జొహనెస్‌బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో ఇవాళ (నవంబర్ 15) జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఎలాంటి మార్పులు చేయలేదు. మూడో టీ20లో ఆడిన జట్లనే యధాతథంగా బరిలోకి దించుతున్నాయి. నాలుగు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.
తుది జట్లు..
భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(వికెట్‌కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి
దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్, రీజా హెండ్రిక్స్, ఎయిడెన్ మార్క్రమ్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్‌కీపర్), డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, ఆండిల్ సైమ్‌లేన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, లూథో సిపమ్లా
Comments
Please login to add a commentAdd a comment