MI Bowling Coach Shane Bond Praises On Hardik Pandya, Says India Need Him Too At T20 WC - Sakshi
Sakshi News home page

IPL 2022: 'మేము అతడి సేవలను కోల్పోయాము.. మా జట్టులో ఉంటే బాగుండేది'

Published Fri, Jun 3 2022 9:16 PM | Last Updated on Sat, Jun 4 2022 9:46 AM

I miss Hardik Pandya, India need him at T20 World Cup Says MI bowling coach Shane Bond  - Sakshi

PC: IPL.com

అరంగేట్ర సీజన్‌లోనే జట్టుకు టైటిల్‌ను అందించిన గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యాను ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ ప్రసింశాడు. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ 20 ప్రపంచకప్‌లో టీమిండియా తరపున పాండ్యా అద్భుతంగా రాణిస్తాడని బాండ్ థీమా వ్యక్తం చేశాడు. కాగా గతంలో ముంబై ఇండియన్స్ తరపున హార్ధిక్‌ ఆడిన సంగతి తెలిసిందే. "హార్దిక్ చాలా కూల్ కెప్టెన్. నేను బౌలింగ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి సీజన్‌ నుంచి హార్దిక్  నాకు తెలుసు.

పాండ్యా వేరే ఫ్రాంచైజీకి కెప్టెన్‌ కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే మేము అతడి సేవలను కోల్పోయాము. అతడు అద్భుతమైన ఆటగాడు కాబట్టి మా జట్టులో ఉంటే బాగుండేది. ఇక టీ20 ప్రపంచకప్‌కు అతడి సేవలు భారత్‌కు చాలా అవసరం. అతడు ఒక కెప్టెన్‌గా, ఆల్‌ రౌండర్‌గా తన సత్తా ఎంటో చూపించాడు" అని స్పోర్ట్స్‌కీడాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షేన్ బాండ్ పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్‌-2022లో హార్దిక్ అద్భుతంగా రాణించాడు. 15 మ్యాచ్‌లు ఆడిన పాండ్యా 487 పరుగులతో పాటు, వికెట్లు పడగొట్టాడు.
చదవండి: IPL 2022: అర్జున్ టెండూల్కర్‌ను అందుకే ఆడించలేదు: షేన్‌ బాండ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement