IND VS SA 1st T20: తుది జట్లు ఇవే..! | IND VS SA 1st T20: South Africa Won The Toss And Opt To Bowl, Here Are Playing XI | Sakshi
Sakshi News home page

IND VS SA 1st T20: తుది జట్లు ఇవే..!

Published Fri, Nov 8 2024 8:17 PM | Last Updated on Sat, Nov 9 2024 8:19 AM

IND VS SA 1st T20: South Africa Won The Toss And Opt To Bowl, Here Are Playing XI

నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా డర్బన్‌ వేదికగా టీమిండియాతో ఇవాళ (నవంబర్‌ 8) జరుగుతున్న తొలి టీ20లో సౌతాఫ్రికా టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ముగ్గురు స్పెషలిస్ట్‌ స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగుతుంది. సంజూ శాంసన్‌, అభిషేక్‌ శర్మ ఓపెనర్లుగా రానున్నారు.

భారత్‌, సౌతాఫ్రికా మధ్య ఇప్పటివరకు 27 టీ20 మ్యాచ్‌లు జరగగా.. భారత్‌ 15, సౌతాఫ్రికా 11 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఇరు జట్లు చివరిసారి తలపడిన మ్యాచ్‌లో టీమిండియానే పైచేయి సాధించింది. టీ20 వరల్డ్‌కప్‌ 2024 ఫైనల్లో భారత్‌, సౌతాఫ్రికా తలపడగా.. ఆ మ్యాచ్‌లో టీమిండియా జయభేరి మోగించి రెండో సారి వరల్డ్‌కప్‌ ఛాంపియన్‌గా నిలిచింది. 

దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(వికెట్‌కీపర్‌), ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్‌), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, పాట్రిక్ క్రుగర్, మార్కో జాన్సెన్, ఆండిల్ సిమెలన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, న్కాబయోమ్జి పీటర్

భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్‌కీపర్‌), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్‌), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement