Shane Bond
-
#Riyan Parag: 'అతడొక సంచలనం.. సూర్యకుమార్‌లా ఆడుతున్నాడు'
ఐపీఎల్-2024లో రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో అదరగొట్టిన పరాగ్.. సోమవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సంజూ శాంసన్, బట్లర్, జైశ్వాల్ వంటి స్టార్ ఆటగాళ్లు విఫలమైన చోట పరాగ్ సత్తాచాటాడు. తన అద్బుత ఇన్నింగ్స్‌తో రాజస్తాన్‌ను పరాగ్ గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో 39 బంతులు ఎదుర్కొన్న పరాగ్ 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడిన పరాగ్.. 181 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో పరాగ్‌పై రాజస్తాన్ రాయల్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. పరాగ్ తన ఆట తీరుతో సూర్యకుమార్ యాదవ్‌ను గుర్తు చేస్తున్నడంటూ బాండ్ కొనియాడాడు."పరాగ్ అద్బుతమైన ఆటగాడు. అతడు తన ఆట తీరుతో సూర్యకుమార్ యాదవ్‌ను గుర్తు చేశాడు. సూర్య ముంబై ఇండియన్స్‌లోకి కొత్తగా వచ్చినప్పుడు ఈ తరహా ప్రదర్శనే చేసేవాడు. పరాగ్‌కు మంచి బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. అతడు కేవలం 22 ఏళ్ల వయస్సుకే అద్బుతమైన టాలెంట్‌ను సంపాందించుకున్నాడు. కచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది.ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందు అతడు దేశవాళీ క్రికెట్లో అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. అందుకే అతడికి బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ ఇచ్చాం. దేవ్‌దత్ పడిక్కల్‌ను వదులుకోవడంతో పరాగ్ ఆ స్ధానంలో బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉంది. అతడి నుంచి ఈ తరహా ప్రదర్శన కోసం మేము ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాము.రాజస్తాన్ అతడిపై పెట్టిన పెట్టుబడికి ఇప్పుడు ప్రతిఫలం పొందుతుంది. మిగిలిన సీజన్లో కూడా రియాన్ తన ఫామ్‌ను కొనసాగించాలని ఆశిస్తున్నానని" క్రిక్‌ట్రాకర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాండ్ పేర్కొన్నాడు. -
#Riyan Parag: 'అతడొక సంచలనం.. సూర్యకుమార్‌లా ఆడుతున్నాడు'
ఐపీఎల్-2024లో రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో అదరగొట్టిన పరాగ్.. సోమవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సంజూ శాంసన్, బట్లర్, జైశ్వాల్ వంటి స్టార్ ఆటగాళ్లు విఫలమైన చోట పరాగ్ సత్తాచాటాడు. తన అద్బుత ఇన్నింగ్స్‌తో రాజస్తాన్‌ను పరాగ్ గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో 39 బంతులు ఎదుర్కొన్న పరాగ్ 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడిన పరాగ్.. 181 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో పరాగ్‌పై రాజస్తాన్ రాయల్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. పరాగ్ తన ఆట తీరుతో సూర్యకుమార్ యాదవ్‌ను గుర్తు చేస్తున్నడంటూ బాండ్ కొనియాడాడు. "పరాగ్ అద్బుతమైన ఆటగాడు. అతడు తన ఆట తీరుతో సూర్యకుమార్ యాదవ్‌ను గుర్తు చేశాడు. సూర్య ముంబై ఇండియన్స్‌లోకి కొత్తగా వచ్చినప్పుడు ఈ తరహా ప్రదర్శనే చేసేవాడు. పరాగ్‌కు మంచి బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. అతడు కేవలం 22 ఏళ్ల వయస్సుకే అద్బుతమైన టాలెంట్‌ను సంపాందించుకున్నాడు. కచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందు అతడు దేశవాళీ క్రికెట్లో అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. అందుకే అతడికి బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ ఇచ్చాం. దేవ్‌దత్ పడిక్కల్‌ను వదులుకోవడంతో పరాగ్ ఆ స్ధానంలో బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉంది. అతడి నుంచి ఈ తరహా ప్రదర్శన కోసం మేము ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాము. రాజస్తాన్ అతడిపై పెట్టిన పెట్టుబడికి ఇప్పుడు ప్రతిఫలం పొందుతుంది. మిగిలిన సీజన్లో కూడా రియాన్ తన ఫామ్‌ను కొనసాగించాలని ఆశిస్తున్నానని" క్రిక్‌ట్రాకర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాండ్ పేర్కొన్నాడు. -
రాజస్తాన్ రాయల్స్ అసిస్టెంట్ కోచ్‌గా షేన్ బాండ్..
ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు రాజస్తాన్ రాయల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ పేసర్ షేన్ బాండ్‌ను రాజస్తాన్ ఫ్రాంచైజీ నియమించింది. షేన్ బాండ్ రాజస్తాన్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా మాత్రమే కాకుండా అసిస్టెంట్ కోచ్‌గా కూడా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా రాజస్తాన్ వెల్లడించింది. కాగా ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో 9 సీజన్ల పాటు ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్‌గా పనిచేసిన బాండ్‌ను.. ముంబై ఫ్రాంచైజీ ఇటీవలే విడిచిపెట్టింది. ఐపీఎల్లో అత్యంత విజయంవతమైన టీమ్‌గా ముంబై ఇండియన్స్‌ను తీర్చిదిద్దడంలో షేన్ బాండ్ కీలక పాత్ర పోషించాడు. అతడి స్ధానంలో శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగాను తమ బౌలింగ్ కోచ్‌గా ముంబై నియమించింది. అయితే గత రెండు సీజన్లలో రాజస్తాన్ రాయల్స్ బౌలింగ్ కోచ్‌గా లసిత్ పనిచేయడం గమానార్హం. చదవండి: అదే మా కొంపముంచింది.. వారు మాత్రం అద్భుతం: న్యూజిలాండ్ కెప్టెన్ We've always had a special 𝘉𝘰𝘯𝘥 with the name 𝘚𝘩𝘢𝘯𝘦 . 🫶#RoyalsFamily, meet your new Assistant & Fast Bowling Coach! 💗 pic.twitter.com/xm7VSlDIAF — Rajasthan Royals (@rajasthanroyals) October 23, 2023 -
IPL 2024: ముంబై ఇండియన్స్ ప్రకటన.. అతడితో తెగదెంపులు! కొత్త కోచ్‌గా..
IPL 2024- Mumbai Indians: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన చేసింది. ఐపీఎల్-2024 సీజన్లో తమ బ్యాటింగ్, బౌలింగ్ కోచ్‌లుగా ఇద్దరు దిగ్గజ క్రికెటర్లను నియమించుకున్నట్లు వెల్లడించింది. గతంలో వీరిద్దరు ముంబై ఇండియన్స్‌కు ఆడినవారే కావడం విశేషం. బ్యాటింగ్ కోచ్‌గా విండీస్ దిగ్గజం కాగా తమ బ్యాటింగ్ కోచ్‌గా ముంబై ఫ్రాంఛైజీ ఇప్పటికే వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శ్రీలంక లెజెండరీ పేసర్ లసిత్ మలింగను తమ బౌలింగ్ కోచ్‌గా ఎంచుకున్నట్లు తెలిపింది. నాకు దక్కిన గౌరవం: బౌలింగ్ కోచ్ మలింగ ఇక తన నియామకంపై స్పందించిన మలింగ.. ‘‘ఇప్పటికే ఎంఐ న్యూయార్క్, ఎంఐ కేప్టౌన్లతో నా ప్రయాణం మొదలైంది. ఇప్పుడు ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్‌గా నియమితుడిని కావడం గొప్పగా అనిపిస్తోంది. పోలీ, రోహిత్, మార్క్‌లతో పాటు జట్టు మొత్తానికి మరింత సన్నిహితంగా మెలిగే అవకాశం వస్తుంది. ముఖ్యంగా బౌలింగ్ విభాగంతో నాకు కొత్త అనుబంధం ఏర్పడుతుంది. ప్రతిభావంతులైన యువ బౌలర్లకు మార్గదర్శనం చేయడం నాకు దక్కిన గౌరవం’’ అని హర్షం వ్యక్తం చేశాడు. షేన్ బాండ్‌తో తెగదెంపులు కాగా ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్‌గా లసిత్ మలింగ షేన్ బాండ్ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. తొమ్మిదేళ్లపాటు ముంబై ఇండియన్స్ కోచ్‌గా వ్యవహరించిన న్యూజిలాండ్ మాజీ పేసర్ షేన్ బాండ్‌తో ఫ్రాంఛైజీ తెగదెంపులు చేసుకున్న తరుణంలో మలింగకు ఈ అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. నాలుగుసార్లు టైటిల్ గెలిచిన ముంబై జట్లలో సభ్యుడు ఇక ఆటగాడిగా మలింగ ఐపీఎల్ కెరీర్ విషయానికొస్తే.. 