Shahbaz Ahmed
-
SRH vs RR: మా ఓటమికి కారణం అదే.. బుమ్రా తర్వాత అతడే: సంజూ
‘‘కీలకమైన మ్యాచ్. తొలి ఇన్నింగ్స్‌లో మా వాళ్లు బౌలింగ్ చేసిన విధానం పట్ల గర్వంగా ఉంది. అయితే, రెండో ఇన్నింగ్స్ మిడిల్ ఓవర్లలో వారి స్పిన్ వ్యూహాలను ఎదుర్కోవడంలో మేము తడబడ్డాం.అక్కడే మ్యాచ్ మా చేజారింది. ఈ పిచ్‌పై తేమ ఉంటుందా? లేదా అన్నది ముందే ఊహించడం కష్టం. రెండో ఇన్నింగ్స్‌కు వచ్చే సరికి వికెట్ పూర్తి భిన్నంగా మారిపోయింది.బంతి కాస్త టర్న్ కావడం మొదలైంది. ఆ అవకాశాన్ని వాళ్లు సద్వినియోగం చేసుకున్నారు. మిడిల్ ఓవర్లలో మా కుడిచేతి వాటం బ్యాటర్ల కోసం లెఫ్టార్మ్ స్పిన్నర్లను దింపి ఫలితం రాబట్టారు.అక్కడే వాళ్లు మాపై పైచేయి సాధించారు. లెఫ్టార్మ్ స్పిన్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ షాట్లకు ఎక్కువగా ప్రయత్నించి ఉంటే బాగుండేది. ఏదేమైనా వాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు’’ అని రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అన్నాడు.ఐపీఎల్-2024 క్వాలిఫయర్-2లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే కారణమని అంగీకరించాడు. అయితే, జట్టు ప్రదర్శన పట్ల మాత్రం తనతో పాటు ఫ్రాంఛైజీ కూడా సంతృప్తిగానే ఉందని సంజూ ఈ సందర్భంగా తెలిపాడు.బుమ్రా తర్వాత అతడేఈ మేరకు.. ‘‘మేము ఈ ఒక్క సీజన్లోనే కాదు.. గత మూడేళ్లుగా నిలకడగా రాణిస్తున్నాం. మా ఫ్రాంఛైజీ మా ప్రదర్శన పట్ల సంతృప్తిగానే ఉంది. ముఖ్యంగా భారత్‌లోని యంగ్ టాలెంట్‌ను మేము వెలికితీయగలుగుతున్నాం.రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ అందుకు ఉదాహరణ. వీళ్లిద్దరు కేవలం రాజస్తాన్‌కే కాదు టీమిండియా తరఫున కూడా రాణిస్తే చూడాలని కోరుకుంటున్నా.ఇక సందీప్ శర్మ.. అతడి బౌలింగ్ తీరు పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. వేలంలో తను మా జట్టులోకి రాకపోయినా వేరొకరి స్థానంలో మాతో చేరాడు. అద్భుత ఆట తీరుతో అందరినీ మెప్పించాడు.గత రెండేళ్లుగా అతడి ప్రదర్శన బాగుంది. బుమ్రా తర్వాత అతడే బెస్ట్!’’ అంటూ రాజస్తాన్ యువ ఆటగాళ్లపై సంజూ శాంసన్ ప్రశంసలు కురిపించాడు. కాగా చెన్నై వేదికగా శుక్రవారం నాటి కీలక మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 36 పరుగుల తేడాతో ఓడిపోయింది.విఫలమైన సంజూ శాంసన్ఈ క్రమంలో సన్‌రైజర్స్ ఫైనల్లో అడుగుపెట్టగా.. రాజస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో లక్ష్య ఛేదనలో సంజూ శాంసన్ పూర్తిగా విఫలమయ్యాడు. 11 బంతులు ఎదుర్కొని కేవలం 10 పరుగులే చేశాడు. యశస్వి జైస్వాల్(21 బంతుల్లో 42), ధ్రువ్ జురెల్(56 నాటౌట్) మాత్రమే రాణించారు.తిప్పేసిన స్పిన్నర్లుఅంతకు ముందు సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో రాజస్తాన్ పేసర్ సందీప్ శర్మ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 25 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. కాగా ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ లెఫ్టార్మ్ స్పిన్నర్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ షాబాజ్ అహ్మద్, అభిషేక్ శర్మ అద్బుతంగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.క్వాలిఫయర్-2: సన్‌రైజర్స్ వర్సెస్ రాజస్తాన్ స్కోర్లు:👉టాస్: రాజస్తాన్.. తొలుత బౌలింగ్👉సన్‌రైజర్స్ స్కోరు: 175/9 (20)👉రాజస్తాన్ స్కోరు: 139/7 (20)👉ఫలితం: రాజస్తాన్‌పై 36 పరుగుల తేడాతో గెలుపొంది ఫైనల్‌కు దూసుకెళ్లిన సన్రైజర్స్చదవండి: SRH Captain Pat Cummins: ఆ నిర్ణయం నాది కాదు.. అతడొక సర్ప్రైజ్.. ఇంకొక్క అడుగు SRH vs RR: ఓవరాక్షన్.. మూల్యం చెల్లించకతప్పలేదు! Plenty to cheer & celebrate for the @SunRisers 🥳An impressive team performance to seal a place in the all important #Final 🧡Scorecard ▶️ https://t.co/Oulcd2FuJZ… #TATAIPL | #Qualifier2 | #SRHvRR | #TheFinalCall pic.twitter.com/nG0tuVfA22— IndianPremierLeague (@IPL) May 24, 2024 -
SRH vs RR: ఎంత టాలెంట్ ఉంటే ఏం లాభం?: టీమిండియా దిగ్గజం ఫైర్
రాజస్తాన్ రాయల్స్ యువ బ్యాటర్ రియాన్ పరాగ్ ఆట తీరుపై టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ మండిపడ్డాడు. ప్రతిభ ఉంటే సరిపోదని.. దానిని ఎలా వినియోగించుకోవాలో కూడా తెలిసి ఉండాలంటూ చురకలు అంటించాడు.ఐపీఎల్-2024లో ఆది నుంచి వరుస విజయాలు సాధించిన రాజస్తాన్ రాయల్స్.. ఆ తర్వాత వరుస ఓటములతో విమర్శలు మూటగట్టుకుంది. ప్లే ఆఫ్స్ చేరినప్పటికీ సంజూ శాంసన్ సేన స్థాయికి తగ్గట్లు రాణించడం లేదని విశ్లేషకులు పెదవి విరిచారు.ఎలిమినేటర్ మ్యాచ్‌లో విశ్వరూపంఅలాంటి సమయంలో కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో అద్భుత ఆట తీరుతో రాజస్తాన్ తిరిగి సత్తా చాటింది. అహ్మదాబాద్‌లో బుధవారం నాటి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును చిత్తు చేసి క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది.విలువైన ఇన్నింగ్స్ ఆడిన రియాన్ఈ విజయంలో రియాన్ పరాగ్ కీలక పాత్ర పోషించాడు. 26 బంతుల్లో 36 విలువైన పరుగులు జోడించి జట్టును గెలుపు తీరాలకు చేర్చడంలో సహకారం అందించాడు. అయితే, మరో కీలకమైన మ్యాచ్‌లో మాత్రం ఒత్తిడిలో అతడు చిత్తయ్యాడు.మరో కీలక మ్యాచ్‌లో మాత్రం విఫలంసన్రైజర్స్ హైదరాబాద్‌లో శుక్రవారం నాటి క్వాలిఫయర్-2లో రియాన్ పరాగ్ పూర్తిగా విఫలమయ్యాడు. లక్ష్య ఛేదనలో రాజస్తాన్ తడబడుతున్న వేళ నాలుగో నంబర్లో బ్యాటింగ్‌కు వచ్చిన 22 ఏళ్ల ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్.. 10 బంతులు ఎదుర్కొని కేవలం 6 పరుగులే చేశాడు.రాజస్తాన్ ఇన్నింగ్స్‌లో 12వ ఓవర్ వేసిన రైజర్స్ లెఫ్టార్మ్ స్పిన్నర్ షాబాజ్ అహ్మద్ బౌలింగ్‌లో మొదటి బంతిని ఎదుర్కొనే క్రమంలో.. నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకున్నాడు. అనవసరపు షాట్‌కు యత్నించి బంతిని గాల్లోకి లేపగా.. అభిషేక్ శర్మ క్యాచ్ పట్టాడు.Shahbaz Ahmed has put Sunrisers Hyderabad on 🔝🧡#RR in deep trouble and in search of something special in Chennai! Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #SRHvRR | #Qualifier2 | #TheFinalCall pic.twitter.com/8sGV8fzxcZ— IndianPremierLeague (@IPL) May 24, 2024 దీంతో రియాన్ పరాగ్ తడ‘బ్యాటు’ అంతటితో ముగిసిపోయింది. అతడు అవుటైన తీరుకు రాజస్తాన్ కోచ్ సంగక్కర షాక్‌లో ఉండిపోగా.. కామెంటేటర్ సునిల్ గావస్కర్ తీవ్ర స్థాయిలో విమర్శించాడు.ఎంత టాలెంట్ ఉంటే ఏం లాభం?‘‘ఎలా ఉపయోగించుకోవాలో తెలియనపుడు నీకు ఎంత ప్రతిభ ఉంటే ఏం లాభం? అసలు ఇలాంటి షాట్ ఎలా ఆడతావు? నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. అపారమైన ప్రతిభ.. కానీ దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియదు. ఇంకొన్ని బంతుల వరకు పరుగులు రానంత మాత్రాన ఏం మునిగిపోతుంది? ఆ తర్వాత మళ్లీ పుంజుకోవచ్చు కదా!’’ అంటూ గావస్కర్ లైవ్ కామెంట్రీలోనే రియాన్ పరాగ్‌పై ఫైర్ అయ్యాడు. కాగా ఈ ఏడాది ఐపీఎల్లో రియాన్ పరాగ్ 16 మ్యాచ్‌లలో కలిపి 573 పరుగులు సాధించాడు.చదవండి: Kavya Maran Viral Reaction Video: దటీజ్ కావ్య.. సరైన నిర్ణయాలు!.. తండ్రిని హత్తుకుని చిన్నపిల్లలా! -
SRH: ఆ నిర్ణయం నాది కాదు.. అతడొక సర్ప్రైజ్: కమిన్స్
ఎనిమిది.. ఎనిమిది.. పది.. గత మూడేళ్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్థానాలు. చెత్త ప్రదర్శనతో గతేడాది అట్టడుగున నిలిచిన ఆరెంజ్ ఆర్మీ ఈసారి అద్భుత ఆట తీరుతో సంచలనాలు సృష్టించింది.విశ్లేషకుల అంచనాలు తలకిందులు చేస్తూ ఏకంగా ఫైనల్లో అడుగుపెట్టింది. క్వాలిఫయర్-2లో రాజస్తాన్ రాయల్స్‌ను చిత్తు చేసి.. ఆరేళ్ల తర్వాత తుదిపోరుకు అర్హత సాధించింది.కొత్త కోచ్ డానియల్ వెటోరి మార్గదర్శనంలో.. నూతన కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సారథ్యంలో ఊహించని ఫలితాలు సాధిస్తూ టైటిల్ వేటలో నిలిచింది. ఈ నేపథ్యంలో రాజస్తాన్‌పై విజయానంతరం ఎస్ఆర్హెచ్ సారథి కమిన్స్ మాట్లాడుతూ తన మనసులోని భావాలు పంచుకున్నాడు.మా బలం అదే‘‘ఈ సీజన్ ఆసాంతం మా వాళ్లు అదరగొట్టారు. ఆరంభం నుంచే ఫైనల్ లక్ష్యంగా ముందుకు సాగాము. ఇప్పుడు ఆ కలను నెరవేర్చుకున్నాము. మా బలం బ్యాటింగ్ అన్న సంగతి మాకు తెలుసు. అయినప్పటికీ మా బౌలర్లను తక్కువ అంచనా వేయడానికి లేదు. అనుభవజ్ఞులైన బౌలర్లు మా జట్టులో ఉన్నారు. భువీ, నట్టు, ఉనాద్కట్ నా పని మరింత సులువు చేశారు.ఆ నిర్ణయం నాది కాదుఇక ఈ రోజు షాబాజ్ అహ్మద్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకురావాలన్న నిర్ణయం డాన్ వెటోరీదే. ఈ లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ జట్టులో ఎంత మంది వీలైతే అంత మంది లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ బౌలర్లను ఈరోజు ఆడించాలని అనుకున్నాడు.అతడొక సర్ప్రైజ్ఇక అభిషేక్ శర్మ ఈరోజు ఇలా బౌలింగ్(2/24) చేయడం నిజంగా ఓ సర్ప్రైజ్ లాంటిదే. మిడిల్ ఓవర్లలో అతడు ప్రభావం చూపాడు. వాస్తవానికి ఈ పిచ్ మీద 170 పరుగుల టార్గెట్‌ను ఛేదించడం అంత సులువేమీ కాదని తెలుసు.కాస్త మెరుగ్గా ఆడితే గెలిచే అవకాశం ఉంటుందని తెలుసు. అయితే, వికెట్‌ను బట్టి పరిస్థితులను అంచనా వేయడంలో నేనేమీ దిట్ట కాదు. ఎందుకంటే వారం వారం ఇదంతా మారిపోతూ ఉంటుంది.ఇంకొక్కటి మిగిలి ఉందిమేము ఇక్కడిదాకా చేరడం వెనుక ఫ్రాంఛైజీకి చెందిన ప్రతి ఒక్కరి సహకారం ఉంది. దాదాపుగా 60- 70 మంది మనస్ఫూర్తిగా కఠిన శ్రమకోర్చి మమ్మల్ని ఈస్థాయిలో నిలిపారు.ఇంకొక్క అడుగు.. అందులోనూ సఫలమైతే ఇంకా బాగుంటుంది’’ అని కమిన్స్ హర్షం వ్యక్తం చేశాడు. సమిష్టిగా రాణించినందు వల్లే తాము ఫైనల్ చేరుకోగలిగామని జట్టులోని ప్రతి ఒక్కరికి క్రెడిట్ ఇచ్చాడు.ఇంపాక్ట్ చూపిన షాబాజ్కాగా రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ స్థానంలో ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన లెఫ్టార్మ్ స్పిన్నర్ షాబాజ్ అహ్మద్.. యశస్వి జైస్వాల్(42), రియాన్ పరాగ్(6), రవిచంద్రన్ అశ్విన్(0) వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కీలక సమయంలో రాణించి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. మరో లెఫ్టార్మ్ స్పిన్నర్ అభిషేక్ శర్మ కెప్టెన్ సంజూ శాంసన్(10), షిమ్రన్ హెట్మెయిర్(4) రూపంలో రెండు కీలక వికెట్లు కూల్చాడు.క్వాలిఫయర్-2: సన్‌రైజర్స్ వర్సెస్ రాజస్తాన్ స్కోర్లు:👉వేదిక: ఎంఏ చిదంబరం స్టేడియం(చెపాక్), చెన్నై👉టాస్: రాజస్తాన్.. తొలుత బౌలింగ్👉సన్‌రైజర్స్ స్కోరు: 175/9 (20)👉రాజస్తాన్ స్కోరు: 139/7 (20)👉ఫలితం: రాజస్తాన్‌పై 36 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ విజయం.. ఫైనల్‌కు అర్హత👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: షాబాజ్ అహ్మద్(18 పరుగులు, 3/23).చదవండి: T20 WC: టీ20 వరల్డ్‌కప్-2024కు పాకిస్తాన్ జట్టు ప్రకటన.. Plenty to cheer & celebrate for the @SunRisers 🥳An impressive team performance to seal a place in the all important #Final 🧡Scorecard ▶️ https://t.co/Oulcd2FuJZ… #TATAIPL | #Qualifier2 | #SRHvRR | #TheFinalCall pic.twitter.com/nG0tuVfA22— IndianPremierLeague (@IPL) May 24, 2024 -
RR Vs SRH Pics: ఆర్ఆర్ను చిత్తు చేసి.. ఫైనల్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఫొటోలు)
-
చహల్ మ్యాజిక్.. శతక్కొట్టిన లోమ్రార్
విజయ్ హజారే ట్రోఫీ 2023లో సెమీస్ బెర్త్‌లు ఖరారయ్యాయి. ఇవాళ (డిసెంబర్ 11) జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో కర్ణాటక, తమిళనాడు, హర్యానా, రాజస్థాన్ జట్లు విదర్భ, ముంబై, బెంగాల్, కేరళ జట్లపై విజయాలు సాధించి ఫైనల్ ఫోర్కు అర్హత సాధించాయి. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో రాజస్థాన్‌కు చెందిన మహిపాల్ లోమ్రార్ (122 నాటౌట్, కేరళపై), బెంగాల్‌కు చెందిన షాబాజ్ అహ్మద్ (100, హర్యానా), హర్యానాకు చెందిన అంకిత్ కుమార్ (102, బెంగాల్‌పై), తమిళనాడు చెందిన బాబా ఇంద్రజిత్ (103 నాటౌట్, ముంబైపై) శతకాలతో చెలరేగగా.. హర్యానాను చెందిన యుజ్వేంద్ర చహల్ (10-0-37-4, బెంగాల్‌పై), కర్ణాటకకు చెందిన విజయ్‌కుమార్ వైశాక్ (8.5-2-44-4, విదర్భపై), రాజస్థాన్‌కు చెందిన అనికేత్ చౌదరీ (7-1-26-4, కేరళపై) బంతితో రాణించారు. డిసెంబర్ 13న జరిగే తొలి సెమీఫైనల్లో హర్యానా, తమిళనాడు.. డిసెంబర్ 14న జరిగే రెండో సెమీఫైనల్లో రాజస్థాన్, కర్ణాటక జట్లు తలపడనున్నాయి. రెండు సెమీఫైనల్స్‌లో విజేతలు డిసెంబర్ 16న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల స్కోర్ల వివరాలు.. తొలి క్వార్టర్ ఫైనల్: బెంగాల్ 225 (50 ఓవర్లు) హర్యానా 226/6 (45.1 ఓవర్లు) 4 వికెట్ల తేడాతో హర్యానా విజయం రెండో క్వార్టర్ ఫైనల్: రాజస్థాన్ 267/8 (50 ఓవర్లు) కేరళ 67/9 (21 ఓవర్లు) 200 పరుగుల తేడాతో రాజస్థాన్ విజయం మూడో క్వార్టర్ ఫైనల్: విదర్భ 173 (42 ఓవర్లు) కర్ణాటక 177/3 (40.3 ఓవర్లు) 7 వికెట్ల తేడాతో కర్ణాటక విజయం నాలుగో క్వార్టర్ ఫైనల్: ముంబై 227 (48.3 ఓవర్లు) తమిళనాడు 229/3 (43.2 ఓవర్లు) 7 వికెట్ల తేడాతో తమిళనాడు విజయం -
షాబాజ్ అహ్మద్ సూపర్ సెంచరీ.. ఆర్సీబీని వీడితేనే బాగుపడతారంటున్న ఫ్యాన్స్
విజయ్ హజారే ట్రోఫీ 2023లో భాగంగా హర్యానాతో ఇవాళ (డిసెంబర్ 11) జరుగుతున్న తొలి క్వార్టర్ ఫైనల్లో బెంగాల్ ఆటగాడు, ఆర్సీబీ మాజీ ప్లేయర్ షాబాజ్ అహ్మద్ సూపర్ సెంచరీతో (118 బంతుల్లో 100; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) కదంతొక్కాడు. జట్టులోని మిగతా ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కడుతున్నా షాబాజ్ ఒంటరిపోరాటం చేసి తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాడు. Shahbaz Ahmed - 100 (118).Next best - 24 (41).One of the best innings in the Quarter Final of Vijay Hazare Trophy by Shahbaz...!!!pic.twitter.com/pO2bILZvhf— Mufaddal Vohra (@mufaddal_vohra) December 11, 2023 షాబాజ్ ఒంటరిపోరాటం చేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్ నిర్ణీత 50 ఓవర్లలో 225 పరుగులు చేసి ఆలౌటైంది. షాజాబ్ తర్వాత బెంగాల్ ఇన్నింగ్స్‌లో అభిషేక్ పోరెల్ చేసిన 24 పరుగులే అత్యధికం. కెప్టెన్ సుదీప్ ఘరామీ (21), ప్రదిప్త ప్రమానిక్ (21) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. హర్యానా బౌలర్లలో యుజ్వేంద్ర చహల్ (4/37), సుమిత్ కుమార్ (2/27), రాహుల్ తెవాటియా (2/32) బెంగాల్ పతనాన్ని శాశించారు. అనంతరం నామమాత్రపు లక్ష్య ఛేదనకు దిగిన హర్యానా 30 ఓవర్ల తర్వాత 3 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసి విజయం దిశగా సాగుతుంది. అంకిత్ కుమార్ (82 నాటౌట్) హర్యానాను గెలుపు దిశగా తీసుకెళ్తున్నాడు. "Shahbaz Ahmed's sensational 💯 under immense pressure in the Vijay Hazare Trophy Knockout game is cricket brilliance at its finest! Single-handedly steering Bengal with a stunning innings, while others faltered. 🏏🔥 #ShahbazAhmed #VijayHazareTrophy" pic.twitter.com/2PJVktLXCH — Hemant ( Sports Active ) (@hemantbhavsar86) December 11, 2023 ఈ మ్యాచ్‌లో షాబాజ్ అహ్మద్ బాధ్యతాయుతమై సెంచరీతో రాణించడంతో బెంగాల్ అభిమానులు అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ ట్రేడింగ్‌లో షాబాజ్‌ను సన్‌రైజర్స్‌కు వదిలిపెట్టినందుకు గాను ఆర్సీబీపై దుమ్మెత్తిపోస్తున్నారు. షాబాజ్‌ను ఆర్సీబీ వదిలిపెట్టడమే మంచిదైందని వారు కామెంట్లు చేస్తున్నారు. ఆర్సీబీని వీడితేనే ఆటగాళ్లు బాగుపడతారంటూ ట్రోలింగ్‌కు దిగుతున్నారు. you leave rcb and you become successful. https://t.co/1UhwUzIdkB — munka in kalimpong (@messymunka) December 11, 2023 కాగా, అన్క్యాప్డ్ ఆల్‌రౌండర్ మయాంక్ డాగర్ కోసం ఆర్సీబీ షాబాజ్ అహ్మద్‌ను సన్‌రైజర్స్‌కు వదిలిపెట్టిన విషయం తెలిసిందే. ట్రేడింగ్ పద్దతిలో షాబాజ్‌ను వదిలేసిన ఆర్సీబీ.. వనిందు హసరంగ, హర్షల్ పటేల్, జోష్ హాజిల్‌వుడ్, ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్‌వెల్, డేవిడ్ విల్లీ, వేన్ పార్నెల్, సోనూ యాదవ్, అవినాష్ సింగ్, సిద్ధార్థ్ కౌల్, కేదార్ జాదవ్‌లను కూడా వేలానికి వదిలిపెట్టింది. ఐపీఎల్ 2024 ఎడిషన్‌కు సంబంధించిన వేలం ఈనెల 19న దుబాయ్‌లో జరుగనుంది. -
సన్‌రైజర్స్ కీలక నిర్ణయం.. అతడిని విడిచిపెట్టి! స్టార్ ఆల్‌రౌండర్‌ని
ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రాంఛైజీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఐపీఎల్ ట్రేడింగ్‌లో భాగంగా సన్‌రైజర్స్, బెంగళూరు తమ ఆటగాళ్లను మార్చుకున్నాయి. ఎస్ఆర్హెచ్ నుంచి మయాంక్ డాగర్‌ను ఆర్సీబీ సొంతం చేసుకోగా.. ఆర్సీబీ నుంచి షాబాజ్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ కొనుగోలు చేసింది. ఇరు జట్ల పరస్పర అంగీకారంతో ఈ ట్రేడింగ్ జరిపాయి. గత ఏడాది వేలంలో డాగర్‌ను ఎస్ఆర్హెచ్ రూ.1.8 కోట్లకు కొనుగోలు చేసింది. అదే విధంగా షాబాజ్‌ను రూ.2.4 కోట్లకు ఆర్సీబీ సొంతం చేసుకుంది. ఇప్పుడు అదే ధరకు ఇరు జట్లు కూడా ఆటగాళ్లను మార్చుకున్నాయి. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇరు ప్రాంఛైజీలు ఆదివారం విడుదల చేసే ఛాన్స్ ఉంది. కాగా ఐపీఎల్-2024 సీజన్‌కు సంబంధించిన వేలం డిసెంబర్ 19న ముంబై వేదికగా జరగనుంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది సీజన్ కోసం ఫ్రాంచైజీలు నవంబర్ 26 నాటికి తమ వద్ద అట్టిపెట్టుకునే ఆటగాళ్లతో పాటు విడిచిపెట్టే ప్లేయర్లకు సంబంధించిన వివరాలను బీసీసీఐకి అందజేయాల్సి ఉంది. చదవండి: IND vs AUS 2nd T20: ఆస్ట్రేలియాతో రెండో టీ20.. టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్!? -
ఐపీఎల్-2023లో చెత్తగా ఆడుతుంది వీరే.. వీరితో ఓ జట్టు తయారు చేస్తే ఇలా ..!
ఐపీఎల్-2023లో స్వదేశీ విదేశీ ఆటగాళ్లు అన్న తేడా లేకుండా భారీ అంచనాలు పెట్టుకున్న చాలామంది ఉసూరుమనిపించారు. వీరి చెత్త ప్రదర్శనతో ఫ్రాంచైజీలతో పాటు అభిమానులు సైతం విసిగివేసారిపోయారు. ఇప్పటివరకు (ఏప్రిల్ 30) జరిగిన 42 మ్యాచ్‌ల్లో ఏయే ఆటగాళ్లు దారుణంగా నిరాశపరిచారో, వారందరిని కలిపి ఓ జట్టుగా తయారు చేస్తే ఇలా ఉంటుంది. ఓపెనర్లుగా ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు పృథ్వీ షా (8 కోట్లు, 6 మ్యాచ్‌ల్లో 47 పరుగులు), ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ (16 కోట్లు, 8 మ్యాచ్‌ల్లో 184 పరుగులు, ఒక్క హాఫ్‌సెంచరీ), వన్ డౌన్లో సన్‌రైజర్స్ మయాంక్ అగర్వాల్ (8.25 కోట్లు, 8 మ్యాచ్‌ల్లో 169 పరుగులు), నాలుగో స్థానంలో లక్నో దీపక్ హుడా (5.75 కోట్లు, 8 మ్యాచ్‌ల్లో 52 పరుగులు), ఐదులో రాజస్థాన్ రియాన్ పరాగ్ (3.80 కోట్లు, 5 మ్యాచ్‌ల్లో 54 పరుగులు), ఆరులో ఆర్సీబీ దినేశ్ కార్తీక్ (5.5 కోట్లు, 8 మ్యాచ్‌ల్లో 83), ఏడో స్థానంలో వాషింగ్టన్ సుందర్ (8.75 కోట్లు, 7 మ్యాచ్‌ల్లో 60 పరుగులు, 3 వికట్లు), ఎనిమిదో ప్లేస్‌లో ఆర్సీబీ షాబాజ్ అహ్మద్ (2.4 కోట్లు, 8 మ్యాచ్‌ల్లో 42 పరుగులు, 0 వికెట్లు), 9వ స్థానంలో ముంబై ఇండియన్స్ జోఫ్రా ఆర్చర్ (8 కోట్లు, 3 మ్యాచ్‌ల్లో ఒక్క పరుగు, 2 వికెట్లు), 10లో కేకేఆర్ ఉమేశ్ యాదవ్ (2 కోట్లు, 8 మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్, 19 పరుగులు), 11వ స్థానంలో కేకేఆర్ లోకి ఫెర్గూసన్ (10 కోట్లు, 3 మ్యాచ్‌ల్లో 12.52 ఎకానమీతో ఒక్క వికెట్). వీరు కాక ఇంకా ఎవరైనా చెత్త ప్రదర్శన (కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా రాణించని వారు) చేసిన ఆటగాళ్లు ఉంటే కామెంట్ చేయండి. -
2.4 కోట్లు పెట్టి కొన్నారు.. గల్లీ క్రికెటర్ కంటే హీనం.. పైగా ఆల్‌రౌండరట..!
IPL 2023 RCB VS KKR: ఐపీఎల్ 2023లో ఆర్సీబీ ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. ఈ సీజన్లో అతనాడిన 8 మ్యాచ్‌ల్లో వికెట్లేమీ తీయకపోగా.. బ్యాటింగ్‌లో కేవలం 42 పరుగులు (10.50 సగటు, 107.69 స్ట్రయిక్ రేట్) మాత్రమే చేశాడు. ఈ సీజన్లో అతడి గణాంకాలు ఇలా ఉన్నాయి.. కేకేఆర్‌పై 1 (5), 0/25 (ఒక్క ఓవర్) ఢిల్లీపై 20 (12), 0/11 సీఎస్కేపై 12 (10) పంజాబ్‌పై 5 (3) రాజస్థాన్‌పై 2 (4) కేకేఆర్‌పై 2 (5), 0/6 ఈ దారుణ ప్రదర్శన నేపథ్యంలో షాబాజ్ అహ్మద్‌పై ఆర్సీబీ ఫ్యాన్స్ నిప్పులు చెరుగుతున్నారు. 2.4 కోట్లు పెట్టి కొన్నారు.. గల్లీ క్రికెటర్ల కంటే హీనంగా ఆడుతున్నాడంటూ పరుష పదజాలంతో దూషిస్తున్నారు. షాబజ్ను వెంటనే జట్టును తొలగించి, వేరే ఆటగాడిని రిక్రూట్ చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇతనితో పాటు దినేశ్ కార్తీక్‌ను కూడా వెంటనే జట్టు నుంచి తప్పించి, ప్రత్యామ్నాయ ఆటగాళ్లను ఎంపిక చేసుకోవాలని పట్టుబడుతున్నారు. లేకపోతే ఈ ఏడాది కూడా తాము టైటిల్ గెలవలేమని అంటున్నారు. కేకేఆర్‌తో నిన్న (ఏప్రిల్ 26) జరిగిన మ్యాచ్‌లో షాబాజ్ ప్రదర్శన (1 (5), 0/25 (1)) గురించి ప్రస్తావిస్తే.. ఇలాంటి మహత్తరమైన ఆల్‌రౌండర్‌ను తాము జీవితంలో చూడలేదని వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. బ్యాటింగ్ చేయడం ఎలాగూ రాదు, బౌలర్‌గా అయినా ఉపయోగపడతాడా అనుకుంటే, జేసన్ రాయ్ చేతిలో (ఒకే ఓవర్లో 4 సిక్సర్లు) బలైపోయాడని అంటున్నారు. చదవండి: #JasonRoy: 4 బంతుల్లో నాలుగు సిక్సర్లు.. షాబాజ్ అహ్మద్‌ను ఉతికారేశాడు మొత్తంగా షాబాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్‌ల కారణంగానే ఆర్సీబీ ఓటమిపాలవుతుందని మండిపడుతున్నారు. సొంత మైదానంలో వరుస ఓటములను జీర్ణించుకోలేక ఈ తరహా కామెంట్స్ చేస్తున్నారు. కాగా, హర్యానాకు చెందిన 29 ఏళ్ల షాబాజ్ అహ్మద్‌ను (లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆల్‌రౌండర్) 2023 ఐపీఎల్ వేలంలో ఆర్సీబీ 2.4 కోట్టు పెట్టి సొంతం చేసుకుంది. 2020 సీజన్లో ఐపీఎల్ అరంగ్రేటం (ఆర్సీబీ తరఫున, ధర 20 లక్షలు) చేసిన షాబాజ్.. ఇప్పటివరకు ఆడిన 37 మ్యాచ్‌ల్లో 321 పరుగులు చేసి 13 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో ఆర్సీబీపై కేకేఆర్ 21 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. జేసన్ రాయ్ (29 బంతుల్లో 56; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) నితీశ్ రాణా (21 బంతుల్లో 48), వెంకటేశ్ అయ్యర్ (26 బంతుల్లో 31) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసి ఓటమిపాలైంది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో డుప్లెసిస్ (17), మ్యాక్స్‌వెల్ (5) సహా అందరూ విఫలమయ్యారు. సిరాజ్ (4-0-33-1), హసరంగ (4-0-24-2), విరాట్ కోహ్లి (37 బంతుల్లో 54) పర్వాలేదనిపించారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3, సుయాశ్ శర్మ, ఆండ్రీ రసెల్ తలో 2 వికెట్లు పడగొట్టారు. చదవండి: ఫినిషర్ పాత్రకు న్యాయం చేయకపోగా పనికిమాలిన రికార్డు -
అవమాన భారంతో తలెత్తుకోలేకపోతున్న ఆర్సీబీ ఫ్యాన్స్.. డీకే, షాబాజ్‌పై ఫైర్
సొంత మైదానంలో పరాజయాల (లక్నో, సీఎస్కే, కేకేఆర్ చేతుల్లో) నేపథ్యంలో ఆర్సీబీ అభిమానులు తెగ ఫీలైపోతున్నారు. తమ ఆటగాళ్ల చెత్త ప్రదర్శన కారణంగా వారు తలెత్తుకోలుకపోతున్నారు. సొంత ఇలాకాలో ఇదేం కర్మ రా బాబు అనుకుంటూ అవమాన భారంతో కుంగిపోతున్నారు. సొంత జట్టుకే వ్యతిరేకంగా సోషల్‌మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. KGFను (కోహ్లి, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఫాప్ డుప్లెసిస్) మినహాయించి మిగతా ఆటగాళ్లందరిపై దుమ్మెత్తిపోస్తున్నారు. ముఖ్యంగా దినేశ్ కార్తీక్, షాబజ్ అహ్మద్‌లపై తారా స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. వీరి వల్లే ఆర్సీబీ విజయాలకు దూరమవుతుందని మండిపడుతున్నారు. వీరు సరిగ్గా ఆడకపోగా.. ఇతరులను కూడా భ్రష్ఠుపట్టిస్తున్నారని (రనౌట్లు, మిస్ ఫీల్డింగ్‌లు, క్యాచ్‌లు జారవిడచడం వంటివి) తూర్పారబెడుతున్నారు. నిన్న కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్ గురించి ప్రస్తావిస్తూ.. దినేశ్ కార్తీక్‌ను (18 బంతుల్లో 22, సుయాశ్ రనౌట్‌కు కారకుడు), షాబాజ్ అహ్మద్‌ను (5 బంతుల్లో 2, ఒకే ఓవర్లో 25 పరుగులు సమర్పించుకున్నాడు) పరుష పదజాలంతో దూషిస్తున్నారు. చదవండి: #JasonRoy: 4 బంతుల్లో నాలుగు సిక్సర్లు.. షాబాజ్ అహ్మద్‌ను ఉతికారేశాడు వీరి వల్లే తాము సొంత మైదానంలో తలెత్తుకోలేకపోతున్నామని వాపోతున్నారు. ఇక చాలు.. మీరు వెళ్లండ్రా బాబు అంటూ కామెంట్లు చేస్తున్నారు. హర్షల్ పటేల్, సుయాశ్ ప్రభుదేశాయ్, విజయ్ కుమార్ వైశాఖ్లు కూడా తమ ఆటతీరును మెరుగుపర్చుకోవాలని, లేకపోతే స్వచ్ఛందంగా జట్టును తప్పుకోవాలని సూచిస్తున్నారు. పనిలో పనిగా సరైన జట్టును (దేశీయ ఆటగాళ్లను) ఎంపిక చేసుకోలేదని ఫ్రాంచైజీ యాజమాన్యంపై మండిపడుతున్నారు. ఆ నలుగురిని (KGF, సిరాజ్) తప్పిస్తే, ఐపీఎల్ చరిత్రలో ఇంత బలహీనమైన జట్టే ఉండదని అంటున్నారు. కాగా, చిన్న స్వామి స్టేడియంలో (బెంగళూరు) కేకేఆర్‌తో నిన్న (ఏప్రిల్ 26) జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. సిరాజ్ (4-0-33-1), హసరంగ (4-0-24-2), విరాట్ కోహ్లి (37 బంతుల్లో 54) మినహాయించి ఆ జట్టు మూకుమ్మడిగా విఫలమై ఓటమిపాలైంది. చదవండి: #ViratKohli: అరుదైన ఘనత.. టి20 చరిత్రలో తొలి ఆటగాడిగా తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. జేసన్ రాయ్ (29 బంతుల్లో 56; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), నితీశ్ రాణా (21 బంతుల్లో 48), వెంకటేశ్ అయ్యర్ (26 బంతుల్లో 31) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసి, 21 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో డుప్లెసిస్ (17), మ్యాక్స్‌వెల్ (5) సహా అందరూ విఫలమయ్యారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3, సుయాశ్ శర్మ, ఆండ్రీ రసెల్ తలో 2 వికెట్లు పడగొట్టారు. చదవండి: 'ఓటమికి అర్హులం.. ఫీల్డింగ్ వైఫల్యం కొంపముంచింది' -
#JasonRoy: 4 బంతుల్లో నాలుగు సిక్సర్లు.. షాబాజ్ అహ్మద్‌ను ఉతికారేశాడు
ఐపీఎల్ 16వ సీజన్లో కేకేఆర్ ఓపెనర్ జేసన్ రాయ్ వరుసగా రెండో అర్థశతకం సాధించాడు. బుధవారం ఆర్సీబీతో మ్యాచ్‌లో ఆరంభం నుంచే ధాటిగా ఆడిన రాయ్ 22 బంతుల్లోనే అర్థశతకం మార్క్ అందుకున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. ఇక ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన షాబాజ్ అహ్మద్‌కు జేసన్ రాయ్ చుక్కలు చూపించాడు. ఆ ఓవర్లో నాలుగు సిక్సర్లు బాదిన రాయ్ 24 పరుగులు పిండుకొని ఉతికారేశాడు. ఇక మ్యాచ్‌లో 29 బంతుల్లో 56 పరుగులు చేసిన జేసన్ రాయ్ విజయ్‌కుమార్ వైశాక్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. Oh boy, this Roy can bat! 👏#RCBvKKR #TATAIPL #IPLonJioCinema #IPL2023 | @JasonRoy20 @KKRiders pic.twitter.com/QVYc2ZuZ2b — JioCinema (@JioCinema) April 26, 2023 చదవండి: Virat Kohli: చరిత్రకెక్కిన కోహ్లి.. 580 రోజుల తర్వాత -
టీమిండియాకు భారీ షాక్.. గాయంతో స్టార్ ప్లేయర్ ఔట్..!
India Tour Of Bangladesh 2022: బంగ్లాదేశ్ పర్యటనకు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. అందరూ ఊహించిన విధంగానే స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా జట్టుకు దూరం కానున్నాడని ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో ఓ కథనంలో పేర్కొంది. మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోని జడ్డూ.. బంగ్లాదేశ్‌తో వన్డే, టెస్ట్ సిరీస్‌లకు అందుబాటులో ఉండడని సదరు వెబ్సైట్ వెల్లడించింది. వన్డేల్లో జడేజా స్థానాన్ని షాబాజ్ అహ్మద్, టెస్ట్‌ల్లో సౌరభ్ కుమార్ భర్తీ చేసే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఈ విషయంపై బీసీసీఐ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. Sourabh Kumar likely to replace Ravindra Jadeja in the Bangladesh Test Series. Shahbaz Ahmed to replace Jadeja in the ODI series. (Reported by EspnCricinfo). — Mufaddal Vohra (@mufaddal_vohra) November 23, 2022 కాగా, గాయపడిన జడ్డూ స్థానంపై ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్‌లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జడేజా స్థానాన్ని మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ భర్తీ చేస్తాడని అభిమానులు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న సూర్య.. బంగ్లా సిరీస్‌లో టెస్ట్ అరంగేట్రం చేయడం ఖాయమని పందెలు సైతం కాస్తున్నారు. అయితే, తాత్కాలిక సెలెక్షన్ కమిటీ మాత్రం ఆల్‌రౌండర్ సౌరభ్ కుమార్ పేరునే పరిశీలస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రవీంద్ర జడేజా.. బంగ్లాదేశ్ టూర్‌కు అందుబాటులో ఉండకపోవడంపై మరో ప్రచారం కూడా నడుస్తుంది. జడేజా భార్య రివాబా జడేజా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది కాబట్టి, కావాలనే జడ్డూ గాయాన్ని బూచిగా చూపించి బంగ్లా టూర్ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నాడని అనుకుంటున్నారు. గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 1, 5 తేదీల్లో జరుగనుండగా.. బంగ్లాదేశ్ సిరీస్ డిసెంబర్ 4న మొదలుకానున్న విషయం తెలిసిందే. -
'ఏదైనా సాధిస్తేనే ఇంటికి రా..'
మనిషిగా పుట్టిన మనం ఏదైనా సాధిస్తేనే ఆ జన్మకు ఒక పరిపూర్ణత వస్తుందంటారు పెద్దలు. తాము ఏదో సాధించాలని అందరూ ఆ లక్ష్యం దిశగానే అడుగులు వేస్తారు.. కానీ కొందరే సక్సెస్ అవుతారు. ఆ కోవకు చెందినవాడే టీమిండియా క్రికెటర్ షాబాజ్ అహ్మద్. మనం ఎందరో క్రికెటర్లనూ చూశాం. సచిన్ నుంచి కోహ్లి వరకు, యువరాజ్ నుంచి ధోని వరకు.. ఇలా చెప్పుకుంటే పోతే చాలా మంది ఉన్నారు. కానీ ఎవరి నేపథ్యం వారిది. అయితే షాబాజ్ అహ్మద్ కథ వేరుగా ఉంటుంది. క్రికెట్‌పై ప్రేమతో ఇంజనీరింగ్‌ను మధ్యలోనే వదిలేసిన షాబాజ్ అహ్మద్ తండ్రి కోపానికి బలయ్యాడు. ''ఏదైనా సాధించిన తర్వాతే ఇంటికి తిరిగిరా.. ఏం చేయకపోతే నువ్వేమైపోయావన్న సంగతి కూడా మాకు తెలియకూడదు'' అంటూ హుకుం జారీ చేశాడు. -సాక్షి, వెబ్‌డెస్క్ తండ్రి మాటలను సీరియస్‌గా తీసుకున్న షాబాజ్ అహ్మద్ ఇవాళ క్రికెటర్‌గా ఎదిగిన వైనం అందరిని ఆకట్టుకుంటుంది. తాజాగా దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో భాగంగా రెండో వన్డేలో షాబాజ్ అహ్మద్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఆడుతున్న తొలి వన్డేలోనే ఈ ఆల్‌రౌండర్ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. తన 10 ఓవర్ల కోటాలో షాబాజ్ అహ్మద్ 54 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. అయితే షాబాజ్ అహ్మద్ అంత ఈజీగా క్రికెటర్ కాలేదు. అందుకోసం ఎంతో కష్టపడ్డాడు. జీవితంలో ఎన్నో ఓడిదుడుకులు ఎదుర్కొన్నాడు. షాబాజ్ అహ్మద్ మొదట చదువు కొనసాగిస్తూనే క్రికెట్‌పై దృష్టి సారించేవాడు. అయితే రెండింటిపై పూర్తిస్థాయిలో దృష్టిని కేంద్రీకరించలేకపోయాడు. దీంతో ఇంజనీరింగ్‌ను మధ్యలోనే వదిలేశాడు. ఆపై హరియాణా నుంచి కోల్‌కతాకు మకాం మార్చాడు. అలా రంజీ క్రికెటర్‌గా కెరీర్‌ను ఆరంభించిన షాబాజ్ అహ్మద్ ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చాడు. తాజాగా టీమిండియాకు ఆడే స్థాయికి ఎదిగాడు. ఇక షాబాజ్ టీమిండియాకు ఆడడంపై తండ్రి అహ్మద్ జాన్, తల్లి అబ్నమ్ సంతోషం వ్యక్తం చేశారు. ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో అహ్మద్ జాన్ మాట్లాడుతూ..''షాబాజ్ అహ్మద్ చదువును మధ్యలోనే వదిలేసి కోల్‌కతాకు వెళ్లడం నాకు ఇష్టం లేదు. అందుకే ఏదైనా సాధించు.. అప్పటివరకు ఇంటిముఖం చూడకు'' అంటూ హెచ్చరించాను. ఇవాళ వాడు అనుకున్నది సాధించాడు. నేను స్ట్రిక్ట్‌గా ఉండకపోయుంటే ఈరోజు మా ఇంట్లో ఒక క్రికెటర్‌ను చూసేవాడిని కాను అని పేర్కొన్నాడు. షాబాజ్ అహ్మద్ చదువును మధ్యలో వదిలేసినప్పుడు అప్పటి ప్రొఫెసర్ఘీ విధంగా స్పందించాడు. అతను మంచి విద్యార్థే కానీ తప్పు నిర్ణయం తీసుకున్నాడు అని పేర్కొన్నారు. దీనిపై షాబాజ్ స్పందిస్తూ.. ఏదో ఒకరోజు నాకు డిగ్రీ పట్టాను ఇచ్చి సత్కరిస్తారు అని ధీమా వ్యక్తం చేశాడు. ''నా కొడుకు ఆరోజు అన్న మాటలు నిజమయ్యాయి.. ఇవాళ వాడికి డిగ్రీ ఇచ్చి ఘనంగా సత్కరించారు'' అంటూ తల్లి అబ్నమ్ సంతోషంతో పేర్కొంది. చదవండి: క్రికెట్లో అరుదైన ఘటన.. నోరెళ్లబెట్టడం ఖాయం! -
అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టిన షాబాజ్ అహ్మద్
రాంఛీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 1-1 టీమిండియా సమం చేసింది. ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ (111 బంతుల్లో 113 నాటౌట్; 15 ఫోర్లు) అజేయ శతకం సాధించగా.. ఇషాన్ కిషన్(84 బంతుల్లో 93; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కాగా ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన టీమిండియా ఆల్ రౌండర్ షాబాజ్ ఆహ్మద్ తన ప్రదర్శనతో అందరినీ అకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తన 10 ఓవర్ల బౌలింగ్ కోటాలో.. 54 పరుగులు ఇచ్చి ఓ కీలక వికెట్ ఆహ్మద్ పడగొట్టాడు. అదే విధంగా దక్షిణాప్రికా బ్యాటర్ రెజా హెండ్రిక్స్‌ను అద్భుతమైన క్యాచ్‌తో షాబాజ్ పెవిలియన్‌కు పంపాడు. Maiden International wicket for Shahbaz Ahmed, so happy for him. pic.twitter.com/eqjzABB9Fl — Johns. (@CricCrazyJohns) October 9, 2022 అయితే అప్పటికే మార్క్రమ్, హెండ్రిక్స్ దక్షిణాఫ్రికా స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. ఈ క్రమంలో తన సంచలన క్యాచ్‌తో షాబాజ్ఈ కీలక భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు. కాగా అరంగేట్ర మ్యాచ్‌లోనే అకట్టుకున్న షబాజ్ను సోషల్ మీడియా వేదికగా అభిమానులు ప్రశంసిస్తున్నారు. అంతకుముందు ధావన్ చేతులు మీదగా షబాజ్ టీమిండియా క్యాప్‌ను అందుకున్నాడు. ఇక సిరీస్ డిసైడ్ చేసే మూడో వన్డే ఇరు జట్ల మధ్య ఆక్టోబర్ 11న ఢిల్లీ వేదికగా జరగనుంది. 🎥 A moment to cherish for Shahbaz Ahmed as he makes his debut in international cricket. 👏 👏 Go well! 👍 👍 Follow the match ▶️ https://t.co/6pFItKAJW7 #TeamIndia | #INDvSA pic.twitter.com/Jn9uU5fYXc — BCCI (@BCCI) October 9, 2022 All the best Shahbaz Ahmed for great international career. Straight away into the action by bowling in power play and got his maiden ODI wicket. — Rashid (@Rash_sf) October 9, 2022 చదవండి: IND vs SA 2nd ODI: సెంచరీతో చెలరేగిన శ్రేయస్.. దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం -
షమీ అవుట్: జట్టులోకి ఉమేశ్ యాదవ్.. అయ్యర్, అహ్మద్ కూడా: బీసీసీఐ
South Africa tour of India, 2022 T20 Series - India Updated Squad: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ నేపథ్యంలో ఉమేశ్ యాదవ్ భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. పేసర్ మహ్మద్ షమీ కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకోని నేపథ్యంలో అతడి స్థానాన్ని ఉమేశ్‌తో భర్తీ చేసినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి పేర్కొంది. హుడా కూడా అవుట్ అదే విధంగా వెన్నునొప్పితో దూరమైన దీపక్ హుడా స్థానంలో శ్రేయస్ అయ్యర్ జట్టులోకి రానున్నట్లు తెలిపింది. ఇక స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ సిరీస్‌కు దూరంగా ఉన్న నేపథ్యంలో యువ ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ టీ20 జట్టులోకి వచ్చినట్లు తెలిపింది. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేసింది. ఇక హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ జాతీయ క్రికెట్ అకాడమీకి చేరుకోనున్నట్లు తెలిపింది. కాగా తిరువనంతపురం వేదికగా బుధవారం టీమిండియా- సౌతాఫ్రికా మధ్య మొదటి టీ20తో మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరు జట్లు అక్కడికి చేరుకున్నాయి. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు(అప్డేట్): రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, దినేశ్ కార్తిక్, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, దీపక్ చహర్, జస్ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, షాబాజ్ అహ్మద్. చదవండి: Ind Vs SA 1st T20: అతడు లేని జట్టు బలహీనం.. టీమిండియా ఓడిపోతుంది: భారత మాజీ క్రికెటర్ Irfan Pathan: 'ధోని వల్లే కెరీర్ నాశనమైంది'.. ఇర్ఫాన్ పఠాన్ అదిరిపోయే రిప్లై GAME DAY 💪🏻💪🏻 All set for the first T20I in Thiruvananthapuram#TeamIndia | #INDvSA pic.twitter.com/DAb2lks2Ry — BCCI (@BCCI) September 28, 2022 -
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. హార్దిక్ దూరం.. యువ ఆల్‌రౌండర్‌కు చోటు!
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో రేపటి నుంచి జరగాల్సిన మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొనేందుకు ముందుగా ఎంపిక చేసిన భారత జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో ఆడిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం విశ్రాంతి ఇవ్వగా... దీపక్ హుడా వెన్నెముక గాయంతో దూరమయ్యాడు. కరోనా నుంచి ఇంకా కోలుకోకపోవడంతో మొహమ్మద్ షమీ దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు అందుబాటు ఉండటంలేదు. హార్దిక్ పాండ్యా స్థానంలో బెంగాల్ ఆల్‌రౌండర్ షహబాజ్ అహ్మద్‌ను, దీపక్ హుడా స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ఎంపిక చేశారు. 27 ఏళ్ల షహబాజ్ అహ్మద్ ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున నిలకడగా రాణించిన ఆకట్టుకున్నాడు. షహబాజ్ 16 మ్యాచ్‌లు ఆడి 219 పరుగులు సాధించి నాలుగు వికెట్లు తీశాడు. బుధవారం తిరువనంతపురంలో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టి20 మ్యాచ్ జరగనుంది. మరోవైపు అక్టోబర్ 1 నుంచి 5 వరకు రాజ్‌కోట్‌లో జరిగే ఇరానీ కప్ మ్యాచ్‌లో సౌరాష్ట్రతో పోటీపడే రెస్టాఫ్ ఇండియా జట్టుకు ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారి కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. చదవండి: IND vs SA: టీమిండియాకు నిరసన సెగ.. సంజూ అభిమానుల ఆందోళన -
టీమ్ఇండియాలో మరో మార్పు !
-
Ind Vs Zim: జింబాబ్వే పర్యటనలో టీమిండియా.. పూర్తి షెడ్యూల్, జట్ల వివరాలు.. ఇంకా
India Vs Zimbabwe ODI Series: స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో సిరీస్‌ల కంటే ముందు టీమిండియా జింబాబ్వేలో పర్యటించనుంది. ఈ క్రమంలో ఇప్పటికే అక్కడికి చేరుకున్న కేఎల్ రాహుల్ సేన మూడు వన్డేలు ఆడనుంది. భారత క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ మార్గదర్శనంలో ‘పసికూన’తో పోరుకు సిద్ధమవుతోంది. కాగా ఆసియా కప్-2022 టోర్నీ సమీపిస్తున్న తరుణంలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి సహా పలువురు కీలక ఆటగాళ్లకు బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. They are here now . . . 🇮🇳 have just landed in Harare ahead of the three-match ODI series against 🇿🇼 scheduled for 18, 20 and 22 August at Harare Sports Club #WelcomeIndia | #ZIMvIND | #VisitZimbabwe pic.twitter.com/lViHCYPSPL — Zimbabwe Cricket (@ZimCricketv) August 13, 2022 దీంతో తొలుత వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ను తొలుత ఈ జట్టుకు సారథిగా ఎంపిక చేశారు. అయితే, పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయం నుంచి కోలుకోవడంతో ధావన్‌ను తప్పించి అతడికి కెప్టెన్సీ అప్పగించారు. ఇక గాయం కారణంగా వాషింగ్టన్ సుందర్ దూరం కావడంతో అతడి స్థానాన్ని షాబాజ్ అహ్మద్‌తో భర్తీ చేస్తున్నట్లు బీసీసీఐ మంగళవారం వెల్లడించింది. UPDATE - Shahbaz Ahmed replaces injured Washington Sundar for Zimbabwe series. More details here - https://t.co/Iw3yuLeBYy #ZIMvIND — BCCI (@BCCI) August 16, 2022 మరోవైపు.. బంగ్లాదేశ్‌ను స్వదేశంలో టీ20, వన్డే సిరీస్‌లలో 2-1తో ఓడించి జింబాబ్వే ఆత్మవిశ్వాసంతో ఉంది. అయితే, రెగ్యులర్ కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో చకబ్వా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. Zimbabwe name squad for ODI series against India Details 👇https://t.co/cDteJIV5AZ pic.twitter.com/5tm3ecV9e2 — Zimbabwe Cricket (@ZimCricketv) August 11, 2022 మరి టీమిండియా జింబాబ్వే టూర్ నేపథ్యంలో పూర్తి షెడ్యూల్, మ్యాచ్ ప్రసార సమయం, వేదిక, ఇరు జట్ల వివరాలు తదితర అంశాలు గమనిద్దాం. జింబాబ్వే వర్సెస్ భారత్ వన్డే సిరీస్- మూడు మ్యాచ్‌లు ►షెడ్యూల్-వేదిక ►మొదటి వన్డే- ఆగష్టు 18- గురువారం- హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే ►రెండో వన్డే- ఆగష్టు 20- శనివారం-హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే ►మూడో వన్డే- ఆగష్టు 22- సోమవారం- హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే మ్యాచ్ ప్రసార సమయం ►భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.45 గంటలకు టీమిండియా- జింబాబ్వే మధ్య వన్డే మ్యాచ్‌లు ఆరంభం ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే! ►భారత్‌లో సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో లైవ్ టెలికాస్ట్. సోనీలివ్‌లో లైవ్ స్ట్రీమింగ్. ►జింబాబ్వేలో సూపర్‌స్పోర్ట్ టీవీలో ప్రసారం. జింబాబ్వే పర్యటనలో భారత జట్టు: ►కేఎల్ రాహుల్(కెప్టెన్), శిఖర్ ధావన్(వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుబ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, షాబాజ్ అహ్మద్, అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఆవేశ్ ఖాన్, ప్రసిద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, దీపక్ చహర్. జింబాబ్వే జట్టు: రెగిస్ చకబ్వా (కెప్టెన్), తనకా చివాంగా, బ్రాడ్లీ ఎవాన్స్, ల్యూక్ జోంగ్వే, ర్యాన్ బర్ల్, ఇన్నోసెంట్ కైయా, కైటానో టకుడ్జ్వానాషే, క్లైవ్ మడాండే, వెస్లీ మాధేవెరే, తాడివానాషే మారుమని, జాన్ మసారా, టోనీ మున్యోంగా, రిచర్డ్‌టర్ న్గార్వా, సికిందర్ రజా, మిల్టన్ షుంబా, డోనాల్డ్ తిరిపానో, విక్టర్ నయౌచి. చదవండి: IND Vs ZIM: జింబాబ్వే కదా అని తీసిపారేయొద్దు.. ఆ ముగ్గురితో జాగ్రత్త Kevin Obrien: ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించి.. పాకిస్తాన్‌పై సెంచరీతో మెరిసి! కెవిన్ అరుదైన ఘనతలు! -
సుందర్ స్థానాన్ని భర్తీ చేయనున్న ఆర్సీబీ ఆల్‌రౌండర్
టీమిండియా.. జింబాబ్వే పర్యటనకు ఎంపికై, గాయం కారణంగా జట్టుకు దూరమైన స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానాన్ని భారత సెలెక్షన్ కమిటీ మరో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌తో భర్తీ చేసింది. సుందర్ స్థానంలో ఆర్సీబీ ఆల్‌రౌండర్, బెంగాల్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ షాబాజ్ నదీమ్ జింబాబ్వే పర్యటనకు బయల్దేరనున్నట్లు సెలెక్షన్ కమిటీ మంగళవారం ప్రకటించింది. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున ఓ మోస్తరు ప్రదర్శన చేస్తున్న షాబాజ్.. టీమిండియా తరఫున ఎంట్రీ కోసం ఎదురుచూస్తుంగా, ఊహించని అవకాశం అతని తలుపు తట్టింది. షాబాజ్.. ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున 29 మ్యాచ్‌ల్లో 118 స్ట్రయిక్ రేట్‌తో 279 పరుగులు, 8.58 ఎకానమీతో 13 వికెట్లు పడగొట్టాడు. షాబాజ్‌కు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో మంచి రికార్డే ఉంది. బ్యాటింగ్‌లో 3 శతకాలు, 10 అర్ధశతకాలు.. బౌలింగ్‌లో 7/57 అత్యుత్తమ ప్రదర్శనతో 100కు పైగా వికెట్లు సాధించాడు. ఇందులో 2 ఐదు వికెట్ల ఘనతలు కూడా ఉన్నాయి. కాగా, వాషింగ్టన్ సుందర్ ఇంగ్లండ్ దేశవాళీ క్రికెట్ ఆడుతూ గాయపడ్డ విషయం తెలిసిందే. రాయల్ లండన్ వన్డే కప్‌లో లాంకషైర్ తరఫున ఆడుతున్న సుందర్.. ఈ నెల 10న వోర్సస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో క్యాచ్ పట్టేందుకు డైవ్ చేసినప్పుడు ఎడమ భుజానికి తీవ్ర గాయమైంది. నొప్పితో అతను ఉన్నపళంగా మైదానాన్ని వీడాడు. చదవండి: అనుకున్నదే అయ్యింది.. జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం..! -
షాబాజ్ అహ్మద్.. సివిల్ ఇంజనీర్ నుంచి క్రికెటర్ దాకా
ఐపీఎల్ 2021లో భాగంగా రాజస్తాన్ రాయల్స్, ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్ గుర్తుంది కదా. ఆ మ్యాచ్‌లో లక్ష్యచేధనలో బెంగళూరు 87 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలుచుంది. ఈ దశలో దినేశ్ కార్తిక్(23 బంతుల్లో 44, 7 ఫోర్లు, 1 సిక్సర్) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను టర్న్ చేయడమే గాక ఆఖరిదాకా నిలిచి జట్టును గెలిపించాడు. అయితే కార్తిక్ ఇన్నింగ్స్ ఎంత కీలకమో షాబాజ్ అహ్మద్ ఆడిన ఇన్నింగ్స్‌కు అంతే ప్రాముఖ్యత ఉంటుంది. 26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో షాబాజ్ 45 పరుగులు చేశాడు. అయితే కార్తిక్ విధ్వంసకర ఇన్నింగ్స్‌పై అంతా ప్రశంసలు కురిపించారు. కానీ సరైన సహకారం ఉంటేనే ఏ బ్యాట్స్‌మన్ అయినా జట్టును గెలిపించగలడు.ఆ సహకారం పేరే షాబాజ్ అహ్మద్. 21 ఏళ్ల ఈ కుర్రాడు రాజస్తాన్ బౌలర్లను ఎదుర్కొన్న తీరు అద్భుతమనే చెప్పొచ్చు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే బ్యాట్స్‌మన్ ఎప్పటికి గుర్తుండిపోతాడు. ఆ జాబితాలో షాబాజ్ అహ్మద్ చేరిపోయాడు. ►షాబాజ్ అహ్మద్ పశ్చిమబంగలోని కోల్‌కతా నగరం అతని నివాసం ►ఐపీఎల్ ఆడడం అతని కెరీర్లో ఇది మూడోసారి. ►ప్రస్తుతం ఒక ప్రైవేటు యునివర్సిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ►బెంగాల్ రంజీ ట్రోఫీలో ప్రస్తుతం షాబాజ్ అహ్మద్ ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. ►చిన్నప్పుడు ఇంజనీర్ కావాలనుకున్న షాబాజ్ అహ్మద్.. తన స్నేహితులతో కలిసి స్కూల్ ఎగ్గొట్టి రంజీ మ్యాచ్‌లు చూసేందుకు వెళ్లేవాడు. అలా అతను క్రికెట్‌పై మక్కువ పెంచుకున్నాడు. ►2018-19 విజయ్ హజారే ట్రోఫీ ద్వారా దేశవాలీ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ► 2020లో తొలిసారి ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున బరిలోకి దిగాడు. ఆ సీజన్లో రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ►గత ఫిబ్రవరిలో జరిగిన మెగావేలంలో షాబాజ్ అహ్మద్‌ను మరోసారి ఆర్సీబీ కొనుగోలు చేసింది. చదవండి: Dinesh Karthik: వారెవ్వా కార్తిక్.. మరో 'నిదహాస్'ను తలపించావు Shikar Dhawan: 'లవ్ ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసింది.. కోహినూర్ డైమండ్‌ను మిస్సయ్యావు!' -
IPL 2022: శభాష్ షహబాజ్... సూపర్ కార్తీక్.. భళా ఆర్సీబీ!
IPL 2022 RCB Vs RR- Shahbaz, Dinesh Karthik- ముంబై: 170 పరుగుల ఛేదనలో బెంగళూరు స్కోరు ఒకదశలో 87/5... మరో 45 బంతుల్లో 83 పరుగులు చేయాలి... ఐపీఎల్లో పెద్దగా అనుభవం లేని షహబాజ్ అహ్మద్, చాలా కాలంగా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వని దినేశ్ కార్తీక్ క్రీజ్‌లో ఉన్నారు. దాంతో ఆర్సీబీ విజయంపై అంతా అపనమ్మకం! అయితే వీరిద్దరు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ చెలరేగారు. 33 బంతుల్లోనే 67 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. మంగళవారం జరిగిన పోరులో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (47 బంతుల్లో 70 నాటౌట్; 6 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా, హెట్‌మైర్ (31 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), పడిక్కల్ (29 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. బట్లర్, హెట్‌మైర్ నాలుగో వికెట్‌కు 51 బంతుల్లో అభేద్యంగా 83 పరుగులు జోడించారు. అనంతరం బెంగళూరు 19.1 ఓవర్లలో 6 వికెట్లకు 173 పరుగులు చేసింది. షహబాజ్ అహ్మద్ (26 బంతుల్లో 45; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), దినేశ్ కార్తీక్ (23 బం తుల్లో 44 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) మెరిశారు. చివర్లో దూకుడు... ఓపెనర్‌గా వచ్చి చివరి వరకు క్రీజ్‌లో ఉన్నా బట్లర్ ఆడింది 47 బంతులే... బట్లర్ ఎంత బలంగా కొట్టినా బంతి ఫీల్డర్లను దాటలేదు, ఫలితంగా ఒక్క ఫోర్ కూడా లేదు... రెండు సార్లు క్యాచ్‌లు మిస్! బ్యాటింగ్‌కు అసలు ఏమాత్రం అనుకూలించని పిచ్‌పై నిర్లక్ష్యంగా ఆడి వికెట్ పారేయకుండా బట్లర్ పట్టుదలగా నిలవడం వల్లే జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. కొద్దిసేపు పడిక్కల్, చివర్లో హెట్‌మైర్ అతనికి అండగా నిలిచి ఇన్నింగ్స్‌లో కీలకపాత్ర పోషించారు. కీలక సమయంలో రెండు లైఫ్‌లు బట్లర్ నిలదొక్కుకునేలా చేశాయి. 10 పరుగుల వద్ద ఆకాశ్ దీప్ రిటర్న్ క్యాచ్ వదిలేయగా, 11 పరుగుల వద్ద విల్లీ అంచనా తప్పి క్యాచ్ పట్టుకోవడంలో విఫలమయ్యాడు. బట్లర్, పడిక్కల్ రెండో వికెట్‌కు 49 బంతుల్లో 70 పరుగులు జోడించగా, సామ్సన్ (8) ప్రభావం చూపలేకపోయాడు. 18 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 127 పరుగులు. అయితే చివరి 2 ఓవర్లలో 42 పరుగులతో రాయల్స్ పండగ చేసుకుంది. సిరాజ్ వేసిన 19వ ఓవర్లో బట్లర్ 2 సిక్స్‌లు సహా 19 పరుగులు రాగా, ఆకాశ్ దీప్ వేసిన 20వ ఓవర్లో బట్లర్ రెండు, హెట్‌మైర్ ఒక సిక్స్ బాదడంతో మొత్తం 23 పరుగులు వచ్చాయి. కోహ్లి రనౌట్... ఛేదనలో ఆర్సీబీకి సరైన ఆరంభం లభించింది. డుప్లెసిస్ (20 బంతుల్లో 29; 5 ఫోర్లు), రావత్ (25 బంతుల్లో 26; 4 ఫోర్లు) వేగంగా పరుగులు రాబట్టడంతో పవర్‌ప్లేలో స్కోరు 48 పరుగులకు చేరింది. ఒకదశలో వీరిద్దరు ఏడు బంతుల వ్యవధిలో ఐదు ఫోర్లు కొట్టారు. అయితే చహల్ తన తొలి ఓవర్లోనే డుప్లెసిస్‌ను అవుట్ చేసి రాయల్స్‌కు మొదటి వికెట్ అందించాడు. ఆ తర్వాత బెంగళూరు పరుగు వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది. అనవసరపు సింగిల్‌కు ప్రయత్నించి కోహ్లి (5) అనూహ్యంగా రనౌట్ కాగా, తర్వాతి బంతికే విల్లీ (0) వెనుదిరిగాడు. రూథర్‌ఫర్డ్ (5) కూడా విఫలం కావడంతో ఆర్సీబీ 87 పరుగులకు సగం వికెట్లు కోల్పోయింది. బెంగళూరు ఆశలు కోల్పోయిన ఈ స్థితిలో షహబాజ్, కార్తీక్ భాగస్వామ్యం ఒక్కసారిగా మ్యాచ్‌ను మలుపు తిప్పింది. వీరిద్దరి దూకుడైన ఆటతో ఆర్సీబీ విజయం దిశగా దూసుకుపోయింది. అశ్విన్ ఓవర్లో 3 ఫోర్లు, సిక్స్‌తో కార్తీక్ జోరు మొదలు పెట్టగా, ప్రసిధ్ బౌలింగ్‌లో షహబాజ్ ఫోర్, సిక్స్ బాదాడు. బౌల్ట్ ఓవర్లోనూ మరో ఫోర్, సిక్స్ తో చెలరేగిన షహబాజ్ అదే ఓవర్లో అవుటైనా... కార్తీక్ నిలబడి బెంగళూరును గెలిపించాడు. చదవండి: Ravi Shastri: "అతడు యార్కర్ల కింగ్.. ప్రపంచకప్‌లో అతడి సేవలను కోల్పోయాం" What a sensational win! 👌 👌 Second victory on the bounce & 2⃣ more points in the bag for @RCBTweets as they beat #RR by 4⃣ wickets. 👏 👏 Scorecard ▶️ https://t.co/mANeRaZc3i #TATAIPL | #RRvRCB pic.twitter.com/VJMRJ1fhtP — IndianPremierLeague (@IPL) April 5, 2022 -
పాక్ హాకీ సెక్రటరీగా షెహజాద్ అహ్మద్
కరాచీ : పాకిస్తాన్ హాకీ సమాఖ్య సెక్రటరీగా పాక్ దిగ్గజ ఆటగాడు షెహజాద్ అహ్మద్ ను నియమించారు. హాకీ వరల్డ్ కప్ గెలిచిన పాక్ జట్టు కెప్టెన్ గానూ ఆయన ప్రసిద్ధి. అయితే ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాక, అతడు పాక్ హాకీకి చాలా దూరంగా ఉన్నాడు. హాకీ సమాఖ్య మాజీ అధ్యక్షుడు ఖాలీద్ ఈజాజ్ చౌదరి ఈ నియామకాన్ని అధికారికంగా ప్రకటించాడు. అతడు మూడేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకున్నాడని వెల్లడించాడు. ఇప్పటివరకు సెక్రటరీగా ఉన్న రాణా ముజాహిద్ 2013 డిసెంబర్ నుంచి జట్టుకు సేవలందిస్తున్న విషయం విదితమే. ప్రస్తుతం కోల్కర్ హాకీ అధ్యక్షుడిగా కొనసాగతున్నారు.