Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో కేకేఆర్ ఓపెనర్ జేసన్ రాయ్ వరుసగా రెండో అర్థశతకం సాధించాడు. బుధవారం ఆర్‌సీబీతో మ్యాచ్‌లో ఆరంభం నుంచే ధాటిగా ఆడిన రాయ్ 22 బంతుల్లోనే అర్థశతకం మార్క్ అందుకున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి.
ఇక ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన షాబాజ్ అహ్మద్‌కు జేసన్ రాయ్ చుక్కలు చూపించాడు. ఆ ఓవర్లో నాలుగు సిక్సర్లు బాదిన రాయ్ 24 పరుగులు పిండుకొని ఉతికారేశాడు. ఇక మ్యాచ్‌లో 29 బంతుల్లో 56 పరుగులు చేసిన జేసన్ రాయ్ విజయ్‌కుమార్ వైశాక్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
Oh boy, this Roy can bat! 👏#RCBvKKR #TATAIPL #IPLonJioCinema #IPL2023 | @JasonRoy20 @KKRiders pic.twitter.com/QVYc2ZuZ2b
— JioCinema (@JioCinema) April 26, 2023
చదవండి: Virat Kohli: చరిత్రకెక్కిన కోహ్లి.. 580 రోజుల తర్వాత
Comments
Please login to add a commentAdd a comment