులు చేశారు. ఈ జోడీ వికెట్లను ఆదిలోనే కోల్పోయమనే విషయాన్ని పక్కకు పెట్టి ఫ్రీగా బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో పంత్ హాఫ్ సెంచరీ సాధించాడు. వీరిద్దరూ 96 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో ఢిల్లీ తేరుకుంది. పంత్ హాఫ్ సెంచరీ సాధించిన కాసేపటికి ఔటయ్యాడు. కౌల్టర్ నైల్ వేసిన 15 ఓవర్ చివరి బంతికి హార్దిక్ క్యాచ్ పట్టడంతో పంత్ ఔటయ్యాడు. అటు తర్వాత హెట్మెయిర్(5) కూడా నిరాశపరిచాడు. బౌల్ట్ బౌలింగ్‌లో హెట్మెయిర్ ఔటయ్యాడు. అయ్యర్ మాత్రం కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకున్నాడు.ముంబై బౌలర్లలో బౌల్ట్ మూడు వికెట్లు సాధించగా కౌల్టర్ నైల్ రెండు వికెట్లు తీశాడు. జయంత్ యాదవ్‌కు వికెట్ దక్కింది. -
పంత్ ‘రికార్డు’ బ్యాటింగ్
దుబాయ్: ఐపీఎల్-13వ సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 157 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. రిషభ్ పంత్(56; 38 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్స్‌లు), శ్రేయస్ అయ్యర్(65 నాటౌట్; 50 బంతుల్లో 6 ఫోర్లు, 2సిక్స్‌లు)లు రాణించడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరు చేసింది. టాస్ గెలిచిన ఢిల్లీ ఇన్నింగ్స్‌ను ధావన్-స్టోయినిస్‌లు ఆరంభించారు. తొలి ఓవర్‌ను అందుకున్న బౌల్ట్ తాను వేసిన తొలి బంతికే స్టోయినిస్‌ను పెవిలియన్‌కు పంపాడు. బుల్లెట్లా దూసుకొచ్చిన ఆ బంతికి స్టోయినిస్ వద్ద సమాధానం లేకుండా పోయింది. స్టోయినిస్ ఎలా ఆడాలని నిర్ణయించుకునేలోపే ఆ బంతి ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ డీకాక్ చేతుల్లోకి వెళ్లింది. దాంతో స్టోయినిస్ గోల్డెన్ డక్‌గా నిష్క్రమించాడు.అదే బౌల్ట్ వేసిన మూడో ఓవర్ నాల్గో బంతికి అజింక్యా రహానే(2) పెవిలియన్ చేరాడు. దాంతో 16 పరుగుల వద్ద ఢిల్లీ రెండో వికెట్‌ను కోల్పోయింది. ఆపై మరో ఆరు పరుగుల వ్యవధిలో శిఖర్ ధావన్(15) ఔటయ్యాడు. ధావన్‌ను జయంత్ యాదవ్ ఔట్ చేశాడు. దాంతో ఢిల్లీ 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో అయ్యర్-పంత్‌లు ఇన్నింగ్స్‌ను మరమ్మత్తులు చేశారు. ఈ జోడీ వికెట్లను ఆదిలోనే కోల్పోయమనే విషయాన్ని పక్కకు పెట్టి ఫ్రీగా బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో పంత్ హాఫ్ సెంచరీ సాధించాడు. వీరిద్దరూ 96 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో ఢిల్లీ తేరుకుంది. పంత్ హాఫ్ సెంచరీ సాధించిన కాసేపటికి ఔటయ్యాడు. కౌల్టర్ నైల్ వేసిన 15 ఓవర్ చివరి బంతికి హార్దిక్ క్యాచ్ పట్టడంతో పంత్ ఔటయ్యాడు. అటు తర్వాత హెట్మెయిర్(5) కూడా నిరాశపరిచాడు. బౌల్ట్ బౌలింగ్‌లో హెట్మెయిర్ ఔటయ్యాడు. అయ్యర్ మాత్రం కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకున్నాడు. దాంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు నష్టానికి 156 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో బౌల్ట్ మూడు వికెట్లు సాధించగా కౌల్టర్ నైల్ రెండు వికెట్లు తీశాడు. జయంత్ యాదవ్‌కు వికెట్ దక్కింది. పంత్ ‘రికార్డు’ బ్యాటింగ్ ఈ మ్యాచ్‌లో రిషభ్ పంత్ హాఫ్ సెంచరీ చేయడం ద్వారా రికార్డు సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో ఫైనల్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించిన రెండో పిన్నవయస్కుడిగా పంత్ గుర్తింపు పొందాడు. పంత్ 23 ఏళ్ల 37 రోజుల వయసులో ఐపీఎల్ ఫైనల్లో అర్థ శతకం సాధించగా, అంతకుముందు మనన్ వోహ్రా పిన్న వయస్కుడిగా రికార్డు సాధించాడు. 2014లో కింగ్స్ పంజాబ్ ఫైనల్‌కు వెళ్లిన మ్యాచ్‌లో వోహ్రా అర్థ శతకం నమోదు చేశాడు. వోహ్రా 20 ఏళ్ల 318 రోజుల వయసులో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆనాటి మ్యాచ్‌లో వోహ్రా 67 పరుగులు చేశాడు. -
బుల్లెట్లా దూసుకొచ్చిన బంతి.. గోల్డెన్ డక్!
దుబాయ్: ఐపీఎల్-13వ సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ బౌల్ట్ తొలి బంతికే వికెట్ తీసి అదిరే ఆరంభాన్నిచ్చాడు. ఈ మ్యాచ్ ముందువరకూ బౌల్ట్ ఆడటంపై అనేక అనుమానాలు తలెత్తాయి. గాయపడ్డ బౌల్ట్ అంతిమ సమరానికి ఫిట్ అవుతాడా.. లేదా అనే దానిపైనే చర్చ సాగింది. కానీ ఫిట్నెస్ను నిరూపించుకున్న చివరి నిమిషంలో జట్టులోకి రావడంతో ముంబైకు బౌలింగ్ బెంగ లేకుండా పోయింది. అయితే టాస్ గెలిచిన ఢిల్లీ ముందుగా బ్యాటింగ్ తీసుకోవడంతో స్టోయినిస్-శిఖర్ ధావన్‌లు ఇన్నింగ్స్ ఆరంభించారు. తొలి ఓవర్‌ను అందుకున్న బౌల్ట్ తాను వేసిన తొలి బంతికే స్టోయినిస్‌ను పెవిలియన్‌కు పంపాడు. బుల్లెట్లా దూసుకొచ్చిన ఆ బంతికి స్టోయినిస్ వద్ద సమాధానం లేకుండా పోయింది. స్టోయినిస్ ఎలా ఆడాలని నిర్ణయించుకునేలోపే ఆ బంతి ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ డీకాక్ చేతుల్లోకి వెళ్లింది. దాంతో స్టోయినిస్ గోల్డెన్ డక్‌గా నిష్క్రమించగా, వాటే ఏ బాల్ అని అనుకోవడం మనవంతైంది.అదే బౌల్ట్ వేసిన మూడో ఓవర్ నాల్గో బంతికి అజింక్యా రహానే(2) పెవిలియన్ చేరాడు. దాంతో 16 పరుగుల వద్ద ఢిల్లీ రెండో వికెట్‌ను కోల్పోయింది. ఆపై మరో ఆరు పరుగుల వ్యవధిలో శిఖర్ ధావన్(15) ఔటయ్యాడు. ధావన్‌ను జయంత్ యాదవ్ ఔట్ చేశాడు. దాంతో ఢిల్లీ 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. -
ఐపీఎల్ 2020: టైటిల్ ఎవరిదో?
దుబాయ్: ఈ సీజన్ ఐపీఎల్ టైటిల్ కోసం ముంబై ఇండియన్స్-ఢిల్లీ క్యాపిటల్స్‌లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. నాలుగు టైటిల్స్ గెలిచిన ముంబై ఒకవైపు.. తొలి టైటిల్ సాధించాలనే లక్ష్యంతో ఢిల్లీ మరొకవైపు ఫైనల్లో తలపడునున్నాయి. ఈ తుది సమరంలో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చేయడానికే మొగ్గుచూపాడు. కాగా, ఇప్పటికే లీగ్‌పై ఆధిపత్యం ప్రదర్శిస్తూ అత్యంత విజయవంతమైన టీమ్‌గా నిలిచిన రోహిత్ శర్మ బృందం ఎవరికీ అందనంత ఎత్తులో నిలుస్తుంది. ‘డేర్‌డెవిల్స్’గా విఫలమైన ఢిల్లీ... ‘క్యాపిటల్స్’గా మారి గత ఏడాది మూడో స్థానంలో నిలిచింది. ఇప్పుడు మరింత మెరుగైన ప్రదర్శనతో తొలిసారి ఫైనల్‌కు చేరింది.(ఫస్ట్ సెంచరీ చేయనివ్వలేదని..) ఈ సీజన్ లీగ్ దశలో ముంబై ఇండియన్స్ 14 మ్యాచ్‌లలో 9 గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. తొలి క్వాలిఫయర్‌లో అతి సునాయాసంగా ఢిల్లీని 57 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరింది. ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చిన చివరి మ్యాచ్ ను మినహాయిస్తే తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు అత్యల్ప స్కోరు కూడా 162 పరుగులు ఉందంటే జట్టు బ్యాటింగ్ బలమేమిటో అర్థమవుతోంది. ముంబై జట్టులో ఇషాన్ కిషన్ (483 పరుగులు), డికాక్ (483), సూర్యకుమార్ యాదవ్ (461)ల బ్యాటింగ్ ప్రధానంగా జట్టును నడిపించింది. ఇక పొలార్డ్ (190.44), హార్దిక్ పాండ్యా (182.89)ల స్ట్రయిక్‌రేట్‌తో ముంబై ఇండియన్స్ విజయాల్లో తమదైన హార్డ్ హిట్టింగ్ పాత్రను పోషించారు.. ఇక బౌలింగ్‌లో బుమ్రా (27 వికెట్లు), బౌల్ట్ (22) ప్రదర్శన ముంబైని ముందంజలో నిలిపింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ లీగ్ దశలో 14 మ్యాచ్‌లలో 8 గెలిచి రెండో స్థానంలో నిలిచింది. తొలి క్వాలిఫయర్‌లో చిత్తుగా ఓడినా... రెండో క్వాలిఫయర్‌లో సమష్టి ప్రదర్శనతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గెలిచి ఫైనల్ చేరింది. లీగ్ ఆరంభంలో అద్భుతంగా ఆడిన ఢిల్లీ.. ఆపై నాలుగు వరుస ఓటముల తర్వాత ఎట్టకేలకు ఒక విజయంలో ప్లే ఆఫ్స్ చేరగా... ముంబై చేతిలో భారీ ఓటమి జట్టు బలహీనతను చూపించింది. ఢిల్లీ జట్టులో ధావన్ 603 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలున్నాయి. ఇంతా వరకూ బాగానే ఉన్నా నాలుగు డకౌట్లు కూడా ధావన్ బ్యాటింగ్‌పై ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ధావన్ నుంచి మరోసారి అదిరే ఆరంభం వస్తే ఢిల్లీకి ఆందోళన తగ్గుతుంది. శ్రేయస్ అయ్యర్ 454 పరుగులతో రెండో స్థానంలో ఉన్నా... అతని స్ట్రయిక్‌రేట్ (122.37) పేలవంగా ఉండటం కలవర పరుస్తోంది. ఆ జట్టుకు బ్యాటింగ్‌లో మరో ప్రధాన బలం మార్కస్ స్టోయినిస్. స్టోయినిస్ 352 పరుగులు సాధించి ఢిల్లీ విజయాలక్లో కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్‌లో కూడా మెరిసి 12 వికెట్లు సాధించాడు. ఢిల్లీ బౌలింగ్ విభాగంలో రబడా 29 వికెట్లతో టాప్‌లో ఉన్నాడు. అతనికి నోర్జే నుంచి కూడా చక్కటి సహకారం లభిస్తోంది. నోర్జే 20 వికెట్లు సాధించాడు. వీరికి జతగా అశ్విన్, అక్షర్ పటేల్‌లు కూడా రాణిస్తే పోరు ఆసక్తికరంగా మారుతోంది. -
మహిళా క్రికెట్: నీతా అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో విమెన్స్ టీ20 (మహిళల ఐపీఎల్)2020 టైటిల్ విజేతగా ట్రైల్ బ్లేజర్స్ నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫైనల్మ్యాచ్కు ముందు రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్పర్సన్ నీతా అంబానీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఫైనల్ పోరులో ఎవరు గెలిచినా ఆ విజయం ఎంతోమంది ఔత్సాహిక మహిళా క్రీడాకారిణులకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆమె భారతదేశంలో మహిళల క్రికెట్‌కు రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి నీతా అంబానీ ఇన్‌స్టాలో సోమవారం ఒక వీడియో పోస్ట్ చేశారు. ప్రతి రంగంలో, ముఖ్యంగా క్రీడా, విద్యా రంగాల్లో మహిళలను ప్రోత్సహించాలని, వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నీతా పేర్కొన్నారు. ఇందుకు తమ ఫౌండేషన్ తరపున బాలికలు అందరికీ విద్య, క్రీడా అవకాశాలు అందించాలనేదే తన ధ్యేయమని చెప్పారు. మౌలిక వసతులు, సదుపాయాలతోపాటు, అవకాశాలు, నైపుణ్య శిక్షణ అవసరమన్నారు. ఈ విషయంలో తమ ఫౌండేషన్ చాలా కృషి చేస్తోందని ఆమె చెప్పారు. ఈ నేపథ్యంలో దేశానికి 33 మందితోపాటు, 12 మంది విదేశీ మహిళా క్రికెటర్లు జియో విమెన్ 2020లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అలాగే తొలిసారి థాయ్‌లాండ్ నుంచి నాథకాన్(24) పాల్గొంటున్నారని నీతా అంబానీ తెలిపారు. క్రీడల్లో బాలికల ప్రోత్సాహం కోసం నవీముంబైలో ఒక జియో క్రికెట్ స్టేడియాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. అమ్మాయిలకు సరైన అవకాశాలు కల్పిస్తే, గ్లోబల్‌గా రాణిస్తారనే విషయాన్ని మరోసారి నిరూపించారని నీతా ప్రశంసించారు. టీమిండియా మహిళల క్రికెట్ జట్టు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అద్భుతంగా రాణిస్తోందన్నారు. గత ఆరేళ్లుగా అంజుం చోప్పా, జులన్గోస్వామి, మిథాలీ రాజ్లాంటి లెజెండ్లు మంచి పేరు సంపాదించారన్నారు. అలాగే స్మృతి మంధన, పూనం యాదవ్, హర్మన్ ప్రీత్‌కౌర్ మన మహిళా క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళుతున్నారని చెప్పారు. భవిష్యత్తులోమరింత రాణించనున్నారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కాగా డిఫెండింగ్ ఛాంపియన్ సూపర్నోవాస్ను ఓడించి మూడేళ్లలో తొలిసారి ఛాంపియన్‌గా అవతరించింది ట్రైల్ బ్లేజర్స్. జియో అండ్ రిలయన్స్ ఫౌండేషన్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫర్ ఆల్ మహిళల టి 20 ఛాలెంజ్‌ను స్పాన్సర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. View this post on Instagram “In the end, women’s cricket will be the winner today.” - Mrs. Nita Ambani. . Here’s how Reliance Foundation Education and Sports for All and JIO are bridging the gender divide in sport. . #OneFamily #MumbaiIndians #MI #JioWomensT20Challenge @reliancefoundation @reliancejio A post shared by Mumbai Indians (@mumbaiindians) on Nov 9, 2020 at 7:17am PST -
ప్రపంచకప్ తర్వాత ఇదే పెద్ద మ్యాచ్
కరోనా కారణంగా ఇళ్లకే పరిమితమైన క్రికెట్ అభిమానులకు అసలైన మజా ఇస్తున్న ఐపీఎల్ చివరి దశకు చేరుకుంది. నేటి ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపీయన్ను ఢిల్లీ క్యాపిటల్స్ ఢీ కొట్టేందుకు సిద్ధమైంది. నాలుగు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ మరోసారి ట్రోఫీని ముద్దాడాలని ఉరకలు వేస్తోంది. మరోవైపు తొలిసారి ఫైనల్‌కు చేరిన ఢిల్లీ.. ఒక్క సారైనా ట్రోఫీ గెలవాలని ఆరాటపడుతోంది. తామే కప్ గెలుస్తామని ఇరు జట్ల ఆటగాళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఫైనల్ మ్యాచ్‌కు ముందు ముంబై ఆల్ రౌండర్ కీరన్ పోలార్డ్ మాట్లాడుతూ.. ప్రపంచకప్ ఫైనల్ తర్వాత క్రికెట్లో ఐపీఎల్ ఫైనలే అతి పెద్ద మ్యాచ్ అని అభిప్రాయపడ్డాడు. ఫైనల్ అనగానే సహజంగానే ఒత్తిడి ఉంటుందని, ఆటగాళ్లు అందరూ ఒత్తిడికి గురవుతారని పేర్కొన్నాడు. కానీ కప్ గెలవాలంటే సాధారణ మ్యాచ్‌గానే భావించాలని, ఎలాంటి తప్పులు జరగనివ్వద్దని ఆటగాళ్లకు సూచించారు. ప్రశాంతంగా గ్రౌండ్లో అడుగుపెట్టి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఆడండి అంటూ పోలార్డ్ ఒక వీడియోలో సందేశమిచ్చాడు. ఈ వీడియోని ముంబై ఇండియన్స్ అధికారిక ట్విట్టర్లో మంగళవారం సాయంత్రం పోస్టు చేసింది. ముంబై ఇండియన్స్ ఇది వరకే 4 సార్లు (2013, 2015, 2017, 2019) సీజన్లో ట్రోఫీ కైవసం చేసుకుంది. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్ చేరడం ఇదే మొదటిసారి. క్వాలిఫైయర్-2 లో సన్‌రైజర్స్ ను ఓడించి ఫైనల్‌కు చేరింది. ఇక ఫైనల్ మ్యాచ్ గురించి ముంబై ఇండియన్స్ కోచ్ మహేల జయవర్దనే మాట్లాడుతూ.. ‘ఇది క్రికెట్ లో ఒక మ్యాచ్ మాత్రమే. దీని గురించి తాము ఎక్కువగా ఆలోచించడం లేదు. మేము ప్రయత్నాలని నమ్ముతూ, నైపుణ్యాలని అమలు చేయడానికి ప్రయత్నిస్తాం. ఇది బ్యాట్‌కి బంతికి, పరుగులకి వికెట్లకి మధ్య పోరాటం. కాబట్టి ఆ పోరాటాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నిస్తాం’ అని పేర్కొన్నాడు. మా జట్టులో కొందరి ఆటగాళ్లకు ఫైనల్ మ్యాచ్ ఆడిన అనుభవం ఉందని, క్లిష్ట సమయంలో ఎలా ఆడాలో వారికి తెలుసన్నారు. తుది పోరులో ఖచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. -
‘వారిద్దరూ టీమిండియాకు ఆడటం ఖాయం’
దుబాయ్: ఈ ఐపీఎల్ సీజన్లో పలువురు యువ క్రికెటర్లు సత్తాచాటిన సంగతి తెలిసిందే, వారిలో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లైన సూర్యకుమార్ యాదవ్, రాహుల్ చాహర్‌లు కూడా ఉన్నారు. టోర్నమెంట్ అంతటా సూర్య కుమార్ తన బ్యాటింగ్ పవర్ చూపించగా చాహర్ తన స్పిన్ బౌలింగ్‌తో గేమ్ ఛేంజర్ పాత్రను పోషిస్తూ వస్తున్నాడు. వీరిపై ప్రశంసలు కురిపించాడు ఇంగ్లండ్ మాజీ ఫాస్ట్ బౌలర డొమినిక్ కార్క్. అదే సమయంలో ముంబై ఇండియన్స్ జట్టు రిజర్వ్ బెంచ్ చాలా బలంగా ఉందని కొనియాడాడు. స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ టాక్ షోలో మాట్లాడిన కార్క్..ముంబై జట్టు అత్యంత పటిష్టంగా ఉందన్నాడు. ఒకరు గాయపడితే ఆ ప్లేస్‌ను భర్తీ చేయడానికి తగినన్ని వనరులు ముంబై జట్టులో ఉన్నాయన్నాడు. లెఫ్టార్మ్ బౌలర్ అయిన బౌల్ట్ గాయపడితే, అతని స్థానాన్ని రిప్లేస్ చేయడానికి లెఫ్టార్మ్ బౌలర్ అయిన మెక్లీన్గన్ ఉన్న విషయాన్ని ప్రస్తావించాడు. ఇలా ఎక్కడ చూసుకున్నా ముంబై అన్ని విభాగాల్లోనూ బలంగా ఉందన్నాడు. అటు సీనియర్లు, ఇటు యువ టాలెంటెడ్ క్రికెటర్ల సమ్మేళనమే ముంబై ఇండియన్స్ అని అభిప్రాయపడ్డాడు. అసాధారణ నైపుణ్యమున్న యంగ్ క్రికెటర్లతో ముంబై కల్గి ఉండటమే వారి విజయాలకు కారణమన్నాడు. అందులో సూర్యకుమార్ యాదవ్, రాహుల్ చాహర్‌ల పేర్లను కార్క్ ప్రస్తావించాడు. వారిద్దరూ కచ్చితంగా టీమిండియాకు ఆడతారని పేర్కొన్నాడు. ఈరోజు (మంగళవారం) ముంబై ఇండియన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య టైటిల్ పోరు జరనుగంది. నాలుగుసార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై ఒకవైపు, తొలి టైటిల్ సాధించాలనే లక్ష్యంతో ఢిల్లీ మరొకవైపు టైటిల్ వేట కోసం సన్నద్ధమయ్యాయి. -
‘ఐపీఎల్ టైటిల్ గెలవడానికే వచ్చాం’
దుబాయ్: ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్‌తో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి పాలైంది. లీగ్ దశలో రెండు మ్యాచ్‌లతో పాటు క్వాలిఫయర్-1లో కూడా ముంబై ఇండియన్స్ చేతిలో ఢిల్లీ ఓడింది. అయితే ముంబై ఇండియన్స్‌తో జరిగే ఫైనల్లో తమ కుర్రాళ్లు అత్యుత్తమ ఆటను ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నారని హెడ్ కోచ్ రికీ పాంటింగ్ తెలిపాడు. ఈ సీజన్‌ను అత్యుత్తమంగా ముగించే సత్తా ఢిల్లీకి ఉందని ధీమా వ్యక్తం చేశాడు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు సంబంధించి ప్రిమ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన పాంటింగ్..‘నేను చాలా భారీ అంచనాలతో యూఏఈకి వచ్చా. (‘ఏంటిది కోహ్లి.. ధోనిలా ఆలోచించలేవా?!’) మా జట్టు కచ్చితంగా బెస్ట్ జట్టే. సీజన్ ఆరంభంలో ఢిల్లీ ప్రదర్శనే ఇందుకు ఉదాహరణ. కానీ సెకండ్ లెగ్‌లో మేము కాస్త వెనుకబడ్డాం. చివరి మూడు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌లు గెలిచాం. ఫైనల్లో కూడా మేము ఏమిటో చూపిస్తాం. మాకు ఇదొక మంచి సీజన్. మేము ఇప్పటికీ గెలవలేదు. అదే లక్ష్యంతో ఇక్కడికి వచ్చాం. మేము టైటిల్ గెలవడం కోసమే ఇక్కడ ఉన్నాం’ అని పాంటింగ్ పేర్కొన్నాడు.ఈ సీజన్లో వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోవడం తమను తీవ్ర నిరాశలోకి నెట్టిందన్నాడు. కాగా, ఆ తర్వాత పుంజుకోవడం తమ జట్టులో ఉన్న టాలెంట్‌కు నిదర్శనమన్నాడు. కొంతమందికి సరైన అవకాశాలు కూడా ఇవ్వలేకపోయామని, వారికి నిరాశ అనేది ఉంటుందన్నాడు. బెస్ట్ ఎలెవన్ అనేది చూసే జట్టును పోరుకు సిద్ధం చేస్తున్నామన్నాడు. తమ అత్యుత్తమ క్రికెట్ ఇంకా రావాల్సి ఉందని పాంటింగ్ అన్నాడు. అది ఫైనల్ మ్యాచ్ ద్వారా నెరవేరుతుందని ఆశిస్తున్నానన్నాడు. -
పాండ్యా స్ఫూర్తిదాయక వీడియో
దుబాయ్: గత యాభై రోజులుగా క్రికెట్ అభిమానులకు వినోదాన్ని పంచుతున్న ఐపీఎల్ 2020 సీజన్ ముంగిపునకు వచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్-ముంబై ఇండియన్స్ జట్ల మధ్య నేటి (మంగళవారం) సాయంత్రం 7.30 గంటలకు ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈనేపథ్యంలో ముంబై ఆటగాడు హార్దిక్ పాండ్యా ముంబైకి మద్దతు కూడగట్టేందుకు ట్విటర్లో షేర్ చేసిన వీడియో స్ఫూర్తిదాయకంగా ఉంది. ఫిట్నెస్, ప్రాక్టిస్‌కు సంబంధించి ఎంతగా శ్రమించాల్సి వస్తుందో తెలిజేసే వీడియో అది. ‘ఇన్నాళ్లూ ఒక ఎత్తు. ఫైనల్ మ్యాచ్ మరో ఎత్తు. మా సామర్థ్యాన్ని నిరూపించుకునే సమయం వచ్చింది’అని పాండ్యా ట్విటర్లో పేర్కొన్నాడు. కాగా, మంచి హిట్టర్‌గా పేరున్న పాండ్యా.. తనపై రోహిత్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఐపీఎల్ తాజా సీజన్లో 13 మ్యాచుల్లో పాల్గొని 278 పరుగులు చేసి జట్టు విజయాల్లో తన వంతుపాత్ర పోషించాడు. వాటిలో 14 ఫోర్లు, 25 సిక్సర్లు ఉండటం విశేషం. ఇక క్వాలిఫయర్ మ్యాచ్ మినహాయిస్తే.. తాజా సీజన్లో ఢిల్లీతో జరిగిన రెండు మ్యాచుల్లోనూ ముంబై విజయం సాధించింది. మొదట జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో, రెండోసారి జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఢిల్లీపై రోహిత్ సేన గెలుపొందింది. ముంబై ఇండియన్స్ 2013, 2015, 2017, 2019 ఐపీఎల్ టైటిల్స్ సాధించగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇదే తొలి ఐపీఎల్ ఫైనల్. (చదవండి: అతని గేమ్ వేరే లెవెల్లో ఉంది: రోహిత్) -
5 కోసం ముంబై.. 1 కోసం ఢిల్లీ
ఐపీఎల్ అసలు 2020లో జరుగుతుందా అనే సందేహాలను దాటి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదికగా 52 రోజుల పాటు అభిమానులను అలరించిన టోర్నీ ఇప్పుడు చివరి ఘట్టానికి చేరింది. ఆసాంతం అద్భుత వినోదం పంచిన లీగ్‌లో ఆఖరి సమరానికి రంగం సిద్ధమైంది. నాలుగు సార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఒకవైపు... పదమూడో ప్రయత్నంలో ఫైనల్ చేరి మొదటి ఐపీఎల్ టైటిల్ వేటలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ మరోవైపు పోరుకు ‘సై’ అంటున్నాయి. మైదానంలో ప్రేక్షకులు లేకపోయినా... టీవీ వీక్షకుల ఆనందానికి ఏమాత్రం లోటు రాకుండా సాగిన ఈ సీజన్ ఐపీఎల్‌కు మరో అద్భుత ముగింపు లభించాలని అభిమానులు కోరుకుంటున్నారు. నాలుగు బేసి సంవత్సరాల్లో (2013, 2015, 2017, 2019) చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ మళ్లీ గెలిస్తే వారి ఖాతాలో ఐదో టైటిల్ చేరుతుంది. ఇప్పటికే లీగ్‌పై ఆధిపత్యం ప్రదర్శిస్తూ అత్యంత విజయవంతమైన టీమ్‌గా నిలిచిన రోహిత్ శర్మ బృందం ఎవరికీ అందనంత ఎత్తులో నిలుస్తుంది. ‘డేర్‌డెవిల్స్’గా విఫలమైన ఢిల్లీ... ‘క్యాపిటల్స్’గా మారి గత ఏడాది మూడో స్థానంలో నిలిచింది. ఇప్పుడు మరింత మెరుగైన ప్రదర్శనతో తొలిసారి ఫైనల్‌కు చేరింది. ఐపీఎల్ నెగ్గని మూడు జట్లలో ఒకటైన ఢిల్లీ గెలిస్తే మొదటి ట్రోఫీ వారి చెంతకు చేరుతుంది. లీగ్‌లో టాప్–2లో నిలిచిన జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ఎంత హోరాహోరీగా సాగుతుందనేది ఆసక్తికరం. ముంబై ఇండియన్స్ టోర్నీలో జట్టు ప్రస్థానం: లీగ్ దశలో 14 మ్యాచ్‌లలో 9 గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. తొలి క్వాలిఫయర్‌లో అతి సునాయాసంగా ఢిల్లీని 57 పరుగులతో చిత్తు చేసి ఎలాంటి తడబాటు లేకుండా దర్జాగా ఫైనల్‌కు చేరింది. టోర్నీ ఆసాంతం ప్రత్యర్థి జట్లపై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చిన చివరి మ్యాచ్ ను మినహాయిస్తే తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు అత్యల్ప స్కోరు కూడా 162 పరుగులు ఉందంటే జట్టు బ్యాటింగ్ బలమేమిటో అర్థమవుతోంది. లక్ష్యాన్ని నిర్దేశించినా... లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చినా సానుకూల ఫలితాలు పొందగలిగింది. ఆటగాళ్ల ప్రదర్శన: డిఫెండింగ్ చాంపియన్ మళ్లీ ఫైనల్ చేరేందుకు జట్టులో ప్రతీ ఒక్కరు తమదైన పాత్ర పోషించారు. ఇంకా చెప్పాలంటే ఒకరితో మరొకరు పోటీ పడి బాగా ఆడేందుకు ప్రయత్నించారు. ఇషాన్ కిషన్ (483 పరుగులు), డికాక్ (483), సూర్యకుమార్ యాదవ్ (461)ల బ్యాటింగ్ ప్రధానంగా జట్టును నడిపించింది. ఇక పొలార్డ్ (190.44), హార్దిక్ పాండ్యా (182.89)ల స్ట్రయిక్‌రేట్ చూస్తే ఎలాంటి ప్రత్యర్థి అయినా ఆందోళన చెందాల్సిందే. రోహిత్ శర్మ స్థాయి ఆటగాడు విఫలమైనా... ముంబైకు ఆ లోటు ఏమాత్రం కనిపించలేదు. ప్రతీ మ్యాచ్‌లో కనీసం ఇద్దరు బ్యాట్స్‌మెన్ చెలరేగి ప్రత్యర్థులను దెబ్బ కొట్టారు. ఇక బౌలింగ్‌లో బుమ్రా (27 వికెట్లు), బౌల్ట్ (22) ప్రదర్శన ముంబైని ముందంజలో నిలిపింది. వీరిద్దరి ఎనిమిది ఓవర్లే మ్యాచ్‌లను శాసించాయంటే అతిశయోక్తి కాదు. ఈ బృందాన్ని నిలువరించాలంటే ఢిల్లీ రెట్టింపు ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. ఢిల్లీ క్యాపిటల్స్ టోర్నీలో జట్టు ప్రస్థానం: లీగ్ దశలో 14 మ్యాచ్‌లలో 8 గెలిచి రెండో స్థానంలో నిలిచింది. తొలి క్వాలిఫయర్‌లో చిత్తుగా ఓడినా... రెండో క్వాలిఫయర్‌లో సమష్టి ప్రదర్శనతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గెలిచి ఫైనల్ చేరింది. లీగ్ ఆరంభంలో అద్భుతంగా ఆడినా రాన్రానూ ఆట దిగజారుతూ వచ్చింది. నాలుగు వరుస ఓటముల తర్వాత ఎట్టకేలకు ఒక విజయంలో ప్లే ఆఫ్స్ చేరగా... ముంబై చేతిలో భారీ ఓటమి జట్టు బలహీనతను చూపించింది. అయితే గత మ్యాచ్‌లో తుది జట్టులో సరైన మార్పులు, సరైన వ్యూహాలతో విజయాన్ని అందుకుంది. అయితే ఐదు మ్యాచ్‌లలో 150 లోపే పరుగులు చేయగలిగింది. ఆటగాళ్ల ప్రదర్శన: 16 మ్యాచ్‌లలో 4 సార్లు డకౌట్ అయి కూడా మొత్తంగా 603 పరుగులు (2 సెంచరీలు) చేయగలిగిన శిఖర్ ధావన్ ఇప్పుడు జట్టుకు అత్యంత విలువైన ఆటగాడు. 145.65 స్ట్రయిక్‌రేట్‌తో అతను ఈ పరుగులు చేయడం ఓపెనర్‌గా ధావన్ ఇచ్చే ఆరంభంపై ఢిల్లీ ఎంతగా ఆధారపడుతుందో చెప్పవచ్చు. అయితే అతనికి ఇతర బ్యాట్స్‌మెన్ నుంచి సహకారం లభించలేదు. అదే బ్యాటింగ్ వైఫల్యం ఢిల్లీని లీగ్ చివరి దశలో దెబ్బ తీసింది. శ్రేయస్ అయ్యర్ 454 పరుగులతో రెండో స్థానంలో ఉన్నా... అతని స్ట్రయిక్‌రేట్ (122.37) పేలవం. ఎలిమినేటర్‌లో ఆడిన ఇన్నింగ్స్‌లా (20 బంతుల్లో 21) మళ్లీ అయ్యర్ ఆడితే అది ఆత్మహత్యా సదృశ్యమే. టోర్నీలో స్టొయినిస్ ఆల్‌రౌండ్ ప్రదర్శన (352 పరుగులు, 12 వికెట్లు) జట్టును బలంగా మార్చింది. ఫైనల్లోనూ అతను ఇదే జోరు కనబర్చాల్సి ఉంది. హెట్‌మైర్ కూడా కీలకం. రబడ (29 వికెట్లు), నోర్జే (20)తో పేస్ పదునుగా కనిపిస్తుండగా...అశ్విన్, అక్షర్ పటేల్ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయగలరు. విజేతకు రూ. 10 కోట్లు ఈసారి ఐపీఎల్లో ప్రైజ్‌మనీని భారీగా తగ్గించారు. చాంపియన్‌గా నిలిచిన జట్టుకు రూ. 10 కోట్లు ఇవ్వనున్నారు. గత ఏడాది విజేత జట్టుకు రూ. 20 కోట్లు లభించాయి. ఈసారి రన్నరప్ జట్టుకు రూ. 6 కోట్ల 25 లక్షలు దక్కుతాయి. గత ఏడాది రన్నరప్ జట్టు ఖాతాలో రూ. 12 కోట్ల 50 లక్షలు చేరాయి. ఈసారి ప్లే ఆఫ్ దశలో ఓడిన రెండు జట్లకు రూ. 4 కోట్ల 37 లక్షల 50 వేల చొప్పున ప్రైజ్‌మనీ కేటాయించారు. ► టోర్నీలో ముంబై 130 సిక్సర్లు బాదితే, ఢిల్లీ 84 సిక్సర్లు మాత్రమే కొట్టడం ఇరు జట్ల మధ్య దూకుడులో తేడాను చూపిస్తోంది. ► లీగ్ దశలో ఢిల్లీతో ఆడిన రెండు మ్యాచ్‌లతోపాటు తొలి క్వాలిఫయర్‌లో కూడా గెలిచి ముంబై 3–0తో ఆధిక్యంలో ఉంది. ► గత నాలుగు ఐపీఎల్‌లలో క్వాలిఫయర్–1లో విజేతగా నిలిచిన జట్టే మూడు సార్లు టైటిల్ సాధించింది. ఒక్కసారి మాత్రమే (2017లో) క్వాలిఫయర్–2 ద్వారా ఫైనల్ చేరిన జట్టు గెలిచింది. ► రోహిత్ శర్మకు ఇది ఆరో ఐపీఎల్ ఫైనల్. అతను భాగంగా ఉన్న జట్లు ఐదుసార్లు ఫైనల్‌కు వెళితే ప్రతీసారి నెగ్గింది. ముంబై తరఫున 4 టైటిల్స్‌తో పాటు 2009లో విజేతగా నిలిచిన దక్కన్ చార్జర్స్ జట్టులో రోహిత్ సభ్యుడిగా ఉన్నాడు. 2010లో ఫైనల్లో ఓడిన ముంబై జట్టులో రోహిత్ లేడు. ఎన్నో ఆశలతో మేం యూఏఈకి వచ్చాం. ఇప్పుడు వాటిని నెరవేర్చుకునే సమయం వచ్చింది. మొత్తంగా సీజన్ బాగానే గడిచినా... అసలు పని మాత్రం పూర్తి కాలేదు. ఐపీఎల్ టైటిల్ గెలవాలనేదే మా లక్ష్యం. అందుకోసం ఫైనల్లో మా అత్యుత్తమ ఆటను ప్రదర్శిస్తాం. ఎంతో క్రికెట్ ఆడినా ఒక్కసారి కూడా ఐపీఎల్ ఫైనల్లో ఆడే అవకాశం రానివారితో పోలిస్తే మీరు ఎంతో అదృష్టవంతులు. కాబట్టి మైదానంలో ఎలాంటి ఒత్తిడి పెంచుకోకుండా ప్రశాంతంగా ఆడాలని మాత్రమే మా కుర్రాళ్లకు చెప్పాను. సీజన్లో ఇప్పటికే మూడు సార్లు ఓడినా సరే... ముంబైపై గెలిచే సత్తా మా జట్టుకు ఉందని నమ్ముతున్నా. –రికీ పాంటింగ్, ఢిల్లీ హెడ్ కోచ్ గతంలో ఐపీఎల్ ఫైనల్లో ఆడిన అనుభవం ఉండటం వల్ల ప్రత్యర్థిపై మానసికంగా మాది కొంత పైచేయిగా కనిపిస్తున్నా... లీగ్‌లో ప్రతీ రోజూ కొత్తదే. ఆ రోజు ఎవరు ఎలా ఆడతారనేదే ముఖ్యం. ఇది ఎన్నో సార్లు జరిగింది. కాబట్టి గతంలో ఏం జరిగిందనేది ఎక్కువగా ఆలోచించడం అనవసరం. ఇప్పుడు కొత్త ప్రత్యర్థితో తలపడుతున్నట్లే భావించి అదే ప్రణాళికతో ఆడతాం. నిజాయితీగా చెప్పాలంటే ఇప్పుడు మా జట్టులో ఎలాంటి బలహీనతా కనిపించడం లేదు. అయితే ఇంత పటిష్ట జట్టు ఒక్కసారిగా తయారు కాలేదు. ఈ ఆటగాళ్లంతా అన్ని జట్లకు అందుబాటులో ఉన్న రోజుల్లో వారిని గుర్తించి సానబెట్టి మాకు కావాల్సిన విధంగా మార్చుకున్నాం. వారిపై నమ్మకం ఉంచాం కాబట్టే ఫలితాలు వచ్చాయి. –రోహిత్ శర్మ, ముంబై ఇండియన్స్ కెప్టెన్ -
అతని గేమ్ వేరే లెవెల్లో ఉంది: రోహిత్
దుబాయ్: ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే టీమిండియా జట్టులో ముంబై ఇండియన్స్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌కు చోటు ఇవ్వకపోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. మన సెలక్షన్ కమిటీలో ఒక్కొక్కరికీ ఒక్కో రూల్ అనేది సూర్యకుమార్‌ను పక్కకు పెట్టడంతో మరొకసారి రుజువైందని మాజీలు మండిపడ్డారు. దీనిపై ఇటీవలే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ క్లారిటీ ఇచ్చాడు. ఈ ఐపీఎల్ సీజన్లో పలువురు ఆటగాళ్లు ఆకట్టుకున్నారని, అందులో కొంతమందికి చాన్స్ వచ్చిందన్నాడు. అదే సమయంలో సూర్యకుమార్ సమయం కూడా వస్తుందని దాదా వెల్లడించాడు. కాగా, ఢిల్లీ క్యాపిటల్స్‌తో దుబాయ్ వేదికగా జరుగునున్న తుదిపోరులో ముంబై ఇండియన్స్ తలపడనుంది. రేపు(మంగళవారం) ముంబై-ఢిల్లీ జట్ల మధ్య టైటిల్ పోరు జరుగనుంది. ఇది ముంబైకు ఆరో ఫైనల్ కాగా, ఢిల్లీకి తొలి ఫైనల్. దాంతో మరొకటైటిల్ను ఎగురేసుకుపోవాలని రోహిత్ గ్యాంగ్ ఒకవైపు, తొలి టైటిల్‌ను ముద్దాడాలనే అయ్యర్ గ్యాంగ్ మరొకవైపు ఫైనల్ కోసం తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రిమ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ.. ప్రత్యేకంగా సూర్యకుమార్ యాదవ్‌పై ప్రశంసలు కురిపించాడు. ‘సూర్యకుమార్ యాదవ్ మంచి ఆరంభాలు ఇస్తున్నాడు. ఈ సీజన్లో ఒక ప్రత్యేకమైన సూర్యకుమార్‌ను చూస్తున్నాం. అతని గేమ్ వేరే లెవెల్లో ఉంది. అది మనమంతా చూశాం.. అందుకు మనమే సాక్షులం. ఒక చక్కటి టెంపోతో ఆడుతున్నాడు. దాన్నే కొనసాగిస్తూ విలువైన పరుగులు చేస్తున్నాడు. మా విజయాల్లో సూర్యకుమార్ భాగస్వామ్యం చాలా పెద్దది’ అని పేర్కొన్నాడు. ఢిల్లీతో జరిగిన క్వాలిఫయర్-1లో సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ సాధించి ముంబై భారీ స్కోరు చేయడంలో తనవంతు పాత్ర పోషించాడు. అదే సమయంలో ఈ సీజన్లో 450 పరుగులకు పైగా సాధించిన ఎనిమిది మంది ఆటగాళ్లలో సూర్యకుమార్ ఒకడు. ఇక వంద ఐపీఎల్ మ్యాచ్‌లు, రెండు వేలకు పైగా పరుగులు చేసిన తొలి అన్క్యాప్డ్ భారత క్రికెటర్‌గా సూర్యకుమార్ యాదవ్ గుర్తింపు పొందాడు. -
నా ఉచిత సలహా ఉపయోగపడింది: సెహ్వాగ్
న్యూఢిల్లీ: ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్‌కు చేరడంలో తాను ఇచ్చిన ఉచిత సలహా కూడా ఉపయోగపడిందని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పష్టం చేశాడు.మార్కస్ స్టోయినిస్‌ను ఓపెనర్‌గా పంపమని తాను ఒక సలహా ఇస్తే, అది ఢిల్లీకి అడ్వాంటేజ్ అయ్యిందన్నాడు. ఈ మేరకు ఒక వీడియోలో ఢిల్లీ క్యాపిటల్స్-సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన క్వాలిఫయర్-2 గురించి సెహ్వాగ్ మాట్లాడాడు. టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బ్యాటింగ్ చేయడం సరైన నిర్ణయంగా పేర్కొన్నాడు. అంతకుముందు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ఢిల్లీ ఛేజింగ్ చేస్తూ తడబడిన విషయాన్ని ప్రస్తావించిన సెహ్వాగ్.. క్వాలిఫయర్-2లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బ్యాటింగ్‌కు మొగ్గుచూపడం వంద శాతం మంచి నిర్ణయమేనన్నాడు.‘ ఢిల్లీ క్యాపిటల్స్ ముందుగా బ్యాటింగ్ తీసుకుంది. కానీ ఇక్కడ ఆ జట్టు తీసుకున్న ఒక నిర్ణయంతో ఆశ్చర్యపోయా.స్టోయినిస్‌ను ఓపెనింగ్‌కు పంపమని నేను చెప్పా. అలాగే చేశారు. అది నేను ఇచ్చిన సలహానే కానీ ఉపయోగపడింది’ అని సెహ్వాగ్ తెలిపాడు. ఇక స్టోయినిస్ ఆరంభంలోనే ఇచ్చిన క్యాచ్‌ను సన్‌రైజర్స్ ఆటగాడు హోల్డర్ వదిలేయడంతో ఒక గొప్ప చాన్స్‌ను కోల్పోయిందన్నాడు. ఆ సమయంలో స్టోయినిస్ మూడు పరుగులే చేశాడని ,అప్పుడు అతని క్యాచ్ తీసుకుని ఉంటే ఢిల్లీపై ఒత్తిడి వచ్చేదన్నాడు. ఆ తర్వాత స్టోయినిస్ విలువైన పరుగుల్ని సాధించి ఢిల్లీ మంచి ఆరంభంలో కీలక పాత్ర పోషించాడన్నాడు. ఢిల్లీ 8 ఓవర్లు చేరేసరికి 80 పరుగులు దాటేసిందని, ఆ ఫుల్స్పీడ్నే తుది వరకూ కొనసాగించిందన్నాడు. రషీద్ ఖాన్ తన రెండో ఓవర్లో స్టోయినిస్‌ను బౌల్డ్ చేసినా అప్పటికే చాలా నష్టం జరిగిపోయిందన్నాడు. స్టోయినిస్ అయ్యే సమయానికి ధావన్ డ్రైవర్ సీట్(పైచేయి సాధించడంలో)లో కూర్చోవడంతో ఢిల్లీలో పరుగులు వేగం తగ్గలేదన్నాడు. ఈ మ్యాచ్‌లో స్టోయినిస్ 27 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 38 పరుగులు సాధించడంతో పాటు మూడు కీలక వికెట్లు తీసి గెలుపులో కీలక పాత్ర పోషించాడు. -
మూడు వరుస లీగల్ డెలివరీల్లో వికెట్లు.. హ్యాట్రిక్ కాదు
అబుదాబి: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన క్వాలిఫయర్-2లో ఢిల్లీ క్యాపిటల్స్ 17 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. ఈ విజయంలో కగిసో రబడా, మార్కస్ స్టోయినిస్‌లు కీలక పాత్ర పోషించారు. 190 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో సన్‌రైజర్స్ పోరాడింది. రబడా, స్టోయినిస్‌లు వరుస వికెట్లు సాధించి దెబ్బమీద దెబ్బ కొట్టడంతో సన్‌రైజర్స్ తిరిగి తేరుకోలేకపోయింది. 19 ఓవర్లో రబడా వరుసగా మూడు వికెట్లు సాధించడం హైలైట్‌గా నిలిచింది. అయితే రబడా వరుస మూడు లీగల్ డెలివరీల్లో వికెట్లు సాధించినా అది హ్యాట్రిక్‌గా నమోదు కాలేదు. 19 ఓవర్ మూడో బంతికి అబ్దుల్ సామద్‌ను ఔట్ చేసిన రబడా.. ఆ తర్వాత బంతికి రషీద్ ఖాన్‌ను ఔట్ చేశాడు. ఆపై ఐదో బంతిని వైడ్‌గా వేశాడు. కానీ ఆ బంతి స్థానంలో వేసిన మరో బంతికి శ్రీవాత్స్ గోస్వామిని పెవిలియన్‌కు పంపాడు. దాంతో అది హ్యాట్రిక్ అనే అనుమానం చాలామందిలో తలెత్తింది. కానీ అది హ్యాట్రిక్ కాదు. వరుస మూడు లీగల్ డెలివరీల్లో వికెట్లు సాధించినా, ఒక బంతి వైడ్ కావడంతో హ్యాట్రిక్ మిస్సయ్యింది. నిబంధనల ప్రకారం వరుస మూడు బంతుల్లో మాత్రమే ఒక బౌలర్ వికెట్లు సాధిస్తేనే హ్యాట్రిక్ అవుతుంది కానీ లీగల్ డెలివరీలు అయినంత మాత్రన హ్యాట్రిక్‌గా పరిగణించరు. మరొకవైపు మ్యాచ్‌లో వరుసగా రెండు వికెట్లు సాధించిన తర్వాత మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లి, సదరు బౌలర్ ఫస్ట్ బాల్కే వికెట్ తీసినా అది కూడా హ్యాట్రిక్ కాదు. అలానే ఒక మ్యాచ్‌లో వరుసగా రెండు వికెట్లు సాధించి, తదుపరి మ్యాచ్‌లో ఆ బౌలర్ తాను వేసిన తొలి బంతికే వికెట్ తీసినా హ్యాట్రిక్‌గా నమోదు చేయరు. కేవలం ఒకే మ్యాచ్‌లో మాత్రమే వరుస వికెట్లును తీసే క్రమంలో మాత్రమే హ్యాట్రిక్ అవుతుంది. -
టెస్టు జట్టులో రోహిత్.. వన్డే, టీ20లకు రెస్ట్
న్యూఢిల్లీ: త్వరలో ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరే టీమిండియా జట్టులో ఓపెనర్ రోహిత్ శర్మను చేర్చారు. ముందుగా విడుదల చేసిన భారత క్రికెట్ జట్టులో రోహిత్‌ను పక్కకు పెట్టడంతో పెద్ద దుమారం లేచింది. ఫిట్నెస్ పరంగా రోహిత్ బాగానే ఉన్నా అతన్ని ఎందుకు చేర్చలేదనే విమర్శలు వచ్చాయి. దాంతో రివైజ్డ్ జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సెలక్షన్ కమిటీ తాజాగా ప్రకటించింది. ఇందులో రోహిత్‌కు చోటు కల్పిస్తూ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. కేవలం టెస్టు జట్టులో మాత్రమే రోహిత్‌కు చోటిచ్చిన సెలక్టర్లు.. వన్డే, టీ20 సిరీస్‌లకు విశ్రాంతి ఇచ్చారు. (అతన్ని వేలంలో ఎవరూ తీసుకోలేదు: గంభీర్) రోహిత్‌తో బీసీసీఐ మెడికల్ టీమ్ సంప్రదించిన తర్వాతే అతనికి వన్డే, టీ20లకు రెస్ట్ ఇస్తున్నట్లు సెలక్షన్ కమిటీ స్పష్టం చేసింది. రోహిత్ ఫిట్నెస్ను బీసీసీఐ మెడికల్ టీమ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించింది. ఆ క్రమంలోనే సీనియర్ సెలక్షన్ కమిటీకి నివేదిక అందజేసింది. ఈ నెల 27వ తేదీ నుంచి భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ ఆరంభం కానుంది. డిసెంబర్ 8వ తేదీతో పరిమిత ఓవర్ల సిరీస్ ముగియనుండగా, డిసెంబర్17వ తేదీ నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం అవుతుంది. మెడికల్ రిపోర్ట్ ప్రకారం టెస్టు సిరీస్ నాటికి రోహిత్ పూర్తిస్థాయి ఫిట్నెస్ను సాధిస్తాడని భావించిన సెలక్షన్ కమిటీ.. వన్డే, టీ20 సిరీస్‌లకు విశ్రాంతి ఇచ్చింది. రివైజ్డ్ జట్టులో కొన్ని మార్పులు సంజూ శాంసన్- సంజూ శాంసన్‌కు వన్డే జట్టులో కూడా చోటు కల్పించారు. ముందుగా అతని టీ20 జట్టులో స్థానం ఇవ్వగా, ఇప్పుడు వన్డే జట్టులో కూడా చోటిచ్చారు. ఇషాంత్ శర్మ- ఇంకా ఇషాంత్ కోలుకోలేదు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఆటగాళ్ల పునరావాస శిబిరంలో చికిత్స తీసుకుంటున్నాడు. ఇషాంత్ పూర్తి ఫిట్నెస్ సాధించిన తర్వాత భారత టెస్టు జట్టులో చోటు కల్పిస్తారు. వరుణ్ చక్రవర్తి-భుజం గాయం కారణంగా వరుణ్ చక్రవర్తి టీ20 సిరీస్ నుంచి ఔటయ్యాడు. అతని స్థానంలో టి నటరాజన్‌కు చోటు దక్కింది. వృద్ధిమాన్ సాహా- నవంబర్ 3 తేదీన జరిగిన ఐపీఎల్ మ్యాచ్ తర్వాత సాహా గాయం కారణంగా పలు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. సాహా కోలుకున్న తర్వాత అతని స్థానంపై తుది నిర్ణయం తీసుకుంటారు. -
బ్రో.. డీఆర్ఎస్ను మరచిపోయావా?
న్యూఢిల్లీ: ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ ను ఒకవైపు పొగుడుతూనే మరొకవైపు ట్రోల్ చేశాడు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్. ధావన్ మంచి ఫామ్‌లో ఉన్నాడు.. కానీ మనోడికి డీఆర్ఎస్ను కోరకుండా వెళ్లిపోవడం అలవాటుగా మారిపోయింది అంటూ సెటైర్ వేశాడు. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన క్వాలిఫయర్-2లో ఢిల్లీ విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. ఫలితంగా ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ఢిల్లీ ఫైనల్‌కు చేరినట్లయ్యింది. కాగా, ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోర్ చేయడంలో శిఖర్ ధావన్ కీలక పాత్ర పోషించాడు.(అతన్ని వేలంలో ఎవరూ తీసుకోలేదు: గంభీర్) ఇన్నింగ్స్ ఆరంభం నుంచే సన్‌రైజర్స్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. హాఫ్ సెంచరీ అనంతరం 19వ ఓవర్లో ధావన్ ఔటయ్యాడు. పేసర్ సందీప్ శర్మ వేసిన 18వ ఓవర్ మూడో బంతికి ధావన్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అయితే అంపైర్ ఔటివ్వకముందే.. అతడు దాదాపు క్రీజ్‌ను వదలడానికి సిద్ధమై పోయాడు. కానీ రీప్లేలో ఆ బంతి ఆఫ్‌స్టంప్ అవతలికి వెళ్లినట్లు తేలింది.శిఖర్ ధావన్ కనీసం డీఆర్ఎస్కు వెళ్లకపోవడం టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో గబ్బర్ను ఉద్దేశించి యువీ ట్విటర్లో ట్రోల్ చేశాడు.(గెలిపిస్తే బాగుండేది..కానీ పవర్ గేమ్ అదిరింది!) 'ఢిల్లీ ఇన్నింగ్స్‌లో చివరి రెండు ఓవర్లలో హైదరాబాద్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఆఖరి రెండు ఓవర్లలో నటరాజన్, సందీప్ శర్మ ఒక్క బౌండరీ కూడా ఇవ్వలేదు. ఒత్తిడిని తట్టుకుని బాగా బౌలింగ్ చేశారు. శిఖర్ ధావన్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. కానీ ఎప్పటిలాగే డీఆర్ఎస్ కోరడం మర్చిపోయావా బ్రో’ అంటూ యువీ ఆటపట్టించాడు. ఈ సీజన్లో అతను 16 మ్యాచ్‌లు ఆడి 603 పరుగులు చేశాడు. 2012లో ధావన్ అత్యధికంగా 569 పరుగులు సాధించిన అతని రికార్డును సవరించుకున్నాడు. నిన్నటి మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 189 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (78; 50 బంతుల్లో, 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. ఆపై భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వార్నర్‌సేన 8 వికెట్లు కోల్పోయి 172 పరుగులకే పరిమితమైంది. రేపు(మంగళవారం) ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ టైటిల్ పోరులో తలపడనుంది. ఇరుజట్ల మధ్య జరిగిన తొలి క్వాలిఫయర్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించి ముందుగానే ఫైనల్ బెర్తును ఖాయం చేసుకున్న సంగతి తెలిసిందే. Great come back by bowlers in the last 2 overs ! Not even A single boundary scored hats off natrajan and @sandeep25a pressure game execution to the point ! @SDhawan25 man in form but naam to jatt ji hai 🤪 how bout drs bro ? 🤷♂️🤦🏻♂️ as usual must have forgotten 😂 game on #DCvSRH — Yuvraj Singh (@YUVSTRONG12) November 8, 2020 -
అతన్ని వేలంలో ఎవరూ తీసుకోలేదు..
