![RCB, SRH Complete Shahbaz Ahmed, Mayank Dagar Trades Ahead Of IPL 2024 - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/25/sun-risers.jpg.webp?itok=VYQgmM1R)
ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రాంఛైజీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఐపీఎల్ ట్రేడింగ్‌లో భాగంగా సన్‌రైజర్స్, బెంగళూరు తమ ఆటగాళ్లను మార్చుకున్నాయి. ఎస్‌ఆర్‌హెచ్ నుంచి మయాంక్ డాగర్‌ను ఆర్సీబీ సొంతం చేసుకోగా.. ఆర్సీబీ నుంచి షాబాజ్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ కొనుగోలు చేసింది.
ఇరు జట్ల పరస్పర అంగీకారంతో ఈ ట్రేడింగ్ జరిపాయి. గత ఏడాది వేలంలో డాగర్‌ను ఎస్‌ఆర్‌హెచ్ రూ.1.8 కోట్లకు కొనుగోలు చేసింది. అదే విధంగా షాబాజ్‌ను రూ.2.4 కోట్లకు ఆర్సీబీ సొంతం చేసుకుంది. ఇప్పుడు అదే ధరకు ఇరు జట్లు కూడా ఆటగాళ్లను మార్చుకున్నాయి. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇరు ప్రాంఛైజీలు ఆదివారం విడుదల చేసే ఛాన్స్ ఉంది.
కాగా ఐపీఎల్-2024 సీజన్‌కు సంబంధించిన వేలం డిసెంబర్ 19న ముంబై వేదికగా జరగనుంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది సీజన్ కోసం ఫ్రాంచైజీలు నవంబర్ 26 నాటికి తమ వద్ద అట్టిపెట్టుకునే ఆటగాళ్లతో పాటు విడిచిపెట్టే ప్లేయర్లకు సంబంధించిన వివరాలను బీసీసీఐకి అందజేయాల్సి ఉంది.
చదవండి: IND vs AUS 2nd T20: ఆస్ట్రేలియాతో రెండో టీ20.. టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్!?
Comments
Please login to add a commentAdd a comment