బెంగళూరు వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ స్టార్ టిమ్ సౌథీ అద్భుతమైన హాఫ్ సెంచరీతో మెరిశాడు. కివీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 402 పరుగుల భారీ స్కోర్‌ను సాధించడంలో సౌథీ కీలక పాత్ర పోషించాడు. రచిన్ రవీంద్రతో కలిసి ఎనిమిదో వికెట్‌కు 137 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
73 బంతులు ఎదుర్కొన్న సౌథీ 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 65 పరుగులు చేశాడు. ఈ ఇక మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో మెరిసిన సౌథీ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన జాబితాలో సౌథీ ఆరో స్ధానానికి ఎగబాకాడు. ఇప్పటివరకు 147 టెస్టు ఇన్నింగ్స్‌లలో సౌథీ 92 సిక్స్‌లు బాదాడు.
ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్(91) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో సెహ్వాగ్‌ను ఈ కివీ వెటరన్ అధిగమించాడు. ఇక అరుదైన ఫీట్ నమోదు చేసిన జాబితాలో బెన్ స్టోక్స్(131) అగ్రస్ధానంలో ఉన్నాడు.
చదవండి: IND vs PAK 2nd Test: ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన పాకిస్తాన్..
Comments
Please login to add a commentAdd a comment