న్యూఢిల్లీ: ఐపీఎల్-2020 సీజన్ ప్రారంభంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆట పడుతూ లేస్తూ సాగింది. కోల్‌కతా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మ్యాచ్‌లలో గెలుపు ఖాయం అనుకున్న స్థితిలో అనూహ్యంగా ఓటమిపాలైంది. కచ్చితంగా చివరి మూడు మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌లపై ఘన విజయాలు సాధించి ప్లేఆఫ్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఒకానొక దశలో టోర్నీ రేసు నుంచి తప్పుకునేలా కనిపించిన సన్‌రైజర్స్ .. పుంజుకుందంటే జాసన్ హోల్డర్ కూడా ఓ కారణం. ఆతడి చేరిక జట్టులో సమతూకం తీసుకువచ్చింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో భాగంగా ఆర్సీబీతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయంలో జాసన్ హోల్డర్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 4 ఓవర్లలో 25 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసిన హోల్డర్.. బ్యాటింగ్‌లో 24 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఛేజింగ్‌లో తీవ్ర ఒత్తిడిలో హోల్డర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. (గెలిపిస్తే బాగుండేది..కానీ పవర్ గేమ్ అదిరింది!) ఈ సీజన్లో 7 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన జాసన్ హోల్డర్ 14 వికెట్లు తీయడంతో పాటు 66 రన్స్ చేశాడు. అయితే గత ఏడాది జరిగిన ఐపీఎల్ 2020 వేలంలో హోల్డర్‌ను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. వెస్టిండీస్ కెప్టెన్‌గా ఉన్నహోల్డర్‌ను వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయకపోవడం పట్ల టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. జేమ్స్ నీశమ్, క్రిస్ మోరీస్, మొయిన్ అలీ లాంటి ఆల్రౌండర్లను తీసుకున్న ఫ్రాంచైజీలు హోల్డర్‌ను పక్కనబెట్టడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నాడు. గౌతమ్ గంభీర్ ఈఎస్పీఎన్-క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ... ‘ వేలంలో జేమ్స్ నీషమ్, క్రిస్ మోరిస్, మొయిన్ అలీలను తీసుకున్నారు. కానీ జాసన్ హోల్డర్‌ను వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయకపోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. అంతర్జాతీయ జట్టుకు హోల్డర్ కెప్టెన్‌గా ఉన్నాడు. అతడు రెగ్యులర్‌గా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్నాడు. కొత్త బంతితో బాగా రాణిస్తాడు. పరుగులు చేస్తాడు. ఓవర్సీస్ ఆల్‌రౌండర్ నుంచి ఇంతకు మంచి ఏం ఆశించగలం. అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఆటగాళ్లకు ఒత్తిడిని ఎదుర్కోవడం తెలుస్తుంది' అని పేర్కొన్నాడు. -
గెలిపిస్తే బాగుండేది..కానీ పవర్ గేమ్ అదిరింది!
న్యూఢిల్లీ: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయినా ఆ జట్టు తుది వరకూ చేసిన పోరాటం ఆకట్టుకుంది. ప్రధానంగా కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఆరెంజ్ ఆర్మీ ఓదశలో గెలుపు దిశగా పయనించింది. కేన్ విలియమ్సన్-అబ్దుల్ సామద్‌లు ఆడుతున్నంతసేపు మ్యాచ్ సన్‌రైజర్స్ వైపే మొగ్గింది. కానీ విలియమ్సన్ (45 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 67 పరుగులు) ,సామద్ (16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33 పరుగులు) స్వల్ప వ్యవధిలో ఔటైన తర్వాత సన్‌రైజర్స్ వెనుకబడిపోయింది. ఆ క్రమంలోనే ఢిల్లీ తిరిగి పుంజుకుని ఫైనల్‌కు అడుగుపెట్టింది. (ఆసీస్ టూర్‌కు వరుణ్ దూరం! సెలక్టర్లపై విమర్శలు) కాగా, జమ్మూ కశ్మీర్ ఆటగాడైన సామద్పై టీమిండియా మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్లు ప్రశంసలు కురిపించారు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను సామద్ గెలిపిస్తే బాగుండేది.. కానీ అతను పోరాడిన తీరు ఆకట్టుకుంది. ప్రత్యేకంగా సామద్ పవర్ గేమ్ అదిరింది’ అని ఇర్ఫాన్ కొనియాడాడు. ఇక ఇర్ఫాన్ ట్వీట్‌కు యువరాజ్ రిప్లై ఇస్తూ..‘ అతనిలో సత్తా ఏమిటో తెలిసింది. భవిష్యత్తులో అతనొక స్పెషల్ ప్లేయర్‌గా ఎదుగుతాడు’ అని ప్రశంసించాడు. ఆదివారం ఇక్కడ జరిగిన క్వాలిఫయర్-2లో సన్‌రైజర్స్ పోరాడి ఓడింది. ఢిల్లీ క్యాపిటల్స్ 17 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ను ఓడించింది. దాంతో సన్‌రైజర్స్ ఇంటిముఖం పట్టగా, ఢిల్లీ క్యాపిటల్స్ తొలిసారి ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. శిఖర్ ధావన్(78; 50 బంతుల్లో 6 ఫోర్లు, 2సిక్స్‌లు), స్టోయినిస్(38; 27 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్)లు మంచి ఓపెనింగ్ భాగస్వామ్యంతో పాటు హెట్మెయిర్( 42 నాటౌట్; 22 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) బ్యాట్ ఝుళిపించాడు. అనంతరం టార్గెట్‌ను ఛేదించడానికి బరిలోకి దిగిన సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో సన్‌రైజర్స్ 8 వికెట్ల నష్టానికి 172పరుగులకే పరిమితం కావడంతో ఓటమి పాలైంది. -
‘తొలిసారి ఫైనల్లో.. చాలా హ్యాపీగా ఉంది’
అబుదాబి: ఆదివారం జరిగిన ఐపీఎల్-2020 క్వాలిఫైయర్- 2 మ్యాచ్‌లొ సన్‌రైజర్స్‌పై గెలుపుతో ఢిల్లీ క్యాపిటల్స్ మొదటిసారి ఫైనల్లో అడుగుపెట్టింది. దీంతో జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పట్టలేని ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఇచ్చిన 190 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ సన్‌రైజర్స్ ఛేదించలేకపోయింది. చివర్లో వికెట్లు కోల్పోవడంతో 20 ఓవర్లలో 172 పరుగులకే పరిమితం అయింది. బౌలర్ల అద్భుతప్రదర్శనతో ఢిల్లీ 17 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంపై అయ్యర్ జట్టు ఆటగాళ్లకు, యాజామన్యానికి ధన్యావాదాలు తెలిపాడు. ఈ సందర్భంగా అయ్యర్ మాట్లాడుతూ.. తమ విజయానికి కొన్ని కీలక నిర్ణయాలు కారణమని చెప్పాడు. ‘ఈ విజయానుభూతి అద్భుతంగా ఉంది. రోలర్ కాస్టర్‌లా హెచ్చుతగ్గులు వచ్చినప్పటికీ మా జట్టంతా ఒకకుటుంబంలా ఉన్నాం. కెప్టెన్‌గా చాలా బాధ్యతలు ఉన్నా, టాపార్డార్ బ్యాట్స్‌మెన్ గాను నిలకడను కొనసాగించాలి. కోచ్‌ల నుంచి, యాజమాన్యం నుంచి నాకు గొప్ప మద్ధతు లభించింది. ఇలాంటి జట్టుతో ఉండటం నిజంగానా అదృష్టం. అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి’ అని అన్నాడు. ఈ మ్యాచ్‌లో శిఖర్ ధావన్‌తో కలసి ఆసీస్ ఆల్‌రౌండర్ స్టోయినిస్ బరిలోకి దిగాడు. 27 బంతుల్లో 38 చేసి శుభారంభాన్ని ఇవ్వడమే కాకుండా మూడు కీలక వికెట్లు తీశాడు. మరో ఓపెనర్ ధావన్ 50 బంతుల్లో 78 పరుగులుచేశాడు. ఇక ఓపెనర్ మార్పుపై అయ్యర్ మాట్లాడుతూ ‘ఎపుడు ఒకే బ్యాటింగ్ ఆర్డర్‌ను కొనసాగించడం కన్నా అపుడప్పుడు మార్పులు చేయాలి. తర్వాతి మ్యాచ్‌లో కూడా ఇలాంటివి ఉండవచ్చు. దీనివల్ల మేము స్వేచ్ఛగా ఉండటంతోపాటు సహజత్వాన్ని కోల్పోలేం. మా జట్టు పరుగుల పట్ల సంతోషంగా ఉన్నాం. ఓవర్‌కు దాదాపు 10 పరుగుల చొప్పున సాధించాం. రషీద్ బౌలింగ్ తో ప్రమాదమే అయినా, భారీ షాట్లు ఆడాలని నిర్ణయించుకున్నాం. మాఓపెనింగ్ జోడి నుంచి గొప్ప ఆరంభం లభించింది. స్టోయినిస్ ఎన్ని ఎక్కువ బంతులు ఆడితే, మాకు అంత మంచి ప్రారంభం ఇవ్వగలడు.’ అని తెలిపాడు. నవంబర్ 10న దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే ఐపీఎల్-2020 ఫైనల్ లో ఢిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో పోరుకు ఢిల్లీ కాపిటల్స్ సిద్ధంగా ఉంది. -
రేపే ఐపీఎల్ ఫైనల్.. బుమ్రా, రబడకు కూడా!
అబుదాబి: ఐపీఎల్ 13 వ సీజన్ చివరి దశకు చేరుకుంది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మంగళవారం జరుగనుంది. అయితే, ఐపీఎల్ విజేత ఎవరనే ఉత్కంఠ ఒకవైపు కొనసాగుతుండగా.. పర్పుల్, ఆరెంజ్ క్యాప్‌లను గెలుచుకునే ఆటగాళ్లెవరు? అనే ఆసక్తి పెరిగిపోయింది. బ్యాటింగ్ విభాగంలో ప్రస్తుతం కింగ్స్ పంజాబ్ ఆటగాడు కేల్ రాహుల్ 670 పరుగులతో టాప్‌లో ఉండగా.. ఢిల్లీ ఓపెనర్ శిఖర్ ధావన్ 603 పరగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఎస్ఆర్హెచ్ ఆటగాడు డేవిడ్ వార్నర్ మూడో స్థానంలో ఉన్నాడు. రాహుల్ కన్నా 67 పరుగుల వెనకబడి ఉన్న ధావన్‌కు ఆరెంజ్ క్యాప్ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక ఢిల్లీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న దక్షిణాఫ్రికా ఆటగాడు కాగిసో రబడ 29 వికెట్లతో బౌలింగ విభాగంలో టాప్‌లో ఉన్నాడు. 27 వికెట్లతో ముంబై బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తర్వాతి స్థానంలో ఉన్నాడు. 22 వికెట్లతో ముంబై మరో బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ఉన్నాడు. ఇరు జట్లలో కీలకమైన బుమ్రా, రబడ ఇద్దరిలో ఎవరు రేపు జరిగే ఫైనల్లో సత్తా చాటి పర్పుల్ క్యాప్‌ను దాంతోపాటు జట్టుకు విజయాన్ని కట్టబెడతారో చూడాలి. ఆదివారం ఎస్ఆర్హెచ్తో జరిగిన క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో ఢిల్లీ 17 పరుగులతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టులో ధావన్ (50 బంతుల్లో 78 పరుగులు, 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించగా.. అనంతరం రబాడా నాలుగు వికెట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. (చదవండి: బ్రియన్ లారా మెచ్చిన యంగ్ క్రికెటర్ అతనే!) -
ఎక్కడో ఉండేవాళ్లం.. ఇక్కడిదాక వచ్చాం!
అబుదాబి: ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ చేతిలో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం జరిగిన క్వాలిఫైయర్-2 లో 17 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రేయస్ అయ్యర్ సేన 20 ఓవర్లకు 189 పరుగులు చేయగా.. వార్నర్ దళం 172 పరుగుల వద్దే ఆగిపోయింది. అయితే, టోర్నీ మొదలైనప్పటి నుంచి కీలక ఆటగాళ్లు గాయాలతో వైదొలిగినా ఎస్ఆర్హెచ్ ఎక్కడా పోరాటాన్ని ఆపలేదని కెప్టెన్ డేవిడ్ వార్నర్ పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌లో చెప్పుకొచ్చాడు. జట్టు సమష్టి కృషి పట్ల గర్విస్తున్నానని పేర్కొన్నాడు. ‘ఐపీఎల్ 2020లో తొలి అర్థభాగం పూర్తయ్యే వరకు మా ప్రదర్శన మరీ అంత గొప్పగా ఏం లేదు. భువనేశ్వర్ కుమార్, మిచెల్ మార్ష్ గాయాలతో వెనుదిరగ్గా.. కేన్ విలియమ్సన్ టోర్నీప్రారంభంలో అందుబాటులో లేకపోవడంతో జట్టుకు కష్టాలు తప్పలేదు. ఇక గత మ్యాచ్‌లలో మెరుగ్గా రాణించిన వృద్ధిమాన్ సాహా కూడా గాయం కారణంగా క్వాలిఫైయర్-2 లో అందుబాటులో లేడు. తగినంత వనరులు లేకపోయినప్పటికీ.. సమష్టి ప్రదర్శనతోనే ఇక్కడిదాక రాగలిగాం. భువీ, మార్ష్ లేని సమయంలో నటరాజన్ తన అద్భుత బౌలింగ్‌తో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అతను మాకు దొరికిన గొప్ప బౌలర్. రషీద్ ఎప్పటిలానే మెరుగ్గా రాణించాడు. మూడో స్థానంలో రాణించి మనీష్ పాండే బ్యాటింగ్ లైనప్‌ను పటిష్టం చేశాడు. మాకు అండగా నిలిచిన సహాయక సిబ్బంది, మద్దతు తెలిపిన అభిమానులందరికీ కృతజ్ఞతలు’అని వార్నర్ తెలిపాడు. (చదవండి: ఢిల్లీ వెళ్లింది ఫైనల్‌కు...) కాగా, నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు వార్నర్, ప్రియం గార్గ్‌తో పాటు, మనీష్ పాండే కూడా వెనుదిరగడంతో కష్టాలు మొదలయ్యాయి. అప్పటికీ జట్టు స్కోరు 5 ఓవర్లకు 44 మాత్రమే. అయినప్పటికీ మిగతా సభ్యులు జట్టును విజయ తీరాలకు చేర్చేందుకు తుదివరకూ పోరాడిన తీరు అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఇదిలాఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మంగళవారం జరగనుంది. (చదవండి: వైరల్ : కూతుళ్లతో మురిసిపోతున్న ముంబై ఆటగాళ్లు) -
సన్‌రైజర్స్‌కు షాక్.. ఫైనల్లో ఢిల్లీ
ఢిల్లీ నిరీక్షణ ఫలించింది. ఐపీఎల్ చరిత్రలో ఎట్టకేలకు ఆ జట్టు తొలిసారి ఫైనల్లోకి ప్రవేశించింది. తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఎక్కడ విఫలమైందో తెలుసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ రెండో క్వాలిఫయర్‌లో వాటిని అధిగమించింది. ఆఖరి అవకాశాన్ని అద్భుతంగా అందిపుచ్చుకుంది. ధావన్ మెరుపు ఇన్నింగ్స్... స్టొయినిస్ ఆల్‌రౌండ్ ప్రదర్శన... రబడ వైవిధ్యభరిత బౌలింగ్... ఢిల్లీని ఫైనల్ మెట్టుపై పడేసింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ వైఫల్యాలతో సన్‌రైజర్స్ ఐపీఎల్–13ను మూడో స్థానంతో ముగించింది. అబుదాబి: ఐపీఎల్ చరిత్రలో ఎనిమిదోసారి టాప్–2 జట్లే టైటిల్ పోరుకు అర్హత పొందాయి. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ తొలిసారి ‘సై’ అంటోంది. ఆదివారం జరిగిన రెండో క్వాలిఫయర్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఢిల్లీ 17 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (50 బంతుల్లో 78; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ స్టొయినిస్ (27 బంతుల్లో 38; 3 ఫోర్లు, సిక్స్), హెట్‌మైర్ (22 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడారు. తర్వాత లక్ష్యఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులే చేసి ఓడింది. కేన్ విలియమ్సన్ (45 బంతుల్లో 67; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) పరువు నిలిపే పోరాటం చేశాడు. స్టొయినిస్ (3/26), రబడ (4/29) హైదరాబాద్‌ను దెబ్బ తీశారు. విలియమ్సన్ పోరాటం.... 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు అనుభవజ్ఞుడైన అశ్విన్ తొలి ఓవర్లోనే 12 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ జోరు ఇక షురూ అనుకుంటున్న తరుణంలోనే రబడ రెండో ఓవర్ తొలి బంతికే వార్నర్ (2)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఐదో ఓవర్ వేసిన స్టొయినిస్... ప్రియమ్ గార్గ్ (17; 2 సిక్స్‌లు)ను బౌల్డ్ చేశాడు. రెండు బంతుల వ్యవధిలో మనీశ్ పాండే (14 బంతుల్లో 21; 3 ఫోర్లు)ను ఔట్ చేశాడు. దీంతో 44 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయిన హైదరాబాద్ కష్టాల్లో పడింది. కేన్ విలియమ్సన్, హోల్డర్ కాసేపు వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశారు. క్రీజులో కుదురుకున్నాక విలియమ్సన్ చెలరేగాడు. హోల్డర్ (11) ఔటయ్యాక... అబ్దుల్ సమద్ (16 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి లక్ష్యాన్ని అందుకునేందుకు విలియమ్సన్ విఫలయత్నం చేశాడు. జట్టు స్కోరు 12.1 ఓవర్లలో వంద పరుగులకు చేరింది. ఈ దశలో పరుగుల వేగం పెరగడంతో ఢిల్లీ శిబిరం లో కలవరం మొదలైంది. 19 బంతుల్లో 43 పరుగులు చేయాల్సిన తరుణంలో విలియమ్సన్‌ను స్టొయినిస్ ఔట్ చేశాడు. రబడ ఒకే ఓవర్లో సమద్, రషీద్ ఖాన్‌లను పెవిలియన్ చేర్చాడు. ఐదో బంతికి శ్రీవత్స్ గోస్వామి (0) కూడా అవుట్ కావడంతో హైదరాబాద్ ఓటమి ఖాయమైంది. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ జట్టు ఫైనల్ చేరడం ఇదే ప్రథమం. గతంలో ఆ జట్టు నాలుగుసార్లు (2008, 2009–సెమీఫైనల్; 2012, 2019–ప్లే ఆఫ్స్ మూడో స్థానం) ప్రయత్నించి విఫలమైంది. ఓపెనర్ల మెరుపులు... అంతకుముందు ఢిల్లీ ఆరంభం నుంచే ధనాధన్‌కు శ్రీకారం చుట్టింది. తొలుత స్టొయినిస్... ఆ తర్వాత ధావన్ దంచేశారు. నాలుగో ఓవర్ వేసిన హోల్డర్‌ను స్టొయినిస్ చితగ్గొట్టాడు. 4, 0, 4, 0, 6, 4లతో ఏకంగా 18 పరుగులు పిండుకున్నాడు. దీంతో 4.5 ఓవర్లలో జట్టు స్కోరు 50కి చేరింది. కాసేపటికి స్టొయినిస్‌ను రషీద్‌ఖాన్ బౌల్డ్ చేశాడు. 9వ ఓవర్లో ధావన్ ఫిఫ్టీ, జట్టు స్కోరు వంద దాటింది. తర్వాత ఢిల్లీ ఆట చూస్తే వేగం తగ్గినట్లనిపించింది. 4 ఓవర్ల పాటు (11 నుంచి 14) 24 పరుగులే చేయగలిగింది. అయ్యర్ (21) ఔటయ్యాక వచ్చిన హెట్‌మైర్ చెలరేగడంతో ఢిల్లీ స్కోరు మళ్లీ పుంజుకుంది. హోల్డర్ 18వ ఓవర్లో హెట్‌మైర్ 3, ధావన్ ఒక బౌండరీ బాదడంతో 18 పరుగులొచ్చాయి. నటరాజన్ ఆఖరి ఓవర్‌ను నియంత్రించి 7 పరుగులే ఇచ్చాడు. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: స్టొయినిస్ (బి) రషీద్ ఖాన్ 38; ధావన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సందీప్ 78; అయ్యర్ (సి) మనీశ్ పాండే (బి) హోల్డర్ 21; హెట్‌మైర్ (నాటౌట్) 42; పంత్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 189. వికెట్ల పతనం: 1–86, 2–126, 3–178. బౌలింగ్: సందీప్ 4–0–30–1, హోల్డర్ 4–0–50–1, నదీమ్ 4–0–48–0, రషీద్ ఖాన్ 4–0–26–1, నటరాజన్ 4–0–32–0. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్: ప్రియమ్ గార్గ్ (బి) స్టొయినిస్ 17; వార్నర్ (బి) రబడ 2; మనీశ్ పాండే (సి) నోర్జే (బి) స్టొయినిస్ 21; విలియమ్సన్ (సి) రబడ (బి) స్టొయినిస్ 67; హోల్డర్ (సి) ప్రవీణ్ దూబే (బి) అక్షర్ 11; సమద్ (సి) (సబ్) కీమో పాల్ (బి) రబడ 33; రషీద్ ఖాన్ (సి) అక్షర్ (బి) రబడ 11;గోస్వామి (సి) స్టొయినిస్ (బి) రబడ 0; నదీమ్ (నాటౌట్) 2; సందీప్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 172. వికెట్ల పతనం: 1–12, 2–43, 3–44, 4–90, 5–147, 6–167, 7–167, 8–168. బౌలింగ్: అశ్విన్ 3–0–33–0, రబడ 4–0–29–4, నోర్జే 4–0–36–0, స్టొయినిస్ 3–0–26–3, అక్షర్ 4–0–33–1, ప్రవీణ్ దూబే 2–0–14–0. ► శిఖర్ ధావన్ తన ఐపీఎల్ కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. ఈ సీజన్లో అతను 16 మ్యాచ్‌లు ఆడి 603 పరుగులు చేశాడు. 2012లో ధావన్ అత్యధికంగా 569 పరుగులు సాధించాడు. ► ఐపీఎల్లో ఢిల్లీ జట్టు తరఫున ఒకే సీజన్లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌గా రబడ నిలిచాడు. ఈ సీజన్లో రబడ 29 వికెట్లు పడగొట్టాడు. మోర్నీ మోర్కెల్ (2012లో 25 వికెట్లు) పేరిట ఉన్న రికార్డును అతను సవరించాడు. -
పోరాడి ఓడిన సన్‌రైజర్స్..ఫైనల్‌కు ఢిల్లీ
అబుదాబి: ఐపీఎల్–13లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆట ముగిసింది. ఆదివారం ఇక్కడ జరిగిన క్వాలిఫయర్-2లో సన్‌రైజర్స్ పోరాడి ఓడింది. ఢిల్లీ క్యాపిటల్స్ 17 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ను ఓడించింది. దాంతో సన్‌రైజర్స్ ఇంటిముఖం పట్టగా, ఢిల్లీ క్యాపిటల్స్ తొలిసారి ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. శిఖర్ ధావన్(78; 50 బంతుల్లో 6 ఫోర్లు, 2సిక్స్‌లు), స్టోయినిస్(38; 27 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్)లు మంచి ఓపెనింగ్ భాగస్వామ్యంతో పాటు హెట్మెయిర్( 42 నాటౌట్; 22 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) బ్యాట్ ఝుళిపించాడు. ఇక అయ్యర్(21; 20 బంతుల్లో 1 ఫోర్), లు ఫర్వాలేదనిపించడంతో ఢిల్లీ భారీ స్కోరు చేసింది. అనంతరం టార్గెట్‌ను ఛేదించడానికి బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. డేవిడ్ వార్నర్(2) నిరాశపరిచాడు. రబడా వేసిన రెండో ఓవర్ తొలి బంతికి వార్నర్ ఔటయ్యాడు. ఇక ప్రియాం గార్గ్(17), మనీష్ పాండే(21)లు పరుగు తేడాలో ఔట్ కావడంతో సన్‌రైజర్స్ కష్టాల్లో పడింది. స్టోయినిస్ వేసిన ఐదో ఓవర్ నాలుగు, ఆరు బంతులకు గార్గ్, పాండేలు ఔట్ కావడంతో ఆరెంజ్ ఆర్మీ 44 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తరుణంలో కేన్ విలియమ్స్(67; 45 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), అబ్దుల్ సామద్(33; 16 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్స్‌లు)లు పోరాడినా జట్టును గట్టెంచలేకపోయారు. వీరిద్దరూ ఆడుతున్నంతసేపు మ్యాచ్ సన్‌రైజర్స్‌దే అనిపించినా, ఈ జోడి ఔటైన తర్వాత మ్యాచ్ ఢిల్లీ చేతుల్లోకి వెళ్లిపోయింది. సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో సన్‌రైజర్స్ 8 వికెట్ల నష్టానికి 172పరుగులకే పరిమితం కావడంతో ఓటమి పాలైంది. ఢిల్లీ బౌలర్లలో రబడా నాలుగు వికెట్లు సాధించగా, స్టోయినిస్ మూడు వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్‌కు వికెట్ దక్కింది.మంగళవారం ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ అమీతుమీ తేల్చుకోనుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 190 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌ను స్టోయినిస్, ధావన్‌లు ఆరంభించారు. పృథ్వీ షాకు ఉద్వాసన పలకడంతో ధావన్‌తో కలిసి స్టోయినిస్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. వీరిద్దరూ ఆదినుంచి బ్యాట్ ఝుళిపించడంతో ఢిల్లీ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. స్టోయినిస్-ధావన్‌లు పోటీ పరుగులు చేయడంతో పవర్ ప్లే ముగిసే సరికి ఢిల్లీ 65 పరుగులు చేసింది. కాగా, రషీద్ ఖాన్ వేసిన తొమ్మిదో ఓవర్ రెండో బంతికి స్టోయినిస్ బౌల్డ్ అయ్యాడు. దాంతో ఢిల్లీ 86 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. అనంతరం ధావన్-అయ్యర్ల జోడి రన్‌రేట్ కాపాడుకుండా స్టైక్ రొటేట్ చేసింది. 14 ఓవర్లో అయ్యర్‌ను హోల్డర్ ఔట్ చేయడంతో ఢిల్లీ 126 పరుగుల వద్ద రెండో వికెట్‌ను నష్టపోయింది. అనంతరం ధావన్‌కు హెట్మెయిర్ జతకలిసి ఇన్నింగ్స్‌లో మరొకసారి దూకుడు పెంచాడు. ఈ జోడి 30 బంతుల్లో 52 పరుగులు చేసింది. -
కూతుళ్లతో మురిసిపోతున్న ముంబై ఆటగాళ్లు
దుబాయ్ : ఐపీఎల్ 13వ సీజన్లో మరోసారి అదరగొట్టే ప్రదర్శన చేసిన ముంబై ఇండియన్స్ ఆరవసారి ఫైనల్లోకి ప్రవేశించింది. ప్లేఆఫ్‌లో ఢిల్లీపై ఘన విజయం సాధించిన ముంబై మరో టైటిల్‌పై కన్నేసింది. కాగా నేడు ఎస్ఆర్హెచ్, ఢిల్లీ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో గెలిచిన జట్టు మంగళవారం ముంబై ఇండియన్స్‌తో తుది పోరుకు సిద్ధమవనుంది. కాగా ఫైనల్ మ్యాచ్‌కు మూడు రోజుల సమయం ఉండడంతో ముంబై ఆటగాళ్లు తమ కుటుంబసభ్యులతో ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా రోహిత్ కూతురు సమైరా, ధవల్ కులకర్ణి కూతురు నితారా, తారే కూతురు రబ్బానీల బర్త్‌డే సెలబ్రేషన్స్ లో భాగంగా కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా ఆటగాళ్లు తమ కూతుళ్లతో కలిసి దిగిన ఫోటోను ముంబై ఇండియన్స్ యాజమాన్యం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇప్పుడీ ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే.. డికాక్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యాలతో బ్యాటింగ్ విభాగం బలంగా కనబడుతుండగా.. బౌలింగ్‌లో బుమ్రా, బౌల్ట్‌లు చెలరేగిపోతున్నారు. బుమ్రా 14 మ్యాచ్‌ల్లో 27 వికెట్లతో టాప్‌లో కొనసాగుతుండగా.. బౌల్ట్ 22 వికెట్లతో ఉన్నాడు. అన్నింట్లోనూ సమానంగా కనిపిస్తున్న ముంబై మంగళవారం జరగబోయే ఫైనల్లో గెలిచి ఐదోసారి కప్ సొంతం చేసుకోవాలని భావిస్తుంది. -
సన్‌రైజర్స్ బ్యాట్ ఝుళిపిస్తేనే..
అబుదాబి: ఐపీఎల్ నాకౌట్ సమరంలో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-2 లో ఢిల్లీ క్యాపిటల్స్ 190 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. శిఖర్ ధావన్(78; 50 బంతుల్లో 6 ఫోర్లు, 2సిక్స్‌లు), స్టోయినిస్(38; 27 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్)లు మంచి ఓపెనింగ్ భాగస్వామ్యంతో పాటు హెట్మెయిర్( 42 నాటౌట్; 22 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) బ్యాట్ ఝుళిపించాడు. ఇక అయ్యర్(21; 20 బంతుల్లో 1 ఫోర్), లు ఫర్వాలేదనిపించడంతో ఢిల్లీ భారీ స్కోరు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌ను స్టోయినిస్, ధావన్‌లు ఆరంభించారు. పృథ్వీ షాకు ఉద్వాసన పలకడంతో ధావన్‌తో కలిసి స్టోయినిస్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. వీరిద్దరూ ఆదినుంచి బ్యాట్ ఝుళిపించడంతో ఢిల్లీ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. స్టోయినిస్-ధావన్‌లు పోటీ పరుగులు చేయడంతో పవర్ ప్లే ముగిసే సరికి ఢిల్లీ 65 పరుగులు చేసింది. కాగా, రషీద్ ఖాన్ వేసిన తొమ్మిదో ఓవర్ రెండో బంతికి స్టోయినిస్ బౌల్డ్ అయ్యాడు. దాంతో ఢిల్లీ 86 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. అనంతరం ధావన్-అయ్యర్ల జోడి రన్‌రేట్ కాపాడుకుండా స్టైక్ రొటేట్ చేసింది. 14 ఓవర్లో అయ్యర్‌ను హోల్డర్ ఔట్ చేయడంతో ఢిల్లీ 126 పరుగుల వద్ద రెండో వికెట్‌ను నష్టపోయింది. అనంతరం ధావన్‌కు హెట్మెయిర్ జతకలిసి ఇన్నింగ్స్‌లో మరొకసారి దూకుడు పెంచాడు. ఈ జోడి 30 బంతుల్లో 52 పరుగులు చేసింది. సందీప్ శర్మ వేసిన 19 ఓవర్ మూడో బంతికి ధావన్ ఔట్ అయ్యాడు. ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ స్లాగ్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీని రెండొందల పరుగుల మార్కును చేరకుండా నివారించింది. చివరి రెండు ఓవర్లలో వికెట్ సాధించిన సన్‌రైజర్స్ 13 పరుగులే ఇచ్చింది. -
‘ఛేజింగ్ రికార్డు’ ఎస్ఆర్హెచ్కు కలిసొచ్చేనా?
అబుదాబి: ఈ ఐపీఎల్ సీజన్లో భాగంగా క్వాలిఫయర్-2లో సన్‌రైజర్స్ హైదరాబాద్-ఢిల్లీ క్యాపిటల్స్‌లు తలపడనున్నాయి. వరుసగా నాలుగు విజయాలు సాధించి ఊపు మీదున్న సన్‌రైజర్స్ మరో గెలుపుపై కన్నేసింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరును ఓడించిన హైదరాబాద్... ఇప్పుడు ఢిల్లీనీ ఓడిస్తే తుది పోరుకు అర్హత సాధిస్తుంది. ప్రస్తుత ఫామ్ ప్రకారం సన్‌రైజర్స్ మంచి జోరు మీద ఉంది. ఒక దశలో 9 మ్యాచ్‌లకు మూడే విజయాలు సాధించిన ఆరెంజ్ ఆర్మీ.. వరుసగా నాలుగు విజయాలను ఖాతాలో వేసుకుని ప్లేఆఫ్స్‌కు చేరింది. ముఖ్యంగా బౌలింగే రైజర్స్ బలంగా మారింది. ఇక తొలి 9 మ్యాచ్‌లలో 7 గెలిచి అభేద్యంగా కనిపించిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆ తర్వాత కుప్పకూలింది. వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడింది. ఎట్టకేలకు ఆఖరి లీగ్‌లో బెంగళూరుపై గెలిచి ప్లే ఆఫ్స్‌కు చేరినా... టీమ్ ఆట మారలేదని తొలి క్వాలిఫయర్‌లో చెత్త ప్రదర్శన చూపించింది. జట్టు టాపార్డర్ మరీ పేలవం. ఎవరిని ఆడించాలో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. వరుసగా రెండు సెంచరీలు ఆ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా రికార్డు సాధించిన ఢిల్లీ ఓపెనర్ శిఖర్ ధావన్.. ఈ సీజన్లో ఇప్పటివరకూ నాలుగు డకౌట్లు అయ్యాడు. ఇది ఢిల్లీని ఆందోళనకు గురిచేస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ ముందుగా బ్యాటింగ్ తీసుకుంది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చేయడానికి మొగ్గుచూపాడు. అబుదాబిలో జరిగిన గత 9 మ్యాచ్‌లలో 8 సార్లు రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది. ఇప్పడు సన్‌రైజర్స్ ఛేజింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది సన్‌రైజర్స్ కు కలిసొస్తుందా లేదో చూడాలి. ఈ మ్యాచ్‌కు సైతం సాహా దూరమయ్యాడు. హ్యాట్రిక్ కొట్టి ఫైనల్‌కు చేరతారా! సన్‌రైజర్స్ కూల్‌గా తన పని తాను చేసుకుపోతోంది. ముఖ్యంగా సన్‌రైజర్స్ జట్టు ఎటువంటి ఆందోళన లేకుండా వరుస విజయాలు సాధించడంతో ఆ జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగింది. మరొకవైపు ఈ సీజన్లో ఢిల్లీతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ వార్నర్ గ్యాంగ్‌దే పైచేయి అయ్యింది. ఇరుజట్ల మధ్య జరిగిన తొలి పోరులో 15 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ గెలవగా, రెండో మ్యాచ్‌లో 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. ఈ సీజన్లో ఢిల్లీతో ఆడిన రెండు మ్యాచ్‌లలో కూడా హైదరాబాద్ గెలిచింది. తొలి మ్యాచ్‌లో 15 పరుగులతో నెగ్గిన రైజర్స్, రెండో పోరులో 88 పరుగులతో ఘన విజయం సాధించింది. దాంతో ఢిల్లీపై హ్యాట్రిక్ విజయం సాధించి ఫైనల్‌కు చేరాలని సన్‌రైజర్స్ భావిస్తోంది. ఇరుజట్లు ఓవరాల్‌గా ముఖాముఖి పోరులో 17 సార్లు తలపడగా సన్‌రైజర్స్ 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, ఢిల్లీ 6సార్లు మాత్రమే గెలుపును అందుకుంది. సన్‌రైజర్స్ జట్టులో డేవిడ్ వార్నర్(546), మనీష్ పాండే(4040), బెయిర్ స్టో(345)లు టాప్ స్కోరర్లుగా ఉండగా, బౌలింగ్‌లో రషీద్ ఖాన్(19), నటరాజన్(16), సందీప్ శర్మ(13)లు అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో వరుసగా ఉన్నారు. ఇక ఢిల్లీ జట్టులో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో శిఖర్ ధావన్(525), శ్రేయస్ అయ్యర్(433), మార్కస్ స్టోయినిస్(314)లు వరుసగా ఉన్నారు. టాప్ వికెట్ టేకర్ల జాబిజాతాలో రబడా(25), నోర్జే(20), రవిచంద్రన్ అశ్విన్(13)లు వరుసగా ఉన్నారు. ఢిల్లీ శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), శిఖర్ ధావన్, అజింక్యా రహానే, రిషభ్ పంత్, హెట్మెయిర్, స్టోయినిస్, అక్షర్ పటేల్, అశ్విన్, ప్రవీణ్ దూబే, రబడా, నోర్జే ఎస్ఆర్హెచ్ డేవిడ్ వార్నర్(కెప్టెన్), శ్రీవత్స్ గోస్వామి, మనీష్ పాండే, విలియమ్సన్, ప్రియాం గార్గ్, జేసన్ హోల్డర్, అబ్దుల్ సామద్, రషీద్ ఖాన్, నదీమ్, సందీప్ శర్మ, నటరాజన్ -
ఆర్సీబీ.. మీకు అతనే పర్ఫెక్ట్ ఫినిషర్!
న్యూఢిల్లీ: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో టాలెంట్ ఉన్న కొంతమంది ఆటగాళ్లను సరైన స్థానంలో ఆడించలేదని దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ పేర్కొన్నాడు. బ్యాటింగ్ ఆర్డర్లో కన్ఫూజ్ ఏర్పడిన కారణంగా శివం దూబే వంటి ఆల్‌రౌండర్‌కు సరైన న్యాయం జరగలేదన్నాడు. దూబేను ఆడమని ప్రోత్సహించి ఉంటే ఫలితం మరొకలా ఉండేదన్నాడు. దూబేను వాషింగ్టన్ సుందర్ కంటే కింది స్థానంలో పంపడంతో అతను కన్ఫ్యూజ్ అవుతూ వచ్చాడన్నాడు. దూబేను ఆర్సీబీ పర్ఫెక్ట్ ఫినిషర్‌తో పోల్చాడు గావస్కర్. స్టార్ స్పోర్ట్‌తో మాట్లాడిన గావస్కర్.. వచ్చే ఐపీఎల్ సీజన్‌కు ఎంతో సమయం లేకపోవడంతో ఇకనైనా ఆర్సీబీ ఫినిషర్‌పై గురిపెట్టాలన్నాడు. ఆర్సీబీకి దూబే పర్ఫెక్ట్ ఫినిషర్ కాగలడనే ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక్కడ దూబేకు స్వేచ్ఛగా ఆడే అవకాశాన్ని ఇస్తే మంచిదని సూచించాడు. (‘ప్రతీసారి జట్టును మార్చలేరు’) ‘దూబేకు ఒక కచ్చితమైన రోల్‌ను అప్పగించడంపై ఆలోచన చేస్తే మంచింది. దూబే చాలా కింది వరుసలో బ్యాటింగ్‌కు వస్తున్నాడు. ఇక సుందర్ ఏమో కిందికి పైకి ట్రాన్స్ఫర్ అవుతున్నాడు. అతనికి ఒక రోల్‌ను అప్పచెప్పి, బంతిని హిట్ చేయమనే ఫ్రీహ్యాండ్ ఇవ్వండి. అది అతనికి లాభించే అవకాశం ఉంది. ప్రస్తుతం అతను కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఐదో స్థానంలో దూబేను బ్యాటింగ్‌కు పంపడమే కాకుండా స్వేచ్ఛగా ఆడమని చెప్పండి. అప్పుడు కోహ్లి, డివిలియర్స్‌లపై ఒత్తిడి తగ్గుతుంది. దూబే ఉన్నతమైన లక్ష్యాలను సెట్ చేసుకున్నా దానిని అందిపుచ్చుకోవడం లేదు. దూబే బ్యాటింగ్ ఆర్డర్‌ను పదే పదే మార్చడమే కారణం. డివిలియర్స్‌తో పాటు దూబే కూడా పరుగులు చేస్తే ఆర్సీబీ పెద్ద స్కోరును బోర్డుపై ఉంచకల్గుతుంది’ అని తెలిపాడు. -
‘ప్రతీసారి జట్టును మార్చలేరు’
న్యూఢిల్లీ: ఇప్పటివరకూ ఒక్క ఐపీఎల్ టైటిల్ కూడా సాధించలేకపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్రక్షాళన అవసరమని తాజాగా వినిపిస్తున్న మాట. అయితే ఆర్సీబీ ఎక్కువగా ఆటగాళ్లను మారుస్తూ ఉంటుందనేది కూడా కాదనలేని వాస్తవం. అయితే ఇలా చేయవద్దని అంటున్నాడు ఆర్సీబీ మాజీ బౌలింగ్ కోచ్ ఆశిష్ నెహ్రా. ఎక్కువ మంది ఆటగాళ్లను వదిలేసుకోవడం, మళ్లీ వేలానికి వెళ్లడం వంటి ప్రక్రియ జట్టుకు మంచిది కాదన్నాడు. ఇలా చేయడం వల్లే ఆర్సీబీ ఎక్కువగా విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌లపై ఆధారపడాల్సి వస్తుందన్నాడు. ఈ ఇద్దరి చుట్టూనే జట్టు తిరుగుతూ ఉంటుందని నెహ్రా పేర్కొన్నాడు. క్రికెట్ అనేది 11 మంది ఆటగాళ్లు ఆడే ఆట అని తెలిపాడు. (ఒక గిఫ్ట్‌గా ముంబై చేతిలో పెట్టారు: టామ్ మూడీ) తీసుకున్న ఆటగాళ్లను కనీసం రెండు మూడేళ్ల పాటు నిలబెట్టుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చన్నాడు. జట్టులో నిలకడ రావాలంటే కోహ్లి, డివిలియర్స్, చాహల్‌లు కొనసాగుతున్నట్లు ఇతర ఆటగాళ్లపై నమ్మకం ఉంచాలన్నాడు. ఎప్పుడూ ఆర్సీబీని చూసినా ముగ్గురు నుంచి నలుగురు మాత్రమే రిటైన్ అయిన ఆటగాళ్లు తుది జట్టులో ఆడుతూ ఉంటారన్నాడు. ఆర్సీబీలో ఎక్కువగా ఆటగాళ్లను తీసుకోవడం, వదిలేయడం మాత్రమే జరుగుతూ ఉంటుందని, ఇది మంచి పరిణామం కాదన్నాడు. ఒక మంచి జట్టుగా రూపాంతరం చెందాలంటే ఒక తుది జట్టు అంటూ ఉండాలన్నాడు. వేలంలో ప్రతీసారి ఆటగాళ్లను మార్చలేరని విషయం తెలుసుకోవాలన్నాడు. ప్రతీసారి జట్టులోకి కొత్త ఆటగాళ్లను తీసుకుంటూ పోతే చివరకు తీసుకున్న వాళ్లనే మళ్లీ తీసుకోవాల్సి వస్తుందన్నాడు. ఉన్న జట్టునే కనీసం మూడేళ్ల పాటు కొనసాగిస్తే వారి సత్తా బయటకు వస్తుందన్నాడు. కాగా, ఈ ఐపీఎల్ సీజన్లో ప్లేఆఫ్స్‌కు చేరిన ఆర్సీబీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. దాంతో ఈసారైనా కప్‌ను సాధించాలనే ఆర్సీబీ ఆశలకు ప్లేఆఫ్స్‌తోనే బ్రేక్‌పడింది. -
‘అది చాలామంది బౌలర్లను డిస్టర్బ్ చేసింది’
న్యూఢిల్లీ: క్రికెటర్లకు తన ట్రేడ్‌మార్క్ షాట్(ఎక్కవగా కొట్టే షాట్లు) అనేది ఒకటి కచ్చితంగా ఉంటుంది. కానీ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ట్రేడ్‌మార్క్ షాట్లు చాలానే ఉన్నాయి. స్ట్రైట్‌డ్రైవ్, కట్ షాట్, కవర్ డ్రైవ్‌లతో పాటు ఇంకా చాలా ట్రేడ్‌మార్క్ షాట్లు సచిన్ సొంతం. దాంతోనే బౌలర్లపై సచిన్ ఆధిపత్యం కొనసాగేది. ఇక సచిన్ షాట్లలో అప్పర్ కట్ షాట్ ఒకటి. 2001 దక్షిణాఫ్రికా పర్యటనలో ఎటువంటి ప్రాక్టీస్ లేకుండా ఆ షాట్లను అలవోకగా ఆడేశాడు సచిన్. తాజాగా ఆ అప్పర్ షాట్ గురించి యూట్యూబ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్లో సచిన్ కొన్ని విషయాలను షేర్ చేసుకున్నాడు. అనురాజ్ ఆందే అనే అభిమాని సచిన్‌ను అప్పర్ కట్ షాట్ గురించి అడిగాడు. ‘మీరు అప్పర్ కట్ షాట్లను ఆడటం కోసం స్పెషల్‌గా ఏమైనా ప్రాక్టీస్ చేశారా’? అని ప్రశ్నించాడు. (ఒక గిఫ్ట్‌గా ముంబై చేతిలో పెట్టారు: టామ్ మూడీ) దానికి సచిన్ బదులిస్తూ.. ‘అది 19 ఏళ్ల క్రితం దక్షిణాఫ్రికా పర్యటనలో జరిగింది. మేము బ్లోమ్ఫాంటీన్లో టెస్టు మ్యాచ్‌కు సిద్ధమైనప్పుడు తొలుత బ్యాటింగ్‌కు దిగాం. అప్పుడు ఎన్తిని ఆఫ్ స్టంప్ బంతుల్ని ఎక్కువగా వేసేవాడు. అతను షార్ట్ లెంగ్త్ డెలివరీలను రెగ్యులర్‌గా వేస్తూ ఉంటాడు. లెంగ్త్ డెలివరీలు అనేవి చాలా తక్కువగా వేసేవాడు. క్రీజ్‌కు బాగా ఎడంగా పరుగెత్తుకొచ్చి బౌలింగ్ వేయడం అతనికి అలవాటు. అదే సమయంలో దక్షిణాఫ్రికా పిచ్‌ల్లో బౌన్స్ కూడా ఎక్కువగా వస్తుంది. నా ఎత్తు కంటే బంతి ఎక్కువ ఎత్తులో వచ్చినప్పడు దూకుడుగా బ్యాటింగ్ చేసే క్రమంలో అప్పర్ కట్ షాట్ ఆడేవాడిని. బంతిని వేటాడి గ్రౌండ్ అవతలికి పంపేవాడిని. అది థర్డ్ మ్యాన్ స్థానం నుంచి అప్పర్ కట్ షాట్లు ఆడేవాడిని. అది చాలా మంది బౌలర్లను డిస్టర్బ్ చేసిందనే అనుకుంటున్నా. ఏ బౌలర్ అయినా బౌన్స్ వేస్తే అది డాట్ బాల్ కావాలనుకుంటారు(పరుగులు రాకుండా ఉండటం). కానీ నేను అప్పర్ కట్ షాట్‌తో బౌండరీ లైన్ దాటించడంతో బౌలర్లకు నిరాశ ఎదురవుతుంది. దీని కోసం ప్రత్యేకంగా ప్రణాళిక ఏమీ ఉండేది కాదు’ అని సచిన్ పేర్కొన్నాడు. -
ఒక గిఫ్ట్‌గా ముంబై చేతిలో పెట్టారు..
సిడ్నీ: ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ విజయాల్లో పేసర్ ట్రెంట్ బౌల్ట్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. పవర్ ప్లేలో కానీ డెత్ ఓవర్లలో కానీ బౌల్ట్ తనదైన పేస్‌తో చెలరేగిపోతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జరిగిన క్వాలిఫయర్-1లో బౌల్ట్ ఆరంభంలోనే రెండు వికెట్లు సాధించి తన బౌలింగ్ వేడిని రుచి చూపించాడు. తొలి ఓవర్లోనే పృథ్వీ షా, అజింక్యా రహానేలను డకౌట్లుగా పంపి ఢిల్లీని కోలుకోని దెబ్బకొట్టాడు. కాగా, ఈ సీజన్లో బౌల్ట్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ వదిలేయడం ఆ జట్టు చేసిన తప్పిదంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కోచ్ టామ్ మూడీ అభిప్రాయపడ్డాడు. (ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్!) ముంబైకు బౌల్ట్‌ను ఒక గిఫ్ట్‌గా ఢిల్లీ అప్పగించిందని విమర్శించాడు. ‘ అదొక అసాధారణమైన చర్య. ట్రేడింగ్ ద్వారా బౌల్ట్‌ను ముంబైకు వదిలేయడం సరైన నిర్ణయం కాదు. ప్రస్తుతం ముంబై జట్టులో బౌల్ట్ కీలక బౌలర్‌గా మారిపోయాడు. టోర్నమెంట్ యూఏఈలో జరుగుతుందని వారికి తెలియకపోవడంతోనే బౌల్ట్‌ను వదిలేసుకుని ఉండవచ్చు. ఏది ఏమైనా ముంబై దొరికిన ఒక గిఫ్ట్ బౌల్ట్. పవర్ ప్లేలో బౌల్ట్ ఒక అత్యుత్తమ బౌలర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. బలమైన జట్టుకు బౌల్ట్‌ను అప్పగించి తప్పుచేసింది ఢిల్లీ. ఒకవేళ ట్రేడింగ్ ద్వారా బౌల్ట్ ముంబైకు వెళ్లకపోతే అతని కోసం వేలంలో చాలా జట్లు పోటీ పడేవి. ఏది ఏమైనా బౌల్ట్‌ను వదిలేయడం ఢిల్లీ చేసిన అది పెద్ద తప్పు’ అని ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో మాట్లాడిన మూడీ పేర్కొన్నాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు నాలుగు ఫ్రాంచైజీల తరుపున బౌల్ట్ ఆడాడు. తొలుత సన్‌రైజర్స్ తరుపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఈ లెఫ్టార్మర్.. ఆ తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ప్రాతినిథ్యం వహించాడు. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్‌తో ట్రెంట్ బౌల్ట్ జతకట్టాడు. ట్రేడింగ్ విండో విధానం ఐపీఎల్-2015 నుంచి ప్రారంభించారు. ఈ విధానం ద్వారా ప్రాంచైజీలు ఆటగాళ్లను బదిలీ చేసుకునే వీలు ఉంటుంది. (‘ఫినిషర్ అంటే అలా ఉండాలి’) -
ఈ బెంగ తీరనిది..!
‘విలియమ్సన్ క్యాచ్‌ను పడిక్కల్ పట్టి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో’... ఎలిమినేటర్ మ్యాచ్‌లో హైదరాబాద్ చేతిలో ఓడిన తర్వాత రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యాఖ్య ఇది! ఇదొక్కటి చాలు ఐపీఎల్లో అతని నాయకత్వ వైఫల్యానికి ఉదాహరణగా చూపించేందుకు. బ్యాటింగ్‌లో 131 పరుగులే చేయగలిగిన తమ వైఫల్యాన్ని చెప్పుకోకుండా 17 బంతుల్లో రైజర్స్ 27 పరుగులు చేయాల్సిన స్థితిలో ఎంతో కష్టసాధ్యమైన క్యాచ్‌ను తీవ్రంగా ప్రయతి్నంచిన తర్వాత కూడా ఒక యువ ఆటగాడు అందుకోలేకపోతే పరాజయాల్లో దానిని ఒక కారణంగా చూపించడం కోహ్లి పరిణతిని ప్రశ్నిస్తోంది. గత మూడు సీజన్లలో వరుసగా ఎనిమిది, ఆరు, ఎనిమిది స్థానాల్లో నిలిచిన బెంగళూరు జట్టు ఈసారి కొంత మెరుగ్గా నాలుగో స్థానంతో ముగించింది. అయితే తొలి సీజన్ నుంచి అభిమానులు ఆశిస్తున్న టైటిల్ కోరిక మాత్రం తీరలేదు. ఆటగాడిగా, భారత కెప్టెన్‌గా ఘనమైన రికార్డు ఉన్న కోహ్లి ఐపీఎల్ నాయకత్వంపై కూడా ఈ ప్రదర్శన సందేహాలు రేకెత్తిస్తోంది. –సాక్షి క్రీడా విభాగం ఈసారి ఐపీఎల్లో తాము ఆడిన చివరి నాలుగు లీగ్ మ్యాచ్‌లు, ఎలిమినేటర్ కలిపి వరుసగా ఐదు మ్యాచ్‌లలో బెంగళూరు ఓటమి పాలైంది. ఈ ఐదుసార్లు ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు ఒక్కసారిగా మాత్రమే 160 పరుగులు దాటగలిగింది. ఇలాంటి ప్రదర్శనతో ఐపీఎల్లో గెలుపును కోరుకోవడం అత్యాశే అవుతుంది. 2019 ఐపీఎల్లో ఆర్సీబీ టోర్నీ తొలి ఆరు మ్యాచ్‌లలో ఓటమి పాలైంది. తర్వాత ఐదు మ్యాచ్‌లు గెలిచినా అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయి ఆఖరి స్థానంలో నిలిచింది. అయితే 2008 నుంచి ఎదురు చూస్తున్నట్లుగానే ఈసారి కూడా బెంగళూరు అభిమానులు మళ్లీ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడైనా కోహ్లి ట్రోఫీని అందిస్తాడని నమ్మారు. అందుకు తగినట్లుగా తొలి 10 మ్యాచ్‌లలో 7 గెలవడంతో ఆర్సీబీ సరైన దిశలోనే వెళుతున్నట్లు అనిపించింది. కానీ కథ మళ్లీ మొదటికి వచి్చంది. ఆ తర్వాత ఒక్క గెలుపూ దక్కక... రన్‌రేట్ అదృష్టం కలిసొచ్చి నాలుగో స్థానంతో ప్లే ఆఫ్స్‌కు చేరినా, ఎలిమినేటర్‌లోనే జట్టు ఆట ముగిసింది. ఏబీ మెరుపు ప్రదర్శన... బెంగళూరు తరఫున ఏబీ డివిలియర్స్ ప్రదర్శనే హైలైట్‌గా నిలిచింది. ఏకంగా 158.74 స్ట్రయిక్‌రేట్‌తో అతను 454 పరుగులు సాధించాడు. ఏబీ అర్ధసెంచరీ చేసిన ఐదు మ్యాచ్‌లలో నాలుగు సార్లు జట్టు గెలిచింది. డివిలియర్స్‌కు ఇతరుల నుంచి సహకారం లభించలేదు. తొలి ఐపీఎల్ ఆడిన యువ ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్ జట్టు తరఫున అత్యధికంగా 473 పరుగులు చేయడం మరో చెప్పుకోదగ్గ అంశం. బౌలింగ్‌లో 21 వికెట్లతో చహల్ సత్తా చాటగా, ఆరుకంటే తక్కువ ఎకానమీ నమోదు చేసిన వాషింగ్టన్ సుందర్ కూడా ఆకట్టుకున్నాడు. ఆ్రస్టేలియా కెపె్టన్ ఫించ్ వైఫల్యం (268 పరుగులు–1 అర్ధ సెంచరీ) జట్టును బాగా దెబ్బ తీసింది. గాయంతో మోరిస్ 9 మ్యాచ్‌లకే పరిమితం కావడం కీలక సమయంలో సమస్యగా మారింది. సీనియర్ పేసర్లు స్టెయిన్ (11.40 ఎకానమీ), ఉమేశ్ యాదవ్ (11.85)లు ఘోరంగా విఫలమవ్వగా... కోల్‌కతాతో (3/8) ప్రదర్శన మినహా సిరాజ్ భారీగా పరుగులిచ్చాడు. లోయర్ ఆర్డర్లో ధాటిగా ఆడే ఒక్క బ్యాట్స్‌మన్ కూడా లేకపోవడం జట్టులో పెద్ద లోటుగా కనిపించింది. కోహ్లి అంతంతే... అన్నింటికి మించి కోహ్లి వ్యక్తిగత వైఫల్యం కూడా జట్టును ఇబ్బంది పెట్టింది. కెపె్టన్ మొత్తంగా 466 పరుగులు చేసినా...స్ట్రయిక్‌రేట్ 121.35కే పరిమితమైంది. 2012 సీజన్లో వెటోరి మధ్యలో తప్పుకోవడంతో కెపె్టన్‌గా కోహ్లి బాధ్యతలు స్వీకరించాడు. అప్పటినుంచి ఇప్పటి వరకు అతనే సారథిగా వ్యవహరిస్తున్నాడు. ఎనిమిది పూర్తి సీజన్లలో కూడా కోహ్లి తన జట్టుకు టైటిల్ అందించలేకపోవడం అభిమానులను తీవ్రంగా బాధిస్తోంది. 2016లో రన్నరప్‌గా నిలవడమే అత్యుత్తమ ప్రదర్శన. 125 మ్యాచ్‌లలో కెప్టెన్‌గా వ్యవహరిస్తే గెలిచిన మ్యాచ్లకంటే (55) ఓడిన మ్యాచ్‌ల సంఖ్య (63) ఎక్కువ. ఈ నేపథ్యంలో కోహ్లి ఇంకా కెప్టెన్‌గా కొనసాగుతాడా, ఫ్రాంచైజీ యాజమాన్యం మార్పు కోరుకుంటుందా అనేది చూడాలి. బ్యాటింగ్‌పరంగా తాను నెలకొలి్పన ప్రమాణాలను కోహ్లి అందుకోలేకపోయాడు. అతనివైఫల్యమే జట్టును ముందుకు తీసుకుపోలేకపోయింది. ఇంత కాలం బౌలింగ్ బలహీనంగా ఉండి ఓడిన బెంగళూరు ఇప్పుడు బ్యాటింగ్ బలహీనతతో ఓడింది. –సునీల్ గావస్కర్ 100 శాతం కోహ్లిని కెప్టెన్సీ నుంచి తప్పించాలనేదే నా అభిప్రాయం. ఈ పరాజయాలకు నేనే కారణమని అతనే చెప్పుకోవాలి. ఎనిమిదేళ్లు అంటే చాలా ఎక్కువ సమయం. ఇన్నేళ్లు ఒక్క ట్రోఫీ గెలవకుండా కూడా కెపె్టన్‌గా ఎవరైనా కొనసాగగలరా. కెప్టెన్సీ విషయంలో ధోని (3 టైటిల్స్), రోహిత్ (4 టైటిల్స్)లతో కోహ్లికి అసలు పోలికే లేదు. సరిగ్గా చెప్పాలంటే బెంగళూరుకు ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అర్హతే లేదు. ఒక్క డివిలియర్స్ ప్రదర్శనతోనే వారు ముందుకొచ్చారు. – గంభీర్ -
ఫైనల్‌పై రైజర్స్ గురి!
అబుదాబి: మాజీ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండోసారి ఐపీఎల్ ఫైనల్ చేరడంపై గురి పెట్టింది. అద్భుత ఫామ్‌తో వరుసగా నాలుగు విజయాలు సాధించి ఊపు మీదున్న ఈ టీమ్‌కు ఇప్పుడు ‘క్వాలిఫయర్–2’ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ రూపంలో ప్రత్యర్థి ఎదురైంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరును చిత్తు చేసిన హైదరాబాద్... ఇప్పుడు ఢిల్లీనీ ఓడిస్తే తుది పోరుకు అర్హత సాధిస్తుంది. నాలుగుసార్లు చాంపియన్ ముంబైని టైటిల్ కోసం ఢీకొట్టాలంటే ముందుగా ఢిల్లీ అడ్డంకిని సన్‌రైజర్స్ అధిగమించాల్సి ఉంది. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ ఒక్కసారి కూడా ఫైనల్ చేరలేదు. ఫామ్ ప్రకారం చూస్తే ఢిల్లీకంటే హైదరాబాద్ జోరు మీదుంది. ఒక దశలో తొలి 9 మ్యాచ్‌లలో 3 మాత్రమే గెలిచి ఏడో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ ఆ తర్వాత పుంజుకుంది. ఇప్పుడు వరుసగా నాలుగు మ్యాచ్‌లలో గెలిచి సత్తా చాటింది. తుది జట్టు విషయంపై రైజర్స్‌కు పూర్తి స్పష్టత వచ్చేసింది. ముఖ్యంగా బౌలింగే రైజర్స్ బలంగా మారింది. గత ఆరు మ్యాచ్‌లలో ఒక్కసారి మాత్రమే హైదరాబాద్ ప్రత్యర్థులు 150కు పైగా పరుగులు చేయగలిగారు. అయితే మిడిలార్డర్లో కొంత తడబాటు ఉందని ఎలిమినేటర్‌లో కూడా కనిపించింది. దీనిని జట్టు అధిగమించడమే కీలకం. సాహా గాయం నుంచి కోలుకోకపోవడంతో శ్రీవత్స్‌ని కొనసాగించే అవకాశం ఉంది. తొలి 9 మ్యాచ్‌లలో 7 గెలిచి అభేద్యంగా కనిపించిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆ తర్వాత కుప్పకూలింది. వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడింది. ఎట్టకేలకు ఆఖరి లీగ్‌లో బెంగళూరుపై గెలిచి ప్లే ఆఫ్స్‌కు చేరినా... టీమ్ ఆట మారలేదని తొలి క్వాలిఫయర్‌లో చెత్త ప్రదర్శన చూపించింది. జట్టు టాపార్డర్ మరీ పేలవం. ఎవరిని ఆడించాలో కూడా అర్థం కాని పరిస్థితి. రెండు సెంచరీలు చేసినా కూడా ధావన్ 4 డకౌట్లు నమోదు చేయగా... పృథ్వీ షా 3 సార్లు, రహానే 2 సార్లు డకౌటయ్యారు. ఈ మ్యాచ్ కోసం డేనియల్ స్యామ్స్ స్థానంలో బ్యాటింగ్‌కు బలంగా మార్చేందుకు హెట్‌మైర్ రావచ్చు. ఈ సీజన్లో ఢిల్లీతో ఆడిన రెండు మ్యాచ్‌లలో కూడా హైదరాబాద్ గెలిచింది. తొలి మ్యాచ్‌లో 15 పరుగులతో నెగ్గిన రైజర్స్, రెండో పోరులో 88 పరుగులతో ఘన విజయం సాధించింది. అబుదాబిలో జరిగిన గత 9 మ్యాచ్‌లలో 8 సార్లు రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది. రెండో ఇన్నింగ్స్ సమయంలో మంచు ప్రభావం కూడా దీనికి కారణం కాబట్టి టాస్ కీలకం. అయితే శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో మంచు పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. హైదరాబాద్ వికెట్ కీపర్ శ్రీవత్స్ గోస్వామి తొలి సీజన్ (2008) నుంచే ఐపీఎల్లో ఆడుతున్నాడు. నాటినుంచి 2020 ఐపీఎల్ వరకు ఆడుతూ ఒక్కసారి కూడా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించని (అన్క్యాప్డ్) ఆటగాడు అతనొక్కడే. గత ఐపీఎల్లో నాకౌట్ దశలో హైదరాబాద్‌ను ఢిల్లీ దెబ్బ తీసింది. విశాఖపట్నంలో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో క్యాపిటల్స్ 2 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ను ఓడించింది. ఇప్పుడు మళ్లీ నాకౌట్ మ్యాచ్‌లో రెండు జట్లు తలపడుతున్నాయి. శ్రీవత్స్ గోస్వామి -
ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్!
న్యూఢిల్లీ: ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనకు సంబంధించి భారత క్రికెట్ జట్టును ప్రకటించినప్పట్నుంచీ రోహిత్ శర్మ తొడ కండరాల గాయం హాట్ టాపిక్ అయ్యింది. ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్‌ను ఎంపిక చేయకపోవడంతో పెద్ద ఎత్తున దుమారం లేచింది. ఈ ఐపీఎల్లో కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత రోహిత్ కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. గాయం కారణంగా పలు ఐపీఎల్ మ్యాచ్‌ల్లో రోహిత్ పాల్గొనలేదు. దీన్ని సాకుగా చూపి రోహిత్‌ను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయలేదు. కనీసం రోహిత్‌కు సమాచారం ఇవ్వకుండా పర్యటన నుంచి తప్పించారు. దీనికి కోహ్లితో రోహిత్‌కు ఉన్న విభేదాలే కారణమని సోషల్ మీడియాలో హోరెత్తింది. ఇక మళ్లీ రోహిత్ ఐపీఎల్ మ్యాచ్‌ల్లో పాల్గొనడంతో అతన్ని పరిగణలోకి తీసుకోవాలనే డిమాండ్ వినిపించింది. సునీల్ గావస్కర్ సైతం రోహిత్ గాయం నుంచి కోలుకోవడం శుభపరిణామం అని, అతన్ని ఆలస్యంగానైనా జట్టులోకి తీసుకుంటే బాగుంటుందని మద్దతుగా నిలిచాడు. అయితే తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సైతం రోహిత్ శర్మ ప్రస్తావన తీసుకొచ్చాడు. ఓ జాతీయ పత్రికతో మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా పర్యటనలో ఓపెనింగ్ అనేది చాలా కీలకమని పేర్కొన్నాడు. టెస్టు సిరీస్‌లో ఓపెనింగ్ ప్రధాన భూమిక పోషిస్తుందన్నాడు. ఆస్ట్రేలియాలో భారత్ రాణించాలంటే విరాట్ కోహ్లి కెప్టెన్సీ స్కిల్స్‌పైనే ఆధారపడి ఉంటుందన్నాడు. బౌలర్ల విషయంలో కానీ, బ్యాట్స్‌మెన్ విషయంలో కానీ కోహ్లి తీసుకుని నిర్ణయాలే కీలకమన్నాడు. ఈ మాట్లలో రోహిత్ మాట కూడా గంగూలీ నోటి నుంచి వచ్చింది. బ్యాటింగ్‌లో మయాంక్ అగర్వాల్, పృథ్వీషా, రోహిత్ శర్మల్లో ఎవర్ని తుది జట్టులోకి తీసుకోవాలనేది కోహ్లి నిర్ణయంపైనే ఉంటుందన్నాడు. దాంతో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే జట్టులో రోహిత్‌ను చేర్చడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఫిట్నెస్ పరంగా రోహిత్ బానే ఉండటంతో అతని ఎంపిక అనివార్యమనే చెప్పాలి. రోహిత్ ఫిట్నెస్ను నిరూపించుకుంటే అతన్ని జట్టులో ఎంపిక చేస్తామని గంగూలీనే స్వయంగా చెప్పాడు. ఇంకా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లడానికి సమయం ఉండటంతో రోహిత్ ఫిట్నెస్ నిరూపించుకోవడం కష్టం కాకపోవచ్చు. -
'సరైన టైంలో బ్రెయిన్ వాడాం.. మ్యాచ్ గెలిచాం'
దుబాయ్ : విండీస్ ఆటగాడు జేసన్ హోల్డర్ ఐపీఎల్ 13వ సీజన్లో లేట్‌గా ఎంట్రీ ఇచ్చిన లేటెస్ట్గా అదరగొడుతున్నాడు. ఎస్ఆర్హెచ్ తరపున బరిలోకి దిగిన హోల్డర్ ఆడిన 6 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీసి జట్టు విజయాల్లో భాగంగా నిలిచాడు. అయితే విచిత్రమేంటంటే హోల్డర్ వచ్చిన తర్వాత లీగ్‌లో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. కాగా శుక్రవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో జేసన్ హోల్డర్ ఆల్‌రౌండ్ పాత్ర పోషించాడు. మొదట బౌలింగ్‌లో 3 వికెట్లు, తర్వాత బ్యాటింగ్‌లో 20 బంతుల్లో 24 పరుగులు చేసి ఎస్ఆర్హెచ్ విజయంలో కీలకంగా నిలిచి ఏకంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ను వరించాడు ఈ సందర్భంగా కీలక మ్యాచ్‌లో విజయం సాధించనందుకు చాలా ఆనందంగా ఉందని హోల్డర్ పేర్కొన్నాడు.(చదవండి : వైరలవుతున్న మీమ్స్.. పాపం ఆర్సీబీ) 'సరైన సమయంలో మా బ్రెయిన్ వాడాం.. అందుకే ఆర్సీబీపై విజయం సాధించాం . మ్యాచ్‌కు ముందే ఎలా విజయం సాధించాలన్నదానిపై చాలా సేపు చర్చ జరిగింది. టాస్ గెలిస్తే బౌలింగ్ ఏంచుకొని ఆర్సీబీని తక్కువ స్కోరుకే కట్టడి చేయాలనుకున్నాం. అనుకున్నట్లే టాస్ గెలవడంతో మా బౌలర్లు సరైన సమయంలో బ్రెయిన్ వాడి.. తమ నైపుణ్యతను చూపించి వరుస విరామాల్లో వికెట్లు తీశారు. ఆ తర్వాత స్కోరు చేదనలో బ్యాట్స్మెన్ల పని సులువైంది. మెయిన్బౌలర్ భువనేశ్వర్ గైర్హాజరీలోనూ మా బౌలర్లు చక్కగా రాణిస్తున్నారు. (చదవండి : 'వాళ్లను చూస్తే 90లలో మమ్మల్ని చూసినట్లుంది') ముఖ్యంగా సందీప్ శర్మ తక్కువ ఎకానమితో వికెట్లు తీస్తుండడం.. నటరాజన్ యార్కర్లతో చెలరేగుతుండడం.. రషీద్ ఖాన్ లెగ్ స్నిన్ మహిమ.. నదీమ్ పేస్‌తో చెలరేగడం.. వెరసి మా బౌలింగ్ ఇప్పుడు అద్భుతంగా ఉంది. వీరికి తోడు తాజాగా నేను తోడవ్వడం కలిసివచ్చింది. నిజానికి గత కొన్నేళ్లుగా భుజం గాయాలతో పాటు పలు సర్జరీలు నన్ను చాలా ఇబ్బంది పెట్టాయి. ఐపీఎల్ పుణ్యమా అని ఈ సీజన్లో బాగానే ప్రాక్టీస్ లభించింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌లో కష్టపడితే చాలు.. మరోసారి ఫైనల్లో అడుగుపెడతాం. అని చెప్పుకొచ్చాడు. కాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. -
‘ఫినిషర్ అంటే అలా ఉండాలి’
సిడ్నీ: క్రికెట్లో ఫినిషర్ అంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేపేరు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని. వరల్డ్ అత్యుత్తమ ఫినిషర్‌గా ధోని ఆడిన ఎన్నో ఇన్నింగ్స్‌లే అతన్ని బెస్ట్ ఫినిషర్‌ను చేశాయి. అయితే మరో అత్యుత్తమ ఫినిషర్ భారత క్రికెట్ జట్టులోనే ఉన్నాడని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ అంటున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన క్వాలిఫయర్-1లో ముంబై ఇండియన్స్ సాధించిన తర్వాత హార్దిక్ పాండ్యాపై మూడీ ప్రశంసలు కురిపించాడు. 14 బంతుల్లో అజేయంగా 37 పరుగులు సాధించి మొత్తం మ్యాచ్ స్వరూపాన్నే హార్దిక్ మార్చేశాడని మూడీ కొనియాడాడు. ఆ ఇన్నింగ్స్‌లో హార్దిక్ ఒక్క ఫోర్ కూడా కొట్టకుండా ఐదు సిక్సర్లు సాధించడాన్ని మూడీ ప్రస్తావించాడు. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో మాట్లాడిన మూడీ..‘ హార్దిక్ లాంటి ఫినిషర్లను చాలా అరుదుగా చూస్తాం. ఫినిషర్ అంటే అలా ఉండాలి. ముంబై 170-175 పరుగులు చేస్తుందనే దశ నుంచి రెండొందలకు తీసుకెళ్లాడు. ప్రతీ ఒక్కరూ ఆ తరహా ఫినిషింగ్ ఇవ్వాలని అనుకుంటారు. హార్దిక్ పాండ్యా ఆటతో మ్యాచ్ అప్పుడే వారి వశమై పోయింది. ఆ మ్యాచ్‌లో టర్నింగ్ పాయింట్ ఏదైనా ఉందంటే అది హార్దిక్ ఆడిన ఇన్నింగ్సే’ అని మూడీ పేర్కొన్నాడు.ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన క్వాలిఫయర్-1లో ముంబై ఇండియన్స్ 57 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా తుది బెర్తును ఖరారు చేసుకుంది. లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీని ఏదశలోనూ తేరుకోనివ్వని ముంబై తనమార్కు ఆట తీరుతో చెలరేగిపోయింది. హార్దిక్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో 201 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. -
వైరలవుతున్న మీమ్స్.. పాపం ఆర్సీబీ
దుబాయ్ : ‘ఈ సాలా కప్ నామ్దే(ఈసారి కప్పు మాదే) అంటూ ఐపీఎల్ 13వ సీజన్లో బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరోసారి నిరాశపరిచింది. శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ చేతిలో ఓడిపోవడంతో మరోసారి ఒట్టి చేతులతో తిరిగి వచ్చింది. ఈసారి కప్ కచ్చితంగా కొడుతామంటూ కోహ్లి అండ్ గ్యాంగ్ చేసిన శపథాలకు పాపం ఆర్సీబీ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఫ్యాన్స్ ఆశలను మోస్తూ ఐపీఎల్లో అడుగుపెట్టిన ఆర్సీబీ మొదటి అంచె లీగ్ మ్యాచ్‌లు ముగిసేసరికి 5 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచి అంచనాలను మరింత పెంచేసింది. రెండో అంచె పోటీలకు వచ్చేసరికి అసలు కథ మొదలయ్యింది. మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచినా.. తర్వాత వరుసగా ఐదు మ్యాచ్‌లు ఓటమిపాలవడంతో ఆర్సీబీది మళ్లీ పాతకథే అయ్యింది. రన్‌రేట్ కాస్త మెరుగ్గా ఉండడం.. లీగ్ రెండో అంచెలో వరుస విజయాలతో రేసులోకి వచ్చిన పంజాబ్‌తో పాటు కోల్‌కతా, రాజస్తాన్‌లు కీలక మ్యాచ్‌ల్లో ఓటమిపాలవడంతో ఎలాగోలా ప్లేఆఫ్ చేరింది. అయితే ఒత్తిడికి మారుపేరుగా ఉండే ఆర్సీబీ శుక్రవారం ఎస్ఆర్హెచ్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో పాతకథే పునరావృతమైంది. అసలు ఆడుతుంది ఆర్సీబీనేనా అన్నట్లు వారి ఆటతీరు ఉంది. అసలు సమయంలో రాణించాల్సింది పోయి ఒత్తిడికి తలొగ్గి ఓటమి పాలై నిరాశతో ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది. ఈ విషయంలో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి సారీ కూడా చెప్పాడు. ఇది ఐపీఎల్ 13వ సీజన్లో స్థూలంగా ఆర్సీబీ కథ. (చదవండి : ఫ్యాన్స్‌కి సారీ చెప్పిన డివిలియర్స్) ఇక ఇప్పుడు సోషల్ మీడియా వంతు వచ్చింది. ఈ సాలా కప్ నామ్దే అంటూ బరిలోకి దిగి ఒట్టి చేతులతో వెనక్కిరావడం పట్ల ఆర్సీబీపై నెటిజన్లతో పాటు ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్ ఒక ఆట ఆడుకున్నారు. ఆర్సీబీపై వారు చేసిన మీమ్స్ ఇప్పుడు ట్రెండింగ్ గా మారాయి. సరదాగా వాటిపై ఓ లుక్కేయండి. RCB team to their fans and owner : #RCBvsSRH pic.twitter.com/bFrR1Cq4XV — ㅤ ㅤ ㅤ ㅤ ㅤ ㅤ ㅤ ㅤ ㅤ (@theesmaarkhan) November 6, 2020 #RCBvSRH #Dream11IPLSRHvRCB#IPL2020 RCB gets eliminated Fans: pic.twitter.com/L21BY1a0Ys — Hemant Kumar (@SportsCuppa) November 6, 2020 *RCB has been eliminated* CSK Fans right now : pic.twitter.com/8sGsV07cP8 — Aadarsh Dixit💞 (@aadarshdixit2) November 6, 2020 #RCBvSRH After 13 season...RCB fans pic.twitter.com/ZApWkgySrE — BreakingBed (@bedbreakin) November 6, 2020 #RCBvSRH Nothing much Just a picture of ABD carrying #RCB pic.twitter.com/gN1CzRf0wC — Vijay Jaiswal ➐ (@puntasticVU) November 6, 2020 #RCBvSRH Netizens looking at #RCB supporters pic.twitter.com/3xxlono0kx — Atmanirbhar Engineer (@Bahut_Scope_Hai) November 6, 2020 -
విరాట్ కోహ్లికి సెహ్వాగ్ మద్దతు
న్యూఢిల్లీ: కనీసం ఈ ఐపీఎల్ సీజన్లోనైనా టైటిల్ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్ నుంచే నిష్క్రమించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ పరాజయం చెందడంతో టోర్నీ నుంచి వైదొలిగింది. దాంతో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లిపై విమర్శల తాకిడి ఎక్కువైంది. అసలు ఆర్సీబీకి కెప్టెన్‌గా కోహ్లి సరైన వ్యక్తేనా అనే ప్రశ్న తలెత్తింది. ఎనిమిదేళ్ల నుంచి కెప్టెన్‌గా చేస్తున్న కోహ్లి.. ఆ జట్టుకు ఒక్కసారి కూడా టైటిల్ సాధించి పెట్టలేకపోయాడని మాజీలు విమర్శిస్తున్నారు. జట్టు వరుసగా పరాజయాలు చవిచూస్తున్నప్పుడు దానికి కెప్టెనే బాధ్యత తీసుకోవాలని మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఎద్దేవా చేశాడు. కోహ్లిని కెప్టెన్సీ నుంచి తప్పించడానికి ఇదే సరైన సమయమని గంభీర్ అభిప్రాయపడ్డాడు. (ఢిల్లీపై అదే మా ప్రణాళిక: రషీద్ ఖాన్) కాగా, గంభీర్ అభిప్రాయంతో మరో మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ విభేదించాడు. కోహ్లిని కెప్టెన్సీ నుంచి తప్పించడం మార్గం కాదన్నాడు. ‘ కోహ్లిని కెప్టెన్‌గా మార్చాల్సిన అవసరం లేదు. అతని జట్టుకు సారథిగా మాత్రమే ఉన్నాడు. ఇక్కడ ఫలితాలు రాకపోవడానికి ఆర్సీబీ పూర్తిస్థాయి జట్టుతో ఏనాడు సిద్ధం కాలేదు. టీమిండియాకు కోహ్లి కెప్టెన్‌గా ఉన్నాడు. మరి ఇక్కడ ఫలితాలు సాధిస్తున్నాడు కదా. వన్డేలు, టీ20లు, టెస్టులు ఇలా అన్నింటిలోనే కోహ్లి నాయకత్వంలోని భారత క్రికెట్ జట్టు మెరుగైన విజయాలు నమోదు చేస్తుంది. మరి ఆర్సీబీ ఎందుకు సాధించడం లేదంటే ఓవరాల్‌గా ఆ జట్టే బాలేదు. ప్రతీజట్టు సమతుల్యమైన బ్యాటింగ్ ఆర్డర్ కల్గి ఉంది. ఆర్సీబీలో ఇప్పటివరకూ మంచి బ్యాటింగ్ లైనప్ కన్పించలేదు. ఇప్పుడు ఆర్సీబీలో కోహ్లి, ఏబీ డివిలియర్స్‌లు మాత్రమే ఉన్నారు. దాంతో వీరి స్థానాలను మార్చుకుంటూ కింది వరుసలో ఇబ్బంది లేకుండా ప్రయత్నం చేశారు. కానీ అలా ఎప్పుడూ సాధ్యం కాదు. ఆర్సీబీకి ఒక స్పెషలిస్టు ఓపెనర్ కావాలి. అదే సమయంలో లోయర్ ఆర్డర్లో ఒక మంచి బ్యాట్స్‌మన్ ఉండాలి. కనీసం ఐదుగురు బ్యాట్స్మెన్లు ఆ జట్టులో ఉంటే ఆర్సీబీ విజయాలు సాధిస్తుంది. ఇక భారత ఫాస్ట్ బౌలర్లపై కూడా ఆర్సీబీ నమ్మకం ఉంచాలి’ అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.(కోహ్లి ట్రిక్ వర్కౌట్ కాలేదు..రిప్లై అదిరింది!) -
ఢిల్లీపై అదే మా ప్రణాళిక: రషీద్ ఖాన్
అబుదాబి: ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం జరగబోయే క్వాలిఫయర్-2కు తాము సిద్ధంగా ఉన్నట్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రధాన స్పిన్నర్ రషీద్ ఖాన్ తెలిపాడు. తాము ఎంతో ఒత్తిడిలో వరుసగా మ్యాచ్‌లు గెలుచుకుంటూ వస్తున్నామని అదే ఆత్మవిశ్వాసాన్ని ఢిల్లీతో పోరులో కూడా కొనసాగిస్తామన్నాడు. ఆర్సీబీతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఒక దశలో తాము కఠిన పరిస్థితిని ఎదుర్కొన్నామని రషీద్ పేర్కొన్నాడు. (కోహ్లి ట్రిక్ వర్కౌట్ కాలేదు..రిప్లై అదిరింది!) కింగ్స్ పంజాబ్‌తో జరిగిన రెండో అంచె మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో పరాజయం చవిచూసిన సందర్భం మళ్లీ వస్తుందా అనిపించిందన్నాడు. కాకపోతే ఇది ఎలిమినేటర్ మ్యాచ్ కావడంతో ఆందోళనకు గురైనట్లు తెలిపాడు. చివరకు విజయం సాధించడంతో ఊపిరి పీల్చుకున్నామన్నాడు. ఇక ఢిల్లీతో క్వాలిఫయర్-2కు తమ జట్టు సిద్ధంగా ఉందన్నాడు. అబుదాబి పిచ్ చాలా స్లోగా ఉందన్న రషీద్.. బేసిక్స్‌ను కచ్చితంగా అవలంభిస్తే సరిపోతుందన్నాడు. అదే తమ ప్రణాళిక అని రషీద్ అన్నాడు. ఇక తన ప్రదర్శనకు వచ్చేసరికి రైట్ లెంగ్త్ బాల్‌ను వేయడంపైనే దృష్టి పెట్టానన్నాడు. తాను ఫుల్ లెంగ్త్ బాల్‌ను వేసినప్పుడు పరుగులు సమర్పించుకున్నానే విషయం గ్రహించానన్నాడు. తన వీడియోలను ఒకసారి రివీల్ చేసుకుంటే ఇదే విషయం తనకు తెలిసిందన్నాడు. దాంతో రైట్ ఏరియాలో బంతుల్ని వేయడానికి కృషి చేస్తానన్నాడు. ఈ వికెట్‌పై కొన్ని సందర్బాల్లో ఊహించని టర్న్ వస్తుందన్నాడు. రేపు జరగబోయే క్వాలిఫయర్-2లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుతుంది. ఇది మరో నాకౌట్ మ్యాచ్ కావడంతో ఇరుజట్లు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. సన్‌రైజర్స్ చిన్న చిన్న లక్ష్యాలను కాపాడుకుంటూ విజయాలు సాధిస్తూ ఉంటే, ఢిల్లీ పేలవమైన ఫామ్‌తో వరుస ఓటముల్ని చవిచూస్తోంది. సన్‌రైజర్స్ బౌలింగ్ విభాగం పటిష్టంగా మారడమే ఆ జట్టు వరుస విజయాలకు ప్రధాన కారణం. -
ఫ్యాన్స్‌కి సారీ చెప్పిన డివిలియర్స్
అబుదాబి: అద్భుత బ్యాటింగ్ లైనప్ కలిగిన రాయల్ చాలెంజర్స్ జట్టు అనూహ్యంగా ఐపీఎల్ 2020 నుంచి వైదొలిగింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓటమిపాలై ఇంటిదారి పట్టింది. ఐపీఎల్ తాజా సీజన్లో ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఏబీ డివిలియర్స్ నిన్నటి మ్యాచ్‌లోనూ సత్తా చాటాడు. ఆరోన్ ఫించ్ (30 బంతుల్లో 32, 3 ఫోర్లు, ఒక సిక్స్) సాయంతో డివిలియర్స్ (43 బంతుల్లో 56, ఐదు ఫోర్లు) జట్టును ఆదుకున్నాడు. అయితే, మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమవడంతో ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 131 పరుగులు మాత్రమే చేసింది. ఎస్ఆర్హెచ్ బౌలర్ల దెబ్బకు మంచి ఫామ్‌లో ఉన్న కెప్టెన్ కోహ్లి, ఓపెనర్ దేవదత్ పడిక్కల్‌తో సహా మొయిన అలీ, శివం దుబే, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైనీ సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరారు. పేసర్ మహ్మద్ సిరాట్ 10 పరుగులు చేశాడు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ డేవిడ్ వార్నర్, మనీష్ పాండే తక్కువ పరుగులకే ఔటైనా.. కేన్ విలియమ్సన్ (44 బంతుల్లో 50 పరుగులు, 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), జేసన్ హోల్డర్ (20 బంతుల్లో 24 పరులు, మూడు ఫోర్లు) బాధ్యాయుత ఆటతో విజయం సాధించింది. ఇక కీలకమైన మ్యాచ్‌లో ఆర్సీబీ బోల్తా పడటంతో అటు ఆటగాళ్లు, ఇటలు అభిమానులు నిరాశలో మునిగిపోయారు. (చదవండి: కన్ఫ్యూజ్ చేసిన డివిలియర్స్!) ఇప్పటివరకు ఐపీఎల్ ట్రోఫీ కలగానే మిగిలిపోవడం పట్ల భారమైన హృదయంతో టోర్నీకి గుడ్‌బై చెప్పారు. ఈ సందర్భంగా ఏబీ డివిలియర్స్ అభిమానుల ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపాడు. అదే సమయంలో బాగా ఆడి అభిమానులను అలరించినప్పటికీ.. అంచనాలు అందుకోలేకపోయామని క్షమాపణలు కూడా కోరాడు. చిరస్మరణీయ పోటీ నుంచి నిరాశగా తప్పుకుంటున్నామని ఆర్సీబీ యాజమాన్యం ట్వీట్ చేసింది. ఆటగాళ్ల ఫేర్వెల్ వీడియోను షేర్ చేసింది. ఇదిలాఉండగా.. తాజా సీజన్లో 454 పరుగులు చేసి ఏబీ డివిలియర్స్ అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడు. 15 మ్యాచ్‌లో మూడు అర్ధ సెంచరీలు చేసిన ఏబీ 158.7 స్ట్రయిక్‌రేట్‌తో ఈ ఘనత సాధించాడు. (చదవండి: ఆర్సీబీ ఔట్.. కోహ్లి ఎమోషనల్ ట్వీట్!) -
కన్ఫ్యూజ్ చేసిన డివిలియర్స్!
అబుదాబి: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 132 పరుగుల టార్గెట్‌నే నిర్దేశించగా, సన్‌రైజర్స్ దాన్ని ఇంకా రెండు బంతులు ఉండగా ఛేదించి క్వాలిఫయర్-2లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఆటగాళ్లలో విరాట్ కోహ్లి(32; 30 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), ఏబీ డివిలియర్స్(56;43 బంతుల్లో 5 ఫోర్లు)లు మాత్రమే రాణించారు. నిన్నటి మ్యాచ్‌లో ఆర్సీబీ ఆటగాడు మొయిన్ అలీ ఫ్రీహిట్‌లో రనౌట్ కావడం ఆశ్చర్యపరిచింది. ఫ్రీహిట్ బంతిని ఎక్స్ట్రా కవర్ మీదుగా షాట్ ఆడిన మొయిన్ అలీ.. పరుగు కోసం యత్నించాడు. అది రిస్క్ అని తెలిసినా తొందరపాటులో మొయిన్ తడబడ్డాడు. దానికి రనౌట్ కావడంతో డగౌట్లో ఉన్న కోహ్లి ఒక్కసారిగా అసహనం వ్యక్తం చేశాడు.(కోహ్లి ట్రిక్ వర్కౌట్ కాలేదు..రిప్లై అదిరింది!) ఇదిలా ఉంచితే, అసలు బంతి వికెట్ కీపర్ వరకూ చేరకుండానే బెయిల్స్‌ను గిరాటేయడం ఇంకాస్త ఇంట్రెస్టింగ్గా మారింది. వాషింగ్టన్ సుందర్ వేసిన ఐదో ఓవర్ రెండో బంతికి కీపర్‌గా ఉన్న ఏబీ డివిలియర్స్‌ను ముందుగానే పడేశాడు.ఆ బంతిని వార్నర్ కవర్స్‌లో ఆడగా, అంతకుముందే బెయిల్స్ పైకి లేచిపోయాయి. అయితే అక్కడ ఏమి జరిగిందనే దానిపై కాసేపు గందరగోళం నెలకొంది. వార్నర్ వికెట్లను హిట్ చేశాడా.. అనే సస్పెన్స్ చోటు చేసుకుంది. కానీ చివరి ఏబీడీ బెయిల్స్‌ను ముందుగానే పడేశాడని తేలడంతో ఆ బాల్‌ను నో బాల్‌గా ప్రకటించారు. నిబంధనల ప్రకారం బ్యాట్స్‌మన్ బంతిని ఆడకుండా కీపర్ బెయిల్స్‌ను లేపేస్తే అది నో బాల్‌గా పరిగణిస్తారు. -
కోహ్లి ట్రిక్ వర్కౌట్ కాలేదు..రిప్లై అదిరింది!
అబుదాబి: ఈ ఐపీఎల్ సీజన్లో ప్లేఆఫ్స్‌తోనే సంతృప్తి పడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. నిన్న జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో పరాజయం చవిచూసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. వరుస ఓటములతో కుదేల్ అయిన జట్టులో స్ఫూర్తినింపాల్సిన కెప్టెన్ విరాట్ కోహ్లి.. దానికి భిన్నంగా వ్యవహరించాడు. లీగ్ దశ మ్యాచ్‌లను కూడా పరిగణనలోకి తీసుకుంటే వరుసగా అయిదింట్లో ఓడిపోయింది. అయితే ప్రత్యర్థి జట్టు సన్‌రైజర్స్ ఆటగాడు మనీష్ పాండేపై స్లెడ్జింగ్‌కు దిగాడు. అతన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశాడు. సన్ రైజర్స్ బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో ఇన్నింగ్ మూడో ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ వేసిన ఓవర్ అది. సిరాజ్ వేసిన రెండోబంతిని పాండే కవర్స్ వైపు ఆడాడు. అక్కడ ఉన్న మొయిన్ అలీ ఆ బంతిని ఫీల్డ్ చేశాడు. దాన్ని కోహ్లికి అందించాడు. బంతిని అందుకున్న కోహ్లి.. మనీష్ పాండే వైపు చూస్తూ బిగ్గరగా నవ్వాడు. (ఆర్సీబీ ఔట్.. కోహ్లి ఎమోషనల్ ట్వీట్!) బహుత్ బడియా. ఆజ్ నహీ మార్ రహా షాట్.. అచ్ఛా చలో.. అంటూ పాండేను ఉద్దేశించి కామెంట్స్ చేశాడు. ఓపెనర్ గోస్వామి అవుట్ అయిన తరువాత వన్‌డౌన్‌గా క్రీజ్‌లోకి వచ్చిన పాండే పరుగు చేయడానికి ఐదు బంతులు ఆడాడు. అయితే కోహ్లి స్లెడ్జ్ చేసిన తర్వాత ఒక బంతిని వదిలిపెట్టిన మనీష్ పాండే..ఆ ఓవర్ నాల్గో బంతికి సిక్స్‌తో సమాధానం చెప్పాడు. మనీష్ పాండేను రెచ్చగొట్టడానికి కోహ్లి ట్రిక్ వర్కౌట్ కాలేదు. ఇదిలా ఉంచితే, సహచర టీమిండియా ఆటగాడిపై స్లెడ్జింగ్ చేయడంపై సన్‌రైజర్స్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల చివర్లో ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరి వెళ్లే టీమిండియా జట్టుకు మనీష్ పాండే ఎంపికయ్యాడు. తనతో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోబోయే క్రికెటర్‌పైనే స్లెడ్జింగ్‌కు పాల్పడటాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు తప్పుపడుతున్నారు. ఆర్సీబీతో మ్యాచ్‌లో మనీష్ పాండే 21 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 24 పరుగులు చేశాడు. pic.twitter.com/E76DXLILAw — Simran (@CowCorner9) November 7, 2020