IND Vs SA 2nd ODI: Fans Wish Shahbaz Ahmed All The Best For His Debut In Second ODI Against South Africa - Sakshi
Sakshi News home page

IND vs SA: అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టిన షాబాజ్ అహ్మద్

Published Mon, Oct 10 2022 8:05 AM | Last Updated on Mon, Oct 10 2022 9:32 AM

Fans wish Shahbaz Ahmed all the best for his debut in Ranchi ODI - Sakshi

రాంఛీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో భారత్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 1-1 టీమిండియా సమం చేసింది. ఈ మ్యాచ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ (111 బంతుల్లో 113 నాటౌట్‌; 15 ఫోర్లు) అజేయ శతకం సాధించగా.. ఇషాన్‌ కిషన్‌(84 బంతుల్లో 93; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

కాగా ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన టీమిండియా ఆల్‌ రౌండర్‌ షాబాజ్‌ ఆహ్మద్‌ తన ప్రదర్శనతో అందరినీ అకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తన 10 ఓవర్ల బౌలింగ్‌ కోటాలో.. 54 పరుగులు ఇచ్చి ఓ కీలక వికెట్‌ ఆహ్మద్‌ పడగొట్టాడు. అదే విధంగా దక్షిణాప్రికా బ్యాటర్‌ రెజా హెండ్రిక్స్‌ను అద్భుతమైన ‍క్యాచ్‌తో షాబాజ్‌ పెవిలియన్‌కు పంపాడు.

అయితే అప్పటికే మార్‌క్రమ్‌, హెండ్రిక్స్‌ దక్షిణాఫ్రికా స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. ఈ క్రమంలో తన సంచలన క్యాచ్‌తో షాబాజ్‌ఈ కీలక భాగస్వామ్యాన్ని బ్రేక్‌ చేశాడు. కాగా అరంగేట్ర మ్యాచ్‌లోనే అకట్టుకున్న షబాజ్‌ను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులు ప్రశంసిస్తున్నారు. అంతకుముందు ధావన్‌ చేతులు మీదగా షబాజ్‌ టీమిండియా క్యాప్‌ను అందుకున్నాడు.  ఇక సిరీస్‌ డిసైడ్‌ చేసే మూడో వన్డే ఇరు జట్ల మధ్య ఆక్టోబర్‌ 11న ఢిల్లీ వేదికగా జరగనుంది.


చదవండి: IND vs SA 2nd ODI: సెంచరీతో చెలరేగిన శ్రేయస్‌.. దక్షిణాఫ్రికాపై భారత్‌ ఘన విజయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement