రాయల్స్ జట్టు(PC: RR X)- సునిల్ గావస్కర్
రాజస్తాన్ రాయల్స్ యువ బ్యాటర్ రియాన్ పరాగ్ ఆట తీరుపై టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ మండిపడ్డాడు. ప్రతిభ ఉంటే సరిపోదని.. దానిని ఎలా వినియోగించుకోవాలో కూడా తెలిసి ఉండాలంటూ చురకలు అంటించాడు.
ఐపీఎల్-2024లో ఆది నుంచి వరుస విజయాలు సాధించిన రాజస్తాన్ రాయల్స్.. ఆ తర్వాత వరుస ఓటములతో విమర్శలు మూటగట్టుకుంది. ప్లే ఆఫ్స్ చేరినప్పటికీ సంజూ శాంసన్ సేన స్థాయికి తగ్గట్లు రాణించడం లేదని విశ్లేషకులు పెదవి విరిచారు.
ఎలిమినేటర్ మ్యాచ్‌లో విశ్వరూపం
అలాంటి సమయంలో కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో అద్భుత ఆట తీరుతో రాజస్తాన్ తిరిగి సత్తా చాటింది. అహ్మదాబాద్‌లో బుధవారం నాటి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును చిత్తు చేసి క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది.
విలువైన ఇన్నింగ్స్ ఆడిన రియాన్
ఈ విజయంలో రియాన్ పరాగ్ కీలక పాత్ర పోషించాడు. 26 బంతుల్లో 36 విలువైన పరుగులు జోడించి జట్టును గెలుపు తీరాలకు చేర్చడంలో సహకారం అందించాడు. అయితే, మరో కీలకమైన మ్యాచ్‌లో మాత్రం ఒత్తిడిలో అతడు చిత్తయ్యాడు.
మరో కీలక మ్యాచ్‌లో మాత్రం విఫలం
సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో శుక్రవారం నాటి క్వాలిఫయర్-2లో రియాన్ పరాగ్ పూర్తిగా విఫలమయ్యాడు. లక్ష్య ఛేదనలో రాజస్తాన్ తడబడుతున్న వేళ నాలుగో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన 22 ఏళ్ల ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్.. 10 బంతులు ఎదుర్కొని కేవలం 6 పరుగులే చేశాడు.
రాజస్తాన్ ఇన్నింగ్స్‌లో 12వ ఓవర్ వేసిన రైజర్స్ లెఫ్టార్మ్ స్పిన్నర్ షాబాజ్ అహ్మద్ బౌలింగ్‌లో మొదటి బంతిని ఎదుర్కొనే క్రమంలో.. నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకున్నాడు. అనవసరపు షాట్‌కు యత్నించి బంతిని గాల్లోకి లేపగా.. అభిషేక్ శర్మ క్యాచ్ పట్టాడు.
Shahbaz Ahmed has put Sunrisers Hyderabad on 🔝🧡#RR in deep trouble and in search of something special in Chennai!
Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #SRHvRR | #Qualifier2 | #TheFinalCall pic.twitter.com/8sGV8fzxcZ— IndianPremierLeague (@IPL) May 24, 2024
దీంతో రియాన్ పరాగ్ తడ‘బ్యాటు’ అంతటితో ముగిసిపోయింది. అతడు అవుటైన తీరుకు రాజస్తాన్ కోచ్ సంగక్కర షాక్‌లో ఉండిపోగా.. కామెంటేటర్ సునిల్ గావస్కర్ తీవ్ర స్థాయిలో విమర్శించాడు.
ఎంత టాలెంట్ ఉంటే ఏం లాభం?
‘‘ఎలా ఉపయోగించుకోవాలో తెలియనపుడు నీకు ఎంత ప్రతిభ ఉంటే ఏం లాభం? అసలు ఇలాంటి షాట్ ఎలా ఆడతావు? నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. అపారమైన ప్రతిభ.. కానీ దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియదు.
ఇంకొన్ని బంతుల వరకు పరుగులు రానంత మాత్రాన ఏం మునిగిపోతుంది? ఆ తర్వాత మళ్లీ పుంజుకోవచ్చు కదా!’’ అంటూ గావస్కర్ లైవ్ కామెంట్రీలోనే రియాన్ పరాగ్‌పై ఫైర్ అయ్యాడు. కాగా ఈ ఏడాది ఐపీఎల్‌లో రియాన్ పరాగ్ 16 మ్యాచ్‌లలో కలిపి 573 పరుగులు సాధించాడు.
చదవండి: Kavya Maran Viral Reaction Video: దటీజ్ కావ్య.. సరైన నిర్ణయాలు!.. తండ్రిని హత్తుకుని చిన్నపిల్లలా!
Comments
Please login to add a commentAdd a comment