sixers record
-
చరిత్రపుటల్లోకెక్కిన పోలార్డ్
విండీస్ విధ్వంసకర వీరుడు కీరన్ పోలార్డ్ పొట్టి క్రికెట్లో ఓ అరుదైన ఘనత సాధించాడు. పోలీ టీ20 ఫార్మాట్లో 900 సిక్సర్లు బాదిన రెండో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. టీ20ల్లో పోలార్డ్‌కు ముందు క్రిస్ గేల్ మాత్రమే 900 సిక్సర్ల మార్కును తాకాడు. గేల్ 463 మ్యాచ్‌ల్లో 1056 సిక్సర్లు బాదగా.. పోలార్డ్ తన 690వ మ్యాచ్‌లో 900 సిక్సర్ల మార్కును తాకాడు.టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్లు..క్రిస్ గేల్ 1056 (463 మ్యాచ్‌లు)కీరన్ పోలార్డ్ 901 (690 మ్యాచ్‌లు)ఆండ్రీ రసెల్ 727 (529 మ్యాచ్‌లు)నికోలస్ పూరన్ 593 (376 మ్యాచ్‌లు)కొలిన్ మున్రో 550 (434 మ్యాచ్‌లు)కాగా, ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టోర్నీలో (ILT20 2025) భాగంగా డెసర్ట్ వైపర్స్‌తో నిన్న (జనవరి 16) జరిగిన మ్యాచ్‌లో పోలీ 900 సిక్సర్స్ క్లబ్లో చేరాడు. ఈ మ్యాచ్‌లో పోలార్డ్ (ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్) 23 బంతుల్లో 2 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో 36 పరుగులు చేశాడు. ఎంఐ ఎమిరేట్స్ ఇన్నింగ్స్‌లో పోలార్డే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో పోలార్డ్ మెరిసినా ఎంఐ ఎమిరేట్స్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది.తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఎమిరేట్స్ ఇన్నింగ్స్‌లో కుసాల్ పెరీరా 33, ముహమ్మద్ వసీం 18, టామ్ బాంటన్ 15, నికోలస్ పూరన్ 15, పోలార్డ్ 36, మౌస్లీ 15, రొమారియో షెపర్డ్ 16 (నాటౌట్), అకీల్ హొసేన్ 4 (నాటౌట్) పరుగులు చేశారు. డెసర్ట్ వైపర్స్ బౌలర్లలో లోకీ ఫెర్గూసన్ 2, డేవిడ్ పేన్, వనిందు హసరంగ, డాన్ లారెన్స్ తలో వికెట్ పడగొట్టారు.160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వైపర్స్ మరో ఐదు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. ఫకర్ జమాన్ (52 బంతుల్లో 67; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ద సెంచరీతో రాణించి వైపర్స్‌ను గెలిపించాడు. ఆఖర్లో షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (8 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అలెక్స్ హేల్స్ 34, సామ్ కర్రన్ 28 పరుగులు చేసి వైపర్స్ గెలుపులో తమవంతు పాత్ర పోషించారు. డాన్ లారెన్స్ (5), ఆజమ్ ఖాన్ (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఎంఐ ఎమిరేట్స్ బౌలర్లలో జహూర్ ఖాన్, డాన్ మౌస్లీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. వకార్ సలామ్‌ఖీల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ గెలుపుతో వైపర్స్ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఆక్రమించుకుంది. -
కివీస్ పేసర్ భారీ హిట్టింగ్.. క్రిస్ గేల్ సిక్సర్ల రికార్డు సమం
తన కెరీర్లో ఆఖరి టెస్టు ఆడుతున్న న్యూజిలాండ్ సీనియర్ పేసర్ టిమ్ సౌథీ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో వెస్టిండీస్ విధ్వంసక వీరుడు క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డును సౌథీ సమం చేశాడు. కివీస్ జట్టు సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడుతోంది.మరో మ్యాచ్ మిగిలి ఉండగానేఇందులో భాగంగా తొలి రెండు టెస్టుల్లో పర్యాటక ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శనివారం నామమాత్రపు మూడో టెస్టు మొదలైంది.లాథమ్, సాంట్నర్ ఫిఫ్టీలుహామిల్టన్లోని సెడాన్ పార్కులో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌తో శనివారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి 82 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. కెప్టెన్ టామ్ లాథమ్ (135 బంతుల్లో 63; 9 ఫోర్లు), మిచెల్ సాంట్నర్ (54 బంతుల్లో 50 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు.మరోవైపు.. మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (44; 9 ఫోర్లు), విల్ యంగ్ (42; 10 ఫోర్లు) రాణించారు. అయితే, ఒక దశలో 172/2తో పటిష్టంగా కనిపించిన న్యూజిలాండ్... మిడిలార్డర్ వైఫల్యంతో 231/7కు పరిమితమైంది. రచిన్ రవీంద్ర (18), డరైన్ మిషెల్ (14), టామ్ బ్లన్‌డెల్ (21), గ్లెన్ ఫిలిప్స్ (5) విఫలమయ్యారు.చెలరేగిన సౌథీమరికాసేపట్లో ఇన్నింగ్స్ ముగియడం ఖాయమే అనుకుంటున్న దశలో ఆల్‌రౌండర్ మిచెల్ సాంట్నర్ చెలరేగాడు. ఈ మ్యాచ్‌తో టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకనున్న టిమ్ సౌథీ (10 బంతుల్లో 23; 1 ఫోర్, 3 సిక్స్‌లు) కూడా దుమ్ము రేపడంతో న్యూజిలాండ్ మూడొందల మార్కు దాటగలిగింది. వీరిద్దరి ధాటికి కివీస్ టి20 తరహాలో చివరి 8 ఓవర్లలో 76 పరుగులు రాబట్టడం విశేషం. ఇంగ్లండ్ బౌలర్లలో మాథ్యూ పాట్స్, గస్ అట్కిన్సన్ చెరో 3 వికెట్లు పడగొట్టారు.టెస్టు క్రికెట్లో భారీ సిక్స్‌లకు పెట్టింది పేరైన సౌథీకాగా టెస్టు క్రికెట్లో భారీ సిక్స్‌లకు పెట్టింది పేరైన సౌథీ ఈ మ్యాచ్‌లో మూడు సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ప్లేయర్ల జాబితాలో... క్రిస్ గేల్ (98 సిక్స్‌లు)తో సమంగా నాలుగో స్థానానికి చేరాడు. ఈ జాబితాలో ఉన్నది వీరేఈ జాబితాలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (133 సిక్స్‌లు) అగ్ర స్థానంలో ఉండగా... న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్కల్లమ్ (107 సిక్స్‌లు), ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ (100 సిక్స్‌లు) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నారు.ఇక టీమిండియా నుంచి వీరేంద్ర సెహ్వాగ్ (91 సిక్స్‌లు), రోహిత్ శర్మ (88 సిక్స్‌లు) ఈ జాబితాలో వరుసగా ఆరో, ఏడో స్థానాల్లో ఉన్నారు. ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్ తరఫున 107వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న సౌథీ... ఇంగ్లండ్‌తో సిరీస్ అనంతరం కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు.ఇంగ్లండ్ 143 ఆలౌట్ఆదివారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా కివీస్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 347 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 143 పరుగులకే కుప్పకూలింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన న్యూజిలాండ్ ఆట పూర్తయ్యేసరికి 32 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. ఇంగ్లండ్ కంటే 340 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది.చదవండి: భారత్‌తో మూడో టెస్టు: ట్రవిస్ హెడ్ వరల్డ్ రికార్డు.. సరికొత్త చరిత్ర -
IND VS AUS 2nd Test: సెహ్వాగ్ రికార్డు బద్దలు కొట్టిన నితీశ్ రెడ్డి
టీమిండియా యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉండిన ఓ లాంగ్ స్టాండింగ్ రికార్డును బద్దలు కొట్టాడు. ఆస్ట్రేలియాపై ఓ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు (భారత్ తరఫున) గతంలో సెహ్వాగ్ పేరిట ఉండేది. 2003 పర్యటనలో సెహ్వాగ్ ఆస్ట్రేలియాపై 6 సిక్సర్లు బాదాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్‌లో నితీశ్ కుమార్ రెడ్డి సెహ్వాగ్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ సిరీస్‌లో నితీశ్ ఇప్పటికే 7 సిక్సర్లు బాదాడు. ఈ సిరీస్‌లో ఇంకా మూడు టెస్ట్ మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. నితీశ్ ఈ సిరీస్‌లో మరిన్ని సిక్సర్లు బాదే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాతో జరిగిన ఓ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్లు..నితీశ్ కుమార్ రెడ్డి-7 (2024)వీరేంద్ర సెహ్వాగ్-6 (2003)మురళీ విజయ్-6 (2014)సచిన్ టెండూల్కర్-5 (2007)రోహిత్ శర్మ-5 (2014)మయాంక్ అగర్వాల్-5 (2018)రిషబ్ పంత్-5 (2018)ఇదిలా ఉంటే, అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయం ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో నితీశ్ రెడ్డి (42) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో మిచెల్ స్టార్క్ (6/48) టీమిండియాను దెబ్బకొట్టాడు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. ట్రవిస్ హెడ్ (140) శతక్కొట్టడంతో 337 పరుగులు చేసి ఆలౌటైంది. భారత బౌలర్లలో సిరాజ్, బుమ్రా తలో నాలుగు వికెట్లు పడగొట్టారు.157 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. మరోసారి ఘోరంగా విఫలమైంది. కమిన్స్ (5/57) ధాటికి భారత్ 175 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ నితీశ్ కుమార్ రెడ్డే (42) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.19 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ 3.2 ఓవర్లలో వికెట్ నష్ట పోకుండా విజయతీరాలకు చేరింది. ఈ గెలుపుతో ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో ఆసీస్ 1-1తో సమంగా నిలిచింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో భారత్ 295 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. -
సూర్యకుమార్ యాదవ్ సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ
టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ భారత టీ20 జట్టు సారధి సూర్యకుమార్ యాదవ్ పేరిట ఉన్న ఓ రికార్డును బద్దలు కొట్టాడు. అభిషేక్ ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్సర్లు (టీ20ల్లో) బాదిన బ్యాటర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు సూర్యకుమార్ యాదవ్ పేరిట ఉండేది. స్కై 2022లో 41 ఇన్నింగ్స్‌ల్లో 85 సిక్సర్లు (టీ20ల్లో) బాదగా.. అభిషేక్ ఈ ఏడాది కేవలం 38 ఇన్నింగ్స్‌ల్లోనే 87 సిక్సర్లు కొట్టాడు. టీ20ల్లో ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాళ్ల జాబితాలో అభిషేక్ అగ్రస్థానంలో ఉండగా.. స్కై వరుసగా రెండు, మూడు స్థానాల్లో (2023లో 71 సిక్సర్లు) ఉన్నాడు.క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టీ20 సిక్సర్లు బాదిన భారత ఆటగాళ్లుఅభిషేక్ శర్మ (38 ఇన్నింగ్స్‌ల్లో 87 సిక్సర్లు, 2024)సూర్యకుమార్ యాదవ్ (41 ఇన్నింగ్స్‌ల్లో 85 సిక్సర్లు, 2022)సూర్యకుమార్ యాదవ్ (33 ఇన్నింగ్స్‌ల్లో 71 సిక్సర్లు, 2023)రిషబ్ పంత్ (31 ఇన్నింగ్స్‌ల్లో 66 సిక్సర్లు, 2018)శ్రేయస్ అయ్యర్ (42 ఇన్నింగ్స్‌ల్లో 63 సిక్సర్లు, 2019)సంజూ శాంసన్ (32 ఇన్నింగ్స్‌ల్లో 60 సిక్సర్లు, 2024)సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ సూర్యకుమార్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ 11 సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ కేవలం 28 బంతుల్లోనే సెంచరీ చేశాడు. తద్వారా టీ20ల్లో భారత్ తరఫున వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా ఉర్విల్ పటేల్ (గుజరాత్) రికార్డును సమం చేశాడు. ఉర్విల్ కూడా ఇదే సీజన్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఫాసెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన మేఘాలయ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. మేఘాలయ ఇన్నింగ్స్‌లో అర్పిత్ భటేవారా (31) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్.. అభిషేక్ సుడిగాలి శతకంతో విరుచుకుపడటంతో 9.3 ఓవరల్లోనే విజయతీరాలకు చేరింది. -
ఒకే ఓవర్లో 5 సిక్సర్లు.. ఆఫ్ఘన్ ఆటగాడి విధ్వంసం
అబుదాబీ టీ10 లీగ్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు హజ్రతుల్లా జజాయ్ విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో బంగ్లా టైగర్స్‌కు ప్రాతనిథ్యం వహిస్తున్న జజాయ్ ఒకే ఓవర్లో 5 సిక్సర్లు బాదాడు. నార్త్రన్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జజాయ్ ఈ ఫీట్‌ను సాధించాడు. వారియర్స్ బౌలర్ అంకుర్ సాంగ్వాన్ జజాయ్ ధాటికి బలయ్యాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో ఐదో బంతి మినహా మిగిలిన ఐదు బంతులను జజాయ్ సిక్సర్లుగా మలిచాడు. ఈ మ్యాచ్‌లో జజాయ్ 23 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన 53 పరుగులు చేశాడు. జజాయ్‌తో పాటు మొహమ్మద్ షెహజాద్ (25 బంతుల్లో 54 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా రాణించడంతో నార్త్రన్ వారియర్స్‌పై బంగ్లా టైగర్స్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్రన్ వారియర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. కొలిన్ మున్రో 28 బంతుల్లో 4 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 59 పరుగులు చేశాడు. వారియర్స్ ఇన్నింగ్స్‌లో మున్రో మినహా ఎవరూ రాణించలేదు. బ్రాండన్ కింగ్ (12), జాన్సన్ చార్లెస్ (18) రెండంకెల స్కోర్లు చేశారు. షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ 7, అజ్మతుల్లా 4, జియా ఉర్ రెహ్మాన్ 4 పరుగులు చేసి ఔటయ్యారు. బంగ్లా టైగర్స్ బౌలర్లలో రషీద్ ఖాన్, ఇఫ్తికార్ అహ్మద్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. డేవిడ్ పేన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం 108 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టైగర్స్ 7.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. ప్రస్తుత ఎడిషన్‌లో బంగ్లా టైగర్స్‌కు ఇది వరుసగా రెండో విజయం. -
సంచలనం.. 8 బంతుల్లో 8 సిక్సర్లు.. వీడియో
స్పెయిన్ టీ10 క్రికెట్లో సంచలనం నమోదైంది. యునైటెడ్ సీసీ గిరోనాతో జరిగిన మ్యాచ్‌లో పాక్ బార్సిలోనా ఆటగాడు అలీ హసన్ 8 బంతుల్లో 8 సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బార్సిలోనాకు మెరుపు ఆరంభం లభించింది. అయితే ఆ జట్టు స్వల్ప వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. pic.twitter.com/Mpq9PeLddD— Sunil Gavaskar (@gavaskar_theman) November 20, 2024ఈ దశలో బరిలోకి దిగిన అలీ హసన్ ప్రత్యర్థి బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. ఏడో ఓవర్ రెండో బంతి నుంచి వరుసగా ఐదు సిక్సర్లు.. ఆతర్వాత ఎనిమిదో ఓవర్ రెండో బంతి నుంచి వరుసగా మూడు సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 16 బంతులు ఎదుర్కొన్న అలీ హసన్ 8 సిక్సర్లు, బౌండరీ సాయంతో 55 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కడపటి వార్తలు అందేసరికి ఛేదనలో గిరోనా జట్టు ఎదురీదుతుంది. ఆ జట్టు కేవలం 19 పరుగులు మాత్రమే చేసి మూడు వికెట్లు కోల్పోయింది. ఈ టోర్నీ పాయింట్ల పట్టికలో బార్సిలోనా చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓ గెలుపు, మరో పరాజయాన్ని ఎదుర్కొంది. ఐపీఎల్ 2025 మెగా వేలానికి షార్ట్ లిస్ట్ అయిన పేర్లలో అల్ హసన్ పేరు లేకపోవడం విచారకరం. -
సౌథీ అరుదైన ఘనత.. సెహ్వాగ్ సిక్సర్ల రికార్డు బ్రేక్
బెంగళూరు వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ స్టార్ టిమ్ సౌథీ అద్భుతమైన హాఫ్ సెంచరీతో మెరిశాడు. కివీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 402 పరుగుల భారీ స్కోర్‌ను సాధించడంలో సౌథీ కీలక పాత్ర పోషించాడు. రచిన్ రవీంద్రతో కలిసి ఎనిమిదో వికెట్‌కు 137 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.73 బంతులు ఎదుర్కొన్న సౌథీ 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 65 పరుగులు చేశాడు. ఈ ఇక మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో మెరిసిన సౌథీ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన జాబితాలో సౌథీ ఆరో స్ధానానికి ఎగబాకాడు. ఇప్పటివరకు 147 టెస్టు ఇన్నింగ్స్‌లలో సౌథీ 92 సిక్స్‌లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్(91) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో సెహ్వాగ్‌ను ఈ కివీ వెటరన్ అధిగమించాడు. ఇక అరుదైన ఫీట్ నమోదు చేసిన జాబితాలో బెన్ స్టోక్స్(131) అగ్రస్ధానంలో ఉన్నాడు.చదవండి: IND vs PAK 2nd Test: ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన పాకిస్తాన్.. -
1877 నుంచి ఇదే తొలిసారి: అసలైన మజానిచ్చే రికార్డు!
బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో టీమిండియా వీరబాదుడును క్రికెట్ ప్రేమికులు అంత తేలికగా మర్చిపోలేరు. కాన్పూర్‌లో పొట్టి ఫార్మాట్ తరహాలో ఒక్కో భారత బ్యాటర్ చెలరేగుతూ ఉంటే అభిమానులు పండుగ చేసుకున్నారు. అంతకు ముందు వర్షం వల్ల రెండు రోజుల ఆట రద్దైన కారణంగా ఉసూరుమన్న ఫ్యాన్స్‌కు.. రోహిత్ సేన పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చి లెక్క సరిచేసింది.50, 100, 200, 250 పరుగుల రికార్డుటెస్టు ఫార్మాట్లో అత్యంత వేగంగా 50, 100, 200, 250 పరుగుల రికార్డును సాధించి.. ప్రపంచంలో ఈ ఘనతలు నమోదు చేసిన తొలి క్రికెట్ జట్టుగా చరిత్ర సృష్టించింది. కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ 11 బంతుల్లోనే 23 పరుగులు చేస్తే.. అతడి జోడీ యశస్వి జైస్వాల్(72) కేవలం 32 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.1877 నుంచి ఇదే తొలిసారివిరాట్ కోహ్లి 35 బంతుల్లో 47 పరుగులు చేస్తే.. కేఎల్ రాహుల్ 43 బంతుల్లోనే 68 పరుగులు సాధించాడు. ఈ నలుగురు ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన కారణంగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 34.4 ఓవర్లలోనే 285 పరుగులు చేయగలిగింది. ఇదిలా ఉంటే.. ఈ తుఫాన్ ఇన్నింగ్స్ నేపథ్యంలో భారత జట్టు ఖాతాలో అత్యంత అరుదైన రికార్డు ఒకటి నమోదైంది.ఒకే క్యాలెండర్ ఇయర్లో టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన తొలి జట్టుగా రోహిత్ సేన నిలిచింది. తద్వారా ఇంగ్లండ్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసింది. 1877 నుంచి ఇప్పటి వరకు ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో టెస్టుల్లో 90 సిక్సర్లు నమోదు చేసిన టీమ్‌గా చరిత్రకెక్కింది.కాగా బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ మూడు, యశస్వి జైస్వాల్ రెండు, శుబ్‌మన్ గిల్ ఒకటి, విరాట్ కోహ్లి ఒకటి,. కేఎల్ రాహుల్ రెండు, ఆకాశ్ దీప్ రెండు సిక్సర్లు బాదారు. ఇక నవంబరులో టీమిండియా సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో మూడు, ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు టెస్టులు ఆడనుంది. కాబట్టి తన సిక్సర్ల రికార్డును రోహిత్ సేన తానే బద్దలు కొట్టే అవకాశం ఉంది.టెస్టుల్లో ఒకే ఏడాదిలో అత్యధిక సిక్సర్లు బాదిన జట్లుటీమిండియా- 90 సిక్స్‌లు(2024లో ఇప్పటి వరకు)ఇంగ్లండ్- 89 సిక్స్‌లు(2022లో)టీమిండియా- 87 సిక్స్‌లు(2021లో)న్యూజిలాండ్- 81 సిక్స్‌లు(2014లో)న్యూజిలాండ్- 71 సిక్స్‌లు(2013లో).చదవండి: CT 2025: టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లనుందా? బీసీసీఐ ఏమంటోంది? View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
చరిత్ర సృష్టించిన పూరన్
విండీస్ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్ టీ20ల్లో ఓ అరుదైన సిక్సర్ల రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో భీకర ఫామ్‌లో ఉన్న పూరన్.. టీ20ల్లో ఓ క్యాలెండర్ ఇయర్లో 150 సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో నిన్న (సెప్టెంబర్ 23) జరిగిన మ్యాచ్‌లో ఏడు సిక్సర్లు బాదిన పూరన్ ఈ ఏడాది టీ20 ఫార్మాట్లో 63 ఇన్నింగ్స్‌లు ఆడి 151 సిక్సర్లు బాదాడు. పూరన్ కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ఇప్పటివరకు 21 సిక్సర్లు బాదాడు. ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టీ20 సిక్సర్లు బాదిన క్రికెటర్ల జాబితాలో పూరన్ తర్వాతి స్థానంలో క్రిస్ గేల్ ఉన్నాడు. గేల్ 2015లో 135.. 2012లో 121 సిక్సర్లు బాదాడు.పేట్రియాట్స్‌తో మ్యాచ్‌లో 43 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయమైన 93 పరుగులు చేసిన పూరన్.. మరో అరుదైన ఘనత కూడా తన పేరిట లిఖించుకున్నాడు. ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. పూరన్ ఈ ఏడాది టీ20ల్లో 2022 పరుగులు చేశాడు. ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు మొహమ్మద్ రిజ్వాన్ పేరిట ఉంది. రిజ్వాన్ 2021లో 48 ఇన్నింగ్స్‌ల్లో 2036 పరుగులు చేశాడు. పూరన్ తర్వాతి స్థానంలో అలెక్స్ హేల్స్ ఉన్నాడు. హేల్స్ 2022లో 61 మ్యాచ్‌లు ఆడి 1946 పరుగులు చేశాడు.సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ (పూరన్ జట్టు) 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పేట్రియాట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఆండ్రీ ఫ్లెచర్ (61 బంతుల్లో 93; 4 ఫోర్లు, 6 సిక్సర్లు), కైల్ మేయర్స్ (30 బంతుల్లో 60; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీలతో చెలరేగారు.అనంతరం 194 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్‌రైడర్స్.. నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించడంతో 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. పూరన్‌తో పాటు జేసన్ రాయ్ (34 బంతుల్లో 64; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు.కాగా, ఈ మ్యాచ్ గెలుపుతో సంబంధం లేకుండా నైట్‌రైడర్స్ ఇదివరకే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. నైట్‌రైడర్స్‌తో పాటు సెయింట్ లూసియా కింగ్స్, గయానా అమెజాన్ వారియర్స్, బార్బడోస్ రాయల్స్ ఈ సీజన్ ప్లే ఆఫ్స్‌కు చేరుకున్నాయి. ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ ఈ సీజన్ నుంచి ఇదివరకే ఎలిమినేట్ అయ్యాయి. ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు అక్టోబర్ 1, 2, 4 తేదీల్లో జరుగనున్నాయి. అక్టోబర్ 6న ఫైనల్ జరుగుతుంది. చదవండి: రాణించిన గబ్బర్.. అయినా డీకే జట్టు చేతిలో ఓటమి -
ఆల్‌టైమ్ రికార్డుకు ఏడు సిక్సర్ల దూరంలో ఉన్న రోహిత్
టెస్ట్‌ల్లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్ల రికార్డు సాధించేందుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం ఏడు సిక్సర్లు దూరంలో ఉన్నాడు. హిట్‌మ్యాన్ త్వరలో బంగ్లాదేశ్‌తో జరుగబోయే సిరీస్‌లో మరో ఏడు సిక్సర్లు బాదితే టీమిండియా తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా వీరేందర్ సెహ్వాగ్ రికార్డును అధిగమిస్తాడు. వీరూ 103 టెస్ట్‌ల్లో 90 సిక్సర్లు బాదగా.. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 84 సిక్సర్లు (59 టెస్ట్‌ల్లో) ఉన్నాయి. టెస్ట్‌ల్లో టీమిండియా తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో వీరూ, రోహిత్ తర్వాత ధోని (78), సచిన్ (69), రవీంద్ర జడేజా (64) టాప్-5లో ఉన్నారు. సుదీర్ఘ ఫార్మాట్లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి కేవలం 26 సిక్సర్లు మాత్రమే కొట్టాడు. మూడు ఫార్మాట్ల విషయానికొస్తే.. రోహిత్ ప్రపంచంలోనే అందరి కంటే ఎక్కువ సిక్సర్లు బాదిన ఆటగాడిగా ఉన్నాడు. హిట్‌మ్యాన్ తన కెరీర్లో 483 మ్యాచ్‌లు ఆడి 620 సిక్సర్లు కొట్టాడు. ఈ జాబితాలో రోహిత్ తర్వాతి స్థానాల్లో క్రిస్ గేల్ (553), షాహిద్ అఫ్రిది (476) టాప్-3లో ఉన్నారు.బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ విషయానికొస్తే.. రెండు టెస్ట్‌లు, మూడు టీ20ల సిరీస్‌ల కోసం బంగ్లాదేశ్ జట్టు ఈ నెల 19 నుంచి భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో తొలుత రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరుగనుంది. తొలి టెస్ట్ సెప్టెంబర్ 19, రెండో టెస్ట్ సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభమవుతాయి. టీ20 సిరీస్ అక్టోబర్ 6, 9, 12 తేదీల్లో జరుగుతుంది. -
క్రిస్ గేల్ రికార్డును సమం చేసిన రోహిత్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ రికార్డును సమం చేశాడు. వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో గేల్, రోహిత్ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. వన్డేల్లో ఈ ఇద్దరు చెరో 331 సిక్సర్లు బాదారు. ఈ జాబితాలో పాక్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది (351) టాప్‌లో ఉన్నాడు. ప్రస్తుత తరం క్రికెటర్లలో రోహిత్ తర్వాతి స్థానంలో జోస్ బట్లర్ ఉన్నాడు. బట్లర్ ఖాతాలో ప్రస్తుతం 170 సిక్సర్లు ఉన్నాయి. శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో రోహిత్ గేల్ రికార్డును సమం చేశాడు.ఈ మ్యాచ్‌లో రోహిత్ 20 బంతుల్లో ఓ సిక్సర్, 6 ఫోర్ల సాయంతో 35 పరుగులు చేశాడు. రోహిత్ ఓ మోస్తరు స్కోర్‌తో రాణించినా ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. పథుమ్ నిస్సంక (45), అవిష్క ఫెర్నాండో (96), కుసాల్ మెండిస్ (59), కమిందు మెండిస్ (23 నాటౌట్) రాణించారు. భారత బౌలర్లలో రియాన్ పరాగ్ 3, సిరాజ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.249 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 138 పరుగులకే (26.1 ఓవర్లలో) ఆలౌటై 110 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దునిత్ వెల్లలగే ఐదు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు. తీక్షణ, వాండర్సే తలో రెండు, అషిత ఫెర్నాండో ఓ వికెట్ పడగొట్టారు. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ (35), సుందర్ (30), విరాట్ కోహ్లి (20), రియాన్ పరాగ్ (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.ఈ మ్యాచ్‌లో ఓటమితో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోయింది. తొలి వన్డే టైగా ముగియగా.. రెండు, మూడు వన్డేల్లో శ్రీలంక విజయం సాధించింది. శ్రీలంక 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ద్వైపాక్షిక సిరీస్‌లో భారత్‌పై విజయం సాధించింది. -
టీమిండియా తరఫున ఎవరికీ సాధ్యం కాలేదు.. అభిషేక్ శర్మ సాధించాడు
జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ 47 బంతుల్లో (7 ఫోర్లు, 8 సిక్సర్లు) శతక్కొట్టిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో అభిషేక్‌తో పాటు రుతురాజ్ గైక్వాడ్ (47 బంతుల్లో 77 నాటౌట్; 11 ఫోర్లు, సిక్సర్), రింకూ సింగ్ (22 బంతుల్లో 48 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) కూడా చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ (2 వికెట్ల నష్టానికి 234 పరుగులు) చేసింది. అనంతరం ఛేదనలో చేతులెత్తేసిన జింబాబ్వే.. ముకేశ్ కుమార్ (3.4-0-37-3), ఆవేశ్ ఖాన్ (3-0-15-3), రవి బిష్ణోయ్ (4-0-11-2), వాషింగ్టన్ సుందర్ (4-0-28-1) ధాటికి 18.4 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని (100 పరుగుల తేడాతో) మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో భారత్.. తొలి టీ20లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్, జింబాబ్వే చెరో విజయంతో సమంగా ఉన్నాయి. మూడో మ్యాచ్ జులై 10న జరుగనుంది.𝙃𝙖𝙫𝙤𝙘 𝙞𝙣 𝙃𝙖𝙧𝙖𝙧𝙚 🌪️🏏@IamAbhiSharma4 smashes 100 in 47 balls 🥵💪#SonySportsNetwork #ZIMvIND #TeamIndia pic.twitter.com/hHYlTopD1V— Sony Sports Network (@SonySportsNetwk) July 7, 2024ఇదిలా ఉంటే, రెండో టీ20లో సుడిగాలి శతకంతో (46 బంతుల్లో) విరుచుకుపడిన అభిషేక్ శర్మ.. భారత క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని ఓ అరుదైన ఫీట్‌ను సాధించాడు. కెరీర్లో కేవలం రెండో టీ20 ఆడుతున్న అభిషేక్.. సెంచరీ మార్కును హ్యాట్రిక్ సిక్సర్లతో (వెల్లింగ్టన్ మసకద్జ బౌలింగ్‌లో) అందుకున్నాడు. భారత క్రికెట్ చరిత్రలో ఏ క్రికెటర్ కూడా అంతర్జాతీయ శతకాన్ని హ్యాట్రిక్ సిక్సర్లతో అందుకోలేదు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ తన పరుగుల ఖాతాను కూడా సిక్సర్‌తోనే ఓపెన్ చేయడం విశేషం. తన కెరీర్ తొలి మ్యాచ్‌లో డకౌట్ అయిన అభిషేక్ రెండో మ్యాచ్‌లోనే సెంచరీ చేసి పలు రికార్డులు కొల్లగొట్టాడు.అభిషేక్ సాధించిన రికార్డులు ఇవే..అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా(ఇన్నింగ్స్‌ల పరంగా) సెంచరీ చేసిన భారత క్రికెటర్‌గా అభిషేక్ రికార్డులకెక్కాడు. అభిషేక్ కేవలం రెండు ఇన్నింగ్స్‌ల వ్యవధిలోనే తన మొదటి అంతర్జాతీయ సెంచరీని సాధించాడు.అభిషేక్‌కు ముందు ఈ రికార్డు దీపక్ హుడా పేరిట ఉండేది. హుడా తన కెరీర్ మూడో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశాడు.అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరపున సెంచరీ చేసిన ఐదో అత్యంత పిన్న వయస్కుడిగా అభిషేక్ నిలిచాడు. అభిషేక్ 23 ఏళ్ల 307 రోజుల వయస్సులో తన తొలి సెంచరీ నమోదు చేశాడు. ఈ జాబితాలో యశస్వీ జైశ్వాల్ (21 ఏళ్ల 279 రోజుల వయస్సులో) టాప్‌లో ఉన్నాడు.అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన నాలుగో భారత బ్యాటర్‌గా అభిషేక్ శర్మ రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ(38 బంతులు) అగ్రస్ధానంలో ఉండగా.. సూర్యకుమార్ యాదవ్(45), కేఎల్ రాహుల్(46), అభిషేక్ శర్మ(46) తర్వాతి స్థానాల్లో నిలిచారు.ఈ ఏడాది ప్రొఫెషనల్ టీ20 క్రికెట్లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా అభిషేక్ రికార్డులకెక్కాడు. ఈ ఏడాది టీ20ల్లో ఇప్పటివరకు 18 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్.. 50 సిక్స్‌లు బాదాడు. అభిషేక్‌కు ముందు ఈ రికార్డు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (25 మ్యాచ్‌ల్లో 46 సిక్స్‌లు) పేరిట ఉండేది.ఈ మ్యాచ్‌లో స్పిన్నర్ల బౌలింగ్‌లో 65 పరుగులు సాధించిన అభిషేక్.. అంతర్జాతీయ టీ20ల్లో స్పిన్నర్లపై అత్యధిక పరుగులు సాధించిన భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. అభిషేక్‌కు ముందు ఈ రికార్డు యువరాజ్ సింగ్ (57 పరుగులు) పేరిట ఉండేది. -
T20 World Cup 2024: చరిత్ర సృష్టించిన రో'హిట్'మ్యాన్ శర్మ.. రికార్డులు బద్దలు
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా ఇంగ్లండ్‌తో నిన్న (జూన్ 27) జరిగిన రెండో సెమీఫైనల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పలు రికార్డులు బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో తాను చేసిన 57 పరుగుల్లో 6 ఫోర్లు బాదిన హిట్‌మ్యాన్.. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక బౌండరీలు బాదిన (43 మ్యాచ్‌ల్లో 113) ఆటగాడిగా శ్రీలంక దిగ్గజం మహేళ జయవర్దనే (111) రికార్డును బద్దలు కొట్టాడు. ఇదే మ్యాచ్‌లో రెండు సిక్సర్లు కూడా బాదిన రోహిత్.. క్రిస్ గేల్ (63) తర్వాత టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో 50 సిక్సర్లు మార్కు తాకిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ మరో రెండు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో అత్యధిక సిక్సర్లు (22) బాదిన ఆటగాడిగా.. భారత కెప్టెన్‌గా 5000 పరుగుల మైలురాయిని దాటిన ఐదో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక సిక్సర్లుక్రిస్ గేల్- 63రోహిత్ శర్మ- 50జోస్ బట్లర్- 43డేవిడ్ వార్నర్- 40యువరాజ్ సింగ్- 33విరాట్ కోహ్లి- 33టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక బౌండరీలురోహిత్ శర్మ- 113జయవర్దనే- 111విరాట్- 105వార్నర్- 103తిలకరత్నే దిల్షన్- 101భారత కెప్టెన్‌గా అత్యధిక పరుగులువిరాట్- 12883ధోని- 11207అజహారుద్దీన్- 8095గంగూలీ- 7643రోహిత్- 5012ఐసీసీ నాకౌట్స్‌లో అత్యధిక సిక్సర్లురోహిత్ శర్మ- 22క్రిస్ గేల్- 21ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి మూడోసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్స్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఇంగ్లండ్ 16.4 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌటైంది. రోహిత్ శర్మ (57), సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), కుల్దీప్ యాదవ్ (4-0-19-3), అక్షర్ పటేల్ (4-0-23-3), బుమ్రా (2.4-0-12-2) భారత విజయంలో కీలకపాత్రలు పోషించారు. భారతకాలమానం రేపు (జూన్ 29) రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఫైనల్లో టీమిండియా.. సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకుంటుంది. -
ఒకే ఓవర్లో 38 పరుగులు
ఇంగ్లండ్ యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ కౌంటీ క్రికెట్లో చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఒకే ఓవర్లో 38 పరుగులు సమర్పించుకుని కౌంటీ క్రికెట్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఓవర్ వేసిన బౌలర్‌గా ఘోర అపఖ్యాతిని సొంతం చేసుకున్నాడు. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్-1లో భాగంగా సర్రేతో జరుగుతున్న మ్యాచ్‌లో వార్సెస్టర్‌షైర్‌కు ఆడుతూ ఈ అపవాదును తన ఖాతాలో వేసుకున్నాడు.బషీర్ వేసిన ఇన్నింగ్స్ 128వ ఓవర్లో సర్రే బ్యాటర్ డాన్ లార్సెన్ తొలి ఐదు బంతులకు ఐదు సిక్సర్లు బాదాడు. అనంతరం ఆరో బంతికి వైడ్ల రూపంలో ఐదు పరుగులు.. ఆతర్వాతి బంతి నో బాల్.. చివరి బంతికి రెండు పరుగులు రావడంతో మొత్తంగా ఈ ఓవర్లో 38 పరుగులు వచ్చాయి. కౌంటీ చరిత్రలో ఓ సింగిల్ ఓవర్లో ఇన్ని పరుగులు రావడం ఇది రెండోసారి. 1998 సీజన్లో అలెక్స్ ట్యూడర్ కూడా ఓ ఓవర్లో 38 పరుగులు సమర్పించుకున్నాడు. నాడు ట్యూడర్ బౌలింగ్‌లో ఇంగ్లండ్ దిగ్గజ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ 34 పరుగులు సాధించాడు.మ్యాచ్ విషయానికొస్తే.. వార్సెస్టర్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన సర్రే తొలుత బ్యాటింగ్ చేసింది. డాన్ లారెన్స్ (175) భారీ సెంచరీతో.. డామినిక్ సిబ్లీ (76), జేమీ స్మిత్ (86), బెన్ ఫోక్స్ (52) అర్దసెంచరీలతో రాణించడంతో సర్రే తొలి ఇన్నింగ్స్‌లో 490 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వార్సెస్టర్‌షైర్ రెండో ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. జేక్ లిబ్బీ (61), బెన్ అల్లీసన్ (19) క్రీజ్‌లో ఉన్నారు. -
T20 World Cup 2024: బట్లర్ విశ్వరూపం.. సిక్సర్ల సునామీ.. యువీ తర్వాత..!
యూఎస్ఏతో జరిగిన వరల్డ్‌కప్ 2024 సూపర్-8 మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ విశ్వరూపం ప్రదర్శించాడు. సెమీస్‌కు చేరాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. హర్మీత్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో ఏకంగా ఐదు సిక్సర్లు బాది, యువరాజ్ సింగ్ (2007 ప్రపంచకప్‌లో యువీ.. ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదాడు) తర్వాత టీ20 వరల్డ్‌కప్‌ల్లో ఐదు అంతకంటే ఎక్కువ సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.హర్మీత్ ఓవర్లో ఐదు సిక్సర్లు సహా 32 పిండుకున్న బట్లర్.. మ్యాచ్ మొత్తంలో ఏడు సిక్సర్లు బాదాడు. తద్వారా ఇంగ్లండ్ తరఫున టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా అలెక్స్ హేల్స్ రికార్డును సమం చేశాడు. ఈ మ్యాచ్‌లో 38 బంతులు ఎదుర్కొన్న బట్లర్.. 6 బౌండరీలు, 7 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బట్లర్ మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో యూఎస్ఏ నిర్దేశించిన 116 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 9.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా ఊదేసింది. ఫలితంగా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, గ్రూప్-2 నుంచి సెమీస్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. బట్లర్ సహచర ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ (25)తో కలిసి ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చాడు.అంతకుముందు క్రిస్ జోర్డన్ (2.5-0-10-4) హ్యాట్రిక్ వికెట్లతో, ఆదిల్ రషీద్ (4-0-13-2) అద్బుత బౌలింగ్ ప్రదర్శనతో చెలరేగడంతో యూఎస్ఏ 18.5 ఓవర్లలో 115 పరుగులకే చాపచుట్టేసింది. యూఎస్ ఇన్నింగ్స్‌లో నితీశ్ కుమార్ (30) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
T20 World Cup 2024: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. ప్రపంచ క్రికెట్లో తొలి ఆటగాడు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో మెరుపు అర్ద సెంచరీ చేసిన హిట్‌మ్యాన్.. అంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లలో) 600 సిక్సర్లు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.2007 నుంచి ఇప్పటివరకు 473 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రోహిత్ 499 ఇన్నింగ్స్‌ల్లో 600 సిక్సర్లు బాదాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ తర్వాతి స్థానంలో క్రిస్ గేల్ (553), షాహిద్ అఫ్రిది (476), బ్రెండన్ మెక్కల్లమ్ (398), మార్టిన్ గప్తిల్ (383) టాప్-5లో ఉన్నారు. ప్రస్తుత తరం క్రికెటర్లలో రోహిత్‌కు దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు.ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ 330 సిక్సర్లతో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఆతర్వాత వార్నర్ 312 సిక్సర్లతో 11వ స్థానంలో.. 294 సిక్సర్లతో విరాట్ కోహ్లి 12వ స్థానంలో ఉన్నారు.కాగా, ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూయార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లు మూకుమ్మడిగా రాణించి ఐర్లాండ్‌ను 96 పరుగులకే (16 ఓవర్లు) ఆలౌట్ చేశారు. హార్దిక్ పాండ్యా (4-1-27-3), అర్ష్‌దీప్ సింగ్ (4-0-35-2), సిరాజ్ (3-0-13-1), బుమ్రా (3-1-6-2), అక్షర్ పటేల్ (1-0-3-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. View this post on Instagram A post shared by ICC (@icc)ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో లోర్గాన్ టక్కర్ (10), కర్టిస్ క్యాంపర్ (12), గెరాత్ డెలానీ (26), జాషువ లిటిల్ (14) రెండంకెల స్కోర్ చేయగా.. ఆండ్రూ బల్బిర్నీ (5), పాల్ స్టిర్లింగ్ (2), హ్యారీ టెక్టార్ (4), జార్జ్ డాక్రెల్ (3), మార్క్ అదైర్ (3), బ్యారీ మెక్ కార్తీ (0) దారుణంగా విఫలమయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో రోహిత్ (37 బంతుల్లో 52 రిటైర్డ్ హర్ట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), పంత్ (26 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించి టీమిండియాను గెలిపించారు. వీరిద్దరు సత్తా చాటడంతో భారత్ 12.2 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఐసీసీ ఈవెంట్లలో రోహిత్‌తో కలిసి తొలిసారి ఓపెనింగ్ చేసిన కోహ్లి 5 బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. పంత్ సిక్సర్‌తో మ్యాచ్ ఫినిష్ చేశాడు. అర్ద సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత మోచేతికి బంతి బలంగా తాకడంతో రోహిత్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. -
T20 WC: సిక్సర్ల సునామీ.. క్రిస్ గేల్ తర్వాత ఒకే ఒక్కడు!
టీ20 ప్రపంచకప్-2024లో యునైటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్టు శుభారంభం చేసింది. సొంతగడ్డపై జరుగుతున్న ఈ మెగా ఈవెంట్ ఆరంభ మ్యాచ్‌లో కెనడాపై సంచలన విజయం సాధించింది.డలాస్ వేదికగా ఆదివారం ఉదయం(భారత కాలమానం ప్రకారం) జరిగిన ఈ మ్యాచ్‌లో కెనడాను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. అంతర్జాతీయ టీ20లలో తమ అత్యధిక పరుగుల ఛేదనను నమోదు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. View this post on Instagram A post shared by ICC (@icc)ఇక ఈ విజయంలో యూఎస్ఏ వైస్ కెప్టెన్ ఆరోన్ జోన్స్దే కీలక పాత్ర. కెనడా విధించిన 195 పరుగుల లక్ష్య ఛేదనలో అమెరికా జట్టు ఆరంభంలోనే తడబడింది. స్వల్ప వ్యవధిలోనే ఓపెనర్లు స్టీవెన్ టేలర్(0), కెప్టెన్ మొనాక్ పటేల్(16) వికెట్లు కోల్పోయింది.ఆరోన్ జోన్స్ సంచలన ఇన్నింగ్స్ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ ఆండ్రీస్ గౌస్(46 బంతుల్లో 65)తో కలిసి ఆరోన్ జోన్స్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 40 బంతుల్లోనే 94 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఇక స్ట్రైకురేటు 235తో ఈ మేరకు పరుగుల విధ్వంసం సృష్టించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లతో పాటు ఏకంగా పది సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో ఆరోన్ జోన్స్ టీ20 ప్రపంచకప్ చరిత్రలో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc) క్రిస్ గేల్ తర్వాత ఒకే ఒక్కడు!యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ తర్వాత టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రెండో క్రికెటర్‌గా ఆరోన్ జోన్స్ చరిత్రకెక్కాడు. కాగా యూఎస్ఏ విజయంలో కీలక పాత్ర పోషించి.. తొమ్మిదో ఎడిషన్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న తొలి ఆటగాడిగానూ నిలిచాడు.టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్లు👉క్రిస్ గేల్- 11- ఇంగ్లండ్ మీద- 2016లో..👉క్రిస్ గేల్- 10- సౌతాఫ్రికా మీద- 2007లో..👉ఆరోన్ జోన్స్- 10- కెనడా మీద- 2024లో..👉రిలీ రొసోవ్- 8- బంగ్లాదేశ్ మీద- 2022లో. View this post on Instagram A post shared by ICC (@icc)చదవండి: జీవితంలో కష్టాలు సహజం.. ఏదేమైనా వదిలిపెట్టను: హార్దిక్ పాండ్యా -
చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న రోహిత్.. దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు..!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. టీ20 వరల్డ్‌కప్ 2024 హిట్‌మ్యాన్ మరో మూడు సిక్సర్లు కొడితే అంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లలో) 600 సిక్సర్లు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పుతాడు.2007 నుంచి ఇప్పటివరకు 472 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రోహిత్ 498 ఇన్నింగ్స్‌ల్లో 597 సిక్సర్లు బాదాడు. అన్ని సవ్యంగా సాగితే టీ20 వరల్డ్‌కప్ తొలి మ్యాచ్‌లోనే హిట్‌మ్యాన్ 600 సిక్సర్ల మార్కును తాకుతాడు. ప్రస్తుత తరం క్రికెటర్లలో రోహిత్‌కు దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ 330 సిక్సర్లతో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఆతర్వాత వార్నర్ 312 సిక్సర్లతో 11వ స్థానంలో.. 294 సిక్సర్లతో విరాట్ కోహ్లి 12వ స్థానంలో నిలిచారు.ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్‌లో భారత ప్రస్తానం జూన్ 5న ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌తో మొదలవుతుంది. దీనికి ముందు భారత్ ఇవాళ (జూన్ 1) బంగ్లాదేశ్‌తో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. మెగా టోర్నీలో భారత్ రెండో మ్యాచ్ జూన్ 9న ఆడుతుంది. ఆ రోజు జరిగే మ్యాచ్‌లో రోహిత్ సేన చిరకాల ప్రత్యర్ది పాకిస్తాన్‌తో తలపడనుంది.మరో రికార్డుపై కూడా కన్నేసిన రోహిత్జూన్ 5న ఐర్లాండ్‌తో జరుగబోయే మ్యాచ్‌లో రోహిత్ శర్మ మరో రికార్డుపై కూడా కన్నేశాడు. ఆ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ మరో 26 పరుగులు చేస్తే.. విరాట్, బాబర్ తర్వాత 4000 టీ20 పరుగులు సాధించిన మూడో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం రోహిత్ 151 టీ20 మ్యాచ్‌ల్లో 5 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీల సాయంతో 3974 పరుగులు చేశాడు. విరాట్ 117 మ్యాచ్‌ల్లో 4037 పరుగులు.. బాబర్ 119 మ్యాచ్‌ల్లో 4023 పరుగులు చేసి రోహిత్ కంటే ముందున్నారు. -
SRH VS LSG: సిక్సర్ల సునామీ.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో గతంలో ఎన్నడూ లేని విధంగా సిక్సర్ల మోత మోగుతుంది. ఈ సీజన్ మరో 18 మ్యాచ్‌లు మిగిలుండగానే 1000 సిక్సర్ల అత్యంత అరుదైన మైలురాయిని తాకింది. సన్‌రైజర్స్‌తో ఇవాళ (మే 8) జరుగుతున్న మ్యాచ్‌లో కృనాల్ పాండ్యా కొట్టిన సిక్సర్‌తో ఈ సీజన్లో 1000 సిక్సర్లు పూర్తయ్యాయి. ఈ మైలురాయిని చేరుకునే క్రమంలో ప్రస్తుత ఐపీఎల్ సీజన్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టింది. వెయ్యి సిక్సర్ల మార్కును అత్యంత వేగంగా చేరుకున్న సీజన్‌గా ఐపీఎల్ 2024 సరికొత్త చరిత్ర సృష్టించింది.1000TH SIXES IN IPL 2024...!!!! 🤯- THE MOST CRAZIEST IPL SEASON EVER. 🔥 pic.twitter.com/mfYwS6fbUY— Tanuj Singh (@ImTanujSingh) May 8, 2024ఐపీఎల్ చరిత్రలో 2022 (1062 సిక్సర్లు), 2023 (1124 సిక్సర్లు), 2024 సీజన్లలో మాత్రమే 1000కి పైగా సిక్సర్లు నమోదు కాగా.. ఈ సీజన్లోనే అత్యంత వేగంగా ఆ మార్కు తాకింది. 2022 సీజన్లో ఈ మార్కును తాకేందుకు 16269 బంతులు అవసరమైతే.. గత సీజన్లో 15390 బంతులు.. ఈ సీజన్లో అన్నిటికంటే తక్కువగా 13079 బంతుల్లోనే వెయ్యి సిక్సర్లు పూర్తయ్యాయి.సన్‌రైజర్స్-లక్నో మ్యాచ్ విషయానికొస్తే.. హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో లక్నో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. 18 ఓవర్లు పూర్తయ్యాక లక్నో స్కోర్ 4 వికెట్ల నష్టానికి 131 పరుగులుగా ఉంది. డికాక్ (2), స్టోయినిస్ (3), కృనాల్ పాండ్యా (24), రాహుల్ (29) ఔట్ కాగా.. పూరన్ (30), బదోని (39) క్రీజ్‌లో ఉన్నారు. భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన స్పెల్‌తో (4-0-12-3) లక్నోను దారుణంగా దెబ్బ కొట్టగా.. కమిన్స్ ఓ వికెట్ పడగొట్టాడు. కృనాల్‌ను కమిన్స్ అద్భుతమైన త్రోతో రనౌట్ చేశాడు. -
IPL 2024 SRH VS LSG: మరో మూడేస్తే..!
ఐపీఎల్ 2024 సీజన్లో ఇవాళ (మే 8) మరో బిగ్ ఫైట్ జరుగనుంది. విధ్వంసకర ఆటగాళ్లతో నిండిన సన్‌రైజర్స్, లక్నో సూపర్ జెయింట్స్ అమీతుమీకి సిద్దమయ్యాయి. సన్‌రైజర్స్ హోం గ్రౌండ్ అయిన ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగునుంది. హైదరాబాద్‌లో నగరంలో నిన్న రాత్రి అతి భారీ వర్షం కురిసింది. ఇవాళ కూడా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే నగరంలో ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే వరుణుడి నుంచి మ్యాచ్‌కు ఎలాంటి ముప్పు లేదని తెలుస్తుంది. ప్రస్తుతం సన్‌రైజర్స్, ఎల్ఎస్జీ పాయింట్ల పట్టికలో సమవుజ్జీలుగా ఉన్నాయి. రెండు జట్లు చెరి 11 మ్యాచ్‌లు ఆడి ఆరింట గెలుపొందాయి. అయితే లక్నోతో పోలిస్తే సన్‌రైజర్స్ రన్‌రేట్ కాస్త మెరుగ్గా ఉండటంతో ఆ జట్టు మెరుగైన స్థానంలో ఉంది. సన్‌రైజర్స్ నాలుగులో.. లక్నో ఆరో స్థానంలో కొనసాగుతున్నాయి. ఇరు జట్లకు ప్లే ఆఫ్స్ అవకాశాలు సమానంగా ఉండటంతో ఈ మ్యాచ్ ఫలితం అత్యంత కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు టెన్షన్ లేకుండా తదుపరి మ్యాచ్‌కు వెళ్లవచ్చు. ఇరు జట్ల ఈ సీజన్లో ఇదే తొలి మ్యాచ్. ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటివరకు మూడు సార్లు తలపడగా.. అన్ని సందర్భాల్లో లక్నోనే విజయం సాధించింది.మరో మూడేస్తే..ఇక ఈ మ్యాచ్ ఓ భారీ మైలురాయికి వేదిక కానుంది. ఈ మ్యాచ్‌లో మరో మూడు సిక్సర్లు నమోదైతే ఈ సీజన్లో 1000 సిక్సర్లు (అన్ని జట్లు కలిపి) పూర్తవుతాయి. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు నమోదైన సీజన్‌గా ఐపీఎల్ 2023 ఉంది. గత సీజన్లో రికార్డు స్థాయిలో 1124 సిక్సర్లు నమోదయ్యాయి. ఈ సీజన్లో ఇంకా 18 మ్యాచ్‌లు మిగిలుండగానే 1000 సిక్సర్లు మార్కు తాకితే ఆల్‌టైమ్ హైయెస్ట్ సిక్సర్ల రికార్డు బద్దలవడం ఖాయం. నేటి మ్యాచ్‌లో తలపడబోయే సన్‌రైజర్స్, లక్నో జట్లలో భారీ హిట్టర్లు ఉండటంతో ఈ మ్యాచ్‌లో కనీసం 20 సిక్సర్లు నమోదయ్యే అవకాశం ఉంది. సీజన్ల వారీగా సిక్సర్లు..2008- 6222009- 5062010- 5852011- 6392012- 7312013- 6722014- 7142015- 6922016- 6382017- 7052018- 8722019- 7842020- 7342021- 6872022- 10622023- 11242024- 997* -
పరుగుల ప్రళయం.. సిక్సర్ల సునామీ.. ఆల్‌టైమ్ రికార్డులు బద్దలు
ఐపీఎల్ 2024లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య నిన్న (మార్చి 27) జరిగిన మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాటర్లు పోటాపోటీ పడి సిక్సర్లు బాదారు. ఇరు జట్ల బ్యాటర్ల సిక్సర్ల సునామీ ధాటికి హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం తడిసి ముద్దైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 18 సిక్సర్లు బాదితే.. ఛేదనలో ముంబై తామేమీ తక్కువ కాదని 20 సిక్సర్లు బాదింది. ఇరు జట్లు కలిపి ఈ మ్యాచ్‌లో ఏకంగా 38 సిక్సర్లు కొట్టాయి. ఫలితంగా భారీ స్కోర్లు నమోదు కావడంతో పాటు పలు ఆల్‌టైమ్ రికార్డులు బద్దలయ్యాయి. పోట్టి క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు (38) నమోదైన మ్యాచ్‌గా ఈ మ్యాచ్ రికార్డుల్లోకెక్కింది. పురుషుల టీ20ల్లో అత్యధిక సిక్సర్లు.. 38 - SRH vs MI, హైదరాబాద్, IPL 2024 37 - బాల్ఖ్ లెజెండ్స్ vs కాబుల్ జ్వానన్, షార్జా, APL 2018 37 - SNKP vs JT, బస్సెటెర్రే, CPL 2019 36 - టైటాన్స్ vs నైట్స్, పోట్చెఫ్స్ట్రూమ్, CSA T20 ఛాలెంజ్ 2022 35 - JT vs TKR, కింగ్స్టన్, CPL 2019 35 - SA vs WI, సెంచూరియన్, 2023 ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు.. ఈ మ్యాచ్ ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక సిక్సర్లు (38) నమోదైన మ్యాచ్ గానూ రికార్డు నెలకొల్పింది. 38 - SRH vs MI, హైదరాబాద్, 2024 33 - RCB vs CSK, బెంగళూరు, 2018 33 - RR vs CSK, షార్జా, 2020 33 - RCB vs CSK, బెంగళూరు, 2023 ఐపీఎల్లో అత్యధిక బౌండరీల సంఖ్య (4 6s).. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి కొట్టిన బౌండరీలు (ఫోర్లు, సిక్సర్లు) ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధికం. 69 - CSK vs RR, చెన్నై, 2010 69 - SRH vs MI, హైదరాబాద్, 2024 67 - PBKS vs LSG, లక్నో, 2023 67 - PBKS vs KKR, ఇండోర్, 2018 65 - డెక్కన్ ఛార్జర్స్ vs RR, హైదరాబాద్, 2008 ఐపీఎల్లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు.. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కొట్టిన సిక్సర్ల సంఖ్య ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధికం కాగా, సన్‌రైజర్స్ బాదిన సిక్సర్ల సంఖ్య నాలుగో అత్యధికం. 21 - RCB vs PWI, బెంగళూరు, 2013 20 - RCB vs GL, బెంగళూరు, 2016 20 - DC vs GL, ఢిల్లీ, 2017 20 - MI vs SRH, హైదరాబాద్, 2024 18 - RCB vs PBKS, బెంగళూరు, 2015 18 - RR vs PBKS, షార్జా, 2020 18 - CSK vs KKR, కోల్‌కతా, 2023 18 - SRH vs MI, హైదరాబాద్, 2024 ఐపీఎల్లో అత్యధిక టీమ్ స్కోర్లు.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక టీమ్ స్కోర్ చేసిన జట్టుగా సన్‌రైజర్స్ చరిత్ర సృష్టించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. 277/3 - SRH vs MI, హైదరాబాద్, 2024 263/5 - RCB vs PWI, బెంగళూరు, 2013 257/5 - LSG vs PBKS, మొహాలి, 2023 248/3 - RCB vs GL, బెంగళూరు, 2016 246/5 - CSK vs RR, చెన్నై, 2010 246/5 - MI vs SRH, హైదరాబాద్, 2024 టీ20ల్లో అత్యధిక స్కోర్లు.. ఈ మ్యాచ్‌లో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసిన సన్‌రైజర్స్ టీ20ల్లో నాలుగో అత్యధిక స్కోర్‌ను నమోదు చేసింది. పొట్టి ఫార్మాట్లో అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు నేపాల్ పేరిట ఉంది. 314/3 - నేపాల్ వర్సెస్ మంగోలియా, హాంగ్జౌ, ఏషియన్ గేమ్స్ 2023 278/3 - ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఐర్లాండ్, డెహ్రాడూన్, 2019 278/4 - చెక్ రిపబ్లిక్ వర్సెస్ టర్కీ, ఇల్ఫోకౌంటీ, 2019 277/3 - సన్‌రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్, హైదరాబాద్, ఐపీఎల్ 2024 275/6 - పంజాబ్ వర్సెస్ ఆంధ్ర, రాంచీ, 2023 ఐపీఎల్ రెండో ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోర్లు.. ఐపీఎల్ హిస్టరీలో ఛేదనలో అత్యధిక స్కోర్ నమోదు చేసిన జట్టుగా ముంబై ఇండియన్స్ రికార్డుల్లోకెక్కింది. 246/5 - MI vs SRH, హైదరాబాద్, 2024 (ఓటమి) 226/6 - RR vs PBKS, షార్జా, 2020 (గెలుపు) 223/5 - RR vs CSK, చెన్నై, 2010 (ఓటమి) 223/6 - MI vs PBKS, ముంబై WS, 2017 (ఓటమి) 219/6 - MI vs CSK, ఢిల్లీ, 2021 (గెలుపు) ఐపీఎల్లో అత్యధిక స్కోర్ (ఇరు జట్లు కలిపి) నమోదైన మ్యాచ్‌లు.. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి 523 పరుగులు (సన్‌రైజర్స్ 277/3, ముంబై ఇండియన్స్ 246/5) చేయడంతో ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ఓ మ్యాచ్‌లో 500 పరుగుల మార్కు దాటింది. 523 - SRH vs MI, హైదరాబాద్, 2024 469 - CSK vs RR, చెన్నై, 2010 459 - PBKS vs KKR, ఇండోర్, 2018 458 - PBKS vs LSG, మొహాలి, 2023 453 - MI vs PBKS, ముంబై WS, 2017 టీ20ల్లో అత్యధిక స్కోర్ (ఇరు జట్లు కలిపి) నమోదైన మ్యాచ్‌లు.. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి చేసిన స్కోర్ పొట్టి క్రికెట్ చరిత్రలోనే ఓ మ్యాచ్‌లో నమోదైన అత్యధిక స్కోర్‌గా రికార్డైంది. 523 - SRH vs MI, హైదరాబాద్, IPL 2024 517 - SA vs WI, సెంచూరియన్, 2023 515 - QG vs MS, రావల్పిండి, PSL 2023 506 - సర్రే vs మిడిల్సెక్స్, ది ఓవల్, T20 బ్లాస్ట్ 2023 501 - టైటాన్స్ vs నైట్స్, పోచెఫ్‌స్ట్రూమ్, CSA T20 ఛాలెంజ్ 2022 -
హిట్‌మ్యాన్ ఖాతాలో మరో రికార్డు.. తొలి ఆసియా క్రికెటర్‌గా..!
