PC:IPL.com
ఐపీఎల్-2024లో రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో అదరగొట్టిన పరాగ్.. సోమవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సంజూ శాంసన్, బట్లర్, జైశ్వాల్ వంటి స్టార్ ఆటగాళ్లు విఫలమైన చోట పరాగ్ సత్తాచాటాడు.
తన అద్బుత ఇన్నింగ్స్‌తో రాజస్తాన్‌ను పరాగ్ గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో 39 బంతులు ఎదుర్కొన్న పరాగ్ 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడిన పరాగ్.. 181 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో పరాగ్‌పై రాజస్తాన్ రాయల్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. పరాగ్ తన ఆట తీరుతో సూర్యకుమార్ యాదవ్‌ను గుర్తు చేస్తున్నడంటూ బాండ్ కొనియాడాడు.
"పరాగ్ అద్బుతమైన ఆటగాడు. అతడు తన ఆట తీరుతో సూర్యకుమార్ యాదవ్‌ను గుర్తు చేశాడు. సూర్య ముంబై ఇండియన్స్‌లోకి కొత్తగా వచ్చినప్పుడు ఈ తరహా ప్రదర్శనే చేసేవాడు. పరాగ్‌కు మంచి బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. అతడు కేవలం 22 ఏళ్ల వయస్సుకే అద్బుతమైన టాలెంట్‌ను సంపాందించుకున్నాడు. కచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది.
ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందు అతడు దేశవాళీ క్రికెట్‌లో అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. అందుకే అతడికి బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ ఇచ్చాం. దేవ్‌దత్ పడిక్కల్‌ను వదులుకోవడంతో పరాగ్ ఆ స్ధానంలో బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉంది. అతడి నుంచి ఈ తరహా ప్రదర్శన కోసం మేము ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాము.
రాజస్తాన్ అతడిపై పెట్టిన పెట్టుబడికి ఇప్పుడు ప్రతిఫలం పొందుతుంది. మిగిలిన సీజన్‌లో కూడా రియాన్ తన ఫామ్‌ను కొనసాగించాలని ఆశిస్తున్నానని" క్రిక్‌ట్రాకర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాండ్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment