సెంచూరియన్ వేదికగా టీమిండియాతో ఇవాళ (నవంబర్ 13) జరుగుతున్న మూడో టీ20లో సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెరో మార్పు చేశాయి. భారత్ తరఫున ఆవేశ్ ఖాన్ స్థానంలో రమణ్‌దీప్ సింగ్ ఎంట్రీ ఇచ్చాడు. రమణ్‌దీప్‌కు ఇది డెబ్యూ మ్యాచ్.
సౌతాఫ్రికా తరఫున న్కాబయోమ్జి పీటర్ స్థానంలో లూథో సిపమ్లా తుది జట్టులోకి వచ్చాడు. ఈ సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన అభిషేక్ శర్మకు మరో అవకాశం ఇచ్చింది టీమిండియా మేనేజ్మెంట్. కాగా, నాలుగు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారత్.. రెండో మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలుపొందిన విషయం తెలిసిందే.
తుది జట్లు..
భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(వికెట్‌కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి
దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్, రీజా హెండ్రిక్స్, ఎయిడెన్ మార్క్రమ్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్‌కీపర్), డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, ఆండిల్ సైమ్‌లేన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, లూథో సిపమ్లా
Comments
Please login to add a commentAdd a comment