2008 నుంచి 2020 వరకు ముంబై ఇండియన్స్‌కి ప్రాతినిథ్యం వహించాడు. ఇందులో భాగంగా 122 మ్యాచ్‌లు ఆడి రికార్డు స్థాయిలో 170 వికెట్లు తీశాడు. అదే విధంగా.. 2013, 2015, 2017, 2019లో ట్రోఫీ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టులో సభ్యుడైన మలింగ ఖాతాలో నాలుగు టైటిళ్లు ఉన్నాయి. ఇక ప్లేయర్‌గా 2021లో రిటైరైన తర్వాత మలింగ బౌలింగ్ కోచ్‌గా అవతారమెత్తాడు. రాజస్తాన్ రాయల్స్ జట్టుకు 2022, 2023 సీజన్లలో పేస్ బౌలింగ్ కోచ్‌గా పనిచేశాడు. ఇప్పుడు ముంబై క్యాంపులో పునరాగమనం చేయనున్నాడు. చదవండి: Virat Kohli: 78వ సెంచరీ! వాళ్ల వల్లే సాధ్యమైంది.. జడ్డూకు సారీ చెప్పాలి: కోహ్లి 𝗕𝗔𝗧𝗧𝗜𝗡𝗚 𝗖𝗢𝗔𝗖𝗛 - 🄿🄾🄻🄻🄰🅁🄳 𝗕𝗢𝗪𝗟𝗜𝗡𝗚 𝗖𝗢𝗔𝗖𝗛 - 🄼🄰🄻🄸🄽🄶🄰 Paltan, आता कसं वाटतय? 🤩#OneFamily #MumbaiIndians #MumbaiMeriJaan @malinga_ninety9 @KieronPollard55 pic.twitter.com/bdPWVrfuDy — Mumbai Indians (@mipaltan) October 20, 2023 -
IPL 2024: ముంబై ఇండియన్స్‌లో మలింగ రీఎంట్రీ! అతడి స్థానంలో..
Lasith Malinga returns to MI?: శ్రీలంక స్టార్ పేసర్ లసిత్ మలింగ ముంబై ఇండియన్స్‌లో పునరాగమనం చేయనున్నట్లు సమాచారం. ఐపీఎల్-2024 నేపథ్యంలో ఎంఐ బౌలింగ్ కోచ్‌గా మలింగ తిరిగిరానున్నట్లు తెలుస్తోంది. షేన్ బాండ్ స్థానాన్ని అతడు భర్తీ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రికార్డు స్థాయిలో వికెట్లు కాగా 2008 నుంచి 2020 వరకు మలింగ ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన విషయం తెలిసిందే. మొత్తంగా 122 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ఈ స్టార్ పేసర్ రికార్డు స్థాయిలో 170 వికెట్లు పడగొట్టాడు. 2021లో రిటైరైన తర్వాత బౌలింగ్ కోచ్‌గా అవతారమెత్తిన మలింగ రాజస్తాన్ రాయల్స్ క్యాంపులో చేరాడు. రాజస్తాన్ రాయల్స్‌తో 2022, 2023 సీజన్లలో రాయల్స్ పేస్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. ఇదిలా ఉంటే.. గతేడాది అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరిన రాజస్తాన్.. ఈసారి ఐదో స్థానంతో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోచింగ్ స్టాఫ్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం. యుజీ చహల్‌తో మలింగ (PC: IPL) ఈ నేపథ్యంలో లసిత్ మలింగ రాయల్స్‌ను వీడి ముంబై ఇండియన్స్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా రానున్నట్లు తెలుస్తోంది. ఎంఐతో తొమ్మిదేళ్లుగా అనుబంధం కొనసాగిస్తున్న షేన్ బాండ్.. ఫ్రాంఛైజీతో తెగదెంపులు చేసుకుంటున్న తరుణంలో అతడి స్థానాన్ని మలింగ భర్తీ చేయనున్నట్లు ఈఎస్‌పీఎన్‌క్రిక్ ఇన్ఫో కథనంలో పేర్కొంది. నాలుగుసార్లు ట్రోఫీ గెలిచి లసిత్ మలింగ ఖాతాలో నాలుగు ఐపీఎల్ టైటిళ్లు ఉన్నాయి. 2013, 2015, 2017, 2019లో ట్రోఫీ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టులో అతడు సభ్యుడు. ఇదిలా ఉంటే.. తాజా ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ చేరినప్పటికీ టైటిల్ పోరుకు అర్హత సాధించలేకపోయింది. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి విజేతగా అవతరించి ముంబై రికార్డును సమం చేసింది. చదవండి: అప్పట్లో ఒకడుండేవాడు.. అతడే ధోని! కానీ రోహిత్ మాత్రం: పాక్ దిగ్గజం Lasith Malinga has replaced Shane Bond as Mumbai Indians' bowling coach for IPL 2024. (Espncricinfo). pic.twitter.com/5fgHDEkHpI — Mufaddal Vohra (@mufaddal_vohra) August 19, 2023 -
అమెరికాలో.. దిగ్గజ క్రికెటర్లతో సంజూ శాంసన్! ఫొటో వైరల్
Sanju Samson In USA: టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్ అమెరికాలో ఎంజాయ్ చేస్తున్నాడు. భార్య చారులతతో కలిసి యూఎస్ఏలో పర్యటిస్తున్నాడు. ఐపీఎల్-2023 తర్వాత దొరికిన విరామ సమయాన్ని యూఎస్ఏ ట్రిప్‌లో తన సతీమణితో కలిసి ఆస్వాదిస్తున్నాడు. ఈ నేపథ్యంలో భార్య చారులతతో పలు ఫొటోలు షేర్ చేసిన సంజూ.. తాజాగా ఇద్దరు క్రికెటర్ దిగ్గజాలతో ఉన్న చిత్రాన్ని పంచుకున్నాడు. న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ షేన్ బాండ్, వెస్టిండీస్ మాజీ సారథి బ్రియన్ లారాతో కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ‘గ్రేట్ కంపెనీ’’ అంటూ ఇందుకు క్యాప్షన్ జతచేశాడు. స్టైలిష్ లుక్ ఇందులో షేన్ బాండ్, లారా నడుమ నిలబడ్డ సంజూ స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకున్నాడు. కాగా షేన్ బాండ్, బ్రియన్ లారా ఐపీఎల్-2023లో భాగమైన విషయం తెలిసిందే. బాండ్.. ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించగా.. లారా సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్‌కోచ్‌గా సేవలు అందించాడు. మరోవైపు.. సంజూ.. రాజస్తాన్ రాయల్స్ సారథిగా జట్టును ముందుకు నడిపిన విషయం తెలిసిందే. గత సీజన్లో రాజస్తాన్‌ను ఫైనల్‌కు చేర్చిన సంజూ.. ఈసారి కనీసం ప్లే ఆఫ్స్ వరకు కూడా తీసుకువెళ్లలేకపోయాడు. విండీస్‌తో వన్డేలకు ఇక మొత్తంగా 14 మ్యాచ్‌లలో 362 పరుగులు సాధించాడు ఈ కేరళ బ్యాటర్. ఇదిలా ఉంటే.. వెస్టిండీస్ పర్యటనకు ఇటీవల ప్రకటించిన భారత జట్టులో సంజూకు చోటు దక్కింది. విండీస్‌తో వన్డేలకు అతడిని ఎంపిక చేశారు సెలక్టర్లు. 2015లో తొలిసారిగా టీమిండియాకు ఆడిన సంజూ శాంసన్.. ఇప్పటి వరకు 11 వన్డేలు, 17 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వరుసగా 330, 301 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. జూలై 12- ఆగష్టు 13 వరకు భారత జట్టు వెస్టిండీస్ టూర్‌తో బిజీ కానుంది. వెస్టిండీస్‌తో వన్డేలకు టీమిండియా రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, మొహమ్మద్. సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముకేష్ కుమార్. చదవండి: కెప్టెన్ ఊచకోత.. జింబాబ్వే సంచలన విజయం.. మేటి జట్లను వెనక్కి నెట్టి టీమిండియా తర్వాత.. View this post on Instagram A post shared by Sanju V Samson (@imsanjusamson) View this post on Instagram A post shared by Sanju V Samson (@imsanjusamson) -
పార్థివ్ పటేల్‌కు లక్కీ ఛాన్స్.. ఎంఐ ఎమిరేట్స్ బ్యాటింగ్ కోచ్‌గా..
International League T20- MI Emirates Coaching Staff: యూఏఈ ఇంటర్నేషనల్ టీ20 లీగ్ నేపథ్యంలో ఎంఐ ఎమిరేట్స్ తమ జట్టు ప్రధాన కోచ్‌గా షేన్ బాండ్‌ను నియమించింది. అదే విధంగా టీమిండియా మాజీ క్రికెటర్లు పార్థివ్ పటేల్‌ను బ్యాటింగ్ కోచ్‌గా.. వినయ్ కుమార్‌ను బౌలింగ్ కోచ్‌గా ఎంపిక చేసినట్లు తెలిపింది. న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ జేమ్స్ ఫ్రాంక్లిన్ తమ జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నట్లు తెలిపింది. అప్పటి నుంచి ముంబై ఫ్రాంఛైజీతో ప్రయాణం ఈ మేరకు ఎంఐ ఎమిరేట్స్ యాజమాన్యం రిలయన్స్ ఇండస్ట్రీస్ శనివారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. కాగా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ షేన్ బాండ్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌కు బౌలింగ్ కోచ్‌గా సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. 2015 నుంచి ఈ ఫ్రాంఛైజీతో అతడి ప్రయాణం మొదలైంది. అప్పటి నుంచి నాలుగు సార్లు(2013 మినహా) టైటిల్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. కోచ్‌లకు స్వాగతం! ఎంఐ ఎమిరేట్స్ కోచ్‌ల నియామకం నేపథ్యంలో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ.. ఎంఐ ఎమిరేట్స్ కుటుంబంలోకి షేన్, పార్థివ్, వినయ్‌లకు స్వాగతం పలికారు. ముంబై ఇండియన్స్ మాదిరిగానే.. వారికున్న అపార అనుభవంతో కొత్త జట్టును కూడా విజయపథంలో నడిపిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. నాకు దక్కిన గౌరవం! ఇక తన నియామకంపై షేన్ బాండ్ స్పందిస్తూ.. ఎంఐ ఎమిరేట్స్ హెడ్‌కోచ్‌గా ఎంపిక కావడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపాడు. ఆటగాళ్లలో స్ఫూర్తి నింపుతూ.. ఎంఐ ఎమిరేట్స్ స్థాయిని మరింతగా పెంచేందుకు కృషి చేస్తానని వెల్లడించాడు. కాగా యూఏఈ లీగ్ వచ్చే ఏడాది ఆరంభం కానుంది. ఈ లీగ్ ద్వారా పార్థివ్ పటేల్, వినయ్ కుమార్ కోచ్‌లుగా ఎంఐ ఎమిరేట్స్ తరఫున అరంగేట్రం చేయనున్నారు. చదవండి: అతడు జట్టులో లేకపోవడం టీమిండియాకు తీరని లోటు: శ్రీలంక మాజీ కెప్టెన్ అదరగొట్టారు.. ఎవరీ పంకజ్ సింగ్, తన్మయ్ శ్రీవాత్సవ? 𝘿𝙖𝙫𝙖𝙣𝙜𝙚𝙧𝙚 Express is here 🔥 We are excited to announce that @Vinay_Kumar_R has joined MI Emirates as the bowling coach! 🤩#OneFamily #MIemirates @ILT20Official pic.twitter.com/z5spZNsi4j — MI Emirates (@MIEmirates) September 17, 2022 -
'మేము అతడి సేవలను కోల్పోయాము.. మా జట్టులో ఉంటే బాగుండేది'
అరంగేట్ర సీజన్లోనే జట్టుకు టైటిల్‌ను అందించిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ ప్రసింశాడు. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ 20 ప్రపంచకప్‌లో టీమిండియా తరపున పాండ్యా అద్భుతంగా రాణిస్తాడని బాండ్ థీమా వ్యక్తం చేశాడు. కాగా గతంలో ముంబై ఇండియన్స్ తరపున హార్ధిక్ ఆడిన సంగతి తెలిసిందే. "హార్దిక్ చాలా కూల్ కెప్టెన్. నేను బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి సీజన్ నుంచి హార్దిక్ నాకు తెలుసు. పాండ్యా వేరే ఫ్రాంచైజీకి కెప్టెన్ కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే మేము అతడి సేవలను కోల్పోయాము. అతడు అద్భుతమైన ఆటగాడు కాబట్టి మా జట్టులో ఉంటే బాగుండేది. ఇక టీ20 ప్రపంచకప్‌కు అతడి సేవలు భారత్‌కు చాలా అవసరం. అతడు ఒక కెప్టెన్‌గా, ఆల్ రౌండర్‌గా తన సత్తా ఎంటో చూపించాడు" అని స్పోర్ట్స్కీడాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షేన్ బాండ్ పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్-2022లో హార్దిక్ అద్భుతంగా రాణించాడు. 15 మ్యాచ్‌లు ఆడిన పాండ్యా 487 పరుగులతో పాటు, వికెట్లు పడగొట్టాడు. చదవండి: IPL 2022: అర్జున్ టెండూల్కర్‌ను అందుకే ఆడించలేదు: షేన్ బాండ్ -
పాక్ మాజీ బౌలర్‌పై సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. అక్తర్ బౌలింగ్‌ను చక్కర్ అంటూ ఒక టీవీ ఇంటర్య్వూలో పేర్కొన్నాడు. సెహ్వాగ్ మాట్లాడుతూ.. '' అక్తర్ తన ఎల్బోను కదలిస్తూ బౌలింగ్ చేసేవాడు. ఈ తరహా బౌలింగ్‌ను క్రికెట్ భాషలో చక్కర్ అని సంబోధిస్తారు. అందుకే అక్తర్ బౌలింగ్‌ను ఐసీసీ కొంతకాలం బ్యాన్ చేసింది. ఇక ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రెట్ లీ బౌలింగ్ యాంగిల్ కాస్త డౌన్లో వస్తుంది.. అందువల్ల అతని బౌలింగ్ పెద్ద కష్టంగా అనిపించదు. అయితే షోయబ్ బౌలింగ్‌లో మాత్రం బంతి ఎక్కడి నుంచి వస్తుందో తెలిసేది కాదు. అందుకే అక్తర్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం కాస్త కష్టంగా అనిపించేది. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ షేన్ బాండ్ కూడా నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్లలో ఒకడు. అతని స్వింగ్ బౌలింగ్ ఎక్కువగా ఆఫ్‌స్టంప్ అవతల పడుతూ బ్యాట్స్మెన్లను ఇబ్బంది పెట్టేవి. ఇక బ్రెట్ లీ బౌలింగ్‌లో ఆడడం పెద్దగా భయం లేనప్పటికి.. అక్తర్‌ను మాత్రం మనం నమ్మలేం. అతను సంధించే బీమర్.. యార్కర్ ఎక్కడ నా కాలుకు తగులుతుందోనని భయపడేవాడిని. కానీ బ్యాటింగ్ మాత్రం ఎప్పుడు కంఫర్ట్‌గానే ఉండేది.'' అంటూ వెల్లడించాడు. ఇక అక్తర్ బౌలింగ్‌ను సెహ్వాగ్ సహా.. మాజీ క్రికెటర్లు సచిన్, గంగూలీ, ద్రవిడ్, లక్ష్మణ్‌లు బాగా ఎంజాయ్ చేసేవారు. ముఖ్యంగా సెహ్వాగ్ పాకిస్తాన్‌పై 90 సగటుతో ఒక సెంచరీ, రెండు డబుల్ సెంచరీలు, ఒక ట్రిపుల్ సెంచరీ అందుకోవడం విశేషం. చదవండి: Andrew Symonds: కన్నీరు తెప్పిస్తున్న ఆండ్రూ సైమండ్స్ సోదరి లేఖ -
ముంబై ఇంకా ప్లేఆఫ్స్ రేసులో ఉంది: షేన్ బాండ్
Shane Bond Commnets On Mumbai Indians: ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ ప్రస్తుత సీజన్లో పేలవ ప్రదర్శన కొనసాగిస్తుంది. ముఖ్యంగా సెకెండ్ ఫేజ్‌లో ఆడిన 5 మ్యాచుల్లో కేవలం ఒక విజయాన్ని మాత్రమే నమోదు చేసింది. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై 4 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమి చెందింది. ఫలితంగా డిఫెండింగ్ ఛాంపియన్ ప్లేఆఫ్ ఛాన్స్‌లు సంక్లిష్టంగా మారాయి. ఈ క్రమంలో జట్టు ఆటతీరుపై ముంబై బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ స్పందించాడు. ఐపీఎల్ 2021లో ముంబైకు ఇంకా ప్లేఆఫ్‌కు ఆర్హత సాధించే అవకాశం ఉందని బాండ్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ సెకెండ్ ఫేజ్‌లో ముంబై ఇండియన్స్ అత్యుత్తమంగా ఆడలేదని బాండ్ అంగీకరించాడు. "మేము ఐపీఎల్ మెదటి దశలో బాగా ఆడాము. మేము ప్రస్తుతం బాగా ఆడడంలేదని తెలుసు, కానీ మేము ఇంకా పోటీలో ఉన్నాము. ఏమి జరుగుతుందో మేము చూస్తాము. మేము ఐదు విజయాలు మాత్రమే సాధించాము, కానీ మా జట్టు రెండు విజయాలు సాధించగలిగితే ఫలితాలు మారవచ్చు అని మ్యాచ్ అనంతరం విలేఖేరల సమావేశంలో షేన్ బాండ్ పేర్కొన్నాడు. 145 పరుగులు సాధించింటే ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై విజయం సాధించేదని అని బాండ్ చెప్పాడు. కాగా ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై 10 పాయింట్లతో 7 వ స్థానంలో ఉంది. చదవండి: CSK VS RR: ఫిలిప్స్ ఫన్నీ బ్యాటింగ్ వీడియో.. ‘నోరెళ్లబెట్టిన సామ్’’ -
'ఢిల్లీ క్యాపిటల్స్ టాలెంటెడ్.. కానీ మా ప్లాన్ మాకుంది'
చెన్నై: గతేడాది సీజన్లో ముంబై ఇండియన్స్ చాంపియన్‌గా నిలిస్తే.. ఢిల్లీ క్యాపిటల్స్ రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. లీగ్ దశలో ముంబై చేతిలో రెండు మ్యాచ్‌లు ఓడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ క్వాలిఫయర్ 1లో ఓడింది. అయితే అనూహ్యంగా రెండో క్వాలిఫయర్‌లో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టిన ఢిల్లీకి మరోసారి ముంబైతో చేదు అనుభవమే ఎదురైంది. ఓవరాల్‌గా గత సీజన్లో ముంబైతో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ఢిల్లీ ఓడిపోయింది. తాజాగా ఐపీఎల్ 14వ సీజన్లో ముంబై ఇండియన్స్ నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ ఆసక్తికరవ్యాఖ్యలు చేశాడు. ''ఢిల్లీ క్యాపిటల్స మంచి టాలెంట్ ఉన్న జట్టు. గతేడాది సీజన్లో అద్భుత ప్రదర్శన చేసిన ఆ జట్టు ఫైనల్లో మాతో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నిజానికి ఢిల్లీ క్యాపిటల్స్ మంచి బౌలింగ్, బ్యాటింగ్‌తో సమతూకంగా ఉంది. కానీ నేడు జరిగే మ్యాచ్‌లో మళ్లీ మేమే పైచేయి సాధిస్తాం. వారు టాలెంట్ జట్టు కాబట్టే వారిని ఓడగొట్టాలంటే మంచి ప్లాన్‌తో బరిలోకి దిగాలి. ఇప్పటికే చెన్నై పిచ్‌పై మాకు పూర్తి క్లారిటీ వచ్చింది. ఇక్కడ ఢిల్లీ తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఢిల్లీపై అటాకింగ్ గేమ్ ఆడితే వారు త్వరగా ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. మా స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ కనబరుస్తున్నారు. చివరి 5 ఓవర్లలో బౌలర్లు మంచి ప్రదర్శన కారణంగా 20-25 పరుగులు మాత్రమే వస్తుండడం సానుకూలాంశం. కీలక సమయాల్లో మా బౌలర్లకు ఏం చేయాలనే విషయంపై పూర్తి అవగాహన ఉంది.అని చెప్పుకొచ్చాడు. ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై వేదికగా తొలి మ్యాచ్ ఆడనుండగా.. మరోవైపు ముంబై ఇండియన్స్ మాత్రం చెన్నైలో తన చివరి మ్యాచ్ ఆడనుంది. -
బుమ్రా ఎప్పటికైనా ప్రమాదకారే..
అడిలైడ్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఎప్పటికైనా ప్రమాదకారేనని న్యూజిలాండ్ మాజీ బౌలర్ షేన్ బాండ్ అభిప్రాయపడ్డాడు. అడిలైడ్ వేదికగా నేడు తొలి టెస్టు ప్రారంభమైన సందర్భంగా బాండ్ బుమ్రా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'బూమ్ బూమ్.. బుమ్రా ఫామ్‌లో ఉంటే చాలా ప్రమాదకారి. గంటకు 145 కిమీ వేగంతో వేసే బంతులు ఆసీస్‌ను సర్వనాశనం చేయనున్నాయి. ఇప్పటికే బుమ్రా ప్రత్యర్థి బ్యాట్స్మెన్లను ముప్పతిప్పలు పెట్టడానికి తన అస్త్రాలన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. ఒకవేళ సరైన పిచ్ తగిలితే మాత్రం అతన్ని ఆపడం ఎవరితరం కాదు. పేసర్లకు స్వర్గధామంగా నిలిచే పెర్త్( వాకా మైదానం)లో బుమ్రా చెలరేగే అవకాశం ఉంది.2018-19 ఆసీస్ పర్యటనను అతను మరోసారి రిపీట్ చేస్తే మాత్రం ఆసీస్‌కు కష్టాలు తప్పకపోవచ్చంటూ' తెలిపాడు. (చదవండి : పృథ్వీ షా డకౌట్.. వైరలవుతున్న ట్వీట్స్) వాస్తవానికి బుమ్రాకు ఆసీస్ టూర్ ప్రారంభంలో అంతగా అచ్చి రాలేదు. వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు కలిపి నాలుగు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. వన్డే మ్యాచ్‌లు జరిగిన వేదికలన్ని ఫ్లాట్ పిచ్‌లు సిద్దం చేయడంతో ఎక్కువగా వికెట్లు తీయలేకపోయాడు. ఆ తర్వాత జరిగిన టీ20 సిరీస్‌లో బుమ్రాను ఆడించలేదు. అయితే టెస్టు సిరీస్‌లో మాత్రం పరిస్థితి అలా ఉండకపోవచ్చు. టెస్టు ఫార్మాట్లో సుధీర్ఘంగా బౌలింగ్ చేసే అవకాశం ఉండడం.. మ్యాచ్‌లన్నీ పేసర్లకు అనుకూలించే విధంగా వికెట్లు రూపొందించడం బుమ్రాకు సానుకూలాంశంగా మారనుంది. ఇక 2018-19 ఆసీస్ పర్యటనలో బుమ్రా టెస్టు సిరీస్‌లో దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. నాలుగు టెస్టుల సిరీస్‌లో 21 వికెట్లు తీసి టీమిండియా 2-1 తేడాతో సిరీస్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు.(చదవండి : దుమ్మురేపిన కోహ్లి.. జడేజా) -
వరల్డ్ బెస్ట్ టి20 బౌలర్ ‘బుమ్రా’
దుబాయ్: భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రపంచంలోనే అత్యుత్తమ టి20 బౌలర్ అని ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ కితాబిచ్చాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అతని ఆటను చూడటం గౌరవంగా భావిస్తున్నానని అన్నాడు. గురువారం జరిగిన క్వాలిఫయర్స్–1లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ముంబై ఇండియన్స్ చిత్తు చేయడంలో ట్రెంట్ బౌల్ట్ (2/9)తో కలిసి బుమ్రా (4/14) కీలకపాత్ర పోషించాడు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా బాండ్ తన ఆనందాన్ని పంచుకున్నాడు. ‘బుమ్రా ఆట చూడటం గొప్ప గౌరవం. అతను ప్రపంచ అత్యుత్తమ టి20 బౌలర్. 2012 నుంచి బౌల్ట్ ఆటను ఆస్వాదిస్తున్నా. అతనో విధ్వంసక బౌలర్. టోర్నీ ఆసాంతం అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు’ అని వీడియోలో పేర్కొన్నాడు. -
‘ఓవెన్’లో ఉన్నట్టుంది...
ఐపీఎల్ కోసం భారత్‌లో గడిపిన రెండు నెలలు ఓవెన్లో కూర్చున్నట్లు ఉందని ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ చెప్పాడు. లీగ్‌లో చాంపియన్స్‌గా నిలిచిన తర్వాత స్వదేశం న్యూజిలాండ్ వెళ్లిన బాండ్... భారత్‌లో తన బాధలను చెప్పుకొచ్చాడు. ‘బాబోయ్... అదేం వేడి. గతంలో భారత్‌లో ఆడాను. కానీ ఈసారి మాత్రం ఎండలు తట్టుకోలేకపోయాం. ముఖ్యంగా కోల్‌కతాలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత, 90 శాతం ఉక్కబోత ఉంది. ఇప్పుడు న్యూజిలాండ్ వచ్చా క ఒక్కసారిగా హాయిగా అనిపిస్తోంది. రెండు నెలల తర్వాత స్వెట్టర్ వేసుకున్నాను’ అని బాండ్ చెప్పాడు. అయితే ఇంత ఎండల్లోనూ అభిమానులు చూపించే ఆదరణ భారత్‌లో మాత్రమే దొరుకుతుందని చెప్పాడు. ‘హోటల్లో లిఫ్ట్‌లోంచి బయటకు రాగానే అభిమానులు ఫొటోలు తీసుకుంటూ ఉంటారు. బస్‌లో స్టేడియానికి వెళుతుంటే మండుటెండలో కూడా రోడ్లపై బారులుగా నిలబడి ఉంటారు. ఇంత గొప్ప అభిమానం భారత్ లోనే దొరుకుతుంది’ అని బాండ్ చెప్పాడు.