గెబెర్హాలో వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. సఫారీ బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేసి భారత బ్యాటర్లను కట్టడి చేశారు. సఫారీ బౌలర్లలో మార్కో జన్సెన్, గెరాల్డ్ కొయెట్జీ, అండైల్ సైమ్‌లేన్, ఎయిడెన్ మార్క్రమ్, ఎన్ పీటర్ పొదుపుగా బౌలింగ్ చేసి తలో వికెట్ పడగొట్టారు.
ఈ మ్యాచ్‌లో టీమిండియా ఐదు పరుగులకే ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ వికెట్లు కోల్పోయింది. గత రెండు టీ20ల్లో సెంచరీలు చేసిన సంజూ మూడు బంతులు ఆడి డకౌట్ కాగా.. అభిషేక్ శర్మ (5 బంతుల్లో 4) తన వైఫల్యాల పరంపరను కొనసాగించాడు. ఆతర్వాత బ్యాటింగ్‌కు దిగిన సూర్యకుమార్ యాదవ్ కూడా పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డాడు. స్కై 9 బంతుల్లో కేవలం 4 పరుగులు చేసి ఔటయ్యాడు.
ఆతర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్ వర్మ (20), అక్షర్ పటేల్ (27) క్రీజ్‌లో ఉన్నంత సేపు ధాటిగా ఆడారు. తిలక్ వర్మను డేవిడ్ మిల్లర్ అద్బుతమైన క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపగా.. అక్షర్ పటేల్.. హార్దిక్ ఆడిన రిటర్న్ షాట్ కారణంగా రనౌటయ్యాడు. ఆతర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన హార్దిక్ చాలా నిదానంగా ఆడి 45 బంతుల్లో 4 బౌండీరలు, సిక్సర్ సాయంతో 39 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రింకూ సింగ్ తొమ్మిది పరుగులు చేసి ఔట్ కాగా.. అర్షదీప్ సింగ్ 7 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఈ మ్యాచ్‌లో హార్దిక్ కాస్త వేగంగా ఆడి ఉంటే భారత్ మరింత మెరుగైన స్కోర్ చేసేది. ఇన్నింగ్స్ ఆఖర్లో హార్దిక్ స్ట్రయిక్ రొటేట్ చేసేందుకు ఇష్టపడలేదు. అతను సొంతంగా స్కోర్ చేయకపోగా.. బంతులను అనవసరంగా వృధా చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment