
సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి సౌతాఫ్రికా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. తిలక్ వర్మ మెరుపు సెంచరీ (56 బంతుల్లో 107 నాటౌట్; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) చేసి టీమిండియా భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డాడు.
అభిషేక్ శర్మ తనవంతుగా మెరుపు అర్ద శతకం (25 బంతుల్లో 50; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) బాదాడు. తిలక్ కేవలం 51 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత ఇన్నింగ్స్‌లో సంజూ శాంసన్ డకౌట్ కాగా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 1, హార్దిక్ పాండ్యా 18, రింకూ సింగ్ 8, రమణ్‌దీప్ సింగ్ 15 పరుగులు చేసి ఔటయ్యారు.
ఆఖరి ఓవర్‌ను మార్కో జన్సెన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ ఓవర్‌లో అతను కేవలం నాలుగు పరుగులలు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, సైమ్‌లేన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జన్సెన్‌కు ఓ వికెట్ దక్కింది. కాగా, నాలుగు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ప్రస్తుతం ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment