
దుబాయ్: భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ప్రపంచంలోనే అత్యుత్తమ టి20 బౌలర్ అని ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ కితాబిచ్చాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అతని ఆటను చూడటం గౌరవంగా భావిస్తున్నానని అన్నాడు. గురువారం జరిగిన క్వాలిఫయర్స్–1లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ముంబై ఇండియన్స్ చిత్తు చేయడంలో ట్రెంట్ బౌల్ట్ (2/9)తో కలిసి బుమ్రా (4/14) కీలకపాత్ర పోషించాడు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా బాండ్ తన ఆనందాన్ని పంచుకున్నాడు. ‘బుమ్రా ఆట చూడటం గొప్ప గౌరవం. అతను ప్రపంచ అత్యుత్తమ టి20 బౌలర్. 2012 నుంచి బౌల్ట్ ఆటను ఆస్వాదిస్తున్నా. అతనో విధ్వంసక బౌలర్. టోర్నీ ఆసాంతం అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు’ అని వీడియోలో పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment