![Shubham Dubey wants to buy a house after life changing deal in IPL 2024 Auction - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/28/dubey.jpg.webp?itok=gUFFA3E3)
ఐపీఎల్-2024 వేలంలో విధర్భ ఆటగాడు శభమ్ దూబేపై కాసుల వర్షం కురిసిన సంగతి తెలిసిందే. ఈ వేలంలో దూబేను రూ.5.60 కోట్ల భారీ ధరకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. దేశీవాళీ క్రికెట్‌లో దుమ్మురేపుతున్న 28 ఏళ్ల దూబే.. ఇప్పుడు క్యాష్‌రిచ్ లీగ్‌లోనూ సత్తాచాటేందుకు సిద్దమవుతున్నాడు. ఇక తాజాగా తన మనసులోని మాటను దూబే బయటపెట్టాడు. ఐపీఎల్‌లో వచ్చిన డబ్బులతో తన కుటుంబం కోసం కోసం ఇళ్లు కొంటానని దూబే తెలిపాడు.
'మా కుటుంబం ఆర్ధికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. క్రికెట్ కిట్ కొనే స్థోమత లేదు. కానీ మా నాన్న ఇప్పటికీ తన కష్టంతో నాకు క్రికెట్ కిట్‌ని కొని ఇస్తున్నారు. నేను ఈ స్థాయికి వచ్చానంటే అందుకు కారణం మా నాన్నే. ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉన్నప్పటికీ నన్ను వేరే పని చేయమని ఎప్పుడూ బలవంతం చేయలేదు.
మా నాన్న నిరాడంబరమైన వ్యక్తి. కుటంబాన్ని పోషించడానికి ఎంతో కష్టపడ్డారు. మొదటిలో పాన్ స్టాల్ నిర్వహించారు. ఆ తర్వాత హోటల్ మేనేజర్‌గా కూడా పనిచేశారు. మా నాన్నతో పాటు నా సోదరుడు కూడా ఎంతో మద్దతుగా నిలిచాడు. నాపై ఎటువంటి ఒత్తడి కలగకుండా తన కూడా ఎదో ఒక పనిచేసి మా నాన్నకు సాయంగా ఉండేవాడు.
నేను గాయపడి క్రికెట్‌కు దూరంగా ఉన్న సమయంలో కూడా నా కుటుంబం చాలా సపోర్ట్‌గా ఉంది. ఇకపై వారికి ఎటువంటి కష్టం కలగకుండా చూసుకోవాలనకుంటున్నాను. నేను ముందుగా నా ఫ్యామిలీ కోసం ఇల్లు కొనాలనుకుంటున్నానని" రాజస్తాన్ రాయల్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దుబే పేర్కొన్నాడు.
చదవండి: IND vs AFG: అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్.. టీమిండియా కొత్త కెప్టెన్ అతడే!? రోహిత్ డౌటే?
Comments
Please login to add a commentAdd a comment