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డుల మీద రికార్డులను కొల్లగొడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇప్పటికే ఓ ప్రపంచ రికార్డు (అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో 60కు పైగా క్యాచ్‌లు అందుకున్న తొలి ప్లేయర్) నెలకొల్పిన హిట్‌మ్యాన్.. తాజాగా బ్యాటింగ్‌లో మరో రికార్డు సాధించాడు. తొలి ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో మార్క్ వుడ్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన రోహిత్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో 50 సిక్సర్ల మార్కును అందుకున్నాడు. తద్వారా డబ్యూటీసీ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి ఆసియా క్రికెటర్‌గా.. ఓవరాల్‌గా రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. డబ్యూటీసీ హిస్టరీలో అత్యధిక సిక్సర్ల రికార్డు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ పేరిట ఉంది. స్టోక్స్ డబ్యూటీసీలో 45 మ్యాచ్‌ల్లో 78 సిక్సర్లు కొట్టాడు. స్టోక్స్ తర్వాత అత్యధికంగా హిట్‌మ్యాన్ 32 ఇన్నింగ్స్‌ల్లో 50 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో స్టోక్స్, రోహిత్ తర్వాత రిషబ్ పంత్ (38), జానీ బెయిర్‌స్టో (29), జైస్వాల్ (26) ఉన్నారు. కాగా, ధర్మశాల టెస్ట్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. కుల్దీప్ యాదవ్ (5/72), అశ్విన్ (4/51), జడేజా (1/17) దెబ్బకు 218 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (79) మినహా ఎవ్వరూ రాణించలేదు. డకెట్ 27, పోప్ 11, రూట్ 26, బెయిర్‌స్టో 29, స్టోక్స్ 0, ఫోక్స్ 24, హార్ట్లీ 6, వుడ్ 0, ఆండర్సన్ 0 పరుగులు చేసి ఔటయ్యారు. షోయబ్ బషీర్ 11 పరుగులతో అజేయంగా నిలిచాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత.. దూకుడుగా ఆడుతుంది. 15 ఓవర్లలో టీమిండియా వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), యశస్వి (33; ఫోర్, 3 సిక్సర్లు) పరిమిత ఓవర్ల క్రికెట తరహాలో రెచ్చిపోతున్నారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు భారత్ ఇంకా 146 పరుగులు మాత్రమే వెనుకపడి ఉంది. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. -
Rohit Sharma: మరో 'ఆరేస్తే' క్రికెట్ చరిత్రలోనే మొట్టమొదటి ఆటగాడవుతాడు..!
ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా మార్చి 7 నుంచి ధర్మశాల వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ మరో ఆరు సిక్సర్లు కొడితే అంతర్జాతీయ క్రికెట్లో 600 సిక్సర్ల మార్కును తాకిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 594 సిక్సర్లు (అన్ని ఫార్మాట్లలో కలిపి) ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ తర్వాతి స్థానంలో విండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ ఉన్నాడు. గేల్ ఖాతాలో 553 సిక్సర్లు ఉన్నాయి. గేల్ తర్వాత షాహిద్ అఫ్రిది (476), మార్టిన్ గప్తిల్ (398), ధోని (383), జయసూర్య (359), ఇయాన్ మోర్గన్ (352), ఏబీ డివిలియర్స్ (346), జోస్ బట్లర్ (328) వరుసగా టాప్ 10 స్థానాల్లో ఉన్నారు. హిట్‌మ్యాన్ ముంగిట మరో రికార్డు.. ధర్మశాల టెస్ట్‌లో రోహిత్ శర్మ మరో సిక్సర్ కొడితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో 50 సిక్సర్ల మార్కును తాకిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. కాగా, ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ధర్మశాల టెస్ట్ మ్యాచ్ నామమాత్రం సాగనుంది. సిరీస్ వరకు ఇది అప్రధానమైన మ్యాచే అయినప్పటికీ... వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 దృష్ట్యా కీలకం కానుంది. ఈ సిరీస్‌లో టీమిండియా సీనియర్ల సేవలు కోల్పోయినప్పటికీ.. యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. -
ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్.. ఎవరికీ సాధ్యం కాని రికార్డుపై కన్నేసిన రోహిత్
ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే టీ20 సిరీస్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎవరికీ సాధ్యం కాని ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. ఈ సిరీస్‌లో హిట్‌మ్యాన్ మరో 18 సిక్సర్లు బాదితే టీ20ల్లో 200 సిక్సర్లు కొట్టిన తొలి క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. రోహిత్ ఇప్పటివరకు 148 మ్యాచ్‌ల్లో 182 సిక్సర్లు కొట్టి, టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. రోహిత్ తర్వాత అత్యధిక సిక్సర్లు కొట్టిన ఘనత న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ (122 మ్యాచ్‌ల్లో 173 సిక్సర్లు) పేరిట ఉంది. ఈ జాబితాలో ఆసీస్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ (125), యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (124), టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ (123) వరుసగా మూడు నుంచి ఐదు స్థానాల్లో ఉన్నారు. 117 సిక్సర్లతో విరాట్ కోహ్లి తొమ్మిదో స్థానంలో నిలిచాడు. కాగా, జనవరి 11 (మొహాలీ), 14 (ఇండోర్), 17 (బెంగళూరు) తేదీల్లో ఆఫ్ఘనిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్ కోసం ఇరు జట్లను ఇదివరకే ప్రకటించారు. భారత్ తరఫున రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి చాలాకాలం తర్వాత టీ20ల్లో బరిలోకి దిగుతున్నారు. టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్‌కీపర్), సంజు శాంసన్ (వికెట్‌కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్ , అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్ అఫ్గనిస్తాన్: ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మతుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), హజ్రతుల్లా జజాయ్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, కరీం జనత్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్ హక్ ఫారూఖీ, ఫరీద్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, నూర్ అహ్మద్, మహ్మద్ సలీం, కైస్ అహ్మద్, గుల్బదిన్ నైబ్, రషీద్ ఖాన్. -
చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్.. రోహిత్, గేల్‌కు కూడా సాధ్యం కాని ఘనత సొంతం
పొట్టి ఫార్మాట్లో యూఏఈ కెప్టెన్, పాకిస్తాన్ ఆటగాడు ముహమ్మద్ వసీం చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు ఏ ఆటగాడికి సొంతం కాని అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఓ క్యాలెండర్ ఇయర్లో 100 అంతకంటే ఎక్కువ సిక్సర్లు బాదిన తొలి అంతర్జాతీయ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. టీ20ల్లో సిక్సర్ల వీరులుగా పేరున్న రోహిత్ శర్మ, క్రిస్ గేల్ సైతం ఈ ఫీట్ సాధించలేకపోయారు. ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న జరిగిన రెండో టీ20లో వసీం ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో మూడు సిక్సర్లు బాదిన వసీం.. 2023 క్యాలెండర్ ఇయర్లో 100 సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాది మొత్తం 47 అంతర్జాతీయ టీ20లు ఆడిన వసీం.. 101 సిక్సర్లు తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో వసీం తర్వాత ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఘనత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉంది. హిట్‌మ్యాన్ ఈ ఏడాది టీ20ల్లో 80 సిక్సర్లు (35 మ్యాచ్‌ల్లో) బాదాడు. ఈ విభాగంలో ఆ తర్వాతి రెండు స్థానాలు కూడా రోహిత్ శర్మ పేరిటే ఉన్నాయి. 2019, 2018 క్యాలెండర్ ఇయర్స్‌లో హిట్‌మ్యాన్ వరుసగా 78, 74 సిక్సర్లు బాదాడు. ఈ విభాగంలో ఐదో స్థానంలో టీమిండియా విధ్వంసకర వీరుడు సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. స్కై 2022లో 74 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో వీరి తర్వాత యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఉన్నాడు. గేల్ 2012లో 26 మ్యాచ్‌ల్లో 59 సిక్సర్లు కొట్టాడు. ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన నిన్నటి మ్యాచ్‌లో ముహమ్మద్ వసీం 32 బంతుల్లో 3 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో 53 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో యూఏఈ సంచలన విజయం సాధించింది. వసీంతో పాటు ఆర్యన్ లక్రా (63 నాటౌట్) కూడా అర్ధసెంచరీతో రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఛేదనలో తడబడిన ఆఫ్ఘనిస్తాన్ 19.5 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటై, 11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ముహమ్మద్ జవాదుల్లా (4/26), అలీ నసీర్ (4/24) ఆఫ్ఘనిస్తాన్ పతనాన్ని శాశించారు. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో మొహమ్మద్ నబీ (47) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ గెలుపుతో యూఏఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. నిర్ణయాత్మకమైన మూడో టీ20 జనవరి 2న జరుగనుంది.